అది జూన్ నెల. క్లాక్ టవర్ ఆరుసార్లు మ్రోగి ఆగింది. ఆల్ప్స్ పర్వత శ్రేణులు అప్పుడప్పుడే పడుతున్న సూర్యకిరణాల వెలుగులో మెరుస్తున్నాయి. ఒక ఆఫీసు గదిలో తల దువ్వుకోకుండా అస్తవ్యస్తంగా ఉన్న జుట్టుతో, వదులుగా ఉన్న ట్రౌజర్లు వేసుకున్న యువకుడి చేతుల్లో "న్యూ థియరీ ఆఫ్ టైమ్" పేపర్లు నలిగిపోయి ఉన్నాయి. ఈరోజు ఆ కాగితాల్ని "జర్మన్ జర్నల్ ఆఫ్ ఫిజిక్స్"కి మెయిల్ చెయ్యడానికి అతడు తెల్లవారుఝాముననగా ఆఫీసుకు వచ్చి కూర్చున్నాడు.
స్పైషర్గాసే (Speichergasse, Germany)లో ఈ యువ 'పేటెంటు క్లర్కుకు' కొద్ది నెలలుగా 'కాలం' గురించి వస్తున్న కలలు అతడి రీసెర్చిని ప్రభావితం చేస్తూవచ్చాయి. ఎంతగా అంటే, నిద్రకీ, మెలకువకీ ఏమాత్రం తేడా తెలీనంతగా వచ్చిన కలలతో అతడు పూర్తిగా అలసిపోయాడు. ఏదేమైనా రీసెర్చ్ పూర్తయ్యింది, కలలు రావడం ఆగిపోయింది. ప్రస్తుతం అతడు కుర్చీలో సర్దుకుని కూర్చుని నెమ్మదిగా "బీథోవెన్ మూన్ లైట్ సొనాటా" హమ్ చేస్తూ టైపిస్ట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అతడు ఐన్స్టీన్ అని ప్రత్యేకం చెప్పక్కర్లేదు కదా!
|
Image Courtesy Google |
రెండేళ్ళ క్రితం అనుకుంటా, డేవిడ్ ఈగల్మాన్ రాసిన "Sum: Forty Tales from the Afterlives" అనే పుస్తకం చదివాను. ఫిక్షన్నీ, నాన్ ఫిక్షన్నీ కలిపి అంతబాగా రాసిన కథలు మునుపెప్పుడూ చదవలేదు. మళ్ళీ ఇంతకాలానికి అలాన్ లైట్మాన్ రాసిన "Einstein's Dreams" చదివినప్పుడు ఆ పుస్తకం గుర్తొచ్చింది. ఇది కూడా అటువంటి పుస్తకమే. ఐన్స్టీన్ "థియరీ ఆఫ్ రెలెటివిటీ" మీద పని చేస్తున్న 1905 కాలానికి కాల్పనికతను జోడించి రాసిన ఈ పుస్తకం దాదాపు 30 భాషల్లోకి అనువాదమైంది.
ఈ పుస్తకంలో రీసెర్చ్ సమయంలో ఐన్స్టీన్ కి వచ్చే కలల్ని ఒక జర్నల్ లాగా తేదీలవారిగా రాసుకొచ్చారు. కాలం ఇలా కాకపోతే ఎలా ఉంటుంది? ఎలా ఉండొచ్చు? అనే ప్రశ్నల్ని పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో అన్ని సంభావ్యతలనూ ఊహిస్తూ వాటి పరిణామాల్ని మానవ సమాజానికి అన్వయిస్తారు అలాన్ లైట్మాన్. మనం అవెంజర్స్ సినిమాల్లో చూసే టైమ్ లైన్ ని మార్చడం దగ్గర్నుంచీ కాలం ఒకే క్షణంలో పూర్తిగా ఆగిపోయిన ప్రపంచం, కాలం ఓవర్లాప్ అయిన ప్రపంచం, జ్ఞాపకాలు లేని ప్రపంచం, కాలం వృత్తాకారంలో ఉండే ప్రపంచం, కాలం ఒక ప్రవాహంలా ఉన్నట్లుండి దిశలు మార్చుకునే ప్రపంచం, అంతంలేని అనంతమైన ప్రపంచం (అంటే మనుషులకు చావు రాదు)- ఇలా చెప్పుకుంటూపోతే ఐన్స్టీన్ కలల్లో వివిధ సంభావ్యతలతో కూడిన అనేకానేక ప్రపంచాలు కనిపిస్తాయి. ఈ ఒక్క పుస్తకంతో ఎన్ని సైన్స్ ఫిక్షన్ పుస్తకాలు రాసుంటారో/ రాయచ్చో అనిపించింది. ఇది సైన్స్ ఫిక్షన్/ డిస్టోపియన్ ఫిక్షన్ కి మంచి ముడిసరుకునిచ్చే రచన.
మనం చిన్న అసహనం వచ్చినా 'టైమ్'ని ఎన్నిసార్లు తిట్టుకుంటామో! ఈ ప్రపంచం ఇలా ఉండకపోతే బావుణ్ణని ఎన్నిసార్లు అనుకుంటామో! కానీ ఈ ప్రపంచం, కాలం ఇలా ఉండకపోతే ఎంత భయానకంగా ఉంటుందో రాసిన ఈ పుస్తకం చదివితే మళ్ళీ ఎప్పుడూ 'టైమ్'ని నిందించాలనిపించదు.
The world will end on 26 September 1907. Everyone knows it. అది 1905 సంవత్సరం, ప్రపంచం 26 సెప్టెంబర్ 1907 లో అంతమైపోతుంది. ఈ విషయం అందరికీ తెలుసు. మనుషులంతా ఇక తామేం చేసినా వృధానే అనుకుంటారు. ఏడాది ముందు స్కూళ్ళన్నీ మూసేస్తారు. అంత స్వల్ప కాలంలో ఏదైనా నేర్చుకుని ఉపయోగం ఏముంది! చదువుసంధ్యల్లేవని పిల్లలు కేరింతలు కొడుతూ ఆటల్లో పడిపోతారు, పెద్దలు వాళ్ళని నచ్చినట్లు చేసుకోడానికి వదిలేస్తారు. నెల ముందు వ్యాపారాలూ, పరిశ్రమలూ అన్నీ మూతపడతాయి. కేఫుల్లో మనుషులు కాఫీ తాగుతూ దాపరికాలు లేకుండా మనసువిప్పి మాట్లాడుకుంటారు. కాలం ఆగిపోయి ప్రపంచం అంతమైపోవడం వాళ్ళకి కొత్తగా స్వేచ్ఛనిస్తుంది. ఒక యువతి తన తల్లితో చిన్నప్పుడు ఉద్యోగరీత్యా ఆమె తనతో గడపలేదని చెప్తుంది, ఇద్దరూ కలిసి హాలిడే ప్లాన్ చేసుకుంటారు. మరో వ్యక్తి తన సహోద్యోగితో, తన పై ఆఫీసరు తన భార్యపై అత్యాచారం చేశాడనీ, ఆ విషయం బయటకు చెప్పకుండా బెదిరించాడనీ అంటాడు. ఇప్పుడు పోయేదేం లేదు గనుక ఆఫీసరుని చితకబాది కక్ష తీర్చుకుంటాడు. తర్వాత మనసు తేలికపడి ఆల్ప్స్ పర్వతశ్రేణుల్ని ప్రశాంతంగా చూస్తూ కూర్చుంటాడు.
జనం బ్రెడ్ లాంటి నిత్యావసర కొనుగోళ్ళ సమయంలో మునుపెన్నడూ లేనంత మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తుంటారు. డబ్బుకి ఎటూ విలువపోయింది కాబట్టి ఇవ్వాల్సినంత డబ్బు బకాయిలు లేకుండా చెల్లించేస్తారు. అందరిదీ అదే పరిస్థితి కాబట్టి ప్రపంచం అంతమయిపోవడం గురించి ఎవరూ బెంగపడడంలేదు. జనం నవ్వుతూ పనులు చేసుకుంటున్నారు. ఆత్మీయులతో సమయం గడుపుతున్నారు, విహారాలకెళ్తున్నారు, పిల్లలు చెప్పే మాటల్ని శ్రద్ధగా వింటున్నారు. చూస్తుండగానే సమయం గడిచిపోతోంది. ఇక ఒక్క నెలే మిగిలింది. A world with one month is a world of equality.
ఇక రేపు చివరి రోజు అనగా జనమంతా వీధుల్లోకి వచ్చి ఒకరినొకరు నవ్వుతూ పలకరించుకున్నారు, ఎప్పుడూ మాట్లాడుకోని ఇరుగుపొరుగు వాళ్ళు మాటలు కలిపారు. ఇంకొందరు దగ్గర్లో ఉన్న ప్రవాహాల దగ్గరకెళ్ళి స్నానం చేశారు, అలసిపోయాక గడ్డి మీద పడుకుని కవిత్వం చదువుకున్నారు. ఒక బారిష్టరు, పోస్టల్ క్లర్కు తమ సామజిక స్థాయిల్ని మర్చిపోయి ఒకరి భుజం మీద మరొకరు చేతులు వేసుకుని ఆర్ట్ గురించీ, సంగీతం గురించీ చర్చించుకుంటూ నడవసాగారు. What do their past stations matter? In a world of one day they are equal.
కొందరు హడావుడిగా గతంలో చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా మంచిపనులు చెయ్యసాగారు. ఇక మరో నిముషంలో ప్రపంచం అంతమైపోతుందనగా అందరూ ఒకరిచేతులొకరు పట్టుకుని 'జైంట్ సర్కిల్' నిర్మించారు. ఎవ్వరూ కదలరు, మాట్లాడరు, తమ గుండె చప్పుడు తమకే వినిపించేలా అంతటా నిశ్శబ్దం.
In the last seconds, it is as if everyone has leaped off Topaz Peak, holding hands. The end approaches like approaching ground. Cool air rushes by, bodies are weightless. The silent horizon yawns for miles.
అదే కాలం ఒకవేళ వృత్తాకారంలో ఉంటే, ప్రతీ ముద్దూ, ప్రతీ హ్యాండ్ షేక్, ప్రతీ పుట్టుక, ప్రతీ చావు, ఇలా ప్రతి చర్యా మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతుంది. నిలబెట్టుకోలేని ప్రతీ మాట, చేజారిపోయిన ప్రతీ అవకాశం, కోల్పోయిన ప్రతీ స్నేహం, విచ్ఛిన్నమైపోయిన ప్రతీ కుటుంబం- ఇలా అన్నీ మళ్ళీ మళ్ళీ లూప్ లో కొత్తగా జరుగుతూనే ఉంటాయి.
These are the people with unhappy lives, and they sense that their misjudgments and wrong deeds and bad luck have all taken place in the previous loop of time. In the dead of night these cursed citizens wrestle with their bedsheets, unable to rest, stricken with the knowledge that they cannot change a single action, a single gesture. Their mistakes will be repeated precisely in this life as in the life before. And it is these double unfortunates who give the only sign that time is a circle. For in each town, late at night, the vacant streets and balconies fill up with their moans.
ఇంకో ప్రపంచంలో కాలం నీటి ప్రవాహంలా దిశలు మార్చుకుంటుంది. ఉధృతమైన గాలో, అడ్డొచ్చిన ఇసుక మేటలో, రాళ్ళో ప్రవాహపు గతిని మార్చినట్లు కొన్నిసార్లు కాలం దిశను మార్చుకుని వెనక్కు మరలుతుంది. ఆ సమయంలో పక్షులూ, మట్టీ, మనుషులూ గతంలోకి నెట్టేయబడతారు.
When a traveler from the future must talk, he does not talk but whimpers. He whispers tortured sounds. He is agonized. For if he makes the slightest alteration in anything, he may destroy the future. At the same time, he is forced to witness events without being part of them, without changing them. He envies the people who live in their own time, who can act at will, oblivious of the future, ignorant of the effects of their actions. But he cannot act. He is an inert gas, a ghost, a sheet without soul. He has lost his personhood. He is an exile of time.
అలాగే ఇంకో ప్రపంచంలో భవిష్యత్తు ఉండదు. జీవితం ఆ క్షణానికే పరిమితం కాబట్టి ఏ మనిషికీ తన పనుల వల్ల మంచి జరుగుతోందో, చెడు జరుగుతుందో స్పృహ ఉండదు. ఈ లోకంలో పర్యవసానాల గురించి ఆలోచన లేకుండా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు జీవిస్తారు.
In a world of fixed future, there can be no right or wrong. ముందే నిర్ణయింపబడిన భవిష్యత్తులో మంచి-చెడు అంటూ ఏమీ ఉండవు. ఎందుకంటే మంచి-చెడులకు స్వయం నిర్ణయాధికారం అవసరం, 'ఫ్రీడమ్ ఆఫ్ ఛాయిస్' అవసరం. ప్రతి కర్మ ముందే నిర్ణయమైపోతే ఇక ఫ్రీడమ్ ఆఫ్ ఛాయిస్ ఏముంటుంది! అటువంటి ఒక ప్రపంచంలో మనిషి దేనికీ బాధ్యుడు కాదు. ఆ ప్రపంచంలో మనిషి ఆలోచనల ఫలితం కూడా ముందే నిర్ణయింపబడి ఉంటుంది. He almost permits himself a smile, so pleased is he at his decision. He breathes the moist air and feels oddly free to do as he pleases, free in a world without freedom.
ఇలా చెప్పుకుంటూపోతే ఐన్స్టీన్ కలల్లో ఊహాప్రపంచాలు పాఠకులకు ఇటాలో కాల్వినో కాస్మిక్ ప్రపంచాలను గుర్తుకుతెస్తాయి. ఈ ఏడాది హోమర్ 'ఒడిస్సీ' తర్వాత నాకు చాలా నచ్చిన పుస్తకం ఇది. హ్యాపీ రీడింగ్ :)
పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు :
The tragedy of this world is that no one is happy, whether stuck in a time of pain or of joy. The tragedy of this world is that everyone is alone. For a life in the past cannot be shared with the present. Each person who gets stuck in time gets stuck alone.
There is a place where time stands still. Raindrops hang motionless in air. Pendulums of clocks float mid-swing. Dogs raise their muzzles in silent howls. Pedestrians are frozen on the dusty streets, their legs cocked as if held by strings. The aromas of dates, mangoes, coriander, cumin are suspended in space.
With time, each person’s Book of Life thickens until it cannot be read in its entirety. Then comes a choice. Elderly men and women may read the early pages, to know themselves as youths; or they may read the end, to know themselves in later years.
Some have stopped reading altogether. They have abandoned the past. They have decided that it matters not if yesterday they were rich or poor, educated or ignorant, proud or humble, in love or empty-hearted—no more than it matters how a soft wind gets into their hair. Such people look you directly in the eye and grip your hand firmly. Such people walk with the limber stride of their youth. Such people have learned how to live in a world without memory.
This is a world of changed plans, of sudden opportunities, of unexpected visions. For in this world, time flows not evenly but fitfully and, as consequence, people receive fitful glimpses of the future.
Such is the cost of immortality. No person is whole. No person is free. Over time, some have determined that the only way to live is to die. In death, a man or a woman is free of the weight of the past. These few souls, with their dear relatives looking on, dive into Lake Constance or hurl themselves from Monte Lema, ending their infinite lives.