"One writes because the act of writing has become as close to one as breathing. It is difficult to stop." అని తన ముందు మాటలో రాసిన తమిళ రచయిత్రి అంబై కథలన్నీ అడ్డుకట్ట తెగిపోయిన అనుభవాల ప్రవాహంలా ఉంటాయి. పదేళ్ళ కాలంలో వివిధ సమయాల్లో పత్రికలకు పంపిన ఈ కథలన్నీ రాయడానికి డెడ్ లైన్స్ లేవంటారావిడ. మొత్తం 18 కథలున్న ఈ అనువాదాన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది. 'In a forest, A Deer' పేరిట అంబై కథలకు లక్ష్మీ హోల్మ్స్ట్రోమ్ చేసిన అనువాదం విషయమై రచయిత్రి పంచుకున్న విషయాలు నాకు చాలా నచ్చాయి.
"అనువాదంలో నా పాత్రలు నాకు కొత్తగా కనిపించాయి. పాత్రల చిత్రీకరణ వేరుగా ఉంది,చిత్రీకరణలో నేనూహించుకున్న వర్ణాలు వేరు. శబ్దాలు కూడా భిన్నంగా ధ్వనించాయి. అనువాదంలో కొత్త భాషను సొంతం చేసుకుని చదివేకొద్దీ మన కథలు కొత్తగా రెక్కలు విప్పుకుని రెండు భాషల మధ్య దూరాలను చెరిపేసే దిశగా ప్రయాణిస్తాయి. జాలరి పడవను సముద్రంలోకి నెట్టే విధంగా అనువాదం ఒక భాషలోని కథను సాగరసమానమైన మరో భాషలోకి సున్నితంగా నెట్టి వదిలేస్తుంది."
|
Image Courtesy Google
|
కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో నేను చదివిన కొందరు భారతీయ రచయితల్లో అంబై ఒకరు. ఈ మధ్య ఫెమినిస్టు కథలు చదివే ఆసక్తి బాగా తగ్గిపోయింది. కానీ ఇన్నేళ్ళుగా తమిళనాట ఉండీ కూడా నలభై ఏళ్ళుగా రచనా వ్యాసంగంలో ఉన్న ప్రముఖ తమిళ రచయిత్రి అంబై కథలను చదవలేదే అనిపించింది . అందుకే రోజుకో కథ అనుకుని 'In a Forest, A Deer : Stories' ను చదువుతూ వచ్చాను. నిజానికి సాంస్కృతికపరమైన వివరణలతో చక్కగా చిక్కగా అల్లిన ఈ కథలన్నీ ఏకబిగిన చదవలేం. అంబై చెప్పే చిన్న చిన్న సంగతుల్ని పట్టుకోడానికీ,ఆమె పరిచయం చేసే ప్రపంచాన్ని పూర్తిగా అవగాహన చేసుకోడానికీ ఒక ప్రత్యేకమైన మూడ్ కావాలి.
అంబై కలం పేరుతో రాసే 'సి.ఎస్.లక్ష్మి' కథలన్నిటిలో స్త్రీ కేంద్రబిందువు. అన్ని కథల్లోనూ ప్రోటొగోనిస్ట్ గా స్త్రీ కంఠస్వరమే వినిపిస్తుంది. కోయింబత్తుర్ లో పుట్టి, ముంబై,బెంగళూరుల్లో పెరిగి, ఢిల్లీలో పీహెచ్డీ చెయ్యడం వల్ల ఆమె కథల్లో క్రాస్-కల్చరల్ ఎలిమెంట్స్ పుష్కలంగా కనిపిస్తాయి. పెరుమాళ్ మురుగన్ వంటి కొందరు తమిళ రచయితల కథల్లోలా సాంస్కృతికపరమైన అంశాలన్నీ కేవలం తమిళ సంస్కృతికి మాత్రమే పరిమితం కాకపోవడం అంబై కథల్లోని ప్రత్యేకత. తన కథల్లో ఆమె తన తమిళ అస్తిత్వపు మూలాల్ని వెలికితీసి అనుభవాలను పంచుకున్నారే గానీ ఎక్కడా తమిళ సంస్కృతిని గుడ్డిగా భుజాన మోసిన దాఖలాల్లేవు. ఆ మాటకొస్తే కొన్ని చోట్ల తమిళ సంస్కృతీ,సంప్రదాయాల పేరిట జరిగే అణచివేతపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. అలాగే ఈ కథల్లో స్త్రీవాదం పేరిట మూలాల్ని త్యజించి నేల విడిచి సాము చెయ్యలేదు. ఒకవైపు తన సాంస్కృతిక మూలాలను వదలకుండా ఒడిసి పట్టుకుంటూనే మరోవైపు ఈ కథలను ఆమె ఒక 'డిటాచ్మెంట్' తో రాశారనిపించింది. ఆమె తన కథల ద్వారా స్త్రీ కి వ్యవస్థను 'కండిషనింగ్' పేరిట తృణీకరించమని పిలుపునివ్వలేదు. స్త్రీ తన స్వేచ్ఛను విస్మరించకుండా ఆరోగ్యకరమైన వ్యవస్థలో భాగంగా మారడానికి అనువైన మార్గాల కోసం మాత్రమే ఆమె అన్వేషించారు.
ఈ కథల్లో అంబై తీవ్ర విముఖత కనబర్చిన విషయం 'రామాయణం'. కొన్ని కథల్లో రాముని ధర్మంపై తీవ్ర విమర్శలు చేశారు. Camel ride అనే కథలో ముక్కులోంచి రక్తమోడుతున్న ఒంటెను చూసి "ఇది సముద్రతీరంలో షికారుకు తీసుకెళ్ళనని మొండిగా మొరాయిస్తూ శూర్ఫణఖలా కూర్చుంది. శూర్ఫణఖ అంటే తన ప్రేమను ధైర్యంగా వ్యక్తం చేసినందుకు మన పురాణాల్లో ఒక వీరుడి వల్ల ముక్కు పగలగొట్టించుకుందీ, ఆమే. గుర్తుందా ? " అంటారు.సాధారణంగా రామాయణంపై ఇటువంటి విషయాలు చాలా చోట్ల చదివి నాకు విసుగ్గా అనిపించినా ఈ కథల్లో ఆమె విమర్శలు పంటిక్రింద రాళ్ళలా తగలకపోవడం విశేషం. దానికి కారణం కూడా ఉంది. దేన్నైనా విమర్శించే ముంది ఆ విషయం గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి. కావ్యాలు చదవకుండా వాటిలో అనుకూలమైన కొన్ని వాదాల్ని మాత్రం ఎంపిక చేసుకుని ఆమె విమర్శలకు పాల్పడలేదు. అంబై ప్రస్తావించే విషయాలు చూస్తే ఆమె రామాయణం ఔపాసన పట్టకుండా కేవలం ఒక ఫెమినిస్టు కోణంలో గాల్లోంచి విషయాలను ఏరుకొచ్చి ఎడ్డెమంటే తెడ్డెమంటూ ఈ విమర్శలు చెయ్యలేదని అర్ధమవుతుంది. పురాణాల్లో ఒక్కో సంఘటననీ,చిన్న చిన్న వివరాల సహితంగా ఎందుకు నచ్చలేదో పరిశీలిస్తూ రాసిన విశ్లేషణలు కావడంతో ఆమెకు పాఠకుల్ని తనదారికి ఎలా తెచ్చుకోవాలో బాగా తెలుసనిపించింది. మంచి రచయిత తన కథ ద్వారా అయితే పాఠకుల్ని ఆలోచించేలా చెయ్యగలగాలీ లేదా ఒప్పించగలగాలి. ఈ రెండు విషయాల్లో అంబై కి మంచి నేర్పూ,ఓర్పూ ఉన్నాయి. మరో ప్రత్యేకమైన అంశం ఏమిటంటే, హిందుస్థానీ,కర్ణాటిక్ సంగీతాన్నీ,హిందీ,తమిళ సినిమా పాటల్నీ సందర్భోచితంగా తన నేరేషన్ లో వాడుకోవడం అంబైకు సంగీతం మీద ఉన్న ప్రీతిని చెప్పకనే చెబుతాయి.
ఒక కథలో మన ఎన్.టి.రామారావు రాముడిగా, శివాజీ గణేశన్ భరతుడిగా (నేను ఉత్సాహం కొద్దీ యూ ట్యూబ్ లో ఒక క్లిప్పింగ్ చూశాను,భరతుడు అంతఃపురం అదిరిపోయేలా చేసిన నటన మీరూహించినట్లే ఉంది :) ) తమిళంలో నటించిన 'సంపూర్ణ రామాయణం' గురించి రాశారు.
But as she grew up, there were some aspects of Rama that she began to dislike. She was stung to anger at the notion of Rama, in his original form of Vishnu, lying on the serpent Adisesha, with Lakshmi relegated firmly to his feet. She preferred Shiva. She liked the indifferent and defiant nature of Shiva as he went about smoking gartja, wandering as he chose, and dancing his immortal taandavam. Then, after she saw the film Sampurna Ramayanam, as far as she was concerned, Rama became the actor N.T. Rama Rao. What’s more, when she heard T.K. Bhagavati singing as Ravana, (Ga gamagagari rigaririsa rigaririsarisa nidapadasa’ in Kambodhi Raga, her heart inclined more and more towards the rakshasa.
First Poems అనే మరో కథలో కూడా ఆయన ప్రస్తావన ఉంటుంది: రాముడన్నా,శివుడన్నా రవివర్మ చిత్రాల తరువాత గుర్తొచ్చేది ఎన్.టి.రామారావు అని ఆమె రాస్తే చదివి సంబరంగా అనిపించింది.
The idea that a girl should marry no one other than God fascinated her. At the same time they were learning about Akkamahadevi in their Kannada lessons. Mahadeviakka too, had renounced everything for the sake of Shiva. It struck her, though, that there might be a few problems in accepting God as one’s husband, when it actually came to practice. In the first place, she was scared to think in what form the gods might actually manifest themselves, even if they looked so beautiful as statues, and in the paintings by Ravi Varma. In the second place, it was N.T. Rama Rao who took the roles of Rama and Shiva in the cinema, in those days. Suppose, after she had given herself up to God, he then knocked on her door in the shape of Rama Rao? The thought confused her.
అంబై కథల్లో నాకు తెలిసిన తమిళ ప్రపంచాన్ని వెతికాను. కనిపించలేదు. ఆమె కథల్లో 'చెన్నై, కోయింబత్తూర్' లు లేవు, తెలుగు,తమిళ సంస్కృతులు కలగలిసిన 'మద్రాసు' మాత్రమే కనిపిస్తుంది. బాల్యం నుండీ అంబై అనుభవాలు ఆమె సృజించిన అనేక పాత్రల్లో ప్రతిబింబిస్తాయి. తన చుట్టూ ఉన్న ప్రపంచంతో గాఢమైన అనుబంధం,తన ఉనికి పట్ల స్పష్టత ఈ రెండూ అంబై పాత్రల్లో ముఖ్య లక్షణాలుగా ఉంటాయి. గమనింపు రచయితకు ఎంత అవసరమో ఆమె రాసిన వివరాలు చెబుతాయి. చెవిలో పడిన ప్రతీ కీర్తనా, మాటా, అభిప్రాయాలూ, ఏ శబ్దమూ ఆమె గమనికను దాటిపోలేదనిపించింది. ఈ కథల్లో దేనికదే ప్రత్యేకంగా ఉన్నప్పటికీ నాకు బాగా నచ్చిన రెండు కథలు 1. Parasakti and Others in a Plastic Box 2. Wrestling.
ఇందులో అన్నీ స్త్రీవాదానికి సంబంధించిన కథలే అనుకుంటే పొరపాటే. ఆమె కథల్లో 'స్వేచ్ఛ' కు పేద పీట వేశారు అంబై. ఉదాహరణకు One and another కథ LGBT అంశానికి సంబంధించినది ; A Rat, a Sparrow / A Saffron-coloured Ganesha on the Seashore / A Movement, a Folder, some Tears / Camel ride వంటి కథలు సామజిక సమస్యలు,సెక్కులరిజం,బాబ్రీ మసీద్ కూల్చివేత నేపథ్యాల్లో రాసినవి. A Rose-coloured Sari Woven with Birds and Swans / Parasakti and Others in a Plastic Box ఈ రెండు కథలూ ఒక తరంలో మనుషులకు తమ సాంస్కృతిక మూలాలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తాయి. ఈ కథలు చదివినప్పుడు గతించిన తరాల్ని ప్రేమగా గుర్తుచేసుకోని పాఠకులుండరంటే అతిశయోక్తి కాదు. నేటి తరం స్వేచ్ఛ పేరిట ఏం కోల్పోతోందో, దానికి చెల్లిస్తున్న మూల్యం ఏమిటో, ఎన్ని ఉన్నా జీవితాల్లో ఒంటరితనంతో కూడిన ఖాళీ ఏర్పడడానికి కారణాలేమిటో పరిశీలించుకోమంటాయీ కథలు. మనుషులతో సహా తన అస్తిత్వంతో ముడిపడిన వస్తువుల్ని కూడా నిముషంలో వదిలించుకుంటూ 'డిస్కార్డ్' మంత్రాన్ని జపిస్తున్న నేటి తరాన్ని ఈ కథలు ఆలోచనలో పడేస్తాయి.
‘“Is that what you call freedom? I can’t understand it,” she fretted.’ ‘As soon as she arrived, she was anxious to make all those things like rasam and sambar powders before the monsoons set in. Now, look, within one week, all these powders are ready in my house. And there are still three months to go before the beginning of the rains! Day before yesterday she went and bought a quantity of limes, chopped them up, and made salt pickle and hot pickle in two separate lots. Ginger murabha and ginger pickle have also been prepared.
But Amma is one who is deeply bound to the earth. Even though she might float free like cotton-wool, she’ll always feel the need to touch the earth again. Even though she might float free like cotton-wool, she’ll always feel the need to touch the earth again. Certainly, she could stay either at my house or at yours. But it is bound to be hard for her. She’ll tell a thousand little lies: this one to hide that, that to hide this. It’s not just that Amma needs a place to live; she must reign indisputably in that space. Because Amma isn’t just an individual, she’s an institution.Her need is not simply a small space in which she can keep her plastic box. The pity is, she is wandering about seeking after a realm of her own. And if you and I wish to do so, we could give it to her. The jewellery that you and I possess were all given to us by Amma.
అంబై కథల్లో నన్ను ఆకట్టుకున్న మరో అంశం ఏమిటంటే ఆమె పాత్రల్లో స్త్రీ కి ప్రాధాన్యత ఉంది గానీ,స్త్రీల పట్ల పక్షపాతం లేదు. దీనికి తోడు ఆమె స్త్రీవాదాన్ని వినిపించడానికి ఎన్నుకున్న అంశాలూ, నేపథ్యాలూ వైవిధ్యంగా ఉన్నాయి. ఒక కథలో ముంబై లో సామజిక కార్యకర్తగా ; మరో కథలో కవి అయిన భర్తకు రచయిత్రి భార్యగా ; ఇంకో కథలో భర్తనూ,కుటుంబాన్నీ వదిలేసి తన ఐడెంటిటీని వెతుక్కుంటూ అడవుల్లో ఒంటరిగా నివసించడానికి వెళ్ళిన స్త్రీగా ; మరో కథలో తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి కూతురితో సంబంధాన్ని సైతం తెంచుకున్న అమ్మగా ; ఇంకో కథలో తల్లి మనసు అర్ధం చేసుకున్న కూతురిగా ఇలా ఆమె స్త్రీలు విభిన్న రూపాల్లో కనిపిస్తారు.
Unpublished Manuscript నాకు నచ్చిన మరో కథ. ఒక కవిని ప్రేమించి పెళ్ళిచేసుకుని అణచివేతకు గురైన స్త్రీ మూర్తి కథ. చదువుకుని,సాధికారికంగా ఉండే స్త్రీల విషయంలో భర్తల్లో ఉండే ఆత్మన్యూనతను గురించి చెబుతుంది. ఆర్టిస్టులు కూడా ఈ విషయంలో మినహాయింపు కాదని రుజువు చేస్తుంది. తన భార్యను నిందిస్తూ 'Are you a woman?’ అని పదే పదే అడిగే భర్తను గురించి చదివినప్పుడు మన పురుషాధిక్య సమాజంలో ఉన్న జాడ్యాలను అతడు గొంతెత్తి అరిచి చెప్తున్నట్లుగా ఉంటుంది.
She wondered why something that seemed perfectly all right when done by a man seemed like an act of madness when done by a woman instead? Once, by a rare chance, there was a showing of the old film Karnatt. Devika sang a love song in it, and during the entire time Sivaji Ganesan sat stiffly, one hand placed on his thigh. Perhaps, this was because Karnan was a warrior? Devika circled around him again and again, like a butterfly. Even Sivaji Ganesan’s smile was like squeezing toothpaste out of an empty tube. If men can soften and dissolve and melt through bhakti, why can’t they do so out of love? She decided firmly on the sort of man she could respect. He would have to know how to melt. ‘Melting, melting to the heart’s core.’
Amma answered that it was easier to live with Appa’s poetry than with a poet like Appa.
A Rose-Coloured Sari అనే కథలో ఈ వాక్యాలు దృష్టి, ధ్వనీ, వాసనలతో కూడిన అంబై విశాలమైన ప్రపంచాన్ని ప్రతిబింబిస్తాయి :
The sweet smell that fills the air as soon as a jackfruit is split open. The knots and swirls and scatterings as Mali begins the opening alaapanai of his Kaapi raagam. The steam that hits your face as you open the lid of the water-pot, the firewood still burning underneath, and as you bend over it, chembu in hand, ready to pour out the water into a bucket. Drops of sweat blooming on Balasaraswati’s forehead as she danced. Birju Maharaj’s Kathak dance-leaps. The smell of cooking when a properly-soured batter is just spreading on a heavy dosai griddle. The smell of sesame in the chilli powder. The smell of gingili oil, unstrained, fresh from the oilpress. The tenderness of Bhimsen Joshi’s Lalit raagam. The deep resonance of Gangubai Hangal’s voice. Girija Devi’s lilting tones. The kisses she and her lover had exchanged as they stood under a chestnut tree in a small village in Himachal Pradesh. The journey past her house every day, of bodies going to the cremation ground. Funeral fires burning at a distance. The voice of her Tamil teacher who had loved and read Tirumular, ‘I nurtured my body; indeed I nurtured my life-source.’ The poet Ghalib pleading, ‘Lord, they have not understood me; they will not understand me. Give them different hearts. Or at least give me a new language.’ Which of these things would her mind seek and at what moment? Would it seek after any of these at all? Or would it be soothed by Festivals of India?
How convenient a nostril is, for piercing and for threading a rope through! Like that folk tale from oral tradition. In a forest there lived a woman who was independent, under no one’s control, and who wandered about at her own will and pleasure. Later on, a man— when they tell this tale, they describe him as a great warrior and a man of great prowess—put a ring through her nose, subdued her, and dragged her home. Sometime later, she began to wear the same ring as an ornament.
పుస్తకంనుండి మరి కొన్ని వాక్యాలు :
‘It is my life, isn’t it? A life that many hands have tossed about, like a ball. Now, let me take hold of it; take it into my hands.’ So saying, Sita lifted the rudravinai and laid it on her lap.
హాస్యంతో కూడిన మరో చిన్న సంగతి :
Deva kaappaadu... O God, help me,’ Kempamma called out. Then thinking perhaps that it was wrong to summon God familiarly, in the singular, she called out again, ‘Devari kaappaadu'