స్త్రీ వాద రచనలనగానే స్త్రీలేం చేసినా గుడ్డిగా సమర్ధించడమో, జీవితం పట్ల ఆమె దృక్పథాన్ని భావోద్వేగాల త్రాసులో వేసి చూసి, ఇన్ఫీరియర్ జెండర్ కాబట్టి ఆమె కన్నీటి గాథ అనైతికంగా ముగిసినా చప్పట్లు చరచడమో చెయ్యడమే ఎక్కువ చూస్తుంటాం..అదీ కాకపోతే సమస్యలు ఎదురైనప్పుడు ప్రతీకారంతో విలువలకు తిలోదకలివ్వమని ప్రేరేపించే కథలు కూడా తక్కువేం కాదు..స్త్రీవాద కథలతో నాకున్న పేచీ ఏమిటంటే వాటిలో లాజిక్ /ప్రాక్టీకాలిటీ కంటే ఎమోషన్ ఎక్కువ అమ్ముడుపోతుంది..అటువంటిది ఈ మధ్య జర్మన్ రచయిత్రి ఎల్ఫ్రీడ్ జెనెలిక్ రాసిన 'Women as Lovers' అనే 'స్త్రీ పక్షపాతం లేని స్త్రీవాద రచన' ఒకటి చదివాను.
Image Courtesy Google |
మార్గరెట్ ఆట్వుడ్ కి ఇంకా నోబెల్ రాలేదనీ,బోర్హెస్ కి అసలంటూ ఇవ్వలేదనీ నాకు నోబెల్ ప్యానెల్ మీద కాస్త కినుకుగా ఉండేది..ఆ కారణంగా ఆట్వుడ్ కంటే చాలా చిన్నవారైన నోబెల్ గ్రహీత,ఆస్ట్రియన్ రచయిత్రి ఎల్ఫ్రీడ్ జెలినెక్ ని చూసినప్పుడల్లా ఈమెలో అసలు రైటర్ లక్షణాలేమీ ఉన్నట్లు లేదు,మోడల్ కి ఎక్కువ రైటర్ కి తక్కువలా ఉన్నారీవిడ అనుకునేదాన్ని..ఆట్వుడ్ వీరాభిమానిగా నాకు జెలెనిక్ పట్ల కొంచెం వివక్ష ఉండేది..అప్పుడప్పుడూ ఆవిడ పుస్తకాలు మేమున్నామంటూ ఎదురైనా నేనే కావాలని సీతకన్ను వేస్తూ వచ్చాను..మీరేమనుకుంటున్నారో నాకు వినిపిస్తోంది,"అంత జడ్జిమెంటల్ ఏమిటసలు" అనేగా ? పాఠకులు కూడా మనుషులేనండీ, ప్రీ కన్సీవ్డ్ నోషన్స్/జడ్జిమెంటల్ ఆటిట్యూడ్ లాంటివి మాకూ ఉంటాయి..మైక్ పట్టుకుని పైకి చెప్పమంతే..కానీ దీనంతటిలో నేనే ఒకప్పుడు ఫిలసాఫికల్ గా ట్విన్ టాక్ చేసిన బేసిక్ రూల్ ఒకటి మర్చిపోయాను, అదేమిటంటే "You need to love something (or someone) before you hate it"..అందువల్ల జెలెనిక్ ని ఎలాగూ హేట్ చేద్దామని నిర్ణయించుకున్నాను కాబట్టి,దానికి ముందు ఒకసారి ప్రేమించి చూడాల్సిన బాధ్యత ఉంది కదా :)
అందమైన ఆల్ప్స్ పర్వతశ్రేణుల నడుమ అందంగా అమరిపోయిన ఒక బట్టల ఫ్యాక్టరీ..అందులో పనిచేసే అమ్మాయిలు స్త్రీల లోదుస్తులు తయారుచేస్తూ ఉంటారు..కథా నేపథ్యాన్నీ,ఆ పరిసరాలనూ వర్ణిస్తూ They sew. They sew foundations, brassieres, sometimes corsets and panties too. Often these women marry or they are ruined some other way. అంటారు రచయిత్రి..నిజానికి ఆ రెండో వాక్యం ముగించడంలో ఆమె చెప్పాలనుకున్న కథకు ప్రారంభం ఉంటుంది..ఆ ఫ్యాక్టరీలో పని చేసే బ్రిడ్జిట్టి కి ఎలక్ట్రీషియన్ గా స్థిరపడబోతున్న ఎగువ మధ్య తరగతికి చెందిన హెయిన్జ్ అంటే వల్లమాలిన ప్రేమ..ఆ ప్రేమ ఎటువంటిదంటే,
Heinz keeps one eye on his professional advancement and on courses which are perhaps to be attended. Brigitte keeps an eye on love, which is like a serious illness, and Brigitte keeps the other eye on her future home and its furnishings. Brigitte has heard that it's real, if it's like an illness, Brigitte loves Heinz really and truly.
హెయిన్జ్ ని ఒప్పించగలిగితే రాబోయే సౌకర్యాల గురించీ,ఇంటి ఇల్లాలుగా తనకు దక్కబోయే సర్వాధికారాల గురించీ కలలుగంటూ, కాబోయే భర్తని అది 'ప్రేమ' అని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న బ్రిడ్జిట్టి ప్రేమలో డొల్లతనాన్ని ఎత్తి చూపిస్తారు రచయిత్రి..అతడితో సినిమాల్లోనూ,రేడియోలోనూ,టీవీ లోనూ చూసే ఫేవరెట్ షోల్లో హీరోయిన్ లా I love you అంటుందామె..హెయిన్జ్ మాత్రం తక్కువ తిన్నాడా, I don't know if it's enough for a whole life, says Heinz, a man wants to enjoy many women, a man is different.
బ్రిడ్జిట్టి ఊరుకోదుగా,ఆమె ఏమంటుందంటే : But that's exactly why I love you, because you are a man, says Brigitte. You are a man, who is learning a trade, I am a woman, who has not learned a trade. Your trade must do for both of us. And it will do that easily, because it's such a beautiful trade. You must never leave me, otherwise I would die, says Brigitte.
నువ్వు మరీనూ అంటాడు హెయిన్జ్ : No one dies as easily as that, says Heinz. You would just have to fall back on someone, who earns less, than I shall earn one day..
దానికి బ్రిడ్జిట్టి But that's exactly why I love you, because you earn more than someone, who earns less. అంటుంది. :)
ఈ పుస్తకం రాసింది ఒక రచయిత్రి కాబట్టి, పుస్తకం పేరుని బట్టి ఇది స్త్రీవాద రచనేమో అనుకున్నాను..కానీ బ్రిడ్జిట్టి ,హెయిన్జ్ ల మధ్య సంభాషణని చూస్తే ఇది పూర్తి స్త్రీవాద రచన కాదని అర్ధమవుతుంది..నిజానికి ఈ రచన సారాంశాన్నంతటినీ వీరిద్దరి సంభాషణలో కుదించి చూడవచ్చు..ప్రేమ పేరిట తమ అవసరాలు తీర్చుకోడానికి ఆడామగా నాగరికంగా ఆడే దాగుడుమూతలల్ని ఇంత తేటతెల్లంగా చూపించే రచనలు బహు అరుదు..రచయిత్రిగా జెలెనిక్ అటు బ్రిడ్జిట్టి పక్షం గానీ,ఇటు హెయిన్జ్ పక్షంగానీ తీసుకోకుండా, సాదాసీదా సంభాషణల రూపంలో పాత్రల స్వభావాలను బేరీజు వేసే పనిని మనకే వదిలేస్తూ కథను నడిపిస్తారు..స్త్రీపురుష సంబంధాలు ఏర్పరుచుకోవడంలో రెండు వర్గాల్లోనూ ఎదురయ్యే సంక్లిష్టతలను ఒకవైపు ఎత్తి చూపిస్తూనే, తాను సృష్టించిన స్త్రీ పాత్రలపట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ స్త్రీవాదాన్ని వినిపించడం అంత సులువైన పని కాదు.
His parents want the best for Heinz. Brigitte is certainly not that: the BEST. I love you so much, says Brigitte. My gleaming hair supports my love. What also supports my love: your job, which has a future. What supports my love apart from that: I myself, who have nothing at all. అంటూ స్త్రీపురుష సంబంధాలను గ్లోరిఫై చేసే ప్రేమ,రొమాన్స్ లాంటి అంశాల్ని పూర్తిగా కథలోంచి తీసి అవతలకు విసిరేస్తారు జెనెలిక్..ఉన్నదల్లా 'అవసరమే'..మనిషిని నడిపించేది అవసరమే అని పదే పదే పాఠకులను స్వాప్నిక లోకాలను వదిలి నేలమీదకు వచ్చి చూడమంటారు.
ఈ కథంతా దిగువ మధ్య తరగతికి చెందిన పౌలా,బ్రిడ్జిట్టి, ఉన్నత వర్గానికి చెందిన సుశి అనే ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంది..బ్రిడ్జిట్టి గురించి చెప్పుకున్నాం కదా ఇక పౌలా విషయానికొస్తే ఆమెకు అందరమ్మాయిల్లా ఒక సాధారణ సేల్స్ గర్ల్ లా బ్రతుకీడ్చకుండా 'డ్రెస్ మేకింగ్' నేర్చుకుని జీవితంలో పైకెదగాలనుంటుంది..ఈలోగా చెట్లు నరికే వృత్తిలో ఉన్న అందగాడు ఎరిక్ తో ఆమెకు పరిచయం ప్రేమగా మారుతుంది..ఎరిక్ కు హెయిన్జ్ లా లక్ష్యాలేమీ లేవు సరికదా అతడు ఒక తాగుబోతూ ,తిరుగుబోతూను..అయినా గుడ్డిగా అతడి ప్రేమలో పడుతుంది పదిహేనేళ్ళ పౌలా..ప్రేమ అనగానే తమ ఉనికిని పూర్తిగా మర్చిపోయి సర్వం అతడే అనుకునే మెజారిటీ సగటు ఆడపిల్లల్లా పౌలా కూడా 'డ్రెస్ మేకింగ్' ని కూడా వదిలేసి అతడి చుట్టూ తిరుగుతుంటుంది..ఇక వీరిద్దరికీ భిన్నమైన అమ్మాయి సుశీ..చదువూ సంస్కారం కలిగి కాస్త స్వతంత్ర భావాలున్న వ్యక్తి ఆమె..తన విలువేమిటో,తనకేం కావాలో స్పష్టంగా తెలిసిన సుశీ బ్రిడ్జిట్టి లా హెయిన్జ్ మాయమాటలకు లొంగదు..స్థిరత్వాన్ని ఆశించి స్వప్నాల వెంట పరుగులు తీసే వీరి ముగ్గురి జీవితాల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది మిగతా కథ.
అసలీ రచనలో ప్రత్యేకత ఏముంది ! మూల కథని చూస్తే చాలా సాధారణమైన అంశమే : అమ్మాయిలూ,ప్రేమలూ,పెళ్ళిళ్ళు..మరి నోబెల్ ప్రైజ్ ఇలాంటి సాధారణ కథలు రాసే వాళ్ళకి ఇచ్చేస్తారా అంటే,ఖచ్చితంగా ఇవ్వరు..ఏదో ప్రత్యేకత ఉండాలి కదా ! జెలెనిక్ రచనల్లో మహామహుల ఆర్ట్,క్రాఫ్ట్ తో పోటీపడగలిగే విషయం ఏమిటంటే, మొదలూ తుదా గుర్తుపట్టలేని జిగిబిగి అల్లికల చిక్కని వచనం..ఒక మంచి రచయిత ఒక అసాధారణమైన విషయాన్ని తీసుకుని అసాధారణంగా చూపించగలడు..కానీ ఒక గొప్ప రచయితలో మాత్రమే ఒక సాధారణమైన విషయాన్ని సైతం అసాధారణంగా చూపించే నైపుణ్యం ఉంటుంది..జెలెనిక్ ముడి సరుకు సాధారణ అంశమే..దాన్ని ఆవిడ రూపుదిద్దిన విధానం మాత్రం చాలా ప్రత్యేకం..ఈ కథను సగం ప్రథమ పురుషలోనూ,సగం మధ్యమ పురుషలోనూ చెబుతారు..మనకి పాత్రల సంభాషణలు ఎక్కడ పూర్తయ్యాయో, రచయిత్రి స్వరం ఎక్కడ మొదలయ్యిందో కూడా తెలియనంత సునాయాసంగా నేరేషన్ దిశలు మార్చుకుంటుంది..ఇదే విధంగా రచయిత్రి పౌలా కథలోంచి బ్రిడ్జిట్టి కథలోకి, సుశీ కథలోంచి పౌలా కథలోకి అవలీలగా వెళ్ళిపోతారు..వ్యంగ్యాన్నీ,హాస్యాన్నీ మేళవించిన జెలెనిక్ నెరేషన్ పాఠకులకు అలసట తెలియనివ్వదు..దీనికి తోడు నాణానికి ఉన్న రెండు వైపులనూ చూపించడంలో జెలెనిక్ ఒక కొత్త పంథాను ఎన్నుకున్నారు..ఉదాహరణకు ఇద్దరి స్వభావ వైరుధ్యాలను మనకు వివరిస్తూ రాసిన ఈ వాక్యాలు చూడండి :
As we can see there exists a great difference between Paula's present and Paula's future, as well as between Erich's present and Erich's future, as well as between Paula's present and Erich's present, as well as between Paula's future and Erich's future, an even larger one exists however between Paula's present and Erich's future, and between Erich's present and Paula's future.
ఇక ఈ రచనలో లోపాల విషయానికొస్తే మొదటి భాగంలో ఉన్న పట్టు రెండో భాగంలోకి వచ్చేసరికి సడలిపోయింది..అంతవరకూ నేరేషన్ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న పాఠకులు ఇక దైనందిన జీవితంలోని భవసాగరాలు ఈదలేక అలసిపోయి ఒడ్డుని వెతుక్కునే పనిలో పడతారు..కథనంలో తప్ప కథలో బలం లేకపోవడం దీనికి కారణం.
ఈ జర్మన్ రచనకు మార్టిన్ ఛాల్మర్స్ ఆంగ్లానువాదం మూలం చదువుతున్నంత సరళంగా ఉంది..నిజానికి అన్యమనస్కంగా మొదలుపెట్టినా తీరా చదివాక, "న న కర్తే ప్యార్ తుమ్హిసే కర్ బైఠే !!" అంటూ ఆవిడతో పీకల్లోతు ప్రేమలో పడిపోయాను..ఉహూ ఇది పద్యం కాదు గద్యం..ఉహు ఇది పోయెట్రీ అయ్యే అవకాశం లేదు..నేను చదువుతున్నది ప్రోజ్..నేను చదువుతున్నది ప్రోజ్..నేను చదువుతున్నది ప్రోజ్ : పుస్తకం చదువుతున్నంతసేపూ ఈ మాట నాకు నేను చెప్పుకుంటూనే ఉన్నాను.."లిరికల్ నేరేషన్", "షీర్ పోయెట్రీ" అంటూ ఇక ముందు నేనెవరి వర్ణనల గురించైనా పొగిడేటప్పుడు జెలెనిక్ తప్పకుండా గుర్తొస్తారు..అబ్బే అది పోయెట్రీ ఎలా అవుతుందమ్మాయ్..నేను రాసింది గుర్తులేదా అని దబాయిస్తారు..ఆవిడ రాసేది పద్యమా ? గద్యమా ? అని చదువుతున్నప్పుడు పదే పదే ప్రశ్నించుకోని పాఠకులుండరంటే అతిశయోక్తి కాదు..ఇటువంటి ప్రోజ్ నేను ఇంతకు మునుపెన్నడూ చదవలేదు..వాక్యాలను కళ్ళతో చదివి తనివితీరక రెండు మూడు సార్లు పైకి చదువుకున్న సందర్భాలెన్నో..ఇంట్లో వాళ్ళకి చదివి వినిపించి మురిసిపోయిన క్షణాలెన్నో..ఉదాహరణకు ఈ క్రింది వాక్యాలు అంత సులభంగా మర్చిపోగలిగేవి కాదు..స్త్రీవాదాన్ని గుప్పెడు వాక్యాల్లో మూటగట్టిన జెలెనిక్ ప్రతిభకు నమో నమః..మీరు స్త్రీవాదులైనా,రచయితలైనా ఈ పుస్తకం తప్పకుండా చదవండి..పుస్తకం పూర్తిగా చదివే ఓపిక లేకపోతే కనీసం ముందు మాట ఒక్కటీ చదవండి..హ్యాపీ రీడింగ్ :)
A machine always makes a seam, it doesn't get bored. It performs its duty, wherever it is put. Each machine is operated by a semi-skilled seamstress. The seamstress does not get bored. She too performs a duty. She is allowed to sit. She has a lot of responsibility, but no overview and no long view. But usually a household.Sometimes in me evening the cycles cycle their owners home. Home. The homes stand in the same beautiful landscape. Contentment flourishes here, one can see that. Whoever is not made content by the landscape, is made completely content by children and husband. Whoever is not made content by landscape, children and husband, is made completely content by work.
పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు :
But as long as they sew, they sew. Often their gaze wanders outside to a bird, a bee or a blade of grass. They can sometimes enjoy and understand the nature outside better than a man.
If someone has a fate, then it's a man, if someone gets a fate, then it's a woman.
One day Brigitte decided, that she wanted to be only woman, all woman for a guy, who was called Heinz. She believes, that from now on her weaknesses would be strengths and her strengths very much hidden.
Birth and starting work and getting married and leaving again and getting the daughter, who is housewife or sales assistant, usually housewife, daughter starts work, mother kicks the bucket, daughter is married, leaves, jumps down from the running board, herself gets the next daughter, the co-op shop is the turntable of the natural cycle of nature, the seasons and human life in all its many forms of expression are reflected in its fruit and veg. In its single display window are reflected the attentive faces of its sales assistants, who have come together here to wait for marriage and for life. But marriage always comes alone, without life.
Paula is waiting to be chosen, which is what really matters. What matters is to be chosen by the right man.
She also wants one day to say to someone: mine. About her dressmaking Paula never says: my work. About her work Paula never says: mine. Not even inwardly. Work, that is something, which is detached from a person, work after all is more like a duty and so it happens to the second body. Love, that's pleasure, relaxation, and so it happens to the first body.
All that matters is that love has come at last, and that it hasn't come to an ugly, worn out, drunken, exhausted, vulgar, common woodcutter and her, but to a handsome, worn out, drunken, strong, vulgar, common woodcutter and her. That makes the whole thing special.
This is how it's done: you have often seen in the cinema, Erich, haven't you, that between extraordinary people extraordinary things like for example an extraordinary love can arise. So we only have to be extraordinary and see what happens. The people all around are ordinary, they do nothing but work and work. We who do nothing but work, but also love one another, are extraordinary. We no longer need to look for the extraordinary, because we already have it: our love. Sometimes it only happens once in a lifetime, if one doesn't take it with both hands, then one will be very unhappy, if e.g. One lets the beloved woman or the beloved man go far away or astray.
Whereas this dressmaking is completely pointless, cannot replace a man and not prepare a woman for a man, is no use to a woman, if she already has a man and doesn't get her a man if she needs one, whereas this dressmaking doesn't make one HAPPY, which only a man can do.
Love can move mountains, but not Erich. Love can move mountains, but not change Erich into a loving human being. Erich is unpractised at being loved, he has never experienced it himself. Apart from that love cannot produce a refrigerator. If there is no refrigerator etc., then one only has husband and children to love, those are too few objects for Paula's great great love. There is sooo much love in Paula, which is lying idle and craving worthwhile objects.
No comments:
Post a Comment