Friday, January 18, 2019

Cosmicomics - Italo Calvino

మనం కొత్తగా ఏదైనా చదివినప్పుడో,కొన్ని రచనల్ని గురించి చెప్పేటప్పుడో అసలిటువంటి రచన మునుపూ ముందూ చదివింది లేదని సులభంగా అనేస్తుంటాం..నూటికి తొంభై శాతం అతిశయోక్తి తప్ప అటువంటి ప్రకటనలో నిజాయితీ పాళ్ళు చాలా తక్కువ..కానీ ఇక్కడ 'ఇటాలో కాల్వినో' గురించి మాట్లాడుతున్నాం గనుక ఈ మాటలు తొణుకూ బెణుకూ లేకుండా ధైర్యంగా అనవచ్చు..'ఇటాలో కాల్వినో' బొత్తిగా పరిచయం అఖ్ఖర్లేని రచయిత,ఈ మధ్యే ఆయన కథలు 'కాస్మికామిక్స్' చదివాను..ఈ కథలు చదువుతుంటే,చిన్నప్పుడెప్పుడో గోరుముద్దలు తింటున్నప్పుడు విన్న చందమామ కథలేవో మళ్ళీ వింటున్నట్లు అనిపించింది,అమ్మ వేలు పట్టుకుని బుడి బుడి నడకలు నడుస్తున్నప్పుడు ఇంతలేసి కళ్ళు విప్పార్చుకుని చూసిన ప్రపంచమేదో కలియతిరిగి మళ్ళీ చూసొచ్చిన భావన కలిగింది..'కాస్మి కామిక్స్' లాంటి కథల్ని నేనైతే మునుపూ ముందూ చదివింది లేదు.
Image Courtesy Google
ఈ పన్నెండు కథల్ని మిగతా కథల నుండి వేరుగా నిలబెట్టేవి కాల్వినో ఈ కథలకు ఎంచుకున్న కథావస్తువులు..ఏ కథనైనా సహజంగా అనగనగా ఒక రోజు అనో,అనగనగా ఒక దేశంలో అంటూనో,ఫలానా ఊరిలో ఫలానా వ్యక్తి అనో అప్పటి కాలమాన పరిస్థితుల్ని వివరిస్తూ ఆరంభిస్తారు..ఇటువంటి సంప్రదాయ శైలికి భిన్నంగా ఈ కథలన్నీ విశ్వంలో ఎక్కడో శూన్యంలో చిన్న బిందువు వద్ద మొదలవుతాయి..భూమి ఏర్పడ్డాక,జీవ పరిణామ సిద్ధాంతాల అనంతరం నాగరికత అంటూ మొదలైన తరువాత కథలు రాయడం వింత  కాదు..కానీ సంస్కృతి,నాగరికత,భాష,కాలం ఇటువంటి విషయాలేవీ లేకుండా భూమి,మానవాళి పుట్టక ముందు కథలెలా ఉంటాయో ఊహించడం కష్టం..ఇందులో కాల్వినో రాసిన కథలన్నీ ఈ ఊహకు రూపకల్పన చేసే దిశగా ఉంటాయి..చిహ్నాలు,భాష,సంఖ్యలు,కాలము,రూపు రేఖలు,అస్తిత్వం ఇలా ఏ మాధ్యమమూ లేని జీవుల ఉనికిని గూర్చిన కథలు ఇవి..అంటే ఏ ఆబ్జెక్ట్ లేకుండా స్పేస్ లో అల్లిన కథలన్నమాట..అన్ని కథలకూ backdrop ఒక 'శూన్యం'..ఒక ఖాళీ ఉపరితలాన్ని వేదికగా చేసుకుని,కథ చెప్తున్న వాళ్ళు మనుషులో,మరో గ్రహాంతర వాసులో లేక జంతువులో కూడా స్పష్టత ఇవ్వకుండా కథను చెప్పి మెప్పించడం అనే అసంభవమనిపించే విషయాన్ని ఇక్కడ సంభవం చేసి చూపించారు కాల్వినో.

ఇందులో అన్ని కథల్లోనూ ముఖ్య పాత్ర దాదాపు ఒక్కటే..ఆ పాత్ర పేరు కూడా విచిత్రం గా ఉంటుంది 'Qfwfq' ..మిగతా పాత్రలపేర్లు కూడా ఇలాగే ఉంటాయి..వందల వేల సంవత్సరాలు వయో పరిమితిగా కలిగిన ఈ పాత్రలు కొన్ని కథల్లో మనుషులైతే,కొన్నిట్లో నాలుగు కాళ్ళ జంతువులు,కొన్నిట్లో డైనోసార్లు,కొన్నిట్లో చేపలు,కప్పలు ఇలా రకరకాల జీవరాసులూను..ఈ కథల్లో గురుత్వాకర్షణ కూడా లేని చోట చరించే మనుషులూ (?),హైడ్రోజన్ పరమాణువుల్ని స్పేస్ లోకి విసిరేసే సరదా ఆటలు,నక్షత్రమండలాల్లో పోటీపడి ప్రదక్షిణలు చేసే జీవులూ,బూడిద రంగులో ఉండి గుర్తుపట్టడానికి సాధ్యం కాని ప్రపంచంలో చరించే జీవులూ లాంటి ఫాంటసీ ఎలిమెంట్స్ అన్నీ పుష్కలంగా ఉంటాయి..

మొదటి కథ 'The Distance of the Moon'..ఈ కథలో భూమ్మీద మనుషులకు చేతికందేంత దూరంలో తిరుగుతున్న చందమామ..కొందరు ఆ చందమామ మీద పెరుగు మీగడ లాంటి పదార్ధాన్ని సముద్రంలో అలలతో పోటీ పడుతూ చిన్న చిన్న పడవల మీద చందమామ మీదకు నిచ్చెనలేసుకుని వెళ్ళి తెస్తుంటారు.
I thought only of the Earth. It was the Earth that caused each of us to be that someone he was rather than someone else; up there, wrested from the Earth, it was as if I were no longer that I, nor she that She, for me. I was eager to return to the Earth, and I trembled at the fear of having lost it. The fulfillment of my dream of love had lasted only that instant when we had been united, spinning between Earth and Moon; torn from its earthly soil, my love now knew only the heart-rending nostalgia for what it lacked: a where, a surrounding, a before, an after.

మరో కథ 'At day break', లో వాతావరణం ఏర్పడక ముందు మనుషులు నెబ్యులా లోని ద్రవ పదార్ధపు పొరలక్రింద నివసిస్తూ ఉంటారు..నెబ్యులా కండెన్సేషన్ కారణంగా భూమీ మిగతా గ్రహాలూ ఆవిర్భవించడం వల్ల అక్కడ జీవరాశులు పడే ఇబ్బందుల్ని హాస్యం మేళవించి వర్ణిస్తారు.

There was no way of telling time; whenever we started counting the nebula’s turns there were disagreements, because we didn’t have any reference points in the darkness, and we ended up arguing. So we preferred to let the centuries flow by as if they were minutes.

‘We’re hitting something!’, a meaningless expression (since before then nothing had ever hit anything, you can be sure),

We never really understood which uncle was the husband and which the brother, or exactly how they were related to us: in those days there were many things that were left vague

'A sign in space' లో గుర్తులూ,సంజ్ఞలు,భాష ఇవేమీ లేని సమయంలో విశ్వంలో ఒక చిహ్నాన్ని ఏర్పాటు చెయ్యడానికి కథానాయకుడు ప్రయత్నిస్తూ ఉంటాడు..
I couldn’t say I’ll make it the same or I’ll make it different, there were no things to copy, nobody knew what a line was, straight or curved, or even a dot, or a protuberance or a cavity.

All at one point: జీవరాశులన్నీ ఒకే బిందువు వద్ద కేంద్రీకృతమైతే ? 'We all are packed 'like sardines' అంటాడు Qfwfq..
This was mere unfounded prejudice – that seems obvious to me – because neither before nor after existed, nor any place to immigrate from, but there were those who insisted that the concept of ‘immigrant’ could be understood in the abstract, outside of space and time.

‘Boys, the tagliatelle I would make for you!’, a true outburst of general love, initiating at the same moment the concept of space and, properly speaking,

Without colours: విశ్వం అంతా బూడిద రంగు తప్ప మరే రంగులూ లేని ప్రపంచం ఎలా ఉంటుందీ ? ఈ కథలో ఆ విచిత్రమైన ఊహకు ప్రాణం పోస్తారు కాల్వినో.
How could we understand each other? Nothing in the world that lay before our eyes was sufficient to express what we felt for each other, but while I was in a fury to wrest unknown vibrations from things, she wanted to reduce everything to the colourless beyond of their ultimate substance.

An aquatic uncle: ఈ కథలో జలచరాల్నీ,భూచరాలనీ వర్గీకరిస్తూ డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని విశ్లేషించారు..ఈ కథలో మానవాళి జీవించడంలో ఆనందాన్ని పొందుతోందా లేక కేవలం ప్రాణరక్షణార్థం జీవిస్తోందా అనే దిశగా ఆలోచనలు రేకెత్తిస్తుంది..కడుపుబ్బ నవ్విస్తూనే మార్పును స్వీకరించడం ఎంత అవసరమో హితవు చెప్తుంది.
According to my great-uncle, the lands that had emerged were a limited phenomenon: they were going to disappear just as they had cropped up or, in any event, they would be subject to constant changes: volcanoes, glaciations, earthquakes, upheavals, changes of climate and of vegetation. And our life in the midst of all this would have to face constant transformations, in the course of which whole races would disappear, and the only survivors would be those who were prepared to change the bases of their existence so radically that the reasons why living was beautiful would be completely overwhelmed and forgotten.

How much shall we bet ? : విశ్వంలో భూమీ,గ్రహాలూ ఇవేమీ ఏర్పడని సమయంలో అంతరిక్షంలో ఉన్న ఇద్దరు మిత్రులు భవిష్యత్తులో ప్రపంచం ఎలా ఉండబోతోందా అని అంచనాలు వెయ్యడం అనే అంశంపై నడిచే కథ.
‘Hurry, look at the way the planets are condensing: now tell me, which is the one where an atmosphere is going to be formed? Mercury? Venus? Earth? Mars? Come on: make up your mind! And while you’re about it, calculate for me the index of demographic increase on the Indian subcontinent during the British raj. What are you puzzling over?

And I think how beautiful it was then, through that void, to draw lines and parabolas, pick out the precise point, the intersection between space and time where the event would spring forth, undeniable in the prominence of its glow; whereas now events come flowing down without interruption, like cement being poured, one column next to the other, one within the other, separated by black and incongruous headlines, legible in many ways but intrinsically illegible, a doughy mass of events without form or direction, which surrounds, submerges, crushes all reasoning.

ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కథా ఒక ఆణిముత్యమే..ఇక కాల్వినో శైలిని గురించి కాస్తైనా పొగడకపోతే ఈ వ్యాసం రాసిన తృప్తి నాకు మిగలదు :) కాల్వినో సిద్ధాంతం ఏంటంటే 'కాదేదీ కథకనర్హం'..ఆయన ఊహా ప్రపంచంలో కథావస్తువుల భాండాగారం ఏదో ఉన్నట్లుంది..ఆయన కథ రాయాలనుకున్నప్పుడు,ఒక చేత్తో ఆ భాండాగారంలో చెయ్యిపెట్టి చేతికందిన ఏదో ఒక వస్తువుని తీసుకుని,మరో చేత్తో కలాన్ని మంత్రదండంలా చేసి మంత్రిస్తే చాలు అక్షరాలు అద్భుతమైన కథనాలుగా రూపాంతరం చెంది,అలవోకగా గమ్యం దిశగా పరుగులు తీస్తాయి..అంతే,ఒక అద్భుతమైన కథ సిద్ధం అయిపోతుంది..ఎంత చెయ్యి తిరిగిన రచయితలైనా,ఒక సందర్భాన్ని వర్ణించడానికో,మరో సన్నివేశానికి జీవం పొయ్యడానికో సాధారణంగా పడే ప్రయాస,వారి వాక్యాల్లో అప్పుడప్పుడూ విసుగ్గా తొంగి చూస్తుంటుంది,కానీ కాల్వినో కథల్లో ఆ తెచ్చిపెట్టుకున్న ప్రయాస ఇసుమంతైనా కనిపించలేదు..తెచ్చిపెట్టుకున్న భావాలూ,కోరితెచ్చుకున్న పాత్రలూ,పదగాంభీర్యాలూ ఎంతమాత్రం ఉండవు..కథలు రాయడంలో కాల్వినో కనపరిచే 'ease' చాలా ప్రత్యేకం.

1963 నుండీ 1968 మధ్యలో రాసిన ఈ కథలు అమెరికా,రష్యా ల మధ్య 'స్పేస్ రేస్' జరుగుతున్న సమయంలో రాశారట..రియలిస్టిక్ ఫిక్షన్ అవసాన దశకి వచ్చిందని గ్రహించి ఊహాత్మకత పరిధులు పెంచే దిశగా ఈ నూతన శైలికి శ్రీకారం చుట్టారట కాల్వినో..ఇన్ని కథల్లో ఇష్టమైన కథేంటంటే చెప్పడం కష్టం..కానీ 'The Distance of the Moon','Dinosaurs' నాకు బాగా నచ్చాయి..ఈ కాస్మి కామిక్స్ లో కథలన్నీ అంతరిక్షం చుట్టూ తిరిగినా ప్రతి కథలోనూ ఒక మానవీయ కోణం కనిపిస్తుంది,విశ్వంలోని సమస్త జీవరాశుల గళం వినిపిస్తుంది..కాల్పనిక జగత్తులో అస్తిత్వవాదం కాస్త భారమైన వ్యవహారం,అటువంటి రచనలు చదవాలంటే కాస్త 'ఇన్సానిటీ' తో కూడిన మానసిక సంసిద్ధత అవసరం..కానీ వాటికి భిన్నంగా కాల్విన్ అండ్ హాబ్స్ కామిక్స్ లో కనిపించే సరళమైన హాస్యం ఈ కథల్లో కూడా కనిపిస్తుంది..గంభీరమైన విషయాల్ని సైతం సున్నితంగా చెప్తూ,కడుపుబ్బ నవ్విస్తూనే ఆలోచనలో పడేసే కథలు ఈ 'కాస్మి కామిక్స్'..మనసుకి ఆహ్లాదం,మెదడుకి ఆలోచన ఈ రెండూ ఒకేసారి అనుభవమవ్వాలంటే  ఈ కథలు చదవండి..DON'T miss them. 

1 comment:

  1. బాబోయ్.. ఏమి ఊహలు.. ఎంత చైతన్యం

    ReplyDelete