Saturday, April 25, 2020

The Man Who Mistook His Wife for a Hat - Oliver Sacks

మనిషి ఉనికిని ప్రధానంగా నిర్వచించేవి అనుభవాలూ,జ్ఞాపకాలూను..కానీ న్యూరాలజీకి సంబంధించిన వ్యాధుల కారణంగా ఈ రెండూ కోల్పోయిన మనిషి శరీరం ఒక ఖాళీ చేసిన ఇంటితో సమానం..ఎటువంటి అలికిడీ లేకుండా బావురుమంటున్న ఇంట్లో నాలుగ్గోడల మధ్యా ఊపిరాడకుండా తాను ఎవరో ఏమిటో తెలుసుకోవాలనే మనిషి ఆరాటం,అప్పుడే ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన పసిబిడ్డలా ఉంటుంది..సాంకేతిక విప్లవం వెన్నుదన్నుగా వైద్యవిజ్ఞాన రంగం ఎంత అభివృద్ధి సాధించినా వృద్ధాప్యానికీ,మృత్యువుకూ విరుగుడు కనిపెట్టలేకపోయింది..తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదని భ్రమించే మనిషిని 'హ్యూమన్ మోర్టాలిటీ' ఇప్పటికీ వెక్కిరిస్తూనే ఉంది..అదే విధంగా న్యూరోసైన్సెస్ కూడా ఎంత అభివృద్ధి సాధించినా మానవ మస్తిష్కపు పద్మవ్యూహాన్ని ఇంకా ఛేదించలేకపోయిందనే అంటారు ప్రముఖ బ్రిటిష్ న్యూరోలజిస్ట్ ఆలివర్ సాక్స్..సాక్స్ 1985లో తన పేషెంట్స్ క్లినికల్ హిస్టరీ గురించి రాసిన కొన్ని వ్యాసాలు 'The Man Who Mistook His Wife for a Hat' పేరిట ప్రచురించారు..ఈ పుస్తకంలో ఆయన తన పేషెంట్స్ కి సంబంధించిన న్యూరోలజీ సంబంధిత వ్యాధులూ,వాటి లక్షణాలను గురించి విస్తృతంగా చర్చించారు..ఈ పుస్తకం చదువుతున్నప్పుడు జాన్ నాష్,ఐన్స్టీన్,అలాన్ ట్యూరింగ్ లాంటి కొందరు మేథావులు గుర్తొచ్చారు..అటువంటి వ్యక్తుల అసాధారణమైన మేథోశక్తికీ,వాళ్ళ బ్రెయిన్ ఫార్ములేషన్ కీ సంబంధం ఉండడం కేవలం ఒక అపోహ కాదని అనిపిస్తుంది.
Image Courtesy Google
ఇందులో Korsakov's syndrome,అమ్నిసియా,అఫేజియా,అగ్నోసియా,Tourette's syndrome వంటి పలు న్యూరోలాజికల్ డిజార్డర్స్ గురించి అనేక మంది పేషెంట్స్ కేస్ హిస్టరీస్ ఆధారంగా రాసిన వ్యాసాలున్నాయి..కొందరికి ఎంత వయసొచ్చినా రాయడం,చదవడం లాంటి అతి సాధారణ విషయాల్లో ఇబ్బందులు ఉండడం,లేని శరీరావయవాలు ఉన్నట్లుగా (ఫాంటమ్స్) గా కనిపించడం,జ్ఞాపకశక్తి పూర్తిగా పోయి తమ ఉనికిని మర్చిపోవడం,ముఖాలను పోల్చుకోలేకపోవడం,అన్ని శరీరావయవాలు సరిగ్గానే ఉన్నప్పటికీ అవి ఉన్నాయన్న స్పృహ లేక కదల్లేకపోవడం వంటి ఎప్పుడూ వినని రకరకాల క్లినికల్ టేల్స్ ని మన ముందుంచుతారు ఆలివర్ సాక్స్..వీటితో పాటు మానసిక సంతులనం సరిగ్గా లేనప్పటికీ బోర్హెసియన్ అబ్స్ట్రాక్ట్ ప్రపంచపు జీవుల్ని తలపించే ప్రాడిజీలను కొంతమందిని పరిచయం చేస్తారు.

న్యూరోలజీ మనిషి గ్రాహకశక్తిని 'కాంక్రీట్','అబ్స్ట్రాక్ట్' అనే రెండు ఆలోచనా విధానాలుగా విభజిస్తుందంటారు..మానవమేథ గొప్పదనమంతా మెదడులోని 'స్పష్టత' మరియు 'అబ్స్ట్రాక్ట్' లోనే కేంద్రీకృతమై ఉంటుందని సిస్టమాటైజర్ / న్యూరోలజిస్ట్ అయిన Kurt Goldstein ప్రతిపాదించారు..కానీ ఈ వాదనను వ్యతిరేకిస్తూ కేవలం ఈ రెండు దృక్పథాలను పరిగణనలోకి తీసుకుని బ్రెయిన్ డామేజ్ అయిన మనిషి మానసిక స్థితిని అంచనా వెయ్యడం,అతడిని సమాజంనుండి పనికిరానివాడిగా వెలివేయడం సరికాదంటారు సాక్స్..కాంక్రీట్ లేదా వాస్తవిక స్పృహ (capable of being perceived by the senses) కు న్యూరోలజిస్టులు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వకుండా ఒక రకమైన చులకన భావంతో (wretched thing, beneath consideration, incoherent, regressed) చూస్తారనేది ఆయన ఫిర్యాదు..ఆయన ఇందులో చర్చించిన పలు కేస్ స్టడీస్ అన్నీ న్యూరోలజీ మానసిక సంబంధిత రోగులకు చికిత్స చేసేటప్పుడు విస్మరిస్తున్న ఈ 'కాంక్రీట్' ను సమర్ధించే దిశగానే సాగుతాయి.

ఏదైనా ఒక వస్తువును 'వస్తువుగా' పసివాళ్ళు సైతం తమ సెన్సెస్ ఆధారంగా గుర్తిస్తారు (కాంక్రీట్) కానీ దాని లక్షణాలను గురించి స్పష్టంగా మాట్లాడమంటే మాట్లాడలేరు (అబ్స్ట్రాక్ట్)..ఈ వైరుధ్యాన్ని గుర్తిస్తూ తన తొలి కేస్ స్టడీ 'The Man Who Mistook His Wife for a Hat' లో Dr P. గా పిలిచే ఒక పేషెంట్ గురించి రాశారు..డాక్టర్.పి వస్తువుల్ని గుర్తించలేరు,ముఖాలను పోల్చుకోలేరు..ఆయనకు అందరిముఖాలూ,వస్తువులూ చుట్టూ ఔట్ లైన్స్ మినహా అలికేసినట్లుగా కనబడుతుంటాయి (Visually, he was lost in a world of lifeless abstractions)..కానీ డాక్టర్.పి ప్రత్యేకత ఏమిటంటే ఆయనో గొప్ప సంగీతకారుడు,అన్నా కరీనినా పాత్రలను గురించి అడిగినా చక్కని జ్ఞాపకశక్తితో మాట్లాడగలరు..అలాగే వస్తువుల గురించి కూడా ఎంతైనా మాట్లాడతారు గానీ వాటిని స్పష్టంగా గుర్తుపట్టే శక్తిని మాత్రం పూర్తిగా కోల్పోయారు..కానీ విచిత్రంగా 'Visual Agnosia' అనే ఈ వ్యాధి సంగీతకారునిగా ఆయన నైపుణ్యాన్ని కొంచెం కూడా తగ్గించలేదన్నది గమనించవలసిన విషయం అంటారు సాక్స్.
A face, to us, is a person looking out-we see, as it were, the person through his persona, his face. But for Dr P. there was no persona in this sense-no outward persona, and no person within.I had stopped at a florist on my way to his apartment and bought myself an extravagant red rose for my buttonhole. Now I removed this and handed it to him. He took it like a botanist or morphol-ogist given a specimen, not like a person given a flower.
బ్రిటిష్ న్యూరోలజిస్ట్ Hughlings Jackson ఈ అఫేజియా బారిన పడిన వాళ్ళని అబ్స్ట్రాక్ట్,‘prepositional’ thought కోల్పోయినవాళ్ళుగా కుక్కలతో పోలుస్తారు..(or, rather, he compares dogs to patients with aphasia)..కానీ సాక్స్ తన పేషెంట్ డాక్టర్.పి గురించి రాస్తూ,డాక్టర్.పి కోల్పోయింది కాంక్రీట్ ప్రపంచాన్ని మాత్రమేననీ,నిజానికి ఆయన వాస్తవ ప్రపంచాన్ని గుర్తించలేకపోయినా ఒక కంప్యూటర్ పనిచేసినంత సమర్థతతో పనిచెయ్యగలరనీ అంటారు..డాక్టర్.పి ప్రస్తుత ప్రపంచం పూర్తి 'అబ్స్ట్రాక్ట్' ప్రపంచం..ఈ కేస్ ని ఉదహరిస్తూ తమ న్యూరోలొజీ ఎప్పుడూ పేషెంట్ లో నయం చెయ్యలేని లోపాల మీదే దృష్టి పెట్టింది తప్ప పేషెంట్ కి సమాజంలో గౌరవప్రదంగా బ్రతకడానికి అవకాశం కల్పించే అతడిలో మిగిలిన శక్తిసామర్ధ్యాలపై దృష్టి పెట్టలేదంటారాయన.

మానవమేథస్సుని నిర్వచించేది మెదడు సాధారణ పనితనాన్ని(కాంక్రీట్) మించిన 'అబ్స్ట్రాక్ట్' దృక్పథమే అని నమ్మే న్యూరోలజీ ప్రపంచానికి వ్యతిరేకంగా,మనిషి దైనందిన జీవితంలో రోజువారీ పనులు చేసుకుంటూ హుందాగా బ్రతకడానికి అబ్స్ట్రాక్ట్ కంటే కాంక్రీట్ దృక్పథమే ఎక్కువ అవసరమని వాదిస్తారు సాక్స్..ఇందులో వ్యాసాలన్నీ అనేకమంది పేషెంట్స్ గురించిన వివరాలను ఉదహరిస్తూ సాక్స్ తన వాదనను సమర్ధించుకునే దిశగానే సాగుతాయి.

ఇమ్మానుయేల్ కాంట్ సిద్ధాంతం ప్రకారం చూసినా,లేదా జీవపరిణామ క్రమం ప్రకారం చూసినా 'జడ్జిమెంట్' అనేది మనిషి ఆలోచనా విధానంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది..మనిషైనా,జంతువైనా 'అబ్స్ట్రాక్ట్ సెన్స్' విషయంలో విఫలమైనా మంచి జీవితాన్ని జీవించగలరు గానీ,'జడ్జిమెంట్' అనేది లేకపోతే పూర్తిగా నిర్వీర్యమైపోతారంటారు..కానీ ఒక మనిషి తన జీవితాన్ని సుగమం చేసుకోవడంలో ముఖ్య పోషించే ఈ 'జడ్జిమెంట్' ను క్లాసికల్ (కంప్యూటేషనల్) న్యూరోలజీ సరిగ్గా అర్థంచేసుకోలేక నిర్లక్ష్యం చేస్తోందంటారు సాక్స్..

డాక్టర్.పి భార్య ఆయన వేసిన కొన్ని అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ ని సాక్స్ కు గర్వంగా చూపిస్తూ అందులో ఆయన ఆర్టిస్టిక్ మెరిట్స్ గురించి చెప్పడాన్ని గురించి రాస్తూ,అది ఆర్ట్ కాదనీ పాథాలజీ అనీ అనడం పికాసో,మైఖేలాంజెలో,రింబాడ్ లాంటి ప్రపంచ ప్రసిద్ధ ఆర్టిస్టుల,చైల్డ్ ప్రోడిజీల మానసిక స్థితిలో మామూలు మనుషులకు విరుద్ధమైన బ్రెయిన్ ఫార్ములేషన్ ఏమైనా ఉంటుందా అనే కుతూహలం రేకెత్తించింది.
'Ach, you doctors, you're such Philistines!' she exclaimed. 'Can you not see artistic development-how he renounced the realism of his earlier years, and advanced into abstract, nonrepresenta-tional art?'
'No, that's not it,' I said to myself (but forbore to say it to poor Mrs P.). He had indeed moved from realism to nonrepresentation to the abstract, yet this was not the artist, but the pathology, advancing-advancing towards a profound visual agnosia, in which all powers of representation and imagery, all sense of the concrete, all sense of reality, were being destroyed. This wall of paintings was a tragic pathological exhibit, which belonged to neurology, not art.
The Lost Mariner అనే మరో కేస్ స్టడీలో ఆర్గానిక్ Amnesia / retrograde amnesia బారినపడి తన జీవితంలో కొన్నేళ్ళ జ్ఞాపకాలను పూర్తిగా కోల్పోయి,చిన్నప్పటి కొన్ని చెదురుమదురు జ్ఞాపకాలు మాత్రమే మిగిలిన జిమ్మీ గురించి రాస్తారు..సజావుగా సాగిపోతున్న జీవితంలో ఉన్నట్లుండి ఒక లోతైన బ్లాక్ హోల్ లాంటి అగాథం ఏర్పడి అంతవరకూ జీవించిన క్షణాలన్నిటినీ,ప్రోగుచేసుకున్న అనుభవాలన్నిటినీ ఒక్క చిహ్నం కూడా మిగలకుండా తనలోకి అమాంతం లాగేసుకుంటే ఎలా ఉంటుందో జిమ్మీ జీవితం అలా చీకటిగదిలా ఖాళీగా ఉంటుంది.
You have to begin to lose your memory, if only in bits and pieces, to realise that memory is what makes our lives. Life without memory is no life at all . . . Our memory is our coherence, our reason, our feeling,even our action. Without it, we are nothing అంటారు Luis Bunuel.మరి జ్ఞాపకాలు ఏమీ మిగలని జిమ్మీ జీవితం ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం.
'He is, as it were,' I wrote in my notes, 'isolated in a single moment of being, with a moat or lacuna of forgetting all round him … He is man without a past (or future), stuck in a constantly changing, meaningless moment.'
కానీ రష్యన్ న్యూరో సైకాలజిస్ట్ అలెగ్జాండర్ లూరియా, 'A man does not consist of memory alone. He has feeling, will, sensibility, moral being … It is here . . . you may touch him, and see a profound change.' అంటారు..అందుచేత జ్ఞాపకాలు,మెంటల్ ఆక్టివిటీ,మెదడు లాంటివాటిని మాత్రమే మనిషి ఉనికిని నిర్వచించే అంశాలుగా చూడడం సమంజసం కాదనీ,మోరల్ అటెన్షన్,అతడు శ్రద్ధగా చేసే పనుల్లాంటివి కూడా మనిషిని అతడి ఆత్మతో ఏకంచేసి, భావోద్వేగాలు,అనుభవాలతో కూడిన పరిపూర్ణమైన జీవితం జీవించే అవకాశాన్నిస్తాయని సాక్స్ వాదన..ముఖ్యంగా మనిషినీ,అతడి ఆత్మనూ ఏకం చేసే కళకూ,ఆధ్యాత్మికతకూ న్యూరోలాజికల్ డిజార్డర్స్ ను సమర్ధవంతంగా ఎదుర్కునే శక్తి ఉంటుందని అంటారాయన.
Jimmie, who was so lost in extensional 'spatial' time, was perfectly organised in Bergsonian 'intentional' time; what was fugitive, unsustainable, as formal structure, was perfectly stable, perfectly held, as art or will.
The Disembodied Lady పేరిట రాసిన మరో కేస్ లో ఇరవయ్యేడేళ్ళ క్రిస్టినా అనే స్త్రీ తన కాళ్ళు,చేతులు మొదలైన శరీరావయవాలకు సంబంధించిన స్పృహ కోల్పోతుంది..
'I feel my body is blind and deaf to itself … it has no sense of itself-' అంటుందామె..these are her own words. She has no words, no direct words, to describe this bereftness, this sensory darkness (or silence) akin to blindness or deafness. She has no words, and we lack words too. And society lacks words, and sympathy, for such states.
Witty Ticcy Ray అనే మరో వ్యాసంలో తీవ్రమైన నెర్వస్ ఎనర్జీ వ్యాధితో బాధపడే 'రే' అనే పేషెంట్ గురించి రాస్తారు..మెదడు,నాడీవ్యవస్థ సమతౌల్యంలో చిన్నపాటి తేడాలు కూడా మొత్తం శరీరం పనితీరుమీద ఎటువంటి ప్రభావం చూపిస్తాయో ఈ కేస్ హిస్టరీ చూస్తే అర్ధమవుతుంది..అతి సర్వత్రా వర్జయేత్ అని పెద్దలు ఎప్పుడో చెప్పారు..రే కు సంతోషం వచ్చినా,దుఃఖం వచ్చినా పట్టలేం,అతడిలో భావోద్వేగాల తీవ్రత ఎక్కువ..ఈ కారణంగా అతడు ఉద్యోగంలోనూ,వ్యక్తిగత జీవితంలోనూ అనేక ఇబ్బందులకు గురయ్యేవాడు..ఇటువంటి వ్యాధిని Tourette's సిండ్రోమ్ అంటారు..ఈ వ్యాథికి వైద్యం తీసుకున్నాక రే జీవితం ఈ విధంగా ఉందంటారు.
So now there are two Rays-on and off Haldol. There is the sober citizen, the calm deliberator, from Monday to Friday; and there is 'witty ticcy Ray', frivolous, frenetic, inspired, at weekends. It is a strange situation, as Ray is the first to admit:Having Tourette's is wild, like being drunk all the while. Being on Haldol is dull, makes one square and sober, and neither state is really free ...You 'normals', who have the right transmitters in the right places at the right times in your brains, have all feelings, all styles, available all the time-gravity, levity, whatever is appropriate. We Touretters don't: we are forced into levity by our Tourette's and forced into gravity when we take Haldol. You are free, you have a natural balance: we must make the best of an artificial balance.
ఇలా చెప్పుకుంటూ పోతే పాఠకులకు ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇటువంటివెన్నో..ఇందులో మొదటి రెండు సెక్షన్స్ లో హ్యూమన్ బ్రెయిన్ లో excess లేదా deficit కారణంగా సంక్రమించే వ్యాధుల్ని గురించి చర్చించగా మూడో విభాగంలో న్యూరోలజీ,మెడిసిన్ ల పరిధిలోకి రాని reminiscence, altered perception, imagination,'dream' వంటి అంశాల గురించి చర్చిస్తారు..జ్ఞాపకాలు,మతిమరపు,అనుభవాలూ,గ్రహింపు మొదలైన అనేక విషయ విశేషాలతో కూడిన ఈ క్లినికల్ టేల్స్ చదువుతున్నప్పుడు పాఠకులు ఎక్కడో ఒకచోట తమను తాము ఐడెంటిఫై చేసుకుంటారనిపించింది..ఉదాహరణకు నేను ముఖాలు జ్ఞాపకం ఉంచుకోవడంలో ఇబ్బందిపడతాను,చాలా మంది అతి సహజంగా చేసే చిన్న చిన్న పనులైన షూ కి లేసులు కట్టుకోవడం లాంటివి నేను చాలా కష్టపడి నేర్చుకున్నాను,డైరెక్షన్స్ గుర్తుపట్టడంలో ఇప్పటికీ తడబడతాను,ఇలాంటివి మరెన్నో..కానీ ఈ కథల్లాంటి వ్యాసాలు  చదివినప్పుడు మానవ మేథస్సు మీద ఉన్న అపారమైన నమ్మకం సడలక మానదు..ఎంత శోధించినా ఇంకా మనకు తెలీని సృష్టి రహస్యాలను తనలో దాచుకున్న మనిషి మెదడు ఒక అద్భుతం అనిపించక మానదు..ఈ అనంత విశ్వంలో పరమాణువంత మన ఉనికి మనకు గుర్తురాక మానదు..షెర్రింగ్టన్ 'an enchanted loom' గా అభివర్ణించిన హ్యూమన్ బ్రెయిన్ ని మించిన మిరాకిల్ మరొకటుంటుందా అని అనిపించక మానదు.

పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు,

'What can be shown cannot be said.'

The aspects of things that are most important for us are hidden because of their simplicity and familiarity. (One is unable to notice something because it is always before one's eyes.) The real foundations of his enquiry do not strike a man at all. –Wittgenstein.

Jonathan Miller produced a beautiful television series, The Body in Question, but the body, normally, is never in question: our bodies are beyond question, or perhaps beneath question-they are simply unquestionably, there. This unquestionability of the body, its certainty, is, for Wittgenstein, the start and basis of all knowledge and certainty.

This "proprioception" is like the eyes of the body, the way the body sees itself. And if it goes, as it's gone with me, it's like the body's blind. My body can't "see" itself if it's lost its eyes, right? So I have to watch it-be its eyes. Right?'

'In the beginning is the deed,' Goethe writes. This may be so when we face moral or existential dilemmas, but not where movement and perception have their origin. Yet here too there is always something sudden: a first step (or a first word, as when Helen Keller said 'water'), a first movement, a first perception, a first impulse- total, 'out of the blue', where there was nothing, or nothing with sense before. 'In the beginning is the impulse.' Not a deed, not a reflex, but an 'impulse', which is both more obvious and more mysterious than either . . . We could not say to Madeleine, 'Do it!' but we might hope for an impulse; we might hope for, we might solicit, we might even provoke one . . .

She speaks very quickly, impulsively, and (it seems) indifferently … so that the important and the trivial, the true and the false, the serious and the joking, are poured out in a rapid, unselec-tive, half-confabulatory stream . . . She may contradict herself completely within a few seconds . . . will say she loves music, she doesn't, she has a broken hip, she hasn't . . .

They make me think, first, of Borges' 'Funes', and his remark, 'My memory, Sir, is like a garbage-heap', and finally, of the Dunciad, the vision of a world reduced to Pure Silliness-Silliness as being the End of the World:Thy hand, great Anarch, lets the curtain fall; And Universal Darkness buries All.

Hume, as we have noted, wrote: I venture to affirm . . . that [we] are nothing but a bundle or collection of different sensations, succeeding one another with inconceivable rapidity, and in a perpetual flux and movement.Thus, for Hume, personal identity is a fiction-we do not exist, we are but a consecution of sensations, or perceptions.

Dostoievski had 'psychical seizures', or 'elaborate mental states' at the onset of seizures, and once said of these: You all, healthy people, can't imagine the happiness which we epileptics feel during the second before our fit… I don't know if this felicity lasts for seconds, hours or months, but believe me, I would not exchange it for all the joys that life may bring.

Thus a gulf appears, indeed a chasm, between what we learn from our patients and what physiologists tell us. Is there any way of bridging this chasm ?

All of this was hinted at a hundred years ago-in Hughlings Jackson's original account of'reminiscence' (1880); by Korsakoff, on amnesia (1887); and by Freud and Anton in the 1890s, on agnosias. Their remarkable insights have been half-forgotten, eclipsed by the rise of a systematic physiology.

The final therapy, as Freud said, is work and love.

One must go to Dostoievsky who experienced on occasion ecstatic epileptic auras to which he attached momentous significance, to find an adequate historical parallel.There are moments, and it is only a matter of five or six seconds, when you feel the presence of the eternal harmony … a terrible thing is the frightful clearness with which it manifests itself and the rapture with which it fills you. If this state were to last more than five seconds, the soul could not endure it and would have to disappear. During these five seconds I live a whole human existence, and for that I would give my whole life and not think that I was paying too dearly . . .

No one has expressed this more beautifully than Kierkegaard, in the words he wrote on his deathbed.
Thou plain man!' (he writes, and I paraphrase slightly). 'The symbolism of the Scriptures is something infinitely high . . . but it is not "high" in a sense that has anything to do with intellectual elevation, or with the intellectual differences between man and man . . . No, it is for all . . . for all is this infinite height attainable.'         

'I'm so cold,' she cried, huddling into herself. 'It's not outside, it's winter inside. Cold as death,' she added. 'She was a part of me. Part of me died with her.'

Wednesday, April 15, 2020

Why I Am Not Going to Buy a Computer - Wendell Berry

'DO I WISH TO
KEEP UP WITH
THE TIMES ?

NO.'

ఇటువంటి ముందుమాటతో మొదలయ్యే పుస్తకం ఎటువంటిదో ప్రత్యేకం చెప్పనక్కర్లేదు..
ఊరందరిదీ ఒక దారైతే ఉలిపికట్టెది ఒక దారి అన్నట్లు అమెరికన్ రచయిత,ఎన్విరాన్మెంటల్ ఆక్టివిస్ట్ అయిన వెన్డెల్ బెర్రీ నలుగురూ నడిచే దారిని గుడ్డిగా అనుసరించకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఏర్పరుచుకున్న వ్యక్తి..ఎనర్జీ కార్పొరేషన్స్ వల్ల మానవాళికి జరిగే మేలు కంటే కీడే ఎక్కువ అని నమ్మే వ్యక్తి కావడంతో  వృత్తిరీత్యా వ్యవసాయదారుడైన బెర్రీ తన వ్యవసాయం ఎక్కువగా గుర్రాలను ఉపయోగించి చేసేవారట,అలాగే ప్రవృత్తి రీత్యా రచయిత కావడంతో తన రచనల్ని కేవలం ఒక పెన్సిలూ,పెన్నూ,పేపరూ ఉపయోగించి రాసేవారు..తరువాత ఆయన భార్య ఆ ప్రతుల్ని రాయల్ స్టాండర్డ్ టైప్ రైటర్లో టైప్ చేసి,ప్రూఫ్ రీడింగ్ చేసేవారట.."మేమిద్దరం ఇష్టపడి చేసే ఈ పని ఒక 'లిటరరీ కాటేజ్ ఇండస్ట్రీ'" అంటారు బెర్రీ..కంప్యూటర్ కొనుక్కోమని ఎంతమంది సలహా చెప్పినా తన భార్య ఇష్టపడి చేసే విలువకట్టలేని పనికి ప్రత్యామ్నాయంగా ఒక మెషీన్ ను వాడడం తనకు ఇష్టం లేదంటారు..దీనికి మరో కారణంగా ఎనర్జీ కార్పొరేషన్స్ మీద సాధ్యమైనంత వరకూ ఆధారపడకూడనే తన సిద్ధాంతాన్ని గుర్తుచేస్తారు..హార్పర్స్ మ్యాగజైన్ లో బెర్రీ  రాసిన 'Why I am Not Going to Buy a Computer' అనే వ్యాసంలో ఇదంతా చదివిన పాఠకులు పత్రికాముఖంగా ఆయన మీద తీవ్రమైన విమర్శలతో కూడిన లేఖలు రాశారు.ఆ లేఖల్లో,

*Wife – a low-tech energy-saving device. Drop a pile of handwritten notes on Wife and you get back a finished manuscript, edited while it was typed.

*History teaches us that Wife can also be used to beat rugs and wash clothes by hand, thus eliminating the need for the vacuum cleaner and washing machine, two more nasty machines that threaten the act of writing.

అంటూ అనేకమంది బెర్రీ మీద వ్యంగ్యాస్త్రాలు సంధిస్తారు..దీనికి సమాధానంగా ఆయన
'What are People For ?' అనే వ్యాసాల సంకలనంలో ప్రచురించిన 'Feminism, the Body and the Machine’ అనే వ్యాసంలో వారికి సమాధానమిచ్చారు..ఈ పుస్తకంలో ఆ రెండు వ్యాసాలూ ఉంటాయి.
Image Courtesy Google
సమీక్షలు రెండు రకాలు..మనం రచయిత చెప్పుల్లో మన కాళ్ళు దూర్చే ప్రయత్నం చేసి రాసేవి కొన్నైతే,రచయిత చెప్పుల సైజు మరీ పెద్దది గనుక,అందులో కాళ్ళు పెట్టే అవకాశం లేక మన చెప్పులు మనం తొడుక్కుని ఒక ప్రక్కగా నిలబడి రాసేవి మరికొన్ని..ఇది మొదటి రకం సమీక్ష..పాఠకులు తమ ఆలోచనా సరళిని రచయిత దృక్పథం తాలుకు తూకపురాళ్ళ వేసి తూచుకునే ప్రయత్నం చెయ్యడానికి అనువైన రచన ఈ పెంగ్విన్ మోడరన్ సిరీస్ లో భాగంగా అమెరికన్ రచయిత వెన్డెల్ బెర్రీ రాసిన 'Why I Am Not Going to Buy a Computer'..ఇది చదువుతున్నప్పుడు ఫ్రెడ్రిక్ బాక్మన్ రాసిన 'A Man Called Ove' లో ఆధునిక తరాన్ని ఏవగించుకునే ఛాదస్తపు ఓవ్ చాలాసార్లు గుర్తొచ్చారు.

ఈ కంప్యూటర్ కాలంలో కంప్యూటర్ ఉపయోగించనివారూ,మొబైల్స్ వినియోగం ఎక్కువగా ఉన్న కాలంలో అవి వాడనివాళ్ళూ,రియాలిటీ షోస్ కాలంలో వాటిని చూడని వాళ్ళూ,ఇంట్లో టీవీ సెట్,మొబైల్స్ లాంటివి కుటుంబ సంబంధాలను దెబ్బతీస్తాయని భావించేవాళ్ళు,భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేసే కంటే తల్లిదండ్రులిద్దరిలో ఎవరో ఒకరు కుటుంబం,పిల్లల బాధ్యత తీసుకోవడం అవసరం అనుకునేవాళ్ళు,చదువుని డబ్బు సంపాదించడానికి మార్గంగా మాత్రమే చూడనివాళ్ళు,హోటల్ లో తినడం కంటే ఇంట్లో స్వయంగా వండుకుని తినడం ఆరోగ్యానికి మంచిది అని అనుకునే వాళ్ళు,ఆరోగ్యకరమైన మానవ సంబంధాల్లో హక్కులూ,ఆత్మాభిమానాలూ ఉండవని గుడ్డిగా నమ్మేవాళ్ళూ,వంటావార్పులు తెలిసుండడం,పిల్లల ఆలనా పాలనా చూడడం బానిసత్వం కాదనీ,మనిషి ప్రాథమిక బాధ్యత కుటుంబ వ్యవస్థ నుండే మొదలవ్వాలనీ గుర్తించేవారు,ఒకరికి సహాయంగా ఉండడం,ఇల్లు ఊడవడం,అంట్లు తోమడం లాంటివి తమపని తాము గౌరవంగా చేసుకోవడమే తప్ప చెయ్యకూడని పనులు కాదని అనుకునేవాళ్ళు,కార్పెంటరీ,ఎలక్ట్రిసిటీ పనులు,బ్యాంకు వ్యవహారాలూ,తోటపనీ వంటి ఇంటా,బయటా పనులన్నీ కొంతవరకూ తెలిసి ఉండడం అవసరమనుకునేవాళ్ళు,అన్నిటినీ మించి 'పని' ఏదైనా పనే అనీ,మనిషన్నవాడికి అన్ని పనులూ తెలిసి ఉండాలని,ఆడైనా మగైనా తమ పనులు తాము చేసుకోవడంలో నామోషీ లేదని భావించేవాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ తరహా మనుషులు నేటి ఆధునిక తరంలో ఛాందసులుగా,వెర్రివాళ్ళుగా పరిగణింపబడుతున్నారు..ఆధునిక తరంలో పనికి నిర్వచనాలు మారిపోయాయి..నూటికి తొంభై శాతం మంది,పని అంటే ఫలితం డబ్బు రూపేణా వచ్చేదిగా,చదువుని డబ్బు సంపాదనకు మార్గంగా మాత్రమే చూస్తున్న దురదృష్టకర పరిస్థితులు నెలకొన్నాయి..కానీ నలుగురూ నడిచే దారి మంచిదేనా ?? మెజారిటీ తీసుకునే నిర్ణయాలు ఉత్తమమైనవీ,అనుసరించదగ్గవీనా ?? సూపర్ పవర్ దేశాధినేతగా ట్రంప్ ని చూసినప్పుడల్లా 'ఖచ్చితంగా కాదు' అని అనాలనిపిస్తుంది :) మార్క్ ట్వైన్ అంటారు,'Whenever you find yourself on the side of the majority, it is time to pause and reflect' అని..కానీ మార్క్ ట్వైన్ చెప్పినా లేక మరో రాబర్ట్ ఫ్రాస్ట్ లాంటి వాళ్ళు చెప్పినా మనిషి మాత్రం తన సౌకర్యార్థం నలుగురూ నడిచే దారిని అనుసరించడమే ఇష్టపడతాడు.. అప్పుడూ,ఇప్పుడూ మనిషికి కావాల్సింది సౌకర్యవంతమైన జీవితం..కానీ దీనికోసం మనిషి చెల్లిస్తున్న మూల్యం ఏంటనేది ఆలోచించుకోమంటారు బెర్రీ.

ఒక తరంలో పురుషులు పొలాల్లో కాయకష్టం చేసి డబ్బు సంపాదించే పని మానేసి చదువుకుని ఉద్యోగాలు చెయ్యడం సౌకర్యంగా భావించారు,క్రమంగా స్త్రీలు కూడా వంటిల్లు దాటి సాధికారత దిశగా ప్రయాణించడంతో నేడు స్త్రీ పురుషులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు..ఎంత చెట్టుకి అంత గాలి రీతిలో కన్స్యూమరిజం వెఱ్ఱితలలు వేస్తున్న తరుణంలో విలాసాలు కాస్తా మనిషి ప్రాథమిక అవసరాలుగా ఎప్పుడు మారిపోయాయో తెలీని స్థితిలో కుటుంబంలో ఇద్దరూ ఉద్యోగం చేస్తే గానీ పూటగడవని స్థితికి చేరుకున్నాం..ఈ క్రమంలో కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైంది అంటారు బెర్రీ..కుటుంబ వ్యవస్థ,ప్రకృతి మనిషి మనుగడలో కీలక పాత్ర పోషిస్తాయని మనసా వాచా కర్మణా నమ్మే ఆయన marriage as a state of mutual help, and the household as an economy గా చూడాలంటారు..కానీ ప్రస్తుతం సాంకేతిక విప్లవం తద్వారా ఆకాశాన్నంటిన కన్స్యూమరిజం వెరసి నేటి వివాహ వ్యవస్థ పరిస్థితి ఇదీ అంటారు :

Marriage, in other words, has now taken the form of divorce: a prolonged and impassioned negotiation as to how things shall be divided. During their understandably temporary association, the ‘married’ couple will typically consume a large quantity of merchandise and a large portion of each other. The modern household is the place where the consumptive couple do their consuming. Nothing productive is done there. Such work as is done there is done at the expense of the resident couple or family, and to the profit of suppliers of energy and household technology. For entertainment, the inmates consume television or purchase other consumable diversion elsewhere.

There are, however, still some married couples who understand themselves as belonging to their marriage, to each other, and to their children. What they have they have in common, and so, to them, helping each other does not seem merely to damage their ability to compete against each other. To them, ‘mine’ is not so powerful or necessary a pronoun as ‘ours.'

కన్సల్టెంట్ ఇంజినీర్ అయిన తన భార్య తన తీరిక సమయంలో తనకు సహాయం చెయ్యడం బానిసత్వం అనే ఫెమినిస్టులు ఆమె ఒక కార్పొరేట్ ఉద్యోగంలో మరో స్త్రీ/పురుషుడి వద్ద జీతం తీసుకుని పని చెయ్యడాన్ని మాత్రం బానిసత్వం కాదని ఎలా అంటారని సూటిగా ప్రశ్నిస్తారు.

But what appears infuriate them the most is their supposition that she works for nothing. They assume – and this is the orthodox assumption of the industrial economy – that the only help worth giving is not given at all, but sold. Love, friendship, neighborliness, compassion, duty – what are they? We are realists. We will be most happy to receive your check.

సహజవనరుల సంరక్షణ ధ్యేయంగా జరిగే ఉద్యమాల్లో సైతం ప్రొడక్షన్ ని మాత్రమే పర్యావరణ సమతౌల్యం దెబ్బతినడానికి కారణంగా చూపిస్తారు తప్ప ప్రొడక్షన్ ని నిర్దేశించే వినియోగాన్ని ఎందుకు విస్మరిస్తారో అర్ధం కాదంటూ,అవసరాలకూ,విలాసాలకూ తేడా తెలుసుకోవడం పూర్తిగా వినియోగదారుని నైతికత మీదే ఆధారపడుతుందంటారు బెర్రీ..తాను కంప్యూటర్ కొనకూడదనుకోవడంలో,కంప్యూటర్  ఉపయోగించి రాసేవారు బాగా రాయారని చెప్పే ఉద్దేశ్యం లేదనీ,మంచి సాహిత్యం కంప్యూటర్ ఉపయోగించకుండా కూడా రాయొచ్చని చెప్పడం మాత్రమే తన ఉద్దేశ్యమనీ స్పష్టం చేస్తారు..కానీ సాంకేతికత మనిషి శరీరాన్నిసౌకర్యాలకు బానిసగా మార్చి,బలహీన పరుస్తుందని అంటూ (The danger most immediately to be feared in ‘technological progress’ is the degradation and obsolescence of the body.),రచయిత స్వయంగా తన చేత్తో రచనలు చేసినప్పుడు అతడి  శరీరం,మనసూ,సృజనాత్మకత ఈ మూడూ కలిసి పనిచేసిన ఫలితంగా ఉత్పన్నమయ్యే ఆర్ట్ వెలకట్టలేని తృప్తినిస్తుందంటారు బెర్రీ.

(In fact, I know a publisher who says that under the influence of computers – or of the immaculate copy that computers produce – many writers are now writing worse.) But I do say that in using computers writers are flirting with a radical separation of mind and body, the elimination of the work of the body from the work of the mind. The text on the computer screen, and the computer printout too, has a sterile, untouched, factorymade look, like that of a plastic whistle or a new car. The body does not do work like that. The body characterizes everything it touches. What it makes it traces over with the marks of its pulses and breathings, its excitements, hesitations, flaws, and mistakes. On its good work, it leaves the marks of skill, care, and love persisting through hesitations, flaws, and mistakes. And to those of us who love and honor the life of the body in this world, these marks are precious things, necessities of life.

ఇందులో ఫెమినిస్టులతో పాటు పురుషాహంకారులకూ,ఆ మాటకొస్తే తనపర భేదం లేకుండా సామజిక బాధ్యతను విస్మరించి నా చిన్ని పొట్టకు శ్రీరామ రక్షా అనుకుంటూ తాము గీసుకున్న చట్రాల్లో బ్రతికేస్తున్న ప్రతీ మనిషికీ చురకలంటించిన అనేక అంశాలున్నాయి..భూమిని నమ్ముకుని వ్యవసాయం చెయ్యడంలో ఉన్న స్వతంత్రత ఒకరి క్రింద పని చెయ్యడంలో లేదని బెర్రీ ఘంటాపధంగా చెప్పడంలో ఒక గతించిన తరంలోని రైతు బిడ్డల స్వాభిమాన స్వరం వినిపిస్తుంది.

Women have complained, justly, about the behavior of ‘macho’ men. But despite their he-man pretensions and their captivation by masculine heroes of sports, war, and the Old West, most men are now entirely accustomed to obeying and currying the favor of their bosses. Because of this, of course, they hate their jobs – they mutter, ‘Thank God it’s Friday’ and ‘Pretty good for Monday’ – but they do as they are told. They are more compliant than most housewives have been. Their characters combine feudal submissiveness with modern helplessness. They have accepted almost without protest, and often with relief, their dispossession of any usable property and, with that, their loss of economic independence and their consequent subordination to bosses.

పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు,

I know that I am in dangerous territory, and so I had better be plain: what I have to say about marriage and household I mean to apply to men as much as to women. I do not believe that there is anything better to do than to make one’s marriage and household, whether one is a man or a woman. I do not believe that ‘employment outside the home’ is as valuable or important or satisfying as employment at home, for either men or women. It is clear to me from my experience as a teacher, for example, that children need an ordinary daily association with both parents. They need to see their parents at work; they need, at first, to play at the work they see their parents doing, and then they need to work with their parents. It does not matter so much that this working together should be what is called ‘quality time,’ but it matters a great deal that the work done should have the dignity of economic value.

Do I wish to keep up with the times? No.
My wish simply is to live my life as fully as I can. In both our work and our leisure, I think, we should be so employed. And in our time this means that we must save ourselves from the products that we are asked to buy in order, ultimately, to replace ourselves.

Thoroeu words :
Why should anybody wait to do what is right until everybody does it? It is not ‘significant’ to love your own children or to eat your own dinner, either. But normal humans will not wait to love or eat until it is mandated by an act of Congress.

Friday, April 10, 2020

Felicity: Poems - Mary Oliver

మేరీ ఆలివర్ సాహచర్యం లేకపోతే ఈ క్వారన్టైన్ సమయంలో ఏమైపోయి ఉండేదాన్నో అనిపిస్తుంది..ఈ 'ఫెలిసిటీ' అనే కవితా సంపుటి పేరుకి తగ్గట్టే 'ఆనందం'..'సంపూర్ణానందం'.నాలుగైదు పుస్తకాలు సమాంతరంగా చదువుతూ అక్కడో వాక్యం ఇక్కడో వాక్యం నెమరువేసుకుంటూ,భౌతిక ప్రపంచపు నీడలు విస్తరించని నాది మాత్రమే అయిన చోటులో ఏదో ఒక మూలన,చేతిలో పుస్తకంతో ఏ నూతన ప్రపంచపు నీడలో సేదతీరాలా అనే కాసేపు వెతుకులాటకి స్పష్టమైన గమ్యాన్ని నిర్దేశిస్తూ,అస్తవ్యస్తంగా గడిచిపోతున్న రోజుల్లో కూడా తన అందమైన ప్రపంచంలోకి చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళిపోయారు అమెరికన్ కవయిత్రి మేరీ ఆలివర్..నాకు బ్రెయిన్ పికింగ్స్ పరిచయం చేసిన కొందరు ఆణిముత్యాల్లాంటి రచయిల్లో ఆలివర్ ఒకరు..కానీ నేను మొదట ఆవిడ 'Upstream' పేరిట రాసిన వ్యాసాలు చదివాను,తరువాత మెల్లిగా ఆవిడ కవితలతో కూడా ప్రేమలో పడ్డాను.
Image Courtesy Google
ఆలివర్ రెండు కవితలు Moments,Storage లకు నా స్వేఛ్ఛానువాదం :

క్షణాలు : 

కొన్ని క్షణాలు వాటిని పూరించమని ఆజ్ఞాపిస్తాయి,
ఎవరినైనా ప్రేమించామని వారికి చెప్పడం,
లేదా,నీ సంపద మొత్తాన్నీ వదులుకోవడం.

నీ హృదయం స్పందిస్తోంది కదా ?
నీవు సంకెళ్ళచే బందీవి కాదు కదా ?

జాగ్రత్తను మించిన విషాదం మరొకటి లేదు,
అనాలోచితంగా వేసే అడుగు ఒక ప్రాణాన్ని రక్షించగలిగినప్పుడు,
బహుశా,అది నీ ప్రాణమే అయినా కావచ్చు.

గిడ్డంగి :

నేను ఒక ఇంటి నుండి మరొక ఇంటికి మారినప్పుడు
నాకు ఆ ఇంట్లో పెట్టడానికి చోటు సరిపోని వస్తువులు చాలా ఉండేవి.
ఎవరైనా ఏం చేస్తారు ? నేనొక స్టోరేజీని అద్దెకు తీసుకున్నాను.
దాన్ని సామానుతో నింపాను.సంవత్సరాలు గడిచాయి.
అప్పుడప్పుడూ నేను అక్కడకు వెళ్ళి ఆ స్టోరేజ్ లోపల వస్తువుల్ని చూసుకునేదాన్ని.
కానీ ఏమీ జరగలేదు,చివరకు నా హృదయంలో చిన్నపాటి నెప్పి కూడా కలుగలేదు.

నేను వృద్ధాప్యం దరిచేరుతున్న కొద్దీ,
చాలా ముఖ్యమైనవి తప్ప,నేను ఆశించే వస్తువుల సంఖ్య
తగ్గుతూ వచ్చింది.
అందువల్ల ఒకరోజు నేను నా స్టోరేజ్ తాళం తీశాను,
చెత్త ప్రోగుచేసేవాణ్ణి పిలిచాను.
అతడు అంతా తీసుకెళ్ళిపోయాడు.

చివరకు బరువు దింపితే  ఊపిరిపీల్చుకున్న
అల్పమైన గాడిదలా అనిపించింది.వస్తువులు !
వాటిని తగలబెట్టండి,తగలబెట్టండి !
ఒక అందమైన చలిమంట వేసుకోండి !
మీ మనసులో మరికాస్త ఎక్కువ చోటు,ప్రేమకూ,
చెట్టుచేమలకూ ! పక్షులకు సొంతమైనదంటూ ఏదీ లేదు,
బహుశా అవి స్వేచ్ఛగా ఎగరడానికి కారణం అదే.

Thursday, April 9, 2020

My Dark Vanessa - Kate Elizabeth Russell

చదివిన అన్ని పుస్తకాలకూ వ్యాసాలు రాయనవసరం లేదు,రాయలేం కూడా అనుకోండి..కొన్ని పుస్తకాలు కాలక్షేపంగా చదివి ప్రక్కన పెట్టేస్తే సరిపోతుంది,ఎందుకంటే చదవడమే దండగ అనుకుంటే దానికి ఇలా ఒక నోట్ రాయాల్సిరావడం మరింత బాధాకరమైన వ్యవహారం..పాప్ కార్న్ తింటూనో,కూరలో పోపు వేసి కలుపుతూనో రెండేసి పేజీల చప్పున చదివెయ్యొచ్చు..అందునా క్వారన్టైన్ టైం లో ఇంట్లో ఉన్న మిగతా జీవులు పేజీకో పదిసార్లు రియాలిటీ లోకి ఎటూ లాగేస్తారు గనుక,సీరియస్ రీడింగ్ కి అవకాశం లేక,దొరికే కాస్త సమయంలో అయినా ఏవో కొన్ని పేజీలు తిరగేద్దామనే కక్కుర్తితో 'ది మోస్ట్ స్టైలిష్ బుక్ ఆఫ్ ది ఇయర్' అని ఏకంగా నబకోవ్ 'లోలిటా' తో పోలుస్తూ మీడియా వేనోళ్ళ పొగుడుతూ చేస్తున్న హడావుడిని చూసి ఎప్పటిలాగే మోసపోయాను.
Image Courtesy Google
పదిహేనేళ్ళ 'వెనెస్సా వై' కీ ఆమె చదువుతున్న స్కూల్లో ఇంగ్లీష్ లిటరేచర్ బోధించే నలభై రెండేళ్ళ 'జాకబ్ స్ట్రేన్' కీ మధ్య మొదలైన సంబంధం వెనెస్సా జీవితాన్ని ఎటువంటి మలుపులు తిప్పిందనేది ఈ కథలో సారాంశం..లోలిటా కథ హంబర్ట్ నేరేటర్ గా,ఒక పురుషుడి దృష్టికోణం నుండి చెప్తారు,కాగా ఈ కథ వెనెస్సా దృష్టికోణం నుండి చెప్పారు..మొదటి పాతిక పేజీల్లో అక్కడక్కడా తళుక్కుమన్న పొయెటిక్ నేరేషన్ శాశ్వతమైన పేలవత్వం సంతరించుకోడానికి ఎక్కువ సమయం పట్టలేదు..ఆ తరువాత చదివినదంతా బొత్తిగా ఎటువంటి సాహితీ విలువలు పాటించని అతి సాధారణమైన కథనం మాత్రమే..ఒక కథను ఒక మామూలు వ్యక్తి చెప్పే తీరుకీ,ఒక సాహిత్యకారుడు చెప్పే తీరుకీ చాలా తేడా ఉంటుంది..ఉండాలి..ఇద్దరూ చెప్పే కథలో సారాంశం ఒక్కటే అయినప్పటికీ అతి మామూలు విషయాన్ని సైతం సాహిత్యకారుడు తన సృజనాత్మకత,భాషా సౌందర్యం,క్రాఫ్టింగ్ వంటి ఎస్తెటిక్స్ కలగలుపుతో 'ప్రెజెంటబుల్' గా (చదివించే గుణం) తయారుచేస్తాడు..అటువంటి ఎస్థెటిక్ సెన్స్ ఏమాత్రమూ లేని రచన ఇది..ఇక మీడియాలో ఈ కథను 'లోలిటా' తో పోల్చడం మరింత చోద్యంగా అనిపించింది..నైతిక విలువలకు సుదూరమైన 'లోలిటా' లాంటి ఒక సంక్లిష్టమైన కథను నబకోవ్ పాఠకులకు చెప్పి మెప్పించగలిగారంటే దానికి కారణం ఆయన లిరికల్ నేరేషన్ మాత్రమే..ఒకప్పుడు నేను సగం వరకూ చదివేసి వదిలేసిన నవల అది..తన అద్భుతమైన ప్రోజ్ తో,చక్కని భాషా సౌందర్యంతో దాన్ని ఒక క్లాసిక్ గా మలచడంలో సఫలీకృతులయ్యారు నబకోవ్..దీనికి విరుద్ధంగా కేట్ ఎలిజబెత్ రస్సెల్ లోలిటా కథను ఒక సాధారణమైన జర్నల్ లా,'మీ టూ' సాహిత్యంగా చూపించే ప్రయత్నం చేశారు..ఇది అచ్చంగా 2020 రచన అని చెప్పవచ్చు.

పఠనానుభవం దృష్ట్యా ఈ పుస్తకం చాలా నిరాశపరిచిన విషయాన్ని ప్రక్కన పెడితే,ఇది  చదువుతున్నంతసేపూ స్త్రీ,పురుష సంబంధాల మీద అనేక ఆలోచనలు రేకెత్తించింది..ఈ పుస్తకంలో కొన్ని నచ్చిన అంశాలు కూడా ఉన్నాయి..మొదట ఈ కథను బయాస్డ్ గా ఒక ఫెమినిస్టు సాహిత్యంగా చూపించే ప్రయత్నం రచయిత్రి చెయ్యలేదు..చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ అంశం ఆధారంగా రాసిన ఈ కథలో పదిహేనేళ్ళ వెనెస్సాను కూడా పూర్తి అమాయకురాలిగానో,బలహీనురాలిగానో చిత్రించకుండా ఈ కథను ఇద్దరు వ్యక్తుల బలహీనతల మధ్య జరిగిన సంఘర్షణల పర్యవసానంగా మాత్రమే చూపించారు..పీడోఫైల్ అయిన స్ట్రేన్ మొదట్నుంచీ వెనెస్సా కు కమిట్ట్మెంట్ ఇవ్వకుండా ఆమెను తన అవసరం తీర్చే వస్తువుగానే చూడడం,ఆ విషయాన్ని ఆమెకు స్పష్టంగా చెప్పడం ("a dozen lovers at twenty, a life in which he was one of many"),స్ట్రేన్ పట్ల వెనెస్సా కు పసితనంలో కలిగిన ఆకర్షణ క్రమేపీ బలపడి తనకు 32 ఏళ్ళొచ్చినా ఆమె అతణ్ణి మర్చిపోలేకపోవడం (వెనెస్సా ఒక సందర్భంలో టేలర్ కు సమాధానమిస్తూ స్ట్రేన్ ను సమర్ధించడం : “That’s not pedophilia,” I say. She stares at me agog. I clear my throat and say, carefully, “The more correct term is ephebophile.”) ,ప్రేమో ఆకర్షణో భేదం తెలీకుండా సెక్సువల్ అబ్యూజ్ ని అతడి కోసం అంగీకరించడం,ఇవన్నీ చూస్తే స్త్రీ ప్రేమ మనసుకి సంబంధించినదైతే,పురుషుడి ప్రేమ దేహానికి సంబంధించినదని తరచూ వినే ఒక జనరల్ స్టేట్మెంట్ నిజమేననిపిస్తుంది..మరో విషయమేంటంటే 'లోలిటా' లో హంబర్ట్ తన అనైతికతని 'ప్రేమ' పేరుతో సమర్ధించుకున్నట్లు స్ట్రేన్ సమర్ధించుకోడు,కానీ అలా అని తన బలహీనతకు బాధ్యత కూడా తీసుకున్నట్లు కనిపించడు..ఈ కథలో వెనెస్సా ఎదుర్కున్న దురదృష్టకరమైన పరిస్థితులకు స్వయానా వెనెస్సా తో సహా ఆమె చుట్టూ ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యులుగా కనిపిస్తారు..సెక్సువల్ అబ్యూజ్ విషయం బయటకు పొక్కితే స్కూల్ పరువు పోతుందనుకున్న స్కూల్ యాజమాన్యం,ఆమెను నిర్లక్ష్యం చేసిన తల్లితండ్రుల,స్ట్రేన్ ఇలా అందరూ బాధ్యులే అనిపిస్తుంది.

ఎప్పుడో స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మొదటిసారి యాష్ చోప్రా 'లమ్హే' చూశాను..ఆ తరువాత ఆ సినిమా లెక్కలేనన్నిసార్లు చూశాను..ఇప్పటికీ లమ్హే అంటే నాకు ప్రాణం..యాష్ చోప్రా ఆరోజుల్లోనే అటువంటి కాంట్రవర్షియల్ సబ్జెక్టును తీసుకుని ఎక్కడా వెగటు పుట్టకుండా ప్రేక్షకుల్ని కన్విన్స్ చేస్తూ కథను డీల్ చేసిన విధానం నాకు నబకోవ్ 'లోలిటా' ని గుర్తుకు తెస్తుంది..అలాగే బిగ్ బీ కెరీర్ లో అద్భుతమైన సినిమా ఏదంటే నేను తడుముకోకుండా RGV 'నిశ్శబ్ద్' అంటాను..ఈ సినిమా క్రెడిట్స్ వర్మకివ్వాలో,బిగ్ బీ కి ఇవ్వాలో ఇప్పటికీ అర్ధం కాదు..ప్రేమ,ఆకర్షణ లాంటివి మనం తయారుచేసుకున్న నైతికత,నాగరికత లాంటి చట్రాల్లో ఇమిడేవి కాదు..వివాహితుడైన బిగ్ బీ కి నిశ్శబ్ద్ లో తన కూతురు వయసున్న జియా ఖాన్ పట్ల ప్రేమ/ఆకర్షణ (?) లాంటివి కలగడం సభ్య సమాజం హర్షించలేని విషయం..కానీ మనకు నచ్చినా నచ్చకపోయినా అది నిజం..ఒక మనిషిగా ఆయన స్థానంలో ఆయన చాలా నిజాయితీగా కనిపిస్తారు,అలాగే సమాజం (భార్య రేవతి) కూడా దాని స్థానంలో అంతే నిజాయితీగా కనిపిస్తుంది..చాలా సార్లు మనం ఏర్పాటు చేసుకున్న సామజిక కట్టుబాట్లు మాత్రమే మనిషికీ మృగానీకీ మధ్య గీత గీస్తూ కంచుకోటలా నిలబడతాయి అనిపిస్తుంది..అన్ని సందర్భాల్లోనూ నిజాయితీగా ఉండలేకపోవడం,ఎప్పటికప్పుడు స్వచ్ఛమైన భావోద్వేగాలతో ఎగసిపడే మనసుని కొరడా ఝుళిపించి అదుపులో పెట్టుకోవడం లాంటివి కేవలం మనిషికే ఉన్న వరమేమో లేక శాపమేమో !!

పుస్తకం నుండి కొన్ని నచ్చిన వాక్యాలు,

I wanted nothing to do with boys my own age,their dandruff and acne, how cruel they could be, cutting girls up into features, rating our body parts on a scale of one to ten. I wasn’t made for them. I loved Strane’s middle-aged caution, his slow courtship. He compared my hair to the color of maple leaves, slipped poetry into my hands—Emily, Edna, Sylvia. He made me see myself as he did, a girl with the power to rise with red hair and eat him like air.He loved me so much that sometimes after I left his classroom, he lowered himself into my chair and rested his head against the seminar table, trying to breathe in what was left of me. All of that happened before we even kissed. He was careful with me. He tried so hard to be good.

Out of the ash         
I rise with my red
hair         
And I eat men like
air.

He’s so close I can smell him—coffee and chalk dust

The nine other students pack up their things and leave the classroom to carry on with their lives, to practices and rehearsals and club meetings. I leave the room, too, but I’m not part of them. They’re the same, but I’m changed. I’m unhuman now. Untethered.While they walk across campus,earthbound and ordinary, I soar, trailing a maple-red comet tail. I’m no longer myself; I am no one.I’m a red balloon caught in the boughs of a tree. I’m nothing at all.

Because even if I sometimes use the word abuse to describe certain things that were done to me, in someone else’s mouth the word turns ugly and absolute. It swallows up everything that happened. It swallows me and all the times I wanted it, begged for it. Like the laws that flatten all the sex I had with Strane before I turned eighteen into legal rape—are we supposed to believe that birthday is magic? It’s as arbitrary a marker as any. Doesn’t it make sense that some girls are ready sooner?

I forget sometimes exactly how old he is; I used to think the gap between us would shrink as I grew older, but it’s still as wide as it’s ever been.

“We’re born, we live, we die,” he says, “and the choices we make in the middle, all those things we agonize over day after day, none of those matter in the end.”

Mr. Strane says nothing about what I know would disgust the rest of them even more, that Virginia Clemm wasn’t just Poe’s cousin; she was thirteen years old. He has each of us read aloud a stanza from “Annabel Lee,” and my voice is unsteady as I say the lines “I was a child and she was a child.” Images of Lolita crowd my head and mix with the memory of Mr. Strane whispering, You and I are the same, as he stroked my knee.

Toward the end of the period, he tips back his head, closes his eyes, and recites the poem “Alone” from memory, his deep,drawn-out voice making the lines “I could not bring / My passions from a common spring” sound like a song. Listening to him, I want to cry. I see him so clearly now, understand how lonely it must be for him, wanting the wrong thing, the bad thing, while living in a world that would surely villainize him if it knew.

Come and be worshiped, come and be caressed,My dark Vanessa, crimson-barred, my blest            My Admirable butterfly! Explain How could you, in the gloam of Lilac Lane,Have let uncouth, hysterical John Shade Blubber your face, and ear, and shoulder blade? (Nabakov 'pale fire')

I’m starting to understand that the longer you get away with something, the more reckless you become, until it’s almost as if you want to get caught.

All interesting women had older lovers when they were young. It’s a rite of passage. You go in a girl and come out not quite a woman but closer,a girl more conscious of herself and her own power. Self-awareness is a good thing. It leads to confidence, knowing one’s place in the world.

“He was so in love with me, he used to sit in my chair after I left the classroom. He’d put his             face down on the table and try to breathe me in.” It’s a detail I’ve trotted out before, always meant as evidence of his uncontrollable love for me, but saying it now, I hear it as she does, as anyone would—deluded and deranged.

It’s just that I’m depraved, my mind so warped by Strane that I misinterpret innocent favoritism as sexual interest.

Friday, April 3, 2020

సైన్సు - సాహిత్యము

కెమిస్ట్రీ,ఫిజిక్స్,మాథ్స్ లాంటి సబ్జెక్టులు చిన్నప్పుడు స్కూల్లో విడివిడిగా నేర్చుకుంటాం..కానీ క్లాసులు పెరిగికొద్దీ ఇవన్నీ ఒకదానితో ఒకటి విడదీయలేనంతగా పెనవేసుకుంటాయి..ఎంతగా అంటే ఒక దశలో వీటిలో ఒక సబ్జెక్టు రాకుండా మరో సబ్జెక్టు చదవడం అసంభవం అన్నంతగా,ఇది అందరికీ తెలిసిన విషయమే..ఒకరకంగా సైన్సు,సాహిత్యం కూడా ఇంతేనేమో అనిపిస్తుంది..“Science and literature are not two things, but two sides of one thing.” అంటారు Thomas Henry Huxley..రెండిటి లక్ష్యమూ ప్రశ్నించడమే,సమాధానాలు వెతుక్కోవడమే,సృజనాత్మకతకు పదును పెడుతూ మానవమస్తిష్కపు పరిథుల్ని శోధించడమే.
Image Courtesy Google
మొన్న రిచర్డ్ ఫైన్మన్ ని చదువుతున్నప్పుడు ఆయన ఆర్ట్ కూ,సైన్స్ కూ ఉన్న సంబంధాన్ని విశ్లేషిస్తూ రాసిన కొన్ని పేజీలు నాలో అనేక ఆలోచనలకు తెరతీశాయి.."Facts are not science as Dictionary is not literature" అని Martin H.Fischer అంటారు..నేను కూడా ఈ రెండు విభాగాల్లోనూ సృజనాత్మకత పుష్కలంగా ఉంటుందని నమ్ముతాను..ఒక సైన్స్ స్టూడెంట్ గా ఈ మాట అథారిటేటివ్ గా అనగలిగే అర్హత నాకుందనే అనుకుంటున్నాను..మరి సాహిత్యానికీ సైన్స్ కీ తేడా లేదా అంటే,ఉంది..ఈ రెంటికీ భూమ్యాకాశాలంత వ్యత్యాసం ఉంది.. I think literature is pure 'human experience' where as science is mere 'execution of facts'..ఇమాజినేషన్ ఉందని చెప్పి మళ్ళీ ఫాక్ట్స్ అంటారేంటి అని మీరనే ముందే,Let me elaborate...'ఊహాత్మకత' ప్రధానంగా చూస్తే  సాహిత్యానికీ ,సాంకేతికతకూ తేడా ఉండదు గానీ,'అనుభూతి' ప్రధానంగా ఈ రెండూ ఉత్తరదక్షిణ ధృవాలు,రెంటినీ కలపడం వీలుపడదు.

సైన్సు స్పష్టమైన సమాధానాల కోసం వెతుకుతుంది,నిర్వచనాలిస్తుంది..నిర్వచించలేనిది నిజం కాదంటుంది..'To define is to limit' కాబట్టి సమాధానం దొరకగానే అక్కడో అడ్డుగోడ తయారవుతుంది..ఏదో ఒక బిందువు వద్ద దాని విస్తృతి ఆగిపోతుంది..ఒక పరిధి దాటాక స్పష్టమైన పరిమితులకు లోబడి వ్యవహరిస్తుంది..సైన్సు మనిషి దైనందిన జీవితంతో పాటుగా ప్రకృతిపై,సమస్త విశ్వంపై ప్రత్యక్షమైన ప్రభావం కలిగి సాధికారికంగా వ్యవహరిస్తుంది..నిర్ణయాధికారం ఎప్పుడూ తన చెప్పుచేతల్లో ఉండాలనుకుంటుంది..ఇక్కడ మనిషికి సాంకేతికత పర్యవసానాల్ని నిస్సహాయంగా అంగీకరించడం మినహా,స్వతంత్రంగా కంట్రోల్ తీసుకునే అవకాశం తక్కువ..సరిగ్గా ఇక్కడే సాహిత్యం అవసరం తెరమీదకొస్తుంది..సైన్స్ మనకు దైనందిన జీవితంలో విషయపరిజ్ఞానాన్ని అందిస్తే,సాహిత్యం ఆ పరిజ్ఞానాన్ని ఎలావాడాలో / ఎంతవరకూ వాడాలో / అసలు వాడాలో వాడకూడదో నిర్ణయించుకునే విచక్షణను నేర్పుతుంది..ఈ విచక్షణ తెలియని మనిషి చేతిలో సాంకేతిక పరిజ్ఞానం పిచ్చివాడి చేతిలో రాయి వంటిది.

కానీ (మంచి)సాహిత్యం దీనికి భిన్నంగా నిర్వచనాలకు దూరంగా వ్యవహరిస్తుంది..సాహిత్యానికి  స్పష్టమైన సమాధానాలు అవసరం లేదు,వెతకదు కూడా..ఎక్స్ప్లోర్ చెయ్యడమే పరమావధిగా ఉంటుంది..ఆలోచనలు రేకెత్తించే వరకే దాని పని..ప్రశ్నలు లేవనెత్తి సమాధానాల కోసం వెతికే పని పాఠకుడికి వదిలేస్తుంది..ఇక ఒక పుస్తకాన్ని ఎవరెలా చదివారన్నది పూర్తిగా ఆ పాఠకుని మీద ఆధారపడి ఉంటుంది,No two persons ever read the same book అని మనకు తెలిసిందే..ఇక్కడ అడ్డుగోడలుండవు..పరిమితులుండవు..సాంకేతికతను భిన్నంగా సాహిత్యం వాస్తవ జీవితంపై పరోక్షంగా ప్రభావాన్ని కలిగి ఉంటుంది..మానవ జీవితంలో స్వయంగా వేలు పెట్టకుండా,ఒక కెటలిస్ట్ లా పరోక్షంగా ఉంటూ మనిషి ఆలోచనల్ని షేప్ చేసుకునే దిక్సూచిగా,మంచి గురువుగా మాత్రమే వ్యవహరిస్తుంది..సైన్స్ లో ఇమాజినేషన్ ఆబ్జెక్టివ్ గా ఒక స్పష్టమైన లక్ష్యం దిశగా ప్రయాణిస్తుంది..కానీ సాహిత్యం సబ్జెక్టివ్ గా ఖచ్చితమైన లక్ష్యాలకు దూరంగా మానవీయ విలువల ఆధారంగా,అనుభూతి ప్రధానంగా వ్యవహరిస్తుంది.

సైన్స్ ను ఉపయోగించి ఒక పారిజాతాన్ని పోలిన ప్లాస్టిక్ పువ్వుని సృష్టించగలం..అలాగే ఆర్టిఫిషియల్ గా దాని సువాసన కూడా తయారుచెయ్యగలం..కానీ ఒక అసలుసిసలు నిజమైన  పారిజాతం మొక్కనుండి క్రిందకి రాలిపడిన పువ్వుల్ని నలిగిపోకుండా అపురూపంగా  దోసిళ్ళలోకి తీసుకుని ఆ సుగంధాన్ని ఆస్వాదించడం (Outworldly experience,Isn't it ?) : ఈ అనుభూతి/అనుభవం సాహిత్యం,చిత్రలేఖనం,సంగీతం,నృత్యం లాంటి కళారూపాలు మాత్రమే అందించగలవు,సైన్స్ వల్ల సాధ్యం కాదు..కీట్స్,వర్డ్స్వర్త్,ఫ్రాస్ట్,ఎమెన్ వంటి కవుల పదాల్లో గుప్పుమనే సన్ఫ్లవర్స్,డఫోడిల్స్,క్రిమ్సన్ రోజెస్ వంటి పువ్వుల గుభాళింపునీ,సౌందర్యాన్నీ స్వచ్ఛమైన మానవీయ అనుభవంగా మార్చడం ఏ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వల్ల సాధ్యమవుతుంది ?

ఇక సాహిత్యం అనేది ఒక పూర్తి స్థాయి కళారూపం..అది ఆస్వాదించి,ఆనందించడానికే గానీ అభ్యసించడానికి కాదు..'కళ' అంటే ప్రస్తుతం అమల్లోకి వస్తున్న ఆధునిక నిర్వచనాలను ప్రక్కన పెడితే కనీసం నా దృష్టిలో స్వచ్ఛమైన కళ పరమావధి 'విజ్ఞాన సముపార్జన' ఎంతమాత్రం కాదు..ఇక సాహితీ ద్రష్టలందరూ తెలివైనవారా అంటే,ఉహూ కాదు..వైల్డ్ అనుకుంటా అంటారు,'All art is immoral and imperfect' అని..మరికొంతమంది ఇంకాస్త ముందుకి వెళ్ళి 'insane' అని మరో పదం కూడా జోడిస్తారు..రేషనాలిటీ/లాజిక్/ప్రాక్టీకాలిటీ లాంటి ఆధునికపదాలకు దూరంగా వ్యవహరించేదే నిజమైన ఆర్ట్..ఇది అభ్యసిస్తే అబ్బేది కాదు..మరి సాహిత్యాన్ని కూడా అభ్యసిస్తారు కదా అంటే,సైన్స్ చదివిన వారందరూ సైంటిస్టులు కానట్టే సాహిత్యాన్నిఅభ్యసించే వారందరూ సాహిత్యకారులూ కాలేరు..సృజన,ఆస్వాదన,అభ్యాసం ఇవన్నీ పరస్పర విరుద్ధమైన అంశాలు..ఏ రెంటినీ కలపడం వీలుపడదు.

ఎక్కడైనా చదివానో,లేక ఎవరైనా అన్నారో స్పష్టంగా గుర్తులేదు గానీ,ఎప్పుడూ మానవ మేథస్సు (సైన్స్/knowledge ) చేరుకోగలిగే స్థానంనుండి సాహిత్యం(Wisdom /వివేకం) కేవలం రెండంగుళాల దూరమేనట..అలాగే సాహిత్యం చేరగలిగే స్థానంనుండి ఆధ్యాత్మికత (Spirituality/ఆత్మ సాక్షత్కారం) మరో రెండంగుళాల దూరమేనట.

చివరగా,Charles Baudelaire అంటారు "Any literature that refuses to step in line with science and philosophy, is homicidal and suicidal literature" అని..మనిషి సౌకర్యవంతంగా,నాగరికంగా జీవించడానికి సాంకేతికత ఎంత అవసరమో,మనఃశాంతి,వివేకం,విచక్షణలతో జీవించడనికి సాహిత్యంలాంటి కళారూపాలు కూడా అంతే అవసరం..ఈ సమతౌల్యం దెబ్బతిన్నప్పుడు మానవజీవితం నరక ప్రాయమవుతుంది..పూర్తిగా మెటీరియలిస్టిక్ గా మారిపోయిన మనిషి తన ప్రాముఖ్యతల్ని విస్మరించి వ్యవహరించినప్పుడు,ఇప్పటిలా కంటికి కనిపించని శత్రువుతో పోరాడుతూ నిస్సహాయంగా ఏదైనా మిరాకల్ కోసం ఎదురుచూపులు చూసే దుర్గతి ఎదురవుతుంది..చివరకు ఓటమినెరగని మానవ మేథస్సు కూడా వేరే గత్యంతరం లేక 'అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ' అనుకోవాల్సొస్తుంది.