Friday, January 4, 2019

The Toughest Indian in the World - Sherman Alexie

ఒకవైపు మూలాల్ని భద్రంగా పొదివిపట్టుకుంటూ మరోవైపు ఆధునీకరణను అందిపుచ్చుకునే ఏ  సమాజానికైనా,ఏ జాతికైనా ఆ పరిణామక్రమంలోని సంధికాలం చాలా కీలకమైనది..ప్రపంచీకరణ అన్ని జాతుల్నీ,మనుషుల్నీ ఒకే చూరు క్రిందకి తెస్తూ తన పని తాను చేసుకుపోతున్నా కూడా,కాలగతికి ఎదురీదైనా సరే తమ సంస్కృతిని అంతరించిపోకుండా కాపాడుకోవాలనే వెఱ్ఱి తపన,మూలాలతో పెనవేసుకుని జీవిస్తూ,మట్టి వాసనతో కూడా తన అనుబంధాన్ని నెమరువేసుకునే ప్రతి సగటు మనిషిలోనూ కనిపిస్తుంది..అటువంటి ఒక సంస్కృతి నేటివ్ అమెరికన్లది..వీరిని అమెరికన్ ఇండియన్లు అని కూడా అంటారు..మళ్ళీ ఇందులో కూడా స్పోకేన్,అపాచీ వంటి పలు తెగలుంటాయి..ఈ తెగలు 'రిజర్వేషన్స్' లో సమూహాలుగా నివసిస్తారు..Spokane-Coeur d'Alene తెగకు చెందిన అమెరికన్ రచయిత షెర్మాన్ అలెక్సీ రాసిన 'The Toughest Indian In The World' 2000 వ సంవత్సరంలో ప్రచురించబడింది.
Image Courtesy Google
షెర్మాన్ అలెక్సీ కథలు స్పోకేన్ (Spokane) ఇండియన్ తెగకు చెందిన నేటివ్ అమెరికన్ల జీవన విధానాలకూ,అంతఃసంఘర్షణలకూ అద్దం పట్టేవిగా ఉంటాయి..ఆయన రాసిన The Absolutely True Diary of a Part-Time Indian ని చదివి ఆరేళ్ళు పైగానే అయ్యింది..అయినా
"Well, life is a constant struggle between being an individual and being a member of the community." అని అందులో గోర్డీ అన్నమాటలు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాయి..ఇందులో కూడా అలెక్సీ కథలన్నీ గోర్డీ అన్న ఆ మాటల పునాదుల మీద నిలబెట్టినవే..ఈ కథలన్నీ రిజర్వేషన్ లలో నేటివ్ అమెరికన్ వ్యవస్థలో నుండి వచ్చి,ఆధునికీకరణలో భాగంగా కొత్త ప్రపంచంలో తమ ఉనికిని చాటుకునే క్రమంలో ఎదురైన సంఘర్షణల నేపథ్యం నుండి పుట్టుకొచ్చాయి..ఇందులో ఇండియన్ల పాత్రల్లో తెల్లజాతీయుల చేతిలో జాతి వివక్షకు గురై,దుర్భరమైన జీవితాల్లోంచి వచ్చినా కూడా,దొరికిన చిన్న చిన్న అవకాశాల్ని అందిపుచ్చుకుని సమాజంలో తమ ఉనికిని చాటుకోవాలనే తపన కనిపిస్తుంది..ఇందులో మొత్తం తొమ్మిది కథలున్నాయి.

మొదటి కథ Assimilation జాత్యాంతర వివాహాల నేపథ్యంలో నేటివ్ అమెరికన్ల,తెల్లజాతీయుల వ్యవస్థల్లో మారిన సమీకరణాలపై దృష్టిసారిస్తుంది..

Jeremiah’s virtue was reasonably intact, though he’d recently been involved in a flirtatious near-affair with a coworker. At the crucial moment, when the last button was about to be unbuttoned, when consummation was just a fingertip away, Jeremiah had pushed his potential lover away and said I can’t, I just can’t, I love my marriage. He didn’t admit to love for his spouse, partner, wife. No, he confessed his love for marriage, for the blessed union, for the legal document, for the shared mortgage payments, and for their four children.

Lynn and Jeremiah had often discussed race as a concept, as a foreign country they occasionally visited, or as an enemy that existed outside their house, as a destructive force they could fight against as a couple, as a family. But race was also a constant presence, a house-guest and permanent tenant who crept around all the rooms in their shared lives, opening drawers, stealing utensils and small articles of clothing, changing the temperature.

పుస్తకం టైటిల్ అయిన రెండో కథ 'The toughest Indian in the world' ,ఒక న్యూస్ పేపర్  జర్నలిస్టుగా పనిచేసే ప్రొటొగోనిస్ట్ తమ రిజర్వేషన్స్ కి తిరిగి వెళ్ళే ఇండియన్లకు తరచూ లిఫ్ట్ (హిచ్ హైకింగ్) ఇస్తుంటాడు..ఆ క్రమంలో ఒక వృద్ధుడైన ఇండియన్ స్ట్రీట్ ఫైటర్ ని మార్గమధ్యంలో కలిసిన నేపథ్యంలో వారిద్దరి మధ్యా జరిగే సంభాషణలూ,సంఘటనలూ పాత-కొత్త తరాల అంతరాల్ని ఎత్తి చూపుతూనే,ఆ రెండిటినీ పరోక్షంగా ముడివేసి ఉంచే సంస్కృతి మూలాల్ని గుర్తుచేస్తాయి..ఈ కథలో ఒక ఇండియన్ ని కారు ఎక్కించుకున్న తరువాత అతనితో మాట కలుపుతూ “You’re a fighter, enit?” అని రిజర్వేషన్ colloquialism ని వాడుతూ తానూ కూడా జన్మతః ఇండియన్ అనీ,రిజర్వేషన్ లో  పుట్టిపెరిగానని చెప్పడానికి ప్రయత్నించే సందర్భంలో 'belongingness' కోసం మనిషి పడే తపన కనిపిస్తుంది..ఆ ఫైటర్ తో మనసువిప్పి తన భావాలన్నీ చెప్పాలనుంది అనడంలో మనిషి ఎన్ని శిఖరాలు అధిరోహించినా,ఎక్కడ ఉన్నా తన అస్తిత్వాన్ని మాత్రం మర్చిపోలేడని అనిపిస్తుంది..ఫైటర్ తన దారిన తాను వెళ్ళిపోయాక  "At that moment,if you had broken open my heart you could have looked inside and seen the thin white skeletons of one thousand salmon." అంటాడు..(Spokane Indian tribe also called Salmon people)..అలెక్సీ కథల్లో ముఖ్య పాత్రలన్నీ మూలలను పట్టుకువెళ్ళాడే సగటు సెంటిమెంటలిస్టులే.

That was how I learned to be silent in the presence of white people. The silence is not about hate or pain or fear. Indians just like to believe that white people will vanish, perhaps explode into smoke, if they are ignored enough times. Perhaps a thousand white families are still waiting for their sons and daughters to return home, and can’t recognize them when they float back as morning fog.

He hugged his backpack more tightly, using it as a barrier between his chest and the dashboard. An Indian hitchhiker’s version of a passenger-side air bag.

“Thanks for the ride, cousin,” he said as he climbed out. Indians always call each other cousin, especially if they’re strangers.

మూడో కథ Class లో తెల్లజాతీయురాలు సుసాన్ ని పెళ్ళి చేసుకున్న ప్రొటొగోనిస్ట్ జెరోనిమో(ఇండియన్) ,భార్య వివాహేతర సంబంధం మరియు బిడ్డను పోగొట్టుకున్న విరక్తి కారణంగా  ఒక రాత్రి ఒంటరితనంతో chunk అనే కేఫ్ కి వస్తాడు,అక్కడ జూనియర్ అనే స్ట్రీట్ ఫైటర్ తో కావాలనే గొడవకు దిగుతాడు..చివరకు తనకున్నదేమిటో,తన సాటి ఇండియన్లకు లేనిదేమిటో తెలుసుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు..తన సమాజంనుండి బయటపడి తాను పొందినదేంటో,అక్కడే జీవిస్తున్నవారు ఎటువంటి అవస్థలు పడుతున్నారో తెలుసుకుని తన జీవితానికి కృతజ్ఞత చెప్పుకునే కథ ఇది..స్ట్రీట్ ఫైటర్ జూనియర్ తో ఎందుకు గొడవపడ్డావు అని జెరోనిమోని అడిగితే "I wanted to be with my people" అంటాడు..ఏ జాతి వాడైనా తన సమూహం లో ఒకడిగా మసలాలని కోరుకుంటాడు,ఫెలోషిప్ కోసం తపన పడతాడు..ఈ కథలో ప్రొటొగోనిస్ట్ లో కనిపించే వేదన కూడా అదే.

Personally, I like bottled water, with gas, as the Europeans like to say. If I drink enough of that bubbly water in the right environment, I can get drunk. After a long night of Perrier or Pellegrino, I can still wake up with a vicious hangover. Obviously, I place entirely too much faith in the power of metaphor.

I decided that her face resembled most of the furniture in the bar: dark, stained by unknown insults, and in a continual state of repair.

మరో కథ The Sin Eaters లో జోనా అనే బాలుణ్ణి నేటివ్ అమెరికన్ల తెగను కొనసాగించడానికి సాధనంగా వాడుకోవడం అనే అంశం పై డిస్టోపియన్ శైలిలో నడుస్తుంది..ఇది అలెక్సీ స్థాయికి దరిదాపుల్లో లేని కథ అనిపించింది..అన్నిటిలోనూ అస్సలు నచ్చని కథ ఇదే.

Indian Country అనే ఇంకో కథలో సారా(ఇండియన్) ,ట్రేసీ (తెల్లజాతీయురాలు) అనే ఇద్దరు లెస్బియన్లు వివాహం చేసుకోవాలనుకుంటారు..సారా తల్లిదండ్రులు Sid,Estelle తమ సంప్రదాయాల్ని కాదంటున్న సారా మనసు మార్చడానికి విఫలయత్నం చేస్తారు..అంతరించిపోతున్న తమ సంస్కృతిని పరిరక్షించుకోలేని ఒక జాతి నిస్సహాయతనూ,వైఫల్యాన్ని చూపించడంతో పాటు,కాలానికి అనుగుణంగా మార్పును కోరుకుంటూ మరో ప్రపంచంలోకి స్వేచ్ఛగా రెక్కలు విప్పుకుంటున్న ఆధునిక తరాన్ని కూడా పరిచయం చేస్తుంది.

ఈ పుస్తకం నేటివ్ అమెరికన్ సంస్కృతితో లోతుగా పెనవేసుకుని పోయిన జీవితాలకు అద్దం పడుతుంది..కాల్పనిక జగత్తులో రిజర్వేషన్స్ లో పుట్టి పెరిగిన నేటివ్ అమెరికన్ల జీవితాలను షెర్మాన్ అలెక్సీ అంత చక్కగా పట్టుకున్న రచయిత మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు..జాతి విద్వేషాలు మనుషుల్లో రెకెత్తించే భయాలూ,భ్రమలూ,అభద్రతా భావాలూ,అంతఃసంఘర్షణలూ తెలియాలంటే షెర్మాన్ అలెక్సి లాంటి వారిని చదవాలి..ఈ కథలు దళితవాదాన్నీ,స్త్రీవాదాన్నీ,నల్లజాతీయుల కథల్నీ జ్ఞప్తికి తెస్తాయి..విశ్వాన్ని సమూహాలకు కుదించి వేసిన కారణాలు ఇలాంటి కథల్లో దొరుకుతాయి..ఇందులో కథలు చాలా కాలం క్రితం చదివిన జె.డి వాన్స్ రాసిన Hillbilly Elegy ,Viet Thanh Nguyen 'The Sympathizer' లాంటి రచనల్ని తలపించాయి.

ఈ పుస్తకంలో జాతి దురహంకారానికి బలైన వ్యవస్థలోని జీవితాలు కొన్ని కథల్లో కనిపిస్తే,ఆ వైషమ్యాలు కాలగతిలో కనుమరుగైపోతున్నాయన్న స్పృహ కలిగిన ఆధునిక తరానికి చెందిన వ్యక్తులు మరికొన్ని పాత్రల్లో కనిపిస్తారు..తమ చరిత్రనూ,సంస్కృతినీ అందమైన ఆల్బంలా భద్రపరుచుకుని,జ్ఞాపకాల పుటలు తిరగవేసేవారు మరికొన్ని కథల్లో కనిపిస్తారు..స్పోకేన్ ఇండియన్లకు ఇష్టమైన తాతమ్మలూ,అమ్మమ్మల నాటి నుండీ ప్రియమైన 'సాల్మన్ మష్' వంటకం గురించీ,వారి సంస్కృతిలో భాగమైన Powwow సమావేశాల గురించీ,హిచ్ హైకర్లు (hitchhikers),'49s' సంగీతం గురించీ ఇలా ఇండియన్ల సంస్కృతిని ప్రతిబింబించే సంగతులెన్నో ఈ కథల్లో ఉంటాయి..అక్కడక్కడా ఒకే అంశాన్ని తిప్పి తిప్పి చెప్పడం విసుగనిపించినా అలెక్సీ మార్కు వ్యంగ్యాస్త్రాలు,హాస్యం అలవోకగా పండించే శైలీ కథలకు జీవం పోస్తాయి.

పుస్తకం నుండి మరికొన్ని అంశాలు..

South by Southwest కథ నుండి..
Indians will love anything if given the chance. I loved our house. I cried whenever I left it. I never wanted to leave it. I wanted to grow old in that house. I wanted to become the crazy elder who’d lived in the same house for all of his life. When I died there, I wanted to have ninety years of stories hanging in the closets.

He leaned in close to me. I could smell him. He smelled like the water and trees of home.

“Yes, you are, you’re a worm. You’re less than a worm to them. You’re an exile, you’re a leper, you’re a pariah, you’re a peon, you’re nothing to them. Nothing."

భారతీయుల్ని,నేటివ్ అమెరికన్ ఇండియన్లనీ అలెక్సీ వర్గీకరించిన తీరు :)
“Indian dot-in-the-head or Indian arrow-in-the-heart?”

Grandmother and grandson sat in the small kitchen of her home—their home!—and found no need to speak to each other. Because they were Indians, they gave each other room to think, to invent the next lie, joke, story, compliment, or insult. He ate; she watched.

You’ve colonized Indian land but I am not about to let you colonize my heart and mind

No comments:

Post a Comment