వాస్తవ జీవితంలో సవాలక్ష డిస్ట్రాక్షన్స్ మధ్య ఈ ఫాబర్ సిరీస్ స్టోరీస్ చదువును గాడితప్పకుండా ఒక ట్రాక్ మీద నడిపిస్తున్నాయి..వీటి పుణ్యమా అని 'రీడింగ్ బ్లాక్' నుండి బయటపడ్డాను..సైన్స్ ఫిక్షన్ నవలలకూ,కథలకూ ఖ్యాతి గడించిన బ్రిటన్ రచయిత బ్రియాన్ ఆల్డిస్ రాసిన మూడు కథల్ని ఫాబర్ 90 వ పుట్టినరోజు సందర్భంగా ఫాబర్ ప్రచురణ సంస్థ 'Three types of solitude' పేరుతో ప్రచురించారు..ఈ రచయిత పేరు ఉర్సులా లెగైన్ ప్రస్తావనలో తొలిసారి విన్నాను..ఒకప్పుడు బ్రియాన్ ఆల్డిస్ సంపాదకునిగా ఒక్క స్త్రీ రచయిత కూడా లేకుండా ప్రచురించిన ఒక సైన్స్ ఫిక్షన్ ఆంథాలజీకి స్తుతివాక్యం రాయమని సంబంధిత ప్రచురణ సంస్థవారు ఉర్సులాను కోరారట..అసలే ఈ వివక్షపై ఆగ్రహంతో ఉన్న ఆవిడ ఆ విషయాన్ని కుండబద్దలుకొడుతూ "Gentlemen I just don't belong here" అంటూ ఒక ఉత్తరం రాసి వారి మొహాన కొట్టారట..ఆనాటికే సైన్స్ ఫిక్షన్ గ్రాండ్మాస్టర్ గా ఖ్యాతి గడించిన బ్రియాన్ ఆల్డిస్ తప్పిదానికి అది సరైన జవాబేననిపించింది..కానీ ఇటువంటి 'ప్రీ కన్సీవ్డ్ నోషన్స్' అన్నీ ప్రక్కన పెట్టి ఈయన్ని చదివితే ఆల్డిస్ రచనలు అన్ని వాదాలకూ అతీతమైనవిగా కనిపించాయి.
ఇక కథల విషయానికొస్తే ఇందులో మొత్తం మూడు కథలున్నాయి..మొదటి కథ
'Happiness In Reverse' లో జడ్జి Beauregard Peach ఒంటరితనంతో బాధపడుతూ,తనను వదిలి కూతుర్ని వెంటతీసుకుని వెళ్ళిపోయిన భార్యకి Gertrude కి ఉత్తరం రాస్తాడు..ఆ ఉత్తరంలో తన కోర్టులో విచారణకు వచ్చిన ఒక కేసు గురించి ఆమెకు వివరిస్తుంటాడు..ఆమెను ఎలా అయినా తన దగ్గరకు తిరిగి రప్పించుకోవాలనే ప్రయత్నంలో ఆ కేసు రూపేణా ఉత్తరంలో ఒక కల్పిత కథనల్లుతాడు..ఆ కథలో ఒక Donald Maudsley అనే యువకుడు భూగర్భశాస్త్రంలో పట్టాపుచ్చుకున్న తర్వాత జనారణ్యానికి దూరంగా దక్షిణమెరికాలోని కారడవుల్లోకి వెళ్ళిపోతాడు..మనుష్య సంచారంలేని ఆ అడవిలో ఒంటరితనం భరించలేక అతడొక చెట్టు కొయ్యబొమ్మను తయారుచేసి దానిని మనిషిగా భావిస్తూ దానితో సంభాషిస్తూ ఉంటాడు..ఇద్దరికీ ఇష్టమైన 'మొరాలిటీ' అనే అంశం మీద తరచూ చర్చలు జరుగుతుంటాయి..ఒక సందర్భంలో ఆ కొయ్యబొమ్మ దుఖ్ఖముగా ఉన్న మాడ్స్లే ని చూసి "మీ మనుషుల్లో ఈ దుఃఖానికి కారణహేతువు ఏంటని" ప్రశ్నిస్తుంది..అప్పుడు మాడ్స్లే "ఈ దుఖ్ఖమనేది సంతోషానికి వ్యతిరేకపదం,దీనినుండి మానవజాతికి విముక్తి లేదు" అంటాడు..దానికి కొయ్యబొమ్మ ‘I’m only your echo,when all’s said and done' అనడంతో మాడ్స్లే ఆలోచనలో పడతాడు..అతడికి బహుశా జీవితమంతా తన ప్రతిధ్వనినే వింటున్నాడని అర్ధమవుతుంది...."and that his morality, on which he had once prided himself, was merely a refusal to permit other people into his life." అని గ్రహించి ఇంటికి తిరుగుముఖం పడతాడు మాడ్స్లే..కానీ తిరిగొచ్చిన మాడ్స్లే మీద చట్టపరమైన కేసు నమోదవుతుంది..అతడి నిర్లక్ష్యం కారణంగా అడవంతా కొయ్యబొమ్మల జనాభా పెరిగిపోయి అడవులన్నీ నాశనమైపోతుంటాయి..మానవ సమాజంలో చాపక్రింద నీరులా పెరిగిపోతున్న ఒంటరితనాన్ని సూచించడానికి కొయ్యబొమ్మల్ని మెటాఫోర్ గా వాడతారు రచయిత..జడ్జ్ భార్యకి రాస్తున్న ఉత్తరంలో ఈ కథకి ముగింపునిస్తూ "Of course I feel lonely without you, otherwise I would not waste my time inventing fables." అంటూ భార్యను ఆక్స్ఫర్డ్ కి తిరిగిరమ్మని ప్రాధేయపడతాడు..ఈ కథ మరుగున పడుతున్న మానవసంబంధాలు ఆవశ్యకతను,అనేక సందర్భాల్లో మోరల్ జడ్జిమెంట్స్ చేసే హానినీ గుర్తుచేస్తుంది.
రెండో కథ A Single-Minded Artist లో కళ అంటే ఇతరుల ముందు ప్రదర్శనకు పెట్టే అంశం కాదని ఋజువుచేస్తూ ఒక ఆర్టిస్టు జీవితాన్ని ఉదహరిస్తారు..కళను ఆత్మసాక్షాత్కారానికి సాధనంగా మాత్రమే చూడాలని సున్నితంగా గుర్తు చేస్తుందీ కథ..మూడు కథల్లో నాకు బాగా నచ్చిన కథ ఇది..ఇక మూడో కథ Talking Cubes సివిల్ వార్ నేపథ్యంలో కూర్చిన ఈ కథలో యుద్ధానికి పూర్వం ఇద్దరు ప్రేమికులు వైరి పక్షాల్లో చెరో దేశానికీ చెందినవారవడంతో యుద్ధం ముగిశాక విడిపోతారు..యుద్ధానంతరం చాలా ఏళ్ళ తరువాత మళ్ళీ కలుసుకున్నప్పుడు వారిరువురూ ఒక జత 'టాకింగ్ క్యూబ్స్' ద్వారా తమ మనసులోని మాటలను ఒకరికొకరు చెప్పుకుంటారు..సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్ అంటూ ఏదీ లేని అతి మామూలు ప్రేమ కథను ఈ పుస్తకంలో చేర్చడం వెనుక ఉద్దేశ్యం ఏమిటో అర్ధం కాలేదు..బహుశా ఈ పుస్తకం టైటిల్ ను జస్టిఫై చెయ్యడానికి ఈ కథను కలిపి ఉండవచ్చనిపించింది..ఈ టైటిల్ లో చెప్పినట్లు మూడు రకాల ఏకాంతాలను ఈ మూడు కథలూ ప్రతిబింబిస్తాయి..కానీ ఈ కథల్లో ఏకాంతానికి పర్యాయపదంలా ఒంటరితనం కూడా నర్మగర్భంగా ధ్వనిస్తుంది..ఈ ఏకాంతానికి మొదటి కథలో నైతికతనూ,రెండో కథలో కళ యొక్క ప్రయోజనాన్నీ కారణంగా చూపిస్తే మూడో కథలో వాస్తవికతను ప్రతిబింబిస్తూ ఇద్దరు ప్రేమికుల వియోగాన్ని కారణంగా చూపెడతారు..ఆల్డిస్ కథల్ని భావప్రధానంగా గాకుండా శైలి ప్రధానంగా చదివితే ఎక్కువ ఆకట్టుకుంటాయి..ఆయన కథల్ని క్రాఫ్టింగ్ కోసం చదవాలి,అదే వీటిలో ప్రధానాకర్షణ.
పుస్తకం నుండి కొన్ని వాక్యాలు,
When he had produced his hundredth canvas, she kissed him tenderly, suggesting he gave up. ‘You’ll never be a success…’
But Arthur Scunnersman was just beginning to enjoy himself.
As I made my way downstairs - the lifts were not working - I thought, the war is
over now. Like my youth.
I had not stayed for the coffee to arrive. Sushia remained in her room with the
old cubes, old words, old emotions.
Image Courtesy Google |

No comments:
Post a Comment