Sunday, January 27, 2019

Six Memos for the Next Millennium - Italo Calvino

1985 లో నూతన సహస్రాబ్దికి కేవలం 15 ఏళ్ళ దూరంలో ఉన్న తరుణంలో నోబెల్ గ్రహీత ఇటాలో కాల్వినో,రాబోయే కాలంలో సాహిత్య రంగంలో చోటు చేసుకోబోయే అనూహ్యమైన మార్పుల్ని అంచనావేస్తూ,సాహిత్యంలో ఉరకలేస్తున్న కొత్తనీరు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా స్థిరంగా ప్రవహించడానికి వీలుగా ఏర్పాటు చేసిన పాయలు ఈ 'Six Memos for the Next Millennium' లో ముందు తరాల రచయితలకు తన అనుభవసారాన్నంతా రంగరించి విలువైన సూచనలిచ్చారు..1985లో హార్వర్డులో 'చార్లెస్ ఇలియట్ నోర్టన్ లెక్చర్స్' కోసమని ఇటాలో కాల్వినో రాసుకున్న ఈ వ్యాసాల్ని పూర్తి చెయ్యకుండానే పరమపదించారు..ఈ లెక్చర్లను Lightness,Quickness,Exactitude,Visibility ,Multiplicity,Consistency అంటూ ఆరు భాగాలుగా విభజించినప్పటికీ,ఆరో భాగం (Consistency) రాయకుండానే కాల్వినో స్వర్గస్తులయ్యారట.
Image Courtesy Google 

ఇటాలో కాల్వినోని చదివిన వారెవరికైనా ఆయన కథనం పక్షి ఈకంత తేలిగ్గా ఉంటుని తెలిసిన విషయమే..సంక్లిష్టమైన కథా వస్తువుని కూడా అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు చెప్పగల సరళమైన శైలి కాల్వినోది..అలా అని తన శైలికి పూర్తి భిన్నమైన భారమైన కథనాన్ని తక్కువ చేసే ఉద్దేశ్యం లేదంటూనే కథ చెప్పడంలో తాననుసరించే సరళమైన శైలిని 'Lightness' విభాగంలో వివరిస్తారు..సో కాల్డ్ 'పోస్ట్ ఇండస్ట్రియల్ ఎరా ఆఫ్ టెక్నాలజీ' నూతన సహస్రాబ్దిలో సాహిత్యంపై ఎటువంటి ప్రభావం చూపించబోతోందో అని అంచనాలు వేసే ఆసక్తి తనకి లేదని చెప్తూ,సాహిత్యం మాత్రమే అందించగలిగే చైతన్యం ఒకటుంటుందనీ,తాను నమ్మిన కొన్ని సాహితీ విలువల్నీ,లక్షణాల్నీ ఈ లెక్చర్ల ద్వారా నూతన సహస్రాబ్దికి అన్వయించి చూసే ప్రయత్నం చేస్తున్నానంటారు.

తన శైలిలో ప్రధానాంశమైన 'Lightness' ను గురించి రాస్తూ గ్రీకు పురాణాల్లోని Perseus మరియు Medusa కథను ఉదహస్తారు..కాలక్రమేణా సృజనాత్మకత లోపిస్తున్న ప్రపంచం మెడూసా దృష్టి సోకినట్లు శిలారూపాన్ని పొందుతోందన్న ఆందోళనను వ్యక్తం చేస్తూ,పెర్సియస్ మెడూసాను ఎలా హతమార్చాడో వివరిస్తారు..మెడూసాను చూసిన వారెవరైనా మరుక్షణంలో శిలలా మారిపోతారు గనుక ఆమెను చంపడానికి పెర్సియస్ ఆమె ముఖాన్ని ప్రత్యక్షంగా చూడకుండా,తన కాంస్య లోహపు డాలులో ఆమె ప్రతిబింబాన్ని చూసి ఆమె తల నరుకుతాడు..ఇక్కడ భయంకరమైన రాక్షసి మెడూసాను హతమార్చినప్పుడు పెర్సియస్ చాలా తేలికపాటి మాధ్యమాలైన వాయుమేఘాల్ని ఉపయోగించుకుంటాడు,తన దృష్టిని అద్దంలో చిక్కుకున్న ఆమె ప్రతిబింబంపై కేంద్రీకరిస్తాడు..ఈ కథని ఒక కవికి ప్రపంచంతో ఉన్న సంబంధంగా చూస్తారు కాల్వినో..
రచయితలు ఈ కథలో గమనించవలసిన విషయాలు :
* మెడూసా ఒక వాస్తవమనుకుంటే కవి వాస్తవంనుండి ముఖం తిప్పుకోకుండా దాన్ని పెర్సియస్ లా పరోక్షంగా చూడాలి(ప్రతిబింబాన్ని చూసినట్లు).
* మరో విషయం ఏంటంటే మెడూసా రక్తం లోనుండి,ఒక రెక్కల గుఱ్ఱం పెగాసస్ జన్మిస్తుంది (the heaviness of stone is transformed into its opposite.). దాన్ని పెర్సియస్ సొంతం చేసుకుంటాడు..గ్రీకు పురాణాల్లో 'పెగాసస్' ప్రత్యేకత ఏంటంటే అది భూమ్మీద ఎక్కడ తన డెక్కను మోపుతుందో అక్కడ ఉద్భవించే నీటిబుగ్గలనుండి ఆర్టిస్టులకు ప్రేరణనిచ్చే 'మ్యూజ్' పుడుతుంది.
* పెర్సియస్ మెడూసా తలను తనతో పాటే ఒక సంచిలో ఉంచుకుని శత్రువులతో పోరాడుతున్నప్పుడు అత్యవసర సమయంలో ఆయుధంగా ఉపయోగిస్తాడు..
Perseus's strength always lies in a refusal to look directly, but not in a refusal of the reality in which he is fated to live; he carries the reality with him and accepts it as his particular burden.

పెర్సియస్ భయంకరమైన మెడూసాను అధీనంలో ఉంచుకున్నట్లు కవి కూడా భారమైన భౌతిక ప్రపంచపు ప్రభావానికి లోనై సృజనాత్మకత కోల్పోకుండా (శిలగా మారకుండా),దాన్ని నిరంతరం అదుపులో ఉంచుకోవాలని కాల్వినో అంటారు..
Were I to choose an auspicious image for the new millennium, I would choose that one: the sudden agile leap of the poet-philosopher who raises himself above the weight of the world, showing that with all his gravity he has the secret of lightness, and that what many consider to be the vitality of the times— noisy, aggressive, revving and roaring—belongs to the realm of death, like a cemetery for rusty old cars.

మరో అంశం 'Quickness' విషయానికొస్తే,కాల్వినో తన కథల్లో స్పష్టత ప్రధానంగా పదాలను చాలా పొదుపుగా వాడతారు..ఒక్క అనవసరమైన సన్నివేశం గానీ,సందర్భం గానీ ఆయన కథల్లో కనపడవు..పేజీలు పేజీలు నింపే వివరణాత్మక రచనల్ని తక్కువ చేసే ఉద్దేశ్యం లేదంటూనే పదాల నిడివి తక్కువ ఉండటంలో ఆవశ్యకతని వివరిస్తారు..హేతువాద దృష్టితో చూడని జానపద కథల్లో ఈ పదాలు పొదుపు గురించి వ్రాస్తారు..కార్ల్ జంగ్ 'Alchemical symbolism' స్టడీస్ లోని  గ్రహస్థితుల్ని ఆధారంగా చేసుకుని రచయితల మనస్తత్వాల్నీ/శైలుల్ని అంచనా వేసే ప్రయత్నం చేశారు..ఆర్టిస్టులకు సరిపడే మెర్క్యూరీ,శాటర్న్ లక్షణాల్ని గురించి చెప్తూ, స్వేచ్ఛ,చురుకుతనం,సూక్ష్మ బుద్ధి,అనువర్తన యోగ్యమైన (adaptable) లక్షణాలు కలిగిన మెర్క్యూరీనీ ఒంటరితనం,విచారం,ఆలోచనాత్మకతలు కలబోసుకున్న 'శాటర్న్' నూ పోల్చుతూ చేసిన విశ్లేషణ అద్భుతంగా ఉంది.

Certainly my own character corresponds to the traditional features of the guild to which I belong. I too have always been saturnine, whatever other masks I have attempted to wear. My cult of Mercury is perhaps merely an aspiration, what I would like to be. I am a Saturn who dreams of being a Mercury, and everything I write reflects these two impulses.

Since in each of my lectures I have set myself the task of recommending to the next millennium a particular value close to my heart, the value I want to recommend today is precisely this: In an age when other fantastically speedy, widespread media are triumphing, and running the risk of flattening all communication onto a single, homogeneous surface, the function of literature is communication between things that are different simply because they are different, not blunting but even sharpening the differences between them, following the true bent of written language.

సాహిత్యంలో అశ్వాన్ని వేగానికి చిహ్నంగా భావిస్తారు..దీని ఆధారంగా కాల్వినో,నవలను ఒక అశ్వంతో పోలుస్తారు..కథ నడిచే 'పేస్' కథనాన్ని రక్తికట్టించాడనికి చాలా ముఖ్యమైన అంశమని అంటారు..చిన్న కథల్ని రాయడంలో బోర్హెస్ శైలిని కొనియాడడంతో పాటు పాల్ వలెరీ,Francis Ponge లాంటి వారి రచనల్ని ఉదహరించారు.
In any case, a story is an operation carried out on the length of time involved, an enchantment that acts on the passing of time, either contracting or dilating it. Sicilian storytellers use the formula “lu cuntu nun metti tempu” (time takes no time in a story) when they want to leave out links or indicate gaps of months or even years. The technique of oral narration in the popular tradition follows functional criteria. It leaves out unnecessary details but stresses repetition:

In my last talk, on lightness, I quoted Lucretius, who in the combinatoria of the alphabet saw a model of the impalpable atomic structure of matter. Now I quote Galileo who, in the combinatoria of the alphabet (“the various arrangements of twenty little characters on a page”), saw the ultimate instrument of communication.

మూడో అంశం Exactitude :
ఇందులో రచయిత చెప్పాలనుకున్న అంశంపై స్పష్టత అవసరమనీ,వ్యక్తీకరణలో భాష మీద పట్టు చాలా అవసరమనీ అంటారు..రచయితలు భాషను అతి సాధారణంగా,నిర్లక్ష్యంగా,ఇష్టం వచ్చినట్లు ఉపయోగిస్తున్నారని అంటూ,ఈ విషయంలో రచయితల వైఫల్యాలను ఎత్తిచూపారు..
Why do I feel the need to defend values that many people might take to be perfectly obvious? I think that my first impulse arises from a hypersensitivity or allergy. It seems to me that language is always used in a random, approximate, careless manner, and this distresses me unbearably. Please don't think that my reaction is the result of intolerance toward my neighbor: the worst discomfort of all comes from hearing myself speak. That's why I try to talk as little as possible. If I prefer writing, it is because I can revise each sentence until I reach the point where—if not exactly satisfied with my wordswords—I am able at least to eliminate those reasons for dissatisfaction that I can put a finger on. Literature—and I mean the literature that matches up to these requirements—is the Promised Land in which language becomes what it really ought to be.

భాషతో పాటు మాస్ మీడియా కూడా నిరంతరం వెదజల్లే విజువల్ ఇమేజెస్ మెదడులో ఒకదానిపై ఒకటి పేరుకుపోయి,తుదకు అసౌకర్యం తప్ప ఏ చిన్న అనుభూతీ మిగల్చుకుండానే అదృశ్యమైపోతాయి అంటారు..
Italian is the only language in which the word vago (vague) also means “lovely, attractive.” Starting out from the original meaning of “wandering,” the word vago still carries an idea of movement and mutability, which in Italian is associated both with uncertainty and indefi-niteness and with gracefulness and pleasure.

స్ఫటికాన్నీ,అగ్నినీ రచయితల శైలికి చిహ్నాలుగా చూస్తూ అగ్నిలా ఎగిసిపడుతూ మండటం ఎంత అవసరమో,స్ఫటికపు పదునూ,పరిధుల్ని గమనిస్తూ రాయడంలో స్పష్టత (exactitude) కలిగివుండటం కూడా అంతే అవసరమంటారు..
The emblem of the crystal might be used to distinguish a whole constellation of poets and writers, very different from one another, such as Paul Valery in France, Wallace Stevens in the United States, Gottfried Benn in Germany, Fernando Pessoa in Portugal, Ramon Gomez de la Serna in Spain, Massimo Bontempelli in Italy, and Jorge Luis Borges in Argentina.

పదాలను కొంతమంది నైరూప్యమైన సృష్టి రహస్యాన్ని ఛేదించడానికి ఒక మాధ్యమంగా మాత్రమే చూస్తారు..అంటే పదాల వెంబడి ప్రయాణిస్తూ ఒక నిర్దిష్టమైన గమ్యం చేరాలనుకుంటారు..కానీ పదాలు ప్రపంచాన్ని ఉన్నదున్నట్లు ప్రతిబింబిస్తాయి గానీ గమ్యాన్ని చేర్చలేవు..
Hoff-mannsthal ఒక చోట అంటారట “Depth is hidden. Where? On the surface.” అని.
Wittgenstein మరికాస్త ముందుకెళ్ళి అన్నారటా,“For what is hidden … is of no interest to us. అని :) :)

Visibility :
టెక్నాలజీ,మీడియా సాహిత్యానికి చేస్తున్న కీడుని ప్రత్యేకించి ఇందులో ప్రస్తావించారు కాల్వినో ..విజువల్ మీడియా లేని కాలంలో జన్మించడం తనలాంటి వారికి వరంగా పరిణమించిందని అంటూ,3 నుండి 13 ఏళ్ళ లోపే ఆర్టిస్టుకు అవసరమైన ఊహాత్మకత ప్రాణం పోసుకుంటుందంటారు..కాల్వినో తల్లి ఆయన కోసం కొని బైండ్ చేసి ఉంచిన కామిక్స్ ను 3 నుండి 6 ఏళ్ళ లోపు వయసులో తాను చదవడం,పదాలు లేని చిత్రాలను చూస్తూ కథను ఊహించుకునే దిశగా 'స్కూలింగ్' లాంటిదంటారు.
నిత్యం టీవీలూ,కంప్యూటర్లూ, సినిమాలూ వెదజల్లే 'prefabricated images' మెదడులో ఒకదానిపై ఒకటి పేరుకుపోయి ఆలోచననూ,సృజనాత్మకతను నాశనం చేస్తున్నాయి..విజువల్ మీడియా బారినపడి సృజనాత్మకత అంతరించిపోతున్న నేటి తరంలో,సాహిత్యంలో మెదడుకి మేత లాంటి 'ఫెంటాస్టిక్' శైలి 21 వ శతాబ్దంలో సాధ్యమా అని ప్రశ్నిస్తారు.

Multiplicity :
రెండేళ్ళ క్రితం ఎప్పుడో కార్లో ఎమిలియో గడ్డా ను చదవడానికి ప్రయత్నించినప్పుడు ఆయన్ను అర్ధం చేసుకోవడం నా వల్ల కాలేదు..ఆ స్థాయి సాహిత్యం అర్ధం కావడానికి మరికాస్త సమయం పడుతుందేమో అని నిరాశగానే పుస్తకం ప్రక్కన పెట్టేశాను..కానీ ఈ పుస్తకంలో కాల్వినో గడ్డా శైలిని గూర్చి చెప్పిన విషయాలు విన్నాకా హమ్మయ్య అనుకున్నాను..ఆయన శైలి అతి సంక్లిష్టం అట,ఇటాలియన్ లో చదివినా కూడా అంత సులువుగా కొరుకుడు పడేది కాదని అంటారు కాల్వినో.
'Multiplicity' అనే అంశం గురించి చర్చిస్తూ రాబర్ట్ ముసిల్ నూ,గడ్డా నూ పోల్చిన విధానం బావుంటుంది..విచారగ్రస్తుడైన గడ్డా శైలి సంక్లిష్టతల మధ్య చిక్కుకుని అంతంలేని వివరణాత్మక విశ్లేషణల్లో కొట్టుకుపోవడం అయితే,ముసిల్ శైలి ఏ విషయంతోను సంబంధం లేకుండా ఉంటూ,అన్ని అంశాల్లోనూ స్పష్టత ఉన్నట్లు ఉంటుందని అంటారు..కానీ ఈ ఇద్దరి విషయంలో ఉమ్మడిగా కనిపించే విషయమేంటంటే 'అంతాన్ని చేరుకోవడంలో వైఫల్యం'...అలాగే ప్రౌస్ట్ గురించి రాస్తూ మనం అందుకోలేని విధంగా ప్రపంచం మన అంచనాల్ని దాటి నిరంతరం విస్తరిస్తూనే ఉంటుంది,and knowledge, for Proust, is attained by suffering this intangibility అంటారు..

Another very wrong idea that is also going the rounds at the moment is the equivalence that has been established between inspiration, exploration of the subconscious, and liberation, between chance, automatism, and freedom. Now this sort of inspiration, which consists in blindly obeying every impulse, is in fact slavery. The classical author who wrote his tragedy observing a certain number of known rules is freer than the poet who writes down whatever comes into his head and is slave to other rules of which he knows nothing.- Raymond Quineau.

మనసులోకి వచ్చింది వచ్చినట్లు రాయడం గురించి రాస్తూ,రచయిత మనసులో చెలరేగే ప్రతి అలజడికీ బానిసలా వ్యవహరించడం సరికాదంటారు..మరో చోట ప్రేరణ కలిగించే భావాల్ని ఒకదానితోనొకటి గుణిస్తూ పోతుంటే ఒక దశలో ఆ చిక్కుముడుల్లో రచయిత తన సహజసిద్ధమైన 'సెల్ఫ్' ని కోల్పోతాడేమో అని అనేవారికి సమాధానమిస్తూ,
But I would answer: Who are we, who is each one of us, if not a combinatoria of experiences, information, books we have read, things imagined? Each life is an encyclopedia, a library, an inventory of objects, a series of styles, and everything can be constantly shuffled and reordered in every way conceivable. అంటారు..

చివరగా ఒక చిన్న విషయం చెప్పి ఈ వ్యాసం ముగిస్తాను..ఒకానొకప్పుడు వంట నేర్చుకోవాలంటే వండడం తెలిసిన వారి దగ్గరో,లేదా వంటల పుస్తకాలు చదివో,గూగుల్ ని ఆశ్రయించో నేర్చుకునేవారు..ఉప్పూ,కారం,పులుపూ లాంటివి ముందుగా ఆ రంగంలో నిపుణుల్ని అనుసరించి కాస్త అటుఇటుగా అంచనాతో వేసినా చివర్లో తన రుచిమేరకు మరో పదార్ధమేదో కలిపితే మంచి వంటకం తయారవుతుంది..అలా చెయ్యగా చెయ్యగా కొంత కాలానికి వంట చెయ్యడంలో తన స్వంత మార్కు ఏర్పడుతుంది..ఏదైనా విషయంలో నైపుణ్యం సాధించాలనుకుంటే ఉన్న అవకాశాల్ని explore చెయ్యడం అవసరం..అలా కాదు,ఏ కళైనా ఒకరు నేర్పితే అబ్బేది కాదు మేము 'ప్రాడిజీలం',ఇవన్నీ పాతచింతకాయ వ్యవహారం అంటారా! అయితే మ్యాగీ,శాండ్విచ్ లాంటివి చాలా సులభంగా తయారవుతాయి. :) 

No comments:

Post a Comment