చరిత్ర పునరావృతమయ్యింది..మరో ఏడాది గుడ్ రీడ్స్ ఛాలెంజ్ లో ఫెయిల్ అయ్యాను..That's OK, failures are stepping stones అనుకునే బాపతు మనం..అయినా ఒకసారంటూ లక్ష్యం సాధించేస్తే మరో ఏడాది ప్రయత్నించాలనే ఆసక్తి పోతుంది.. :) ప్రతి ఏడాది లాగే భారీ సంఖ్యలో రిలీజ్ చేసిన అనేక బుక్ లిస్టుల్లో కోవిడ్ కారణంగా ఈ ఏడాది పుస్తకాలకు గిరాకీ పెరిగింది అని రాశారు..సాధారణంగా మల్టీప్లెక్సుల్లో కోక్ తోను,పాప్ కార్న్ తోనూ కాలక్షేపం చేసే జనం కూడా ఇల్లు కదలడానికి లేకపోయేసరికి పుస్తక పఠనం పై మొగ్గు చూపారు అంటున్నారు..బిజీ జీవితపు వేగంతో సరిసమానంగా పరిగెత్తడమే తప్ప ఎప్పుడూ తీరుబడి ఎరుగని వాళ్ళు,పుస్తకం ముట్టనివాళ్ళు కూడా ఆన్లైన్ లో పుస్తకాలు తెప్పించుకుని మరీ చదివారని వినికిడి..పుస్తక ప్రియులు బుక్ ఫెయిర్ లను మిస్ అయినా ఆన్లైన్ కొనుగోళ్లు ఆ లోటును కొంతవరకూ తీర్చుకునే అవకాశం ఇచ్చాయి.
ఇక నా విషయానికొస్తే ఈ ఏడాది గత ఏడాది కంటే మరో రెండు పుస్తకాలు తక్కువ చదివాను..నార్మల్గా వీక్ డేస్ లో కుటుంబంతో ఎక్కువ సమయం వెచ్చించే అవకాశం ఉండేది కాదు..కానీ కోవిడ్ కుటుంబంతో ఎక్కువసమయం గడిపే అవకాశం ఇచ్చింది..అందరూ ఇంట్లో ఉండడం వల్ల సహజంగానే ఈ ఏడాది పుస్తకాలవైపు మనసుపోలేదు..సో నో రిగ్రెట్స్..మొదట్లో చదువుకు రోజులో కొంతసేపు ఖచ్చితంగా కేటాయించాలని ప్రయత్నించినా,ఇంట్లో మా బుల్లి రాక్షసుణ్ణి పెట్టుకుని పుస్తకాల ఛాలెంజిలు పూర్తి చెయ్యాలనే సో కాల్డ్ unrealistic expectations సంవత్సరం మధ్యలోకి వచ్చేసరికి వదిలేయవలసి వచ్చింది...అయినా ఈ ఏడాది రాండమ్ గా ఎక్కువ పుస్తకాలు చదివాను..అందునా రియలిస్టిక్ ఫిక్షన్ కి దూరంగా జరిగే కొద్దీ పూర్తిగా చదవాలనుకునే పుస్తకాల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది..ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా క్వాలిటీ రీడింగ్ టైం ఎంజాయ్ చేశాను..యాభై అనుకున్నది 32/50 తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది..ఇవి పూర్తిగా చదివిన పుస్తకాలు..ఇక పూర్తి చెయ్యనివీ,నచ్చక సగంలో వదిలేసినవీ అరవై,డెబ్భై పైమాటే.
ఈసారి చదువు పూర్తిగా author based గా సాగింది..ప్రతీసారిలా సింహభాగం చదివే కథలూ,నవలలూ తగ్గించి ఈ సారి కొంతమంది విభిన్నమైన రచయితలను చదివాను..లిటరరీ క్రిటిసిజం,ఫిలసాఫికల్ కాన్సెప్ట్స్ ఎక్కువగా బేస్ చేసుకుని చదివిన కొందరు : సుసాన్ సొంటాగ్,వాల్టర్ బెంజమిన్, Idris Shah, Michel Foucault, Guy Debord ,రోలాండ్ బార్త్ , ఎరిక్ ఫ్రొమ్ , హరాల్డ్ బ్లూమ్ ,బెన్ లెర్నర్ వంటి కొంతమంది సాహిత్యంలో సరికొత్త ప్లేన్స్ ని పరిచయం చేసి అభిరుచి దృష్ట్యా నా చదువును మరో మెట్టు ఎక్కించారు.
మరో ఏడాది మరిన్ని కొత్త పేజీలు చదవాలనీ,తద్వారా చరిత్రలో మరి కొంతమంది ఇంట్రెస్టింగ్ వ్యక్తుల్ని పరిచయం చేసుకోవాలనీ ,మరిన్ని ఫాంటసీ లోకాలు చుట్టి రావాలనీ ఆశిస్తూ,
Happy New Year and Happy Reading :)
No comments:
Post a Comment