"The God of the Japanese short story" అని పిలుచుకునే నోయా షిగా శైలిని అనుకరించడానికి జపాన్ యువ రచయితలు తెగ పోటీపడేవారంటారు. ఈ కథల్ని ఆంగ్లంలోకి అనువదించిన లేన్ డన్లప్ షిగా కథల్లో 17 కథల్ని ఎంపిక చేసి ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఇందులో నాకు తెలిసిన కథ ఒక్కటే- "హాన్స్ క్రైమ్", మునుపు "చైనా జపాన్ ప్రసిద్ధ కథల్లో" తెలుగులో చదివాను.
Image Courtesy Google |
ఇందులో కథలన్నీ నచ్చినవే అయినా "హాన్స్ క్రైమ్" తర్వాత నాకు చాలా నచ్చిన కథ "కునికో". ఈ కథలో వాస్తవ జీవితానికీ, కళాకారుడి ఫాంటసీ ప్రపంచానికీ మధ్య సంఘర్షణను హృద్యంగా చిత్రించారు షిగా. "తన కథలన్నిటిలోనూ ముడి సరుకు తానేనని" చెప్పుకునే షిగా అంతఃసంఘర్షణ ఈ కథలోని ప్రధాన పాత్ర (రచయిత) ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. పిరాండెల్లో కథల్లో కనిపించే సైకో అనాలిసిస్ తో కూడిన తర్కం, హేతువాద సంభాషణలూ, మోనోలాగ్స్ షిగా కథల్లో కూడా ఎక్కువగా కనిపిస్తాయి. షిగా కూడా పిరాండెల్లో తరహాలోనే మనిషిలోని ప్రామాణికతకు పెద్దపీట వేశారనిపిస్తుంది. షిగా పాత్రల్లో నిజాయితీతో కూడిన స్వయంపరిశీలన, స్వస్వరూపజ్ఞానంలాంటివి చూసినప్పుడు ఆ పాత్రల ద్వారా ఖచ్చితమైన ఆత్మపరిశీలన చేసుకుంటూ షిగా తన లోపలి మనిషితో తానే తలపడుతున్నట్లు అనిపిస్తుంది. ''A Memory of Yamashina'', ''Infatuation'', "Kuniko" -వివాహేతర సంబంధాల గురించి రాసిన ఈ మూడు కథలూ వాస్తవానికీ, కళాకారుడి ప్రపంచానికీ మధ్య అంతఃసంఘర్షణకు అద్దంపడతాయి. "కునికో" రాసిన తర్వాత షిగా భార్య ఆయన రచనలు చదవడానికి నిరాకరించారట.
The uneventful, peaceful days and months continued to pass. But this uneventful peacefulness, as far as my own feelings were concerned, was anything but uneventful and peaceful. I felt as though I had fallen into a quagmire where, no matter how much I struggled, there was nothing to serve as a foothold and therefore no way out. Everything was hopelessly boring.
At any rate, some time afterward, I became infatuated with her. Whether or not I was truly in love with her, I can’t really say myself, but, anyway, I was infatuated.
"The Razor" అనే కథలో ఎప్పుడూ చిన్నపాటి జ్వరం కూడా యెరుగని మంగలి యోషిసబురో హఠాత్తుగా జబ్బుపడతాడు. తన వృత్తిలో అతడికున్న నైపుణ్యం పట్ల అతడికి గర్వం మెండు. యోషిసబురోకి ఆరోగ్యం బాగాలేని సమయంలోనే ఆటమ్ ఈక్వినాక్స్ పండుగ కూడా కావడం వల్ల షాపుకు విపరీతమైన రద్దీ మొదలవుతుంది. ఈలోగా ఆ షాపుకు తరచూ వచ్చే ఒక వ్యక్తి తన పనిమనిషిని మంగలికత్తి పదును చెయ్యమని పంపుతాడు. అనారోగ్యం వల్ల యోషిసబురో తన పనిని సవ్యంగా చెయ్యడంలో విఫలమవుతాడు. కత్తి సరిగ్గా లేదని ఆ వ్యక్తి తిప్పి పంపుతాడు. తన వృత్తిలో 'పర్ఫెక్షన్' తప్ప మరొకటి అలవాటులేని యోషిసబురో జ్వరంతో కూడిన ఉన్మాదంతో భార్య ఎంత వారిస్తున్నా వినకుండా ఆ కత్తిని పదునుపెట్టడానికి పూనుకుంటాడు. అదే సమయంలో ఆ షాపుకు ఒక యువకుడు వస్తాడు. ఆ తర్వాత జరిగే పరిణామాలు ఈ కథను "సైకో ఎనలిటికల్ స్టోరీ టెల్లింగ్"లో ఒక అత్యుత్తమ స్థాయి కథగా నిలబెడతాయి.
''Han's Crime'' ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన కథ. ఒక చైనీస్ గారడీవాడు ప్రదర్శన సమయంలో విసిరిన కత్తి భార్య గొంతులోకి దిగి ఆమె అక్కడికక్కడే మరణిస్తుంది. ఇద్దరూ స్వతహాగా మంచివాళ్ళే అయినప్పటికీ భార్యాభర్తల మధ్య విభేదాలున్నాయని విచారణ సమయంలో తెలియగా జడ్జి హాన్స్ ని ప్రశ్నించగా దానికి హాన్స్ ఇచ్చిన వివరణ అద్భుతంగా ఉంటుంది. నిజాయితీ ఎప్పుడూ అంతఃకరణ స్వేచ్ఛని ప్రసాదిస్తుందని సరళమైన పదాల్లో నిరూపించే గొప్ప కథ ఇది. ఇంతకీ తీర్పు హాన్స్ కి అనుకూలంగా వచ్చిందా లేదా అనేది మిగతా కథ చదివి తెలుసుకోవాల్సిందే.
"హాన్స్ క్రైమ్" కథను హాన్స్ భార్య కోణం నుండి రాయాలనిపించింది అని మరో కథలో ఇలా చెబుతారు :
A short while before, I had written a short story called “Han’s Crime.” From jealousy of an old premarital relationship between his wife and a man who was his friend, also driven by his own psychological pressures, a Chinese called Han had murdered his wife. As I had written the story, it was mainly about Han’s feelings. Now, however, I thought of writing a story about the feelings of his wife. Murdered at the end, under the ground of the cemetery—I wanted to write about that quietness of hers.
మరో కథ ''The Shopboy's God'' ఒక పేదవాడైన కుర్రాడు రుచికరమైన, ఖరీదైన ట్యూనా చేపతో చేసిన 'సుషీ' తిందామని ఆశపడతాడు. కానీ డబ్బులేక వెనుదిరుగుతాడు. అది గమనించిన మరో వ్యక్తి ఆ కుర్రవాడి చిన్న కోరికను తీర్చే ప్రయత్నం చేస్తాడు. ఈ కథ ద్వారా దైవత్వం అంటే అదేదో బ్రహ్మపదార్థం కాదనీ, మనిషిలోని దైవత్వమనే పదానికి నిర్వచనాన్నిచ్చే ప్రయత్నం చేశారు షిగా. ఈ కథకు ముగింపు చందమామకథను తలపిస్తుంది. ఇలా చెప్పుకుంటూపోతే ఒక్కో కథా ఒక్కో భిన్నమైన ప్రపంచానికి ద్వారాలు తెరుస్తుంది.
షిగా కథల్లో గమనించిన విషయం- ఈ కథల్లోని పాత్రలు ఆర్టిస్టుగా షిగా తనలో సమాధానపరుచుకోలేని స్వాభావిక లక్షణాలు కలిగి ఉంటాయనిపిస్తుంది. ఆ పాత్రలని తన ప్రత్యర్థులుగా (ఆయన ఆల్టర్ ఇగో?) సృష్టించి వాటితోనే హేతువాదమనే బరిలో తర్కంతో తలపడతారు షిగా. ఈ తర్కం "కునికో" అనే కథతో బాటు "A Memory of Yamashina", "Rain Frogs" మరియు "Infatuation" లాంటి కథల్లో కూడా కనిపిస్తుంది. నాకు షిగా శైలిలోని 'కన్ఫెషనల్ టోన్' అకుతాగవా శైలికి చాలా దగ్గరగా అనిపించింది. '' Entitled', "A Gray Moon'' లాంటి కొన్ని కథలు రచయిత తన రోజువారీ ఆలోచనలతో ఒక జర్నల్ రాసుకుంటున్నట్లు అకుతాగవా "The Life of a Stupid Man"ను గుర్తుకుతెచ్చాయి.
ఇవి కాక ప్రకృతిని మనిషి అస్తిత్వానికి ముడివేస్తూ రాసిన "At Kinosaki", "The little girl and the Rapeseed flower", "The House by The Moat" లాంటి కథలు చదివినప్పుడు రచయితకు తన చుట్టూ ఉన్న పరిసరాల పట్ల గమనింపు ఎంత అవసరమో అర్థమవుతుంది. పువ్వులూ, మొక్కలు, ఎలుకలు, పిల్లులు, బాతులూ, కోళ్ళూ, సీతాకోకచిలుకలూ, ప్రవాహాలూ- ఇలా తన చుట్టూ కనిపించే ప్రపంచంలోని ప్రతీ చిన్న అంశమూ షిగా కథల్లో చోటు సంపాదించుకుంటుంది. ఆయన రచయితగా తొలినాళ్ళలో రాసిన ఈ కథలకూ, "కునికో" నాటికీ షిగా రాతల్లో పరిపక్వత దశలవారీగా చూడచ్చు. 'మాస్టర్ స్టోరీ టెల్లింగ్' అనే మాటకి సరైన నిర్వచనం తెలియాలంటే షిగా కథలు చదవాల్సిందే. హ్యాపీ రీడింగ్ :)
Here I lived as simply as possible. When 1 came out here from my life in the city, drained dry by my relationships with people, people, people, it set my heart very much at ease. My life here was a relationship with insects, birds, fish, water, plants, the sky and, after them, lastly, with human beings.
Even with Nature, there were some relationships that were unwelcome. Elsewhere, if I had left the light on in the parlor, various insects would be attracted by that. Moths, beetles, and other light-seeking insects swarmed and swirled around the light bulb. Eyeing them, a number of bullfrogs crouched on the tatami. Startled by my tread, they would flee in the direction of the moat. But the leaf-frogs that clung to the houseposts bending and twisting their bodies to the utmost, their golden eyes spinning, glared at this unexpeeted intruder who was myself. Actually, no doubt, I was an intruder, who had caused a panic in the house of frogs, lizards, and insects.
పుస్తకం నుండి మరికొన్ని అంశాలు :
I had no heart to watch the rat’s last moments. The appearance of the rat as it fled for its life with all its strength, laboring under a fate that would end in death, remained strangely in my mind. I had a lonely, unpleasant feeling. That was the truth, I thought to myself Before the quietness that I aspired toward, there was that terrible suffering. I might have an affection for the quietness after death, but until I achieved that death I would likely have a dreadful time of it. Creatures that did not know of suicide had to continue their efforts until they had finally done dying. If I were in a situation similar to the rat’s, what would I do? Wouldn’t I struggle, as the rat had done?
The question of whether the injury was fatal or not was literally a matter of life and death. Even so, I was almost completely unassailed by the fear of death. This also seemed strange to me. “Is it fatal or not? What did the doctor say?” I asked a friend who was standing by. “He says it’s not a fatal injury,” I was told. This answer cheered me up immediately. From excitement, I became extraordinarily happy. How would I have acted if I’d been told; “It’s fatal”? I could not at all imagine myself in such a case. Probably I would have felt sad.
1 did not think that this was because of my heartlessness. If it was heartlessness, then the heartlessness of God was like this, I thought. If one wanted to, one could criticize a human being who was not God, who had free will, for looking on heartlessly as if he were God, but for me that course of events was like an irresistible destiny. 1 didn’t even want to raise a finger.
He loved his wife. Even when he’d fallen in love with the other woman, his love for his wife hadn’t changed. But it was an extremely rare thing for him to love a woman other than his wife. And this rarity became a strong glamour; it lured and led him on. It seemed to him to lend a lively vitality to his stagnant life-mood. A selfish feeling, but not altogether a bad one, he thought.
“You really are selfish.” “I have always acted on my desires.” “Yes, I knew you always did as you pleased. But to completely deceive me with that as your excuse, and then to nonchalantly accuse me of coercion and vulgarity—how do you do it? You’re shrewdly penetrating when you judge others, but for yourself the rules are quite different. Why do you think that is? People who scold their children for telling lies don’t mind their own, it seems.”
No comments:
Post a Comment