Image courtesy Google |
నేను : "మీరు పుస్తకాలు ఎందుకు చదువుతారు ?"
వారు : జ్ఞాన సముపార్జన కోసం..
(ఇంకో ప్రశ్న వేయాల్సిన అవసరం కనపడలేదు నాకు)
వారు : మరి మీరెందుకు చదువుతారు ?
నేను : ఆనందం కోసం...
వారు : మరి పుస్తకాల గురించి రాస్తారు అన్నారు కదా ! వాటికి మనీ పే చేస్తారా ఎవరైనా ?
నేను : లేదండీ..ఇవ్వరు..అదొక హాబీ అంతే..
(ఈసారి ఇంకో ప్రశ్న వెయ్యడం అనవసరమని వారికి తోచింది.. నేను చేసే పని వల్ల ఉపయోగం వారికి కనపడలేదు మరి)
నేను : మీకు సినిమాలు ఇష్టమా ?
వారు : అవును..విపరీతమైన పిచ్చి
నేను : నాక్కూడా.. మరి మీరు మీ జీవితంలో విలువైన రెండున్నర గంటలు కూర్చుని సినిమా చూసినందుకు మీకు థియేటర్ యాజమాన్యం ఎంత పే చేస్తారు ?
వారు : (నన్ను పిచ్చి దాన్ని చూసినట్లు చూసి,పగలబడి నవ్వారు)
నేను : ఇందాక మీరడిగిన ప్రశ్న కి నాక్కూడా అలాగే నవ్వొచ్చిందండీ..
వారు : ........... ...... ...... ......
మీరు పుస్తకాలెందుకు చదువుతారు ? ఈ ప్రశ్న చాలా సార్లు చర్చకి వచ్చింది..గూగుల్ ప్లస్ లో చాలా సార్లు స్నేహితుల మధ్య ఈ విషయంలో చర్చలు జరిగాయి.. అప్పుడు నన్ను నేను ప్రశ్నించుకునేదాన్నినిజమే నేను ఎందుకు చదువుతాను అని ? దాని వల్ల ఉపయోగం ఏదైనా ఉందా ? అని !!!
సంతోషానికి నిర్వచనాలు మనిషికీ మనిషికీ ఎలా మారతాయో,ఈ చదవడానికి కూడా కారణాలు మనిషికీ మనిషికీ మారతాయి..ఈ ఎందుకు చదువుతారు అనే ప్రశ్న ఒక్కోసారి చాలా టిపికల్ గా,కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది..హెర్మన్ హెస్సే సిద్ధార్థ చదివి సుమారు నాలుగేళ్ళకి పైనే అయ్యిందనుకుంటా...అందులో సిద్ధార్థుడు 'గౌతమ బుద్ధుణ్ణి' కలవడానికి వెళ్ళి,ఆయన చూపించే మార్గం తనకి ఉపయోగం లేదని నిర్ధారించుకుని తన దారి తాను వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు..సిద్ధార్థుడి స్నేహితుడు గోవిందుడు మాత్రం బుద్ధుడి దగ్గర ఉండిపోతాడు..ఇక్కడ సిద్ధార్ధుడు తెలుసుకున్న విషయం ఏంటంటే జీవితపరమార్ధం తెలుసుకునే దిశగా ప్రతి మనిషీ ఒక ప్రత్యేకమైన మార్గంలో నడవాల్సి ఉంటుందనీ,అది గురువునో,మరొకర్నో అనుసరిస్తే జరిగేది కాదనీను...విద్య,దానితో పాటు వచ్చే జ్ఞానం గురువు దగ్గర అభ్యసిస్తే వచ్చేది..కానీ వాటిని మాధ్యమాలుగా చేసుకుని (టూల్స్ గా ఉపయోగించి) జీవితపరమార్ధం తెలుసుకోవడం ఎలా అనేది ఎవరికివారు చెయ్యాల్సిన పని..(Information is not knowledge)..అది గురువుల వద్ద అభ్యసిస్తే వచ్చేది కాదు.ఇదంతా ఎందుకంటే ప్రతి మనిషీ,చేసే ప్రతి పనికీ ఏదో ఒక 'purpose' (లక్ష్యం అనండి పోనీ) ఉండాలని నియమమేమీ లేదు..ఆ మధ్య ఉర్సులా లెగైన్ కూడా ఒక సందర్భంలో 'నో టైం టు స్పేర్' లో "ఆధునిక సమాజం కాలాన్ని ధనంతో ముడిపెట్టి చూస్తోందనీ,ఇది ఆర్ట్ కి పెద్ద అవరోధమనీ" అంటారు..సంతోషాన్నిచ్చే ఏ పనినీ డబ్బుతో ముడివెయ్యకూడదని ఆవిడ వాదన...ఒక స్ట్రాటజీ,ప్లానింగ్ ప్రకారం చేసేది 'పని' అవుతుంది గానీ 'కళ' కాదు..అందులోనూ సాహిత్యం లాంటివి రూల్స్,స్ట్రాటజీస్,ప్లానింగ్ లాంటి వాటికన్నిటికీ అతీతమైనవి..ఈ లిటరేచర్ అనే మాధ్యమం బాహ్య ప్రపంచాన్ని తెలుసుకోడానికి అనే కంటే మనల్ని మనం తెలుసుకోడానికే ఎక్కువ ఉపయోగపడుతుంది అని నేననుకుంటాను..ఇది నా అనుభవం మాత్రమే..సుభాషిత రత్నకోశంలో ఒక పద్యాన్ని Octavio Paz అనువదించారు,ఈ సందర్భంగా అది గుర్తొచ్చింది..
రచయితలు కూడా నాకు తెలిసినంతలో ఈ చదవడం అనేదాన్ని ఒక ప్లాన్ ప్రకారం చేసి ఉండరు..చాలా కొద్ది exceptions అన్ని చోట్లా ఉంటాయనుకోండి..పెద్దయ్యాక పెద్ద రచయిత కావాలి కాబట్టి నేను ఇప్పటినుండే చదవడం మొదలు పెడతాను,రాయడం మొదలు పెడతాను అని ఏ గొప్ప ఆర్టిస్ట్ అనుకుని ఉండరు..వారికి స్వతః సిద్ధంగా ఉన్న passion తో పని చెయ్యడం వలన ఆటోమేటిక్ గా వారికి దిశానిర్దేశం జరిగి గమ్యానికి చేరువవుతారేమో.. టాల్స్టాయ్,ఠాగోర్,వైల్డ్ లాంటి వాళ్ళని చదివినప్పుడు జీవితసారాన్ని వడబోసిన ఒక గురువు పాఠం చెప్తుంటే శ్రద్ధగా వాళ్ళ అనుభవాల నుంచి నాకు తెలీనిదేదో తెలుసుకుంటున్న భావన కలుగుతుంది..అదే Krzhizhanovsky,పెస్సోవా,కామూ,బిల్ వాటర్సన్ లాంటి వాళ్ళు తొలిపరిచయంలోనే ఆప్తుల్లా,సన్నిహితుల్లా అనిపించారు..నా నమ్మకం ప్రకారం రచయితలందరూ conformity ని ఎద్దేవా చేసేవాళ్ళే అయినప్పటికీ,ఈ రెండో రకం గ్రూప్ బొత్తిగా 'misfits' అనిపిస్తుంది..'అందరూ చదివే పుస్తకాలు చదివితే అందరిలాగే ఆలోచిస్తారు' అని అదేదో quote ఉంటుంది..మరి నేను misfit కావడం వల్లనో మరొకటో గానీ మెజారిటీ పాఠకులు ఇష్టపడే పుస్తకాలు నాకు ఎప్పుడూ నచ్చలేదు..అలాగే సమకాలీన సాహిత్యం చదివే ఆసక్తి కూడా తక్కువ..May be I love the company of misfits..అదృష్టవశాత్తూ నాకు ప్రతి చోటా నాలాంటి వాళ్ళు కొందరు తగుల్తుంటారు,అదొక వరం..పుస్తకాలు చదవడం ద్వారా ప్రపంచాన్ని గురించీ,తోటి మనుషుల గురించీ తెలుసుకోవాలనే ఆసక్తి ఎప్పుడూ లేదు,కానీ నా చుట్టూ ఉన్న ప్రపంచానికి అతీతమైనదేదో తెలుసుకోవాలనే తపన మాత్రం ఉంది..అదేంటి అనడిగితే నాక్కూడా జవాబు తెలీదు..జవాబు చెప్పకుండా తప్పించుకుంటున్నానంటారా !!! Every sort of indulgence is a form of escape.. :) కానీ ఈ ప్రయాణాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తున్నానని మాత్రం చెప్పగలను..
ఇంతకీ నేను పుస్తకాలు ఎందుకు చదువుతాను ? పోనీ మీరెందుకు పుస్తకాలు చదువుతారు ???
చాలా కాలం క్రితం రాసుకున్న కొన్ని అక్షరాలతో ఈ పోస్ట్ ముగిస్తాను..
I read...
Some times for pleasure..
Sometimes as an escape..
Sometimes for company..
And among all,just for the love of reading..
I don't read..
To attain wisdom..
To acquire knowledge..
To be a better person..
And among all I don't read because reading is something good...
What I read,
I read good and bad books (?) equally...
I start my day as a blank sheet of paper and everything I read on that day makes a simple pattern on it which becomes 'Me' for that day....And that 'Me' could be anything..
What is 'reading' like,
Reading is like any other simple addiction/obsession..
Sometimes it made me feel better...
Sometimes it made me feel sick...
"నేనెందుకు రాస్తున్నాను?" అని పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారనుకుంటాను, చాలా మంది రచయితలకి ఈ ప్రశ్న వేసి, ఆ జవాబులతో ఓ పుస్తకమే ప్రచురించారు. మీ పోస్ట్ ప్లస్‌లో చూడగానే అదే గుర్తొచ్చింది. కొన్నింటికి కారణాలు వెదకాలేము, విడమరచి చెప్పా లేము..:)
ReplyDeleteNice poem at the end of the post!
చాలా కాలానికి :) థాంక్ యూ మానస గారూ :)
DeleteBravo
ReplyDeleteThank you Narayana Swamy garu :)
Delete"Sometimes it made me feel better...
ReplyDeleteSometimes it made me feel sick..."
So true. both are equally lovelier times :)
Good one.
True :) Thank you Sunitha :)
Deletevery insprirational medam
ReplyDeletei am new in bloging