Saturday, May 4, 2024

The Private Lives of Trees - Alejandro Zambra

"ఆమె ఇంకా ఇంటికి రాలేదు", "ఆమె ఇల్లు చేరలేదు", "అసలామె ఈరాత్రి  ఇంటికి చేరుతుందో లేదో తెలీదు"- ఈ నవలలో జులియన్ భార్య వెరోనికా ఇంటికి చేరడం గురించి పదేపదే మననం చేసుకుంటున్నట్లు రచయిత రాసే ఈ వాక్యాలు, మనిషిలోని మౌలిక లక్షణమైన 'belongingness' కోసం పడే తపనని గుర్తుచేస్తాయి. పశుపక్ష్యాదుల మొదలు మనిషి వరకూ ఎంత సంచారజీవైనా చివరకు అన్ని జీవాలూ తనదైన సొంత గూటికి చేరాలని ఆరాటపడతాయి. ఒకరకంగా చూస్తే మానవజాతి నాగరికత, అభివృద్ధీ ఈ మౌలిక భావం తాలూకు పునాదుల మీద నిర్మితమైనవే. కానీ ఇక్కడ "సొంత గూడు" అంటే అన్నిసార్లూ నాలుగ్గోడల మధ్య చోటే కాకపోవచ్చు, అక్కడ ఉండే మనుషులు కావచ్చు. కొందరు అదృష్టవంతులకు సొంత గూడు ఉన్నచోటే దొరికితే మరికొందరికి మాత్రం జీవితమంతా వెతుకులాటలోనే గడిచిపోతుంది. అందుకే జులియన్ మాజీ ప్రియురాలు కోపంతో ఇంట్లో గోడమీద అతణ్ణి బయటకి పొమ్మని రాసిన విషయాన్ని జులియన్ జీర్ణించుకోలేకపోతాడు. భార్య వెరోనికా ఇంటికి చేరకపోతే అది కూడా ఇకపై తన "గూడు" కాకుండా పోతుందేమోనన్న ఆందోళన ఆ సమయంలో జులియన్ ప్రవర్తనలో కనిపిస్తుంది.

Image Courtesy Google

"The Private Lives of Trees" రచయిత అలెజాండ్రో జాంబ్రా చిలీకి చెందిన  రచయిత. స్పానిష్ అనగానే "బోర్హెస్" మర్రిచెట్టు నీడలో శ్వాసించిన ప్రభావం కాస్తో కూస్తో ఉండకపోదు. జాంబ్రా నేరేషన్ చదువుతుంటే అనేక చోట్ల బోర్హెస్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా గతానికీ, వర్తమానానికి నడుమ బోర్హెస్ వాక్యంలో కనిపించే 'overlapping' జాంబ్రా వచనంలో కూడా కనిపిస్తుంది.

లిటరేచర్ ప్రొఫెసర్ జులియన్ జీవితంలో ఒక రాత్రిలో జరిగే సంఘటనలను ఒక కథగా రాశారు జాంబ్రా. గతస్మృతులూ, వాస్తవిక సంక్లిష్టతల మధ్య ఊగిసలాడే ఈ కథలో భార్య వెరోనికా రాక కోసం ఎదురుచూస్తూ కూతురు  డేనియేలాకి కథ చెబుతుంటాడు జులియన్ (డేనియేలాకు సవతి తండ్రి). వృత్తిరీత్యా రచయితైన జులియన్ ఆ రాత్రి వెళ్ళదీసే క్రమంలో కూతురికి బెడ్ టైం స్టోరీస్లో భాగంగా చెట్ల గురించిన కథలల్లి చెబుతాడు. బోర్హెస్ వర్ణనల్లోలాగే ఇది కూడా 'ఇమేజ్' ప్రధానమైన నేరేషన్ కాబట్టి ఇందులో సహజంగానే చెప్పుకోడానికి పెద్ద కథేమీ లేదు. పాఠకులు పుస్తకం చదవడం పూర్తిచేశాక జులియన్ లోని సినిసిజంతో కూడిన నిరాశావాదం, ఎటువంటి దాపరికాలూలేని తత్వంతో ప్రేమలోపడకపోయినప్పటికీ కాస్తో కూస్తో సహానుభూతి మాత్రం చెందుతారు.

డేనియేలాను నిద్రపుచ్చి వెరోనికా కోసం వేచి చూస్తూ, ఆ రాత్రి తను రాస్తున్న నవల గురించి జులియన్ ఆలోచనలు ఆర్టిస్టు ఊహాత్మకతను అన్ని కోణాల నుండీ చూపిస్తాయి. అనేక సంభావ్యతల మధ్య వెరోనికా ఇంటికి రాకపోవడానికి గల కారణాలను అతడు ఊహించుకునే తీరు ఆసక్తికరంగా ఉంటుంది. ఆ ఊహల్లోనే డేనియేలా పెద్దైపోతుంది, ఆమెకో బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, ఆమె  తండ్రి రాసిన నవలను చదువుతుంది. ఇలాంటి ఊహలెన్నో.

But this is not a normal night, at least not yet. It’s still not completely certain that there will be a next day, since Verónica isn’t back yet from her drawing class. When she returns, the novel will end. But as long as she is gone, the book will continue. The book goes on until she returns, or until Julián is sure that she isn’t going to return. For now, Verónica is absent from the blue room, where Julián lulls the little girl to sleep with a story about the private lives of trees.

మనుషులు పార్కుల్లో విహరిస్తూ చెట్ల మీద తమ పేర్లు చెక్కుకుంటారు, కొన్నిసార్లు దారినపోతూ అనవసరంగా ఆకులు తుంచేస్తారు, మరికాస్త ముందుకెళ్ళి వాటిని మొదలంటా నరికేస్తారు. వాటికి కూడా జీవం ఉంటుందనీ, అవి కూడా మనలాగే ప్రకృతిలో భాగమనే స్పృహ మనిషికి ఉండదు. ఈ దౌర్జన్యం సహించలేక ఒక పార్కులో రెండు చెట్లు మనుషుల్లాగే తమ కష్టనష్టాలు చెప్పుకుంటే! తమ హక్కుల కోసం పోరాడాలి అని తీర్మానించుకుంటే! ఆ ఊహే భలే ఉంది కదా! ఈ కథలో ప్రొటొగోనిస్ట్ జులియన్ తన కూతురు డేనీయేలా కి చెప్పే కథ ఇలాగే మొదలవుతుంది.
Right now, sheltered in the solitude of the park, the trees are commenting on the bad luck of an oak, in whose bark two people have carved their names as a symbol of their friendship. “No one has the right to give you a tattoo without your consent,” says the poplar, and the baobab is even more emphatic: “The oak tree has been the victim of a deplorable act of vandalism. Those people deserve to be punished.

మన జీవితంలో గతంలో, వర్తమానంలో కలిసే మనుషులు నిరంతరం మన భవిష్యత్ ఆలోచనలను ప్రభావితం చేస్తూనే ఉంటారు. ఇది సబ్కాన్షియస్ లెవెల్లో మనకు తెలీకుండానే జరిగిపోతూ ఉంటుంది. తత్పరిణామంగా మనిషి అస్తిత్వం నిరంతరం రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ క్లారాతో జులియన్ గతం వెరోనికాతో అతడి భవిష్యత్తుని ప్రభావితం చేస్తుంది. గతాన్నీ, వర్తమానాన్నీ పరిగణలోకి తీసుకుని భవిష్యత్తు ఎలా ఉండబోతోందా అని ఊహిస్తాడు జులియన్. ఆ భవిష్యత్తులో వెరోనికా ఆ రాత్రి ఆర్ట్ క్లాస్ నుండి ఇంటికి తిరిగొస్తే, రాకపోతే అనే రెండు సంభావ్యతల మధ్య జులియన్ డేనియేలా (8) ఇరవైయ్యేళ్ళ భవిష్యత్తును ఊహిస్తాడు. కాలపరిమితుల పరిధుల్ని ప్రశ్నిస్తూ కళాకారుడి ఊహాత్మకత అనేక ఇమేజెస్ ఒకదానిపై ఓవర్లాప్ అవుతూ కథనం ఆసక్తికరంగా సాగుతుంది.

మంచి రచన అంటే పాఠకుల్ని అక్షరాలకి ఆవలివైపుకి తీసుకెళ్ళి  అనుభవాలను మిగిల్చేది. పాఠకుడిలో ఎటువంటి భావోద్వేగాన్నీ కలిగించలేని  పదాలు పాఠకుడికీ, రచయితకీ వారధిగా మారలేవు. అటువంటి రచనల్లోని పాత్రలతో మనం ఏ రకంగానూ సహానుభూతి చెందలేము. ముఖ్యంగా ఫిక్షన్ విషయానికొచ్చేసరికి పాఠకుడు కథలోని పాత్రలతో ఎంత సాన్నిహిత్యం అనుభవిస్తే అది అంత మంచి రచన అనుకుంటాను. ఒకప్పటి క్లాసిక్ నవలల్లో అనేకమైన పాత్రలుండేవి. ఆనాటి రచయితలు పాత్రల తీరుతెన్నుల్ని తీర్చిదిద్దే విధానం కేవలం కథానాయకుడు/ నాయకురాలి పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఆగిపోయేది కాదు. ఉదాహరణకు టాల్స్టాయ్ 'అన్నా కరెనిన'లో నాకు రోన్స్కీ, అన్నాల కంటే లెవిన్, కిట్టీలు మనసుకి దగ్గరగా అనిపిస్తారు. వాళ్ళు గుర్తున్నంత మిగిలిన వాళ్ళు గుర్తులేరు. అదేవిధంగా మరో పాఠకుడికి ఆ నవల్లో మరో పాత్రేదో నచ్చచ్చు. ఒకప్పటి రచనలు పాఠకుడు కథలోని ఇతరత్రా పాత్రలతో కూడా సులభంగా తనను తాను ఐడెంటిఫై చేసుకోగలిగేలా ఉండేవి. ఇది నేటి నవలల్లో బహు అరుదనుకోండి. ఈ పుస్తకంలో నాకు జాంబ్రా వచనం నచ్చినంతగా కథలో పాత్రల్ని మలిచిన తీరు నచ్చలేదు. వాటితో మనం లోతుగా కనెక్ట్ అవ్వడం కష్టం.

ఏదేమైనా అలెజాండ్రో జాంబ్రా చిక్కని, సరళమైన వచనం కోసం ఆయన్ని చదవాలి. క్లుప్తంగా కథ చెప్పే విధానంలో కాల్వినోకున్న ప్రతిభ జాంబ్రాలో కూడా కనిపిస్తుంది. అసందర్భమైన వాక్యాలతో కూడిన సుదీర్ఘమైన రచనలు చదివి విసిగిపోయిన పాఠకులకు జాంబ్రా వచనం ఒక ఊరట. 

He sees Daniela sleeping, and he imagines himself, at eight years old, sleeping. It’s a reflex: he sees a blind man and imagines himself blind; he reads a good poem and pictures himself writing it, or reading it aloud, to nobody, encouraged by the somber sound of the words. Julián simply observes these images, receives them and then forgets them. Perhaps he has always merely chased images: he hasn’t made decisions, hasn’t won or lost, just let himself be drawn in by certain images, and then followed them, without fear or courage, until he caught up with or extinguished them.

పరభాషా రచయితల్ని చదవడంలో ఒక ప్రయోజనం ఏంటంటే, వాళ్ళ రాతల్లో ఎక్కడో ఒకచోట వాళ్ళు చిన్నప్పటినుండీ చదువుతూ పెరిగిన మరికొంతమంది రచయితల గురించి కూడా తెలుస్తుంది.

He has read, very closely, translations of Ungaretti, Montale, Pavese, and Pasolini, as well as more recent poets, like Patrizia Cavalli and Valerio Magrelli, but in no way could he be considered an expert in Italian poetry.

He always salvages any tricky situation by sneaking in some quotation from Walter Benjamin, Borges, or Nicanor Parra.

There were inspired nights when he filled pages and pages in a sudden burst of confidence. There were other, less productive nights when he couldn’t get past the first paragraph. He floundered there before the screen, distracted and anxious, as if hoping the book would write itself.

He remembers, especially, the sour voice of an older woman who would talk about her father’s death to anyone who would listen, and the panic of a teenager who, one early morning in winter, swore he would never screw without a condom again. More than once, he thought it would be worthwhile to write down what he heard, to record those conversations; he imagined a sea of words traveling from the ground to the window and from the window to his ear, to his hand, to his book. There would surely be more life in those accidental pages than in the book he was writing.

But that’s another story, a lesser story, not important now—though maybe it would be better to follow those red herrings; Julián himself would greatly enjoy a half-cocked book full of red herrings. No doubt it would be much better to fall down laughing, or to forge an elegant, disdainful smirk. It would be best to close the book, to close all the books, and face, all at once, not life, which is very big, but the fragile armor of the present. For now, the story goes on and Verónica still isn’t home; best to keep sight of that, repeat it a thousand and one times: when she comes home the novel ends—the book continues until she comes home or until Julián is sure she is never coming home again.

అమెరికన్ రచయిత పాల్ ఆస్టర్ "వింటర్ జర్నల్" చదివి ఏళ్ళైపోయింది. ఈ పుస్తకంలో ఆయన ప్రస్తావన రావడం బావుంది. కానీ జాంబ్రాకు పాల్ ఆస్టర్ రచనా శైలి మీద సదభిప్రాయం లేదనిపించింది. ఒక సందర్భంలో బోర్హెస్ శైలితో ఆస్టర్ ని పోలుస్తూ ఇలా అంటారు,

More than one occasion, he even tried to talk others out of reading Auster, arguing that, except for some pages of The Invention of Solitude, he was nothing but a  watered-down Borges.

వెరోనికాని పెళ్ళి చేసుకోక మునుపు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్  క్లారాతో సంబంధాన్ని జులియన్ మాటల్లో:

Julián didn’t want to recover their love; he had stopped loving her a long time ago. He had stopped loving her a second before he started loving her. It sounds strange, but that’s how he feels: instead of loving Karla, he had loved the possibility of love, and then love’s imminence. He had loved the idea of a mass moving under dirty white sheets.

పుస్తకం నుండి మరికొన్ని నచ్చిన వాక్యాలు : 

Still, he keeps thinking about the snow, a ghostly space that’s usually relegated to novels: a world where young people fall gravely ill and old people remember past loves.

And he repeats Emily Dickinson’s verses involuntarily, as if finding himself with his own voice: Our share of night to bear / Our share of morning.

But he doesn’t want to know that much. He wants to know a little, just enough.

This is not a prophecy—he lacks the strength to make prophecies—and neither is it entirely a wish; it’s more like a plan, an overnight script, written in a flash, dictated by desperation. He wants to catch sight of a future that can exist without the present; he arranges the facts willfully, with love, in a way that keeps the future safe from the present.

She knows that very soon Ernesto won’t come back. She imagines herself disconcerted, then furious, and finally pervaded by a decisive stillness. It’s all right, there were no strings attached, as it should be: we love in order to stop loving, and we stop loving in order to start loving others, or to end up alone, for a while or forever. That’s the doctrine. The only doctrine.

Daniela knows that very well. She has survived mediocrity: I’m willing to do anything, she liked to say a few years ago. And it was true. She was willing to do anything, to take whatever they wanted to give her, to say whatever had to be said. She was willing, even, to listen to her own voice saying things she didn’t want to say. But not anymore. Now she is not willing to do anything. Now she is free.

Julián would have liked for Daniela to remember him after reading his book. But no. Memory is no refuge. There remains only an inconsistent babble of the names of streets that no longer exist.

He never wanted to be a doctor, much less a gym teacher. He didn’t even ever want to be a literature professor. He wanted—wants—to be a writer, but being a writer is not exactly being someone.

No comments:

Post a Comment