Sigizmund Krzhizhanovsky...పలకడానికి కూడా వీల్లేని ఈ పేరేంటి అనుకున్న పేరునే గత నెలరోజులుగా అదేపనిగా జపం చేస్తున్నాను..ఈయన రాసిన 'The Autobiography of a Corpse' కథలు చదివాకా వెంటనే అమెజాన్ లో మరో రెండు పుస్తకాలు ఆర్డర్ చేసుకున్నాను..కానీ నాలో Krzhizhanovsky ఫీవర్ క్రోనిక్ అయిపోతున్న దశలో సరిగ్గా వేసవి సెలవులు రావడంతో పుస్తకం చేతిలో ఉన్నా ఎప్పుడెప్పుడు చదువుతానా అని వేచి చూడాల్సొచ్చింది..అప్పటికీ మధ్య మధ్యలో పేజీలు తిప్పుతున్నా ఉహూ,అస్సలు పది పేజీలు కూడా సరిగ్గా చదవలేకపోయాను...బహుశా ఈయనకున్న ఇంట్రోవర్షన్ వైరల్ అనుకుంటా..ఎయిర్పోర్టుల్లోనో ,ట్రైన్లోనో,నలుగురి మధ్యా,ఎప్పుడు పడితే అప్పుడు కూర్చుని చదివే రచయిత ఈయన కాదు..మునుపు చెప్పినట్లుగానే Krzhizhanovsky ని అర్ధం చేసుకోవాలంటే మొట్టమొదట కావాల్సింది పూర్తి స్థాయి ఏకాంతం..మెడిటేషన్లో కూర్చున్నట్లు కూర్చుని చదివితే గానీ అర్ధమయ్యే కథలు కాదు..పాఠకుడూ,ఆయనా తప్ప ఈ ప్రపంచంలో వేరే ఏదీ లేనట్లుండే ట్రాన్స్ లో ఆయన అక్షరాలు మనల్ని అద్భుతమైన ఆబ్స్ట్రాక్ట్ లోకాల్లోకి తీసుకెళ్తాయి..
|
Image courtesy Google |
సరే పుస్తకం విషయానికొస్తే,"లెటర్ కిల్లర్స్ క్లబ్" ..ఈ టైటిల్ ఏంటి విచిత్రంగా !జీవం లేని అక్షరాలకు రచయితలు తమ భావాలతో ప్రాణం పోస్తారని తెలుసు గానీ ,ఈ ప్రాణాలు తియ్యడమేంటో అనుకుంటూ చదవడం మొదలుపెట్టాను..'ది లెటర్ కిల్లర్స్ క్లబ్' అనే రహస్యమైన క్లబ్ కి ప్రెసిడెంట్ అయిన Zez నమ్మకం ప్రకారం,ఏదైనా ఒక ఆలోచన గానీ,భావన గానీ అక్షరరూపంలోకి మారినప్పుడు,అవి పుస్తకంలో ప్రింటెడ్ పేజీ మీద జూలాజికల్ స్పెసిమన్ లుగా ట్రాప్ చెయ్యబడి,జీవం కోల్పోతాయి..ఇది ఆర్టిస్టు ఇమాజినేషన్ కి అవరోధమని భావించే Das,Tyd,Hig,Mov,Fev,Rar అనే మరి కొందర్ని కూడా కలుపుకుని శనివారం సాయంత్రాలు రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తాడు Zez...ఈ క్లబ్ సభ్యులు తమను తాము రీడర్స్ గానో,రైటర్స్ గానో కాక 'కన్సీవర్స్' గా చెప్పుకుంటారు.
మరి విమర్శలు,ఆటుపోట్లు లేకుండా సూర్యకాంతికి దూరంగా చీకట్లో పుట్టి,చీకట్లో కలిసి పోయే కళ (కథ) కాలపరీక్షకు తట్టుకుని నిలబడటానికి యోగ్యమైనదేనా అని ఈ క్లబ్ లో వ్యక్తి రార్ (Rar) లేవనెత్తిన ప్రశ్నకు సమాధానాలు వెతికే క్రమంలో మన నేరేటర్ ను ఎనిమిదో వ్యక్తిగా ఆ క్లబ్ కు ఆహ్వానిస్తారు..ఒక గదిలోని ఖాళీ బుక్ షెల్ఫ్ ల మధ్య,ఫైర్ ప్లేస్ ముందు కూర్చుని,అందరికీ ప్రవేశార్హత లేని సెయింట్ ఫ్రాన్సిస్ పూలతోట లాగే ఈ సమావేశం కూడా రహస్యంగా జరుగుతుంటుంది..తమలోని ఆలోచనల్ని అక్షరీకరించకుండా , మెదడులో ప్రాణం పోసుకున్న కథల్ని అక్కడికక్కడే మిగతా ఏడుగురికీ చెప్తారు..అంటే కలమూ,కాగితమూ లేకుండా కథ,చెప్పేవారి నోటి నుండి,వినేవాళ్ళ చెవులకు ప్రయాణిస్తుంది..సమావేశం పూర్తి కాగానే ఎక్కడివారక్కడికి వెళ్ళిపోతుంటారు..
"షేక్స్ పియర్ ను ఇంగ్లీషు లిటరేచర్ ని రెండొందల ఏళ్ళుగా అణచివేసిన Wildly overgrown tree గా గోథే అభివర్ణిస్తే ,గోథే ను జర్మన్ సాహిత్యపు శరీరంలో వేళ్ళూనుకున్న monstrous కాన్సర్ గా Borne పోల్చారని" ఒక సందర్భంలో జెజ్ తన మిషన్ ను సమర్ధించుకుంటూ నేరేటర్ తో చెప్పే మాటల్లో మన రచయితకు,సాహిత్యంలోని సంప్రదాయవాదాల మీద ఉన్న తిరుగుబాటు ధోరణి వ్యక్తమవుతుంది..మరి జెజ్ తన సీక్రెట్ మిషన్ లో సఫలీకృతుడయ్యాడా లేదా అన్నది మిగతా కథ..
“Writers, in essence, are professional word tamers; if the words walking down the lines were living creatures, they would surely fear and hate the pen’s nib as tamed animals do the raised whip.”
రార్ చెప్పే తొలి కథ (నాటకం) Actus Morbi (History of illness) హేమ్లెట్ స్వభావంలోని డ్యుయాలిటీని థీమ్ గా తీసుకుని చెప్తారు..హేమ్లెట్ పాత్ర పోషించడానికి Guilden మరియు Stern అనే ఇద్దరు స్టేజి ఆర్టిస్టులు పోటీ పడగా స్టెర్న్ ను 'ల్యాండ్ ఆఫ్ రోల్స్' లోని మూడువందల ఏళ్ళనాటి తొలి హేమ్లెట్ పాత్రధారి రిచర్డ్ బర్బేజ్ పాత్ర ఆవహిస్తుంది..ఈ కథ హ్యూమన్ consciousness సామర్ధ్యాన్ని అంచనా వేసే దిశగా అక్కడక్కడా హాస్యపూరిత సంభాషణలతో సాగుతుంది..
Hamlet is,in essence,a duel between Yes and No.
It doesn't matter what's not clear to you.I stopped all the pipe's vents.All of them.The pipe player doesn't ask what happens next:he should know himself.After every gist comes the rest.On this point I agree with Hamlet:'The rest is silence .'Curtain."
రెండో శనివారం Tyd చెప్పే మూడు కథలూ 'The Feast of the Ass','The Goliard's Sack' , 'Notker the Stammerer and The Four Gospels' క్రిస్టియన్ మతంలోని నమ్మకాల ఆధారంగా నడిచే కథలు..
Since it's hard to improvise with people because they are alive (even the invented ones) and sometimes act outside the authorial design,if not contrary to it,I must fall back on enduring heroes.
My third character, the human one, belongs not to people-plots, but to people-themes: people-plots are very troublesome for a writer-their lives contain so many acts, encounters, and coincidences; put them in a story and they expand it to a novella, or even a novel; people-themes exist immanently, their plotless lives are off the main roads, they are part of an idea, reticent and passive; one of these is my hero.
ఈ పుస్తకంలో అమితంగా ఆకట్టుకున్న ఒక అంశం,Tyd ప్రస్తావించే 'పీపుల్ ప్లాట్స్ Vs పీపుల్ థీమ్స్'..ఈ విశ్లేషణ Krzhizhanovsky రచనల్లోని అబ్స్టాక్ట్ కాన్సెప్ట్స్ ను మరింత లోతుగా అర్ధంచేసుకోడానికి తోడ్పడుతుంది..ప్రపంచంలో 'పీపుల్ ప్లాట్స్ , పీపుల్ థీమ్స్' అని రెండు రకాలుంటాయట..ఈ రెంటిలో పీపుల్ ప్లాట్స్ అనేవి చాలా సాధారణమైనవి,వ్యక్తులను ఆధారంగా చేసుకుని అల్లే కథలన్నమాట...వీటిల్లో సహజంగా ఉండే 'నేను' ఉనికిని కోరుకుంటుంది..కానీ పీపుల్ థీమ్స్ అనేవి అరుదైనవి..ఇవి ఒక మనిషికి సంబంధించినవిగా కాక,ఒక ఆలోచనకీ,భావానికీ సంబంధించినవి..మల్టీ డైమెన్షన్స్ లో అందరి దృష్టికీ అందని ఈ థీమ్స్ అబ్స్ట్రాక్ట్ గా ,నిష్క్రియాత్మకంగా,అంతర్ముఖంగా ఉంటూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం అస్సలు చెయ్యవు..పాఠకులే వాటిని వెతుక్కుంటూ వెళ్ళాలి...విపరీతమైన అంతర్ముఖుడైన మన రచయితకు ఈ రెండో పధ్ధతి అంటే ప్రాణం..అందుకేనేమో ఆయన కథలన్నీ పీపుల్ థీమ్స్ ఆధారంగానే రాస్తారు..
మూడో శనివారం దాస్ చెప్పే Exes కథ ఒక డిస్టోపియాన్ హారర్ స్టోరీ, 'ఆటోబయోగ్రఫీ ఆఫ్ అ కార్ప్స్' లోని 'ఎల్లో కోల్' కథని తలపించింది..ఈ పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్ కథ చాలా ఆసక్తికరంగా సాగుతుంది..నేటితరంలో చూస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఐ రోబోట్ లాంటి కాన్సెప్ట్స్ ను టెక్నాలజీ అందుబాటులోలేని ఆ రోజుల్లోనే తన కలంతో అలవోకగా రాసేశారు Krzhizhanovsky..చాలా కథల్లో భాగంగా ప్లేటో,అరిస్టాటిల్,గోథే వంటి వారి ఫిలాసఫీలను ప్రస్తావిస్తూ సాగే నేరేషన్ ఫ్లో ని అందుకోడానికి కొన్ని చోట్ల కష్టం అనిపించినా , మరోచోట Fev చెప్పిన 'Tale of the three mouths' కథలోని Ing,Nig ,Gni లను విష్ణుశర్మ పంచతంత్రంలో ముగ్గురు బ్రాహ్మణులతో పోల్చడం కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది....ఈయన్ని రష్యన్ బోర్హెస్ గా ఎందుకు అభివర్ణిస్తారో ఈ పుస్తకం చదివాకా పూర్తిగా అర్ధం అయ్యింది..తన రచనలు అందరికోసమో,కొందరికోసమో కాదని ఘంటాపథంగా చెప్పే బోర్హెస్ గళాన్ని తనదైన శైలిలో మరోసారి వినిపించే ప్రయత్నం చేశారు రచయిత..మెయిన్ స్ట్రీమ్ కు ఎదురెళ్ళడమనేదే విప్లవమైతే నాకు Krzhizhanovsky శైలిలో అణువణువునా ఆ విప్లవాత్మక ధోరణి కనిపిస్తుంది ..ఈయన రచనల్లో భూతద్దం పెట్టి వెతికినా దొరకని ఒకే ఒక్క వస్తువు 'conformity' ..
ఈ టైటిల్ చూడగానే పాఠకుల్లో తలెత్తే అనేక ప్రశ్నలకు Caryl Emerson ముందుమాటలో పొందుపరచిన,Krzhizhanovsky రచనా వ్యాసంగంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు ధీటైన సమాధానాలిస్తాయి.ఎప్పుడూ నాకు పుస్తకం చదివేశాక ముందు మాట చదవడం అలవాటు..ఈ ముందు మాటలో Krzhizhanovsky ని గురించిన కొన్ని విషయాలు చదివాకా మనసంతా చేదుగా అయిపోయింది..ఒక రచయితగా అనేక వైఫల్యాలను (?) చూసిన Sigizmund Krzhizhanovsky ఒక దశలో అక్షరాల్ని కూడా గుర్తుపట్టలేని స్థితిలో, సైకియాట్రిస్ట్ "Do you love Pushkin ?"అని అడిగిన ప్రశ్నకు "I...I ........" అని తడబడుతూ ఉన్నట్లుండి పసిపిల్లాడిలా ఏడ్చారని ఆయన భార్య Bovshek చెప్తూ ఆ సమయంలో 30 ఏళ్ళుగా అదిమిపట్టిన కన్నీళ్ళ ప్రవాహంలో,ఒక రచయిత అమూల్యంగా భావించే అక్షరాలు కూడా ఆనవాలు లేకుండా కొట్టుకుపోయాయంటారు...ఈ ఘట్టం చదివి చాలా బాధేసింది..ఈ సంఘటన చూస్తే,1925-27 మధ్య రాసిన 'ది లెటర్ కిల్లర్స్ క్లబ్ ' లో ఒక రచయితకు అక్షరాలను చంపాలన్న ఆలోచన రావడం కేవలం కాకతాళీయమేనా అనిపిస్తుంది..'Kantian thinker'(ఆదర్శవాది) గా పేరు తెచ్చుకున్న Sigizmund Krzhizhanovsky రచనలు బాగా ఇంటెలెక్చువల్ గా ఉండటం వలన అవి వర్కింగ్ క్లాస్ కు పనికిరావని 1932 లో మాక్సిమ్ గోర్కీ తీర్మానించడం గురించి చదివినప్పుడు గోర్కీ మీద విపరీతమైన కోపం వచ్చింది..దీనితో పాటు "మెటీరియలిస్టిక్ గా ఉండకుండా,తన ఆలోచనల్ని అమ్మకానికీ,తీర్పులకూ పెట్టడానికి నిరాకరించడం" Krzhizhanovsky వైఫల్యానికి కారణాలుగా చూపించడం ఇంకా దారుణం..
When in 1939 ,he was finally voted into the Soviet Writers Union,one of his sponsors explained the embarrassing delay by noting that Comrade Krzhizhanovsky,an erudite polyglot and drama critic,was "very modest and impractical,unable to do anything for himself".More precisely,he was unwilling to revise on command,either for censors or for well-meaning collaborators and editors.He did try to do things for himself-although high mindedly,rarely in a "practical" or politically savvy way.
'Bridge over the Styx' ను తలపించే ఆఖరి కథ ఈ పుస్తకానికి చరమగీతి వంటిది..Sept మరణించిన తరువాత ఆ మృతదేహం నోట్లో సంప్రదాయం ప్రకారం,కాయిన్ (obol)పెడతారు..ఆ ఒబోల్ ను తన మృతదేహం ప్రక్కనే కాపలాగా కూర్చున్న ఒక చిన్న పాప ఫ్యాబియాకి డేట్స్ కొనుక్కోడానికి ఇచ్చేస్తాడు సెప్ట్(కార్ప్స్) ...Acheron డెత్ వాటర్స్ క్రాస్ చెయ్యడానికి సెప్ట్ కు ఆ కాయిన్ కావాలి..కానీ అది లేక అటు డెత్ కీ లైఫ్ కీ మధ్య,ఆ చిన్న పాప వస్తే తన కాయిన్ తనకిచ్చేస్తుందని వేచి చూస్తూ ఉండిపోతాడు...ఈ కథకి Krzhizhanovsky ఇచ్చిన ముగింపు చదివి తీరాల్సిందే...ఒక రచయిత సత్తా తెలిసేది ఇలాంటి కథల్లోనే అనిపించింది..తమ భావాలను నిరంతరం మృతి చెందే అక్షరాల మధ్యా,సాహిత్యం మధ్యా స్వచ్ఛంగా,సజీవంగా ఉంచుకోవడమనే సవాలును స్వీకరించిన లెటర్ కిల్లర్స్ క్లబ్ సభ్యులకు Mov చెప్పిన ఈ చివరి కథ ఒక ఆణిముత్యం..మరో మాట లేదు..ఈ కథలో రచయితలు కథలు చెప్పే క్రమంలో సంభాషణల్ని "Now then...." " Therefore .. "అంటూ ముగించడం చూస్తే కర్ట్ వొన్నేగాట్ రచన 'స్లాటర్ హౌస్ 5' గుర్తొచ్చింది.. అంతే కాకుండా Letterlessness,Booklessness,Facteaters అంటూ Krzhizhanovsky వాడే కొన్ని పదాలు కూడా భలే ఉంటాయి..
ఈ రచన పార్ట్లీ ఆటోబయోగ్రఫికల్ ఏమో అని చదువుతున్నప్పుడు నాకు కూడా అనిపించింది..అదే నిజమంటూ కార్ల్ ఎమెర్సన్ కూడా చాలా సాక్ష్యాలు చూపించారు..ఉదాహరణకు తల్లి మరణవార్త విన్న జెజ్,ఊరెళ్ళ డానికి తన లైబ్రరీలో పుస్తకాలన్నిటినీ అమ్మి బయలుదేరతాడు.. తిరిగొచ్చాక ఖాళీ గా ఉన్న తన బుక్ షెల్ఫ్ లను చూసి తన consciousness లోనే తన పుస్తకాల తాలూకా ఇమాజినరీ ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు..ఆ క్షణం పునాదిగా జెజ్ 'గేమ్ ఆఫ్ కన్సెప్షన్స్' మొదలవుతుంది..ఇవన్నీ రచయిత జీవితంలో యదార్థంగా జరిగిన సంఘటనలే..రెబెల్ అనగానే మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వాళ్ళు గుర్తొచ్చినంతగా రోసా పార్క్స్ గుర్తురారని Quiet లో సుసాన్ కైన్ అన్నట్లు,రచనల విషయానికొచ్చేసరికి కామూ లాంటి వారు గుర్తొచ్చినంత తొందరగా బిల్ వాటర్సన్ లాంటి వాళ్ళు గుర్తురారు..మరి వారికీ వీరికీ భేదమేంటంటే ఈ రెండో రకంవారు ఇంట్రావర్ట్స్ కావడమే..ఇంట్రావర్ట్ రెబెల్స్..గట్టిగా అరిచి నిజాన్ని చెప్పడమే విప్లవం కాదని ఈ రచన ద్వారా తనదైన శైలిలో మరోసారి గుర్తు చేశారు Sigizmund Krzhizhanovsky.. ఇంతమంచి సాహిత్యాన్ని ముందుతరాలకు కానుకగా ఇచ్చిన రచయితకు శతకోటి వందనాలు..
పుస్తకం నుండి మరికొన్ని నచ్చిన వాక్యాలు,
Soon after that the youth locked away his keyboard and tried trading musical notes for letters; but he came up against an even greater obstacle; for he was- I repeat - person-theme, while our entire literature is based on plot constructions; he was unable to fragment himself and ramify ideas; he strove, as befits a person-theme, not from the one to the many, but from the many to the one. Sometimes a box of pens will contain an unsplit pen: it is just like the others, and no less sharp-but it cannot write.
Can one speak about silence without destroying it?
You cannot cross a threshold-from the inside or the outside-if the door is locked. I, of course, don't care about all those soul-like adjuncts known in the barbaric old days by such absurd names as -inner world' and so on-"
“I must do as he does; everything as he does-it's easier that way.”
I don't want to be an exon among inits. Why do you need me? You kill your letters, but I have none: neither conceptions nor letters. I repeat: I don't want to be an exon!”
I tried to prove that we are not conceivers but eccentrics, harmless only owing to our self-isolation. A conception without a line of text, I argued, is like a needle without thread: it pricks, but does not sew. I accused the others and myself of fearing matter. That's just what I called it: matterphobia. They attacked me, Zez worst of all. In my defense I said that I doubted our conceptions were conceptions since they hadn't been tested by the sun.-- Conceptions and plants can grow in the dark, botany and poetics can do without light,' Tyd riposted, supporting Zez.
But by the end of the week the thought of Rar had made me change my mind. From the first evening, this singularly original man had struck me as necessary and significant; his name, for all that it pretended to be a nonsense syllable, was the only one of them to suggest a meaning; nevertheless, the address bureau would not exchange it for an address.
life developments and plot developments merely cross, they do not coincide. Plotlines throw out disputes the way a plant throws out spores: into space, where they germinate. So then--I'm drifting --”
“Fooling people,” said Ing, “amuses only fools. Men's minds have become as coarse and flat as this field: it's easier to cackle than to think. Where are the syllogisms of the great Stagirite,the definitions of Averroes,Erigena's,hierarchy of ideas? People no longer know how to treat ideas: rather than look an idea in the eye, they peek under its tail.”
“Yes, the land of questions keeps expanding and multiplying its riches, the many-colored land of questions blooms ever more brightly and abundantly, while the land of answers is desolate, destitute, and dismal, like this graveyard. Therefore--”
The art of the literary endgame requires subtler and more varied denouements. To fall into a pit is easy, to climb out of it--if it's deep--is harder.
The stars are bright in the sky because of their "eternal separateness".Music,like happiness,succeeds only if it knows moments of silence or pause.And people most of the time,"are too close together to be close to one another".We perish not because of loneliness but because of entrapment and over-embracement.