నోబెల్ బహుమతి గ్రహీత మారియో వర్గస్ లోసా పుస్తకాలు చదవడం మొదలుపెట్టి,ఆయన రచనల్లోని ఎరోటిక్ కంటెంట్ చదివే సంసిద్ధతా,ఆసక్తీ రెండూ నాకు లేకపోవడంతో నచ్చక పక్కన పెట్టేశాను..ఆ సమయంలో ఆయన వ్యాసాలు కంటపడ్డాయి,ఆయన రాసిన 'మేకింగ్ వేవ్స్' లో కొన్ని ఆర్టికల్స్ చదివాను..ఆల్బర్ట్ కామూ పంఖాని కాబట్టి వాటిల్లో కామూ గురించి లోసా రాసిన ఒక వ్యాసం నన్ను ఆకర్షించింది..మొదట్నుంచీ సాత్రే అభిమాని అయిన మారియో వర్గస్ లోసా కి కామూ అంటే అయిష్టత ఉండేదట..ఆయన అబ్సర్డిటీని ఒక మేధో గేయకావ్యంగా భావించే లోసాకి కామూ ఆలోచనలు సత్యదూరంగా,ఉటోపియన్ డ్రీం లా అనిపించేవి..కానీ లిమా లో జరిగిన టెర్రరిస్టు దాడుల నేపథ్యంలో కామూ 'రెబెల్' ని మరోసారి చదివినప్పుడు కామూని సరిగ్గా అర్ధం చేసుకోలేకపోయాననీ,గమనించగా తాను కూడా కామూతో చాలా విషయాల్లో ఏకీభావానికొచ్చినట్లు గ్రహించాననీ అంటారు.
In the postwar years, when faced with the rising tide of Marxism, historicism and ideologies, which tried to reduce everything to a social problem, Camus’s work became an important counterbalance, emphasizing what these movements scorned or ignored: morality.
మనుషుల్లో రెండు రకాలు..ఒకటి లీడర్లు,రెండు వారి ఫాలోవర్లు..సహజంగా ఈ రెండింట్లో ఏదో ఒక వర్గంలో ఇమిడిపోడానికి ఇష్టపడేవాళ్ళే అధికం..It's rare scenario to find human beings among Gods and Worshipers,people either follow or lead,there is no way around...కానీ ఈ రెండు వర్గాలకూ చెందకుండా సర్వస్వతంత్రంగా idols కూ,ఐడియాలజీలకూ దూరంగా ఉండే మామూలు మనుషుల వర్గానికి ప్రతినిధి ఆల్బర్ట్ కామూ..ఆ కాలంలో కంటే మనుషుల్ని దేవుళ్ళుగా ఐడియలైజ్ చేసి,ఆ దేవుళ్ళు ఏం చెప్పినా అది సరైనదేనని గుడ్డిగా నమ్మే మనుషులు అధికంగా ఉన్న ఈ సమాజానికే కామూ సిద్ధాంతాల అవసరం ఎక్కువ..మరి 'వ్యక్తి పూజ' ఆ కాలంలో లేదా ? అంటే ఉంది..కానీ ఆ కాలంలో స్వలాభాపేక్ష లేకుండా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన వ్యక్తులు హీరోలైతే,సక్సెస్ మాత్రమే కొలమానంగా ఉన్న ఈ కాలంలో కార్పొరేట్ వ్యవస్థకు,క్యాపిటలిస్ట్ విధానాలకూ ప్రతినిధులు ఆధునిక తరానికి రోల్ మోడల్స్ గా చెలామణీ అవుతున్నారు..ఇక్కడ కొందరి వ్యక్తిగత విజయాలనూ,జీనియస్ నూ తక్కువ చెయ్యడం నా ఉద్దేశ్యం కాదు..కానీ వారి 'వ్యక్తిగత' పురోగతి వల్ల సమాజానికీ,సగటు మనిషికీ జరిగే మేలేంటన్నది ఇక్కడ ప్రశ్నించుకోవాల్సిన అంశం..ఈ తరహా సంప్రదాయీకరణలోని నిరంకుశత్వం,ఒక అబద్ధం మీద నిలబడ్డ సామాజిక జీవితం వలన కనుమరుగైపోతున్న 'నైతికత' సమాజానికి చేటని కామూ అంటారు..ఆయన సమకాలీనులైన చాలామంది ఇంటెలెక్చువల్స్ లా 'పేదరికం','దోపిడీ','నిస్సహాయత' లాంటి పదాలు కామూ గ్రంథాల్లో చూసి తెలుసుకున్నవి కాదు,మైనారిటీ వర్గానికి ప్రతినిధిగా అవన్నీ ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకున్నవి.
Camus talked of natural man, linked to the world of the elements, proudly asserting his physical being, who loves his body and tries to please it, who finds the harmony between the landscape and matter to be not only a full and satisfying form of pleasure but also the confirmation of his greatness.
Furthermore, in Camus’s thought the economic exploitation of man is implicitly condemned with the same rigour as his political oppression. And for the same reasons: through his humanistic belief that the individual can only be an end, not a means, that the enemy of man is not only the person who represses him but also the one who exploits him for gain, not just the person who puts him in a concentration camp, but also the one who turns him into a production machine.
మోడరన్ థింకర్స్ మనిషిని ఒక హిస్టారికల్ ప్రోడక్ట్ గా చూస్తే కామూ మాత్రం మనిషిని ప్రకృతిలో భాగంగా చూశారు..ఆయన పుస్తకాల్లో తరచూ కనిపించే ప్రకృతి వర్ణనలు,సముద్ర తీరాలూ,అల్జీరియన్ పర్వత శ్రేణుల్లోని వెచ్చని ఉదయాలూ దీనికి ఉదాహరణ..మెర్సాల్ట్ కామూకి ఒక ఆల్టర్ ఇగో..అందరిలా స్పందించలేకపోవడం,తన భావాల్ని వెళ్ళడించలేకపోవడం అతనిలో లోపం (?)..సమాజం మనిషి నుంచి కోరుకునేది అదేగా ! కోర్ట్ విచారణలో అందరిలో ఒకడిగా మనలేకపోవడమే మెర్సాల్ట్ చేసిన తప్పుగా కనిపిస్తుంది..ఈ కారణంగానే అతని చేతిలో అనుకోకుండా జరిగిన హత్యకు కారణాలు పరిశీలించకుండానే చనిపోయిన తల్లిని చూడ్డానికొచ్చినప్పుడు అతనిలో మనిషిలో సహజమైన భావోద్వేగాలు కనపడకపోవడం,ఆమె శవం ప్రక్కన కూర్చుని సిగరెట్ వెలిగించుకోవడం,తరువాత ఆదమరిచి నిద్రపోవడం లాంటివాటికే ప్రాధాన్యతనిచ్చి న్యాయస్థానం అతన్ని ఒక మృగంగా భావించి దోషిగా నిర్ధారిస్తుంది..కామూ పాత్రల్లో ముఖ్యంగా ఈ unrefined,raw వ్యక్తిత్వాలు కనిపిస్తాయి..ఈ పాత్రలు సామాజిక నియమాలు పాటించవు..ఆ మాటకొస్తే అలాంటి నియమాలుంటాయనే స్పృహ కూడా వారికి ఉండదు.
This man is elemental not only because his pleasures are simple and direct but also because he lacks social refinements and guile: that is, the respect for conventions, a capacity for deception and intrigue, a spirit of accommodation and an ambition for power, glory and wealth.His virtues – frankness, simplicity, a certain preference for the Spartan life – are those traditionally associated with life in the provinces and, in another way, with the pagan world. What happens when this natural man tries to exert his right to be part of the city? A tragedy: the city crushes him, destroys him. This is the theme of Camus’s best novel: The Outsider.
ఈ 'Outsider' ని అర్ధం చేసుకోవాలంటే కామూ మూడు ప్రపంచాల గురించీ ('a provincial, a man of the frontier and a member of a minority') తెలియాలంటారు లోసా..
He was a provincial for better or worse, above all for better in many respects. First, because, unlike the experience of men in large cities, he lived in a world where landscape was the primordial presence, infinitely more attractive and important than cement and asphalt. The love of Camus for nature is a permanent aspect of his work:
Without ever denying man’s historical dimension, he always maintained that a purely economic, sociological or ideological interpretation of the human condition was incomplete and, in the long run, dangerous. In L’Eté, 1948, he wrote: ‘History explains neither the natural universe that existed before it, nor the beauty that is above it.’
ఆర్టిస్టులు సమాజంతో సంఘీభావంతో మెలగడం కంటే చరిత్రగతి నుండి వెలుపలకు వచ్చి ఆలోచించడం అవసరమని అంటూ,
In ‘The Banishment of Helen’, Camus wrote: ‘The historical spirit and the artist, each in its own way, want to remake the world. The artist, through his very nature knows the limits that the historical spirit does not know. This is why the latter ends in tyranny while the passion of the former is for freedom. All those who fight for freedom today come to do battle, in the last instance, for beauty.’ And in 1948, in a talk in the Salle Pleyel, he repeated: ‘In this age in which the conqueror, by the logic of his attitude, becomes an executioner or a policeman, the artist is obliged to be a recalcitrant. In the face of contemporary political society, the only coherent attitude of the artist, unless he prefers to renounce his art, is unconditional rejection.’
విప్లవాలను తీవ్రంగా వ్యతిరేకించే కామూ మనిషికి తిరుగుబాటు చేసే హక్కుని ఎలా సమర్ధిస్తారనే సందేహం నాక్కూడా కలిగేది..రెండూ హింసకే కదా దారితీస్తాయి అనే అనుమానాన్ని నివృత్తి చేస్తూ ఇందులో ఒక విశ్లేషణ చేశారు లోసా..ఇక్కడే 'నైతికత' ప్రాముఖ్యత కనిపిస్తుంది..
For Camus, the revolutionary is a person who places man at the service of ideas, who is prepared to sacrifice the man who is living for the one who is to come, who turns morality into a process governed by politics, who prefers justice to life and who believes in the right to lie and to kill for an ideal..The rebel can lie and kill but he knows that he has no right to do so and that if he behaves in this way, he threatens his cause. He does not agree that tomorrow should take preference over today; he justifies the ends by the means and he puts politics at the service of a higher cause – which is morality.
Image courtesy Google |

No comments:
Post a Comment