ప్రూస్ట్ రాసిన పుస్తకాల సైజు చూసి ఆయన్నీ,జాయిస్ నీ,ఈ తరహా సుదీర్ఘమైన రచనలు చేసే క్లబ్బుకి చెందిన మరి కొందరు రచయితల్నీ బాధ్యతలన్నీ తీరిపోయాక, తీరుబడిగా రిటైర్మెంట్ తరువాత చదువుదామని అనుకున్నాను. ఈలోగా బ్రిటిష్ తత్వవేత్త అలైన్ డి బటన్ రాసిన 'How Proust Can Change Your Life' అనే పుస్తకం కంటబడింది. "ప్రూస్ట్ ని ఎందుకు చదవాలి ?" అనే దిశగా రాసిన పుస్తకంలా అనిపించిన ఆ టైటిల్ నన్ను చాలా ఆకర్షించింది. సినిమా ముందు టీజర్ లా ఈ పుస్తకం చదివితే ప్రూస్ట్ రాసిన బృహద్గ్రంథాలని ఇంకొంచెం సులభంగా చదవవచ్చునేమో అన్న ఆలోచన వచ్చింది. మరో కారణం ఏమిటంటే,గత ఏడాది ప్రూస్ట్ రాసిన 'డేస్ ఆఫ్ రీడింగ్' చదివాను. అందులో జిగిబిగి అల్లికల చిక్కని వచనం నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. చిక్కుముడులు విడదీసుకుంటూ, కొన్ని పంక్తులకు ఆదీ-అంతం ఎక్కడో వెతుక్కుంటూ ఆ పుస్తకం పూర్తి చేసేసరికి నా తలప్రాణం తోక్కొచ్చింది. ఏదైతేనేం "ప్రూస్ట్ ని చదవడం అంత వీజీ కాదు" అనే విషయం స్పష్టంగా అర్థమైపోయింది.
Image Courtesy Google |
పోనీ కాస్త ఓపిక చేసుకుని క్లాసిక్స్ కాబట్టో, తరాలుగా పాఠకుల మన్ననలందుకుంటున్న రచనలనో చదువుదామనుకున్నా ఆ భారీ వాలూమ్స్ చూస్తే ఎవరికి మాత్రం భయమెయ్యదూ !! "చదివితే చదవాలి,లేదా ప్రక్కన పడెయ్యాలి,అంతేగానీ ఒక పుస్తకం చదవడానికి ఇంత ఆలోచన అవసరమా" అంటారా ! మిగతావాళ్ళ సంగతి ప్రక్కన పెడితే ప్రూస్ట్ విషయంలో ఖచ్చితంగా అవసరమే. అసలు ఇక్కడ సమస్య ఏమిటంటే దొరికే కాస్త ఖాళీ సమయంలో ఒక వందా,పోనీ రెండు వందలు,అదీ కాకపోతే పోనీ మరో వంద కలుపుకుని మూడు వందలనుకుందాం. కనీసం మూడొందల పేజీలున్న ఒక పుస్తకాన్ని నేను చదివినట్లు తాబేలులా చదవడానికి ఎంత సమయం వెచ్చించాలి ! అసలే కాలమూ దాని విలువా తెలిసిన పిసినారిని,స్వార్థపరురాలిని. చేతికి కలం,కాగితం దొరికాయి కదాని బొత్తిగా పొదుపుకి అర్థం తెలీకుండా, పాఠకులపై కొంచెం కూడా దయాదాక్షిణ్యాలు లేకుండా ప్రూస్ట్ పేజీలకు పేజీలు రాసి పడేసిన బృహద్గ్రంథాలను నా విలువైన సమయం వెచ్చించి నేనెందుకు చదవాలి ? (బృహద్గ్రంథాలు అని ఊరికే అనడం లేదు,ఆయన 'In Search of Lost Time' పేజిల కౌంటు వికీలో చూస్తే అక్షరాలా నాలుగు వేల రెండువందల పదిహేను పేజీలు.)
1913 లో ప్రూస్ట్ ఏడు వాల్యూముల 'In Search of Lost Time' ని ప్రచురించడానికి ఆయన స్నేహితుడు లూయిస్ డి రాబర్ట్ ఆయనకు సహాయపడదామనుకున్నారట. లూయిస్ తన రచనల్ని ప్రచురించే ప్రముఖ సంస్థ 'ఓలెన్ డోర్ఫ్' కు ఆ ప్రతుల్ని పంపినప్పుడు ప్రచురణ సంస్థ యజమాని ఆల్ఫ్రెడ్ హమ్బ్లోట్ అటువంటి విచిత్రాన్ని (వైపరీత్యం అనాలేమో :) ) మునుపెన్నడూ చూడక పాపం నోరెళ్ళబెట్టారట. మొహమాటం కొద్దీ వాటిని కొంత చదివిన తరువాత ఆయన,
“My dear friend, I may be dense,” replied Humblot after taking a brief and clearly bewildering glance at the opening of the novel, “but I fail to see why a chap needs thirty pages to describe how he tosses and turns in bed before falling asleep.” అన్నారట :)
ఇలా అన్నది ఆయనొక్కరే అనుకుంటే పొరపాటే. పై ఉదంతం జరిగిన కొన్ని మాసాల ముందు ఫాస్కేల్లే అనే మరో ప్రచురణ సంస్థకు చెందిన పాఠకుడు జాక్వెస్ మడెలైన్ ఇవే ప్రతుల మోపుని చదివే సాహసం చేశారు. ఆయన స్పందన ఏమిటంటే,
“At the end of seven hundred and twelve pages of this manuscript,” he had reported, “after innumerable griefs at being drowned in unfathomable developments and irritating impatience at never being able to rise to the surface—one doesn’t have a single, but not a single clue of what this is about. What is the point of all this? What does it all mean? Where is it all leading? Impossible to know anything about it! Impossible to say anything about it!” అంటూ కళ్ళు తేలేశారట.
And as they lie in bed with their limb newly encased in plaster or a tubercle bacillus diagnosed in their lungs, they face another challenge in the length of individual Proustian sentences, snakelike constructions, the very longest of which, located in the fifth volume, would, if arranged along a single line in standardized text, run on for a little short of four meters and stretch around the base of a bottle of wine seventeen times.
ఇక ప్రూస్ట్ ప్రతుల్ని చదివి విరక్తి చెందిన మరో అందమైన యువతి ఆయనకు స్వయంగా ఉత్తరం రాసి,
“I don’t understand a thing, but absolutely nothing. Dear Marcel Proust, stop being a poseur and come down to earth. Just tell me in two lines what you really wanted to say.”అని అందట.
ఇవన్నీ చదివి నాకు మహదానందం కలిగింది. ఆయన వచనం మింగుడుపడనిది నాకు మాత్రమే కాదన్నమాట ! కానీ ఇంతమంది విమర్శించినా పాఠకుల సహనాన్ని పరీక్షించే ప్రూస్ట్ వచనాన్ని చదవడం లాభదాయకమైన వ్యవహారమే అంటారు అలైన్ డి బటన్. అది ఎందుకో తెలియాలంటే ఈ పుస్తకం తప్పకుండా చదవాలి. ఫాస్ట్ ఫుడ్,ఫాస్ట్ లైఫ్,ఫాస్ట్ అఫైర్స్ ఇలా అన్నీ సూపర్ ఫాస్ట్ గా జరిగిపోతున్న ఈ తరంలో ప్రూస్ట్ లాంటి రచయితల్ని చదవడం మరింత అవసరం. n’allez pas trop vite (Don't go very fast) అనే ప్రూస్ట్ స్లోగన్ జీవితాన్ని నెమ్మదిగా ఆస్వాదిస్తూ జీవించమని బోధిస్తుంది. వేగాన్ని తగ్గించి మెల్లిగా జీవితాన్ని ఆస్వాదిస్తూ జీవించడంలో ఉన్న ప్రయోజనం ఏమిటంటే,ప్రపంచం మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంటుంది అంటారు బటన్. ఈ పుస్తకంలో ప్రూస్ట్ శైలి గురించే కాకుండా ఆయన జీవన విధానాన్నీ,అలవాట్లనూ,తన చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల నిబద్ధతతో కూడిన ఆయన గమనింపునూ ప్రస్తావిస్తారు బటన్. 'వింటేజ్ షార్ట్స్' సిరీస్' లో భాగంగా పెంగ్విన్ రాండమ్ హౌస్ వారు ప్రచురించిన ఈ 'How to Take Your Time' (How Proust Can Change Your Life నుండి సంగ్రహించబడింది) ప్రూస్ట్ ని చదవడానికి మరోసారి ప్రయత్నించాలనే ఆసక్తి కలుగజేసింది. ఈ చిన్ని పుస్తకాన్ని ఎయిర్పోర్ట్ లోనో,రైల్వే స్టేషన్లోనో వెయిటింగ్ సమయంలో హాయిగా చదివేసుకోవచ్చు.హ్యాపీ రీడింగ్.
పుస్తకం నుండి మరి కొన్ని నచ్చిన అంశాలు :
Madeleine nevertheless had a go at summarizing the events of the first seventeen pages: “A man has insomnia. He turns over in bed, he recaptures his impressions and hallucinations of half-sleep, some of which have to do with the difficulty of getting to sleep when he was a boy in his room in the country house of his parents in Combray. Seventeen pages! Where one sentence (at the end of page 4 and page 5) goes on for forty-four lines.”
Proust’s novel ostensibly tells of the irrevocability of time lost, of innocence and experience, the reinstatement of extra-temporal values and time regained. Ultimately the novel is both optimistic and set within the context of human religious experience.
These literary quotations were not simply designed to impress (though Proust did happen to feel that “one must never miss an opportunity of quoting things by others which are always more interesting than those one thinks up oneself”)
The truth is that as we grow older, we kill all those who love us by the cares we give them, by the anxious tenderness we inspire in them and constantly arouse.”
No comments:
Post a Comment