చాలా కాలం వరకూ పురాణేతిహాసాల్ని 'రూల్ బుక్స్' అనుకునేదాన్ని..హైందవ సమాజంలోని సంస్కృతీ,సంప్రదాయాలన్నీ అందులో సూత్రాల పునాదులమీదే గుడ్డిగా నిలబడ్డాయని ఒక బలమైన నమ్మకం ఉండేది..ఈ దేశంలో పుట్టినవారందరికీ చిన్నతనం నుండీ రామాయణభారతభాగవతాల్లోని కథలు చిరపరచితమే..ఇంట్లోవాళ్ళు చెప్పగా కొన్నీ,ఆనోటా ఈనోటా కొన్నీ,ఆధ్యాత్మిక ఉపన్యాసాల్లో కొన్నీ నేను కూడా అలాగే విన్నాను..కూలంకషంగా విషయాలు తెలీకపోయినా సుమారు ప్రతి కథా ఎక్కడో అక్కడ విన్నదో,చూసిందో అవ్వడం ఇక్కడ సహజమే అయినా యయాతి విషయానికొచ్చేసరికి ఆ పేరు వినడమే గానీ ఆయన కథ నాకు ఈ పుస్తకం చదివేవరకూ తెలీదు..అర్జునుడూ,కర్ణుడూ లాంటి హీరోలని గ్లోరిఫై చేస్తుకి కథలు చెప్పిన అమ్మనోట యయాతి కథ విన్న గుర్తేదీ లేదు.
Image Courtesy Google |
విష్ణు సఖారాం ఖండేకర్ రచనల్లో ప్రముఖంగా వినిపించే పేరు ఈ 'యయాతి'..1960లో సాహిత్య అకాడెమీ అవార్డు,1974 లో జ్ఞానపీఠ్ అవార్డులను గెలుచుకున్న ఈ నవలకు Y.P.కులకర్ణి చేసిన అనువాదం మరాఠీ మూలాన్ని చదువుతున్న అనుభవాన్నిచ్చింది..సుమారు నాలుగొందల ముప్ఫై పేజీల మరాఠీ మాతృకని ఈ ఆంగ్ల అనువాదంలో సగానికి కుదించారు...ఈ నవలని యయాతి,దేవసేన.. క్షమించాలి (బాహుబలి ఎఫెక్ట్ :) ) దేవయాని,శర్మిష్ఠ ఈ ముగ్గురి దృష్టికోణాలనుంచీ రాశారు..దేవయాని,శర్మిష్ఠ యయాతి భార్యలు కాగా,కచుడు యయాతికి మిత్రుడు...కథలో చాలా పాత్రలున్నప్పటికీ కథనం ముఖ్యంగా యయాతి,దేవయాని,శర్మిష్ఠ,కచుడు-ఈ నలుగురి మధ్యా నడుస్తుంది..కాళిదాసు శకుంతలలో కణ్వ మహర్షి శకుంతలను అత్తవారింటికి పంపుతూ,'యయాతికి శర్మిష్ఠ ఎంత ప్రీతి పాత్రమో నువ్వు నీ భర్తకి అంతటి ప్రీతిపాత్రమవ్వాలి' అని దీవించారుట..మహాభారతంలో ఈ ప్రస్తావన లేనప్పటికీ తాను కాళిదాసుని అనుసరించి ఈ కథకు రూపకల్పన చేశానంటారు ఖండేకర్.
ఇంద్రుణ్ణి జయించిన తరువాత అగస్త్యుడి ద్వారా శాపగ్రస్తుడైన నహుషుడి రెండో కుమారుడైన యయాతి జీవితం చిత్రంగా ఉంటుంది..నహుషుడు,అతని సంతానం ఎప్పటికీ సుఖంగా ఉండబోరనే శాపాన్ని ఆధారం చేసుకుని ఈ కథ నడుస్తుంది..యయాతి తల్లి ఒక వీరుడైన భర్తకు భార్య అయ్యే క్రమంలో యయాతికి తల్లి ప్రేమను పంచడంలో విఫలమవుతుంది..బాల్యంనుండీ భావుకుడైన యయాతి ఒక రాజుగా మారే క్రమంలో వేటాడడంలో,అస్త్రశస్త్రాల అభ్యాసాల్లో అతని తెలీకుండానే అతనిలోని భావుకుడు కనుమరుగైపోతాడు..తొలిసారి స్త్రీ ప్రేమను బంగారు శిరోజాలు కలిగిన దాసీ అలక ద్వారా రుచి చూస్తాడు కానీ తల్లి అలకను చంపించడం యయాతి మనసు మీద తీవ్రమైన గాయం చేస్తుంది..ఆ గాయం మానేలోపే,ఇంద్రుణ్ణి జయించిన పరాక్రమవంతుడైన తండ్రి నహుషుణ్ణి అంతిమఘడియల్లో చూసిన యయాతి చలించిపోతాడు..అంత సాధించినా తుదిఘడియల్లో అల్పంగా,పసిపిల్లాడిలా రోదిస్తూ మరణాన్ని అంగీకరించలేని తండ్రిని చూసిన యయాతికి మృత్యుభీతి మొదలవుతుంది..ఇంత అందమైన ప్రపంచంలోని సుఖాలన్నిటినీ వదిలి వెళ్ళిపోవాలని ఆలోచన అతన్ని క్షణం నిద్రపోనివ్వదు..కొడుకు మనస్థితి గ్రహించిన యయాతి తల్లి,పెద్ద కుమారుడు యతిలాగే యయాతి కూడా ఎక్కడ సన్యాసిగా మారతాడోననే భయంతో అతనికి పెళ్ళి చేస్తే మంచిదన్న ఆలోచనకొస్తుంది..అలకను చంపించిందన్న కారణంగా తల్లి మీద కోపంతో బ్రాహ్మణ స్త్రీ,శుక్రుడి కుమార్తె అయిన దేవయానిని వివాహమాడతాడు యయాతి..తొలిచూపులోనే దేవయాని సౌందర్యానికి దాసోహమని ఆమెను పెళ్ళాడినా,ప్రేమించిన కచుణ్ణి మనసులో ఉంచుకున్న దేవయాని యయాతి కోరుకున్న భార్య కాలేకపోతుంది..మితిమీరిన అహంభావంతో వృషపర్వుడి కుమార్తె అయిన యువరాణి షర్మిష్ఠ ను తన చెలికత్తె గా చేసుకునే దాకా నిద్రపోని పట్టుదల దేవయానిది..తరువాత యయాతి శర్మిష్ఠ ద్వారా తాను కోరుకున్న ప్రేమను పొందినప్పటికీ ఆమెను దేవయానికి భయపడి కుమారుడు పురూతో సహా దూరంగా పంపించేస్తాడు..ఆ తరువాత దేవయాని తనను తాకరాదని శాసించడంతో యయాతి జీవితం కళ్ళేలు లేని గుర్రంలా తయారవుతుంది..మరణ భయం ఒక వైపు,ఒంటరితనం మరోవైపు వెంటాడగా,ఆ స్పృహనుండి తప్పించుకునే మార్గాలు వెతుకుతూ క్రమేపీ భోగలాలసత్వానికి అలవాటుపడతాడు..అశోకవనంలో మద్యం సేవిస్తూ,స్త్రీలతో గడుపుతూ రాజుగా తన బాధ్యతల్ని పూర్తిగా విస్మరిస్తాడు..ఆ తరువాత యయాతి జీవితం ఏమైందనేది మిగతా కథ.
మొగల్ చక్రవర్తి హుమాయూన్ మృత్యుముఖంలో ఉన్నప్పుడు తండ్రి బాబర్ తన ఆయుష్షు కూడా తన కొడుక్కిమ్మని అల్లాను వేడుకున్నాడట..'అలాంటప్పుడు నేను కథ రాయాలంటే బాబర్ గురించి రాయాలి గానీ,కొడుకు యవ్వనాన్ని కోరుకున్న స్వార్ధపరుడైన యయాతి కథ ఎందుకు రాయాలనే' తలంపు వచ్చిందంటారు రచయిత..కానీ 'యయాతి' కథలో సంక్లిష్టత ఈ కథను రాయడానికి పూనుకునేలా చేసిందట..పురాణకథల్ని మూలం చేసుకుని ఫిక్షన్ రాసే రచయితల్లో ప్రధాన పాత్రల్ని వక్రీకరించడానికి అడ్డుపడే సంశయం ద్వితీయ శ్రేణి పాత్రల రూపకల్పన విషయంలో కొంత స్వేఛ్చను తీసుకుంటుంది..వ్యాసుడి శకుంతలకు,కాళిదాసు శకుంతలకూ ఉన్న తేడా ఆ స్వేఛ్చ ఫలితమేనంటారు ఖండేకర్..అదే విధంగా దేవయాని,శర్మిష్ఠ,కచుడి పాత్రల్లో తన కథకు అనుగుణంగా చాలా మార్పులూ-చేర్పులూ చేశారు..వీటన్నిటికీ కేంద్రబిందువుగా ఉండే యయాతి పాత్ర నామకః కథానాయకుడే గానీ నిజానికి ఈ కథలో కథానాయకుడు లేడు..యయాతి కచుడు,వీరిద్దరూ రెండు విభిన్న జీవితాలకు ప్రతినిధులు..రాజభోగాలతో కూడిన జీవనం హస్తినాపురానికి రాజుగా యయాతి జీవితమైతే,సన్యాసిగా సర్వసంగ పరిత్యాగి కచుడు..కచుడు తన ధర్మం కోసం నిలబడి,నిస్వార్ధంగా దేవయాని ప్రేమను తిరస్కరించి శుక్రాచార్యుడి నుండి సంజీవినిని(ఒక శ్లోకం) అపహరిస్తాడు..సంజీవిని అంటే మృతుల్ని పురుజ్జీవింపజేసే ఒక మూలిక అని రామాయణంలో చదువుకుంటాం..ఇక్కడ దానికి భిన్నంగా 'సంజీవిని' ఒక శ్లోకం అన్నారు..
అలాగే నహుషుడి కుమారులు యతి,యయాతి ఒకే నాణానికి రెండు వైపులు..స్త్రీ-పురుషులూ,శరీరం-ఆత్మా ఈ రెండూ Yin and Yang లా విడదీయలేనివి..ఈ రెంటిలో ఏ ఒక్కదాన్ని నశింపజేసినా రెండోదాని ఉనికి ఉండదు..యతి ఆత్మను నమ్ముకుని దేహాన్ని ద్వేషిస్తే,యయాతి దేహాన్ని నమ్ముకుని ఆత్మను విస్మరిస్తాడు..భౌతికసుఖాల్ని త్యజించి సన్యాసిగా మారిన యతి (యయాతి అన్న) ఆత్మసాక్షాత్కారం కోసం ఈ ప్రాధమిక సూత్రాన్ని విస్మరించి 'స్త్రీ' ని నశింపజెయ్యనిదే మోక్షమార్గం సాధ్యం కాదనీ భ్రమతో చివరకు మతిచలించి పిచ్చి వాడిలా మారతాడు..అలాగే ఆత్మను పూర్తిగా విస్మరించి దేహవాంఛలకు లొంగిపోయి విలాసాల్లో మునిగి తేలిన యయాతి మరో విధంగా తన కర్తవ్యంలో విఫలమవుతాడు..ఈ రెండు వైరుధ్యాలనూ సమన్వయం చేస్తూ కచుడి పాత్ర (యయాతి స్నేహితుడు/దేవయాని ప్రేమికుడు) నిస్వార్ధ జీవనమే జీవితపరమార్ధమని బోధిస్తుంది..అదే విధంగా దేవయాని తన స్వార్ధం కోసం యయాతిని వివాహం చేసుకుంటే,శర్మిష్ఠ తన రాజ్యం కోసం తన సుఖాన్ని త్యాగం చేసి దేవయానికి దాసీగా వెళ్తుంది..హస్తినాపురాధీశుడిగా,భౌతిక వాంఛల్ని అదుపులో పెట్టుకోలేని బానిసగా,చివరకు తన వృద్ధాప్యాన్ని కొడుక్కి ఇచ్చి అతని యవ్వనాన్ని గ్రహించిన యయాతి ఈనాటి స్వార్ధపూరిత సమాజానికి ప్రతినిధిగా,ఉదాహరణగా కనిపిస్తాడు..కానీ యయాతి వైఫల్యాల్లో దేవయాని,యయాతి తల్లి కూడా భాగస్వాములుగా కనిపిస్తారు..పురాణ కథల్లో ఉండే ప్రత్యేకత ఏంటంటే ఇతను నాయకుడూ,ఇతను ప్రతినాయకుడూ అంటూ ఎవరికీ టాగ్స్ తగిలించరు..ఆ పాత్రలూ,వ్యక్తిత్వాల తీరుతెన్నుల్నీ,వాటి పర్యవసానాల్నీ మాత్రమే వివరించి వదిలేస్తారు..ఈ రచనలో కూడా ఖండేకర్ అదే చేశారు..మంచి-చెడు,ధర్మాధర్మాల నిర్ణయం అచ్చంగా పాఠకులకే వదిలేశారు.
పుస్తకం నుండి కొన్ని వాక్యాలు..
The world errs, even realises the errors, but seldom learns from them.
The central theme of all was this: The world is sustained by the struggle for power, lives on rivalry and conflict and strives for sensual pleasure.
‘There is only one abiding happiness in life ... eternal happiness. Worldly pleasures end in unhappiness ... be it the pleasure of touch or sight. The body is man’s greatest enemy. It is the prime duty of man to strive persistently for mastery over the body.
With his hand on my shoulder, he said, ‘Yayati, one day you will be king. You will be a sovereign. You will celebrate a hundred sacrifices. But never forget that it is easier to conquer the world than to master the mind ...’
Once a lovely sweet fruit had a worm in it. He turned to me and said, ‘Prince, life is such. It is sweet and beautiful but no one knows how and when it will be infected.’ He paused in deep thought and recited a verse which said, ‘In life, it is the sweet fruit that is most likely to be infested.
Is knowledge a curse or a blessing bestowed on man? Is youth which comes to all living beings a blessing or a curse? Youth is the first step towards old age. And death is the last step. How can it be youth if it lures old age? It is a terrible curse!
In this world everybody obviously lives for himself. As the roots of the trees and creepers turn to moisture nearby, so do men and women look for support to near relations for their happiness. This is what the world calls love, affection or friendship. In fact, it is only the love of self. If the moisture on one side dries up, the trees and the creepers do not dry up, but their roots look for it elsewhere, be it far or near. They find it, draw it in and so remain fresh.
Yayati, death is as inevitable as it is distasteful to all living beings. That is a part of the routine of all creation, as dramatic and mysterious as birth. As the delicate reddish foliage just appearing on the trees in spring is the play of the power of creation, equally so, is it seen in the faded yellow leaves falling off in autumn. That is just how one must view Death. Sunrise and sunset, summer and winter, light and shade, day and night, woman and man, pleasure and pain, body and soul and life and death are all inseparable pairs. Life manifests itself in such quality. It is with such web and woof, that the Prime Power weaves the fabric of the life and growth of creation.
Only one part of Angiras’ letter was truly touching. That was the tears which came to his eyes while writing about Kacha’s death and words that were disfigured thereby. Tears and the disfigured words! All the rest was preaching, just dry philosophy.
I had heard of the heavenly bliss that crowns the union of lovers. An empty pot reverberates while being filled; but the sound ceases when it is full to the brim. The hearts of lovers are the same; I recalled one poet describing this blessed state with the words — when the hearts are filled with love, there is no room for words.
One whose only thought is for himself, one who is absorbed in oneself, one who looks at the world through one’s eyes alone, indeed one who does not see the world as anything beyond oneself is never able to realise the sensibilities of another; but engaged in self worship, unconsciously turns blind in his/her mind and deaf in his/her heart.
Life is full of numerous conflicting duals. An ascetic does achieve and experience eternal happiness in a condition where duals cease to exist. To realise it he adopts a rigid code of conduct. But this code rests essentially on his acceptance of the fact that conflicting duals do exist. It is only when the soul reveals its existence through the body that it can see the world. If the woman does not bear the child for nine months, how can man be born? How elementary these facts are! The ordinary man accepts them as a part of his life. Being a natural part of creation, he accepts its suzerainty.
No comments:
Post a Comment