పుస్తకాలెందుకు చదవడం !! చదివితే ఉన్న మతి పోయిందనీ !!! ఎంత చదివినా ఏం లాభం !! ఏ పని చేసినా దానికొక ప్రయోజనం ఉండాలి !! ఒక్కసారి చదివి ప్రక్కన పడేసేదానికి అంత డబ్బు పోసి ఆ పుస్తకాలు కొనకపోతే ఏం !! అదొక ఎస్కేపిజం !!! ఎక్సట్రా !! ఎక్సట్రా !!! ఎక్సట్రా !! ఇలాంటి హితబోధలూ,ఉపమానాలూ,ఫిర్యాదులూ,నిష్టూరాలూ విని విని అదేదో కాని పని చేస్తున్నామేమో అని ఎప్పుడైనా లేనిపోని అనుమానాలొస్తే "కుచ్ తో లోగ్ కహేంగే ,లోగోం కా కామ్ హై కెహనా/"తూ కౌన్ హై,తేరా నామ్ హై క్యా,సీతా భీ యహాన్ బద్నామ్ హుయీ"" అనే రాజేష్ ఖన్నా పాటని గుర్తు చేసుకుని మళ్ళీ పుస్తకం చదవడంలో మునిగిపోతుంటాను..నాకూ,నాలాంటి మరికొందరికీ పొద్దున్న లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకూ,ఊపిరిసలపని నిజజీవితంలోని బాధ్యతల మధ్య ఈ పుస్తక పఠనం అనే వ్యాపకం ఒక వెలకట్టలేని ఆనందం..నా చెంచాడు భవసాగరాల మధ్యలో నాకోసం నేను వెచ్చించుకునే సమయం ఈ పుస్తకాలు చదువుకోవడం..ఈ అపురూపమైన రెండు మూడు గంటల సమయంలో పుస్తక పఠనమేదో పాపంలా సభ్యసమాజం చేసే నిష్టూరాలు కూడా ఈ చెవితో వినేసి ఆ చెవితో వదిలేసే సమయంలో చూశాను ఈ పుస్తకాన్ని..అప్పుడు అనిపించింది "హమ్మయ్య నేనొక్కర్తినే కాదన్నమాట !" అని..
పుస్తకాలు చదవి ఏం ఉద్ధరిస్తారని అడిగితే నాలాంటి అతి మామూలు మనుషులకే చిరాకు వస్తే మరి సాక్షాత్తూ బ్రిటన్ రాణికి ఎలా అనిపించి ఉంటుంది !! Wait అసలు ప్రపంచం అంతా ఫింగర్ టిప్స్ మీద ఉన్న రాణీగారికి పుస్తకాలతో పనేంటి ? ప్రపంచం నలుమూలలూ తిరిగి చూసిన ఆవిడకు పుస్తకాల్లో కొత్తగా చూడాల్సిన ప్రపంచం ఏంటి ? అసలు ఎవరైనా పుస్తకాలు ఎందుకు చదవాలి ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈ రచన..ఎనభయ్యో పడికి చేరువలో ఉన్న బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ II కు పుస్తకాలు చదివే వ్యసనం (?) ఎలా అలవాటయ్యిందీ..పుస్తకాలు చదివే అలవాటు ఆమెలో ఎలాంటి పరివర్తన తీసుకువచ్చిందీ అనే అంశం ఆధారంగా అల్లిన కల్పిత కథ బ్రిటిష్ రచయిత Alan Bennett రాసిన ఈ 'The Uncommon Reader'..
Few people, after all, had seen more of the world than she had. There was scarcely a country she had not visited, a notability she had not met. Herself part of the panoply of the world, why now was she intrigued by books which, whatever else they might be, were just a reflection of the world or a version of it? Books? She had seen the real thing.“I read, I think,” she said to Norman, “because one has a duty to find out what people are like,” a trite enough remark of which Norman took not much notice, feeling himself under no such obligation and reading purely for pleasure, not enlightenment, though part of the pleasure was the enlightenment, he could see that. But duty did not come into it.
ఒకరోజు బ్రిటన్ రాణి పెంపుడు కుక్కల్ని తోటలో షికారు తిప్పుతుండగా అవి ఉన్నట్లుండి వంటింటి వెనుక వైపుకు పరుగులు తీస్తాయి..వాటిని అనుసరిస్తూ ఎప్పుడూ అటువైపుకు వెళ్ళని ఆవిడ అటు వెళ్ళే సరికి అక్కడ ఒక మొబైల్ లైబ్రరీ వాన్ ఆగి ఉంటుంది.. ప్రతి బుధవారం వచ్చే ఆ మొబైల్ లైబ్రరీ వద్ద రాజభవనపు వంటింట్లో పని చేసే నార్మన్ సీకిన్స్ అనే యువకుడు పుస్తకం చదువుతూ కనిపిస్తాడు..అతడితో మాట కలిపినప్పుడు అతనికి సాహిత్యం మీద ఉన్న అవగాహన తనకు లేదని గమనిస్తుంది..సాహిత్యం,పుస్తకాలూ వీటిపై ఆసక్తీ ,అవసరం ఇవేవీ లేకపోయినా ఆ పుస్తకాల షాపు యజమాని Mr Hutchings కి మర్యాద ఇస్తూ ఒక్క పుస్తకమైనా తీసుకోవాలని,ఆవిడకి తెలుసున్న టైటిల్ తో ఉన్న ఒక పుస్తకం తీసుకుని వెళ్తుంది..అలా మెల్లిగా ఆ పుస్తకం పూర్తిచేసి మళ్ళీ రెండోవారం కూడా పుస్తకాల కోసం వస్తుంది..క్రమేపీ పుస్తకపఠనం మీద ఆసక్తి కాస్తా ఆవిడకి తెలీకుండానే అబ్సెషన్ గా మారుతుంది..ఈ సమయంలోనే తనకు సాహిత్య సలహాదారుగా నార్మన్ ను నియమిస్తుంది..ఇక్కడ నుంచీ అసలు కథ మొదలవుతుంది.
"Oh, to the end. Once I start a book I finish it. That was the way one was brought up. Books, bread and butter, mashed potato — one finishes what’s on one’s plate. That’s always been my philosophy.”
రాణిగా అనేక బాధ్యతల నడుమ ఆమెకు పుస్తకాలకు తగినంత సమయం దొరకదు,అయినప్పటికీ ఆమె ఆసక్తి ఇసుమంత కూడా తగ్గదు..పుస్తకాలపురుగుల్లాగే ఆమె కూడా ప్రధానమంత్రి మొదలు ఇతర దేశాల ప్రతినిధులతో సహా కనిపించిన ప్రతి వ్యక్తినీ ఆ పుస్తకం చదివావా ? ఈ పుస్తకం మీద నీ అభిప్రాయమేంటి ? లాంటి ప్రశ్నలు వేసి,తెలీదన్న వారికి ఆ పుస్తకాలు తెప్పించి బహుకరిస్తుంది...కాల్పనిక ప్రపంచానికీ,వాస్తవ ప్రపంచానికీ ఎప్పుడూ చుక్కెదురు కాబట్టి,ఆమెలో ఈ వ్యాపకం వ్యసనంగా మారగా చివరకు సభల్లో కూడా దొంగచాటుగా కుషన్స్ క్రింద పుస్తకాలు పెట్టుకుని చదవడం,ఎక్కడకు వెళ్ళినా పుస్తకాలు వెంట తీసుకు వెళ్ళడంలాంటివి ఆమె హోదాకు భంగమని భావించిన పాలనా వ్యవస్థలోని వ్యక్తులు ఆమెచే ఎలా అయినా ఈ అలవాటు మాన్పించాలని పుస్తకాలు దాచెయ్యడం,నార్మన్ ను ఆమెకు తెలీకుండానే దూరంగా పంపించెయ్యడం లాంటి కొన్ని ప్రయత్నాలు చేసినా ఆమె ఆసక్తి తగ్గించడంలో పూర్తిగా విఫలమవుతారు.
‘The Queen has a slight cold’ was what the nation was told, but what it was not told, and what the Queen herself did not know, was that this was only the first of a series of accommodations, some of them far-reaching, that her reading was going to involve.
ఈ కథంతా సీరియస్ గా కాకుండా పొట్టచెక్కలయ్యే హాస్యం మేళవించి చెప్పడంలో బెన్నెట్ ప్రత్యేకత అడుగడుగునా కనిపిస్తుంది..రాణీగారి కుక్కలు ఆమె తమకు తగినంత సమయం వెచ్చించడం లేదని అలిగి ఆమె లైబ్రరీ పుస్తకాల్ని చింపి పొయ్యడం,డెబ్భై ఏళ్ళ వయసులో ఆమె తమజోలికి రానందుకు కుటుంబ సభ్యులు ఆనందపడడం,ఆమె పుస్తకాలు బహుమతిగా పొందిన సాధారణ ప్రజలు ebay లో వాటిని అమ్మేసుకుంటారు అని రచయిత అనడం,ఆమె పుస్తకాలు దాచెయ్యడం లాంటివి పాఠకుల్ని నవ్వుల్లో ముంచితేలుస్తాయి..ఇందులో మరో సరదా సందర్భం ఉంటుంది..ఎలిజబెత్ II కి సాహిత్యంపై పట్టువచ్చాక మునుపు Priestly,T.S.Elliot,Philip Larkin,Ted Hughes లాంటి ఎందరో రచయితల్ని ప్రత్యక్షంగా కలిసినా వారి పుస్తకాలు చదవకపోవడం వల్ల ఏమీ మాట్లాడలేకపోయానని చింతించి ఆమె చదివిన రైటర్స్ అందర్నీ ఒకసారి పార్టీకి పిలుస్తుంది..ఈ అనుభవం తరువాత రచయితల్ని పుస్తకాల పేజీల మధ్య కలవడమే మంచిదని నిర్ధారణకొస్తుంది.. :) :)
One Scottish author was particularly alarming. Asked where his inspiration came from, he said fiercely: “It doesn’t come, Your Majesty. You have to go out and fetch it.”
Authors, she soon decided, were probably best met with in the pages of their novels, and were as much creatures of the reader’s imagination as the characters in their books. Nor did they seem to think one had done them a kindness by reading their writings. Rather they had done one the kindness by writing them.
ఒక రాణీగా ప్రపంచంతో ప్రత్యక్షమైన సంబంధం కలిగిన ఆమెకు నిజంగా పుస్తకాల అవసరం ఏముంటుంది ! ఆమెకు పుస్తక పఠనం మేలు చేసిందా,కీడు చేసిందా అనే విషయాలు తెలియాలంటే ఈ రచన చదవాలి..చివర్లో ఆమె చదవడం అనేది జీవితాన్ని దూరంగా నుంచుని చూడడంలాంటిదైతే,రాయడం జీవితంలో భాగం పంచుకోడంలాంటిదని నిర్ణయానికొచ్చి తాను కూడా ఒక రచన చెయ్యాలని సంకల్పించడంతో ఈ కథ ముగుస్తుంది..పుస్తకాలు చదవడం కూడా ఒక వ్యసనమే అనుకుంటే,ఈరోజుల్లో పాపులర్ రియాలిటీ షోలూ,దీర్ఘంగా సాగే ఫోన్ సంభాషణలూ,విరక్తి వచ్చే టీవీ సీరియళ్ళూ,ఇరుగుపొరుగుల వ్యక్తిగత జీవితాలని ఆరాతీస్తూ,ప్రతి దానిలో రంధ్రాన్వేషణ చేస్తూ,మనుషుల్ని ఏదో ఒక సాకుతో జడ్జి చేస్తూ బిజీగా ఉండే ఆధునిక సమాజంలో ఇది ఏమంత అనారోగ్యకరమైన వ్యసనం కాదని భరోసా ఇచ్చే పుస్తకం ఇది..పుస్తకపఠనంలో ఉన్న కష్టనష్టాలూ,చిన్న చిన్న చిక్కులూ,అనంతమైన ఆనందాలతో కూడిన కబుర్లతో ఆద్యంతం సరదాగా నవ్విస్తూ సాగిపోయే ఈ పుస్తకాన్ని రీడర్స్ మరియూ రైటర్స్ తప్పకుండా చదవాలి.
And it came to her again that she did not want simply to be a reader. A reader was next door to being a spectator whereas when she was writing she was doing, and doing was her duty.
పుస్తకం నుండి కొన్ని నచ్చిన విషయాలు,
She was also intensely conventional and when she had started to read she thought perhaps she ought to do some of it at least in the place set aside for the purpose, namely the palace library. But though it was called the library and was indeed lined with books, a book was seldom if ever read there. Ultimatums were delivered here, lines drawn, prayer books compiled and marriages decided upon, but should one want to curl up with a book the library was not the place. It was not easy even to lay hands on something to read, as on the open shelves, so called, the books were sequestered behind locked and gilded grilles. Many of them were priceless, which was another discouragement. No, if reading was to be done it were better done in a place not set aside for it. The Queen thought that there might be a lesson there and she went back upstairs.
Of course he couldn’t actually have said this to her face, she realised that, but the more she read the more she regretted how she intimidated people and wished that writers in particular had the courage to say what they later wrote down. What she was finding also was how one book led to another, doors kept opening wherever she turned and the days weren’t long enough for the reading she wanted to do.
“But ma’am must have been briefed, surely?”
“Of course,” said the Queen, “but briefing is not reading. In fact it is the antithesis of reading. Briefing is terse, factual and to the point. Reading is untidy, discursive and perpetually inviting. Briefing closes down a subject, reading opens it up.”
“I can understand,” he said, “Your Majesty’s need to pass the time.”
“Pass the time?” said the Queen. “Books are not about passing the time. They’re about other lives. Other worlds. Far from wanting time to pass, Sir Kevin, one just wishes one had more of it. If one wanted to pass the time one could go to New Zealand.”
With two mentions of his name and one of New Zealand Sir Kevin retired hurt.
Books did not defer. All readers were equal, and this took her back to the beginning of her life. As a girl, one of her greatest thrills had been on VE night, when she and her sister had slipped out of the gates and mingled unrecognised with the crowds. There was something of that, she felt, to reading. It was anonymous; it was shared; it was common. And she who had led a life apart now found that she craved it. Here in these pages and between these covers she could go unrecognised.
రాణీగారి కుక్కల ఆగ్రహానికి బలైన రచయితల గురించి రాస్తూ,
The James Tait Black prize notwithstanding, Ian McEwan had ended up like this and even A. S. Byatt. Patron of the London Library though she was, Her Majesty regularly found herself on the phone apologising to the renewals clerk for the loss of yet another volume.
“What are you reading at the moment?”
To this very few of Her Majesty’s loyal Subjects had a ready answer (though one did try: “The Bible?”)
Off duty, Piers, Tristram, Giles and Elspeth, all the Queen’s devoted servants, compare notes: “What are you reading? I mean, what sort of question is that? Most people, poor dears, aren’t reading anything. Except if they say that, madam roots in her handbag, fetches out some volume she’s just finished and makes them a present of it.” “Which they promptly sell on eBay.”
“To read is to withdraw. To make oneself unavailable. One would feel easier about it,” said Sir Kevin, “if the pursuit itself were less…selfish.”
To begin with, it’s true, she read with trepidation and some unease. The sheer endlessness of books outfaced her and she had no idea how to go on; there was no system to her reading, with one book leading to another, and often she had two or three on the go at the same time. The next stage had been when she started to make notes, after which she always read with a pencil in hand, not summarising what she read but simply transcribing passages that struck her.
“I think of literature,” she wrote, “as a vast country to the far borders of which I am journeying but cannot possibly reach. And I have started too late. I will never catch up.”
“Do you know that I said you were my amanuensis? Well, I’ve discovered what I am. I am an opsimath.” With the dictionary always to hand, Norman read out: “Opsimath: one who learns only late in life.”
“One recipe for happiness is to have no sense of entitlement.” To this she added a star and noted at the bottom of the page: “This is not a lesson I have ever been in a position to learn.”
పుస్తకాలు చదివే ప్రతివాళ్ళలోనూ ఏదో మూలన ఉండే దువిధ,
Had she been asked if reading had enriched her life she would have had to say yes, undoubtedly, though adding with equal certainty that it had at the same time drained her life of all purpose. Once she had been a self-assured single-minded woman knowing where her duty lay and intent on doing it for as long as she was able. Now all too often she was in two minds. Reading was not doing, that had always been the trouble. And old though she was she was still a doer.
“You don’t put your life into your books. You find it there.”
“No, Home Secretary. But then books, as I’m sure you know, seldom prompt a course of action. Books generally just confirm you in what you have, perhaps unwittingly, decided to do already. You go to a book to have your convictions corroborated. A book, as it were, closes the book.”
Image courtesy Google |

No comments:
Post a Comment