Tuesday, May 21, 2024

Reconciliation - Naoya Shiga

20వ శతాబ్దపు సాహిత్యాన్ని శాసించిన ఆటోబయోగ్రఫికల్ ఫిక్షన్ (Shishōsetsu - Confessional literature) రచయితల్లో జపాన్ కు చెందిన నవోయా షిగా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. "నా సాహిత్యానికి ముడిసరుకు నేనే, నేను మాత్రమే" అని చెప్పుకున్నప్పటికీ కథలో, కథనంలో, ఇతరత్రా పాత్రల్లో ఆయన స్వానుభవాలకు ఊహాత్మకతను జోడించే శైలి, రచయితగా షిగాను ప్రత్యేకంగా నిలబెడుతుంది. పుట్టినప్పుడే తల్లిని పోగోట్టుకున్న షిగాకు సన్నిహితం కాలేని తండ్రి నవోమిచీతో ఉన్న సంక్లిష్టమైన సంబంధాన్ని గురించి 1917లో రాసిన నవలిక 'Reconciliation'ని కేవలం ఐదే వారాల్లో పూర్తి చేశారట. ఈ కథ ద్వారా షిగా తన జీవితపు తొలినాళ్ళ మానసికమైన గాయాలను మాన్పుకునే ప్రయత్నం కనిపిస్తుంది.

Image Courtesy Google

మానవ సంబంధాలు అనుకున్నంత సరళం కాదు. ఎప్పుడు ఏ మాట, ఏ చర్య, ఎవరిని ఎలా నొప్పిస్తుందో ఊహించడం కష్టం. దీనికి ఏ సంబంధమూ మినహాయింపు కాదు. షిగా తండ్రికి ఇష్టంలేని వివాహం చేసుకున్నందువల్ల వాళ్ళిద్దరి మధ్యా విభేదాలు తలెత్తాయి. ఈ కారణంగానే ఆ పెళ్ళి తర్వాత  నాలుగేళ్ళ పాటు షిగా ఏమీ రాయలేదు. మరో ప్రముఖ జాపనీస్ రచయిత నట్సుమే సోసికి (Natsume Sōseki) ఈ వైరాన్ని గురించి 'ఆశాహి' అనే పత్రికలో సీరియల్ గా రాయమని షిగాను కోరినప్పటికీ ఆయన రాయలేకపోయారు. [నిజానికి సోసికి మాస్టర్ పీస్ 'కొకోరో' కూడా ఆ తండ్రీకొడుకుల విభేదాల ప్రేరణగానే రాశారంటారు.] తర్వాత సోసికి "పోనీ రాయలేకపోవడం గురించే ఒక నవల ఎందుకు రాయకూడదూ?" అని అడగ్గా షిగా కలంనుండి ఈ రచన ప్రాణంపోసుకుంది. జననమరణాలకూ, వాటి మధ్య కొట్టుకులాటకూ సంబంధించిన సాధారణ అంశాలను గురించే రాసినప్పటికీ, షిగా వర్ణనలో సైకాలజీకి సంబంధించిన సంక్లిష్టమైన శైలి ఆయన కథల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. విశ్వజనీనమైన అంశాలతో కూడినదైనా జీవితానికీ, కళకూ మధ్య సన్నిహిత సంబంధాన్ని గురించి చెబుతుందీ రచన.

కళాకారుడి సృజనాత్మకతను ప్రేరేపించడానికి 'మ్యూజ్' అవసరమవుతుంది. దాన్నొక ట్రిగ్గర్ అనొచ్చు, లేదా డ్రైవింగ్ ఫోర్స్ అనొచ్చు. తండ్రితో ఉన్న విభేదాలు పరిష్కరించుకోవడంలో షిగాకు ఈ నవల రాయడం ఒక ఊతంగా ఉపయోగపడింది. నవల పూర్తయ్యేసరికి తండ్రితో ఉన్న విభేదాలు కూడా సమసిపోయాయి. దానితోబాటే షిగా నాలుగేళ్ళ 'రైటర్స్ బ్లాక్' కూడా మాయమైపోయింది. షిగాకు పేరు ప్రఖ్యాతలార్జించి పెట్టిన 'ది డార్క్ నైట్స్ పాసింగ్' నవల మొదలు అనేక రచనలు 'Reconciliation' రాసిన తర్వాతే  చేశారు. 

సతోకో జననంతో జుంకిచికీ, అతడి తండ్రికీ మధ్య ఉన్న విభేదాలు సమసిపోతాయనుకుంటే తర్వాత జరిగిన పరిణామాలు వారి సంబంధాన్ని మరింత జటిలం చేస్తాయి. చివరకు వారిద్దరి మధ్యా సయోధ్య ఎలా కుదిరిందన్నదే మిగతా కథ. జుంకిచి పాత్ర ద్వారా షిగా తన తండ్రిపట్ల ఉన్న కోపానికీ, దురభిమానాలకూ పరిష్కారం వెతుక్కునే ప్రయత్నం చేస్తారు. ఈ కథలో ప్రధాన పాత్ర జుంకిచి బిడ్డ సతోకో గురించి రాసిన వర్ణన చదివినప్పుడు హ్రిషిదా 'అభిమాన్' గుర్తుకొచ్చింది. సినిమాల్లో కళకూ , జీవితానికీ ఉన్న దగ్గర సంబంధం గురించి తీసిన ఆ సినిమాకూ ఈ నవలకూ నాకు చాలా పోలికలు కనిపించాయి. అది కూడా కళను ఆధారంగా చేసుకున్న 'Reconciliation' ఆధారంగా తీసిన సినిమానే. హ్రిషికేష్ ముఖర్జీ 'అభిమాన్'లో ప్రేమించి పెళ్ళిచేసుకున్న జంట (జయా, అమితాబ్) మధ్య వృత్తిపరమైన పోటీ కారణంగా భర్త మనసులో విషబీజాలు నాటుకుంటాయి. విచ్ఛిన్నమైన వారి వివాహాన్ని పుట్టబోయే బిడ్డే సరిదిద్దుతుందన్న ఆశతో భర్త రాకకోసం ఎదురుచూస్తుందామె. కానీ చివరకు పుట్టిన బిడ్డ పురిట్లోనే మరణిస్తాడు. తనకు మిగిలిన ఆఖరు ఆశ కూడా కరిగిపోగా ఆమె శిలలా మిగిలిపోతుంది. సున్నితమైన భావోద్వేగాలతో ముడిపడి ఉండే మానవ సంబంధాలను గురించి తీసిన చిత్రాల్లో అదొక క్లాసిక్. 'Reconciliation' చదువుతున్నప్పుడు చిన్నప్పుడు ఎన్నోసార్లు చూసిన ఆ సినిమా గుర్తుకువచ్చింది. ఆపకుండా చదివించిన షిగా నేరేషన్ పాఠకుడికి కథెలా చెప్పాలో మాస్టర్ క్లాస్ లో ఉదహరించాల్సిన రచన.

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు:
I was writing a piece for a literary journal that had to be finished by 19 August. Every night at ten o’clock I would set to work on it, but the material was proving hard to handle. At first I called it ‘The Daydreamer’, then changed it to ‘The Dreamer’. It focused on my relationship with Father six years previously, when I was living in the small city of Onomichi on the Inland Sea. I personally disliked Father. This was more than the inescapable tangle of emotion that binds most parents and children, I felt: at the root of our mutual animosity was a basic disharmony. But although I found it relatively easy to talk about these feelings, I found I couldn’t express them on paper. I didn’t want to use my writing to emotionally purge myself. This was partly out of consideration for him, but I was also afraid that it would poison my work.

Moreover, as I have mentioned, I was hampered by my resolve not to use my work to purge my resentment of Father. The grudge I bore him lived within me like another self. Yet it did not fill me, for beside it dwelt still another self that was deeply sympathetic.

I felt a deep surge of resentment. My thinking went as follows: had the family not attempted to use the baby to reconcile Father and me, she wouldn’t have died.

Her mood and mine were like oil and water.

There must be some sort of rationale, I felt, for the age-old custom that a husband shouldn’t watch his wife give birth. It certainly wouldn’t be good if his presence made her worry about how unattractive her face or her posture might look; bearing the baby safely should be her only concern. For my part, I didn’t think seeing my wife in such an unseemly state was a very good idea. Having to stare at her suffering didn’t appeal to me either.

About the time we pulled out of Kitasenjū, I began to leaf through M’s book on Rodin. At first, I was too distracted to give it my full attention. Before long, though, the pictures began to suck me in. I became acutely aware of the eternal quality of Rodin’s art. I could feel excitement bubbling up from the pit of my stomach, and with it a pleasurable sensation of liberation. It felt as if my own heart were flying off to seek Rodin’s. This experience was strangely invigorating.

The biggest problem was that my mental image of Father just wouldn’t stand still. To put it another way, I found my feelings about him were constantly shifting. Each time I started writing, he would look calm, even conciliatory, and I could go ahead feeling quite calm myself. As I continued, however, Father’s expression would gradually change, and I would respond by shifting from a factual to a more argumentative style. As soon as this happened, Father’s face grew stubborn and cross, and I had no choice but to lay down my pen.

Suppose I’d become the kind of person Father would have liked – judged by my eyes today, that person would be worthless.’

I am reminded of the lines from an old Chinese poem:
"From East and West, South and North
We make our way home at last
Together in the depths of night
We look out upon the same snow-capped peaks."

No comments:

Post a Comment