Image Courtesy Google |
అమెరికన్ రచయిత్రి సిగ్రిడ్ నూనెజ్ నాకు ఒక రచయిత్రిగా కంటే సుసాన్ సొంటాగ్ కుమారుడు డేవిడ్ రీఫ్ గర్ల్ ఫ్రెండ్ గానే మొదట పరిచయం అయ్యారు..బెంజమిన్ మోసర్ రాసిన 'సొంటాగ్' బయోగ్రఫీలో నూనెజ్ కు సొంటాగ్,డేవిడ్ రీఫ్ లతో గల వ్యక్తిగతానుభవాలను గూర్చి కొన్ని పేజీలు కేటాయించారు..అసలు నూనెజ్ రాసిన సొంటాగ్ బయోగ్రఫీ 'సెంప్రే సుసాన్' చదువుదామని ముందు అనుకున్నదే కానీ మోసర్ బయోగ్రఫీ దానికంటే మరింత విస్తృతంగా ఉందని అనిపించడంతో అది చదవడం జరిగింది..నిజానికి 2018 లో నేషనల్ బుక్ అవార్డు గెలుచుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న నూనెజ్ మరో రచన 'ఫ్రెండ్స్' వెలువడేవరకూ ఆమె లైమ్ లైట్ లోకి రాలేదు అంటారు..'ఫ్రెండ్స్' కూడా ఎప్పటిలాగే నా టు-రీడ్ పైల్ లో ఎక్కడో అడుక్కి వెళ్ళిపోయింది..చివరకు ఆమె ఇటీవల రాసిన 'What Are You Going Through' (2020) తో సిగ్రిడ్ నూనెజ్ ను చదవడం జరిగింది.
మనిషి విచిత్రమైనవాడు..అతడు ఈ భూమ్మీద అన్ని జీవరాశులతోనూ కలిసి తిరుగాడే ఒక రెండుకాళ్ళ జంతువు మాత్రమేనన్న విషయం తరచూ మర్చిపోతుంటాడు..తన మేథస్సుతోనూ,దాని వెన్నంటే వచ్చిన అహంతోనూ తాను ఈ పర్యావరణంలో ఒక పరమాణువంత భాగమేనని మర్చిపోయి,తనను దానికి అతీతుడనని భ్రమ పడతాడు..ఎవరికైనా క్యాన్సర్ అని తెలిస్తే 'అయ్యో పాపం' అని సానుభూతి వ్యక్తం చేస్తాం,మనకు రాదనే నమ్మకం..ఎవరైనా మరణించారని వింటే 'రెస్ట్ ఇన్ పీస్' చెప్పి మళ్ళీ మన దైనందిన వ్యవహారాల్లో మునిగిపోతాం, మరణం మన దరిచేరదని నమ్మకం..భూమి మీద సహజవనరులు అన్నీ క్షయమైపోతున్నాయి,వాతావరణ సమతౌల్యం దెబ్బతింటోందని ఎన్విరాన్మెంటలిస్టులు,ఎకాలజిస్టులు గగ్గోలుపెడుతున్నా మన వాహనాల వాడకం,పెట్రోల్ వినియోగం ఆపం,పట్టణీకరణ పేరిట భూబకాసురుల్లా యథేచ్ఛగా చెరువుల్ని మూసేసి భవంతులు నిర్మించడం ఆపం..భూమి మీద అనునిత్యం పెరుగుతూ పోతున్న జనాభాకు సరిపడే వనరులు లేవనీ,ముందుతరాలు ఆకలి,దాహం,వేడిమి తట్టుకోలేని కడు దుర్భరపరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నా పిల్లల్ని కనడం మానం..ఏదైనా మన వరకూ రాదనే నమ్మకం....'తిరస్కరణ'(Denial) ..“Man Is The Only Creature Who Refuses To Be What He Is.” అని ఆల్బర్ట్ కామూ అన్నమాట గుర్తొచ్చింది...The power of denial. It’s happened more than once: a girl finds herself giving birth, in a high school bathroom, say, and later reveals that she’d had no idea she was pregnant, the many changes taking place in her body having been attributed by her to—whatever. The boundless capacity of the human mind for self-delusion: my ex was certainly not wrong about that. అంటుంది ప్రొటొగోనిస్ట్.
I don’t know who it was, but someone, maybe or maybe not Henry James, said that there are two kinds of people in the world: those who upon seeing someone else suffering think, That could happen to me, and those who think, That will never happen to me. The first kind of people help us to endure, the second kind make life hell.
మునుపెన్నడూ లేనంతగా శాస్త్రసాంకేతికరంగం పురోభివృద్ధి కారణంగా అందుబాటులో ఉన్న సౌకర్యాలతో నూటికి డెబ్భై శాతం మంది ఆటో పైలట్ మోడ్ లో జీవితాన్ని ఆడుతూ పాడుతూ గడిపేస్తున్నాం..ఆ రచయిత ప్రసంగంలో చెప్పిన కటువైన నిజాలను ఎస్కేపిస్టు మనస్తత్వంతో తిరస్కరిస్తాం..మనం స్వేచ్ఛాజీవులం (అనుకుంటాం అంతే) ..కానీ మన సో కాల్డ్ స్వేఛ్చతో అభివృద్ధి పేరిట మనం చెల్లిస్తున్న భారీ మూల్యం ఏమిటో గ్రహించమని సున్నితంగా హెచ్చరిస్తుందీ రచన..వినాశనానికి దారితీస్తున్న అటువంటి స్వేఛ్చ కంటే మనుషులు బానిసలుగానే ఉండడం బెటర్ అంటూ, Again, how had a supposedly freedom-loving people allowed this to happen? Why were people not outraged by the very idea of surveillance capitalism? Scared right out of their wits by Big Tech? An alien one day studying our collapse might well conclude: Freedom was too much for them. They would rather be slaves. అంటారు.
ఈ నవలలో ప్రొటొగోనిస్ట్ మనకు తన దైనందిక జీవితంలో ఎదురయ్యే అనేకమంది వ్యక్తుల గురించీ ,వారి అనుభవాలను గురించీ చెప్తూ ఉంటుంది..ఇందులో మూలకథతో పాటు అనేక చిన్న చిన్న ఉప కథలు ఉన్నప్పటికీ,ముఖ్య పాత్రలు మూడే ఉంటాయి..ప్రోటోగోనిస్ట్,క్యాన్సర్ బారినపడి మరణానికి చేరువలో ఉన్న ఆమె స్నేహితురాలు (సొంటాగ్ కీమో థెరపీ అనుభవాలనుండి రాశారనిపించింది ),ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ (రచయిత) : ప్రధానంగా వీరి ముగ్గురి చుట్టూ కథ నడుస్తుంది..పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి ఎన్నో పుస్తకాలు వచ్చాయి..ఇది మరణానికి చేరువలో ఉన్న మనుషుల అనుభవాల ఆధారంగా రాసిన When breath becomes air, Tuesdays with Morrie, The Last Lecture వంటి మెమోయిర్స్, టాల్స్టాయ్ The Death of Ivan Ilyich వంటి పుస్తకాల కోవకి చెందిన రచనే అయినప్పటికీ,ఇందులో మనసును మెలితిప్పే అంశాలమీ కనపడవు..ఈ నేరేషన్ లో ఒక ప్రత్యేకత ఉంది..ఇందులో మూలాంశం మృత్యువు అయినప్పటికీ, కథనం విషయంలో మరీ లోతుగా వెళ్ళిపోకుండా పాఠకులపై భావోద్వేగాల వత్తిడిపడకుండా జాగ్రత్తపడ్డారు నూనెజ్..ఆమె శైలిలో సరళత్వంతో కూడిన విలక్షణత ప్రత్యేకం ఆకట్టుకుంటుంది.
'ఆయినా ముఝసే మేరీ పెహలీసీ సీ సూరత్ మాంగే' అంటూ మహేష్ భట్ సినిమాలో అనుపమ్ ఖేర్ పాట అనుకుంటా, చిన్నప్పుడెప్పుడో ఇష్టంగా వినేదాన్ని..వృద్ధాప్యాన్ని చేరుకున్న ఒక మహిళ తన అందవిహీనమైన (?) రూపాన్ని చూసుకుని ఒక సందర్భంలో All those years ago I died, and I’ve been a ghost ever since. I’ve been mourning my lost self ever since, and nothing, not even my love for my children and grandchildren, can make up for it అంటుంది..Again denial..తన వయసుని డిగ్నిఫైడ్ గా అంగీకరించి,మీరు చాలా యంగ్ అండీ అని ఎవరన్నా అంటే ఒళ్ళుమండుతుంది అనే ఉర్సులా లెగైన్ గుర్తుకువచ్చారు.. :) ఇందులో అందం గురించీ,వృద్ధాప్యం,వయసు పెరగడం గురించి రచయిత్రి రాసిన అనేక విషయాలు ఆ పాటను గుర్తుకు తెచ్చాయి..హీరో శోభన్ బాబు తనను ప్రేక్షకులు అందగాడిగానే గుర్తుపెట్టుకోవాలి అని నిర్ణయించుకుని వృద్ధాప్యంలో లైమ్ లైట్ కి దూరంగా ఉన్నారంటారు..అడుగడుగునా ఈ తరహా 'Human Denial' ఎంత విచిత్రంగా ఉంటుందీ అంటారు నూనెజ్..ఆవిడ రాసిన అనేక హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్ ని చూస్తే మనిషి జీవితంలో ఏ ఒక్క దశలోనూ 'denial' తప్ప 'acceptance' అనేది కనపడదు..బాహ్య సౌందర్యం పట్ల వెర్రి వ్యామోహం కారణంగా ఇతరులు తమనెలా చూస్తున్నారోననే ఆత్మ న్యూనతతో నిరంతరం భయపడుతూ ఛస్తూ బ్రతికేవాళ్ళు నేటి సమాజంలో కోకొల్లలు..Again denial.
And was it so crazy? After all, always hating the way she looked, always fighting against her own body and always, always losing the battle meant that she was depressed all the time, more depressed than her sister had been about getting cancer.
Long before the arrival of FaceApp, I remember once hearing someone say that everybody, sometime in their youth— say around when they finished high school—should be given digitally altered images showing how they’ll probably look in ten, twenty, fifty years. That way, this person said, at least they could be prepared. Because most people are in denial about aging, just as they are about dying.Though they see it happening all around them, though the example of parents and grandparents might be right under their nose, they don’t take it in, they don’t really believe it will happen to them. It happens to others, it happens to everyone else, but it won’t happen to them.
ఈ రచనలో మరో ఆసక్తికరమైన అంశం : పెయింటర్ డోరా కారింగ్టన్ (Dora Carrington) ,రైటర్ లిట్టన్ స్ట్రాచే (Lytton Strachey) ల ప్రేమ కథ..ఇది నేను తొలిసారిగా విన్నాను..ఆమెకు అతడు గే అని తెలుసు,వర్జీనియా వూల్ఫ్ ను ఒకసారి ప్రొపోజ్ చేశాడని తెలుసు,తనకంటే పదమూడేళ్ళు పెద్దవాడని తెలుసు (సొంటాగ్,ఫిలిప్ రీఫ్ గుర్తొచ్చారు) A scandal from the start, theirs became a legendary story. Indeed, it is not for her painting but for her endless, hopeless love of Strachey, how it shaped her life, how it caused her death, that Carrington is known (that kind of woman’s story). For seventeen years, she was devoted to him. Not even her marriage to another man could separate them; all three had to live together. But then the man she married was not her but his object of desire. Having agreed to the marriage, she wrote a poignant letter to Strachey, lamenting the fate that made it impossible for the two of them to become man and wife. Then all three went to Venice on honeymoon together. When Strachey died, of stomach cancer, Carrington survived less than two months before shooting herself. In the stomach. She was just shy of thirty-nine. Not her first suicide attempt. “There is nothing left for me to do,” she had told the Woolfs the day before. “I did everything for Lytton.” అన్నట్లు రచయిత D. H. Lawrence 'విమెన్ ఇన్ లవ్' కి స్ఫూర్తి వారి ప్రేమకథ పట్ల ఆయనకున్న అబ్సెషనేనట.
ఈ నవలలో కథ అంటూ ప్రత్యేకం ఏమీ లేనప్పటికీ కథనం విషయంలో ఎక్కడా పట్టుసడలకుండా చూసుకున్నారు నూనెజ్..వన్ సిట్టింగ్ లో ఆపకుండా చదవగలిగే రచన ఇది..క్యాన్సర్ బారిన పడిన ప్రోటోగోనిస్ట్ స్నేహితురాలు కీమో తాలూకూ నరకయాతనను తట్టుకోలేక ఒక డ్రగ్ తో బలవన్మరణం చెందాలని నిర్ణయించుకుంటుంది..ఒంటరిగా ఈ ప్రపంచాన్ని వదిలిపోలేక స్నేహితురాలైన ప్రోటోగోనిస్ట్ సహాయం అర్ధిస్తుంది..ఆమె తుది రోజుల్లో వారిద్దరి అనుభవాలూ అనేక తాత్వికపరమైన సంభాషణలకు తెరతీస్తూ, నేటి ఆధునిక సమాజపు స్వేచ్చాజీవి (?) జీవితంలో ఐరనీని చూపిస్తాయి.
I think it will be easier to prepare—to focus on letting go—if I’m someplace where I won’t be surrounded by intimate, familiar things, all those reminders of attachments, and so on.
I shrugged. You know how it is when you live with something every day, I said. They probably don’t even notice it anymore.
ఇందులో రైటింగ్ గురించి ప్రస్తావించిన సందర్భాల్లో భాషా,దాని పరిమితులను గురించి రాసిన కొన్ని పేజీలు చాలా ఆసక్తికరంగా అనిపించాయి.
Understood: language would end up falsifying everything, as language always does. Writers know this only too well, they know it better than anyone else, and that is why the good ones sweat and bleed over their sentences, the best ones break themselves into pieces over their sentences, because if there is any truth to be found they believe it will be found there. Those writers who believe that the way they write is more important than whatever they may write about—these are the only writers I want to read anymore, the only ones who can lift me up. I can no longer read books that— But why am I telling you all this?
But what if God had in fact gone even further. What if it was not just to different tribes but to each individual human being that a separate language was given, unique as fingerprints. And, step two, to make life among humans even more strifeful and confounding,he beclouded their perception of this. So that while we might understand that there are many peoples speaking many different languages, we are fooled into thinking that everyone in our own tribe speaks the same language we do.
This would explain much of human suffering, according to my ex, who was being less playful than you might think. He really did believe that’s how it was: each of us languaging on, our meaning clear to ourselves but to nobody else. Even people in love? I asked, smilingly, teasingly, hopefully. This was at the very beginning of our relationship. He only smiled back. But years later, at the bitter end, came the bitter answer: People in love most of all.
పుస్తకంనుండి మరికొన్ని అంశాలు,
I have learned that there exists a word, onsra, in Bodo, a language spoken by the Bodo people in parts of northeastern India, that is used to describe the poignant emotion a person experiences when that person realizes that the love they have been sharing with another is destined not to endure. This word, which has no equivalent in English, has been translated as “to love for the last time.” Misleading. Most English-speaking people would probably take “to love for the last time” to mean to have at long last found one’s true, enduring love. For example, in a song composed by Carole King called “Love for the Last Time.” But when I first learned this translation of onsra I thought it meant something else entirely. I thought it meant to have experienced a love so overwhelming, so fierce and deep, that you could never ever ever love again.
I’ve heard of people who confess to regularly reading obituaries in the hope of seeing the name of someone they know. Reading obituaries is also said to be a source of comfort to many lonely people. Presumably it’s not the deaths that these people like reading about but the neatly summarized lives that the deceased supposedly lived. But are these same people also avid readers of biographies? Probably not.
In the most romantic movie ever made, a girl yearns for her boyfriend, away at war, even as she finds herself forgetting his face. I would have died for him, she says. How is it that I am not dead? The saddest musical of all time, one critic called it. The Umbrellas of Cherbourg.
What draws the reader to the novel is the hope of warming his shivering life with a death he reads about, said Benjamin.
What are you going through? When Simone Weil said that being able to ask this question was what love of one’s neighbor truly meant, she was writing in her native French. And in French the great question sounds quite different: Quel est ton tourment?
Never return to a place where you were really happy, and in fact that’s a mistake I’ve already made once in my life, and then all my beautiful memories of the first time were tainted.
Crime and Punishment: A Love Story. Now that’s a good title. Anyway, don’t they say that every good story is a suspense story? And every story is a love story. And every love story is a ghost story.
(It seems the one person with whom the poet could not share his poem was the very one who had inspired it, and who is addressed in it, the reason being that Dylan Thomas’s father hadn’t been told that he was dying.)
Dying is a role we play like any other role in life: this is a troubling thought. You are never your true self except when you’re alone—but who wants to be alone, dying?
The meaning of life is that it stops. Of course it would have been a writer who came up with the answer. Of course that writer would have been Kafka.
What he was saying was that perhaps the idea of planning families in the way that people had been doing for generations needed to be rethought.
Be kind, because everyone you meet is going through a struggle. Often attributed to Plato.
No comments:
Post a Comment