Saturday, April 1, 2017

2BR02B - Kurt Vonnegut

Image Courtesy Google
రెండేళ్ల క్రిందట అనుకుంటా Lois Lowry డైస్టోపియన్ రచన 'The Giver' Quarter చదివినప్పుడు ఈ కాల్పనిక కథ భవిష్యత్తులో వాస్తవంగా మారబోతోందా అని అనిపించింది..మామూలుగా సైన్స్ ఫిక్షన్/డైస్టోపియన్/ఫాంటసీ రచనలకు ఆమడ దూరంలో ఉండే నేను Giver గురించి తరచూ వినడంతో,సరే ఒకసారి ప్రయత్నిద్దాం అని చదివాను..అది ఈరోజుకీ మర్చిపోలేని రచనల్లో ఒకటిగా మిగిలిపోయింది..మళ్ళీ ఇంతకాలానికి ఆ పుస్తకాన్ని గుర్తుకు తెచ్చింది Kurt Vonnegut రాసిన కథ 2BR02B..ముందుతరాల్లో రాజకీయ సామాజిక పరిస్థితులను గురించిన భవిష్యవాణిని 1940 లలోనే తన రచనల్లో పొందుపరచిన George Orwell రచనల్లాగే ఇది కూడా రాబోయే రోజుల్ని మన కళ్ళ ముందు నిలబెడుతుంది..1962 లో ప్రచురితమైన ఈ సైన్స్ ఫిక్షన్ కథ ఒకే విషయాన్ని రెండు మూడువందల పేజీల రచనగానూ చెప్పొచ్చు,ఇరవై పేజీల్లోనూ చెప్పచ్చు అనడానికి ఒక మంచి ఉదాహరణ..కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కేవలం 28 పేజీలున్న ఈ కథ ఒక పెద్ద నవల చదివిన అనుభూతికి సరిసాటిగా నిలుస్తుంది ..

"Everything was perfectly well"  అంటూ మొదలయ్యే ఈ To Be or Naught to be (2BR02B) అనే కథలో ఒక అందమైన ప్రపంచం (ఉటోపియా) ఉంటుంది.. ఈ ప్రపంచంలో మనుషులకు వృద్ధాప్యం,మరణం,వ్యాధులు లాంటి ఇహలోకపు బాధలేవీ ఉండవు..ఎటొచ్చీ భూమి మీద సమతౌల్యం కోసం 'ఒక పుట్టుకకు ప్రతిగా ఒక చావు' విధానాన్ని జనాభా నియంత్రణ అంటూ అమలు చేస్తుంటారు..అదే సమయంలో 129 ఏళ్ళు average వయసు కలిగిన ఆ జనాభాలో 56 ఏళ్ళ Edward K.Wehling,Jr (అంటే చాలా చిన్న వయస్కుడన్నమాట) అనే వ్యక్తి చికాగో ఆస్పత్రిలో తన భార్య ప్రసవ వేదన పడుతుండగా గది బయట వేచియుంటాడు..అతనికి triplets పుట్టబోతున్నారని డాక్టర్స్ ముందే చెప్తారు..మరి ఒక పుట్టుకని తాను అమితంగా ప్రేమించే తాత మరణాన్ని ప్రతిగా ఇవ్వడానికి గత్యంతరంలేక సిద్ధపడిన Wehling మరో రెండు ప్రాణాలకు బదులు చెల్లించలేడు కాబట్టి ముగ్గురు పసికందుల్లో ఎవరో ఒకర్ని ఎంచుకోవాల్సి పరిస్థితి..

అదే సమయంలో,
A sardonic old man, about two hundred years old, sat on a stepladder,painting a mural he did not like.
అంటూ మరొక 200 ఏళ్ళ వృద్ధుణ్ణి గురించి చెప్తారు..అతను ఈ లోకంలో ఉండలేడు,అలా అని ఈ లోకాన్ని విడిచి వెళ్ళలేడు..ఇక్కడ ఆ mural వాస్తవ ప్రపంచం అన్నమాట..ఆ వృద్ధుడు ఇక్కడ ఉండాలా వెళ్ళాలా అనే దువిధతో ఉంటాడు..
ఇక్కడ "2BR02B" అనేది మరణాన్నిఅందించే ఒక వ్యవస్థ(ఫెడరల్ బ్యూరో ఆఫ్ టెర్మినేషన్ ) ఫోన్ నెంబర్.. ఆ ఉటోపియా ప్రపంచంలో ఉండడం ఇష్టం లేని వాళ్ళు ఆ నెంబర్ ను డయల్ చేస్తే వారికి ఎక్కువగా బాధపడకుండా మరణించడంలో సహాయం చేస్తారు..ఆ వ్యవస్థను ఇలా ముద్దుగా పిలుచుకుంటారు..

 It was the telephone number of an institution whose fanciful sobriquets included: "Automat," "Birdland," "Cannery," "Catbox," "De-louser," "Easy-go," "Good-by, Mother," "Happy Hooligan," "Kiss-me-quick," "Lucky Pierre," "Sheepdip," "Waring Blendor," "Weep-no-more" and "Why Worry?"

మనిషి ఆలోచనా పరిధి ఎంతసేపూ జననం,పునరుత్పత్తి చెయ్యడం,ఆ తరువాత ఈ భూమి మీద ఎల్లకాలం ఉండిపోవాలనే కాంక్షను దాటి ఆవలకి వెళ్ళదు..జననమరణాలకి సైతం పరిధుల్ని విధించగలమనుకునే ఆ ప్రపంచంలో తన పరిధుల్ని మర్చిపోయి అన్నీ శాశ్వతం అనుకుంటూ ఈ అశాశ్వతంలో ఊపిరి సలపకుండా జీవిస్తున్న వర్గానికి ప్రతినిధులుగా Wehling ను,వృద్ధుణ్ణీ ఉదహరిస్తారు రచయిత..చివరగా మరణాన్ని ఆశ్రయించి ఆ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసిన వ్యక్తితో,
"Your city thanks you; your country thanks you; your planet thanks you. But the deepest thanks of all is from future generations."  అంటూ ముగిసే ఈ కథ వాస్తవాన్ని అంగీకరించమంటుంది.. 
చదివిన వెంటనే మర్చిపోయే పుస్తకాలు కొన్నైతే,అప్పుడప్పుడు జ్ఞాపకాల్లోకి వచ్చే ప్రపంచాల్ని పరిచయం చేసేవి మరికొన్ని..ఈ రెండూ కాకుండా చదివిన తరువాత కొంత సేపు పాఠకుల్ని ఆలోచనలో పడేసేవి మరికొన్ని ఉంటాయి..ఇది ఆ మూడో రకం రచన..Kurt Vonnegut ని చదువుదామని ఎంతోకాలం నుండీ అనుకుంటున్నా వేసవి సెలవుల వల్ల పెద్ద పెద్ద రచనలు చదవడం వీలుపడక చదివిన ఈ చిన్న కథ Vonnegut మరికొన్ని రచనల్ని చదవాలనే ఆసక్తి కలిగించింది..

పుస్తకం నుండి మరికొంత,
In the year 2000," said Dr. Hitz, "before scientists stepped in and laid down the law, there wasn't even enough drinking water to go around,and nothing to eat but sea-weed—and still people insisted on their right to reproduce like jackrabbits. And their right, if possible, to live forever."

No comments:

Post a Comment