బోర్హెస్ 'బుక్ ఆఫ్ ఫాంటసీ' ఎట్టకేలకు ఆరంభించాను..అతి అనుకోకపోతే భారత,భాగవతాలను ఒకే పోస్టులో కుదించడం ఎంత అసాధ్యమో,ఈ బుక్ ఆఫ్ ఫాంటసీ గురించి ఒక్క పోస్టులో రాయాలనుకోవడం కూడా అంతే దుస్సాహసం..ఈ పుస్తకంలో ఫెంటాస్టిక్ శైలిలో మహామహులు రాసిన కథల్ని జార్జ్ లూయి బోర్హెస్,సెసారెస్,సిల్వినా ఒకేంపో వంటి సాహితీ దిగ్గజాలు జాగ్రత్తగా ఎంపిక చేసి ఒకచోట చేర్చారు మరి..దీనికి ఉర్సులా కే లెగైన్ ముందు మాట రాశారు..పోయిన సంవత్సరం రే బ్రాడ్బరీ,బోర్హెస్,ఉర్సులా కే లెగైన్,Krzhizhanovsky లాంటి కొందరు 'ఫెంటాస్టిక్' రచయితల్ని చదవడం తటస్థించింది..అదే సమయంలో నాగరాజు పప్పు గారు చెప్పగా ఈ పుస్తకం గురించి తెలిసింది..ఈ పోస్టులో Nathaniel Hawthorne రాసిన 'Earth's Holocaust' అనే కథ గురించి చెప్పుకుందాం.
ఒకానొకప్పుడు మానవాళి తరతరాలుగా భద్రపరుచుకున్న విలువైన వస్తుసామాగ్రి భూమికి భారమైపోతోందని గ్రహించిన కొందరు,వ్యర్ధమైన ప్రతి వస్తువునీ నాశనం చెయ్యాలనే నిర్ణయానికొస్తారు..ఇన్సూరెన్సు కంపెనీల ప్రాతినిథ్యంలో,ఎవరికీ హాని కలగని విధంగా, పశ్చిమ దిశగా భూమికి సరిగ్గా మధ్యలో ఉన్న సువిశాలమైన గడ్డిమైదానంలో ఒక మంటను ఏర్పాటు చేసి నిరుపయోగమైన వస్తువులన్నీ అందులో తగలబెట్టాలని నిర్ణయిస్తారు..ఆ వేడుకలో భాగం పంచుకోడానికి భూమికి నలుమూలల నుండీ జనం పెద్ద ఎత్తున తరలివస్తారు..కాగా మరికొందరు కేవలం ఆ వేడుక తిలకించడానికే వస్తారు.. ఈ సన్నివేశానికంతటికీ ప్రత్యక్షసాక్షిగా ఉన్న పేరు తెలీని కథకుడు మనకు చిన్న చిన్న వివరాలతో సహా ఆ సంఘటనను వర్ణిస్తూ ఉంటాడు.
ఇక అగ్నికి ఆహుతి ఇవ్వడం ప్రారంభమవుతుంది..ముందుగా స్త్రీల విలువైన దుస్తులు,ఆభరణాలు మొదలు ఇంగ్లాండు రాణుల విలువైన వజ్రాల వరకూ,ఇండియా నుండి ఆంగ్లేయులు తీసుకెళ్ళిన అమూల్య ఆభరణాలు,వస్తువులు మొదలు ప్రాచీన మద్యం వరకూ పురాతన వస్తువులన్నిటినీ ఆ మంటల్లో వేస్తారు..తదుపరి యుద్ధరంగంలో విజయకేతనాలు ఎగురవేసిన వీరుల గుర్తుగా పదిలపరిచిన ఆయుధాలన్నింటితో పాటుగా భవిష్యత్తులో యుద్ధాలకు అవసరమైన ఆయుధాలన్నిటినీ కూడా ఆకాశానికి ఎగసిపడుతున్న అగ్నిశిఖల్లో వేస్తారు..ఆ విధంగా యూరోపు సార్వభౌమత్వపు చిహ్నాలు మొదలు,నెపోలియన్ 'లెజియన్ ఆఫ్ ఆనర్' వరకూ అన్నీ అగ్నికి ఆహుతవుతాయి..ఈ ఆయుధాలను మంటల్లో వేస్తున్నప్పుడు అక్కడే ఉన్న ఒక మాజీ కమాండర్ పెదాలపై చిరునవ్వు చూసిన ప్రొటొగోనిస్ట్ ఎందుకు నవ్వుతున్నారని అడిగితే
'When Cain wished to slay his brother,he was at no loss for a weapon' అంటాడతను..కేవలం ఆయుధాలను మంటల పాలు చేస్తే యుద్ధాలు ఆగిపోయి శాంతి నెలకొంటుందా అనేది అతని ప్రశ్న !!
ఇక తరువాతి వంతు సాహిత్యానిది..ఈ కథలో ఈ భాగం చదివి చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయాను..ముద్రణలో ఉన్న ప్రతి కాగితాన్నీ,వోలటైర్ గ్రంధాలు మొదలు బైబిల్ వరకూ,షెల్లీ కవిత్వం మొదలు ఆనాటి వరకూ ముద్రితమైన సమకాలీన సాహిత్యం వరకూ ఏమీ మిగలకుండా అగ్నికి ఆహుతి చేస్తారు..ఇక్కడ పుస్తక ప్రేమికుల వ్యధ హాస్యం పండిస్తుంది..పుస్తకాల పురుగులపై రచయిత సంధించిన వ్యంగ్యాస్త్రాలు అన్నీ ఇన్నీ కావు :)
‘Alas! and woe is me! thus bemoaned himself a heavy-looking gentleman in green spectacles. ‘The world is utterly ruined, and there is nothing to live for any longer. The business of my life is snatched from me. Not a volume to be had for love or money!’ ‘This,’ remarked the sedate observer beside me, ‘is a bookworm—one of those men who are born to gnaw dead thoughts.His clothes, you see, are covered with the dust of libraries. He has no inward fountain of ideas; and, in good earnest, now that the old stock is abolished, I do not see what is to become of the poor fellow. Have you no word of comfort for him?’
‘My dear sir,’ said I to the desperate bookworm, ‘is not Nature better than a book? Is not the human heart deeper than any system of philosophy? Is not life replete with more instruction than past observers have found it possible to write down in maxims? Be of good cheer. The great book of Time is still spread wide open before us; and, if we read it aright, it will be to us a volume of eternal truth.’
‘Oh, my books, my books, my precious printed books!’ reiterated the forlorn bookworm. ‘My only reality was a bound volume; and now they will not leave me even a shadowy pamphlet!’ In fact, the last remnant of the literature of all the ages was now descending upon the blazing heap in the shape of a cloud of pamphlets from the press of the New World. These likewise were consumed in the twinkling of an eye, leaving the earth, for the first time since the days of Cadmus, free from the plague of letters- an enviable field for the authors of the next generation.
కొన్ని చోట్ల కవులూ,రచయితలూ కూడా భుజాలు తడుముకోవలసివస్తుంది..
‘Could a poet but light a lamp at that glorious flame,’ remarked I, ‘he might then consume the midnight oil to some good purpose.’
‘That is the very thing which modern poets have been too apt to do, or at least to attempt, answered a critic. ‘The chief benefit to be expected from this conflagration of past literature undoubtedly is, that writers will henceforth be compelled to light their lamps at the sun or stars.
The truth was, that the human race had now reached a stage of progress so far beyond what the wisest and wittiest men of former ages had ever dreamed of that it would have been a manifest absurdity to allow the earth to be any longer encumbered with their poor achievements in the literary line.
రచయిత ప్రజాదరణ పొందినదంతా సాహిత్యం కాదని అంటున్నట్లున్నారు :)
It was not invariably the writer most frequent in the public mouth that made the most splendid appearance in the bonfire
పనిలో పనిగా ఈ భాగంలో సాహిత్యానికి కూడా అగ్నిపరీక్ష పెడతారు రచయిత..మంటల్లో పుస్తకాలు కాలిన విధాన్ని బట్టి రచనల నాణ్యతను అంచనా వేసే ప్రయత్నం చేస్తారు..ఆ క్రమంలో షెల్లీ రచనలు అన్నిటికంటే స్వచ్ఛమైన ప్రకాశవంతమైన మంటలుగా ఎగసిపడ్డాయంటారు..లార్డ్ బైరన్ రచనలు సంచలనాత్మకంగా,చంచలత్వంతో నల్లటి పొగలుగా ప్రకాశించాయంటారు..ఆంగ్ల సాహిత్యం మంచి ఇంధనంగా మారగా,షేక్స్పియర్ రచనలు ఆ అగ్నిలో సూర్యకాంతిని తలదన్నేలా అగుపించాయంటారు..అన్నిటికంటే ముఖ్యంగా జర్మన్ కథలు కాలుతుంటే 'brimstone scent' వాసనొచ్చాయనడం అద్భుతం (హీబ్రు బైబిల్ లో 'fire & brimstone' దేవుని ఆగ్రహాన్ని సూచిస్తుందట)..ఇదంతా చెప్పి ఎన్ని ఉద్గ్రంధాలైనా Mother Goose 's మెలోడీస్ కి సరిసాటి రాలేదంటారు.
The small, richly gilt French tomes of the last age, with the hundred volumes of Voltaire among them, went off in a brilliant shower of sparkles and little jets of flame; while the current literature of the same nation burned red and blue, and threw an infernal light over the visages of the spectators. converting them all to the aspect of party-coloured fiends.
కానీ ఆ వేడుకను తిలకిస్తున్నవారిలో తీవ్ర నిరసన గళాలు కూడా వినిపిస్తాయి..అంతా ముగిశాక
నిర్వాహకులు ఆనాటినుండి భూమిపై అందరికీ సమాన హక్కు ఉంటుందనీ,అసమానత్వాలకూ,తత్ఫలితంగా రక్తపాతానికీ తావీయని శాంతిని నెలకొల్పామనీ సంబరాలు చేసుకుంటారు..కానీ మతగ్రంధాల్ని మంటల పాలు చేసినంత మాత్రాన మతం అంతరించిపోతుందా ? ఆయుధాల్ని ఆహుతి చేస్తే యుద్ధం ఆగిపోతుందా ? రాతప్రతుల్ని దహనం చేస్తే భావాలు నశించిపోతాయా ? ఇలా పాఠకుల్లో పలు ప్రశ్నలు తెలెత్తుతాయి..చివరికొచ్చేసరికి కొందరు వ్యక్తుల సంభాషణ మన కథకుణ్ణి ఆలోచనలో పడేస్తుంది..ఈ తంతు అంతా వ్యర్థం అనీ,ఇది పాత ప్రపంచానికి కేవలం ముగింపు అనీ,మనిషి 'మనసు' ఉన్నంతవరకూ ఇలాంటివి ఎన్ని చేసినా నిరుపయోగమనీ అక్కడున్న వ్యక్తుల్లో ఒకరు అంటారు..శుద్ధి చేసుకోవాల్సినది మానవ మస్తిష్కమనీ,ప్రక్షాళన చేసుకోవలసినది మానవ హృదయమే గానీ మరొకటి కాదనీ కథకుడు తెలుసుకోవడంతో కథ ముగుస్తుంది.
So long as you possess a living soul, all may be restored to its first freshness. These things of matter and creation of human fantasy are fit for nothing but to be burned when once they have had their day; but your day is eternity!’
ఏదైనా కథ చదివాకా కేవలం అందులో పాత్రలూ,సన్నివేశాలూ మాత్రమే గుర్తు రాకూడదు..చదివిన చాలాసేపటి వరకూ కూడా కథ తాలూకు ఆలోచనలు వెల్లువెత్తి పాఠకుణ్ణి ఉక్కిరిబిక్కిరి చెయ్యాలి..కథ ముగిశాక కూడా పాఠకుణ్ణి తన కాల్పనిక ప్రపంచంలో ఎక్కువసేపు కట్టి పడెయ్యగలిగే ప్రతిభ గొప్ప రచయితలకు మాత్రమే ఉంటుంది..పుస్తకం ప్రక్కన పెట్టిన తరువాత పాఠకులు తమ ఊహలకు రెక్కలిస్తూ,ఆ ఆలోచనల చిక్కు ముడుల్ని ఒక్కొక్కటీ జాగ్రత్తగా విడదీసి చూసినప్పుడు సారాంశం తేటతెల్లమవ్వాలి..అప్పుడు ఒక మంచి కథ చదివామనే సంతృప్తి పాఠకులకు మిగులుతుంది..నిస్సందేహంగా అటువంటి సంతృప్తిని మిగిల్చే కథ ఈ 'Earth's Holocaust'.
Image Courtesy Google |

స్పెల్ బైండింగ్ వ్యాసం. ఇంత జ్ఞానం మీకు ప్రసాదించిన గురువు ఎవరో గానీ నమస్సులు.
ReplyDeleteసుజాత గారూ,మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలండీ..Means a lot :)
Delete