Monday, September 3, 2018

First Love - Ivan Turgenev

కొన్ని సార్లు పాఠకులకు కేవలం చెప్పీ చెప్పకుండా ఉపరితలం వద్దే ఆగిపోయే కథలు
కాదు కావాల్సింది,ఒక్కోసారి రచయితతో అంతకుమించిన దగ్గరితనం కూడా కోరుకుంటారు..కొందరు రచయితలు కేవలం పరిచయస్తుల్లా మిగిలిపోతే మరికొంతమంది మాత్రం సన్నిహితులుగా మారతారు..ఈ సాన్నిహిత్యం కథ చెప్పే రచయిత పాఠకులకి ఇచ్చే గౌరవం అనుకుంటాను..మరి చాలా నమ్మకస్తులకి మాత్రమే కదా మనసులో భావాలన్నీ పూస గుచ్చినట్లు చెప్పడానికి సంకోచించం..ఇవాన్ తుర్గెనెవ్ తొలి పరిచయంలోనే ఒక సన్నిహితునిలా అనిపిస్తారు..అందుకేనేమో రచనల్లో హ్యూమన్ ఎమోషన్స్ కి పెద్దపీట వేసే యురోపియన్ పాఠకుల 'రుచి' ని గ్రహించి వారిని సైతం మెప్పించగలిగారు..

Image courtesy Google
మనసుకి హత్తుకునేలా భావోద్వేగాల్ని వర్ణించడంలో రష్యన్ రచయితలు సిద్ధహస్తులు..టాల్స్టాయ్,చెఖోవ్,స్టీఫెన్ జ్వెయిగ్ లాంటివారి శైలిని తలపించే మరొక రచయిత ఇవాన్ తుర్గెనెవ్..తుర్గెనెవ్ ని చదివాక సంప్రదాయవాదాన్నీ,హేతువాదాన్నీ రెండిటినీ సమన్వయం చేస్తూ కథను నడిపించడం రష్యాన్లకు వెన్నతో పెట్టిన విద్యేమో అనిపించింది..ఈయన రచన 'ఫస్ట్ లవ్' ఒక మామూలు ప్రేమ కథ అనుకుంటే పొరపాటే..దీనిని ఒక సెమీ ఆటోబయోగ్రఫికల్ నవలగా చెప్పుకుంటారు ఇవాన్..ఈ రచనలో మనిషి జీవితంలోని వివిధ దశల్లో మానసిక పరిపక్వత సాధించే క్రమంలో ఎదురయ్యే  సంక్లిష్టతల్ని  అంచెలంచెలుగా వివరిస్తారు...కథ విషయానికొస్తే Sergey Nicolayevich ఆతిధ్యాన్ని స్వీకరించే సందర్భంలో Vladimir Petrovich తన తొలిప్రేమను కథగా రాసి వినిపించడంతో ఈ కథ మొదలవుతుంది...పదహారేళ్ళ వ్లాడిమిర్ తన పొరుగింటికి కొత్తగా వచ్చిన జినైదాతో తొలి చూపు లోనే ప్రేమలో పడతాడు..ప్రేమ ఎప్పుడు,ఎందుకు,ఎలా పుడుతుందో చెప్పలేమంటారు ప్రేమికులు..'తాను అంటూ ఉన్నాననే స్పృహ లేని స్థితి' అది..ఈ స్థితిలో బహుశా వయసుతారతమ్యాలు,సామజిక స్థితిగతులు,కులాలు,మతాలు ఇవేవీ కనిపించవు..వ్లాడిమిర్ కు జినైదా మీద కలిగింది అచ్చంగా అటువంటి ప్రేమే..బ్రతికి చెడ్డ రాజకుటుంబానికి చెందిన ఇరవయ్యొక్కేళ్ళ జినైదా,ఆమె తల్లి Princess Zasyekin పేదరికాన్నుండి బయటపడే మార్గాలు వెతుకుతుంటారు..జినైదా విచిత్రమైన వ్యక్తిత్వం కల అమ్మాయి..తన అందచందాలకు ముగ్ధులై తన చుట్టూ చేరిన యువకుల్ని చలాకీతనంతో నవ్విస్తూ,కవ్విస్తూ తన చుట్టూ తిప్పుకుంటూ ఉంటుంది.. తానేమిటో తనకు స్పష్టంగా తెలిసిన అమ్మాయి..“I’m a flirt, I’m heartless, I’m an actress in my instincts,” అని తన గురించి తానే చెప్పుకుంటుంది...సహజంగానే తొలియవ్వనపు పొంగులో జినైదా పట్ల ఆకర్షితుడైన వ్లాడిమిర్ ఆమె వేరొకరితో ప్రేమలో పడిందని తెలుసుకుని భగ్న హృదయంతో ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుని హతమార్చాలని ఒక రాత్రి కత్తి చేతబూని తోటలో వేచి చూస్తుంటాడు..ఆ చీకట్లో తన తండ్రే ఆ వ్యక్తి అని తెలుసుకుని హతాశుడవుతాడు.."The jealous Othello, ready for murder, was suddenly transformed into a schoolboy.."

జినైదాలాగే ఈ కథలో వ్లాడిమిర్ తండ్రి పెట్రోవిచ్ పాత్ర కూడా వైవిధ్యంగా ఉంటుంది..తనకంటే పదేళ్ళు పెద్దదైన స్త్రీని (వ్లాడిమిర్ తల్లి) పెళ్ళాడిన ఒక సాధారణమైన వ్యక్తి పెట్రోవిచ్.. మితభాషిగా,స్థితప్రజ్ఞుడిలా,గంభీరమైన ఆహార్యంతో ఉంటారు...విచిత్రంగా అంతమంది యువకులు వెంటపడినా,తాను అంతగా ప్రేమించిన జినైదా ప్రేమను పొందిన తండ్రిపట్ల వ్లాడిమిర్ కు ఆశ్చర్యంతో కూడిన గౌరవం కలుగుతుంది..
"but I had no ill-feeling against my father. On the contrary he had, as it were, gained in my eyes … let psychologists explain the contradiction as best they can..."

మరి వివాహితుడైన వ్లాడిమిర్ తండ్రి,జినైదా ల మధ్య చిగురించిన ప్రేమ ఎటువంటి మలుపులు తీసుకుందో,వాటి పరిణామాలు వ్లాడిమిర్ హృదయం మీద ఎటువంటి  ప్రభావం చూపించాయన్నది మిగతా కథ...యవ్వనం తనతో పాటు మోసుకొచ్చే ఒంటరితనాలూ,భయాలూ,అశాంతులూ,సంఘర్షణల్ని ఈ కథలో అద్భుతంగా ఆవిష్కరించారు..తొలిప్రేమ బారినపడ్డ వ్లాడిమిర్ తన మనసులో ఇలా అనుకుంటాడు.. "such an unhappy, lonely, and melancholy youth, that I felt sorry for myself—"

I burnt as in a fire in her presence … but what did I care to know what the fire was in which I burned and melted—it was enough that it was sweet to burn and melt.

'నిశ్శబ్ద్','లమ్హే' లాంటి సినిమాలు మీకు ఇష్టమైతే ఈ కథ కూడా మీకు నచ్చుతుంది..బిగ్ బీ హార్డ్ కోర్ ఫ్యాన్ అయిన నన్ను ఆయన అద్భుతంగా నటించిన సినిమా పేరు చెప్పమంటే వెంటనే ఎందుకో 'నిశ్శబ్ద్' గుర్తుకొస్తుంది..మనిషిలోని అన్ని భావోద్వేగాల్లో చాలా సున్నితమైన 'గిల్టీనెస్' ని తెర మీద చూపించి మెప్పించడం అంత సులభమైన విషయం అని నేను అనుకోను..ఇకపోతే ఈ కథ మొదట 'Art of novella' సిరీస్ లో ప్రచురించిన అనువాదంలో చదివాను..కానీ పెంగ్విన్ ప్రచురణ ఇంకా బావుంది..పెంగ్విన్ ప్రచురణలో Isaiah Berlin అనువాదానికి V. S. Pritchett ఒక అద్భుతమైన ముందుమాట రాశారు.

ఈ కథలో తండ్రి వ్లాడిమిర్ కు తన అనుభవసారాన్ని రంగరించి ఈ రెండు విషయాలూ చెప్తాడు..
“Take for yourself what you can, and don’t be ruled by others; to belong to oneself—the whole savour of life lies in that,”
"Beware of the love of women; beware of that ecstasy-that slow poison."

యువకుడైన వ్లాదిమిర్ కు డాక్టర్ Lushin జ్ఞానబోధ..
 “Liberty,” he repeated; “and do you know what can give a man liberty?”
 “What?”
 “Will, his own will, and it gives power, which is better than liberty. Know how to will, and you will be free, and will lead."

పుస్తకం నుండి మరికొన్ని,
I knew a great deal of poetry by heart; my blood was in a ferment and my heart ached—so sweetly and absurdly; I was all hope and anticipation, was a little frightened of something and full of wonder at everything, and was on the tiptoe of expectation; my imagination played continually, fluttering rapidly about the same fancies, like martins about a bell-tower at dawn; I dreamed, was sad, even wept; but through the tears and through the sadness, inspired by a musical verse, or the beauty of evening, shot up like grass in spring the delicious sense of youth and effervescent life.

I sat down and read “On the Hills of Georgia.” “ ‘That the heart cannot choose but love,’ ” repeated Zinaïda. “That’s where poetry’s so fine; it tells us what is not, and what’s not only better than what is, but much more like the truth, ‘cannot choose but love,’—it might want not to, but it can’t help it.”

No comments:

Post a Comment