Wednesday, April 5, 2017

The Tales of Madness - Luigi Pirandello

వేసవి సెలవులు కావడంతో పెద్ద పెద్ద నవలలు చదివే తీరిక లేక షార్ట్ స్టోరీస్ గురించి చూస్తుంటే ఈ మహానుభావుడు కనపడ్డారు.. సరదాగా ఒకటి రెండు కథలు చదువుదాంలే అని మొదలుపెట్టిన నాకు పుస్తకం అంతా పూర్తి చేసేదాకా నిద్ర పట్టలేదు..'జీవితం నుండి పూర్తిగా విడివడి ఒక ప్రక్కగా నుంచుని నీ రోల్ ని నువ్వే తరచి చూసుకుంటే ఆ జీవితమనే స్టేజి పై  నువ్విక లేనట్లే' అనే  Pirandello ను కేవలం ఒక రచయితగా మాత్రమే చూడడానికి మనస్కరించడంలేదు..ఇటలీకి చెందిన నోబెల్ పురస్కార గ్రహీత Luigi Pirandello రచనల్లో మనకు ఒక ఫిలాసఫర్,సైకాలజిస్ట్,ఆర్టిస్ట్ కూడా కనిపిస్తారని  ఆయన కథలు చదివినవారెవరైనా నిస్సందేహంగా చెప్తారు..నాకు ఆల్బర్ట్ కామూ ను తలుచుకోగానే గుర్తొచ్చే మొదటి పదం 'రెబల్' అయితే,పిరాండెల్లో అనగానే ఇకపై 'madness' గుర్తొస్తుంది...అంతకుమునుపు కూడా చాలా మంది రచయితలూ,కవులూ,చిత్రకారులూ ఈ madness కి ఒక రూపాన్నివ్వడానికి ప్రయత్నించినప్పటికీ,ఈ పదానికి ఆయన న్యాయం చేసినంతగా మరెవరు చెయ్యలేదని Pirandello ని చదివిన వారెవరైనా ఘంటాపదంగా చెప్తారు..

'The Tales of Madness' లో మొత్తం పదహారు కథలున్నాయి..ఇందులో పిరాండెల్లో madness కు సంబంధించిన విపరీత ధోరణులను మొదలుకుని Dementia (చిత్త వైకల్యాలు) లాంటి రుగ్మతల వరకూ వివిధ మానసిక స్థితులను అన్ని సాధ్యమైన కోణాల్లోనూ చూపిస్తారు..నిజానికి ఈ కథల్లో అస్థిత్వవాదాన్ని (Existentialism ) చర్చించడానికి madness ను ఒక మెటాఫోర్ గా వాడారు..Pirandello దృష్టిలో పిచ్చితనం లేని మనిషి అస్థిత్వమే లేదు,ఈ నమ్మకాన్ని బలపరుస్తూ ఆయన కథలన్నీ నిజజీవితంతో పెనవేసుకునే ఉంటాయి..పిరాండెల్లో 'madness' ను అర్ధం చేసుకోడానికి సింపుల్ ఫార్ములాలు ఏమీ ఉండవు,అలాగే దాన్ని స్పష్టంగా వర్గీకరించడం వీలుపడదు..ఈ కథల్లో వేటికీ స్పష్టమైన 'లాజిక్' ఉండదు..అసంపూర్తిగా,అంతు చిక్కని కథల్లా ఉంటాయి,చదివేవాళ్ళని ఒక సందిగ్ధంలోకి నెట్టేస్తాయి..Madness ను శోధించే క్రమం లో పిరాండెల్లో తన ఆలోచనలను Pre-Freudian సైకాలజిస్ట్ లు అయిన Janet,Binet,Marchesini మొదలగువారి నుండి కొంత సంగ్రహించినప్పటికీ,ముఖ్యంగా ఆయన రచనలు ఆయన వ్యక్తిగత అనుభవాలనుండి ప్రభావితమయ్యాయి అంటారు..మానసిక వైకల్యం కలిగిన భార్య Antonietta తో పిరాండెల్లో వైవాహిక జీవితం Madness పై ఆయన ఆలోచనాసరళిని చాలా వరకూ ప్రభావితం చేసిందంటారు..

ప్రతి మనిషికీ మనకు తెలిసీ/తెలియకా కొంత పిచ్చితనం ఉండటం కూడా ఒక సహజమైన మానసిక స్థితి క్రిందకే వస్తుందని ఈ కథలన్నీ నిరూపిస్తాయి..ఎందుకంటే ఒక్కో కథా చదువుతుంటే,'అరే ! ఈ మానసిక స్థితి నాకు కూడా పరిచయమే' అని పాఠకులు అనుకుని తీరాల్సిందే..అన్ని కథలూ అద్దాల్లా మన ప్రతిబింబాల్ని అందులో చూసుకోమంటాయి..ఒక్కోసారి వాస్తవం నుంచి పారిపోవడం,మరికొన్ని సార్లు ఏదో జరుగుతుందని భయపడడం,నిజాన్ని జీర్ణించుకోలేక భ్రమలో బ్రతకడానికి అలవాటుపడటం,సమాజంలో ఇమడలేక దూరంగా పారిపోవడం/లేదా 'తను' కానీ తనను సమాజమనే చట్రంలో ఇమిడ్చేసుకోవడం,ఆ కారణంగా ఉత్పన్నమయ్యే భయాలు,బాధలూ,కోపతాపాలు,నిరాశ-నిస్పృహలు ఇలా అన్ని కోణాల్నీ స్పృశిస్తూ మనిషి మస్తిష్కమనే సముద్రపు లోతును కొలవడానికి ప్రయత్నిస్తాయి..

Pirandello పాత్రలు జీవితమంటే నిరర్ధకమైనదనీ,దానికి తోడు జీవితంలో ఎదురయ్యే సమస్యలకి పరిష్కారం ఉండదనే బలమైన నమ్మకం కలిగి ఉంటాయి..అందువల్ల ఈ కథలన్నీ pessimism కు ప్రతీకలుగా కనిపిస్తాయి..ఈ పాత్రలన్నిటిలో సాధాణంగా కనిపించే మరో విషయం,'విపరీతమైన విశ్లేషణా శక్తి'...ప్రతి సమస్యనూ తీవ్రంగా విశ్లేషిస్తూ,ఆ కారణంగా మామూలు మనుషుల్లా జీవించకుండా,ఆ Act of living లో తమ పాత్రను నిరంతరం తరచి చూసుకుంటూ ఉంటారు..

ఉదాహరణకి 'The Train Whistled' అనే కథలో Belluca  ఊహల్లో సుదూరమైన ప్రదేశాలకు ప్రయాణించడం ద్వారా తన బాధలన్నీ మర్చిపోతాడు.. అలాగే The Wheelbarrow కథలో మరో వ్యక్తి భారమైన బ్రతుకునుండి ప్రశాంతత పొందడం కోసం రహస్యంగా ఒక విచిత్రమైన చర్య చేస్తుంటాడు..Pitagora's Misfortune కూడా ఇదే కోవకు చెందిన కథ..ఈ రెండు కథల్లో వ్యక్తులు ఐడెంటిటీ ఇష్యూస్ తో బాధపడుతుంటారు..
My spirit had almost become estranged from my senses and had taken refuge in an indefinitely distant place where, inexplicably and with a sense of joy that didn't seem its own, it caught a glimpse of the seething of a different life. Not its own, but one that could have been its own. Not here, not now, but there in that infinitely distant place. It was the seething of a remote life which perhaps had been its own, it knew not how or when, and of which it had a vague recollection, not of acts, not of images but, as it were, of desires that vanished even before they were formed. And there was the feeling of not existing, which, though empty, was sad and painful.
Escape అనే మరో కథలో Bareggi తన బాధల నుండి విముక్తి పొందే క్రమంలో ఒక పాలవాడి గుర్రబ్బండిని తోలుకుంటూ సుదూర గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళిపోతాడు..Set fire to the Straw మరో చక్కని కథ లైఫ్ ప్రియరిటిస్ గురించి చర్చిస్తుంది..అలాగే Mrs.Frola and Mr.Ponza వాస్తవాన్ని అంగీకరించలేని అత్తా అల్లుళ్ళ కథ..అలాగే Puberty అనే కథ టీనేజ్ కి వచ్చిన అమ్మాయి మనస్తత్వానికీ,ఆ వయసులో ఉండే భయాలకీ దర్పణం పడుతుంది..
I also penetrated into the life of the plants, and little by little, from a pebble, from a blade of grass, I arose, absorbing and feeling within me the life of all things, until it seemed that I was almost becoming the world, that the trees were my limbs, the earth my body, the rivers my veins, and the air my soul. And for a while I went on like that, ecstatic and pervaded by this divine vision.
Fear of being happy కథలో Fabio జీవితానికి విపరీతమైన లాజిక్ అప్లై చేసి అదొక అబ్సెషన్ గా మారడంతో చెడు తనను చేరుకోడానికి వేచి చూస్తుందనే భ్రమలో పిచ్చివాడిగా మారడం కూడా madness లో మరో కోణాన్ని చూపిస్తుంది.. అలాగే When I was Crazy అనే కథలో protagonist సమాజం తనను పిచ్చివాడిగా ముద్ర వేసిన కారణంగా తాను కూడా (Sane)సాధారణ మనిషిగా మారాననీ స్వార్ధం నేర్చుకున్నానని అంటాడు..
But while I walked through my lands, tiptoed and stooped in order to avoid trampling some little flower or insect whose ephemeral life I lived within myself, those others were stripping my fields, stripping my houses, and going so far as to strip me.And now, here I am: ecce homo
ఈ కథ ప్రకారం ప్రకారం పిరాండెల్లో madness ను ఒక సోషల్ ఎలిమెంట్ గా కూడా చూస్తారు..ఇది మనిషి సమాజంలో ఇమడడానికి పడే సంఘర్షణని ప్రతిబింబిస్తుంది..Pirandello రచనల్లో మామూలు మనుషులకంటే (sane ) madness కే పెద్దపీట వేస్తారు..ఫిలాసఫర్ Henri Bergson సిద్ధాంతం ప్రకారం లైఫ్ అంటే formless అండ్ fluid కాబట్టి,జీవితాన్ని ఏ లాజిక్ లేకుండా బ్రతికే/లేక దానికి విచిత్రమైన లాజిక్ implement చేసే పిచ్చివాళ్ళు జీవితానికి మరింత దగ్గరగా ఉంటారు అని Pirandello వాదన..Existentialism,Philosophy ఇష్టపడేవాళ్లు ఖచ్చితంగా చదవలసిన పుస్తకం ఇది..ఫిలాసఫీ అన్నానని ఇందులో  విసుగొచ్చేలా ఊకదంపుడు ఉపన్యాసాలు ఏమీ ఉండవు,చిన్న చిన్న సంభాషణలతో,మనలాంటి మామూలు వ్యక్తులు మనతో తమ భయాలను,బాధల్ని స్వోత్కర్షలా చెప్పుకుంటున్నట్లు ఉంటుంది.

పుస్తకం నుండి కొన్ని నచ్చిన వాక్యాలు,
"Then everything that happens was destined to have happened? Wrong! It might not have happened if... and here, in this if I always lose myself."
The lessons one learns from the experiences of others, you say? They're useless. Each of us can think that experience is the fruit that grows according to the plant which produces it and the soil in which the plant has taken root. And if I consider myself to be, for instance, a rosebush whose nature it is to produce roses, why should I poison myself with the toxic fruit picked from the sad tree of someone else's life?
Whoever is not guilty, whoever has no reason to be sorry, is always a free man. Even if you chain me, I'll always be free internally. At this point, I don't care what happens to me externally.'
I didn't know that even the so-called mad possess that most complicated little thought-producing machine known as logic, which is in perfect running order, perhaps even more so than ours, in that, like ours, it never stops, not even in face of the most inadmissible deductions.
He who lives, doesn't see himself while he's living: he simply lives... If one can see his own life, that only means that one no longer lives it, but undergoes it, drags it along. Like a dead thing, one drags it along, because every form is a death.

4 comments:

  1. Thank you for introducing Pirandello. This is the first time I am reading about Pirandello and your review is very fair. I am tempted to read him at the earliest.

    ReplyDelete
    Replies
    1. Murthy garu,Thank you so much for your valuable feedback..Pirandello is one of a kind,I'm sure you'd love his works.

      Delete
  2. Your reviews are more easy to understand than the original writings. Keep writing more reviews for average minds like me

    ReplyDelete