Saturday, February 17, 2018

The Illustrated Man - Ray Bradbury

న న కర్తే ప్యార్ తుమ్హిసే కర్ బైఠే ! అని పాడుకుంటూ ఈ మధ్య సైన్స్ ఫిక్షన్ పుస్తకాల ప్రేమలో పడ్డాను..మొన్న ఉర్సులా లెగైన్ 'నో టైం టు స్పేర్' చదివాక,సైన్స్ ఫిక్షన్/ఫాంటసీలపై నాకున్న చిన్నచూపు ఇప్పుడు లేదు..కానీ ఆ పుస్తకం తరువాత వెంటనే రే బ్రాడ్బరీని చదవడం కేవలం కాకతాళీయం ! ఇందులో ఒక వ్యక్తి శరీరం నిండా పచ్చబొట్లలా పొడిపించుకున్న దృష్టాంతాలు అతని శరీరం నిండా అటూ ఇటూ కదులుతూ నిజమైన కథలుగా జీవం పోసుకుంటాయి..ఈ సంకలనంలో మొత్తం పద్ధెనిమిది కథల్లో తొలి సగం కథలు ఒక్కొక్కటీ ఒక్కో ఆణిముత్యమైతే మిగతా సగం కాస్త ఓపిగ్గా చదవాల్సిన కథలు..

Image Courtesy Google
So people fire me when my pictures move. They don’t like it when violent things happen in my Illustrations. Each Illustration is a little story. If you watch them, in a few minutes they tell you a tale. In three hours of looking you could see eighteen or twenty stories acted right on my body, you could hear voices and think thoughts. It’s all here, just waiting for you to look.

ఈ డెబ్భైల ముందు కాలంలో వచ్చిన కొన్ని రచనలు చదువుతున్నప్పుడు సమకాలీన సాహిత్యంలో ఏదో వెలితి ఉన్నట్లు అనిపించేది..పుస్తకం చదువుతున్నప్పుడు నచ్చిన వాక్యాలు నోట్స్/కోట్స్ రాద్దామంటే అదేమిటో ఏమీ దొరకవు..మరి సమకాలీన సాహిత్యంలో పేజీకో వాక్యం ఉంటుంది..అంటే ఆ వాక్యం మినహాయిస్తే  మిగలినదంతా సారవిహీనమైన పదబంధాల హడావుడి మాత్రమే..కానీ ఇలాంటి పుస్తకాల దగ్గరకొచ్చేసరికి కథలో ఆఖరిమెట్టు  దిగుతున్నప్పుడు గానీ రచయిత అంతరంగం పూర్తిగా బోధపడదు..ఆ కాలపు రచయితలకు తమ అక్షరాలంటే ఎంత ప్రేమంటే,తమ ఊహాశక్తిని ప్రతి పదానికీ విస్తరించి ప్రతి వాక్యాన్నీ అందంగా,అర్ధవంతంగా అలంకరించిగానీ తృప్తిపడనంత..నిస్సందేహంగా ఇలాంటి రచనలు సమకాలీన సాహిత్యంలో బహు అరుదు..ఇవి సైన్స్ ఫిక్షన్ కథలైనప్పటికీ మంటో,గుల్జార్,పిరాండెల్లో,కార్వర్ ల శైలికీ,ఈ కథల శైలికీ ఎక్కడో దూరపు చుట్టరికం ఉన్నట్లనిపించింది..

బ్రాడ్బరీ కథల్లో నేపధ్యం సమస్త విశ్వం,అందులో పాలపుంతలు,భూమి,మార్స్,వీనస్ లాంటి గ్రహాలూను..కానీ ఈ కథల్లో ఆత్మ మాత్రం మానవీయ విలువల చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటుంది..ఇందులో వ్యక్తులు మామూలు మనుషులు కాదు..కొందరు భూగ్రహ వాసులైతే,మరి కొందరు మార్షియన్లుంటారు,కొన్ని చోట్ల వీనస్ వర్షంలో చిక్కుకుపోయిన రాకెట్ మెన్లు కూడా తారస పడతారు..ఇందులో పాత్రలన్నీ అటూ ఇటుగా స్పేస్ ట్రావెల్ చేస్తుంటాయి,వార్ షిప్ లలో ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి వెళ్తూ సత్యాన్వేషణ సాగిస్తూ ఉంటాయి..మరి కొన్ని గతించిన కాలంలోకి టైం ట్రావెల్ చేస్తాయి,టెక్నాలజీని తుదికంటా ఉపయోగించుకుని షూ లేసులు కట్టించుకోడం మొదలు అన్నిటికీ రోబోట్లను ఉపయోగిస్తూ ఉంటాయి..1951 లో రాసిన ఈ కథలన్నీ మనల్ని ఒక శతాబ్దం ముందుకి తీసుకెళ్తాయి,అంటే ఇందులో 2051 కాలానికి చెందిన కథలు కూడా ఉంటాయి..భవిష్యత్తును ఊహిస్తూ రాసిన ఈ కథల్లో భూమి మీద సహజవనరులన్నీ యథేచ్ఛగా ఖర్చుపెట్టేసి మిగతా గ్రహాల వైపు ఆశగా చూస్తున్న మానవుడు కనిపిస్తాడు..ఇందులో వ్యక్తుల సమస్యలు కూడా సమస్త విశ్వంతో ముడిపడి ఉంటాయి..పర్యావరణం కూడా మనిషితో సమంగా ఈ కథల్లో కీలక పాత్ర పోషిస్తుంది..

ఇవి సైన్స్ ఫిక్షన్ కథలు కదా అని మెటీరియలిస్టిక్ గా ఉంటాయనుకుంటే పొరపాటే..ప్రతి కథలోనూ భావోద్వేగాలు,నమ్మకాలూ,భక్తి లాంటివి అంతర్లీనంగా ఉంటాయి..అన్ని కథల్లోనూ మానవీయ విలువలకే పెద్ద పీట వేశారు బ్రాడ్బరీ..మనుషుల్ని బానిసలుగా చేసుకుంటున్న టెక్నాలజీ భూతాన్ని గురించి సున్నితంగా హెచ్చరించారు..అన్నిటిలోను నాకు బాగా నచ్చిన "The Veldt" కథ ఈ కాలానికి సరిగ్గా సరిపడే కథ..ముఖ్యంగా పెద్దలు తప్పకుండా చదవాల్సిన కథ..ఇది పిల్లలకు సెల్ ఫోన్లు,టీవీలు 24/7 అందుబాటులో ఉంచుతున్న పెద్దవాళ్ళకు హెచ్చరిక లాంటి కథ.."Kaleidoscope" అనే మరో కథ మనిషి జీవితంలో  ప్రాధాన్యతల్ని విశ్లేషించే కథ.. అలాగే  "The Other Foot" అనే కథ జాతి విద్వేషాలను ప్రక్కకు పెట్టి మనుషుల్ని సోదరభావంతో చూడాలనే నీతిని బోధిస్తుంది.. "The Man" ఇందులో నాకు బాగా నచ్చిన ఇంకో కథ..ఈ కథ అంధ మతవిశ్వాశాలను పునః సమీక్షించుకోమంటూ దైవత్వానికి సరైన నిర్వచనమిచ్చే కథ.. వరల్డ్ వార్ నేపథ్యంలో రాసిన "The Highway" కథలో కాస్త అబ్సర్డిటీ కూడా తొంగిచూస్తుంది..ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో కథలో ఒక్కో నీతి దాగుంటుంది..

బ్రాడ్బరీ కథల్లో నాకు నచ్చిన మరో విషయం ఏంటంటే ఆయన ఎక్కడా భారీ నిర్వచనాల జోలికి పోలేదు..హద్దులు గీయడానికి అస్సలు ప్రయత్నించలేదు..ఈ కథల పరిధి చాలా విశాలం..బిగ్ పిక్చర్ చూసేవాళ్ళయితే వీటికి మరింత  బాగా కనెక్ట్ అవుతారు..ఈ కథలకు హద్దులు నాలుగ్గోడలో,లేక ఊరి పొలిమేరలో,దేశాంతరాలొ,ఖండాంతరాలో కాదు..ఇవి మనిషిని కూడా పర్యావరణంలో భాగంగా చిత్రిస్తూ,విశాల విశ్వంలో అణువంత కూడా లేని  మనిషి,తన ఉనికిని తానే ప్రశ్నించుకునేలా చేస్తాయి..టెక్నాలజీ మోజులో తన ప్రాధాన్యతల్ని మర్చిపోయిన మానవ జాతి పట్ల రచయితలో పేరుకున్న అసంతృప్తి అన్ని కథల్లోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.."The Exiles" అనే మరో కథలో ఊహాశక్తికి తిలోదకాలిచ్చి ,టెక్నాలజీ పిచ్చి పరాకాష్టకు చేరగా భూమి మీద కాల్పనిక సాహిత్యాన్నంతటినీ కాల్చి బూడిద చెయ్యడానికి మనిషి పూనుకోవడం లాంటి కొన్ని కీలకాంశాలు మనల్ని ఖచ్చితంగా ఆలోచనల్లో పడేస్తాయి..ఇటువంటి కథల్ని ఇప్పటి వరకూ చదవలేదు అనడం చాలా అలవాటైన మాటే అయినా మరో సారి చెప్పక తప్పేట్లు లేదు..అవును ఇటువంటి కథల్ని ఇప్పటివరకూ చదవలేదు..

పుస్తకం నుండి మరి కొన్ని..
“That isn’t important,” said Hollis. And it was not. It was gone. When life is over it is like a flicker of bright film, an instant on the screen, all of its prejudices and passions condensed and illumined for an instant on space, and before you could cry out, “There was a happy day, there a bad one, there an evil face, there a good one,” the film burned to a cinder, the screen went dark.

There were differences between memories and dreams. He had only dreams of things he had wanted to do, while Lespere had memories of things done and accomplished. And this knowledge began to pull Hollis apart, with a slow, quivering precision.

“Maybe we’re looking for peace and quiet. Certainly there’s none on Earth,” said Martin.

Why, the chances are one in billions we’d arrived at one certain planet among millions of planets the day after  he  came! You must know where he’s gone!”
"Each finds him in his own way,” replied the mayor gently.

"Don’t ever be a Rocket Man.” I stopped.
“I mean it,” he said. “Because when you’re out there you want to be here, and when you’re here you want to be out there. Don’t start that. Don’t let it get hold of you.”

I remembered him in the garden, sweating, and all the traveling and doing and listening, and I knew that he did this to convince himself that the sea and the towns and the land and his family were the only real things and the good things.

Coming out of space was like coming out of the most beautiful cathedral they had ever seen. Touching Mars was like touching the ordinary pavement outside the church five minutes after having  really  known your love for God.

I’ve always figured it that you die each day and each day is a box, you see, all numbered and neat; but never go back and lift the lids, because you’ve died a couple of thousand times in your life, and that’s a lot of corpses, each dead a different way, each with a worse expression. Each of those days is a different you, somebody you don’t know or understand or want to understand.”

“We’re all fools,” said Clemens, “all the time. It’s just we’re a different kind each day. We think, I’m not a fool today. I’ve learned my lesson. I was a fool yesterday but not this morning. Then tomorrow we find out that, yes, we were a fool today too. I think the only way we can grow and get on in this world is to accept the fact we’re not perfect and live accordingly.”

Did you know I wanted to be a writer? Oh yes, one of those men who always talk about writing but rarely write. And too much temper.

“There are blond robots with pink rubber bodies, real, but somehow unreal, alive but somehow automatic in all responses, living in caves all of their lives. Their  derrières  are incredible in girth. Their eyes are fixed and motionless from an endless time of staring at picture screens. The only muscles they have occur in their jaws from their ceaseless chewing of gum.

No comments:

Post a Comment