Thursday, March 23, 2017

Grief is the Thing with Feathers - Max Porter

జీవితం ఎంత చిన్నదో అర్ధం అయ్యాక,కాలం విలువ తెలిసొచ్చాక,ఏదైనా విషయం మళ్ళీ మళ్ళీ వినాలన్నా,చదవాలన్నా అసహనం ఆవరిస్తోంది..కథకు ఎంతమాత్రం సంబంధం లేని,కథాగమనాన్ని ఏమాత్రం ప్రభావితం చెయ్యని అంశాలను చొప్పించి పేజీలు పేజీలు సాగదీసే రచనల మధ్య ఈ 'Grief is the thing with feathers' ఒక ఉపశమనం అనొచ్చు...అతి తక్కువ పదాల్లో చాలా ఎక్కువ అనుభూతుల్ని మన సొంతం చేసే బహుకొద్ది రచనల్లో ఇదొకటి..
Image courtesy Google

ఈ పుస్తకానికీ,ఈ మధ్యనే చదివిన Helen MacDonald రాసిన H is for Hawk కూ కథాపరంగా చాలా పొంతనలున్నాయి..రెండిటికీ కథావస్తువు Grief కావడం ఒకటైతే,రెండు పుస్తకాల్లోనూ పక్షుల్ని metaphor గా వాడారు..ఎటొచ్చీ Helen రచన పూర్తిస్థాయి గద్యంలో ఉంటే,మాక్స్ పోర్టర్ రచన గద్యం పద్యం మేళవింపులా ఉంది..లండన్ కు చెందిన మాక్స్ పోర్టర్ తొలి నవల అయిన ఈ Grief is the thing with feathers,International Dylan Thomas Prize ను సొంతం చేసుకోవడమే కాకుండా,Goldsmiths Prize,Guardian First Book Award లకు నామినేట్ చెయ్యబడింది..

రచయిత అయిన ఒక తండ్రి,ఆయన ఇద్దరు పిల్లలు,ఒక కాకి..ఈ ముగ్గురి కథే ఈ పుస్తకం..ఈ మధ్య కాలంలో చదివిన అతి చిన్న పుస్తకం ఇది,కేవలం 100 పేజీలు..ఇంట్లోనే జరిగిన ఒక ఆక్సిడెంట్ లో భార్య ఆకస్మిక మరణంతో కృంగిపోయి ఉన్న తండ్రి Ted Hughes's Crow గురించి ‘Crow on the Couch, a wild analysis’ ను రాస్తూ ఉండగా ఆ Crow(grief ) ఇంట్లోకి వచ్చి స్థిరపడుతుంది..ఇక్కడ Crow ను grief కు (శోకానికి) మెటాఫోర్ గా వాడారు మాక్స్..

Crow(grief ) నల్లనిది,శోకం తాలూకూ చీకటిని సూచిస్తుంది..కావ్ కావ్ మంటూ చికాకుపరుస్తుంది..తననొక డాక్టర్ గా,స్నేహితునిగా,దెయ్యంగా,విశ్లేషకునిగా,babysitter గా అభివర్ణించుకుంటుంది..తాను ఎన్నో మెమోయిర్స్ రాశానంటుంది..మనుషులు శోకంలో ఉన్నప్పుడు తప్ప మందమతులంటుంది..

He could learn a lot from me.
That’s why I’m here.
అంటూ మృత్యువు తలుపుతట్టిన ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన Crow (grief ),తన అవసరం ఇక ఉండనంతవరకూ వాళ్ళతోనే ఉంటానంటుంది..
I won’t leave until you don’t need me any more.

ఇది పూర్తి స్థాయి నవల అని చెప్పలేము,ఇందులో కవిత్వం కూడా ఉంది..కొన్నివాస్తవాలతో పాటు కొన్ని కల్పితాలూ ఉన్నాయి..దీని Genre ఇదీ అంటూ ఒక గాటికి కట్టెయ్యడం కష్టమే..ఇందులో బాగా నచ్చిన విషయం మెటాఫోరికల్/పొయెటిక్ నేరేషన్..మాక్స్ పోర్టర్ పదాలను అలవోకగా ఉపయోగించిన తీరు గణితంలో ఒక తెలివైన కుర్రవాడు అంకెలతో చేసే విన్యాసాల్ని తలపిస్తుంది..

స్మశాన వైరాగ్యం అనుభవిస్తూ ఉన్నప్పుడు శోకం ఎన్నో పాఠాలు నేర్పుతుందంటారు..ఈ క్రింద వాక్యాలు రెండు మూడు సార్లు చదివాను..ఇలాంటి వర్ణన ఇంతవరకూ వినలేదు..
There is a fascinating constant exchange between Crow’s natural self and his civilised self, between the scavenger and the philosopher,the goddess of complete being and the black stain, between Crow and his birdness.It seems to me to be the self-same exchange between mourning and living, then and now.I could learn a lot from him.

ఇందులో Grief ను వివిధ దశల్లో చర్చించారు..
Grief felt fourth-dimensional, abstract, faintly familiar. I was cold.

మరణం అంటే తెలీని వయసులో తల్లిని పోగొట్టుకున్న ఇద్దరు చిన్నపిల్లల అంతరంగాన్ని మాక్స్ ఆవిష్కరించిన తీరు మనసుకి హత్తుకుంటుంది...
There were no crowds and no uniformed strangers and there was no new language of crisis.
We stayed in our PJs and people visited and gave us stuff.
Holiday and school became the same.

భార్య మరణాన్ని గురించిన శోకంలో భర్త అంతరంగం..
She was not busy dying, and there is no detritus of care, she was simply busy living, and then she was gone.

She won’t ever use (make-up, turmeric, hairbrush, thesaurus).          
She will never finish (Patricia Highsmith novel, peanut butter, lip balm).
And I will never shop for green Virago Classics for her birthday.          
I will stop finding her hairs.          
I will stop hearing her breathing.

మరణాన్ని అంగీకరించలేని మానవ నైజాన్ని ఉదహరిస్తూ,
We used to think she would turn up one day and say it had all been a test.          
We used to think we would both die at the same age she had.          
We used to think she could see us through mirrors.

పిల్లల మాటల్లో కవిత్వాన్ని ఇలా ఎత్తిపొడుస్తారు..
I don’t like Hughes and I don’t like poetry.
Insanity. Pretentiousness. Denial. Indulgence. Nonsense.

"బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్" అని ఒక మహానుభావుడు అన్నట్లు శోకాన్ని అనుభవించడాన్ని కూడా ఒక మెడిటేషన్ గా చూపిస్తూ,
Moving on, as a concept, is for stupid people,because any sensible person knows grief is a long-term project.I refuse to rush.The pain that is thrust upon us let no man slow or speed or fix.

మామూలు పరిస్థితుల్లో ఈ రచన చదివిదానికంటే,Grieving phase లో ఉండి చదవడం వలన ఈ రచన నా మనసుకి మరింత దగ్గరగా అనిపించింది..ఇప్పట్లో ఇలాంటి పుస్తకాలు వద్దు అనుకుంటున్నా,రివ్యూలు చూసి చదవకుండా ఉండలేకపోయినందుకు ఇది నన్ను నిరాశపరచలేదనే చెప్పాలి..ఇలాంటి పుస్తకాలు జ్ఞాపకాల్ని తట్టిలేపి మర్చిపోయిన గాయాల్ని గుర్తు చేస్తాయన్న భ్రమను పటాపంచలు చేస్తూ విచిత్రంగా ఇదొక అనిర్వచనీయమైన అనుభూతిని మిగిల్చింది..
"Life is short,” Porter explains, “and I wanted to write something short.”
గార్డియన్ లో ప్రచురించబడిన వ్యాసంలో ఈ పుస్తకం నిడివి గురించి మాక్స్ పోర్టర్ మాటలు ఆయనపై గౌరవాన్ని కలిగించాయి...

పుస్తకం నుండి మరి కొన్ని నచ్చిన వాక్యాలు,
The sound of her voice was stinging, like a moon-dragged starvation surging into every hopeless raw vacant pore, undoing, exquisite undoing.

MAN    I would be done grieving?          
BIRD    No, not at all. You were done being hopeless. Grieving is something you’re still doing, and something you don’t need a crow for.          
MAN    I agree. It changes all the time.          
BIRD    Grief?          
MAN    Yes.          
BIRD    It is everything. It is the fabric of selfhood, and beautifully chaotic. It shares mathematical characteristics with many natural forms.

What good is a crow to a pack of grieving humans? A huddle.
A throb.
A sore.
A plug.
A gape.
A load.
A gap.

Soft.                     
Slight.                                  
Like light, like a child’s foot talcum-dusted and kissed, like stroke-reversing suede, like dust, like pins and needles, like a promise, like a curse, like seeds, like everything grained, plaited, linked, or numbered, like everything nature-made and violent and quiet.

Thursday, March 16, 2017

Lincoln in the Bardo - George Saunders




ఏదో పుస్తకం చదువుదామని కూర్చుంటే,మన ముందొక jigsaw పజిల్ పెట్టి,'సాల్వ్ చెయ్యి చూద్దాం' అంటారు George Saunders..ఎటొచ్చీ పాఠకులు పుస్తకం చదవడం పూర్తి చేసినా పజిల్ ను మాత్రం ఇంకా సాల్వ్ చేస్తూనే ఉంటారు..Lincoln in the Bardo ని చదవడం అంటే ఒక క్లిష్టమైన పజిల్ ను సాల్వ్ చెయ్యడంలా ఉంటుంది..అసలు మొదట నలభై పేజీల వరకూ కూడా అస్సలు తెలీని ఊరిలో గూగుల్ మ్యాప్ ని నమ్ముకుని దారి వెతుక్కుంటున్నట్లు ఎటెళ్తున్నామో,ఏం జరుగుతోందో కూడా అర్ధం కాదు..కానీ అప్పటివరకూ కాస్త ఓపిక పడితే ఆ తరువాత కథ ఆగదు.

'Lincoln in the Bardo' అనే టైటిల్ చూడగానే అసలు బార్డో అంటే ఏమిటా అని చూస్తే,ఆ పదం Tibetan Buddhism కి సంబంధించినదని ఉంది..టిబెటన్ బుద్దిజానికి సంబంధించి బార్డో అంటే మరణానికీ,పునర్జన్మకీ మధ్యన ఉండే దశగా చెప్తారు..(Bardo = A state of existence between death and rebirth, varying in length according to a person's conduct in life and manner of, or age at, death.)


1862 లో సివిల్ వార్ సమయంలో అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడుగా ఉండగా జరిగిన సంఘటనలకు కాల్పనికతను జోడించి ఈ హిస్టారికల్ ఫిక్షన్ కు రూపకల్పన చేశారు George Saunders..ఫిబ్రవరి 20,1862 లో అబ్రహం లింకన్,మేరీ లింకన్ లు వైట్ హౌస్ లో ఒక గొప్ప విందు ఏర్పాటు చేస్తారు..కానీ అదే సమయంలో వారి పదకొండేళ్ల కొడుకు Willie Lincoln తీవ్రమైన టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతుంటాడు...ఒక దేశాధ్యక్షుడుగా ఆ విందు ఇవ్వడం తప్పనిసరి కావడం,అదే సమయంలో పరిస్థితి విషమించి తన కొడుకు తీవ్రమైన జ్వరంతో మేడ మీద గదిలో తుదిశ్వాస విడవడం లింకన్ ను తీవ్రంగా కలచివేస్తాయి..సరిగ్గా రెండ్రోజుల తరువాత ఒక రాత్రివేళ లింకన్ Willie మృతదేహాన్ని ఖననం చేసిన Georgetown symmetry కి వెళ్ళి Willie సమాధి వద్ద కొంతసేపు గడుపుతారు..ఈ సంఘటనే George Saunders రచనకు కథావస్తువు.

మరణానంతరం 'బార్డో' చేరిన Willie అక్కడ మరికొన్ని ఆత్మల తో చేరతాడు..రెండో రోజు తండ్రి వచ్చి సుగంధ ద్రవ్యాలతో నిండిన తన శరీరాన్ని హత్తుకుని ఏడవడం,మళ్ళీ వస్తానని చెప్పి తిరిగివెళ్లడంతో తండ్రి రాకకోసం వేచి చూస్తూ అక్కడే ఉండిపోతాడు..బార్డో ప్రపంచంలో పిల్లలు ఎక్కువ కాలం ఉండటానికి వీలుపడదు..ఆ కారణంగా మిగిలిన ఆత్మలు Willie ని ఎలా అయినా పంపించేద్దామని ప్రయత్నిస్తాయి..కానీ Willie అంగకరించకపోవడంతో అతని చుట్టూ ఒక రకమైన తీగల వలయంల ఏర్పడుతుంది,క్రమేణా ఆ వలయం గట్టిపడి ఒక Carapace(తెలుగులో ఏమంటారో తెలీలేదు) లా మారుతుంది..ఆ వలయంలో చిక్కుకుని Willie తీవ్రమైన బాధకు గురవుతుంటాడు..మరి తిరిగి వస్తానన్న తండ్రి వచ్చారా,Willie కి బార్డో నుంచి విముక్తి లభించిందా అనేది తరువాతి కథాంశం..
The more perverse the carapace, the less “light” (happiness, honesty, positive aspiration) would get in. -- roger bevins iii
అందులో చాలా ఆత్మలున్నా,Hans Vollman,Roger Bevins iii,The Reverend Everly Thomas అనే ముగ్గురు ముఖ్యులు..కథలో సింహభాగం వారి సంభాషణలే ఉంటాయి..ఆ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా నీగ్రోల బానిసత్వం,సివిల్ వార్ మరణాలు వంటివి కూడా కథాగమనంలో పాలుపంచుకుంటాయి...ఒక ఫాంటసీని వాస్తవమని నమ్ముతూ సంచరించే ఆ ఆత్మల ప్రపంచంలో Willie రాకతో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయనే అంశంపై మిగతా కథంతా నడుస్తుంది...

ఇక 'బార్డో' మనకో ఆబ్స్ట్రాక్ట్  ప్రపంచం..అందులో ఆత్మల ఆలోచనల ద్వారా మనకు ఆ ప్రపంచాన్ని పరిచయం చేస్తారు  Saunders..ఇందులో నివసించే (?) వారికి తాము చనిపోయామని తెలీదు..వారు కేవలం తాము వ్యాధిగ్రస్తులమనీ (Sick-form), తమ సమాధులను (sick-box) లుగా పిలుచుకుంటూ,మళ్ళీ తమ ప్రపంచానికి తిరిగి వెళ్ళిపోగలమనీ  నమ్ముతుంటారు..వారి సంభాషణల్లో వారి గతించిన అనుభవాలూ,ఆశలూ,ఆశయాలు,భయాలు మనకు స్పష్టమవుతూ ఉంటాయి..రచయిత తన musings ని బార్డో ఆత్మల గళంలో అద్భుతంగా వినిపించారు..ఏ రచనలోనైనా ఒక ఆబ్జెక్ట్ ను దృశ్యం గా మలచడం సులభమే,కానీ 'బార్డో' రూపకల్పన ద్వారా శూన్యానికి ఒక దృశ్యంరూపం ఇవ్వడానికి ప్రయత్నించడం అనేది ఒక విధంగా సాహసం..కానీ ఈ విషయంలో George Saunders పూర్తిగా సఫలీకృతులయ్యారని చెప్పొచ్చు..

All were in sorrow, or had been, or soon would be.

Having never loved or been loved in that previous place, they were frozen here in a youthful state of perpetual emotional vacuity; interested only in freedom, profligacy, and high-jinks, railing against any limitation or commitment whatsoever. --  the reverend everly thomas.

In truth, we were bored, so very bored, so continually bored.  roger bevins iii
Each night passed with a devastating sameness. -- hans vollman

కథంతా చిన్న చిన్నఫ్రాగ్మెంట్స్ లా Quotes రూపం లో ఉంటుంది...ముఖ్యంగా సాధారణ శైలికి భిన్నంగా,చరిత్ర నుండి యధాతథంగా సంగ్రహించిన సమాచారాన్ని వేర్వేరు వాతావరణాల్లో,భిన్నమైన కోణాల్లో,విభిన్నమైన వ్యక్తుల ద్వారా చెప్తారు,అంటే ఒకే సంఘటనను వేర్వేరు కోణాల్లో చూపిస్తారు...దాని వలన రచయిత శైలిలో Conformity ఎంత వెతికినా కనిపించదు..ఉదాహరణకి అబ్రహం లింకన్ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించడంలో ఆయన శారీరక నిర్మాణం గురించీ,ముఖ కవళికల గురించీ పలువురి అభిప్రాయాలను రాస్తారు..కొందరు లింకన్ ను ఒక కురూపి అంటే,మరికొందరు ఆ రూపాన్ని దాటి చూడగలిగితే ఆయనలోని దయ ఆ కళ్ళలో ప్రతిఫలిస్తూ లింకన్ ను ఒక అందమైన వ్యక్తిగా నిలబెడుతుంది అంటారు...అదే విధంగా సివిల్ వార్ మరణాలకు బాధ్యుడుగా ఆయన్ను ఒక దేశాధ్యక్షుడిగా అనర్హుడని కొందరంటే,ఒక మామూలు తండ్రిగా పిల్లలపట్ల పిచ్చి ప్రేమ తో వారికి వైట్ హౌస్ లో ఏ క్రమశిక్షణా అలవర్చలేదని మరికొందరి విమర్శ..ఇలా లింకన్ వ్యక్తిత్వాన్ని అన్ని కోణాలనుంచీ చూపిస్తారు..అబ్రహం లింకన్ మంచి-చెడులతో తనకేం సంబంధం లేదు,ఆయన్ని పరిచయం చెయ్యడం వరకే తన పని అన్నట్లు ఉంటుంది Saunders శైలి..
The saddest eyes of any human being that I have ever seen.  --- In “Lincoln’s Melancholy: How Depression Challenged a President and Fueled His Greatness,” by Joshua Wolf Shenk, account of John Widmer
His nose is rather long but he is rather long himself, so it is a Necessity to keep the proportion complete. ---  In “Mary Lincoln: Biography of a Marriage,” by Ruth Painter Randall, account of a soldier.
బార్డో లో జీవన్మరణాల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆత్మలు అంతా శాశ్వతమే అన్నట్లు వ్యవహరించడం,మామూలు మనుషుల్లా మాట్లాడుకోవడం,కోట్లాడుకోవడం లాంటివి పైకి సరళంగా,సరదాగా కనిపిస్తూ మానవ జీవితంలోని అనిశ్చితిని అంతర్లీనంగా చెప్తూనే ఉంటాయి..సహజత్వం ఉట్టిపడేలా అన్ని పాత్రలు వారి వారి స్వాభావికమైన భాష మాట్లాడుతూ ఉంటాయి..'Gone with the wind' లో నీగ్రోల వాడుక భాష లాగా ఇందులో కూడా కొందరి మాటల్ని అప్పటి వ్యావహారిక భాషలా అస్తవ్యస్తమైన వాక్య నిర్మాణంతో (తప్పులతో కలిపి) రాశారు..

మొదట్లో ఒక లేయర్ మీద అల్లినట్లు అనిపించిన కథ క్రమేణా మరొకటి,ఇంకొకటి, ఇలా అనేక పొరలు ఒకదానిపై ఒకటి అమరిపోయినట్లు,కొన్నిసార్లు overlap అయిపోయినట్లు అనిపిస్తుంది..ముఖ్యంగా తన తొలి నవలకు George Saunders ఎన్నుకున్న శైలి చాలా పుస్తకాల కంటే భిన్నమైనదీ,క్లిష్టతరమైనదీను..ఈ కథ ఒక అద్భుతం అని చెప్పలేను కథనిర్మాణం లో రచయిత ఎంచుకున్న శైలి,నేరేషన్ మాత్రం అద్భుతం..ఇటువంటి రచన ఇప్పటివరకూ చదవలేదు అని మాత్రం చెప్పగలను..
కథలో సంభాషణలు ఇలా ఉంటాయి,లింకన్ Willie సమాధి వద్దకు వచ్చినప్పుడు ఆత్మల సంభాషణ,
And touched the face and hair fondly. --- hans vollmanAs no doubt he had many times done when the boy was -- roger bevins iiiLess sick. -- hans vollman
Saunders పదాలతో చేసిన మాయాజాలం ఈ వర్ణనల్లో అడుగడుగునా కనిపిస్తూ ఉంటుంది..
But he went forth into that stygian dark like pilgrim going forward into a trackless desert.
Truth be told, there was not one among the many here—not even the strongest—who did not entertain some lingering doubt about the wisdom of his or her choice.  roger bevins iii
The tide ran out but never ran in, said Susanna Briggs... The stones rolled downhill but never rolled back up, said Cynthia Hoynton. .....You never in your life was given enough, said Miranda Debb.
You are a wave that has crashed upon the shore, said Miranda.
Tell them we are tired of being nothing, and doing nothing, and mattering not at all to anyone, and living in a state of constant fear, -- the Reverend said.
కొడుకుని పోగొట్టుకున్న లింకన్ శారీరక,మానసిక స్థితిని వర్ణిస్తూ,
Great sobs choked his utterance. He buried his head in his hands, and his tall frame was convulsed with emotion.His grief unnerved him, and made him a weak, passive child. I did not dream that his rugged nature could be so moved. I shall never forget those solemn moments—genius and greatness weeping over love’s lost idol.--Keckley, op. cit.
పుస్తకం నుండి మరికొన్ని నచ్చిన అంశాలు  ,
What I mean to say is, we had been considerable. Had been loved. Not lonely, not lost, not freakish, but wise, each in his or her own way. Our departures caused pain. Those who had loved us sat upon their beds, heads in hand; lowered their faces to tabletops, making animal noises. We had been loved, I say, and remembering us, even many years later, people would smile, briefly gladdened at the memory. --- the reverend everly thomas.
All over now. He is either in joy or nothingness. (So why grieve? The worst of it, for him, is over.)

The Immortal Life of Henrietta Lacks - Rebecca Skloot

కొన్నిసార్లు ఒక పుస్తకం చదవాలనే ఆసక్తి కలగడానికి పుస్తకం పేరే కాదు,దాని మీదున్న కవర్ కూడా కొంతవరకు కారణం అవుతుంది...అమెరికన్ జర్నలిస్ట్/రచయిత్రి Rebecca Skloot రాసిన ఈ 'The Immortal Life of Henrietta Lacks' కవర్ మీద కాన్ఫిడెంట్ గా నవ్వుతూ ఉన్న అమ్మాయి మొహం,అందునా 'immortality' లాంటి బ్రహ్మపదార్ధం కనిపించగానే వెంటనే పేజీ తిప్పాలనిపించింది..1951 లో అమెరికా లోని బాల్టిమోర్ లో Henrietta Lacks అనే ఒక నల్ల జాతీయురాలు సర్వికల్ కాన్సర్ బారినపడి మృతి చెందుతుంది..ఐదుగురు పిల్లల తల్లి అయిన Henrietta మరణించే సమయానికి ఆమెకు కేవలం 31 ఏళ్ళు..పొగాకు తోటల్లో రోజువారీ పనిచేసే ఆమె భర్త డేవిడ్,ఐదుగురు పిల్లలు,Elsie,Lawrence,Deborah,Joseph(సోనీ),Zakariyya లతో కలిసి Clover లో నివసించేది..'Walnut eyes' తో ఆకర్షణీయంగా ఉండటం,అందరినీ ప్రేమాభిమానాలతో ఆదరించడం Henrietta ప్రత్యేకత..

ఇప్పుడు భూగోళం మీద Henrietta ప్రపంచానికి అస్సలు సంబంధం లేని మరోప్రపంచం విషయానికి వస్తే,శాస్త్రీయ విజ్ఞానానికి సంబంధించిన ప్రయోగాలు మరియూ పరిశోధనల విషయంలో సైంటిస్టులు దేనిమీదైతే పరిశోధన చేస్తారో దాన్ని సాధారణంగా ఒక ముడిసరుకు లేదా ఒక ఆబ్జెక్ట్ గా మాత్రమే చూడడం జరుగుతుంది..ఇలాంటి విషయాల్లో భావోద్వేగాలకు తావు లేదు..కానీ ఆ ముడిపదార్ధంగా తీసుకునే ఆబ్జెక్ట్ ఒక మనిషి అయితే !! సరిగ్గా ఇక్కడే Henrietta Lacks కథ మలుపు తిరుగుతుంది..1950 ల కాలం,అంటే మోడరన్ మెడిసిన్ ఆవిర్భావానికి పునాదులు పడుతున్న సమయంలో పోలియో,కాన్సర్,హెచ్ ఐ వీ లాంటి భయంకరమైన వ్యాధులకు విరుగుడు కనిపెట్టే క్రమంలో శాస్త్రవేత్తలు జంతువులను తమ పరిశోధనలకు ఉపయోగించుకునేవారన్నది అందరికీ తెలిసిన విషయమే..కానీ ఈ పరిశోధనల్లో మరో అడుగు ముందుకేస్తూ మేరీల్యాండ్ కు చెందిన George Gey (Guy ) ,Margaret Gey దంపతులు శస్త్రచికిత్స జరిగే సమయంలో మనిషి శరీరం నుండి తీసిన కాన్సర్ టిష్యూల్లో నుండి వేరు చేసిన సెల్స్ ను సజీవంగా ఉంచే దిశగా 'సెల్ కల్చర్' కు శ్రీకారం చుట్టారు...కానీ హ్యూమన్ సెల్స్ ని సజీవంగా ఉంచడానికి అవసరమయ్యే సౌకర్యాలుగానీ,సాంకేతికతగానీ ఏమాత్రం అందుబాటులో లేని ఆ కాలంలో,తన  జీవితాన్ని ప్రయోగశాలకే పరిమితం చేసి,తన సంపాదన అంతా కూడా పరిశోధనలకు వెచ్చించినప్పటికీ Gey అప్పటికే ఆ ప్రయత్నంలో చాలా సార్లు విఫలమయ్యారు..సరిగ్గా అదే సమయంలో సెర్వికల్ కాన్సర్ విషమించి Henrietta,Johns Hopkins హాస్పిటల్ కు రావడం,ఆమెకు వైద్యం చేసిన Howard Jones చాలా మంది పేషెంట్స్ లాగే ఆమె శరీరం నుంచి కూడా తీసిన టిష్యూ సాంపిల్స్ ను Gey కు అందజెయ్యడం జరుగుతుంది..కానీ మోడరన్ వైద్య శాస్త్రాన్ని సమూలంగా మార్చేసే ఒక గొప్ప పరిణామానికి అంకురార్పణ జరగబోతోందని ఆ సమయంలో ఎవరూ ఊహించి ఉండరు..Gey,తన అసిస్టెంట్ మేరీ సహాయంతో తన లాబొరేటరీ లో Roller tube culturing technique ద్వారా He-La సెల్స్ ను సృష్టించడంలో ఎట్టకేలకు సఫలీకృతులవుతారు..అప్పటినుండీ Henrietta Lacks మరణించినా కూడా ఆమె లోని కణాలు He Le సెల్స్ గా అమరత్వాన్ని పొందాయి..తొలుత Gey చిన్న ల్యాబ్ లో మొదలైన He La ప్రొడక్షన్ త్వరలోనే Tuskegee,NIH లాంటి పెద్ద పెద్ద సంస్థలనుండి మాస్ ప్రొడక్షన్ చెయ్యడంతో ప్రపంచం నలుమూలల్నుంచీ పరిశోధనలకు మిలియన్ల ఆర్డర్లు,వాటితో పాటుగా లాభాలు కూడా తీసుకొచ్చింది..ముందు పోలియో వాక్సిన్ తయారీకి ఉపయోగించిన ఈ సెల్స్ ను క్రమేణా కాన్సర్,జెనెటిక్స్,క్లోనింగ్,కాస్మెటిక్,ఫార్మసిటికల్ లాంటి చాలా రంగాల్లో విరివిగా ఉపయోగించారు..చివరకు 1960లో రష్యన్లు ప్రయోగించిన రెండవ శాటిలైట్ లోను,అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములతో కూడా He La ప్రయాణించింది..
They kept growing like nothing anyone had seen, doubling their numbers every twenty-four hours, stacking hundreds on top of hundreds, accumulating by the millions. “Spreading like crabgrass!” Margaret said. They grew twenty times faster than Henrietta’s normal cells, which died only a few days after Mary put them in culture. As long as they had food and warmth, Henrietta’s cancer cells seemed unstoppable.
మరణాన్ని కూడా శాసించగల శక్తిని తమలో దాచుకున్న He La సెల్స్ ఒక వైపు ప్రపంచం నలుదిశలా వ్యాపిస్తూ,వివిధ దేశాల పాలసీలను రూపకల్పన చేసే దిశగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక పరిశోధనల్లో భాగం పంచుకుని వైద్య రంగాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్తుంటే మరో వైపు ఈ సెల్స్ గురించి ఏమీ తెలియని ఆమె కుటుంబం మాత్రం దుర్భరమైన జీవితం గడుపుతుంటుంది..చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న Henrietta కుమార్తె Deborah తన తల్లి గురించి తెలుసుకునే క్రమంలో He La సెల్స్ గురించిన విభ్రాంతికరమైన నిజాలు తెలియడంతో తీవ్ర వేదనకు గురవుతుంది..రిటైల్ రంగం,హాస్పటళ్లు,పలు కంపెనీలు He La కారణంగా సొమ్ము చేసుకుంటుంటే తాము మాత్రం కటిక దారిద్య్రం అనుభవిస్తున్నామనీ,తమ కుటుంబాన్ని అన్ని సంవత్సరాలు చీకట్లో ఉంచి మోసం చేశారని ఆమె బాధపడుతుంది..ఒక సందర్భంలో ఈ విషయం తెలిశాక Henrietta కొడుకు Lawrence,"మా అమ్మ వైద్య రంగానికి అంత ముఖ్యం అయినప్పుడు మాకు కనీసం హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లేదేందుకు?"అని రచయిత్రి Rebecca ను అడుగుతాడు..

Henrietta కథలో ముఖ్యమైన పాత్ర Gey ది..ఇందులో నాయకుడూ,ప్రతినాయకుడూ రెండూ ఆయనే..ఆయనకు He La ఐడెంటిటీని బహిర్గతం చేసే ఉద్దేశ్యం లేక 1970 ల్లో Collier’s article ప్రచురించే వరకూ ఆమెను Helen Lane అనీ,Helen Larsen అనీ pseudonyms తో  ప్రచారంలో ఉంచారంటారు..అందువల్లే ఆమె కుంటుంబానికి He La గురించి అప్పటివరకూ తెలియదు..ఒక దశలో He La సెల్స్ Henrietta Lacks అనే మహిళవి అని ప్రపంచానికి చెప్పకపోవడం Gey చేసిన పొరపాటు అనిపించినా ఆమె సెల్ లైన్ తయారీ లో Gey స్వలాభాపేక్ష లేకుండా తన స్వంత ఖర్చుతో చేసిన పరిశోధన వెనుక కేవలం సమాజ శ్రేయస్సు మాత్రమే కనిపిస్తుంది..చివరకి He La ను పేటెంట్ చెయ్యమని ఎందరు చెప్పినా కూడా,తన వద్ద అందుకు కూడా సమయం లేదని Gey తిరస్కరించడం,ఆ సెల్స్ ను పరిశోధనల నిమిత్తం ఉచితంగా వైద్యులకు,కంపెనీలకు,ఇతర దేశాలకు కూడా ఇవ్వడంలో Gey లో ఒక ఉన్నతాశయం కోసం తపించే సైంటిస్ట్ మాత్రమే కనపడతారు..కానీ 70 లు వచ్చేసరికి ఆయన He La ను పేటెంట్ చేద్దామనుకున్నా అప్పటికే అది ఆయన చెయ్యి దాటిపోతుంది...

He La వెనుక ఉన్న వ్యక్తి Henrietta Lacks అని ప్రపంచానికి చాటిచెప్పాలని చాలా వ్యయ ప్రయాసలకోర్చి ఈ పుస్తకాన్ని రాసిన Rebecca,ఇందులో డాక్టర్స్ కు పేషెంట్స్ కు మధ్య ఉండాల్సిన కమ్యూనికేషన్ అవసరం గురించి చెప్తారు..విచిత్రంగా ఇటీవలే చదివిన అతుల్ గవన్డే 'Being Mortal' అనే పుస్తకంలో కూడా Dr.గవన్డే ఇదే విషయం గురించి పలుమార్లు  ప్రస్తావించారు..ఒక మనిషికి తమ శరీరంపై ఉండే హక్కును గుర్తించాలనీ,వారి భయాలనూ,అనుమానాలనూ ఓపిగ్గా విని,నివృత్తి చెయ్యాలనీ,అన్నిటినీ మించి పేషెంట్స్ తో నిజాయితీగా వ్యవహరించడం వైద్యుల కనీస ధర్మం అనీ అంటారు..కానీ Henrietta కేసులో ఆమె అంగీకారం లేకుండా,కనీసం ఆమె కుటుంబానికి కూడా తెలుపకుండా ఆమె సెల్ లైన్ ను తయారు  చెయ్యడం,వాటిపై పరిశోధనలు జరపడం ఈ కాలంలో అభ్యంతరకరం,వ్యక్తిగత  స్వేఛ్చకి భంగం అని కొందరు భావించినా,అప్పటి పరిస్థితుల దృష్ట్యా మనిషి శరీరం నుండి (పాడైపోయి)వేరు చెయ్యబడినదేదైనా అంటే  సెల్స్,టిష్యూ,క్యాన్సర్స్ ఇలాంటివి వ్యర్థం క్రిందకే వస్తాయనీ,వాటిని వైద్య పరిశోధనల నిమిత్తం ఉపయోగించడం నేరం కాదనీ మరికొందరి వాదన..ఈ వాద ప్రతివాదాల సంగతెలా ఉన్నా వైద్యానికి సంబంధించి కీలక రంగాల్లో He La ఇప్పటికీ తన ఉనికిని చాటుకుంటూనే ఉంది..ఇలాంటి సందర్భాల్లో పేషెంట్ల ప్రైవసీ ని కాపాడే దిశగా తయారైన Nuremberg Code,American Medical Association Code of Ethics లాంటివి చట్టబద్ధమైనవి కాదనీ అవి కేవలం వైద్యులు చేసే ఒక నామమాత్రపు Hippocratic Oath గా పేర్కొంటారు..

ఇక్కడ Henrietta ఒక నల్లజాతీయురాలు కావడం కూడా అప్పటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా విస్మరించలేని అంశం..ఆ రోజుల్లో ముఖ్యంగా  నల్లజాతీయల మీద జరిగే ఆగడాల్లో ఈ వైద్యపరమైన పరిశోధనలు కూడా ఒకటి..వారికి తెలీకుండా వారిని అనేక ప్రయోగాల్లో భాగస్వాముల్ని చెయ్యడం అప్పట్లో పరిపాటి..Henrietta మొదటి కూతురు,మతిస్థిమితం లేని Elsie ఒక ఆస్పత్రి లో దారుణమైన ప్రయోగాల బారినపడి మృతి చెందడాన్ని కూడా ఈ సందర్భంగా ఇందులో పేర్కొంటారు..Johns Hopkins హాస్పిటల్ కూడా అదే చేసిందనీ,తమ తల్లి సెల్స్ తో అందరూ సొమ్ము చేసుకుంటున్నారని Henrietta కుమారులు Lawrence, Zakariyya పలు సందర్భాల్లో ఆరోపించినా, ఆమె కుమార్తె Deborah మాత్రం తన తల్లి ఎవరో ప్రపంచానికి తెలియాలని తప్ప ఇంకేమీ ఆశించట్లేదని అంటూ Rebecca తో ఆమె పుస్తకం రాయడంలో చివరివరకూ  సహాయపడుతుంది కానీ పుస్తకం ప్రచురణకు ముందే Deborah గుండెపోటు తో మరణిస్తుంది..

ఈ పుస్తకంలో శాస్త్రీయత ఒక పార్శ్వమైతే,మానవీయత మరో పార్స్వ్యం..Henrietta కు దక్కవలసిన గౌరవాన్ని ఇవ్వాలంటూ ఈ రెండింటికీ మధ్యనున్న అంతరాల్ని చెరిపెయ్యడమే రచయిత్రి Rebecca ప్రధానోద్దేశ్యంగా అనిపిస్తుంది..ఒక ప్రక్క He La సెల్స్ ను శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంత విశేషంగా వాడుతున్నారో,దానికి సంబంధించిన అనేక పరిశోధనలనుటంకిస్తూ చెప్తూనే,మరో వైపు Henrietta కుటుంబం,పుట్టుపూర్వోత్తరాలు,వారి జీవన శైలి,నల్ల జాతీయులుగా వారు అనుభవించిన దుర్భర పరిస్థితులను బ్యాక్ టు బ్యాక్ మనకు కళ్ళకు కట్టినట్లు వివరిస్తారు...He La వెనుక ఉన్నది Henrietta Lacks అనీ,ఆమె ఒక సెల్ లైన్ మాత్రమే కాదనీ,ఒక ముడిపదార్థంగా కాకుండా Henrietta Lacks ను ముందు ఒక మనిషిగా గుర్తించాలనీ,ఆమె కథను ప్రపంచం తెలుసుకోవలసిన అవసరం ఉందనీ Rebecca వాదన..మెదడుతో ఆలోచించే సైంటిఫిక్ రీసెర్చ్ ని,మనసుతో ఆలోచించే మామూలు మనిషితో ముడిపెట్టే యత్నంలో అడుగడుగునా అడ్డుపడే హ్యూమన్ ఎథిక్స్ పాత్రను తెలుసుకోవాలంటే ఇలాంటి ఒక పుస్తకం చదవాల్సిందే..ఈ రచన Oprah Winfrey Deborah పాత్రలోనటించగా త్వరలో సినిమాగా రానుంది..

Henrietta Lacks మరియు He La సెల్స్ గురించిన BBC documentary 'The Way of All Flesh', యూట్యూబ్ లింక్
BBC documentary on He La

పుస్తకం నుండి కొన్ని లైన్స్,
నల్లజాతీయుల వెళ్ళే Johns Hopkins హాస్పిటల్ గురించి రాస్తూ...
For Henrietta, walking into Hopkins was like entering a foreign country where she didn’t speak the language.
“Hopkins, with its large indigent black population, had no dearth of clinical material.
“Hennie,” she whispered, “they burnt you black as tar.”Henrietta just nodded and said, “Lord, it just feels like that blackness be spreadin all inside me.

Henrietta గురించి Gey అసిస్టెంట్ మేరీ అనుభవాలు,
Mary stood beside Wilbur, waiting as he sewed Henrietta’s abdomen closed. She wanted to run out of the morgue and back to the lab, but instead, she stared at Henrietta’s arms and legs—anything to avoid looking into her lifeless eyes. Then Mary’s gaze fell on Henrietta’s feet, and she gasped: Henrietta’s toenails were covered in chipped bright red polish.
“When I saw those toenails,” Mary told me years later, “I nearly fainted. I thought, Oh jeez, she’s a real person. I started imagining her sitting in her bathroom painting those toenails, and it hit me for the first time that those cells we’d been working with all this time and sending all over the world, they came from a live woman. I’d never thought of it that way."
When it came to growing viruses—as with many other things—the fact that HeLa was malignant just made it more useful. HeLa cells grew much faster than normal cells, and therefore produced results faster. HeLa was a workhorse: it was hardy, it was inexpensive, and it was everywhere.
You do not engage the attention of the reader unless your story has basic human interest elements.
Several patients had successfully sued their doctors for privacy violations, including one whose medical records were released without her consent, and others whose doctors either published photographs or showed videos of them publicly, all without consent. But those patients had one thing going for them that Henrietta didn’t: They were alive. And the dead have no right to privacy—even if part of them is still alive.
Jones wrote: From a clinical point of view, Mrs. Lacks never did well. …As Charles Dickens said at the beginning of [A] Tale of Two Cities, ‘It was the best of times, it was the worst of times.But it was the best of times for science in that this very peculiar tumor gave rise to the HeLa cell line. … For Mrs. Lacks and the family she left behind, it was the worst of times. Scientific progress and indeed progress of all kinds is often made at great cost, such as the sacrifice made by Henrietta Lacks.
“You know what’s weird? The world got more pictures of my mother cells than it do of her. I guess that’s why nobody knows who she is. Only thing left of her is them cells.

The Book of Laughter and Forgetting - Milan Kundera

మనుష్య జీవితంలో విస్మృతి అనేది సర్వసాధారణమే,కానీ ఆ మరపు సహజసిద్ధంగా జరిగే ప్రక్రియలా కాకుండా,ఒక సమాజం ప్రయత్నపూర్వకంగా తన స్వార్ధ ప్రయోజనాల దృష్ట్యా కాలం నిర్వర్తించాల్సిన పనిని తన చేతుల్లోకి తీసుకుని గతాన్ని చరిత్రలో నుంచి చెరిపేసి ప్రయత్నం చేస్తే,అంతవరకూ ఆ అనంతమైన స్మృతిపథాల్లో తమ అస్తిత్వం ముడిపడి ఉందని భావించే మనుషుల జీవితాలు మళ్ళీ తెల్లకాగితాల్లా మిగిలిపోయి,వాళ్ళు అటు గతాన్ని వదల్లేక ఇటు తమది కానీ వాస్తవంలో బ్రతకలేక పడే యాతనకు కాల్పనికతను జోడించి magical realism శైలిలో అక్షర రూపాన్నిచ్చారు,Czechoslovakia రచయిత Milan Kundera..1979 లో తొలి ముద్రణ వచ్చాకా 'The book of laughter and forgetting' ను Michael Henry Heim ఆంగ్లీకరించగా,మరో ప్రసిద్ధ రచయిత Philip Roth ఎడిట్ చేశారు..Kundera నిజానికి Czech పౌరుడైనప్పటికీ,దేశబహిష్కరణకి గురై ఫ్రాన్స్ లో స్థిరపడి ఫ్రెంచ్ భాషలో ఆయన అనేక రచనలు ముద్రణకు నోచుకున్న కారణంగా తనను తాను ఒక ఫ్రెంచ్ రచయిత గా చెప్పుకుంటారు..


చరిత్ర లో అనేక ముఖ్యమైన ఘట్టాలు కాలగర్భంలో కలిసిపోతాయి..నిజానికి కలిపెయ్యబడతాయి..స్వార్ధంతో,అధికారదాహంతో ఒక సంస్కృతినీ,ఒక నాగరికతనీ,ఒక దేశాన్నీ సమూలం గా చరిత్ర పుటల్లోంచి వేరు చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు,ఆ సమాజానికి చెందిన మనిషి ఉనికి అతనికే ప్రశ్నర్ధకమైన పరిస్థితుల్లోంచి పుట్టుకొచ్చిన కథలు ఇవి..నవల మొదట్లో Czech దేశానికి సంబంధించి ప్రాముఖ్యతను సంతరించుకున్న ఒక చారిత్రాత్మక ఘట్టం గురించి చెప్పడంతో కథ మొదలవుతుంది..February 1948 లో కమ్యూనిస్ట్ లీడర్ అయిన Klement Gottwald ,Prague లో Old Town Squareలోని Baroque palace బాల్కనీ నుంచి కొన్ని వేలమంది ప్రజలనుద్దేశించి ప్రసంగించారు..రష్యన్ చొరబాటుతో Czech కమ్యూనిస్ట్ దేశంగా ఆవిర్భవించిన కీలక సందర్భం అది..చలికాలం,అందునా Gottwald తలమీద టోపీ లేక మంచు పడడంతో ప్రక్కనే ఉన్న Vladimír Clementis తన తలమీద ఉన్న fur cap ను తీసి ఎంతో concern తో Gottwald తలమీద ఉంచారు..ఆ టైం లో తీసిన ఫోటో Czech చరిత్రలో ప్రతివారికీ సుపరిచితమే..పిల్లల text books మొదలు ప్రతిచోటా ఆ ఫోటో దర్శనమిచ్చేదట..కానీ ఇది జరిగిన సరిగ్గా నాలుగేళ్లకు Clementis ను దేశద్రోహం నేరం మీద ఉరి తీశారు..దానితో పాటు Czech చరిత్రలో కీలకమైన ఆ ఫోటో నుండి కూడా Clementis ని తప్పించారు..1968 లో రష్యన్ చొరబాటుతో Prague Spring గా పిలవబడే ఈ సమయంలో అప్పటి రాజకీయ పరిస్థితులు సామాన్యుని జీవితంలో ఎలాంటి పెనుమార్పుల్ని తీసుకొచ్చాయో వివరిస్తారు Milan Kundera..ఆ తరువాత సుమారు 41 సంవత్సరాల పాటు Czech రష్యన్ అథారిటీ క్రిందే ఉంది..

కమ్యూనిజం Czech లో వేళ్ళూనుకుంటున్న ఆ రోజుల్లో,కొందరు వ్యక్తులు తాము నమ్మిన సిద్ధాంతాలను సమాజ శ్రేయస్సు దృష్ట్యా తొలుత అమలు పరిచి ఒక పాలన తీసుకొచ్చాక,మళ్ళీ ఆ సమాజంలో కూడా అవే పరిస్థితులు పునరావృతం అయితే,మళ్ళీ ఆ సిద్ధాంతాలను పునఃపరిశీలించుకుని తమ circle కి తామే ఎదురు తిరగాల్సివచ్చినప్ప్పుడు,ఆ వ్యక్తుల్ని ఆ సమాజం దేశద్రోహులుగా ముద్ర వేసి జైలుపాలు చేసింది,కొందర్ని దేశబహిష్కరణకు గురి చేసింది,మరి కొందరినైతే ఉనికే లేకుండా చేసింది..ఇందులో రచయిత,ఒకే నేపధ్యంలో రాసిన ఏడు కథలను తన స్వానుభవాల,మనోభావాల సమాహారంగా మలిచారు..Narration ఫస్ట్ పర్సన్ లోనే ఉంటుంది..ఈ కథా సంకలనాన్ని categorize చెయ్యడం కష్టం,ఎందుకంటే ఇందులో ఆయన చర్చించని విషయమంటూ ఉండదు..మొదట్లో రాజకీయపరమైన వివరణలతో మొదలుపెట్టి మెల్లిగా ఫిలాసఫీ,అస్తిత్వ వాదం,ప్రేమ,ఐడెంటిటీ,తాత్విక వాదం,శృంగారం ఇలా పలు అంశాలను స్పృశిస్తూ ముందుకు వెళ్తారు..Czech దేశ పౌరుడిగా,ఆ యువతకు ప్రతినిధిగా తన అస్తిత్వాన్ని ప్రశ్నించుకునే రచయిత అనుభవాలు మనకు మ్యూజింగ్స్ లా అనిపిస్తాయి..ఇందులో ఒక ప్రత్యేకత ఏంటంటే,ప్రతి కథా దేనికి దానికి విడి విడిగా ఉంటాయి,కానీ చివర్లో చూస్తే అన్నీ కూడా ఒక దానికొకటి interlinked గా ఒకే కథగా అనిపిస్తాయి..అన్నిటిలోను ఉమ్మడిగా కనిపించే విషయాలు టైటిల్ కి న్యాయం చేసే హాస్యము మరియు విస్మృతి..ఈ రెండిటినీ మెటఫోర్లుగా వాడారు..ఈ కథల్లో Laughter అంటే irony, Forgetting అంటే sadness ధ్వనిస్తాయి..మొదటి కథ Lost Letters లో తన గతాన్ని చెరిపెయ్యాలని Mirek చేసే వ్యర్ధ ప్రయత్నం కనిపిస్తే ,మరో కథలో విధవరాలైన Tamina,తన భర్త తాలూకు గతం తన జ్ఞాపకాల్లోంచి చేజారనివ్వకూడదనే తపన కనిపిస్తుంది..

She has no desire to turn the past into poetry, she wants to give the past back its lost body. She is not compelled by a desire for beauty, she is compelled by a desire for life.

There she sits on a raft, looking back, looking only back. The sum total of her being is no more than what she sees in the distance, behind her. And as her past begins to shrink, disappear, fall apart, Tamina begins shrinking and blurring.She longs to see the notebooks so she can fill in the fragile framework of events in the new notebook, give it walls, make it a house she can live in. Because if the shaky structure of her memories collapses like a badly pitched tent, all Tamina will have left is the present, that invisible point, that nothing moving slowly toward death.

మళ్లీ మరో కథలో అదే తమీనా ఒక దీవిలో చిన్న పిల్లల మధ్య Odd man out లా బ్రతకాల్సి రావడం అంతర్లీనంగా Prague హిస్టరీని metaphorical way లో వివరిస్తారు,ఇంకో కథ 'Mother' లో Marketa అనే ఆమె భర్తతో intimate గా ఉండే సమయంలో తల లేకుండా అతన్ని ఊహించుకునే కథలో 'absence of soul' గురించి రాశారు,మరో కథలో inferiority కాంప్లెక్స్ ఉన్న ఒక యువకుడు తన అస్తిత్వాన్ని గురించి ఆలోచించే కథలో existential క్రైసిస్ కనిపిస్తుంది..ఇలా ఒక వైపు వైరుధ్యాన్ని,మరోవైపు సారూప్యాన్ని ఏక కాలంలో సమన్వయం చెయ్యడంలో Milan Kundera ప్రతిభ ప్రతి అక్షరంలోనూ కనిపిస్తుంది..చివరి కథ The Border ఒక్కటే మిగతా కథలకంటే చాలా వేరుగా ఉంది,నాకు పెద్దగా నచ్చలేదు..

ఒక సందర్భంలో రైటింగ్ గురించి చెప్తూ రాసిన ఈ విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి,
Novels are the fruit of the human illusion that we can understand our fellow man.

The only thing we can  do," said Banaka, "is to give an account of our own selves. Anything else is an abuse of power. Anything else is a lie"
"Ever since Joyce," he said, "we have been aware of the fact that the greatest adventure in our lives is the absence of adventure. Odysseus fought at Troy, made his way home on a ship he himself piloted, had a mistress on every island—no, such is not the life we live. Homer's  Odyssey  now takes place within man. Man has internalized it. The islands, the sea, the sirens seducing us, and Ithaca calling us home—they have all been reduced to voices within us.

"Right! Look at me  from the outside  and I don't seem special.  From the outside!  Because it's what goes on in me,  on the inside,  that's worth writing about, that people will want to read about.

The episode of Banaka pointing to his chest and crying out of existential anguish reminds me of a line from Goethe's  West-East Divan:  "Is one man alive when others are alive?" Deep within Goethe's query lies the secret of the writer's creed. By writing books, the individual becomes a universe (we speak of the universe of Balzac, the universe of Chekhov, the universe of Kafka, do we not?). And since the principal quality of a universe is its uniqueness, the existence of another universe constitutes a threat to its very essence.

లిటరరీ మ్యాగజైన్స్ లో వచనం గురించి చెప్తూ లిరికల్/ పొయెటిక్ narration అని వర్ణిస్తూ ఉంటారు,ఆ ఫీల్ తీసుకురావడంలో నిరాశపరిచిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి..కానీ Milan Kundera ని చదివాక 'అంటే ఇలాంటి పుస్తకమన్నమాట' అనుకున్నాను..ఎక్కడా దారం అనేదే కనిపించకుండా చిక్కగా కట్టిన మల్లెచెండు లాంటి వర్ణన అది..కొన్ని పుస్తకాలు ఆడుతూ పాడుతూ చదివెయ్యొచ్చు,వారు చెప్పాలనుకున్న విషయాన్నికొంచెం తేలికైన వచనంతో మన బ్రెయిన్ తీసుకునే distraction gapsని కూడా క్షమించేసే రచయితలు ఉంటారు..కానీ ఈయన ఈ విషయంలో పరమ కర్కోటకుడు,ఆయన చెప్తున్నది పూర్తిగా మన మెదడులో రిజిస్టర్ కావాలంటే ఒక్క అక్షరం కూడా పొల్లుపోనివ్వకుండా,పూర్తి అట్టెన్షన్ తో చదవాల్సిందే..అలా అని ఇందులో అర్ధంకాని పెద్ద పెద్ద వ్యాఖ్యానాలు ఉండవు,పొదుపైన పదాలతో తన అద్భుతమైన narrationతో ఆపకుండా చదివించగలిగే సత్తా ఉన్న రచయిత Milan Kundera..చదువుతున్నంతసేపూ ఆ metaphorical narration గురించి 'ఆహా' అనుకోని సందర్భం ఉండదు..హ్యూమన్ Consciousness ని కూడా layers లో చూస్తే Kundera ముట్టుకోని లేయర్ లేదనే చెప్పాలి..కొన్ని అంశాల్లో అవధుల్లేని ఆయన intellectual streak మనల్ని ఆశ్చర్య పరుస్తుంది..ఇది అవ్వడానికి 263 పేజీల పుస్తకమే అయినా,కంటెంట్ క్వాలిటీ దృష్ట్యా కాస్త భారీగానే అనిపించింది...పుస్తకం చదివేటప్పుడు ఇష్టమైన లైన్స్ మార్క్ చేసుకునే అలవాటులో,చివర్లో చూస్తే దాదాపు చాలా శాతం పుస్తకం మార్క్ చేశాను..

ఈ రచన లో మూలవస్తువు Czech రాజకీయ సామాజిక పరిస్థితులు కావడంతో మొదట్లో Czech చరిత్ర గురించి కాస్త తెలుసుకోవలసి వచ్చింది...రెండేళ్ల క్రితం చదివిన ఒక అద్భుతమైన పొలిటికల్ సెటైర్ George Orwell రాసిన Animal Farmకీ దీనికీ చాలా పొంతనలు ఉన్నాయి,కానీ తేడా ఏంటంటే Orwell రచన ఒక surface మీద సాగితే ఈయన రచనలో విశ్లేషణలు మరింత లోతుగా ఉంటాయి..కానీ ఇది కూడా Animal Farm లాగానే కాలదోషం పట్టని రచన,ప్రతి సమాజానికీ అన్వయించుకోవచ్చు..నా విషయంలో ఒకే రచయిత రాసిన రెండో పుస్తకం వరుసగా చదవడం బహు అరుదు (ఠాగోర్ పూర్తిగా exception అనుకోండి ) కానీ Coetzee తరువాత మళ్ళీ ఇంతకాలానికి ఈయన రాసిన మరో పుస్తకం వెంటనే చదవాలి అనిపించిన రచయిత Milan Kundera మాత్రమే..మొదట ఆయన ప్రముఖమైన నవల 'The unbearable lightness of being' చదువుదామనుకుని, మొదటి సారి కదా,ఆ టైటిల్ అంత భారీగా ఉంది కొంచెం తేలిక పాటి రచనతో మొదలు పెడదాం అని ఇది చదివిన నేను 'Don't judge a book by its title' అని మరో పాఠం నేర్చుకున్నాను..

పుస్తకం చివర్లో Philip Roth రచయితను చేసిన ఇంటర్వ్యూ చాలా బావుంది..ఆయన అందులో ఒక ప్రశ్నకు చెప్పిన సమాధానంలో చివరి రెండు లైన్స్ అద్భుతం..

PR: Is this, then, the furthest point you have reached in your pessimism?MK: I am wary of the words pessimism and optimism. A novel does not assert anything; a novel searches and poses questions. I don't know whether my nation will perish and I don't know which of my characters is right. I invent stories, confront one with another, and by this means I ask questions. The stupidity of people comes from having an answer for everything. The wisdom of the novel comes from having a question for everything.

ఈ పుస్తకం నుంచి నచ్చిన లైన్స్ కొన్ని:
Mirek says that the struggle of man against power is the struggle of memory against forgetting.

He airbrushed her out of the picture in the same way the Party propaganda section airbrushed Clementis from the balcony where Gottwald gave his historic speech. Mirek is as much a rewriter of history as the Communist Party, all political parties, all nations, all men. People are always shouting they want to create a better future. It's not true. The future is an apathetic void of no interest to anyone. The past is full of life, eager to irritate us, provoke and insult us, tempt us to destroy or repaint it. The only reason people want to be masters of the future is to change the past. They are fighting for access to the laboratories where photographs are retouched and biographies and histories rewritten.

Literature is a system of signs.

Whereas the Devil's laughter pointed up the meaninglessness of things, the angel's shout rejoiced in how rationally organized, well conceived, beautiful, good, and sensible everything on earth was.

Laughable laughter is cataclysmic. And even so, the angels have gained something by it. They have tricked us all with their semantic hoax. Their imitation laughter and its original (the Devil's) have the same name. People nowadays do not even realize that one and the same external phenomenon embraces two completely contradictory internal attitudes. There are two kinds of laughter, and we lack the words to distinguish them.

సమాజాన్నీ,అథారిటీని ఒక circle గా చూపిస్తూ చేసిన విశ్లేషణ....
Then one day I said something I would better have left unsaid. I was expelled from the Party and had to leave the circle.That is when I became aware of the magic qualities of the circle. Leave a row and you can always go back to it. The row is an open formation. But once a circle closes, there is no return.It is no accident that the planets move in a circle and when a stone breaks loose from one of them it is drawn inexorably away by centrifugal force. Like a meteorite broken loose from a planet, I too fell from the circle and have been falling ever since. Some people remain in the circle until they die, others smash to pieces at the end of a long fall. The latter (my group) always retain a muted nostalgia for the circle dance. After all, we are every one of us inhabitants of a universe where everything turns in circles

We shall flee rest, we shall flee sleep, We shall outstrip dawn and spring And we shall fashion days and seasons To the measure of our dreams.

A man possessed by peace never stops smiling.

Kundera దృష్టి లో స్త్రీ..."A mismatched outfit, a slightly defective denture, an exquisite mediocrity of the soul—those are the details that make a woman real, alive. The women you see on posters or in fashion magazines—the ones all the women try to imitate nowadays—how canthey be attractive? They have no reality of their own; they're just the sum of a set of abstract rules. They aren't born of human bodies; they hatch ready-made from the computers.

"The first step in liquidating a people," said Hubl, "is to erase its memory. Destroy its books, its culture, its history. Then have somebody write new books, manufacture a new culture, invent a new history. Before long the nation will begin to forget what it is and what it was. The world around it will forget even faster.

Love is a constant interrogation. In fact, I don't know a better definition of love.

Man knows he cannot embrace the universe with all its suns and stars. But he finds it unbearable to be condemned to lose the second infinity as well, the one so close, so nearly within reach. Tamina lost the infinity of her love, I lost my father, we all lose in whatever we do, because if it is perfection we are after, we must go to the heart of the matter, and we can never quite reach it.

Being a corpse struck her as an unbearable disgrace. One minute you are a human being protected by modesty—the sanctity of nudity and privacy—and the next you die, and your body is suddenly up for grabs. Anyone can tear your clothes off, rip you open, inspect your insides, and—holding his nose to keep the stink away—stick you into the deepfreeze or the flames.

But I feel Jan is wrong in thinking that the border is a line dissecting man's life at a given point, that it marks a turning point in time, a definite second on the clock of human existence. No. In fact, I am certain the border is constantly with us, irrespective of time or our age; external circumstances may make it either more or less visible, but it is omnipresent.

My Name Is Lucy Barton - Elizabeth Strout

గతం...వర్తమానం..భవిష్యత్తు...వీటి ప్రస్తావన వచ్చినప్పుడు వర్తమానంలో అంటే ఈ క్షణంలో బ్రతకడం అవసరం అని అనడం చూస్తూ ఉంటాం..కానీ గతం ఛాయలు ప్రతిఫలించకుండా వర్తమానంలో బ్రతకడం చెప్పినంత తేలికేనా ఆచరించడం !! మనిషిని ఒక మట్టిముద్దనుంచి ఒక పరిపూర్ణమైన ఆకృతిలోకి తీసుకురావడంలో గతం పాత్ర చాలా కీలకమైనదీ,విస్మరించలేనిదీను...ఒక మనిషి గురించి పూర్తిగా తెలియాలంటే వారి గతం గురించి తెలియాలి..కానీ భావోద్వేగాల్ని బయటపెట్టడం అనాగరికత అనీ,అది ఒక మానసిక బలహీనత అనీ,సంతోషం,దుఖ్ఖము,అభద్రత,భయాలూ లాంటివాటిని ఒక చిరునవ్వుతో నాగరికత ముసుగులో దాచుకోవాలని చెప్తున్ననేటి సంస్కృతిలో ఒక మనిషిని ఒక్కసారి చూసి,ఉపరితలం మీద వేసుకున్న సంస్కారం,నాగరికత ముసుగుల్లోనుంచి అంచనా వెయ్యడం అసలు సాధ్యమేనా !! Olive Kitteridge అనే కథల సంకలనానికిగాను 2009 లో Pulitzer Prize గెలుచుకున్న అమెరికన్ రచయిత్రి ఇటీవలి రచన 'My Name Is Lucy Barton' ఆ సాధ్యాసాధ్యాలను విశ్లేషిస్తుంది..ఈ పుస్తకం 2016 Man Booker ప్రైజ్ లాంగ్ లిస్ట్ గా ప్రకటించిన 13 నవలల్లో ఒకటిగా నిలిచింది..ఈ పుస్తకం మనిషి అస్తిత్వం మీద ప్రాంతీయ,ఆర్ధిక,సామాజిక,భాషాపరమైన అంశాలు చూపించే ప్రభావాన్ని గురించి విపులంగా చర్చిస్తుంది..

పేదరికం,ఒంటరితనం మధ్య అతి చేదైన బాల్యం గడిపిన లూసీ భర్త,ఇద్దరు పిల్లలతో(5ఏళ్ళు ,6 ఏళ్ళు ) న్యూ యార్క్ లో ఒక రచయిత్రిగా స్థిరపడుతుంది..లూసీ ఒక అంతుబట్టని ఇన్ఫెక్షన్ కారణంగా హాస్పిటల్ లో ఉన్న సమయంలో ఆమె తల్లి ఐదు రోజులకుగాను ఆమెకు తోడుగా రావడం,ఆ సందర్భంలో తల్లి కూతుళ్ళ మధ్య జరిగే సంభాషణలతో narration మొదలవుతుంది..ఇందులో కథ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు,లూసీ అనుభవాల్ని చాలా వరకూ వారిద్దరి మధ్య జరిగే సంభాషణలు,ఆ తదుపరి సంఘటనలే చెప్తాయి..రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న లూసీ తండ్రి లూసీ జర్మన్ నేపథ్యం కలిగిన విలియం ను పెళ్లి చేసుకోవడం పట్ల విముఖత కారణంగా వారి మధ్య చాలా ఏళ్ళగా సత్సంబంధాలు ఉండవు..మళ్ళీ చాలా కాలానికి కలిసిన తల్లి-కూతుళ్ల ఆలోచనల్లో ఉండే వైరుధ్యం,తల్లి తన ప్రక్కనే ఉండటం వల్ల చాలా రోజులకి ప్రశాంతంగా నిద్రపోయానని లూసీ చెప్పడం,తల్లి ఆమెకు తెలిసిన కొందరు వ్యక్తుల పర్సనల్ లైఫ్ గూర్చి లూసీకి చెప్పడం.. ఇలా చాలా మాములుగా,కొన్ని చోట్లయితే ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకునే గాసిప్స్ వింటున్నట్లు ఉంటుంది..

మన సినిమాల్లో పల్లెటూరు నుంచి పట్టణం వెళ్లిన తొలినాళ్లలో మన హీరోలు,హీరోయిన్లు పడే ఇబ్బందులు,ఎదుర్కునే అవమానాలు,అక్కడ ఇమడలేక పడే బాధ ఇవన్నీ ఒక ఫన్నీ టోన్ లో చెప్పడం చూస్తుంటాం.. కానీ నిజానికి ఆ అనుభవాలు హాస్యాస్పదంగానే ఉంటాయా !! పంచె కట్టు,వేషభాషలు చూసి పట్టణ నాగరికులు చేసే ఛీత్కారాలు జీర్ణించుకోవడం సులభమేనా !!! గొప్ప గొప్ప విషయాలు చర్చించే నలుగురి మధ్య అజ్ఞానంతో మౌనంగా చూస్తూ ప్రేక్షకపాత్ర వహించేవారికి గౌరవం దక్కుతుందా !! ఇలాంటి చాలా ప్రశ్నలు మనం ఈ పుస్తకం చదువుతుంటే మన మనసులో మెదులుతాయి...

Looking back, I imagine that I was very odd, that I spoke too loudly, or that I said nothing when things of popular culture were mentioned; I think I responded strangely to ordinary types of humor that were unknown to me. I think I didn’t understand the concept of irony at all, and that confused people.

అమెరికన్స్ అంటే ఆధునికతకి మారుపేరు అని భావించేవారికి  అమెరికా అయినా,ఇండియా అయినా,మరో దేశం అయినా  గ్రామీణ ప్రాంతాల వారు అన్ని చోట్లా ఉంటారనీ,వారు కూడా మహానగరాల్లో నివసించవలసి వచ్చినప్పుడు ఒక సగటు మనిషిలాగే ఆలోచిస్తారనీ లూసీ ఆలోచనలు చదువుతున్నప్పుడు అనిపిస్తుంది...

And a look went across his face—so fast, so involuntary—that was a look of real distaste. I had not yet learned the depth of disgust city people feel for the truly provincial.

 I have said before: It interests me how we find ways to feel superior to another person, another group of people. It happens everywhere, and all the time. Whatever we call it, I think it’s the lowest part of who we are, this need to find someone else to put down.

ఈ నవలలో ప్రత్యేకత ఏంటంటే కథ,కథనం రెండూ కూడా అమెరికన్ వ్యావహారిక శైలికి చాలా విరుద్ధంగా అనిపించాయి..కొన్ని చోట్ల భావోద్వేగాలు,సున్నితత్వం పాళ్ళు పరిధికి మించి ఉన్నాయేమో అనిపించింది..అడుగడుగునా లూసీ మనసులో ఒంటరితనం,పూరించలేని ఖాళీ మనకి అవగతమవుతుంటుంది..ఆమె వ్యక్తిత్వం పై ఆమె కఠినమైన బాల్యం చూపించిన ప్రభావాన్ని  అధిగమించడంలో ఆమె ఓటమి (మానసికంగా) స్పష్టంగా కనిపిస్తుంది..కానీ నేను ఈ ప్రపంచానికి చెందను అనే భావన ఎదురైన ప్రతిసారీ లూసీ Belongingness కోసం పడే తపన,ఆ సంఘర్షణ లూసీది మాత్రమేనా అనే అనుమానం మనకి కలగకపోదు..జీవితంలో ఏదో ఒక స్టేజ్ లో ప్రతి మనిషి తన వర్తమానాన్ని,గతానికి ముడిపెట్టాలని  చేసే విఫలయత్నం తాలూకు సంఘర్షణ అందరికీ అనుభవమే కదా అనిపిస్తుంది..ముఖ్యంగా గ్రామీణ,వెనుకబడిన  ప్రాంతాలనుంచి వచ్చి మహానగరాల్లో,పెద్ద ప్రపంచంలో తమ అస్తిత్వాన్ని చాటుకున్న అనుభవం ఉన్నవారూ,లేదా ప్రయత్నిస్తున్న వారూ ఈ నవలకి బాగా కనక్ట్ అవుతారు..
మొదట్నుంచీ పల్లెల అనుభవం లేని నాకు కొన్ని చోట్ల ఏంటి మరీ ఈ పిరికితనం అనీ,కొన్ని చోట్ల సాగదీతగా అనిపించిన మాట వాస్తవం..లూసీ బాల్యం ఇటీవల చదివిన 'The Glass Castle' ను గుర్తుకు తెచ్చినా,Jeannette Walls లో ఉండే పోరాడేతత్వం  లూసీ లో అణుమాత్రమైనా కనిపించదు..కొన్ని చోట్ల లూసీ తనకి వైద్యం చేసిన Jewish డాక్టర్,neighbour Jeremy,writer Sarah Payne లాంటి కొందరు అపరిచితుల్లో స్నేహం,సాన్నిహిత్యం వెతుక్కోవడంలో ఐడెంటిటీ క్రైసిస్ కనిపిస్తుంది..

I have sometimes been sad that Tennessee Williams wrote that line for Blanche DuBois, “I have always depended on the kindness of strangers.” Many of us have been saved many times by the kindness of strangers, but after a while it sounds trite, like a bumper sticker. And that’s what makes me sad, that a beautiful and true line comes to be used so often that it takes on the superficial sound of a bumper sticker.

రచయిత్రి అవ్వాలంటే కరుకుదనం ఉండాలనీ,సున్నితత్వం,compassion లాంటివి పనికి రావనే  కొందరి అభిప్రాయం లూసీకి వింతగా అనిపిస్తుంది..
Jeremy sat down beside me on the stoop. “Artists are different from other people"
“No. They’re not.” My face flushed. I had always been different; I did not want to be any more different.
“But they are.” He tapped my knee. “You must be ruthless, Lucy.”

He spoke of her work, saying that she was a good writer, but that she could not stop herself from a “softness of compassion” that revolted him, that, he felt, weakened her work.

మనిషికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ముఖ్యం,సెన్సిటివ్ గా ఉండకూడదు,ఎమోషనల్ అవ్వకూడదు,ఇలా కొన్ని నిర్దిష్టాభిప్రాయాలు ఉన్నవారు ఈ నవల జోలికి వెళ్ళకపోవడం మంచిది..ఎందుకంటే ఈ నవల్లో మనల్ని ఉత్తేజింపజేసే అంశాలు దాదాపు ఏమీ ఉండవు..గెలుపోటములు అసలే ఉండవు..ఉపన్యాసాలు ఉండవు...కేవలం ఒక మామూలు వ్యక్తి మన ప్రక్కన కూర్చుని మనతో తన భయాలు,బాధలు,అవమానాలు,చిన్న చిన్న ఆనందాలు పంచుకుంటున్నట్లుంటుంది..హాస్పిటల్ కిటికీ లోంచి దేదీప్యమానంగా మెరుస్తున్న Chrysler Building ను చూస్తూ,ఇంత పెద్ద ప్రపంచంలో తన ఉనికిని మనకి చెప్పాలని చేసే ప్రయత్నం కనిపిస్తుంది..ఆమె 'నా పేరు లూసీ బార్టన్' అని మనకి తనని తాను పరిచయం చేసుకుంటుంది..

పుస్తకం నుండి మరికొన్ని నచ్చిన లైన్స్,
In spite of my plenitude, I was lonely. Lonely was the first flavor I had tasted in my life, and it was always there, hidden inside the crevices of my mouth, reminding me. He saw this that day, I think. And he was kind.

The Puritanism of my ancestors has not made use of conversation as a source of pleasure, the way I have seen other cultures do.

It’s not my job to make readers know what’s a narrative voice and not the private view of the author,”

He said, “What is your job as a writer of fiction?” And she said that her job as a writer of fiction was to report on the human condition, to tell us who we are and what we think and what we do.

“He was famous.”“He was. He was so famous, he died from it.”“He died from drugs, Lucy.”“But that would be the loneliness thing, Mom. From being so famous. Think about it: He couldn’t go anywhere.

Sarah Payne said, If there is a weakness in your story, address it head-on, take it in your teeth and address it, before the reader really knows. This is where you will get your authority, she said, during one of those classes when her face was filled with fatigue from teaching. I feel that people may not understand that my mother could never say the words I love you. I feel that people may not understand: It was all right.
Sarah Payne had said at the writing class in Arizona. “You will have only one story,” she had said. “You’ll write your one story many ways. Don’t ever worry about story. You have only one.”

At our small wedding reception she said to a friend of hers, “This is Lucy.” She added, almost playfully, “Lucy comes from nothing.”I took no offense, and really, I take none now. But I think: No one in this world comes from nothing.

But I know that money is a big thing, in a marriage, in a life, money is power, I do know that. No matter what I say, or what anyone says, money is power.

My more tenderhearted daughter, Becka, said to me during this time, “Mom, when you write a novel you get to rewrite it, but when you live with someone for twenty years, that is the novel, and you can never write that novel with anyone again!”

When breath becomes air By Paul Kalanithi

Image Courtesy Google
"సాస్ లేనా భీ కైసీ ఆదత్ హై !" అని గుల్జార్ అన్నట్లు లైఫ్ లో ఏదో ఒక సమయంలో,అసలు మనమేం చేస్తున్నాం,ఊరికే అలవాటుగా ఊపిరి తీసుకుంటున్నామా లేక నిజంగా 'జీవిస్తున్నామా' అనే ఆలోచన అందరికీ వస్తుంది..మరి 'జీవిస్తున్నాం' అనడానికి కొలమానం ఏంటి !! కెరీర్ లో ఉన్నత శిఖరాలు అధిరోహించడం,నలుగురికీ ఉపయోగపడేలా జీవించడం,నలుగురిని సంపాదించుకోవడం..ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా డిఫైన్ చేస్తారు..ప్రతీ దాన్నీ డిఫైన్  చెయ్యాలనుకోవడం మనిషి నైజం..డిఫైన్ చెయ్యలేనిది అంటే,అది లేనట్లే (సైన్స్ అదే అంటుంది)..జీవితానికి పరమావధి 'ఇదీ' అంటాడు మనిషి..ఆ 'ఇది',ఒక ఫుల్ స్టాప్...కానీ ఆ ముగింపు ఏంటి !! అసలెలా ఉంటుంది !! ఇంకొంచెం ముందుకి వెళ్తే,మరి ముగింపు ముందే తెలిసిన కథల మాటేమిటి !!

కథలెన్నైనా ముగింపు ఒక్కటే,ఆ ముగింపు 'శ్వాస వాయువులో కలిసిపోవడం' అంటారు ఈ ఆటోబయోగ్రఫికల్ వర్క్ లో పాల్ కళానిధి..సరిగ్గా తన గమ్యాన్ని చేరే సమయంలోనే,అంటే ఒక న్యూరో సర్జన్ గా/న్యూరో సైంటిస్ట్ గా తన కలలను సాకారం చేసుకునేలోపే,37 ఏళ్లకే ఊపిరితిత్తుల కాన్సర్ తో ఆయన మరణించారు..నిన్నటి వరకూ పాల్ కళానిధి అంటే ఎవరో తెలీదు,ఎక్కడో ఖండాతరాల్లో పుట్టిన వ్యకి,కాన్సర్ తో చనిపోయారు,వృత్తి రీత్యా ఒక న్యూరోసర్జన్ అని మాత్రమే తెలుసు,ఆయన తల్లితండ్రులది చెన్నై అయినప్పటికీ వృత్తి రీత్యా వారు US లో సెటిల్ అయ్యారు..కానీ ఆయన మరణానంతరం పబ్లిష్ చేసిన ఈ ఆటోబయోగ్రఫికల్ వర్క్ చదివిన వాళ్ళకి ఖచ్చితంగా ఆయనతో ఒక అనిర్వచనీయమైన బాంధవ్యం ఏర్పడుతుంది..ఒక డాక్టర్ రాసిన పుస్తకం అంటే పూర్తిగా మెడికల్ టెర్మినాలజీ తో ఉంటుందని ఉన్న అపోహ కొన్ని పేజీలు చదివేసరికి పూర్తిగా మాయమైంది..అటు సైన్స్ నీ,ఇటు హ్యూమన్ existence నీ,వేదాంతాన్నీ,తర్కాన్నీ సమపాళ్ళలో కలిపి ఆయన రాసిన విధానం నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు.

మృత్యువు దృష్టిలో అందరూ సమానమే. పెద్ద డాక్టర్ అయినా,ఎంతో విజ్ఞాన సముపార్జన చేసినా,మానవీయ విలువలతో బ్రతికినా కూడా అది తేడా చూపించదు. అందుకే పాల్ కూడా తనకి కాన్సర్ అని తెలియగానే మొదట ఒక మామూలు మనిషిగానే రియాక్ట్ అవుతారు..ఒక షాక్ లో,'ఇదేంటి లైఫ్ లో ఇంత కష్టపడ్డాను,నా విజయానికి కేవలం ఒక్క మెట్టు దూరంలోనే ఉన్నాను..ఇప్పుడేంటి ఇలా? అని దేవుణ్ణి నిందిస్తారు'..కానీ ఆయన వివేకం తొందరగానే మరణాన్నికూడా హుందాగా ఆహ్వానించేలా చేస్తుంది. ఒక న్యూరో సర్జన్ గా Religion పట్ల నమ్మకం లేని వ్యక్తి అయినా కూడా చివరి రోజుల్లో దేవుని పట్ల శ్రద్ధాభక్తులతో వ్యవహరించానని అంటారు పాల్. టాల్స్టాయ్ రాసిన కొన్నిపుస్తకాల్లోలాగే చివరకి అన్ని దారులూ Spirituality దగ్గరకు వచ్చి ఆగాల్సిందేనని మరోసారి రుజువు చేస్తుంది ఈ పుస్తకం..

మొదట్నుంచీ లైఫ్ పర్పస్ తెలుసుకోవాలనే తపన పాల్ కళానిధిని సాహిత్యం వైపు ఆకర్షితుడయ్యేలా చేసింది,
What makes human life meaningful? I still felt literature provided the best account of the life of the mind, while neuroscience laid down the most elegant rules of the brain.
కానీ ఒక అనుభవాన్ని ఆలోచనల్లో ఊహించడం వేరు,అదే అనుభవాన్ని జీవించడం వేరు..ఈ కారణంగా ఆయన హ్యూమన్ consciousness అండ్ లైఫ్ పర్పస్ గురించి ప్రాక్టికల్ గా/ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే కుతూహలంతోనే న్యూరోసర్జరీని ఎన్నుకున్నానంటారు..తొలుత Stanford యూనివర్సిటీ లో ఇంగ్లీష్ లిటరేచర్,హ్యూమన్ బయాలజీ,కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి హిస్టరీ మరియు ఫిలాసఫీలో మాస్టర్స్ డిగ్రీ పొందారు..తరువాత Yale school of medicine లో వైద్య విద్యనభ్యసించి Stanford medical school లో రెసిడెన్సీ చేశారు.

ఆయన తోటి స్టూడెంట్స్ స్పెషాలిటీస్ లో లైఫ్ స్టైల్ మెడిసిన్ ని ఎంచుకోగా తాను మాత్రం న్యూరోసర్జరీని వృత్తిగా స్వీకరించాలనుకోవడం 'ఒక calling' అంటారు పాల్..ఒక డాక్టర్ గా తన వృత్తి పట్ల ఆయనకున్న నిబద్ధత,passion మనకి ఒక ఆదర్శవంతమైన న్యూరోసర్జన్ ని పరిచయం చేస్తే,సాహిత్యంలో అభిరుచి,మనుషుల పట్ల/జీవితం పట్ల ఆయన దృక్పథం ఆయన్ని ఒక గొప్ప మానవతావాదిగా నిలబెడుతుంది. మొదటి నలభై పేజీలు చదవగానే కాసేపు పుస్తకం ప్రక్కన పెట్టాల్సొచ్చింది..ముఖ్యంగా రెసిడెన్సీ లో భాగంగా Cadavers గురించి చదివేటప్పుడు,మెడికల్ ట్రైనింగ్లో ఒక సాధారణమైన సున్నితమైన వ్యక్తి ఒక callous/arrogant డాక్టర్(రచయిత మాటల్లోనే) గా ట్రాన్స్ఫర్మేషన్ చెందడంలో ఎదుర్కొన్న పరిస్థితులు చదువుతున్నపుడు ఒళ్ళు గగుర్పొడిచింది. వైద్య వృత్తిలో ఉన్నవారికి చేతులెత్తి దణ్ణం పెట్టాలనిపించింది. న్యూరో సర్జరీలో ఛాలెంజెస్ గురించి చెప్తూ,ఒక సందర్భంలో ఆపరేషన్ ఫెయిల్యూర్ కి బాధ్యత వహిస్తూ,గిల్టీ ఫీల్ తో ఆత్మహత్య చేసుకున్న మిత్రుడు Jeff గురించి రాస్తారు..మరోసారి ఒక ఆపరేషన్ లో పేషెంట్ మృతి చెందిన తరువాత ఫ్రిడ్జ్ లో అంతకుమునుపు తినడానికి పెట్టుకున్న శాండ్విచ్ తినే సందర్భం ఒక డాక్టర్ లైఫ్ ఎంత కఠినతరమో చెప్తారు...
Thirty minutes in the freezer resuscitated the sandwich. Pretty tasty, I thought, picking chocolate chips out of my teeth as the family said its last goodbyes. I wondered if, in my brief time as a physician, I had made more moral slides than strides.
తాను కూడా ఒక కాన్సర్ పేషెంట్ గా మారాకా తప్ప,ఒక  సర్జన్ గా పేషెంట్స్ బాధ తనకు పూర్తిగా అవగాహన కాలేదంటారు పాల్..
How little do doctors understand the hells through which we put patients.
డాక్టర్ స్థానం నుంచి పేషెంట్ గా మారినప్పుడు తన కంటే జూనియర్ డాక్టర్స్ మాట వినాల్సి వచ్చినప్పుడు ఒక సీనియర్ గా తన pride గురించి,కోపం వచ్చిన సందర్భాల గురించీ చెప్పినప్పుడు ఆయనలో నిజాయితీకి గౌరవం కలుగుతుంది..
మరో సందర్భంలో మరణాన్ని అర్ధం చేసుకోవాలనుకున్నవాడికి మరణం ఒక బహుమతే కదా అంటారు !
Shouldn’t terminal illness, then, be the perfect gift to that young man who had wanted to understand death? What better way to understand it than to live it? But I’d had no idea how hard it would be, how much terrain I would have to explore, map, settle.
ఇంకోచోట Pancreatic cancer బారిన పడ్డ colleague మరియు మిత్రుడు 'V ' గురించి చెప్తూ “Paul, do you think my life has meaning?  Did I make the right choices?” అని అడగడం తనని ఆశ్చర్య పరిచింది అంటూ..."It was stunning: even  someone I considered a moral exemplar had these questions in the face of mortality" అంటారు..

హ్యూమన్ knowledge కేవలం ఒక మనిషికి పరిమితం కాదనీ,సమాజంలో సంబంధ బాంధవ్యాలు దాన్ని సంఘటితంగా నిర్వచిస్తాయని అనే రచయితలో ఒక సామజిక బాధ్యత కలిగిన వ్యక్తి కనిపిస్తారు..
In the end, it cannot be doubted that each of us can see only a part of the picture. The doctor sees one, the patient another, the engineer a third, the economist a fourth, the pearl diver a fifth, the alcoholic a sixth, the cable guy a seventh, the sheep farmer an eighth, the Indian beggar a ninth, the pastor a tenth. Human knowledge is never contained in one person. It grows from the relationships we create between each other and the world, and still it is never complete. And Truth comes somewhere above all of them, where, as at the end of that Sunday’s reading,the sower and reaper can rejoice together.For here the saying is verified that ,“One sows and another reaps.” I sent you to reap what you have not worked for; others have done the work, and you are sharing the fruits of their work.
పాల్ తాను జీవించే రోజులను Kaplan-Meier survival curves తో కొలుచుకుంటున్నప్పుడు,మనిషి తన జీవన ప్రమాణం ముందే తెలిస్తే ఆ కాలాన్ని మరింత పద్ధతిగా సద్వినియోగం చేసుకుంటాడేమో అనిపిస్తుంది. అమాయకంగా 'ఒక్క రోజుని నేనేం చేసుకోను' అనే ఆ గొప్ప న్యూరో సర్జన్ ని చూస్తే బాధకలగక మానదు.
Tell me three months, I’d spend time with family. Tell me one year, I’d write a book. Give me ten years, I’d get back to treating diseases. The truth that you live one day at a time didn’t help: What was I supposed to do with that day ?
The problem is that you can’t tell an individual patient where she sits on the curve: Will she die in six months or sixty? I came to believe that it is irresponsible to be more precise than you can be accurate.Those apocryphal doctors who gave specific numbers (“The doctor told me I had six months to live”): Who were they, I wondered, and who taught them statistics ?
పుస్తకాలు చదివి ఏడవడం ఏంటి ! అని నవ్వుతూ కొట్టి పారేసే నన్ను ఈ పుస్తకం కంటతడి పెట్టించింది అని చెప్పడానికి కాస్త ఇబ్బందిగానే ఉంది..అక్షరాలు చాలా విలువైనవి కదా !! లేకపోతే కొన్ని ఖండాంతరాల అవతల ఎక్కడో,ఎప్పుడో భూమిలో ప్రశాంతంగా నిద్రిస్తున్న మనిషితో కేవలం కొన్ని అక్షరాలతో ఇంత బాంధవ్యం ఏర్పడడం చాలా అసహజం,విచిత్రం..ఇవే అక్షరాల్లో ఆ వ్యక్తిని చూశాను. విద్యను మించిన ఆయన వివేకానికి జోహార్లర్పించాను. ఆయన విజయాలకు జేజేలు కొట్టాను. ఆయన ఉన్నతమైన ఆలోచనలను పంచుకున్నాను. ఆయన ప్రశ్నలకి నేను కూడా సమాధానాల కోసం వెతికాను. ఆయన లక్ష్యాలను చేరుకోవాలని చేసిన విఫలయత్నానికి సాక్షిగా మారాను. చివరి ఆపరేషన్ చేసి ఇంటికి తిరిగి వెళ్తూ, 'మళ్ళీ ఈ హాస్పిటల్ కి సర్జన్ గా రాలేను' అని తెలిసి కార్ లో కూర్చుని ఏడ్చిన వ్యక్తిని చూసి మౌనం వహించాను. మరణాన్ని కూడా జీవించి చూపించిన ఆ వ్యక్తికి మనసులోనే శ్రద్ధాంజలి ఘటించాను.."I'm ready" అని అంటూ హుందాగా వీడ్కోలు చెప్పిన ఆయన్ని చూస్తూ నిస్సహాయంగా కన్నీరు కార్చాను. నిస్సందేహంగా,ఇవన్నీ ఈ memoir చదివే ప్రతి వారికీ అనుభవమయ్యే విషయాలే.

అంతకు మునుపు డెత్ గురింఛీ,లైఫ్ గురించీ The last lecture,The book thief,The death of Evan Ilyich,The confession,Tuesdays with Morrie లాంటి పుస్తకాలు కొన్ని చదివాను..కానీ ఇది మిగిలిన అన్నిటికంటే చాలా వేరుగా అనిపించింది. అవన్నీ అంతో ఇంతో ప్రభావం చూపించాయి గానీ నిస్సందేహంగా కంటతడి మాత్రం పెట్టించలేదు. కారణం ఏంటి అనుకున్నాను !! బహుశా ఇది రాసిన వ్యక్తి అటు మరణంతోనూ (కాన్సర్ పేషెంట్ గా) ఇటు జీవితంతోనూ (ఒక న్యూరో సర్జన్ గా) ప్రత్యక్షమైన సంబంధం కలిగిన వ్యక్తి కావడం వల్లనేమో అనిపించింది.. వీటన్నిటినీ మించి లిటరేచర్ లో ఆయనకున్న పట్టు ప్రతి అక్షరంలోను ప్రస్ఫుటమవుతుంది. మధ్యమధ్యలో  T.S.Eliot, Samuel Beckett, Nabokov ఇలా చాలా మంది ప్రసిద్ధ రచయితల ప్రస్తావన ఉంటుంది. ఒక సర్జన్ కాకపోయి ఉంటే ఆయన ఖచ్చితంగా ఒక గొప్ప సాహితీవేత్త అయ్యుండేవారు.
I could only think of Samuel Beckett, the metaphors that, in those twins, reached their terminal limit: “One day we were born, one day we shall die, the same day, the same second….Birth astride of a grave, the light gleams an instant, then it’s night once more.” I had stood next to “the grave digger” with his “forceps.” What had these lives amounted to?
చివర్లో పాల్ సతీమణి లూసీ (ఆమె కూడా వృత్తి రీత్యా డాక్టర్) రాసిన epilogue లో ఆమె పాల్ చివరి ఘడియల వరకూ జరిగిన ప్రయాణం గురించి వివరిస్తారు. ఆయన అంత్యకాలంలో కూతురు Cady (నెలల పసికందు) తో గడిపారు. Cady బోసినవ్వుల్ని చూస్తూ గడిపిన సమయంలో అంతకు మునుపెన్నడూ తెలియని ఆనందం అనుభవించానని ఆమెకు వదిలి వెళ్ళిన ఒక మెసేజ్ లో పేర్కొంటారు. చివర్లో లూసీ ఈ పుస్తకం రాయడం వెనుక భర్త ఉద్దేశ్యం చెప్తూ పాల్ కు తన మరణాన్ని ఒక సెన్సేషన్ చేసే ఉద్దేశ్యం లేదనీ,జీవితంతో/మరణంతో తన అనుభవాలను పంచుకోవాలని,కాలంతో పాటు పోటీ పడుతూ ఈ పుస్తకాన్ని రాశారనీ అంటారు.
What happened to Paul was tragic, but he was not a tragedy.
 This book carries the urgency of racing against time, of having important things to say. Paul confronted death—examined it, wrestled with it, accepted it—as a physician and a patient. He wanted to help people understand death and face their mortality. Dying in one’s fourth decade is unusual now, but dying is not. “The thing about lung cancer is that it’s not exotic,” Paul wrote in an email to his best friend, Robin. “It’s just tragic enough and just imaginable enough. [The reader] can get into these shoes, walk a bit, and say, ‘So that’s what it looks like from here…sooner or later I’ll be back here in my own shoes.’ That’s what I’m aiming for, I think. Not the sensationalism of dying, and not exhortations to gather rosebuds, but: Here’s what lies up ahead on the road.” Of course, he did more than just describe the terrain. He traversed it bravely
కాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజి లో,అంటే మరణించడానికి కొన్ని నెలల ముందు ఈ పుస్తకాన్నిఎలా అయినా పూర్తి చెయ్యాలని పాల్ శక్తికి మించి శ్రమపడాల్సొచ్చింది. ఇందులో ఒక డాక్టర్ గా,ఆపై కాన్సర్ పేషెంట్ గా తన అనుభవాలకీ,జీవితానికి అర్ధం తెలుసుకునే క్రమంలో ఆయన తన మెడిటేషన్స్ కి అక్షర రూపాన్నిచ్చారు. March 9, 2015 లో పాల్ కళానిధి మరణించగా,2016 లో ఈ memoir పబ్లిష్ అయ్యి న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. Stanford University Medical School కి చెందిన మరో ప్రసిద్ధ రైటర్/physician Abraham Verghese దీనికి foreword రాశారు. పాల్ కళానిధి జీవించి లేకపోయినా ఒక రైటర్ గా తన సాహిత్యాభిరుచిని చాటుతూ ముందుతరాలకు ఒక అద్భుతమైన memoir ని కానుకగా ఇచ్చారు..ఈ పుస్తకం ద్వారా జీవితాన్నిఎంత హుందాగా స్వీకరిస్తామో,మరణాన్ని కూడా అంతే హుందాగా స్వీకరించడానికి కొంతమందికైనా ఈ memoir సహాయపడుతుందని నమ్మకంతో చేసిన ప్రయత్నంలో ఆయన మరో విజయం సాధించినట్లే.

పుస్తకం నుండి మరికొన్ని నచ్చిన అంశాలు,
The favorite quote of many an atheist, from the Nobel Prize–winning French biologist Jacques Monod, belies this revelatory aspect: “The ancient covenant is in pieces; man at last knows that he is alone in the unfeeling immensity of the universe, out of which he emerged only by chance.”
Why was I so authoritative in a surgeon’s coat but so meek in a patient's gown?
If the unexamined life was not worth living, was the unlived life worth examining?
Suddenly, now, I know what I want. I want the counselors to build a pyre…and let my ashes drop and mingle with the sand. Lose my bones amongst the driftwood, my teeth amongst the sand….I don’t believe in the wisdom of children, nor in the wisdom of the old.There is a moment, a cusp, when the sum of gathered experience is worn down by the details of living. We are never so wise as when we live in this moment.
English PhDs reacted to science, as he put it, “like apes to fire, with sheer terror"
Maybe Beckett’s Pozzo is right. Maybe life is merely an “instant,” too brief to consider. But my focus would have to be on my imminent role, intimately involved with the when and how of death—the grave digger with the forceps.
Some days, this is how it felt when I was in the hospital: trapped in an endless jungle summer, wet with sweat, the rain of tears of the families of the dying pouring down.
Neurosurgery attracted me as much for its intertwining of brain and consciousness as for its intertwining of life and death.
If I were a writer of books, I would compile a register, with a comment, of the various deaths of men: he who should teach men to die would at the same time teach them to live.—Michel de Montaigne, “That to Study Philosophy Is to Learn to Die.
One chapter of my life seemed to have ended; perhaps the whole book was closing. Instead of being the pastoral figure aiding a life transition, I found myself the sheep, lost and confused. Severe illness wasn’t life-altering, it was life-shattering. It felt less like an epiphany—a piercing burst of light, illuminating What Really Matters—and more like someone had just firebombed the path forward. Now I would have to work around it.
Graham Greene once said that life was lived in the first twenty years and the remainder was just reflection.

2016 Reading list

ప్రతి సంవత్సరం మొదట్లో క్రమం తప్పకుండా Good reads లో రీడింగ్ ఛాలెంజ్ పెట్టుకోవడం,చెంచాడు భవసాగరాలు ఈదడంతో పాటుగా చివరకి ఏం చదివాను అని చూసుకునే సరికి 50% మాత్రమే పూర్తవ్వడం నాకు ఆనవాయితీగా వస్తున్న విషయం..ఈ ఇయర్ కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అనుకున్న వాటిల్లో సగం పుస్తకాలు మాత్రమే చదవడం జరిగింది..ఎప్పట్లా కాకుండా ఈసారి క్లాసిక్స్ తగ్గించి కాంటెంపరరీ లిటరేచర్ కి సంబంధించిన పుస్తకాలు కొన్ని చదివాను.. దానికి తోడు పోయినేడాది కంటే ఈ సారి మా అబ్బాయికి పుస్తక పఠనంపై ఆసక్తి పెరగడంతో వాడితో పాటుగా చిల్డ్రన్ బుక్స్ చదవడానికి ప్రాధాన్యతనివ్వవలసి వచ్చింది..అసలు ఈ సారి ఏం చదివారు అంటే చందమామలు,బాల రామాయణం,తెనాలి రామకృష్ణ,ఏసోప్ ఫేబుల్స్,సుపాండి,జాతక టేల్స్,అరేబియన్ నైట్స్ లాంటి పుస్తకాల జాబితా గురించి చెప్పెయ్యాలన్న కుతూహలం కాస్త కంట్రోల్ చేసుకుని ఈ ఇయర్ చదివిన వేరే పుస్తకాల గురించి చెప్తాను.. :)

Poetry :

టాగోర్,గుల్జార్ లాంటి బహు కొద్దిమంది శైలి తప్ప నాకు కవిత్వం అంత సులువుగా అర్ధం కాదు..ఇప్పటివరకు పెద్దగా కవిత్వం జోలికి పోయిందీ లేదు..కానీ ఈ సంవత్సరం పెద్ద బాలశిక్షలో వత్తులు హల్లులు నేర్చుకున్నట్లు Rumi,Kahlil Gibran,Maya Angelou లాంటి వారిని కొందర్ని చదివాను..

Stray birds - Rabindranath Tagore
Mother:A Cradle to hold me - Maya Angelou
Phenomenal Woman: Four Poems Celebrating Women -  Maya Angelou
Rumi: The Book of Love: Poems of Ecstasy and Longing - Jalaluddin Rumi  రుమి గురించి,ఆయన  కవిత్వం గురించి అంతకుమునుపు Elif Shafak - The Forty Rules of Love లో చదవడం,Imtiaz సినిమాలపై  రుమి పోయెట్రీ ప్రభావం ఈ పుస్తకం పై ఆసక్తి కలగడానికి ప్రధాన కారణాలు..
The Prophet - Kahlil Gibran

Philosophy / Comics:

It's a Magical World: A Calvin and Hobbes Collection - Bill Watterson
There's Treasure Everywhere: A Calvin and Hobbes Collection - Bill Watterson
Something Under the Bed is Drooling: A Calvin and Hobbes Collection - Bill Watterson
The Days Are Just Packed: A Calvin and Hobbes Collection - Bill Watterson
Calvin and Hobbes - Bill Watterson
Homicidal Psycho Jungle Cat: A Calvin and Hobbes Collection - Bill Watterson
The Revenge of the Baby-Sat - Bill Watterson

మీకే కాదు 'ఫిలాసఫీ' కేటగిరీ లో కాల్విన్ హాబ్స్ కామిక్ బుక్స్ గురించి చెప్పడం నాక్కూడా విచిత్రంగానే ఉంది..కానీ నిజం చెప్పాలంటే these are the best philosophy books I've read so far...రెండు మూడేళ్ళ క్రిందట ఫిలాసఫీ మీద ఆసక్తితో జిడ్డు కృష్ణ మూర్తి,Andre Gide,Herman Hesse,Albert Camus,టాల్స్టాయ్ లాంటి వారి పుస్తకాలు కొన్నిచదివి హెవీగా అనిపించిగా ఆ ఆలోచనలతో నాకు నిద్రపట్టని రాత్రులు ఎన్నో! కానీ తన కామిక్స్ లో బిల్ వాటర్సన్ ఫిలాసఫీని కూడా కడుపుబ్బ నవ్వించి మరీ చెప్పారు..మా అబ్బాయితో పాటు సరదాగా చదవడం స్టార్ట్ చేసిన నేను అదో అబ్సెషన్ గా మారడంతో,ప్రతిరోజూ వాడు స్కూల్ నుంచి రాగానే ఇద్దరం రెలీజియస్ గా కాల్విన్ హాబ్స్ చదవడం మా దినచర్య లో భాగం అయిపోయింది..

Memoirs / Biography :

Night - Elie Wiesel  : రెండో ప్రపంచ యుద్ధ సమయంలో Auschwitz, Buchenwald జర్మనీ కాన్సంట్రేషన్ కాంప్స్ లో,15 ఏళ్ళ Elie Wiesel తన భయానకమైన అనుభవాలను గురించి చెప్తూ రాసిన ఈ పుస్తకం హోలోకాస్ట్ సమయంలో జరిగిన మారణహోమాన్ని మనకు గుర్తుచేస్తుంది..2016 జులైలో చనిపోయిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత Elie Wiesel అంటూ ఆ మధ్య గార్డియన్ లో ప్రచురించిన కథనం వల్ల ఈ పుస్తకం గురించి తెలిసింది.

The Glass Castle - Jeannette Walls : చాలా కఠినతరమైన బాల్యం గడిపిన Jeanette తన బాల్యానుభవాలకు ఈ మెమోయిర్లో అక్షర రూపం ఇచ్చింది..Jeanette శైలి పుస్తకం ఎక్కడా ఆపకుండా చదివించింది.

My Name Is Lucy Barton - Elizabeth Strout  : ఇందులో ఎలిజబెత్ ది కూడా కఠినమైన బాల్యమే అయినప్పటికీ Jeanette,ఎలిజబెత్ ల వ్యక్తిత్వాల మధ్య చాలా అంతరం ఉంటుంది..చాలా చోట్ల బోర్ కొట్టిన పుస్తకం ఇది..

Dark Star:The Lonliness of Being Rajesh Khanna - Gautam Chintamani : పూర్ణిమ తమ్మిరెడ్డి పుస్తకం.నెట్ లో రాసిన రివ్యూ చూసి చాలా కాలంగా చదవాలనుకుని మొత్తానికి ఈ ఇయర్ చదివిన పుస్తకం ఇది..అప్పటికి నా వరకు రాజేష్ ఖన్నా అంటే 'ఆనంద్' అంతే..కానీ ఆ ఆనంద్ ముద్రని మన మనసుల్లోంచి పూర్తిగా చెరిపేసి అసలు సిసలు ఖన్నాను ఒక సాధారణ వ్యక్తిగా ఆయన పూర్తి డార్క్ నేచర్ తో మన ముందు నిలబెడుతుంది ఈ 'డార్క్ స్టార్'..ఆయన సినిమాలు ఇష్టపడేవారు తప్పకుండా చదవవలసిన బుక్ ఇది..

When Breath Becomes Air - Paul Kalanithi : ఈ ఇయర్ లో బెస్ట్ రీడ్స్ అంటే,కాల్విన్ అండ్ హాబ్స్ తరువాత ఖచ్చితంగా పాల్ కళానిధి అద్భుతమైన మెమోయిర్ గురించి చెప్పుకోవాలి...చాలా పుస్తకాల్లాగా చదివేశాక వెంటనే మర్చిపోయే పుస్తకం అస్సలు కాదు..ప్రతి పదం ఎంతో విలువైనదిగా,ప్రతి సంఘటనా చదివేవాళ్ళ మనసుని కుదిపేసి,చాలారోజుల వరకూ వెంటాడే పుస్తకం ఇది..A must read memoir for everyone.మరణాన్ని కూడా హుందాగా ఆహ్వానించాలానే ఒక న్యూరో సర్జన్ అంతర్మధనానికి అక్షర రూపం ఈ పుస్తకం..

Plays :

Alice in Bed - Susan Sontag : Susan Sontag గురించి బ్రెయిన్ పికింగ్స్ లో చదివి ఆసక్తి కలిగింది..మొదట చిన్న పుస్తకంతో మొదలు పెడదామని అనుకుని Alice in Bed ను చదివాను..ఇది Henry James చెల్లెలు అయిన Alice James కథను Lewis Carroll ప్రసిద్ధ రచన Alice in Wonderland లోని Alice తో ముడిపెడుతూ రాసిన నాటకం..19 వ శతాబ్దపు పురుషాధిక్య సమాజంలో స్త్రీల పై ఉండే వత్తిడి,లిమిటేషన్స్ మరియు మానసిక పరిస్థితిని ప్రతిబింబిస్తుంది..చివర్లో conclusion ఇదన్నమాట అని అనుకోవడం మినహా ఇందులో చర్చించే  పాత్రలు గానీ,ఆ సన్నివేశాలకు కారణభూతమైన సంఘటనల పట్ల గానీ,నాకు అవగాహన లేకపోవడం వల్ల ఈ ప్లే లో చాలా సన్నివేశాలు ఆకళింపు కాలేదు..

Waiting for Godot - Samuel Beckett : ఇద్దరు వ్యక్తులు Godot గురించి ఒక చెట్టు కింద వేచి ఉండటాన్ని మానవ జీవితానికి అర్ధాన్ని వెతకడంతో పోలుస్తూ రాసిన ఒక ప్లే ఇది..అసలు చాలాసేపటి వరకు రచయిత ఏమి చెప్పాలనుకున్నారో అర్ధం కాలేదు..చెప్పిందే చెప్తున్నారు ఏంటి అని అనుకుని,మళ్ళీ అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో అని ఆసక్తి కొద్దీ చదివిన ఈ పుస్తకం,ఇప్పటికీ నాకొక  అబ్స్ట్రాక్ట్  పెయింటింగ్ లా అనిపిస్తుంది..నా వరకు అర్ధం అయ్యింది ఏంటంటే మనిషి చివరి వరకూ కనిపించనిదాన్నేదో (Godot అనే metaphor) వెతుకుతూ వర్తమానాన్నిగమనించడు అని..కానీ ఇంతకంటే ఇంకేదైనా అర్ధం ఉందేమో మరోసారి చదివితే గానీ ఆ సారాన్ని పూర్తిగా గ్రహించలేనేమో అనిపించింది..

Religion :

A Confession - Leo Tolstoy : టాల్స్టాయ్ రాసిన పుస్తకాల్లో అన్న కరెనినా,వార్ అండ్ పీస్ లాంటి క్లాసిక్స్ ఒక వైపైతే The Death of Ivan Ilych,A Confession,A Calendar of wisdom లాంటివి పూర్తిగా మరో వైపుంటాయి..తరువాత చెప్పిన వాటిల్లో టాల్స్టాయ్ ఒక novelist గా కాకుండా ఒక కంప్లీట్ ఫిలాసఫర్ గా కనిపిస్తారు..Scandals గురించి రాసి ప్రపంచం చేత చప్పట్లు కొట్టించుకున్న ఆయనలో అంతర్లీనంగా దాగున్న ఆధ్యాత్మికత,తాత్వికత వీటిల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది..Confession అంతా టాల్స్టాయ్ జీవితం యొక్క అర్ధం,పరమార్ధం తెలుసుకునే దిశగా సాగుతుంది..మతాన్ని నమ్మని ఆయన చివరకి మతం,ధర్మం అనేవి మనుషుల్ని నడిపించే శక్తిమంతమైన అంశాలుగా పేర్కొంటారు..తన వాదనల్ని అనేక తర్కవితర్కాలతో తరువాత సవివరంగా నిరూపిస్తారు..

Novels :

Man Tiger - Eka Kurniawan : సోషల్ రియలిజం శైలిలో ఇండోనేషియా యువ రచయిత Eka Kurniawan ఇండోనేషియా సాహిత్యం పై సుహార్తో ముఫైయ్యేళ్ళ సుదీర్ఘ నియంతృత్వం ప్రభావం తాలూకు చీకటి కోణాల్ని మూల వస్తువుగా చేసుకుని Margio కథను చెప్తారు..ఇందులో మనిషి పులి గా మారిపోవడం లాంటి supernatural ఎలిమెంట్స్ తో పాటు ఇండోనేషియా సంస్కృతి,సంప్రదాయాలు లాంటివి ఆసక్తికరంగా వర్ణిస్తారు..

Norwegian Wood - Haruki Murakami : Murakami ని చదవడం ఇదే తొలిసారి..జపాన్ సాహిత్యంలో Yasunari Kawabata,Kazuo Ishiguro లాంటి వాళ్ళని చదివాకా అనుకున్నాను..ఈ పుస్తకాల్లో ఏదో కామన్ గా అనిపిస్తోంది ఏంటా అని..'Sadness'..Sadness లాంటి ఒక ఎమోషన్ ని melancholic ఫ్రేమ్స్ లో పెట్టి కళ్ళకు కట్టినట్లు చూపించడంలో ఈ జపాన్ రచయితలు నిజంగా నిష్ణాతులు..Norwegian wood కూడా అదే కోవలోకి వస్తుంది..

The Book of Laughter and Forgetting - Milan Kundera :  1948 కాలం నాటి Czech రాజకీయ,సామాజిక  పరిస్థితులను కథా వస్తువుగా మాజికల్ రియలిజం శైలిలో ఈ కథల సంకలనాన్ని రాశారు కుందేరా..రాజకీయపరమైన వివరణల మొదలు ఫిలాసఫీ, అస్థిత్వ వాదం, ప్రేమ, ఐడెంటిటీ, తాత్విక వాదం, శృంగారం ఇలా పలు అంశాలను స్పృశిస్తూ ఇందులో ఏడు కథలు ఉంటాయి..ఈయన పుస్తకాలు మరికొన్ని చదవాలపించేలా ఈయన రచనా శైలి చాలా బావుంది.

The Vegetarian - Han Kang : సౌత్ కొరియన్ సంస్కృతి లో ఆమోదయోగ్యం కాని ‘వెజిటేరియనిజం’ను బేస్ చేసుకుని,మొత్తం మూడు భాగాల్లో, ముగ్గురు వ్యక్తుల దృష్టికోణం నుంచి Yeong-hye అనే ఒక సాధారణ గృహిణి కథని మనకి చెప్తారు రచయిత్రి Han Kang...Deborah Smith చేసిన అనువాదం చాలా చక్కగా సరిపోయింది..2016 Man Booker International Prize గెలుచుకున్న ఈ పుస్తకం మాంసాహారి అయిన మనిషిలోని మరో అనాగరికమైన క్రూరత్వపు కోణాన్ని చూపిస్తుంది..

The Girl on the Train - Paula Hawkins : 'Gone girl' లాంటి మరో సస్పెన్స్ థ్రిల్లర్.. కట్టి పడేసే narration తో ఆపకుండా చదివిస్తుంది..కానీ చదివాకా పెద్దగా గుర్తు పెట్టుకోడానికేమీ ఉండదు ఇందులో..

Non-Fiction :

Quiet: The Power of Introverts in a World That Can't Stop Talking - Susan Cain  : ఈ సంవత్సరం చదివిన మరో మంచి పుస్తకం..Introversion/extroversion ల గురించి ఏక కాలంలో చర్చించి introversion ని ఒక లోపంగా చూసే సమాజాన్ని ఎత్తి పొడుస్తుంది..కమ్యూనికేషన్స్ ఆవశ్యకతను చెప్తూనే,quietness కూడా సమాజానికి అంతే అవసరం అంటుంది ఈ రచన..

Ongoingness: The End of a Diary - Sarah Manguso : డాక్యుమెంటేషన్,జర్నల్స్, డైరీస్ ను గురించిన పుస్తకం ఇది.."I knew I couldn’t replicate my whole life in language." అంటూనే మళ్ళీ అసంభవాన్ని సంభవం చెయ్యాలనే ప్రయత్నంలో ఈ Ongoingness ను రాశానంటారు Sarah...బ్రెయిన్ పికింగ్స్ లో ఈ పుస్తకం గురించి చదివి ఒక మెమోయిర్ ఏమో అనుకున్న నన్ను ఈ పుస్తకం నిరాశపరిచిందనే చెప్పాలి.. ఇది ఒక డైరీ అనే కంటే,డైరీ లు రాయడం ఎలా అనే దాని గురించి అంటే బావుంటుంది..ముఖ్యంగా Consciousness ని డైరీలో ఖైదు చెయ్యాలనుకోవడం కొంచెం విచిత్రంగా అనిపించినా ఈ పుస్తకం ద్వారా అమెరికన్ రచయిత్రి Sarah Manguso చేసిన ప్రయత్నం అదే..తన అనుభవాల్నీ,జ్ఞాపకాల్నీ జాగ్రత్తగా పాతిక సంవత్సారాల పాటు సుమారు ఎనిమిది లక్షల పదాల్లో డైరీల్లో పదిల పరిచిన Sarah వాటిని సంక్షిప్తరూపంలో ఒక మెమోయిర్ ని రాద్దామనుకుని అనుకున్నప్పటికీ,చాలా వడపోత తరువాత కేవలం ఒక వంద పేజీల పుస్తకంగా 'Ongoingness' ను మన ముందుంచారు.

Telugu  :

తెలుగులో నేను చదివిన పుస్తకాలు బహు కొద్ది...2017 లో అయినా కొన్ని తెలుగు పుస్తకాలు చదవాలి..
Maha Prasthanam - Sri Sri : చాలా కాలంగా చదువుదామని మొత్తానికి ఈ సంవత్సరం చదివిన ఆణిముత్యం..
అరుణ [Aruna] - Chalam : నోబెల్ రచనల స్థాయికి ఏ మాత్రం తగ్గని చలం మరో రచన..

అస్సలు నచ్చక సగంలో వదిలేసిన పుస్తకాలు :

ఒకప్పుడు ఏ పుస్తకం మొదలు పెట్టినా అది ఒక్కోసారి ఎంత నచ్చకపోయినా ఓపిగ్గా పూర్తి చేసేదాన్ని..కానీ James Joyce అన్నట్లు 'Life is too short to read a bad book' అనేది ఇప్పటికి అర్ధం అయ్యింది..ఇక్కడ గుడ్ బుక్స్,బాడ్ బుక్స్ అంటూ ప్రత్యేకం ఉండవని నా నమ్మకం,అయినప్పటికీ ఆ quote లో బాడ్ బుక్ స్థానంలో 'నచ్చని పుస్తకం' అని పెట్టేసుకుని ఈ సారి ఈ పుస్తకాలు సగానికి పైగా చదివి వదిలేశాను..

Brain Droppings - George Carlin : కోట్స్,ఇంట్రడక్షన్ లాంటివి చదివి పుస్తకం చదవకూడదు అని మరోసారి లెంపలు వాయించుకున్న పుస్తకం ఇది..ముఖ్యంగా కార్లిన్ rebellious భావాలు బావున్నప్పటికీ ఆయన ఉపయోగించిన భాష చాలా repulsive గా అనిపించింది..

The Buried Giant - Kazuo Ishiguro : ఈయన పుస్తకం An Artist of the Floating World చదివాక చాలా expectations తో మొదలు పెట్టిన Buried Giant చాలా నిరాశపరిచింది..

H is for Hawk - Helen Macdonald

మనిషికి నవ్వు ఎంత సహజమో ఏడుపూ అంతే సహజం,కానీ ఈ బాధ,కన్నీరు లాంటి ఎమోషన్స్ ని నెగటివ్ ఎమోషన్స్ అనీ,వాటిని వ్యక్త పరచడం ఒక మానసిక దౌర్బల్యం లేదా లోపమనీ భావించే ఆధునిక సమాజంలో రక్తమోడుతున్న గుండె లోపలి గాయాల్ని సంస్కారం,నాగరికత ముసుగుల్లో అందమైన చిరునవ్వుతో కప్పేయ్యాలని విఫలయత్నం చేస్తూ,ఆ గాయాలు ప్రపంచం చూస్తే ఎక్కడ లోకువైపోతామో అనే భయంతో ఆ అహంకారపు పరదా తొలగిపోకుండా గట్టిగా అదిమి పట్టుకుని,ఒక చిరునవ్వుతో ప్రపంచాన్ని పలుకరించడం చేతకాని అసమర్థులు(?) ఆ బాధ నుండి ఉపశమనం పొందడానికి సహజంగానే ఒంటరితనం కోరుకుంటారు..మనిషి సహనపు హద్దుల్ని చేరిపేస్తూ ఎదురయ్యే పెనువిషాదాలను తట్టుకోలేక తీవ్రమైన వేదన కలిగిన ఏదో ఒక సందర్భంలో మనిషై పుట్టాక దుక్ఖం అనివార్యమని అర్ధమైన ఆ తరుణంలో అసలు మనిషిగా పుట్టకపోయి ఉంటే బావుండునని అనుకోవడం పరిపాటి..అలాంటి ఒక  ఒంటరితనం బారినపడి తాను ఈ మానసిక దౌర్బల్యాలు,బాధలు ఏవీ దరిచేరని ఒక  Goshawk లా మారిపోతే ఎంత బావుంటుంది అనుకుంటుంది ఈ H is for Hawk అనే మెమోయిర్ ను రాసిన బ్రిటిష్ రచయిత్రి Helen MacDonald.

తను ఎంతగానో ప్రేమించే తండ్రి ఆకస్మిక మరణంతో తీవ్రమైన డిప్రెషన్ కు లోనైన హెలెన్ Mabel అనే ఒక Goshawk కు శిక్షణనివ్వడం ద్వారా తన దుక్ఖం నుండి విముక్తి పొందాలని ప్రయత్నిస్తుంది..ఇంగ్లాండులో,ఒక గ్రామీణ నేపథ్యంలో గడిచిన హెలెన్ బాల్యం ఆమెను ప్రకృతికి దగ్గర చేసేందుకు దోహదపడుతుంది..దానికి తోడు తండ్రి అభిరుచుల ప్రభావం కూడా ఆమె మీద ఉండటంతో ఆమెకు Falconry పట్ల అబ్సెషన్ ఏర్పడుతుంది..ఆ క్రమంలో హెలెన్ తన బాల్యం గురించీ,ఇంగ్లాండు ఒకప్పటి భౌగోళిక,సామాజిక పరిస్థితులను గురించీ చెప్తూ Goshawk కు శిక్షణనివ్వాలనే తన కోరికకు గల కారణాలను విశ్లేషిస్తుంది..ఈ మెమోయిర్ లో హెలెన్ అనుభవాలన్నీ Goshawk ను మచ్చిక చేసుకోవడం అనే నేపధ్యంతో ముడిపడి ఉంటాయి..కానీ ఒక మరణం తాలూకూ బాధకూ,ఒక డేగను పెంచాలనుకోవడానికీ గల సంబంధం ఏమిటనేదాన్నిమెల్లిగా తన సునిశితమైన విశ్లేషణల ద్వారా హెలెన్ మన ముందుంచుతుంది..
While the steps were familiar,the person taking them was not. I was in ruins. Some deep part of me was trying to rebuild itself, and its model was right there on my fist. The hawk was everything I wanted to be: solitary, self-possessed, free from grief, and numb to the hurts of human life.
ఈ మెమోయిర్ లో తన కథ చెప్పాలంటే T.H.White గురించీ,ఆయన రాసిన 'The Goshawk' గురించీ  తప్పకుండా ప్రస్తావించాలంటుంది హెలెన్..చిన్నతనం నుండీ ఆయన రాసిన పుస్తకాలు చదువుతూ పెరిగిన హెలెన్ పై White కఠినమైన  బాల్యం,వ్యక్తిత్వం,అతని భయాలు,అభిరుచులు ఇవన్నీ చాలా ప్రభావం చూపిస్తాయి..పిల్లలపై పుస్తకాలు చాలా ప్రభావం చూపిస్తాయనడానికి,వైట్ తనను నిరంతరం haunt చేస్తున్నాడని హెలెన్ చెప్పడం ఒక చక్కని ఉదాహరణ అనొచ్చు...వైట్ కూడా హెలెన్ లాగే జనారణ్యానికి దూరంగా ఒక అరణ్యం మధ్యలోని మారుమూల ఇంట్లో ఒక రాబందుతో కాలం గడుపుతాడు..ఇందులో వైట్ కథనూ,తన కథనూ ఏకకాలంలో చెప్తూ Goshawk ను వశపరుచుకోవాలనే హెలెన్ అలుపెరుగని ప్రయత్నం మనిషి-మృగం తాలూకూ రెండు మనోప్రవృత్తుల మధ్య నడిచే యుద్ధంగా అనిపిస్తుంది..ఎత్తుకు పై ఎత్తులూ,ఒక నైజంపై మరో నైజం సాధించే విజయాలు,అణచివేతలు,ఆధిపత్యధోరణులూ కనిపిస్తాయి..ఇందులో Goshawk క్రూరత్వానికి ప్రతీక అయితే హెలెన్ మానవత్వానికీ ప్రతినిధిగా ఉంటుంది.కానీ ఇక్కడ హెలెన్ ఒక Goshawk కు శిక్షణనిస్తుంది అనే కన్నా దాని సాన్నిహిత్యంతో మృగ లక్షణాలైన ఒంటరితనం,స్వీయ స్వాధీనత,దుఖ్ఖమ్ దరిచేరని మనస్తత్వం వంటి వాటిని వంటబట్టించుకోవాలనే తాపత్రయమే ఆమెలో ఎక్కువగా కనిపిస్తుంది..
I look. There it is. I feel it. The insistent pull to the heart that the hawk brings, that very old longing of mine to possess the hawk’s eye. To live the safe and solitary life; to look down on the world from a height and keep it there. To be the watcher; invulnerable, detached, complete. My eyes fill with water. Here I am, I think. And I do not think I am safe.
White గురించి మరోచోట ప్రస్తావిస్తూ,Goshawk కు శిక్షణనివ్వడం అంటే రెండు పరస్పర విరుద్ధ స్వభావాలు తలపడటం వంటిదనీ,కరుణ,దయ వంటి లక్షణాలు మచ్చుకి కూడా కనపడని క్రూరమైన Goshawk స్వాభిమానాన్ని,సహనాన్నీ తన దృఢ నిశ్చయంతో White ఎలా పటాపంచలు చెయ్యడానికి ప్రయత్నించాడో వివరిస్తుంది..మరో సందర్భంలో ఒక క్రూరమైన వేటాడే జంతువుని మచ్చిక చేసే క్రమంలో దానితో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటూ దగ్గరగా గడపడం ద్వారా,మనలోని అణచివేసుకున్న క్రూరమైన కోరికల్ని కూడా ఒక పూర్తి స్థాయి అమాయకత్వంతో మనం అనుభవం చెందుతామని అంటుంది..వైట్ Goshawk లోని లక్షణాలను own చేసుకోవాలనుకోవడం,అలాగే ఆ లక్షణాలకు వ్యతిరేకంగా ఆ పక్షితో పోరాడటం ఒక భయంకరమైన పారడాక్స్ అంటుంది హెలెన్..
Looking for goshawks is like looking for grace: it comes, but not often, and you don’t get to say when or how.
He explained patience. He said it was the most important thing of all to remember, this: that when you wanted to see something very badly, sometimes you had to stay still, stay in the same place, remember how much you wanted to see it, and be patient.
 The old falconers called the manning of a hawk like this watching. It was a reassuringly familiar state of mind, meditative and careful and grave.
That was all there was. Waiting. Watching. Sitting with the hawk felt as if I were holding my breath for hours with no effort. No rise, no fall, just my heart beating and I could feel it, in my fingertips, that little clipping throb of blood that – because it was the only thing I could sense moving – didn’t feel part of myself at all. As if it was another person’s heart, or something else living inside me. Something with a flat, reptilian head, two heavy, down-dropped wings. Shadowed, thrush-streaked sides.

ఒక సందర్భంలో తన మానసిక స్థితికి కారణాలను వెతుక్కుంటూ ఒక లక్ష్యం గానీ,బాధ్యత గానీ లేని జీవితం ఎలా గాడి తప్పుతుందో అలాగే తన మనసు కళ్ళెం లేని గుర్రంలా అదుపు తప్పింది అంటుంది..
The kind of madness I had was different. It was quiet, and very, very dangerous. It was a madness designed to keep me sane. My mind struggled to build across the gap, make a new and inhabitable world. The problem was that it had nothing to work with. There was no partner, no children, no home. No nine-to-five job either. So it grabbed anything it could. It was desperate, and it read off the world wrong. I began to notice curious connections between things. Things of no import burst into extraordinary significance.
Marianne Moore: The cure for loneliness is solitude.
మనిషి అనేక జంతువుల్ని సులభంగా మచ్చిక చెయ్యగలిగినా కూడా ఈ Goshawks విషయంలో మాత్రం తీవ్రంగా విఫలమయ్యాడని చెప్పచ్చు..అందుకే వివిధ  సంస్కృతుల్లో ఈ పక్షుల్ని wildness కు శక్తిమంతమైన ప్రతీకలుగా భావిస్తారు..అంతే కాకుండా ఓటమిని  సులువుగా జీర్ణించుకోలేని మనిషి ఆ లక్షణాలపై ఆధిపత్యం కోసం నిరంతరం తపించాడు..ఇందులో హెలెన్ Goshawk కు శిక్షణనిచ్చే క్రమంలో తనలోని గాడి తప్పిన ఒక wildness ని అదుపు చేస్తూ  తనకే క్రమశిక్షణ నేర్పిస్తోందా అనిపిస్తుంది..
మరో సందర్భంలో సమాజంలో ఇమడలేని తన నిస్సహాయతన,తనపై తనకే కలిగిన కోపాన్నీ హెలెన్ ఈ రకంగా వివరిస్తుంది...
The anger was vast and it came out of nowhere. It was the rage of something not fitting; the frustration of trying to put something in a box that is slightly too small. You try moving the shape around in the hope that some angle will make it fit in the box. Slowly comes an apprehension that this might not, after all, be possible. And finally you know it won’t fit, know there is no way it can fit, but this doesn’t stop you using brute force to try to crush it in,punishing the bloody thing for not fitting properly. That was what it was like: but I was the box, I was the thing that didn’t fit, and I was the person smashing it, over and over again, with bruised and bleeding hands.

'Sword in a Stone' అనే పుస్తకం ప్రభావం కారణంగా మనిషి Goshawk గా పరివర్తన చెందడం అనేది హెలెన్ కు చిన్నతనంలో ఒక మాజికల్ థింగ్ లా అనిపించింది కానీ తాను Goshawk గా metamorphosis చెందాలనుకునే అదే ప్రయత్నం ఆమెను తీవ్ర సంఘర్షణకి లోను చేస్తుంది..Goshawk ఎలియన్ నేచర్,జీవితం పట్ల ఆ పక్షికి ఉండే అమానవీయ దృక్పధం వంటివి హెలెన్ ను కలవరపెడతాయి..బాధ నుండి విముక్తి పొందాలంటే,జనజీవనానికి దూరంగా పారిపోయి ప్రకృతిని ఆశ్రయించాలని చాలా మంది చాలా పుస్తకాల్లో చెప్పడమే కాకుండా,White లాగా ఆచరించి చూపించారనీ,అందుకే తాను కూడా ఒక wildness లోకి వెళ్లిపోయాననీ అంటుంది హెలెన్..కానీ చివరకు వచ్చేసరికి తాను చేసింది తప్పని గ్రహించానంటుంది..
So many of them had been quests inspired by grief or sadness. Some had fixed themselves to the stars of elusive animals. Some sought wildness at a distance, others closer to home. ‘Nature in her green, tranquil woods heals and soothes all afflictions,’wrote John Muir. ‘Earth hath no sorrows that earth cannot heal.’Now I knew this for what it was: a beguiling but dangerous lie. I was furious with myself and my own unconscious certainty that this was the cure I needed. Hands are for other human hands to hold. They should not be reserved exclusively as perches for hawks. And the wild is not a panacea for the human soul; too much in the air can corrode it to nothing.
Of all the lessons I’ve learned in my months with Mabel this is the greatest of all: that there is a world of things out there – rocks and trees and stones and grass and all the things that crawl and run and fly. They are all things in themselves, but we make them sensible to us by giving them meanings that shore up our own views of the world. In my time with Mabel I’ve learned how you feel more human once you have known, even in your imagination, what it is like to be not. And I have learned, too, the danger that comes in mistaking the wildness we give a thing for the wildness that animates it.
ఈ పుస్తకంలో బాగా నచ్చిన అంశం,Goshawk లక్షణాల గురించి హెలెన్ చేసే అద్భుతమైన పొయెటిక్ narrations..పదాల అల్లిక లో హెలెన్ నైపుణ్యం ప్రతి పేజీలో కనిపిస్తుంది..అంతే కాకుండా ఇందులో Falconry గురించి చర్చించిన అంశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి...ప్రకృతి/పక్షుల గురించి ఆసక్తి ఉన్నవాళ్లు,ఏకాంతాన్ని ఇష్టపడేవాళ్లు,ముఖ్యంగా loners హెలెన్ కథకు బాగా కనెక్ట్ అవుతారు..చాలా చోట్ల ఆమె అనుభవాలతో మనల్ని మనం relate చేసుకుంటాము..కానీ కథలో అంతర్భాగమైనప్పటికీ కొన్నిచోట్ల Goshawk గురించిన వర్ణనలు చదివే వాళ్లకి కాస్త విసుగు తెప్పిస్తాయి..రాబందు అని ఊరికే వినడమే గానీ వాటిలో అన్ని రకాలు ఉంటాయని గానీ,వాటికి శిక్షణనిచ్చే విధి విధానాల్లో ఎన్నో కష్టానష్టాలకోర్చాలని గానీ ఈ పుస్తకం చదివే వరకూ నాకు తెలీదు..అసలీ Goshawk అంటే ఏంటని చూస్తే తెలుగులో 'సాళువడేగ,రాజాళి' అనే రెండు అర్ధాలు ఉన్నాయి..2014 లో ప్రచురించబడిన ఈ H Is for Hawk,Samuel Johnson Prize మరియు Costa Book Award లను సొంతం చేసుకుంది.

Night - Elie Wiesel

'We must always take sides. Neutrality helps the oppressor, never the victim. Silence encourages the tormentor, never the tormented.' - Elie Wiesel

బ్రెయిన్ పికింగ్స్ లో కొంత కాలం క్రిందట ఈ quote చదివి 'బావుందే!' అనుకున్నా...కానీ కొన్ని క్లుప్తమైన పదాల వెనక కూడా అంతులేని కథలుంటాయి,సందర్భానుసారం అవి మారిపోతుంటాయి..Elie Wiesel రాసిన Night చదివాక మళ్ళీ అవే పదాల్ని మరోసారి చదివితే ఆ అర్ధం ఇప్పుడు పూర్తిగా వేరేగా అనిపించింది..ఎందుకంటే ఇప్పుడు అవి చదివి కేవలం 'బావుందే!' అని మాత్రం అనుకోలేను..

జయాపజయాల కథలు మనం నిరంతరం వింటూనే ఉంటాం..అందులోనూ చరిత్ర విషయానికొస్తే 'History is written by the winners' అంటుంటారు..కానీ ఈ విజయం సాధించినవాళ్ళకీ,ఓడిపోయినవాళ్ళకీ మధ్యన చరిత్రలో స్థానానికి నోచుకోని బాధిత వర్గం మరొకటి ఉంటుంది..ఆ వర్గానికి గెలుపోటములతో పనిలేదు,దేవుడు ఉన్నడా లేడా అనే తర్కాలతోనూ పనిలేదు,జీవిత పరమార్ధాలు వెతికే అవసరం అంతకంటే లేదు..వారికి కావాల్సిందల్లా కడుపునింపుకోడానికి కాస్త తిండి,ఈ పూట ప్రాణాలతోనే ఉంటామనే చిన్న ఆశ...రెండో ప్రపంచ యుద్ధ సమయంలో Auschwitz,Buchenwald జర్మనీ కాన్సంట్రేషన్ కాంప్స్ లో తన భయానకమైన అనుభవాలకు  అక్షరరూపం ఇస్తూ ఆ వర్గానికి ప్రతినిధిగా తన గళాన్ని వినిపించారు Elie Wiesel ..'The Diary of Anne Frank' తరహాలో చరిత్రలో మిగిలిపోయిన అతి ఘోరమైన నిజాలను,మానవత్వం సిగ్గుతో తలవంచుకునే సందర్భాలను ఈ పుస్తకం మరో సారి గుర్తు చేస్తుంది..

NEVER SHALL I FORGET that night, the first night in camp, that turned my life into one long night seven times sealed. Never shall I forget that smoke. Never shall I forget the small faces of the children whose bodies I saw transformed into smoke under a silent sky. Never shall I forget those flames that consumed my faith forever. Never shall I forget the nocturnal silence that deprived me for all eternity of the desire to live.  Never shall I forget those moments that murdered my God and my soul and turned my dreams to ashes.    Never shall I forget those things, even were I condemned to live as long as God Himself.    Never.

ఈ సంవత్సరం అంటే 2016 జులైలో చనిపోయిన ప్రముఖ రచయిత,నోబెల్ శాంతి బహుమతి గ్రహీత  Elie Wiesel గురించి ఆ మధ్య గార్డియన్ లో ప్రచురించిన కథనం తరువాత ఆయన గురించి గూగుల్ చేస్తే ఈ 'Night' అనే మెమోయిర్ గురించి తెల్సింది..హోలోకాస్ట్ survivor గా 40 పైచిలుకు పుస్తకాలను రాసిన ఆయన తన అనుభవాలను ఈ మెమోయిర్ ద్వారా ప్రపంచానికి చెప్పాలని కోరుకున్నప్పటికీ  Jerzy Kosiński రాసిన The Painted Bird అనే మరో పుస్తకంతో దీనికి ఉన్న సారూప్యత వల్ల plagiarism ఆరోపణలు ఆయనకు తలవంపులు తెచ్చాయంటారు..కానీ 1986 లో లభించిన నోబెల్ శాంతి బహుమతి,Oprah Winfrey -TV book club కారణంగా ఈ రచన మళ్ళీ వెలుగులోకి వచ్చింది.

రొమేనియాలోని Sighet లో ఒక జ్యూయిష్ సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన 15 ఏళ్ళ కుర్రవాడు Elie Wiesel,రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తన కుటుంబంతో పాటుగా ఒక Jewish Ghetto కు తరలించబడతాడు..Eliezer,అతని తండ్రి ఆ క్రమంలో తల్లి,చెల్లెలు నుండి విడిపోతారు,అటు పైన 1944-45 మధ్య కాలంలో Auschwitz,Buchenwald కాన్సంట్రేషన్ క్యాంపుల్లో నాజీ జర్మన్ల హింసాత్మకమైన ధోరణులతో తన తండ్రితో పాటుగా చవిచుసిన అవమానాలను,బాధల్నీ ఇందులో వివరించారు..హిట్లర్ ఆధీనంలోని SS (The Schutzstaffel) అని పిలవబడే పారామిలటరీ దళాల ఆక్రమణతో Sighet లోని కొన్ని వందల జ్యూయిష్ కుటుంబాలు తమ ఇల్లూవాకిళ్ళు వదిలేసి cattle cars లో  కాన్సంట్రేషన్ క్యాంపులకు తరలించబడ్డారు..వారిలో Elie కుటుంబం కూడా ఒకటి..ఎక్కడకి వెళ్తున్నారో,ఏమి చేస్తున్నారో కూడా తెలీని గందరగోళం మధ్య Jews పాలిట నరకానికి మారు పేరైన Auschwitz కి చేరతారు..పసివారిని సైతం వదలకుండా అక్కడ crematorium లోకి విసిరివేసే నరరూపరాక్షసుల మధ్య,నిరంతరం మనిషి మాంసం వాసనలు వచ్చే crematorium పొగల్ని పీలుస్తూ జీవన్మృత్యువుల మధ్య ప్రత్యక్ష నరకం చూస్తారు..వేలకొద్దీ Jews ఆ క్యాంప్స్ కు తరలించబడగా,చివరకు రెడ్ ఆర్మీ వచ్చి తమను రక్షిస్తుందనే ఒక్క ఆశ కూడా అడుగంటిపోయి,కేవలం 12 మంది మాత్రం బ్రతికి బయట పడతారు..ఆ మిగిలిన వారిలో Elie Wiesel,ఆయన తండ్రి కూడా ఉండగా చివరకు dysentery బారిన పడి ఆయన తండ్రి కూడా మృతి చెందుతారు..కానీ ఆయన మరణానికి ముందు మరచిపోడానికి సాధ్యం కానీ పీడకలలాంటి Auschwitz అనుభవాలను తలుచుకుని పడ్డ వేదనని  తాను ఎప్పుడూ మర్చిపోలేనంటారు రచయిత..

But no sooner had we taken a few more steps than we saw the barbed wire of another camp. This one had an iron gate with the overhead inscription:
ARBEIT MACHT FREI. Work makes you free. Auschwitz.

కదిలించే అనుభవాలకు మించిన కథలేముంటాయ్ ! అందులోనూ సాహిత్యం పాత్ర ఆ యదార్ధాలపై అందంగా వేసిన ముసుగుల్ని తొలగించడమేగా..తాను కాన్సంట్రేషన్ క్యాంపులో తన అనుభవాలను రాయడానికి గల కారణాలను వివరిస్తూ ఈ రచన చదివిన తరువాతైనా మళ్ళీ ఇలాంటి ఘోరాలు చరిత్రలో పునరావృతం కాకుండా చూసుకోవలసిన బాధ్యత మానవాళికి ఉందని చెప్పడమే అంటారు Elie Wiesel..నవల చాలా చిన్నది..అనవసర వర్ణనలు లేకుండా రచయిత తన అనుభవాలను సూటిగా,క్లుప్తంగా చెప్పుకొస్తారు..చరిత్రలో ఇటువంటి చీకటి కోణాల గురించి తెలుసుకుంటే కొంతకాలం క్రితం ఒక మిత్రులు అన్నట్లు,"చాలా మంది మనిషి ఉనికి ఇప్పుడు చాలా విపత్కర పరిస్థితుల్లో ఉందని తరచూ వాపోతుంటారు,కానీ నిజానికి ఇప్పుడు మానవ జాతి చాలా సౌకర్యవంతమైన సమాజంలో జీవిస్తోంది" అనే విషయం నిజమేననిపించకమానదు..జాతివర్గవైషమ్యాలతో మనుషులకీ,మృగాలకీ తేడా మర్చిపోయిన హిట్లర్ శకం 'suffering' అనే పదానికి మన నిర్వచనాలను సమూలంగా మార్చుకునేలా చేస్తుంది...ఈ రచన చదివినవారు మానవత్వం,దైవత్వం అనే అంశాలపై  తమ అభిప్రాయాలను మరోమారు పునఃసమీక్షించుకుంటారు..

రచయిత సమస్త మానవజాతి సిగ్గుపడే తరహాలో నాజీల వ్యవహారశైలి ని గురించి చెప్తూ సనాతన కుటుంబంలో జన్మించిన తనకు దేవుని మీద,అసలాయన ఉనికి మీదే నమ్మకం సడలిన క్షణాలను గురించి ఈ విధంగా రాస్తారు..
”Yisgadal, veyiskadash, shmey raba…May His name be celebrated and sanctified…" whispered my father.     For the first time, I felt anger rising within me. Why should I sanctify His name? The Almighty, the eternal and terrible Master of the Universe, chose to be silent. What was there to thank Him for?

What are You, my God? I thought angrily. How do You compare to this stricken mass gathered to affirm to You their faith, their anger, their defiance? What does Your grandeur mean, Master of the Universe, in the face of all this cowardice, this decay, and this misery? Why do you go on troubling these poor people's wounded minds, their ailing bodies ?

Blessed be God's name? Why, but why would I bless Him? Every fiber in me rebelled. Because He caused thousands of children to burn in His mass graves? Because He kept six crematoria working day and night, including Sabbath and the Holy Days? Because in His great might, He had created Auschwitz, Birkenau, Buna, and so many other factories of death? How could I say to Him: Blessed be Thou, Almighty, Master of the Universe, who chose us among all nations to be tortured day and night, to watch as our fathers, our mothers, our brothers end up in the furnaces? Praised be Thy Holy Name, for having chosen us to be slaughtered on Thine altar ?

ఇంత ఘోరం జరుగుతుంటే మిగతా ప్రపంచం ఊరుకోదు..మన చుట్టూ ఉన్న మానవ సమాజం ఈ దారుణాల్ని చూస్తూ మౌనంగా ఉండదు అని అనుకున్న ప్రతి క్షణం కలిగిన నిరాశను ఇలా వ్యక్తపరిచారు..
My forehead was covered with cold sweat. Still, I told him that I could not believe that human beings were being burned in our times; the world would never tolerate such crimes…
“The world? The world is not interested in us. Today, everything is possible,even the crematoria.
We had fallen into the trap, up to our necks. The doors were nailed, the way back irrevocably cut off. The world had become a hermetically sealed cattle car.

కాళ్లకు చెప్పుల్ని కూడా ఉండనివ్వకుండా తీసేసుకున్న అధికారులనుంచి తన జత చెప్పులు దాచుకున్న సమయంలో,దేవుడికి కృతజ్ఞతలు చెప్పిన ఆయన మాటల్లో వ్యంగ్యంతో కూడిన కోపం ధ్వనిస్తుంది..
I had new shoes myself. But as they were covered with a thick coat of mud, they had not been noticed. I thanked God,in an improvised prayer, for having created mud in His infinite and wondrous universe.

మరో సందర్భంలో అందర్నీ వివస్త్రుల్ని చేసి నిల్చోబెట్టిన సందర్భంలో నగ్నత్వాన్ని సమానత్వానికి ముడిపెడుతూ ఇలా అంటారు..
“Strip! Hurry up! Raus! Hold on only to your belt and your shoes…”  Our clothes were to be thrown on the floor at the back of the barrack. There was a pile there already. New suits, old ones, torn overcoats, rags. For us it meant true equality: nakedness. We trembled in the cold.
At that moment in time, all that mattered to me was my daily bowl of soup, my crust of stale bread. The bread, the soup— those were my entire life. I was nothing but a body. Perhaps even less: a famished stomach. The stomach alone was measuring time.

“Bite your lips, little brother…Don't cry. Keep your anger, your hate, for another day, for later. The day will come but not now…Wait. Clench your teeth and wait…”

పుస్తకంలో పలు సందర్భాల్లో రచయిత అనుభవాలు హ్యుమానిటీ గురించీ,Existence of God గురించీ లేవనెత్తే పలు ప్రశ్నలు మనల్ని ఆలోచనలో పడేస్తాయి..
In those days, I fully believed that the salvation of the world depended on every one of my deeds, on every one of my prayers. But now, I no longer pleaded for anything. I was no longer able to lament. On the contrary, I felt very strong. I was the accuser,God the accused. My eyes had opened and I was alone, terribly alone in a world without God, without man. Without love or mercy. I was nothing but ashes now, but I felt myself to be stronger than this Almighty to whom my life had been bound for so long. In the midst of these men assembled for prayer, I felt like an observer,a stranger.

I did not fast. First of all, to please my father who had forbidden me to do so. And then, there was no longer any reason for me to fast. I no longer accepted God's silence. As I swallowed my ration of soup, I turned that act into a symbol of rebellion, of protest against Him.And I nibbled on my crust of bread. Deep inside me, I felt a great void opening.

ఒక తోటి Jew కు హిట్లర్ మీద ఉన్న అభిప్రాయం....
My faceless neighbor spoke up: “Don't be deluded. Hitler has made it clear that he will annihilate all Jews before the clock strikes twelve.”
I exploded: “What do you care what he said? Would you want us to consider him a prophet?”
His cold eyes stared at me. At last, he said wearily: “I have more faith in Hitler than in anyone else. He alone has kept his promises, all his promises, to the Jewish people.

అక్కడి మనుషుల దారుణమైన పరిస్థితుల్ని వివరిస్తూ రచయిత చెప్పే ఈ మాటలు అక్కడి భీతావహ వాతావరణానికి దర్పణం పడతాయి..
We each had put on several garments, one over the other, to better protect ourselves from the cold. Poor clowns, wider than tall, more dead than alive, poor creatures whose ghostly faces peeked out from layers of prisoner's clothes! Poor clowns!

We were the masters of nature, the masters of the world. We had transcended everything—death, fatigue, our natural needs. We were stronger than cold and hunger, stronger than the guns and the desire to die, doomed and rootless, nothing but numbers, we were the only men on earth.

The darkness enveloped us. All I could hear was the violin, and it was as if Juliek's soul had become his bow. He was playing his life. His whole being was gliding over the strings. His unfulfilled hopes. His charred past, his extinguished future. He played that which he would never play again.

OUR FIRST ACT AS FREE MEN was to throw ourselves onto the provisions. That's all we thought about. No thought of revenge, or of parents. Only of bread.