ఆస్కార్ వైల్డ్ అంటారు, There are only two tragedies in life : one is not getting what one wants, and the other is getting it.అని..ఈ పుస్తకంలో కథలన్నీ ఈ వాక్యం రెండో సగం నుండి మొదలవుతాయి..ఎప్పుడైనా ఏదైనా మాట అంటే ఇంట్లో పెద్దవాళ్ళు అనేవారు "పైన తథాస్తు దేవతలు ఉంటారు,అన్నీ మంచి మాటలే మాట్లాడాలి" అని..ఒకవేళ వాళ్ళన్నట్లు తథాస్తు దేవతలు నిజంగానే ఉంటే ? మనం అనుకున్నవన్నీ అయిపోతే ? మనకు భవిష్యత్తులో ఏం జరగబోతోందో ముందే తెలిసిపోతే ? ఎదుటి మనిషి ఆలోచనలను పుస్తకం చదివినట్టు చదివెయ్యగలిగే శక్తి ఉంటే ? అప్పుడు నిజంగానే జీవించడంలో మజా ఉంటుందా ? సమాధానం మనకందరికీ తెలుసు ,"నిస్సందేహంగా ఉండదు"..ఈ పుస్తకం 'కంటెంట్మెంట్' కి అర్ధం తెలీని మనిషికి ఒక మంచి థెరపీ లాంటిది.
|
Image Courtesy Google |
అమెరికన్ న్యూరో సైంటిస్టూ,రచయితా డేవిడ్ ఈగల్మాన్ 2009 లో రాసిన స్పెక్యులేటివ్ ,మెటాఫిజికల్ ఫిక్షన్ల జానర్ కు చెందిన ఈ 'Sum : Forty Tales from the Afterlives' దాదాపు 28 భాషలలోకి అనువదించబడింది..ఇందులో ఉన్న నలభై కథలూ చిన్న చిన్న పిట్టకథల్లా,ఒక్కో కథా రెండు పేజీలను మించకుండా ఉంటాయి..డేవిడ్ కథల్లో ఇటాలో కాల్వినో పొదుపు కనిపిస్తుంది,అనవసరమైన ఒక్క వాక్యంగానీ,వివరం గానీ కనపడవు..అంతేకాకుండా ఆయన ఎన్నుకున్న కొన్ని థీమ్స్ కాల్వినో 'కాస్మి కామిక్స్' కథల్ని గుర్తుకు తెచ్చాయి.
ఊహలకే రెక్కలొస్తే !!! అవి అచ్చంగా డేవిడ్ ఈగల్మాన్ కథల్లా ఉంటాయి అనిపించింది ఈ పుస్తకం చదివాక..ఈ రచయిత ఊహలు ప్రసరించని చోటంటూ లేదు..డేవిడ్ కథలు నీలాకాశంలో ట్రోపోస్పియర్,స్ట్రాటోస్పి యర్ మొదలు అన్ని పొరల్నీ ఛేదించుకుంటూ ,మేఘాలూ,గ్రహమండలాలూ,ఇతరత్రా గెలాక్సీలూ అన్నీ దాటుకుని విశ్వపు పరిథులను తాకుతాయి..వాస్తవాన్ని ప్రతిబింబించే కథల్లో తన చుట్టూ ఉన్న పరిసరాల్ని దాటి ఆవలకి వెళ్ళలేని రచనలు కొన్నైతే,అస్తిత్వపు సంకెళ్ళనుండి బయటపడలేని రచనలు మరికొన్ని..జాతీయదురభిమానాలూ,వర్గవైషమ్యాలు,మతవిద్వేషాలు,లింగవివక్షలూ లాంటి ప్రాపంచిక విషయాలు మూలాధారంగా ఉండే రచనలు ఇంకొన్ని..నిజానికి అధికశాతం వాస్తవికతతో కూడిన కథలు మనిషిని ఏదో ఒక చట్రంలో కుదించకుండా కథా గమనాన్ని నిర్దేశించలేవు..కానీ అటు మానవీయవిలువలను మర్చిపోకుండా,ఇటు వాస్తవికత దృక్పథాన్ని విడిచిపెట్టకుండా నిలుచున్న చోటినుండే మరో ఫాంటసీ ప్రపంచంలోకి దృష్టిసారించి వాస్తవిక సమస్యలను చర్చించడం ఈ రచయిత కథల్లో ప్రత్యేకత.
డేవిడ్ తన కథల్లో పాత్రలను వాటి సహజమైన అస్తిత్వంనుండీ,వాటికి అలవాటైన పరిసరాలనుండీ పూర్తిగా వేరు చేసి కొత్త కొత్త ప్రపంచాల్లోకి తీసుకెళ్ళి వదిలేస్తారు..'ఆఫ్టర్ లైఫ్' పేరిట ఆయన సృష్టించే ప్రపంచాల్లో, ఒక్కో ప్రపంచం ఒక్కో తీరుగా ఉంటుంది..ప్రతీ ప్రపంచం విభిన్నంగానూ ,కొన్ని నిర్ధిష్టమైన నియమాలకనుగుణంగానూ వ్యవహరిస్తుంది..మనిషి తన మరణానంతర జీవితంలోకి అడుగుపెట్టాకా ఆ ప్రపంచాన్ని తెలుసుకోవడం కంటే,భూమి మీద తన వాస్తవ ప్రపంచం గురించీ,ఒక మనిషిగా తన గురించీ ఎక్కువ తెలుసుకుంటాడు..ఆ విధంగా నేల మీద కథల్లో మనిషిని 'మరణానంతర జీవితం' అనే మరో కాల్పనిక ప్రపంచంలోకి తీసుకెళ్ళి ఇహలోకపు సమస్యలపై దృష్టిసారిస్తారు డేవిడ్..ఏదైనా సమస్యను దానిలో భాగంగా ఉండి చూడడంకంటే దాని నుండి విడివడి,ఒక డిటాచ్మెంట్ తో మూడవవ్యక్తిలా దూరంగా నిలబడి చూస్తేనే మనకు సమస్య మరింత స్పష్టంగా అవగతమవుతుంది..డేవిడ్ ఈగల్మాన్ కథలు మనకు అటువంటి దృక్పథాన్ని పరిచయం చేస్తాయి.
మరణానంతర ప్రపంచానికి సంబంధించిన కథలు కాబట్టి వీటిల్లో దేవుడు కూడా కీలకమైన పాత్ర పోషిస్తాడు..ఎటొచ్చీ దేవుణ్ణి కేవలం మగవాడిగా మాత్రమే సృష్టించి లింగవివక్ష చూపకుండా కొన్ని కథల్లో 'గాడ్' ను ఒక స్త్రీగా కూడా చూపిస్తారు డేవిడ్..ఒక సందర్భంలో She knew Her humans were multidimensional అన్నప్పుడు అసలీయన ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని ఆసక్తిగా చదువుతుంటే కాసేపటికి దేవుడు అని అర్ధమయింది..దానికి తోడు కొన్ని కథల్లో ఒక్క దేవుడూ,ఒక్క దేవతా ఉండకుండా వివిధ మతాలకూ,సంస్కృతులకూ చెందిన అనేకమంది దేవుళ్ళూ,దేవతలూ కనిపిస్తుంటారు..ఒక కథలో అయితే ఈ దేవుడి హోదాను భార్యా భర్తలు ఇద్దరూ సరిసమానంగా పంచుకుంటారు..వాళ్ళు భూమి మీద మానవుణ్ణి చూసి ఒక్కోసారి జాలిపడితే మరోసారి అసూయ పడుతుంటారు,అతడి మేథను చూసి అబ్బురపడుతూ,మనిషి లాంటి మిరాకిల్ ని సృష్టించిన తమ సృజనాత్మక శక్తికి గర్వపడతారు..మనిషి తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్న తీరుగా భూమిని చేజేతులా నాశనం చేసుకుంటున్న తీరుకు బాధపడుతూ అందరికీ దూరంగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు.
ఈ కథలన్నిటికీ మరణానంతరపు ప్రపంచాన్ని వేదికగా చేసుకున్నప్పటికీ అందులో చర్చకువచ్చేవన్నీ భూమి మీద మనుషులు ఎదుర్కుంటున్న వ్యక్తిగత ,సామజిక సమస్యలే..భూమి మీద తన ఉనికి పట్ల అసంతృప్తితో ఉన్న మనిషిలో ఉత్పన్నమయ్యే పలు ప్రశ్నలకు డేవిడ్ తన కథల ద్వారా సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశారు..ఈ కధల్లో నేను మరి కాస్త పొడుగ్గా ఉంటే బావుండేది,ఇంకాస్త తెల్లగా ఉంటే బావుండేది,ఫలానా కుటుంబంలో పుట్టి ఉంటే బావుండేది,ఇంకాస్త ఎక్కువ కాలం బ్రతికితే బావుండేది,సమాజం అలా కాక ఇలా ఉంటే బావుండేది,ప్రజాస్వామ్యం బదులు కమ్యూనిజం / సోషలిజం ఉంటే బావుండేది,వృద్ధాప్యం రాకుండా ఉంటే బావుండేది లాంటి 'What if' ప్రశ్నలన్నీ ఒక్కొక్కటిగా చర్చకు వస్తాయి..మరణానంతరం దేవుళ్ళు కూడా "మనం ఇన్ని ఇచ్చినా,పాపం మనిషి జీవితమంతా ఏదో ఒక లోటు వెతుక్కుంటూ అసంతృప్తిగానే బ్రతికాడు కదా,ఇప్పుడైనా అతడి కోరికలు తీరుద్దాం" అనే ఏకాభిప్రాయంతో చాలా ఉదారంగా వ్యవహరిస్తూ అతడు అనుకున్నవన్నీ ఇచ్చి అతడి కోరికలు తీర్చే ప్రయత్నం చేస్తుంటారు..కానీ అన్ని కోరికలూ తీరిన మానవుడు సంతోషంగా ఉన్నాడా ? తెలుసుకోవాలంటే ఈ పుస్తకం తప్పకుండా చదవండి.
ఈ సంవత్సరం నేను చదివిన అన్ని పుస్తకాల్లోకీ,ఒక మూసలో లేకుండా ఫిక్షన్,నాన్ ఫిక్షన్ లను కలబోసి కొత్త పంథాలో ఎక్స్పెరిమెంట్ చేసిన ఈ రచన చాలా ప్రత్యేకంగా అనిపించింది..ఇందులో నచ్చిన ఒక్క కథను ఎంచుకోవడం నా వరకూ అసంభవం..కానీ Mirrors, Quantum కథలు కొంచెం ఎక్కువ నచ్చాయని చెప్పగలను..ఒక్క చిన్న కథ చెప్పి ఈ వ్యాసం ముగుస్తాను.
తాను సృష్టించిన మనుషుల మీద ప్రేమతో దేవత (గాడ్) మంచి వాళ్ళకి స్వర్గం,చెడ్డవాళ్ళకి నరకం ఇవ్వాలన్న రూల్ ని అమలులో పెట్టలేక తెగ సతమతమవుతూ ఉంటుంది..ఆమెకు రాత్రి నిద్రపట్టదు,పగటి పూట కూడా మోపింగ్ చేసుకుంటూ ఈ విషయాన్ని సుదీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది..ఆలోచించగా ఆలోచించగా తన స్వంత పిల్లల పట్ల పక్షపాత ధోరణి సరికాదనే నిర్ణయానికి వస్తుంది..భూమ్మీద ఎలాగూ ఈ వర్గ తారతమ్యాలు ఉన్నాయి కదా ! కనీసం మరణానంతరం అయినా అందరూ సంతోషంగా ఉండాలనీ,స్వర్గ సుఖాలు అనుభవించాలనీ కోరుకుంటూ పాపపుణ్యాలతో సంబంధం లేకుండా అందరినీ స్వర్గంలో చేర్చాలని ఆదేశిస్తుంది..ఆ విధంగా మరణించిన వాళ్ళందరూ స్వర్గం చేరతారు..నరకం పూర్తిగా నిషేధించడబడుతుంది.మరి ఆమె ఆశించినట్లు అందరూ ఆనందంగా ఉన్నారా ? సమాధానం భలే సరదాగా ఉంటుంది.చదవండి. 'The Communists are baffled and irritated, because they have finally achieved their perfect society, but only by the help of a God in whom they don't want to believe. The meritocrats are abashed that they're stuck for eternity in an incentiveless system with a bunch of pinkos. The conservatives have no penniless to disparage; the liberals have no downtrodden to promote.
So God sits on the edge of Her bed and weeps at night, because the only thing everyone can agree upon is that they're all in Hell.' :)
పుస్తకం నుండి కొన్ని నచ్చిన వాక్యాలు :
The missing crowds make you lonely. You begin to complain about all the people you could be meeting. But no one listens or sympathizes with you, because this is precisely what you chose when you were alive.
There are three deaths. The first is when the body ceases to function. The second is when the body is consigned to the grave. The third is that moment, sometime in the future, when your name is spoken for the last time.
చరిత్రకు ఎటువంటి authenticity ఉండదనీ,జ్ఞాపకాలు చరిత్రను ఎలా ప్రభావితం చేస్తాయో చెబుతూ రాసిన కథ ఒకటి ఉంది..అది ఒక ఆణిముత్యం.ఈ క్రింది వాక్యాలు అందులోవి.
The cheerless woman across the way is praised as a saint, even though the roads in her heart were complicated. The gray-haired man at the vending machine was lionized as a war hero, then demonized as a warlord, and finally canonized as a necessary firebrand between two moments in history. He waits with aching heart for his statues to fall.And that is the curse of this room: since we live in the heads of those who remember us, we lose control of our lives and become who they want us to be.
"Your fantasies have cursed your realities".
But they're both wrong. In truth, God lives a life very much like ours—we were created not only in His image but in His social situation as well. God spends most of His time in pursuit of happiness. He reads books, strives for self-improvement, seeks activities to stave off boredom, tries to keep in touch with fading friendships, wonders if there's something else He should be doing with His time. Over the millennia, God has grown bitter. Nothing continues to satisfy. Time drowns Him. He envies man his brief twinkling of a life, and those He dislikes are condemned to suffer immortality with Him.
Very few people visit Him anymore. He finds Himself lonely and misunderstood. He often invites over men like Martin Luther King, Jr., and Mahatma Gandhi, and together they sit on the porch drinking tea and lamenting about movements that sweep over the tops of their founders.
These reunions reveal a group of individuals touchingly searching for a common theme. They appeal to your name as a unifying structure, but they come to realize that the name that existed on Earth, the you that moved serially through these different identities, was like a bundle of sticks from different trees. They come to understand, with awe, the complexity of the compound identity that existed on the Earth. They conclude with a shudder that the Earthly you is utterly lost, unpreserved in the afterlife. You were all these ages, they concede, and you were none.
Does understanding the mechanics of attraction suck all the life out of it ?
చాలా మంచి పరిచయం చేశారండి .రెండు ముఖ్యమైన విషయాలు getting and not getting. చాలా బాగా వివరించారు. మీరు రాసినవి చాలానే చదవాలి! అభినందనలు!!
ReplyDeleteధన్యవాదాలు సుశీల గారూ :)
Delete