Wednesday, April 21, 2021

A Hate Letter To The Man I Loved

Image Courtesy Google

నాకు అతనంటే ఇష్టం...అతడికి నేనంటే నాకంటే ముందునుండే ఇష్టం..కానీ మిస్టర్ డార్సీ వారసులకు ప్రైడ్ ఎక్కువ..ఎప్పుడూ నాకు తెలియనివ్వలేదు..బహుశా నేనే గ్రహించలేదు..కానీ ఎప్పుడూ ఎక్కడికెళ్తే అక్కడికి వస్తూ నా నీడలా వెన్నంటి ఉండేవాడు..చాలా కాలానికి మమ్మల్నిద్దర్నీ దగ్గరగా గమనిస్తున్న ఎవరో అన్నారు,నీకు గ్రహింపు తక్కువ,కాస్త కళ్ళు తెరచి చూడు అని..నాలుగైదు రాత్రులు కంటి మీద కునుకు లేదు..స్నేహితుడు కాడన్నమాట..అయితే ఎవరు ? చుక్కలన్నీ కలుపుకుంటూ వెనక్కి వెళ్ళి చూస్తే నిజమేననిపించింది..తెలీకపోతే ఒకరకం ,తీరా తెలిశాక ఒకరకం.

అతడి సమక్షంలో క్రమేపీ నా మాటల్లో పదును తగ్గింది,అతడు మాట్లాడుతుంటే నా లాజికల్ బ్రెయిన్ పూర్తిగా స్విచ్ ఆఫ్ మోడ్ లోకి వెళ్ళిపోయేది..ఆక్వార్డ్నెస్,రెస్ట్లెస్నెస్..అతడి ఆలోచనలతో నిద్రలేని రాత్రులు,నిద్రమత్తులో పగళ్ళు,పగటికీ రాత్రికి తేడా తెలియకుండా,బాహ్య ప్రపంచంతో బాటు నాలో నేను కూడా అదృశ్యమైపోయిన క్షణాలూ,గంటలూ,రోజులూ గడిచిపోతున్నాయి..అసలే 'క్యూరియాసిటీ కిల్డ్ ది క్యాట్' కు పోస్టర్ ఛైల్డ్ అయిన నాకు ఈ జరుగుతున్నదానిలో నిజమెంతో,నా భ్రమ ఎంతో తెలుసుకోవాలనే తపన మొదలైంది.

అతడికి దూరంగా జరగడానికి ప్రయత్నించాను..అతడు జరగనివ్వలేదు..ఒకరోజు ఆలోచనలు అదుపుతప్పి 'మిస్డ్ యూ' అన్నాను..అతడినుండి సమాధానం లేదు..మౌనం..అటుపై మాట దాటవేశాడు..నా తొందరపాటుకి సిగ్గుపడ్డాను..కాస్త సమాధానపడ్డాక అనిపించింది ఇకనైనా మించిపోయిందేదీ లేదు,ఎమోషనల్ అటాచ్మెంట్ మాత్రమే కదా ! కాస్త దూరం జరుగుదామని ప్రయత్నించాను,అతడు జరగనివ్వలేదు..మళ్ళీ షరా మాములే..మా మధ్య సాన్నిహిత్యం క్షణక్షణానికీ పెరిగిందే తప్ప కొంచెం కూడా తగ్గలేదు..అన్నీ ఉన్నాయి,ఉందో లేదో తెలియని ప్రేమ తప్ప..ఇద్దరికీ అర్ధంకానీ శక్తేదో ఒకర్నొకరికి దగ్గరగా లాగేస్తున్న భావన..చిక్కు ముళ్ళు పడిపోయిన మనసుల్ని తెగేదాకా లాగితే భరించలేని వేదన..ఒక్కరోజు నాతో మాట్లాడకుండా ఉండలేడు..కానీ ప్రేమించానని మాత్రం చెప్పలేడు..ప్రేమిస్తే,వాళ్ళ నుండి ఏమీ ఆశించకూడదు అని ఎవరు చెప్పారో గానీ ఆ క్షణంలో వాళ్ళ మీద విపరీతమైన ద్వేషం కలిగింది.

ఒకరి ఆలోచనల్ని మరొకరం పుస్తకం చదివినట్లు చదివెయ్యగలం..నాలో ఈ మార్పులన్నీ అతడికీ తెలుసు,కానీ అదే కఠినమైన మౌనం..కానీ ఆ మిస్టీరియస్ ఆటిట్యూడే కదా తనవైపుకు నన్ను బలంగా లాగుతుంది !! అతడు నా ఆలోచనలన్నీ అవలీలగా చదివెయ్యగలడు..తనని మిస్ అవుతున్నాను అని గ్రహిస్తే ఎంత బిజీ టైం లో ఉన్నా కూడా ఫోన్ చేస్తాడు,పని చేసుకుంటూ కబుర్లు చెప్తాడు..అతడి కలల ప్రపంచంలోకి మన పర్మిషన్ లేకుండా,మన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా అమాంతం చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళిపోగల సమర్థుడు..కథలూ,కవితలూ,మా మధ్య ఎన్నెన్నో కబుర్లు..వాటిలో మధ్య మధ్యలో తళుక్కున అన్యాపదేశంగా పొంగుకొచ్చే 'రీడ్ బిట్వీన్ ది లైన్స్ ప్రేమ'..ప్రేమ అంటే సంథింగ్ అన్ కండిషనల్ కదా !! (constitution తో పాటు ఇలాంటి ఫిలాసఫీలు కూడా మారాల్సిన కాలం ఇది) అందులోనూ 'ఓన్లీ ఫూల్స్ ఫాల్ ఇన్ లవ్' అంటారు మరి..నా కళ్ళకు పెట్టుకున్న రోజ్ కలర్డ్ గ్లాస్సెస్ తీసే అవకాశం అతడు ఎప్పుడూ ఇవ్వలేదు,నేనూ తీసుకోలేదు.

అతడు కాలంతో పాటు పరిగెడతాడు..అతడి డిక్షనరీలో ప్రేమకంటే క్షణానికి విలువెక్కువ..నాతో గడిపే సమయం కూడా ఆ డైలీ టైం టేబుల్ లో భాగమేనేమో, ఒక రేషన్ లా కొద్ది కొద్దిగా దొరుకుతుంది..కానీ క్వాలిటీ టైం విలువ బాగా తెలిసినవాడు..నానుంచి తనకు తానుగా ఎప్పుడూ ఏదీ ఆశించడు..తన అనుకున్నవాళ్ళు (?) తన జీవితంలో ఉంటే తనకు చాలంటాడు..ప్రేమించడం సంగతి అటుంచి అతణ్ణి ద్వేషించడం ఎవరికీ సాధ్యం కాదు..సాధు జీవి..అతడు భూమి మీద,నేను ఆకాశంలో..భూమీ,ఆకాశం కలుస్తాయనేది భ్రమేమో కదా..అలా అనిపించిన ప్రతిసారీ బాల్కనీ లోనుంచి దూరంగా కనిపించే సముద్రం చిలిపిగా వెక్కిరిస్తూ నవ్వుతుంది..నేను రోజంతా అతడితో గడిపే ఆ కొద్ది నిముషాల కోసం ఎదురుచూస్తాను,అతడికి బహుశా ఆ క్షణంలో మాత్రమే నా ఉనికి గుర్తొస్తుందేమో అనుకుంటాను.

ఒకసారి రోజంతా బిజీగా ఉన్నాడేమో,నాతో గడపడం వీలుపడలేదు..ఈలోగా రాత్రి ఆఫీస్ పనితో నైట్ ఔట్ కూడా చెయ్యాల్సి వచ్చింది,అక్కడే  నిలబడి వేచి చూస్తున్న నాతో "ఈ రాత్రంతా నాకు పనుంది,వర్క్ ఫ్రమ్ హోమ్" అన్నాడు..అతడు నా దృష్టిని దాటిపోకుండా నా సమక్షంలో ఉంటే చాలు అని నా మొహంలో విచ్చుకుంటున్న ఆనందం ఇంకా పూర్తిగా బయటకు కనిపించనేలేదు,"నీకు కావాలంటే ఈరోజు నాతో ఎంతసేపు కావాలంటే అంతసేపు ఇక్కడే గడపవచ్చు,నేను పని చేసుకుంటూ మధ్య మధ్యలో నీతో మాట్లాడతాను" అన్నాడు, బాస్ తన క్రింద పనిచేసే ఉద్యోగికి అవకాశమిచ్చినట్లు..నా మొహంలో చిరునవ్వు చటుక్కున మాయమైపోయింది..చెంప మీదెవరో ఛెళ్ళున కొట్టినట్లైంది..ఆశాభంగం.."నీకు కావాలంటే"..ఈ  రెండు పదాలే మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి..అంటే ఇదంతా కేవలం నా కోసమేనా !! అతడి కళ్ళల్లో ఆశ్చర్యం నా వీపుకి గుచ్చుకుంటుండగా నాకు నిద్రవస్తోంది అని చెప్పి నా మొహంలో భావాలు కనిపించకుండా అక్కడనుంచి మెల్లిగా వచ్చేశాను.

అతడి మనసులో భావాలు చదివే ప్రయత్నం చేసీ చేసీ అలసిపోయాను..ఇక సెలవు నేస్తం అని చెప్పాను ఒకనాడు..అతడి మొహంలో ఆశాభంగం దాచుకుందామన్నా దాగలేదు.."నాకు మాటల మీద కంటే మౌనం మీద,చేతల మీద నమ్మకం ఎక్కువ" అన్నాడు..అదే చాలనిపించింది..బహుశా నేనే తొందరపడ్డాను అనుకున్నాను, అడుగు వెనక్కి వేశాను..కానీ ఒక్కసారైనా నీవంటే ఇష్టమని అతడి నోటి వెంట వినాలనే అబ్సెషన్ రోజురోజుకీ నాలో ఎక్కువై నన్ను పిచ్చిదాన్ని చేసేది.."నేనంటే ఇష్టమని తెలుసు,ఆ ఒక్క మాటెందుకు చెప్పవూ" అని ఒకరోజు నిలదీశాను..ఆ క్షణంలో ఆ మాట ఒక్కటీ అతడి నోటినుండి వింటే,అతడు మళ్ళీ జీవితంలో నా మొహం చూడకపోయినా ఫర్వాలేదనిపించింది..నా పిచ్చితనం నాకు తెలుస్తూనే ఉంది..ఉహూ..మళ్ళీ అదే మౌనం..నన్ను వెళ్ళనివ్వడు,ఉండనివ్వడు..రాక్షసుడు అని మనసులోనే తిట్టుకున్నాను.

ప్రేమతో బాటు ఏదీ శాశ్వతం కాదని తెలిసిన వ్యక్తి..కానీ అతడి నిజం నన్ను భయపెట్టేది..అందరం ఏదో ఒకరోజు చచ్చిపోతామని తెలిసినా జీవితం మీద ఆశే కదా మనల్ని ముందు నడిపిస్తుంది..ప్రేమ స్వాప్నిక లోకాన్ని దాటి వాస్తవరూపం దాల్చినప్పుడు అతడు ఆ వెలుతురుని చూడలేడు..మరో స్వప్నాన్ని వెతుక్కుంటూ వెడతాడు..కానీ మాసిపోయిన స్వప్నాలను సమాధి చెయ్యడు..ఎందుకంటే అతడికి ఆ క్షణం నిజం..ఆ ప్రేమ నిజం..కమిట్మెంట్ లేకుండా జీవితాంతం తోడుంటానంటాడు..ఇక్కడ చిక్కేమిటంటే ఒక బొమ్మతో ఆడుకుని అలసిపోయి,విసిగిపోయిన పసివాడిలా మరో బొమ్మ దొరకగానే దీన్ని ప్రక్కన పడేస్తాడు..కానీ ఆ బొమ్మని ఎవరికీ ఇవ్వడు..తన అల్మారాలో మిగతా బొమ్మల ప్రక్కన భద్రంగా అలకరించుకుంటాడు..అవి అతడి ఉనికిలో భాగం..అతడి స్పిరిట్యువల్ జర్నీలో మరో మెట్టు..అతడి సొంతం..అతడి ఉద్దేశ్యంలో బొమ్మలకి ఇష్టాయిష్టాలుండవు.

ఇదంతా తెలిసే నేను అతణ్ణి నా జీవితంలోకి ఆహ్వానించాను..ఏదో ఒక సమయంలో అతడు నా మనసు ముక్కలు చేస్తాడని తెలుసు..నాది అతడిలా పదిమందికి పంచగలిగే విశాలమైన ప్రేమ కాదు..నా మౌనాన్ని చదివాడో ఏమో ఒకరోజు తనకిష్టమైన కవిత అంటూ ఒక కవితను నాకు చూపించాడు..ప్రేమ కవిత్వం..మనసులో భావాలు మాటల్లో చెప్పేస్తే గాలిలో కలిసిపోయి మాయమైపోతాయి..అలా చెప్పకుండా ఇలా అక్షరాల్లో పెట్టేవాళ్ళు దొరకడం నిజంగా నా అదృష్టం అనుకున్నాను..ఆరోజు నేనెప్పటికీ మర్చిపోలేను..క్లౌడ్ నైన్ లో ఉండడమంటే ఏమిటో ఆ క్షణంలో అనుభవమైంది..ఆ క్షణాన్ని పూర్తిగా జీవించనైనా జీవించలేదు "ఇది కూడా షార్ట్ టైమ్ మాత్రమే,ఏదీ శాశ్వతం కాదు" అతడి స్వరం కఠినంగా పలికింది..నా కళ్ళల్లో నీళ్ళతో పాటు మొదటిసారి అతడిపై నా ప్రేమను వ్యక్తపరిచిన క్షణమది "You know what, I Hate You".

Sunday, April 11, 2021

A Book of Simple Living : Brief Notes from the Hills - Ruskin Bond

ఇది నేను పుస్తకాల గురించి సహజంగా రాసే వ్యాసం కాదు..ఒక పఠనానుభవం నుండి వెలికి వచ్చిన జ్ఞాపకాలను పంచుకునే ప్రయత్నం మాత్రమే..ఆసక్తి లేని వాళ్ళు చదవడం విరమించుకోవచ్చు. 

పుస్తకపఠనం ద్వారా నేర్చుకునే పాఠాల కంటే వాస్తవిక అనుభవాలు నేర్పించే పాఠాలు గొప్పవి..ఈ పుస్తకం నేను బహుశా ఒక పది-పదిహేనేళ్ళ క్రితం చదివి ఉంటే 'ఆహా ఎంత గొప్ప రచన' అనుకునేదాన్నేమో,ఎందుకంటే ఇది ఒక జీవితాన్ని సమూలంగా మార్చగల సత్తా ఉన్న రచన..ఇప్పుడలా అనుకోనని కాదు,ఇది అచ్చంగా అటువంటి రచనే..కానీ ఇప్పుడీ పుస్తకంలో రచయిత జీవితాన్ని నేను జీవించి ఉండడం వల్ల నాకు ఇందులో కొత్తదనమేమీ కనిపించలేదు..ఈ పుస్తకాన్ని నేనొక జీవితకాలం ఆలస్యంగా చదవడం దానికొక కారణం..హిమాలయాల్లో 25 రోజులపాటు సుదీర్ఘంగా సాగిన రోడ్ ట్రిప్ లాంటి అనుభవాలూ, కొడైకెనాల్,ఊటీ,మూనార్ లాంటి హిల్ స్టేషన్స్ లో తరచూ గడిపిన రోజులూ ప్రకృతికి మమ్మల్ని దగ్గరగా తీసుకొచ్చాయి..ఏదేమైనా కొద్ది రోజులు చుట్టపు చూపుగా వెళ్ళి చూసి రావడానికీ, అక్కడే సుదీర్ఘకాలం స్థానికుల్లా ప్రకృతితో మమేకమై జీవించడానికీ చాలా వ్యత్యాసం ఉంటుందన్న విషయం మాకు కాస్త ఆలస్యంగా అర్థం అయ్యింది.

Image Courtesy Google

పొట్టకూటి కోసం ప్రతి మూడేళ్ళకోసారి ఊర్లు మారవలసిన ఉద్యోగం కావడంతో చిన్నప్పటినుండీ పట్టణవాసం తప్ప పల్లెటూర్లు ఎరుగని నాకు ట్రాన్స్ఫర్ కారణంగా ఉత్తర కేరళలోని వాయనాడ్ లో కొంతకాలం నివాసం ఉండవలసి వచ్చింది..పోస్టింగ్ ఇచ్చిన నీలగిరుల్లోని (ఊటీ దగ్గర తమిళనాడు) అయ్యన్ కొల్లై లో సరైన స్కూళ్ళు లేకపోవడంతో దగ్గరలో ఉన్న సుల్తాన్ భతేరీ (కేరళ) లో ఇల్లు వెతుకున్నాం..రెండిటికీ మధ్య 18 km దూరం..రోజూ అరగంటసేపు దట్టమైన నీలగిరి కొండల్లోంచి ఇంటికీ,ఆఫీసుకి రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణం ఆయనకు ఒక కొత్త అనుభవం..చెన్నై ,కోయింబత్తూర్ లాంటి మహానగరాల్లో ట్రాఫిక్ జామ్ లకు అలవాటైన ప్రాణాలకు ఇదొక వరంలా అనిపించింది..రేర్ వ్యూ మిర్రర్ లోకి దృష్టి సారిస్తే వెనుక పది,పదిహేను వాహనాలకు బదులుగా పచ్చదనం బాక్గ్రౌండ్ లో ఖాళీ రోడ్లు దర్శనమిచ్చేవి.

ఉత్తర వాయనాడ్ అనేకమంది ఆదివాసీ తెగలతో కమర్షియల్ కేరళకు సుదూరమైన ప్రాంతం..చెన్నై నుండి షిఫ్టింగ్ ఏర్పాట్ల రీత్యా ముందే వెళ్లిన ఆయన్ని ఊరు ఎలా ఉంది  అనడిగితే, ఏమీ చెప్పకుండా,నువ్వే చూస్తావుగా,తినబోతూ రుచెందుకు అని తన సహజమైన మిస్టిక్ ఎయిర్ తో ఒక నవ్వు నవ్వారు..సరే బ్లాంక్ ఇంప్రెషన్ తో ఆ ఊరికి చేరుకున్నాం..పట్టణాలకు భిన్నంగా ఎటు చూసినా కనుచూపుమేరల్లా పచ్చదనం,అక్కడక్కడా చీమల్లా దోమల్లా మనుషులు..ఇల్లు చేరాక (ఆ ఊరంతటిలో ఉన్న ఒకే ఒక్క అపార్ట్మెంటు) లివింగ్ రూమ్,బెడ్ రూము కిటీకీలు తెరిచి చూద్దుము కదా,ఇంటి చుట్టూ దట్టంగా అమరిపోయిన కాఫీ తోటలూ,పెప్పర్ తోటలూ..కాసేపు నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను.

ఈ పుస్తకంలో ముస్సోరీ లో తన ఇంట్లో కిటికీ ప్రక్కన కూర్చుని గడిపే సమయం గురించి The leaves are a fresh pale green in the spring rain. I can look at the trees from my window—look down on them almost, because the window is on the first floor of the cottage, and the hillside runs at a sharp angle into the ravine. I do nearly all my writing at this window seat. Whenever I look up, the trees remind me that they are there. They are my best critics. As long as I am aware of their presence, I may avoid the thoughtless and the trivial.అంటారు రస్కిన్ బాండ్.

అమ్మా,నేనూ కాఫీ పిచ్చివాళ్ళమేమో ఇక మా ఆనందానికి అవధుల్లేవు..'మిషన్ కష్మీర్' లో ప్రీతి జింటాలా "सोचो के झीलों का शहर हो..लहरों पे अपना एक घर हो" అనే పాటను హమ్ చేసుకుంటూ ఇల్లంతా సర్దేసుకున్నాను..ఇంటిప్రక్కనే ఉన్న తేజస్ రిసార్ట్ లో శెలవులు ఎంజాయ్ చెయ్యడానికొచ్చే టూరిస్టులు ఒక రోజుకి పాతికవేలు రెంట్ కడితే, మా ఇంటి అద్దె నెలకు పదివేలు మాత్రమే..అలా దేవభూమిలో ప్రకృతితో అడుగులో అడుగువేసి జీవించే వరం మాకు కోరుకోకుండానే లభించింది..ఎక్కడున్నా ఆ ఊరిని సొంతం చేసుకుని అక్కడి సంస్కృతినీ,ఆ పరిసరాల్ని తనివితీరా అనుభవించే తత్వమున్న మాకు, ఎప్పటిలాగే అక్కడ రాబోయే రోజులు ఎలా గడపబోతామా అన్న కనీస స్పృహ కూడా లేకపోవడం విశేషం.

పశ్చిమ కనుమల్లో పగటి కంటే రాత్రుళ్ళు సుదీర్ఘంగా అనిపించేవి..షాపింగులు,మాల్స్,బీచ్,కల్చరల్ ఈవెంట్స్,మూవీ పార్టీలూ,కార్పొరేట్ డిన్నర్లు లాంటివాటితో  మాకు చెన్నై లో రాత్రి సాయంత్రం 7 తరువాత జీవితం మొదలయ్యేది..భతేరీలో  చెన్నై కు భిన్నంగా సాయంత్రం 6 గంటలు దాటితే జీవితం స్థంభించేది..అన్ని దుకాణాలూ మూతబడేవి..గూళ్ళకు చేరే పక్షులతో, చిమ్మెటలూ, మిణుగురుల రణగొణధ్వనులతో పరిసరాలన్నీ నిండిపోయేవి..గడియారం ముల్లుతో సహా ఆగకుండా పరిగెత్తడమే తప్ప దొర్లిపోతున్న క్షణాలని ఒడిసిపట్టుకోవాలనే ఆలోచనలేని కాంక్రీటు జంగిల్స్ నుండి వచ్చిన మాకు రోజులో 24 గంటలు ఉంటాయన్న స్పృహ తొలిసారిగా కలిగింది..బోలెడంత ఖాళీ సమయం..మొదట్లో ఆ స్తబ్దతను ఏం చేసుకోవాలో తెలీలేదు..కానీ అక్కడ ఆకూ,మొక్కా,పక్షీ,ప్రాణీ తమ దైనందిన జీవితాన్ని మాకు మెల్లగా పరిచయం చేశాయి..ఉదయం 7 గంటలకు సూర్యుడు నడినెత్తికి వచ్చేవరకూ తెల్లారని మాకు 5 గంటలకు వణికించే చలిలో లేవకపోతే తప్ప ఆవు పాలు దొరకేవి కాదు..అలా పెందలాడే నిద్రలేవడం వల్ల నులివెచ్చని సూర్యోదయాలు చెంపల్ని తాకుతుంటే కలిగే తన్మయత్వం అనుభవంలోకి వచ్చింది..తరువాత ఉదయపు నడకకు బయలుదేరేవాళ్ళం..దారిపొడవునా పచ్చదనం,అన్ని కాలాల్లోనూ విరగబూసే ఎర్రటి మందారాలూ,అల్లం,పసుపు,అరటి,కర్రపెండలం,పనస తోటల మీదుగా ఆదివాసీ నివాసాలను దాటుకుంటూ సాగే నడకలో మధ్య మధ్య జింకలు,లేళ్ళు అనేకం కనిపించేవి..పచ్చని కొండల మీదుగా తేలి వెళ్ళిపోతున్న తెల్లని మేఘాలతో పోటీపడుతూ ఎత్తుపల్లాల దారుల్లో సాగే మా నడకలో అలసట తెలిసేది కాదు..చూపులు కలిపితే అమర్యాద అనుకునే పట్టణవాసులకు భిన్నంగా కళ్ళలో కళ్ళుపెట్టి మొహంలోకి పరీక్షగా చూస్తూ పలకరింపుగా చిరునవ్వు నవ్వే పాదచారులు ఎదురయ్యేవారు..కానీ వీళ్ళకు భిన్నంగా ఆదివాసీల మొహాల్లో మాత్రం పలకరింపు చిరునవ్వు స్థానంలో అనుమానం కనిపించేది.

ఆ ఊళ్ళో రాత్రంతా వెలిగే వీధి దీపాలను ఆర్పే బాధ్యతను ఎవరు ఆ దారంట ముందు వెళ్తే వాళ్ళు తీసుకునేవారు..తెల్లని పంచెలు కట్టుకున్న వ్యక్తులు చురుగ్గా నడుస్తూ ఒక్కో వీధి దీపాన్నీ అలవాటుగా అట్టే శ్రమలేకుండా ఆపుకుంటూ వెళ్ళిపోయేవారు..తెల్లవారు ఝామున  మసక వెలుతురులో అడవిపక్షుల సంగీతం వింటూ కాఫీ తాగడం రోజు మొత్తం మీద మాకు ఇష్టమైన అలవాటుగా మారిపోయింది..బహుశా మేము మాటలకంటే నిశ్శబ్దాన్ని ఎక్కువ ఇష్టపడడం అక్కడే నేర్చుకున్నాం..మా మాటలు అక్కడ ఇంకా మగత నిద్రలో జోగుతున్న ప్రకృతి నిద్రను భగ్నం చేస్తాయేమో అనిపించేది..కాస్త పొద్దెక్కాక వక్క చెట్లెక్కేవాళ్ళూ, కాఫీ,మిరియం తోటల్లో పనులు చెయ్యడానికి వచ్చే వాళ్ళూ, కూనిరాగాలు తీస్తున్నారా అని అనుమానం వచ్చేట్టుగా సంగీతంలా ఉండే మళయాళీ భాషలో గుసగుసగా చెప్పుకునే కబుర్లు చెవిన పడుతుండేవి.

ఇక ఆ పచ్చిగాలికి మధ్యాహ్నపు వేళల్లో కూడా ఇట్టే నిద్ర పట్టేసేది..కిటికీ ప్రక్కన పడుకుని పుస్తకం చదువుకుంటూ, మధ్య మధ్యలో కిటికీ బయట అడవిని చూస్తూ నిద్రలోకి జారిపోయేదాన్ని..ప్రశాంతమైన నిద్ర..గడియారపు ముల్లు శబ్దం,నా గుండె చప్పుడూ తప్ప మరేమీ వినిపించనంత నిశ్శబ్దం. Sleep—‘the gentlest of the gods’, says Ovid. Cherish it. Honour it by giving it most of your night and an hour of your day when you can. అని గుర్తు చేస్తారు బాండ్.

The evening drink, a good, light meal, a hot-water bottle in winter and an open window in summer—these are good sleeping aids, but none more important than a free and easy mind. ‘With quiet mind go take they rest,’ said a wise man, and there is much truth in that statement. Forget and forgive at sunset, and then the day’s deeds are truly done. Then sleep.

ఆ కొండల్లో ఎటువంటి అరుపులూ,కేకలూ,పెద్ద పెద్ద ధ్వనులతో కూడిన హడావుడీ లేకుండా చాలా నిదానంగా,నిశ్శబ్దంగా సాగే రోజువారీ జీవితానికి గుర్తులుగా ఇంట్లో ఫిల్టర్ లోనుండి వచ్చే కాఫీ  ఘుమఘుమలూ, పెంకుటిళ్ళ చిమ్నీల్లోంచి వచ్చే పొగలూ ,రోజూ ఒకే సమయానికి  పాల కాన్ తీసుకుని నడుచుకుంటూ వెళ్ళే పొరుగింటి పన్నెండెకరాల ఆసామీ, ఆఫీసుకు తయారై వెళ్ళే అందమైన చారడేసి కళ్ళ కేరళ కుట్టీలూ, కట్టెల మోపుల్ని తలపై పెట్టుకుని వరుసగా నడుచుకుంటూ వెళ్ళే తోటపనివాళ్ళు..ఇంటి వాకిళ్ళలో రంగురంగుల రూపాల్లో తలలూపుతూ పలకరించే అడవిపూలూ..వీటన్నిటిమధ్యా జీవితం ప్రతిరోజూ పండగలా ఉండేది..ఒక రోజొక విచిత్రం జరిగింది..తెల్లవారుతూనే దుప్పటిముసుగు తీసేసరికి ముక్కుపుటాలు పగిలిపోయేంత సువాసన..ఏ కిటికీ సందులోంచి ఏ కొత్త పువ్వో సుగంధాలు వెదజల్లుతోందేమో అని బెడ్రూమ్ కిటికీ తెరచి చూస్తే కిటికీ బయట కాఫీ మొక్కలన్నిటికీ తెల్లని పువ్వులు పూసేసి ఉన్నాయి..పారిజాతాల్ని తలపించే ఆ సువాసన అద్భుతం..వెంటనే ఈయన్ని నిద్రలేపి బయటకి వెళ్ళి చూస్తే ఎదురింట్లో ప్రక్క ఇంట్లో అన్ని చోట్లా పువ్వులు పూసేసి ఉన్నాయి..సంవత్సరంలో ఒక్క సారే ఇలా కాఫీ పువ్వులు పూస్తాయిట..ఊరంతా పువ్వులే..ఆలస్యం చేస్తే ఈ అందమైన దృశ్యం ఎక్కడ మిస్ అయిపోతామో అన్నట్లు మేము బ్రష్ చేసుకుని కెమెరా భుజాన వేసుకుని బయటకి పరిగెత్తాం..  నడుచుకుంటూ వెళ్తుంటే ఊరంతా తెల్లని పువ్వులే..సుల్తాన్ భతేరీ మొత్తం ఆ రోజు ఆ సువాసనలతో నిండిపోయింది..దాన్ని దేవలోకమని ఎందుకంటారో ఆ క్షణంలో అర్ధమైంది.

ఇక పశ్చిమకనుమల్లో వర్షాకాలపు సొగసులు ఏమని చెప్పను ! కుండపోత వర్షం తరువాత చెట్టూ,చేమా,పొదలూ,తీగల సమేతంగా అడవిలో మహావృక్షాలన్నీ అప్పుడే మంగళస్నానాలాచరించినట్లు తాజాగా కనిపించేవి..వర్షానంతరం ఆ పచ్చటి పసిరిక వాసనైతే వర్ణించనలవి కాదు..మారే ఋతువులతో మారే అడవి రంగుల్నీ ,ఎప్పుడూ చూడని రకరకాల అడవి పూలూ,పళ్ళనీ ,గ్రీన్ కలర్ లో అన్ని షేడ్స్ నీ అక్కడే ప్రత్యక్షంగా చూశాము..స్వచ్ఛమైన గాలీ,నీరూ,కనుల విందుగా ప్రకృతి, 'సంతృప్తి'కి కొత్త అర్థాలు తెలియజెప్పాయి : అక్కడ గడిపిన రోజుల్లో ఈ జీవితానికింకేం కావాలనిపించేది..వేల రూపాయలు ఖర్చుపెట్టి గడిపే మెట్రో వీకెండ్స్ లో ఇటువంటి సంతృప్తి ఎప్పుడూ అనుభవించింది లేదు..ఇది పూర్తిగా వేరు.

We don’t have to circle the world in order to find beauty and fulfilment.  After all, most of living has to happen in the mind. To quote one anonymous sage from my trivet: ‘The world is only the size of each man’s head.అంటారు బాండ్.

ఇక వారాంతాలు తోల్ పెట్టి,బందీపూర్,ముతంగా అడవులను దాటుకుంటూ మధ్య మధ్యలో ఆగుతూ లాంగ్ డ్రైవ్ లకు వెళ్ళేవాళ్ళం..కొన్ని చోట్ల ఫారెస్ట్ రేంజర్లు,స్టాఫ్ తో మాటామంతీ  కలిపేవాళ్ళం..వాళ్ళు అక్కడి సంగతులన్నీ మాకు పూస గుచ్చినట్లు చెప్పేవారు..ఏనుగులు సంచరించే చోట్లు కాబట్టి జాగ్రత్త అని హెచ్చరించేవారు..చివరగా వాయనాడ్ ఫేమస్ 'కట్టా చాయ్' తో మాకు ఆతిథ్యం ఇచ్చి గానీ పంపేవారు కాదు..వర్షాకాలాల్లో గొడుగులు వేసుకుని అడవుల్లోకి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం..మా నడకలో వేగం ఉండేది కాదు..చుట్టూ ప్రకృతిలో కనిపించే ప్రతీ చిన్న సంగతినీ పరిశీలిస్తూ నడిచేవాళ్ళం..ఎప్పుడూ చూడని పక్షులేవో కనిపించేవి, వాననీటికి తడిసిన పువ్వులు నవ్వుతూ పలకరించేవి..ఒకసారి గూడలోరు రోడ్ లో కారులో వెళ్తున్నాం..మా వెనుక వచ్చే కార్లు ఎక్కువ శాతం అతి వేగంగా హారన్ కొడుతూ L బోర్డు తగిలించుకున్నవాళ్ళలా వెళ్తున్న మమ్మల్ని దాటుకుని ముందుకు వెళ్ళిపోయేవి..మాకు గమ్యం చేరాలన్న హడావుడి లేదు..అసలైన ఆనందం గమ్యాన్ని చేరడం కంటే ప్రయాణాన్ని అనుభవించడంలో ఉంటుందన్న స్పృహ ఉన్నవాళ్ళం..మేము వేగంగా వెళ్ళిపోతే దారిలో కనిపించిన టీ స్టాల్ లో హోరుమని వర్షంలో ఆగి టీ తాగే అదృష్టం కోల్పోయేవాళ్ళం,ఆ టీ షాపు ఓనర్ తోనూ ,అతడి మూడేళ్ళ పిల్లవాడితోనూ కబుర్లు చెప్పే అవకాశం చేజార్చుకునేవాళ్ళం..గమ్యం చేరాలన్న హడావుడితో ప్రయాణిస్తే అంబలవాయల్ లో బంతిపూల తోటలూ,కర్ణాకట పల్లెల్లో పొద్దుతిరుగుడు తోటలూ ,చేరంగోడ్ లో మిరియాల తోటలూ కలియతిరుగుతూ వాటిని కోసుకునే అవకాశం కోల్పోయేవాళ్ళం.

I learned early—without quite realizing it—that the pleasure of travel is in the journey, and not so much in reaching one’s destination. Destinations rarely live up to the traveller’s expectations. And the pleasure is further reduced if you’re checking your watch all the time. In travel, as in life, give yourself plenty of time, so that you won’t have to rush—you miss seeing the world around you when you are in a great rush, or if you seal yourself off in air-conditioned cars and trains, afraid of the heat and dust.

The adventure is not in arriving, it’s in the on-the-way experience. It is not in the expected; it’s in the surprise. You are not choosing what you shall see in the world, but giving the world an even chance to see you.

మరో విశేషం ఏంటంటే ఆ ఊళ్ళో ఒక వినాయకుడి గుడి ఉండేది..అక్కడ ప్రతి శుక్రవారం ఊరంతా వచ్చి దీపాలు వెలిగించేవాళ్ళు..మేము కూడా ఆ సంప్రదాయంలో ఇష్టంగా పాలుపంచుకునేవాళ్ళం..ఆ గుడిలో థెయ్యమ్,చెండా మేళం మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరిగేవి..ఇలా చెప్పుకుంటూపోతే ఒక జీవితానికి సరిపడే అనుభవాలను అక్కడ ప్రోగు చేసుకున్నాం..ఆ విధంగా ప్రకృతితో పరిచయం జీవితం పట్ల మా దృక్పథాన్ని సమూలంగా మార్చేసింది..మాకు ప్రాథాన్యతలు తెలిసివచ్చాయి..దేవభూమిలో మేము గడిపిన సమయం జీవితాన్ని సంతోషమయం చేసుకోవడానికి విలాసవంతమైన జీవన విధానం అవసరంలేదనీ, చిన్న చిన్న సంతోషాలే జీవితాన్ని సుసంపన్నం చేస్తాయనీ, ప్రకృతితో,పరిసరాలతో,సాటి మనుషులతో స్నేహం జీవితాన్ని అర్థవంతం చేస్తుందనీ నేర్పించింది..ఈ పుస్తకంలో బాండ్ వ్యాసాలు కూడా ఇదే చెబుతాయి, ప్రతీ క్షణం పూర్తి స్పృహతో జీవించడం ఎంతో అవసరమంటారు బాండ్..ముఖ్యంగా ఏకాంతాన్నీ,నిశ్శబ్దాన్నీ అనుభవించగలగడం ఒక వరమని అంటారు.

And as I sat there, pondering on my future, a line from Thoreau kept running through my head. ‘Why should I feel lonely? Is not our planet in the Milky Way?’  Wherever I went, the stars were there to keep me company. And I knew that as long as I responded, in both a physical and mystical way, to the natural world—sea, sun, earth, moon and stars—I would never feel lonely upon this planet.

రస్కిన్ బాండ్ ఈ రచనలో ముస్సోరీ,డెహ్రాడూన్ లలో తన జీవితాన్ని గురించి ఇటువంటి విషయ విశేషాలే తన అద్భుతమైన నేరేటివ్ స్కిల్స్ తో చిన్న చిన్న వ్యాసాల రూపంలో మనతో పంచుకున్నారు..ఇది చిన్నా-పెద్దా ప్రతి ఒక్కరూ చదవవలసిన రచన..ముఖ్యంగా జీవితంలోకి కొత్త ఆశలతో అడుగుపెట్టబోయే యువతీ,యువకులు తప్పకుండా చదవలసిన రచన.

పుస్తకంనుండి మరి కొన్ని వాక్యాలు : 

ఏకాంతాన్ని గురించి రస్కిన్ బాండ్,

By all means use sometimes to be alone!
Salute thyself: see what thy soul doth wear! —George Herbert.

It seems to me that most people are scared of solitude, for almost everything is carried out on a crowded scale. Clubs, wedding parties, sporting events, political meetings, victory parades, religious events, melas, even prayer meetings—the bigger the crowd, the more successful the event! Let a man be seen walking about the hills or countryside alone, and he will be labelled an eccentric.
For most people loneliness is wrongly linked to unhappiness. Their minds are not deep enough to appreciate the sweetness and balm of solitude; they are afraid of life itself, of coming face to face with themselves.
Most of the time we are taken up with family life or working for a living. To get away from it all, just once in a while, into the hills or fields or bylanes, where ‘I am I’, is to enjoy undisturbed serenity. It helps one to contemplate, to create a philosophy of life, to take the mind off the nagging cares of pressures of this age of technological mayhem.
But you do not have to turn your back on the world at large in order to find true solitude. A solitary spirit can move around with the crowd while still holding on to his innate reserve of solitude. Some people choose to sail around the world in small boats. Others remain in their own small patch, yet see the world in a grain of sand.


ప్రేమను గురించి బాండ్ అభిప్రాయాలు: 

Young couples, usually honeymooners, crowd the Mussoorie Mall. It is good to see new love in full bloom. Not all of them will remain in love with each other, but today they are and it makes them all beautiful, and fearless.
I have fallen in love many times. I still keep falling in love! As a youth, loneliness always went hand in hand with a powerful pull or attraction towards another person, be it boy or girl—and very often without that individual being aware of it. I think I expressed this feeling in a short poem, ‘Passing By’, which I wrote many years ego:
Enough for me that you are beautiful:
Beauty possessed diminishes.
Better a dream of love
Than love’s dream broken
Better a look exchanged
Than love’s word spoken.
Enough for me that you walk past,
A firefly flashing in the dark.
It was probably written as a result of unrequited love. For whenever I pursued a loved one, that person proved elusive. On the other hand, the most lasting relationships have been those that have grown slowly, without fret or frenzy.
Declarations of passionate love or undying friendship are fine in their own way, and perhaps necessary; but the important thing is to feel comfortable with someone, and not have to keep proving yourself in one way or another.
In moments of rare intimacy two people are of one mind and one body, speaking only in thoughts, brilliantly aware of each other. I have known such moments—and who knows, I may know them again!

We must love someone.
We must keep loving, all our days,
Someone, anyone, anywhere
Outside our selves;
For even the sarus crane
Will grieve over its lost companion,
And the seal its mate.
Somewhere in life
There must be someone
To take your hand
And share the torrid day.
Without the touch of love
There is no life, and we must fade away.

And as I write this, I’m reminded of other consolations.
The winter sun on old bones.
The laughter of a child.
A cricket singing in a shady nook.
The smell of frying onions.
A small bird’s nest.
A kiss in the dark.
New moon in a deep purple sky.

The ancient Hebrew sage Hillel has been my guide:
If I am not for myself,
Who will be for me?
And if I am not for others,
What am I?
And if not now, when?

I am a pagan, pure and simple; sensitive to touch and colour and fragrance and odour and sounds of every description; a creature of instinct, of spontaneous attractions, given to illogical fancies and attachments. As a guide I am of little use to anyone, least of all to myself.  I think the best advice I ever had was contained in these lines from Shakespeare which my father had copied into one of my notebooks when I was nine years old :  This above all, to thine own self be true, And it must follow as the night of the day, Thou can’st not then be false to any man.

I feel it too, old as I am. I would like nothing better than to hold someone warm and beautiful in my arms, once again. Am I asking for too much? Well, one can always dream… No one can take our dreams away!  And until death comes, all is life.

Friday, April 9, 2021

Women as Lovers - Elfriede Jelinek

స్త్రీ వాద రచనలనగానే స్త్రీలేం చేసినా గుడ్డిగా సమర్ధించడమో, జీవితం పట్ల ఆమె దృక్పథాన్ని భావోద్వేగాల త్రాసులో వేసి చూసి, ఇన్ఫీరియర్ జెండర్ కాబట్టి ఆమె కన్నీటి గాథ అనైతికంగా ముగిసినా చప్పట్లు చరచడమో చెయ్యడమే ఎక్కువ చూస్తుంటాం..అదీ కాకపోతే సమస్యలు ఎదురైనప్పుడు ప్రతీకారంతో విలువలకు తిలోదకలివ్వమని ప్రేరేపించే కథలు కూడా తక్కువేం కాదు..స్త్రీవాద కథలతో నాకున్న పేచీ ఏమిటంటే వాటిలో లాజిక్ /ప్రాక్టీకాలిటీ కంటే ఎమోషన్ ఎక్కువ అమ్ముడుపోతుంది..అటువంటిది ఈ మధ్య జర్మన్ రచయిత్రి ఎల్ఫ్రీడ్ జెనెలిక్ రాసిన 'Women as Lovers' అనే 'స్త్రీ పక్షపాతం లేని స్త్రీవాద రచన' ఒకటి చదివాను.

Image Courtesy Google

మార్గరెట్ ఆట్వుడ్ కి ఇంకా నోబెల్ రాలేదనీ,బోర్హెస్ కి అసలంటూ ఇవ్వలేదనీ నాకు నోబెల్ ప్యానెల్ మీద కాస్త కినుకుగా ఉండేది..ఆ కారణంగా ఆట్వుడ్ కంటే చాలా చిన్నవారైన నోబెల్ గ్రహీత,ఆస్ట్రియన్ రచయిత్రి ఎల్ఫ్రీడ్ జెలినెక్ ని చూసినప్పుడల్లా ఈమెలో అసలు రైటర్ లక్షణాలేమీ ఉన్నట్లు లేదు,మోడల్ కి ఎక్కువ రైటర్ కి తక్కువలా ఉన్నారీవిడ అనుకునేదాన్ని..ఆట్వుడ్ వీరాభిమానిగా నాకు జెలెనిక్ పట్ల కొంచెం వివక్ష ఉండేది..అప్పుడప్పుడూ ఆవిడ పుస్తకాలు మేమున్నామంటూ ఎదురైనా నేనే కావాలని సీతకన్ను వేస్తూ వచ్చాను..మీరేమనుకుంటున్నారో నాకు వినిపిస్తోంది,"అంత జడ్జిమెంటల్ ఏమిటసలు" అనేగా ? పాఠకులు కూడా మనుషులేనండీ, ప్రీ కన్సీవ్డ్ నోషన్స్/జడ్జిమెంటల్ ఆటిట్యూడ్ లాంటివి మాకూ ఉంటాయి..మైక్ పట్టుకుని పైకి చెప్పమంతే..కానీ దీనంతటిలో నేనే ఒకప్పుడు ఫిలసాఫికల్ గా ట్విన్ టాక్ చేసిన బేసిక్ రూల్ ఒకటి మర్చిపోయాను, అదేమిటంటే "You need to love something (or someone) before you hate it"..అందువల్ల జెలెనిక్ ని ఎలాగూ హేట్ చేద్దామని నిర్ణయించుకున్నాను కాబట్టి,దానికి ముందు ఒకసారి ప్రేమించి చూడాల్సిన బాధ్యత ఉంది కదా :) 

అందమైన ఆల్ప్స్ పర్వతశ్రేణుల నడుమ అందంగా అమరిపోయిన ఒక బట్టల ఫ్యాక్టరీ..అందులో పనిచేసే అమ్మాయిలు స్త్రీల లోదుస్తులు తయారుచేస్తూ ఉంటారు..కథా నేపథ్యాన్నీ,ఆ పరిసరాలనూ వర్ణిస్తూ They sew. They sew foundations, brassieres, sometimes corsets and panties too. Often these women marry or they are ruined some other way. అంటారు రచయిత్రి..నిజానికి ఆ రెండో వాక్యం ముగించడంలో ఆమె చెప్పాలనుకున్న కథకు ప్రారంభం ఉంటుంది..ఆ ఫ్యాక్టరీలో పని చేసే బ్రిడ్జిట్టి కి ఎలక్ట్రీషియన్ గా స్థిరపడబోతున్న ఎగువ మధ్య తరగతికి చెందిన హెయిన్జ్ అంటే వల్లమాలిన ప్రేమ..ఆ ప్రేమ ఎటువంటిదంటే, 

Heinz keeps one eye on his professional advancement and on courses which are perhaps to be attended. Brigitte keeps an eye on love, which is like a serious illness, and Brigitte keeps the other eye on her future home and its furnishings. Brigitte has heard that it's real, if it's like an illness, Brigitte loves Heinz really and truly.

హెయిన్జ్ ని ఒప్పించగలిగితే రాబోయే సౌకర్యాల గురించీ,ఇంటి ఇల్లాలుగా తనకు దక్కబోయే సర్వాధికారాల గురించీ కలలుగంటూ, కాబోయే భర్తని అది 'ప్రేమ' అని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న బ్రిడ్జిట్టి ప్రేమలో డొల్లతనాన్ని ఎత్తి చూపిస్తారు రచయిత్రి..అతడితో సినిమాల్లోనూ,రేడియోలోనూ,టీవీ లోనూ చూసే ఫేవరెట్ షోల్లో హీరోయిన్ లా I love you అంటుందామె..హెయిన్జ్ మాత్రం తక్కువ తిన్నాడా, I don't know if it's enough for a whole life, says Heinz, a man wants to enjoy many women, a man is different.

బ్రిడ్జిట్టి ఊరుకోదుగా,ఆమె ఏమంటుందంటే : But that's exactly why I love you, because you are a man, says Brigitte. You are a man, who is learning a trade, I am a woman, who has not learned a trade. Your trade must do for both of us. And it will do that easily, because it's such a beautiful trade. You must never leave me, otherwise I would die, says Brigitte. 

నువ్వు మరీనూ అంటాడు హెయిన్జ్ : No one dies as easily as that, says Heinz. You would just have to fall back on someone, who earns less, than I shall earn one day.. 

దానికి బ్రిడ్జిట్టి But that's exactly why I love you, because you earn more than someone, who earns less. అంటుంది. :) 

ఈ పుస్తకం రాసింది ఒక రచయిత్రి కాబట్టి, పుస్తకం పేరుని బట్టి ఇది స్త్రీవాద రచనేమో  అనుకున్నాను..కానీ బ్రిడ్జిట్టి ,హెయిన్జ్ ల మధ్య సంభాషణని చూస్తే ఇది పూర్తి స్త్రీవాద రచన కాదని అర్ధమవుతుంది..నిజానికి ఈ రచన సారాంశాన్నంతటినీ వీరిద్దరి సంభాషణలో కుదించి చూడవచ్చు..ప్రేమ పేరిట తమ అవసరాలు తీర్చుకోడానికి ఆడామగా నాగరికంగా ఆడే దాగుడుమూతలల్ని ఇంత తేటతెల్లంగా చూపించే రచనలు బహు  అరుదు..రచయిత్రిగా జెలెనిక్ అటు బ్రిడ్జిట్టి పక్షం గానీ,ఇటు హెయిన్జ్ పక్షంగానీ తీసుకోకుండా, సాదాసీదా సంభాషణల రూపంలో పాత్రల స్వభావాలను బేరీజు వేసే పనిని మనకే వదిలేస్తూ కథను నడిపిస్తారు..స్త్రీపురుష సంబంధాలు ఏర్పరుచుకోవడంలో రెండు వర్గాల్లోనూ ఎదురయ్యే సంక్లిష్టతలను ఒకవైపు ఎత్తి చూపిస్తూనే, తాను సృష్టించిన స్త్రీ పాత్రలపట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ స్త్రీవాదాన్ని వినిపించడం అంత సులువైన పని కాదు.

His parents want the best for Heinz. Brigitte is certainly not that: the BEST. I love you so much, says Brigitte. My gleaming hair supports my love. What also supports my love: your job, which has a future. What supports my love apart from that: I myself, who have nothing at all. అంటూ స్త్రీపురుష సంబంధాలను గ్లోరిఫై చేసే ప్రేమ,రొమాన్స్ లాంటి అంశాల్ని పూర్తిగా కథలోంచి తీసి అవతలకు విసిరేస్తారు జెనెలిక్..ఉన్నదల్లా 'అవసరమే'..మనిషిని నడిపించేది అవసరమే అని పదే పదే పాఠకులను స్వాప్నిక లోకాలను వదిలి నేలమీదకు  వచ్చి చూడమంటారు.  

ఈ కథంతా దిగువ మధ్య తరగతికి చెందిన పౌలా,బ్రిడ్జిట్టి, ఉన్నత వర్గానికి చెందిన సుశి అనే ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంది..బ్రిడ్జిట్టి గురించి చెప్పుకున్నాం కదా ఇక పౌలా విషయానికొస్తే ఆమెకు అందరమ్మాయిల్లా ఒక సాధారణ సేల్స్ గర్ల్ లా బ్రతుకీడ్చకుండా 'డ్రెస్ మేకింగ్' నేర్చుకుని జీవితంలో పైకెదగాలనుంటుంది..ఈలోగా చెట్లు నరికే వృత్తిలో ఉన్న అందగాడు ఎరిక్ తో ఆమెకు పరిచయం ప్రేమగా మారుతుంది..ఎరిక్ కు హెయిన్జ్ లా లక్ష్యాలేమీ లేవు సరికదా అతడు ఒక తాగుబోతూ ,తిరుగుబోతూను..అయినా గుడ్డిగా అతడి ప్రేమలో పడుతుంది పదిహేనేళ్ళ పౌలా..ప్రేమ అనగానే తమ ఉనికిని పూర్తిగా మర్చిపోయి సర్వం అతడే అనుకునే మెజారిటీ సగటు ఆడపిల్లల్లా పౌలా కూడా 'డ్రెస్ మేకింగ్' ని కూడా వదిలేసి అతడి చుట్టూ తిరుగుతుంటుంది..ఇక వీరిద్దరికీ భిన్నమైన అమ్మాయి సుశీ..చదువూ సంస్కారం కలిగి కాస్త స్వతంత్ర భావాలున్న వ్యక్తి ఆమె..తన విలువేమిటో,తనకేం కావాలో స్పష్టంగా తెలిసిన సుశీ బ్రిడ్జిట్టి లా హెయిన్జ్ మాయమాటలకు లొంగదు..స్థిరత్వాన్ని ఆశించి స్వప్నాల వెంట పరుగులు తీసే వీరి ముగ్గురి జీవితాల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది మిగతా కథ.

అసలీ రచనలో ప్రత్యేకత ఏముంది ! మూల కథని చూస్తే చాలా సాధారణమైన అంశమే : అమ్మాయిలూ,ప్రేమలూ,పెళ్ళిళ్ళు..మరి నోబెల్ ప్రైజ్ ఇలాంటి సాధారణ కథలు రాసే వాళ్ళకి ఇచ్చేస్తారా అంటే,ఖచ్చితంగా ఇవ్వరు..ఏదో ప్రత్యేకత ఉండాలి కదా ! జెలెనిక్ రచనల్లో మహామహుల ఆర్ట్,క్రాఫ్ట్ తో పోటీపడగలిగే విషయం ఏమిటంటే, మొదలూ తుదా గుర్తుపట్టలేని జిగిబిగి అల్లికల చిక్కని వచనం..ఒక మంచి రచయిత ఒక అసాధారణమైన విషయాన్ని తీసుకుని అసాధారణంగా చూపించగలడు..కానీ ఒక గొప్ప రచయితలో మాత్రమే ఒక సాధారణమైన విషయాన్ని సైతం అసాధారణంగా చూపించే నైపుణ్యం ఉంటుంది..జెలెనిక్ ముడి సరుకు సాధారణ అంశమే..దాన్ని ఆవిడ రూపుదిద్దిన విధానం మాత్రం చాలా ప్రత్యేకం..ఈ కథను సగం ప్రథమ పురుషలోనూ,సగం మధ్యమ పురుషలోనూ చెబుతారు..మనకి పాత్రల సంభాషణలు ఎక్కడ పూర్తయ్యాయో, రచయిత్రి స్వరం ఎక్కడ మొదలయ్యిందో కూడా తెలియనంత సునాయాసంగా నేరేషన్ దిశలు మార్చుకుంటుంది..ఇదే విధంగా రచయిత్రి పౌలా కథలోంచి బ్రిడ్జిట్టి కథలోకి, సుశీ కథలోంచి పౌలా కథలోకి అవలీలగా వెళ్ళిపోతారు..వ్యంగ్యాన్నీ,హాస్యాన్నీ మేళవించిన జెలెనిక్ నెరేషన్ పాఠకులకు అలసట తెలియనివ్వదు..దీనికి తోడు నాణానికి ఉన్న రెండు వైపులనూ చూపించడంలో జెలెనిక్ ఒక కొత్త పంథాను ఎన్నుకున్నారు..ఉదాహరణకు ఇద్దరి స్వభావ వైరుధ్యాలను మనకు వివరిస్తూ రాసిన ఈ వాక్యాలు చూడండి :

As we can see there exists a great difference between Paula's present and Paula's future, as well as between Erich's present and Erich's future, as well as between Paula's present and Erich's present, as well as between Paula's future and Erich's future, an even larger one exists however between Paula's present and Erich's future, and between Erich's present and Paula's future.

ఇక ఈ రచనలో లోపాల విషయానికొస్తే మొదటి భాగంలో ఉన్న పట్టు రెండో భాగంలోకి వచ్చేసరికి సడలిపోయింది..అంతవరకూ నేరేషన్ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న పాఠకులు ఇక దైనందిన జీవితంలోని భవసాగరాలు ఈదలేక అలసిపోయి ఒడ్డుని వెతుక్కునే పనిలో పడతారు..కథనంలో తప్ప కథలో బలం లేకపోవడం దీనికి కారణం.

ఈ జర్మన్ రచనకు మార్టిన్ ఛాల్మర్స్ ఆంగ్లానువాదం మూలం చదువుతున్నంత సరళంగా ఉంది..నిజానికి అన్యమనస్కంగా మొదలుపెట్టినా తీరా చదివాక, "న న కర్తే ప్యార్ తుమ్హిసే కర్ బైఠే !!" అంటూ ఆవిడతో పీకల్లోతు ప్రేమలో పడిపోయాను..ఉహూ ఇది పద్యం కాదు గద్యం..ఉహు ఇది పోయెట్రీ అయ్యే అవకాశం లేదు..నేను చదువుతున్నది ప్రోజ్..నేను చదువుతున్నది ప్రోజ్..నేను చదువుతున్నది ప్రోజ్ : పుస్తకం చదువుతున్నంతసేపూ ఈ మాట నాకు నేను చెప్పుకుంటూనే ఉన్నాను.."లిరికల్ నేరేషన్", "షీర్ పోయెట్రీ" అంటూ ఇక ముందు నేనెవరి వర్ణనల గురించైనా పొగిడేటప్పుడు జెలెనిక్ తప్పకుండా గుర్తొస్తారు..అబ్బే అది పోయెట్రీ ఎలా అవుతుందమ్మాయ్..నేను రాసింది గుర్తులేదా అని దబాయిస్తారు..ఆవిడ రాసేది పద్యమా ? గద్యమా ? అని చదువుతున్నప్పుడు పదే పదే ప్రశ్నించుకోని పాఠకులుండరంటే అతిశయోక్తి కాదు..ఇటువంటి ప్రోజ్ నేను ఇంతకు మునుపెన్నడూ చదవలేదు..వాక్యాలను కళ్ళతో చదివి తనివితీరక రెండు మూడు సార్లు పైకి చదువుకున్న సందర్భాలెన్నో..ఇంట్లో వాళ్ళకి చదివి వినిపించి మురిసిపోయిన క్షణాలెన్నో..ఉదాహరణకు ఈ క్రింది వాక్యాలు అంత సులభంగా మర్చిపోగలిగేవి కాదు..స్త్రీవాదాన్ని గుప్పెడు వాక్యాల్లో మూటగట్టిన జెలెనిక్ ప్రతిభకు నమో నమః..మీరు స్త్రీవాదులైనా,రచయితలైనా ఈ పుస్తకం తప్పకుండా చదవండి..పుస్తకం పూర్తిగా చదివే ఓపిక లేకపోతే కనీసం ముందు మాట ఒక్కటీ చదవండి..హ్యాపీ రీడింగ్ :)

A machine always makes a seam, it doesn't get bored. It performs its duty, wherever it is put. Each machine is operated by a semi-skilled seamstress. The seamstress does not get bored. She too performs a duty. She is allowed to sit. She has a lot of responsibility, but no overview and no long view. But usually a household.Sometimes in me evening the cycles cycle their owners home. Home. The homes stand in the same beautiful landscape. Contentment flourishes here, one can see that. Whoever is not made content by the landscape, is made completely content by children and husband. Whoever is not made content by landscape, children and husband, is made completely content by work.

పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు : 

But as long as they sew, they sew. Often their gaze wanders outside to a bird, a bee or a blade of grass. They can sometimes enjoy and understand the nature outside better than a man.

If someone has a fate, then it's a man, if someone gets a fate, then it's a woman.

One day Brigitte decided, that she wanted to be only woman, all woman for a guy, who was called Heinz. She believes, that from now on her weaknesses would be strengths and her strengths very much hidden.

Birth and starting work and getting married and leaving again and getting the daughter, who is housewife or sales assistant, usually housewife, daughter starts work, mother kicks the bucket, daughter is married, leaves, jumps down from the running board, herself gets the next daughter, the co-op shop is the turntable of the natural cycle of nature, the seasons and human life in all its many forms of expression are reflected in its fruit and veg. In its single display window are reflected the attentive faces of its sales assistants, who have come together here to wait for marriage and for life. But marriage always comes alone, without life.

Paula is waiting to be chosen, which is what really matters. What matters is to be chosen by the right man.

She also wants one day to say to someone: mine. About her dressmaking Paula never says: my work. About her work Paula never says: mine. Not even inwardly. Work, that is something, which is detached from a person, work after all is more like a duty and so it happens to the second body. Love, that's pleasure, relaxation, and so it happens to the first body.

All that matters is that love has come at last, and that it hasn't come to an ugly, worn out, drunken, exhausted, vulgar, common woodcutter and her, but to a handsome, worn out, drunken, strong, vulgar, common woodcutter and her. That makes the whole thing special.

This is how it's done: you have often seen in the cinema, Erich, haven't you, that between extraordinary people extraordinary things like for example an extraordinary love can arise. So we only have to be extraordinary and see what happens. The people all around are ordinary, they do nothing but work and work. We who do nothing but work, but also love one another, are extraordinary. We no longer need to look for the extraordinary, because we already have it: our love. Sometimes it only happens once in a lifetime, if one doesn't take it with both hands, then one will be very unhappy, if e.g. One lets the beloved woman or the beloved man go far away or astray.

Whereas this dressmaking is completely pointless, cannot replace a man and not prepare a woman for a man, is no use to a woman, if she already has a man and doesn't get her a man if she needs one, whereas this dressmaking doesn't make one HAPPY, which only a man can do.

Love can move mountains, but not Erich. Love can move mountains, but not change Erich into a loving human being. Erich is unpractised at being loved, he has never experienced it himself. Apart from that love cannot produce a refrigerator. If there is no refrigerator etc., then one only has husband and children to love, those are too few objects for Paula's great great love. There is sooo much love in Paula, which is lying idle and craving worthwhile objects.

Monday, April 5, 2021

Notes on the Death of Culture : Essays on Spectacle and Society - Mario Vargas Llosa

తరతరాలుగా సంస్కృతికి ఉన్న నిర్వచనాలు మారుతూ వస్తున్నాయి..చాలా ఏళ్ళ వరకూ సంస్కృతి ఒక మతసంబంధమైన,వేదాంతపరమైన జ్ఞానంగా మాత్రమే ఉండేది..ప్రాచీన కాలంలో గ్రీకులకు ఫిలాసఫీ, రోమన్లకు చట్టం సంస్కృతిని నిర్వచిస్తే, నేటి ఆధునిక తరంలో సైన్సు, సైంటిఫిక్ డిస్కవరీలు సంస్కృతిని నిర్వచించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి..శాస్త్ర సాంకేతిక విప్లవం మూలాలను పెకలించుకుంటూ పురోగమిస్తోంది..రాజకీయ,సామజిక స్థితిగతుల్లో పెనుమార్పులు తీసుకొచ్చే క్రమంలో టెక్నాలజీ జనసామాన్యానికి చేసిన మేలుతో పాటు కీడు కూడా ఉంది..ముఖ్యంగా కళారంగం మీద దాని దుష్ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందన్నది ఆర్టిస్టుల అభియోగం..అభివృద్ధి మాటున కనుమరుగైపోతున్న సంస్కృతిని గురించి నోబుల్ గ్రహీత, స్పానిష్/పెరూ రచయిత మారియో వర్గస్ లోసా 'నోట్స్ ఆన్ డెత్ ఆఫ్ కల్చర్' పేరిట కొన్ని వ్యాసాలు రాశారు.

సంస్కృతిని హైబ్రో,లో బ్రో కల్చర్ అంటూ రెండు విధాలుగా దాని నాణ్యత దృష్ట్యా విభజించడం మనకు తెలిసిందే..ఇలియట్,జేమ్స్ జోయ్స్ వంటివారి రచనలు హైబ్రో కల్చర్ కి చెందితే, ఎర్నెస్ట్ హెమ్మింగ్వే ,వాల్ట్ విట్మన్ లాంటివారి రచనలు సాధారణ పాఠకులకు అర్థమయ్యే రీతిలో లోబ్రో కల్చర్ కి చెందుతాయి..ఈ విభజన రేఖల్ని చెరిపేస్తూ రష్యన్ తత్వవేత్త మిఖాయిల్ బఖ్తిన్, ఆయన అనుయాయులు రష్యన్ ఫార్మలిజం పేరిట తెలిసో తెలియకో ఒక రాడికల్ స్టెప్ తీసుకున్నారంటారు..బఖ్తిన్ ఫిలాసఫీ సంస్కృతి మీద ప్రభావం చూపిస్తూ కళారంగంలో గణనీయమైన మార్పులకు దారితీసింది.."ఒక దశలో సంస్కృతి లేని తరం రూపొందుతుంది" అని ఇలియట్ చెప్పిన జోస్యాన్ని నిజం చేస్తూ సామాన్యతకు అసామాన్యతను ఆపాదించడం వల్ల సంస్కృతి విలువ క్రమేపీ తగ్గనారంభించింది..ఈ రచనలో లోసా టి.ఎస్.ఇలియట్ Notes Towards the Definition of Culture పేరిట రాసిన పరిశీలనాత్మక వ్యాసంలోని కొన్ని అంశాలను  ప్రస్తావిస్తారు..ఆదర్శవంతమైన సంస్కృతి వ్యక్తి, సమూహం, సమాజం ఈ మూడింటి సమన్వయ, సహకారాలతో ఏర్పడుతుందని ఇలియట్ అభిప్రాయపడతారు..ఎలైట్ క్లాసు పరిధిలో ఉండే సంస్కృతి యొక్క నాణ్యత పరిరక్షింపబడాలంటే అది మైనారిటీ కల్చర్ గా ఉండడం తప్పనిసరి అనేది ఆయన భావన..ఈ వాదన అందరూ సమానమని చాటే ప్రజాస్వామిక విలువలకూ ,లిబరల్ భావజాలాలకూ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో సాంస్కృతిక విలువలను చూసినప్పుడు ఇలియట్ జోస్యం నిజమైంది కదా అనిపిస్తుంది.

Image Courtesy Google

సాంకేతిక విప్లవంతో పాటు ప్రజాస్వామ్యాన్ని కూడా సంస్కృతి కనుమరుగవ్వడానికి ఒక కారణంగా భావిస్తారు లోసా..ప్రజాస్వామ్యంలో ఎలైట్ క్లాస్ లాగే సామజిక వర్గం కూడా నిర్వహించవలసిన అవసరమున్న వ్యవస్థ..అందునా ఎలైట్ క్లాసు స్వయంప్రతిపత్తి ఉన్న సమూహం కాదు కాబట్టి  తనకు తానుగా ప్రివిలెజ్డ్,ఆర్టిస్టోక్రసీ నుండి వచ్చిన వ్యక్తుల ద్వారా మాత్రమే అది గుర్తింపబడలేదు..ఎలైట్ క్లాస్ మూలాలు సామజిక వర్గానికి చెందిన కుల,మత,భాషలకు చెందిన వివిధ సమూహాలనుండి వ్రేళ్ళూనుకుని ఉంటాయి,ఈ వర్గాల ఆధారంగా ఎలైట్ క్లాసు ఉనికి ప్రభావితమవుతూ ఉంటుంది..నిజానికి ఇలియట్ కలలుగన్న 'హయ్యర్ క్లాస్' స్థిరమైనది కాదు, అభిరుచులను ఆసరా చేసుకుని వ్యక్తిగత నైపుణ్యంతో ఎవరైనా ఒక వర్గంనుండి మరొక వర్గంలోకి వెళ్ళవచ్చు..ఈ బదలాయింపు ఒక నియమంగా కంటే ఒక మినహాయింపుగా ఉంటుంది..ఇటువంటి వ్యవస్థ సమాజాన్ని క్రమబద్ధీకరిస్తుందని నమ్ముతారు ఇలియట్..కానీ నేటి తరంలో కేవలం విద్య ద్వారా సంస్కృతిని సమాజంలోకి అన్ని వర్గాలకూ వ్యాప్తి చెయ్యవచ్చనే భ్రమ హయ్యర్ కల్చర్ ను ఒకవిధంగా నిర్వీర్యం చేస్తోందంటారు లోసా ఎందుకంటే సంస్కృతిని జ్ఞానంతో పోల్చడం సరికాదు..దీనికి తోడు సంస్కృతి క్షీణించడానికి దాన్ని ప్రజాస్వామ్యబద్ధం చెయ్యడం కూడా మరో కారణమని అభిప్రాయపడతారు లోసా..ఒకప్పుడు కేవలం కొన్ని వర్గాల నియంత్రణలో ఉన్న సంస్కృతి, ప్రజాస్వామ్య, లిబరల్ సొసైటీలో అందరికీ అన్నీ సమానంగా అందుబాటులో ఉండాలన్న 'మోరల్ ఆబ్లిగేషన్' కారణంగా విద్య ద్వారా కళలనూ,సాహిత్యాన్నీ ప్రోత్సహించడం పేరిట అందరికీ లభ్యమవుతోంది..'అందరికీ సమానావకాశాలు' / 'అందరూ సమానం' అనే రెండు వాక్యాలకు అర్ధాలు వక్రీకరించబడి,కంప్యూటర్ కీ బోర్డు మీద టైపు చెయ్యడం వచ్చిన ప్రతివారూ రచయితలూ, ప్రచురించబడిన ప్రతిదీ సాహిత్యం అన్న తీరుగా తయారై సంస్కృతి అంతరించిపోతోంది..ఏ కళారూపమైనా సంఘాన్ని దృష్టిలో పెట్టుకుని అధికసంఖ్యలో జనానికి చేరాలన్న 'సివిక్ డ్యూటీ' (Quantity at the expense of quality) కళ యొక్క నాణ్యతను  తగ్గించింది..కొత్త సంస్కృతికి కావాల్సినదల్లా మాస్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మరియు కమర్షియల్ సక్సెస్ మాత్రమే..వెలకూ, విలువకూ తేడాలు అదృశ్యమైపోయిన తరుణంలో ఆ రెండిటినీ ఒకే అర్ధంలో వాడుతున్నారు..ఈ కాలంలో విజయవంతమైనదీ,అమ్ముడుపోయేదీ మంచిది..జనరంజకం కానిదీ, అమ్ముడుపోనిదీ చెడ్డదిగా మిగిలిపోతోంది..విలువేదైనా ఉందీ అంటే అది మార్కెట్ నిర్దేశించే  'కమర్షియల్ వేల్యూ' మాత్రమే..ఇవన్నీ ప్రక్కన పెడితే నిజానికి అప్పుడూ ఎప్పుడూ కూడా సంస్కృతి మూలాలు ఇంటి వద్ద నుండే మొదలవుతాయి..కానీ కుటుంబ వ్యవస్థ,దాని తరువాత విద్యాసంస్థలు మాత్రమే సంస్కృతిని పరిరక్షిస్తాయనుకుంటే పొరపాటే..ఒకప్పుడు సాంస్కృతిక పరిరక్షణ చర్చి ఆధీనంలో ఉండే అంశం..కానీ సంస్కృతి అంటే అనేక కార్యకలాపాల సమాహారం కాదు కదా ! అది ఒక జీవన విధానం.

ఈ వ్యాసాల్లో ఇదే అంశం మీద పలు తత్వవేత్తలు రాసిన ఇతర రచనలను కూడా ప్రస్తావించారు లోసా..వాటిలో భాగంగా ప్రస్తావించిన రచనల్లో నేను గత ఏడాది చదివిన ఫ్రెంచ్ తత్వవేత్త గై డెబోర్డ్ రాసిన 'ది సొసైటీ ఆఫ్ స్పెక్టకల్' ప్రధానంగా చర్చకు వచ్చింది..సంస్కృతి విషయంలో లోసా,డెబోర్డ్ అభిప్రాయాల్లో పూర్తి సారూప్యత ఉన్నప్పటికీ సంస్కృతి అంతరించిపోవడానికి గల కారణాలను విశ్లేషించడానికి డెబోర్డ్ ఎంచుకున్న థీమ్స్ వేరు..ఆయన వాదనలన్నీ ఆర్ట్ కు దూరంగా మార్క్సిజం ఆధారంగా సోషల్ ల్యాండ్ స్కేప్ కు మాత్రమే పరిమితమయ్యాయి..వర్చ్యువల్ రియాలిటీ,3D సినిమా లాంటివి మనం అందులో ఏర్పాటుచేసిన కృత్రిమమైన వాస్తవికతలో భాగమేమో అని భ్రమింపజేస్తాయి..వాస్తవ జీవితానికి దగ్గరగా ఉన్నామేమో అనిపించేలా ఉండే ఈ సిమ్యులేటింగ్ టెక్నాలజీ మనకు వాస్తవికత హద్దులకు ఆవలనున్న ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది..ప్రేక్షకుల చుట్టూ ఏర్పడే అనేకానేకమైన ఇమేజెస్ ఒకదానిపై ఒకటి ఓవర్లాప్ అవుతూ,ఏది నిజమో,ఏది భ్రమో తెలియని కృత్రిమమైన జీవితానుభవాన్ని కలిగిస్తాయి..అదే విధంగా మాస్ మీడియా కూడా సమాజానికి వార్తల రూపంలో అనేకానేకమైన రాజకీయ,సాంఘిక,సాంస్కృతిక,భాషా/మతపరమైన ఫ్యాబ్రికేటెడ్ ఇమేజెస్ ను తయారుచేసి అందిస్తుంది..కానీ నిశితంగా పరిశీలిస్తే ఈ ఇమేజెస్ అన్నీ వాస్తవానికి సుదూరమైన కృత్రిమమైన రిప్రెజెంటేషన్స్ మాత్రమే..సమాజపు వాస్తవిక చిత్రం స్థానంలో ఈ ఊహా దృశ్యాలు వచ్చి చేరిన సందర్భంలో వాస్తవిక జీవితం ఈ ఇమేజెస్ ద్వారా ఎలా పునః నిర్మింపబడుతుందో గై డెబోర్డ్ తన రచనలో అనేక విశ్లేషణల ద్వారా చూపించే ప్రయత్నం చేశారు..కమోడిటీ ప్రొడక్షన్ ను పెరిగేలా చేసే mass consumption మనిషిని ఒక వినియోగదారునిగా మార్చి సాంఘిక,ఆధ్యాత్మిక ,మానవీయ ప్రాముఖ్యతలనుండి దూరం చేస్తూ ఒక వస్తువుగా తయారుచేస్తోంది అంటారు డెబోర్డ్..క్యాపిటలిస్ట్ పద్మవ్యూహంలో చిక్కుకున్న మనిషి తనకు తెలీకుండానే మరో మనిషిని గూర్చిన కనీస స్పృహ లేకుండా ఏకాకి అయిపోతున్నాడు.

మరొకొందరు తత్వవేత్తల్ని కూడా పరిశీలిస్తే, మనిషి అస్తిత్వాన్ని నిరాకరించిన మిచెల్ ఫూకో,వాస్తవికత శైలిలోనే ఉంటుందన్న రోలాండ్ బార్త్,వాస్తవికత ఉనికి టెక్స్ట్ కు మాత్రమే పరిమితమన్న డెరిడా లకంటే, వాస్తవానికీ,మీడియా సృష్టించిన కాల్పనికతకీ మధ్య పరిధులు చెరిగిపోయిన ఈ తరాన్ని 'ఏజ్ ఆఫ్ సిములాక్రా' గా అభివర్ణిస్తూ ఫ్రెంచ్ సోషియాలజిస్టు జీన్ బాడ్రిల్లార్డ్ చేసిన వాదనలో స్పష్టత ఎక్కువ..బాడ్రిల్లార్డ్ అభిప్రాయం ప్రకారం నేడు నిజమైన వాస్తవికత కనుమరుగైపోయింది..నిజానికి మనం టీవీల్లో,సోషల్ మీడియాలో,మీడియా ప్రొఫెషనల్స్ ఎంపికచేసి సృష్టించే వార్తలో,ప్రొమోషన్స్,మార్కెటింగ్ యాడ్స్ లో చూసేది వాస్తవికతకు క్లోన్డ్ వెర్షన్ మాత్రమే..వాస్తవికత పూర్తి స్థాయి వర్చ్యువల్ రియాలిటీగా మారిపోగా,  'ప్రిన్సిపుల్ ఆఫ్ రియాలిటీ' మీద దాడి నైతిక విలువలపై దాడి కంటే గర్హనీయం అంటారు బాడ్రిల్లార్డ్..ఈ తరంలో ఇలా నిజాల్ని నిగ్గు తేల్చే మేథావులు లేరా అంటే ఉన్నారు గానీ, వాళ్ళు తమ తమ రంగాల్లో మాత్రమే ప్రతిభావంతులు..ఈ స్పెషలిస్టులకు తమ రంగానికి ఆవల ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలీదు..తాము సాధించిన విజయాలు సమాజంపై ఎటువంటి ప్రభావం చూపిస్తాయో కూడా కనీస అవగాహన లేదు..లోసా ఈ 'వన్ డైమెన్షనల్ మనుషుల్ని' ఏకకాలంలో ప్రతిభావంతులూ,సంస్కృతి లేని అనాగరికులు అని అంటారు..వారి సముద్రంలో నీటి బొట్టంత జ్ఞానం అందరితోనూ కలవడానికి బదులు వారిని ఏకాకిని చేస్తొందంటారు లోసా.

నేటి తరంలో 'లైట్ లిటరేచర్' అంటే సులభంగా చదవగలిగే సాహిత్యం వినోదాన్ని పంచడమే పరమావధిగా మెజారిటీ పాఠకులకు ప్రాతినిథ్యం వహిస్తోంది..సరళమైన సాహిత్యంతో చిక్కేమిటంటే అది కళాత్మకత లోపించిన సినిమాలు,తేలికపాటి ఆర్ట్ల రూపంలో పాఠకులను  కొంచెం కూడా ఎటువంటి తార్కిక దృష్టి పెట్టకుండానే తాము సంస్కృతి తెలిసిన మనుషులమనీ,నవనాగరికులమనీ భ్రమించేలా చేస్తుంది..అలాగని మునుపూ ముందూ సరళమైన సాహిత్యం లేదా అంటే, ఉంది..చక్కని సాహితీ విలువలతో కూడిన సరళమైన రచనలు చేసే నైపుణ్యం ఉన్న రచయితలు,వాటిని ఆదరించే పాఠకులూ మునుపు కూడా ఉండేవారు..ఇది జెనెరలైజ్డ్ స్టేట్మెంట్ ఎంతమాత్రమూ కాదు..కానీ ఈ రోజుల్లో సాహిత్యాన్ని చూస్తే జోయ్స్,వూల్ఫ్,బోర్హెస్,రిల్కే లాంటి వినూత్న శైలులతో ప్రయోగాలు చెయ్యగల సమర్ధత కలిగిన సాహసోపేతమైన రచయితలు బహు అరుదు..ఈ ఫాస్ట్ ఫుడ్,జంక్ ఫుడ్ కాలంలో పుస్తకం చదవడమంటే పాఠకులకు పాప్ కార్న్ తిన్నట్లు ఉండాలి..ఈ తరం పాఠకులకు సమయాభావంతో పాటు సహనం కూడా తక్కువ..అందువల్ల రచయిత నర్మగర్భంగా చెప్పే విలువైన విషయాలను ఆసాంతం చదివి ఆస్వాదించే ఓపికా,తీరికా ఉండడంలేదు..ఈ రోజుల్లో ఒక గొప్ప రచన చేసిన రచయితతో సరిసమాన స్థాయిలో చదివి ఆకళింపు చేసుకోవాలంటే పెట్టవలసిన 'ఇంటెలెక్చువల్ కాన్సంట్రేషన్' పెట్టడానికి ఎవరూ ఇష్టపడడం లేదు..ఐదువందల పేజీల పుస్తకాన్ని ఐదు గంటల్లో నెట్ఫ్లిక్ సిరీస్ లో చూసే సౌలభ్యం ఉండగా అంత సమయం వెచ్చించడం మెదడుకి పనిపెట్టడం అవసరమా అనుకుంటున్నారు..దానికి తోడు బరువైన రచనలూ,ఫిలాసఫీలూ చదివితే మెదడుకి మంచిది కాదు,అనవసరమైన ఆలోచనలు అని కొందరు పెద్దలు పిల్లలను నిరుత్సాహపరచడం,వారించడం కూడా తరచూ చూస్తూ ఉంటాము..ఈ కారణంగా కళ్ళకు పని చెప్పి మెదడుకి తాళం వేస్తోందీ తరం..కర్ట్ వన్నెగట్ స్లాటర్ హౌస్ 5 పుస్తకం మీద సుదీర్ఘకాలంపాటు పనిచేశారంటారు..గంగిగోవు పాలు గరిటెడైన చాలు తరహాలో ఒకప్పుడు ఏళ్ళ తరబడి ఒకే పుస్తకాన్ని రాసీ, తిరగరాసీ ,హంగులద్దీ తదేకంగా శ్రమించేవారు..ఇప్పుడు 'లైట్ లిటరేచర్' కు డిమాండ్ పెరగడంతో రచయితలు కూడా కుప్పలుతెప్పలుగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు..ఈ కారణంగా సంస్కృతిని నిర్వచించే మౌలికాంశమైన సాహిత్యంలో నాణ్యత లోపించి సంస్కృతి కనుమరుగవుతోంది.

ఇక ఈ కాలంలో సాహితీ విమర్శ ఒక అంతరించిపోతున్న ప్రక్రియ..ఈరోజుల్లో సోషల్ మీడియా ముఖస్తుతులూ,మార్కెటింగ్ మాయాజాలాల మధ్య నిజాయితీగా రచన నాణ్యతను తూకం వేసే పనికి ఎవరైనా పూనుకోవడం బహుఅరుదు..అందువల్ల సాహితీ విమర్శ ఉత్తుత్తి ప్రశంసలతో కూడిన సమీక్షలుగా మిగిలిపోతోంది..ఒకప్పటి 'విమర్శ'  కన్నదీ,విన్నదీ,చదివిందీ యథాతథంగా నమ్మకుండా మంచి చెడులు బేరీజు వేసుకునే దిశగా ప్రజలను ప్రోత్సహించేది..నేడు విమర్శకులు కూడా సర్కస్ లో కోతుల్లా వ్యవహరించి వినోదం పంచని పక్షంలో వాళ్ళకు ఎటువంటి ప్రాధాన్యతా లేదంటారు లోసా..దానికితోడు ఈ రోజుల్లో సాంస్కృతిక చర్చలు కూడా ఆ దారిలోనే నడుస్తున్నాయి..ఒకప్పుడు సంస్కృతి పట్ల మక్కువ,కాసింత కళాభిరుచీ ఉన్నవారు మంచి సాహిత్యం గురించో,ఒక మాస్టర్ పీస్ లాంటి సినిమా గురించో చర్చించేవారు..కానీ ఈరోజుల్లో నలుగురు కలిసే కూడళ్ళలో ,వేదికల్లో,సోషల్ మీడియాలోనూ మాట్లాడుకునే అంశాలు కూడా సామజిక శ్రేయస్సుకు ఏమాత్రం సంబంధంలేని అంశాలు..ఉదాహరణకు రియాలిటీ షోలూ,సెలెబ్రిటీల ద్వితీయ వివాహాలూ,మోడీ కన్నీళ్ళు పెట్టుకోవడం,ప్రముఖుల వ్యక్తిగత జీవితంలో గాసిప్స్ లాంటి అప్రధానమైన చౌకబారు విషయాలు నేటి హాట్ టాపిక్స్ గా చలామణి అవుతున్నాయి..యాభయ్యేళ్ళ క్రితం అమెరికాలాంటి దేశాల్లో ది న్యూయార్కర్ ,ది న్యూ రిపబ్లిక్ లాంటి పత్రికల్లో ఎడ్మండ్ విల్సన్,సొంటాగ్,బెర్జర్ లాంటి వాళ్ళు తమ వ్యాసాల ద్వారా ఒక పుస్తకాన్నో, నవలనో,కవితనో, వ్యాసాన్నో విశ్లేషించి వాటి నాణ్యతను అంచనా వేసేవారు..మరి ఇప్పుడూ ఓప్రా విన్ఫ్రె షోలూ, బుక్ క్లబ్ లూ,సోషల్ మీడియా సమీక్షలూ ఇలాంటివి  నిర్ణయిస్తున్నాయి..కళాకారుడు తన కళ ద్వారా మాట్లాడాలి,తన మాటల ద్వారా కళను అమ్ముకోకూడదు.

వినోదం పంచడమే పరమావధిగా ఉన్న నేటి మాస్ కల్చర్ గ్లాడియేటర్ సినిమాలో నియంతృత్వ రాజ్యాన్ని తలపిస్తోంది..ఈ సంస్కృతిలో వినియోగదారుడు దేవుడు..అతడికి ఏ ప్రత్యేక విద్యార్హతలూ ఉండవలసిన అవసరంలేదు..దీనికితోడు పైరసీ వచ్చాకా ప్రపంచం మరింత చిన్నదైపోయింది..హాలీవుడ్ సినిమాలను గ్లోబలైజ్ చేసేసింది,సైబెర్నెటిక్ రివల్యూషన్ ప్రపంచీకరణను మరింత వేగవంతం చేసింది..ఏ దేశానికి చెందిన సంస్కృతి అయినా సినిమా,సంగీతం,సాహిత్యం వీటి రూపేణా సమాజంలోని అన్ని వర్గాలకూ  అందుబాటులోకి వచ్చింది..అన్ని సరిహద్దుల్నీ దాటుకుని ఇన్ఫర్మేషన్ అన్ని వ్యవస్థల్లోకీ విస్తృతంగా ప్రవహిస్తోంది.. 'స్క్రీన్ ప్రపంచం' సంస్కృతి యొక్క స్పేస్ - టైమ్ ని ఏ మాత్రం నియంత్రణ లేకుండా స్థానభ్రంశం చేసి సమకాలీనమనే భావనకు అవకాశం లేకుండా చేసింది..ఒకప్పటి సంస్కృతికీ, నేటి సంస్కృతికీ వ్యత్యాసం ఏదైనా ఉంటే,ఒకప్పటి సంస్కృతి కాలదోషం పట్టకుండా తరాలపాటు నిలిచి ఉంది..ఈనాటి సంస్కృతి క్షణికం..ఇప్పుడు చూసే సినిమా పూర్తయ్యేసరికి గుర్తు ఉండదు..ఈరోజు చదివిన పుస్తకం రేపటికల్లా మరచిపోతాం..టాల్స్టాయ్,థామస్ మన్, జోయ్స్ ,ఫాక్నర్ లాంటి వాళ్ళ రచనలు వాళ్ళ జీవితకాలాల్ని మించి నేటికీ సజీవంగా నిలిచాయి..నేటి నెట్ఫ్లిక్ సోప్స్,బాలీవుడ్ మూవీస్ ,షకీరా కాన్సర్ట్స్ లాంటివి షో పూర్తయితే చాలు వాటి ఉనికిని కోల్పోతాయి..తమ స్థానంలో మరో విజయవంతమైన, తాత్కాలిక ప్రదర్శనలకు చోటు వదిలి అదృశ్యమైపోతాయి..నేటి తరంలో సంస్కృతి అంటే వినోదం,వినోదాన్ని పంచనిదేదీ సంస్కృతి కాదు.

ఈ రచనలో సంస్కృతిని నలుదిశలా వ్యాపింపజేసే టూరిజం గురించి కూడా కొన్ని పేజీలు కేటాయించారు లోసా..Gilles Lipovetsky , Jean Serroy లు La cultura-mundo (Culture-World: Response to a Disoriented Society) పేరిట రాసిన పుస్తకంలో లక్షలాది యాత్రికులు ఈనాటికీ సిసిలీ లోని Louvre,The Acropolis and the Greek amphitheaters ను సందర్శిస్తున్నారు గనుక సంస్కృతి తన విలువ కోల్పోలేదనీ,దాని గొప్పదనాన్ని నిలబెట్టుకుంటోందనే వారి వాదనను ఖండిస్తూ యాత్రికులు ఇలా చారిత్రాత్మక స్థలాలకు,గొప్ప గొప్ప మ్యూజియంలకూ కుప్పలుతెప్పలుగా తరలి వెళ్ళడం హై కల్చర్ పట్ల నిజమైన ఆసక్తితో కాదనీ, కేవలం తమకు సంస్కృతి పట్ల గొప్ప అభిరుచి ఉందని నిరూపించుకోవడానికేననీ అంటారు లోసా..అంతటితో ఊరుకోకుండా ఇటువంటి చారిత్రాత్మక స్థలాలను సందర్శించడం 'పోస్ట్ మోడరన్ టూరిస్టు' బకెట్ లిస్టులో మరో గత్యంతరం లేక చెయ్యవలసిన పని అని ఛలోక్తి విసురుతారు..ఆయనన్నట్లు నేటి యాత్రికులు స్పష్టమైన 'సాంస్కృతిక స్పృహ' కలిగి ఉన్నారని చాటడానికి ఏదైనా ఒక చారిత్రాత్మక కట్టడం,పెయింటింగ్,ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ తో తీసుకున్న సెల్ఫీ సాక్ష్యం చాలు మరి.

ఇక సంస్కృతి క్షీణించడంతో మతపరమైన కారణాలు చూస్తే,చాలా మందికి మతం ఒక అవసరం..మృత్యువు భయపెట్టినప్పుడూ,నిరాశానిస్పృహలు ఆవహించినప్పుడూ స్వాంతన చేకూరుస్తూ మతం తోడుగా నేనున్నాననే నమ్మకం కలగజేస్తుంది..అధికశాతం ప్రజలు నైతికవిలువలకు లోబడి వ్యవహరించేది కూడా మతం ద్వారానే..కొద్దిమంది నాస్తిక మైనారిటీ వర్గం  మాత్రం ఆ ఖాళీని సంస్కృతి,ఫిలాసఫీ,సైన్స్ ,సాహిత్యం,కళల ద్వారా పూడ్చుకునే ప్రయత్నం చేస్తుంది..కానీ చిక్కేమిటంటే ఆ వెలితిని సమర్ధవంతంగా పూరించగల శక్తి హయ్యర్ కల్చర్ కి మాత్రమే ఉంటుంది..జీవితంలో నిరంతరం ఎదురయ్యే సందిగ్దతలకూ,సమస్యలకూ,ఎనిగ్మాలకూ సమాధానాలు ఇవ్వగలిగింది హయ్యర్ కల్చర్ మాత్రమే అంటూ నేటి వినోద ప్రధానమైన సరదా సంస్కృతి ఆ ఖాళీని పూరించలేదంటారు లోసా.

ఒకప్పుడు ఇంగ్లాండ్ లో బెర్ట్రాండ్ రస్సెల్,ఫ్రాన్స్ లో కామూ,సాత్రే,ఇటలీ లో మొరావియా,విట్టోరినీ , జర్మనీలో గుంటర్ గ్రాస్,హన్స్ మాగ్నస్ ఎంజెన్స్బర్గర్ లాంటి విద్యావంతులూ,ఇంటెలెక్చువల్స్ ప్రముఖులుగా చలామణీ అయ్యేవారు..వీళ్ళందరూ రాజకీయ సామాజిక వ్యవహారాల్లో కీలకమైన పాత్ర పోషించేవారు..కానీ నేడు ఇటువంటి పండితులు పబ్లిక్ అఫైర్స్ లో తెరమరుగైపోయారు..కొంతమంది అడపాదడపా పత్రికలకు సంపాదకీయాలు రాస్తున్నా వాటి ప్రభావం నేటి సమాజం మీద అతి స్వల్పం..దీనికి కారణం Dominant culture లో జ్ఞానంకంటే వినోదానికీ, ఆలోచనలకంటే ఆకారానికీ, విలువైన విషయాల కంటే సాధారణ అంశాలకీ   ప్రాధాన్యత పెరిగిపోయింది..ఒకప్పటి రాజకీయవేత్తలు శాస్త్రజ్ఞులూ, ఇంటెలెక్చువల్స్ తో ఫోటోలు తీసుకుని ఎన్నికల ప్రచారాలు నిర్వహించుకునేవారు..నేడు ఎన్నికల ప్రచారానికి సినిమా నటులతోనూ,సింగర్ లతోనూ,పాప్ స్టార్ లతోను,క్రీడాకారులతోనూ ఫోటోలు   తీసుకుంటున్నారు..టీవీల్లోనూ,ఇతర ప్రచార మాధ్యమాల్లోనూ 'థింకింగ్' కి బదులు 'గ్లామర్' కి ప్రాముఖ్యత పెరిగింది..In the civilization of the spectacle, the comedian if the king..ఇటువంటి 'షో మాన్ షిప్' లో దిట్టలు కొందరు రాజకీయాల్లో చేరి ప్రెసిడెంట్ స్థాయికి ఎదగడం కూడా మనందరికీ తెలిసిన విషయమే..కానీ వీళ్ళకున్న అర్హతలేమిటి అనే ప్రశ్న వస్తే, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే అంతః సౌందర్యం,పాండిత్యం లేదా ఇంటెలెక్ట్ లాంటివి ఏవీ కాదు, కేవలం పైపై మెరుగుల సౌందర్యం,నటనా వైదుష్యం మాత్రమే..వాళ్ళు రాజకీయాల్లోకి రావడానికి అనర్హులు అని పూర్తిగా అనకపోయినా మీడియా ప్రెజన్స్,నటనాకౌశలం ఉన్నవాళ్ళ అవసరం రాజకీయాలకు లేదని అభిప్రాయపడతారు లోసా..'సివిలైజేషన్ ఆఫ్ స్పెక్టకల్' లో రాజకీయాలు కూడా సాహిత్యంలాగే దిగజారిపోయాయి..రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే దానికి అవసరమైన విలువలు, శ్రద్ధ ,విశ్వాసం లాంటి లక్షణాలకంటే 'మీడియా ప్రెజన్స్' కు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు..ఎన్నికల సమయంలో రాజకీయవేత్తలకు మొహం మీద ముడతలు,తెల్ల వెంట్రుకలు ,ముక్కు సైజు ,పళ్ళ తెల్లదనం, బట్టతల వంటివి సరి చూసుకోవడం ఎన్నికల పోలసీలు వివరించడం కంటే ముఖ్యమైపోయింది..ప్రదర్శన నిబద్ధత కంటే ముఖ్యం అయిపోయింది.

ఈ వ్యాసాల్లో భాగంగా లోసాకి ఇష్టమైన 'ఎరోటికా' కూడా చర్చకు వచ్చింది. సెక్స్ పట్ల లోసా అభిప్రాయాలు చదివాకా ఆయన రచనలపట్ల ఉండే కొన్ని అపోహలు తొలగిపోయి ఆయనపై గౌరవం రెట్టింపైంది..ఎరొటిసిజం కూడా క్రిటిసిజం,హై కల్చర్ ల లాగే కనుమరుగైపోయిందంటారాయన..సెక్స్ కు సంప్రదాయపు కట్టడినుంచి స్వేచ్ఛను ప్రసాదించాలనే దిశగా చేస్తున్న ప్రయత్నాలు నిజంగానే మంచివేనా అనే దిశగా ఇందులో పలు విశ్లేషణలు ఉన్నాయి..ఆధునిక సమాజంలో సెక్స్ గురించి బాహాటంగా,నిర్భీతిగా మాట్లాడుకోవాలనీ,అది చాటుమాటు వ్యవహారంగా ఉండడం సరికాదనే వాదనలు తరచూ వినిపిస్తున్నాయి..కానీ ఇటువంటి స్వేచ్ఛ ఒక దైవసమానమైన 'డివైన్ ఆక్ట్' ను సాధారణం పనిలా మార్చేస్తుందని అభిప్రాయపడతారు లోసా. నేటి తరానికి సెక్స్ ఒక డాన్స్ క్లాసుకో, జిమ్ కో వెళ్ళడంతో సరిసమానంగా కేవలం తమ భౌతిక అవసరాలు తీర్చుకునే ఆటలా తయారైంది. బహుశా ఈ రకం సెక్స్ సైకాలాజికల్,ఎమోషనల్ బాలన్స్ కు మంచిది కావచ్చేమో గానీ ఇలా సెక్స్ ను సాధారణమైన పనిగా మార్చడం వల్ల ఉపయోగం లేదంటారు లోసా. సెక్సువల్ లిబర్టీస్ పెరిగినా అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం సెక్స్ క్రైమ్స్ ఏవీ తగ్గడం లేదు, పైపెచ్చు ప్రేమ,ఊహాత్మకత,భావోద్వేగాలకు తావులేని 'లైట్ సెక్స్' విపరీతంగా పెరిగింది..అటువంటి సెక్సువల్ ఆక్ట్ ను పూర్తి  instinctive and animal sex గా అభివర్ణిస్తారు లోసా..ఈ తరహా సెక్సువల్ ఆక్ట్  మనిషి భౌతికావసరాన్ని తీరుస్తుంది గానీ ఇంద్రియాలనూ,భావోద్వేగాలనూ తృప్తిపరిచి,మనుషుల్ని దగ్గర చేసి జీవితాన్ని పరిపూర్ణం మాత్రం చెయ్యడంలో మాత్రం ఘోరంగా  విఫలమవుతుంది. అందువల్ల సెక్సువల్ ఆక్ట్ పూర్తైన మరుక్షణం ఎటువంటి సంతృప్తీ మిగలకుండా అందులో కృత్రిమంగా పాలుపంచుకున్న జంట తిరిగి అదే ఒంటరితనంలోకి నెట్టివెయ్యబడతారు. ఒకనాటి సాహిత్యానికీ,కళలకూ స్ఫూర్తిదాయకంగా నిలిచిన సెక్స్ నేడు పోర్న్ గా, బహిరంగ స్థలాల్లో చేసే చవకబారు  ప్రదర్శనగా మిగిలిపోయింది..సెక్సువల్ లైఫ్ ను సుసంపన్నం చెయ్యాలంటే దాన్ని దురభిప్రాయాలనుండి దూరం చెయ్యాలి గానీ, నాగరికత నుండీ,సభ్యతతో కూడిన సాంస్కృతిక ఆచారవ్యవహారాలనుండి వేరుచెయ్యడం సరికాదనీ లోసా ఘంటాపథంగా చెప్తారు.

ఒకప్పుడు సాహిత్యం,ఇతరత్రా కళలూ సామజిక సమస్యలకు అద్దం పట్టేవిగా ఉండి ప్రజల్లో సామజిక స్పృహ పెంపొందించేవిగా ఉండేవి..ఇప్పుడు సాహిత్యం ఒక ఎస్కేపిస్ట్ లిటరేచర్ లా సామజిక జాడ్యాల నుండి దూరంగా పారిపోయి బ్రతకడానికీ ,అత్యవసర సమస్యలను నిర్లక్ష్యం చెయ్యడానికీ అందుబాటులో ఉన్న ఆరోగ్యకరమైన వ్యసనంలా మిగిలిపోయింది..నేటి కళలు ప్రజలకు ఒక ఉటోపియా ప్రపంచాన్ని సృష్టించి, వాస్తవాన్ని విస్మరించడం కోసం తీసుకునే మాదకద్రవ్యాల్లా మారిపోయాయి..ఈ రచనలో లోసా సంస్కృతి కనుమరుగవ్వడం పట్ల ఒక ఆర్టిస్టుగా తనలో కలవరాన్ని వ్యక్తం చేశారు..సంస్కృతిని కాపాడుకునే దిశగా నాగరికత తెలిసిన మనిషికి ఉండాల్సిన కనీస సామజిక బాధ్యతలను గుర్తుచేసే ప్రయత్నం చేశారు..ఆయన విశ్లేషణలన్నీ సున్నితత్వానికి దూరంగా స్థిరగంభీరమైన సాధికారక స్వరంలో ఒక కళాకారుడిలో పేరుకున్న నిస్సహాయతతో కూడిన ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తాయి..కళాకారులకు తమ కళలో అత్యవసరమైన సహజత్వం,పరిపూర్ణత లోపించినప్పుడు కలిగే అసంతృప్తి లోసా స్వరంలో స్పష్టంగా కనిపిస్తుంది..ఈ వాదనలన్నీ శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికీ ,రాజకీయ సామాజిక పరిస్థితులకూ వ్యతిరేకంగా చేసినవి..ఎలైట్ క్లాసులు అభివృద్ధి పేరిట కావాలని సీతకన్ను వేస్తున్న అంశాలన్నీ ఇందులో చర్చకు వచ్చాయి..లోసా క్యాపిటలిస్టు కల్చర్ లోని చీకటి కోణాలనూ, దుష్ప్రభావాలనూ ఈ వ్యాసాల ద్వారా వెలుగులోకి తీసుకొచ్చే బాధ్యతాయుతమైన ప్రయత్నం చేశారు.

తొలి ప్రచురణ ఆంధ్ర జ్యోతి వివిధ 5th ఏప్రిల్ 2021.

https://lit.andhrajyothy.com/sahityanews/notes-on-the-death-of-culture-35553

https://epaper.andhrajyothy.com/3050947/Vijayawada-Main/05-04-2021#page/4/2

Thursday, April 1, 2021

Borges at Eighty - Jorge Luis Borges, Willis Barnstone (Editor)

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు,అందునా పుస్తకప్రియులకు కళ్ళు ఎంత అపురూపమో కదా ! ఊహ తెలిసినప్పటినుండీ దివారాత్రాలు జ్ఞానపిపాసతో సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేసిన జార్జ్ లూయి బోర్హెస్ లాంటి వాళ్ళకైతే మరీనూ..ప్రపంచ ప్రఖ్యాత రచనలెన్నో చేసినప్పటికీ ఆయన తనను తాను ఒక సాధారణ పాఠకుడిగానే చూసుకుంటారు..కానీ 'It came like a slow summer twilight' ,స్వర్గమంటే ఒక గ్రంథాలయం అని నిర్వచించిన వ్యక్తికి ఆ గ్రంథాలయం సొంతం చేసుకోగానే అంథత్వం సంక్రమించడం ఐరనీ కదా !యాభైల వయసులోనే అంధత్వం బారినపడి చేతికర్ర సాయంతో అడుగులో అడుగువేసుకుంటూ నడిచే ఆ కురువృద్ధుడు తనదైన ప్రపంచంలో తానుండే యోగిలా కనిపిస్తారు కానీ, మాట్లాడడం మొదలుపెట్టగానే ప్రముఖ వక్తలా వివిధ అంశాలకు సంబంధించి అనర్గళంగా ఉపన్యసించగలరు..సాక్ష్యం ఈ ఇంటర్వ్యూలే..అర్జెంటీనాకు చెందిన ఈ 81 ఏళ్ళ సాహితీవేత్తను చేసిన కొన్ని ఇంటర్వ్యూలను Borhes at Eighty : Conversations పేరిట పుస్తకంగా  ప్రచురించారు..రచయితగా బోర్హెస్ చాలామందికి సుపరిచితమే అయినప్పటికీ ఈ రచన, పాఠకులకు బోర్హెస్ అంతరంగాన్ని చదివే మహదావకాశం కల్పిస్తుంది.

Image Courtesy Google

ఈ పుస్తకం మొదటి భాగంలో ఆర్ట్,ఫిలాసఫీ,సైకాలజీ, ఆధ్యాత్మికత,ఆఫ్టర్ లైఫ్ వంటి అంశాలకు సంబంధించి బోర్హెస్ ను పలు వ్యక్తులు చేసిన ఇంటర్వ్యూలు ఉంటాయి..రెండో భాగంలో బోర్హెస్ రాసిన కొన్ని కవితలను గూర్చి సహేతుకమైన వివరణలతో పాటుగా ఆయనకు ఇష్టమైన కవులు వాల్ట్ విట్మన్,రాబర్ట్ ఫ్రాస్ట్, ఎడ్గర్ అలాన్ పో వంటివారి కవితా వస్తువు,శైలి మొదలగు అంశాలను గురించి అడిగిన ప్రశ్నలకు వారు రాసిన కొన్ని కవితలనుటంకిస్తూ బోర్హెస్ విస్తృతంగా చర్చించారు..కానీ తన ఇష్టమైన కవుల జాబితాలో బోర్హెస్ ఎమెర్సన్ బదులు ఫ్రాస్ట్ పేరు ప్రస్తావించడం విశేషం..ఈ పుస్తకమంతా ప్రశ్నలూ,సమాధానాలే కాబట్టి రచనలో మంచి చెడ్డలు విశ్లేషించాడనికేమీ లేదు..అందువల్ల బోర్హెస్ చెప్పిన సమాధానాల్లో నాకు నచ్చిన కొన్ని అంశాలను మాత్రం ప్రస్తావిస్తాను..ఈ రచనలో ఒక ప్రక్క చాలా లోతైన,విలువైన విషయాలు చర్చిస్తూనే బోర్హెస్ తన మార్కు హాస్యంతో విసిరిన ఛలోక్తులు ఈ సంభాషణలకు అదనపు ఆకర్షణగా నిలిచాయి..ఉదాహరణకు "మీ రాతల్లో మీరొకసారి,'నేను మా పూర్వీకుల్లా ధైర్యవంతుణ్ణి కాననీ ,శారీరకంగా పిరికివాణ్ణనీ' అన్నారు నిజమేనా ? " అనడిగితే, "అవును,My dentist knows all about it! "అన్న ఆయన మాటల్ని విని నవ్వుకోకుండా ఎలా ఉండగలం ! ఇలాంటి సరదా సమాధానాలు ఇందులో అడుగడుక్కీ ఎదురవుతాయి.

బోర్హెస్ ను ఇంటర్వ్యూ చేసిన బార్న్ స్టోన్, రాబర్ట్ ఫ్రాస్ట్ కవిత The Road Not Taken  ను గుర్తుచేసి,మీరు తప్పుడు మార్గంలో ప్రయాణించిన సందర్భాలున్నాయా ? అటువంటి ప్రయాణంలో మీకు సత్ఫలితాలు ఎదురయ్యాయా ? లేదా దుష్ఫలితాలు ఎదురయ్యాయా ? అని ప్రశ్నిస్తారు..దానికి సమాధానంగా బోర్హెస్" నేను రాసిన చెడ్డ పుస్తకాల గురించా ?" అనడుగుతారు..బార్న్ స్టోన్ అవునంటూ, "మీరు రాసిన చెడ్డ పుస్తకాల గురించీ,ప్రేమించిన రాంగ్ వుమన్ గురించీ,గడిపిన చెడ్డ రోజుల గురించీ చెప్పమంటారు..అప్పుడు బోర్హెస్ : 

"ఈ విషయంలో నేను చెయ్యగలిగింది ఏముంది ? నా జీవితంలో నేను ప్రేమించిన నాకు సరిపడని స్త్రీలూ, చేసిన చెడ్డ పనులూ, ఎదురైన చెడు సందర్భాలూ,ఇవన్నీ కవికి సాధనాలు..దొరికింది దురదృష్టమైనా సరే,కవి ఇవన్నీ తనకు సాధనాలుగా దొరికాయనుకోవాలి..దురదృష్టం,ఓటమి,అవమానం, వైఫల్యం, ఇవన్నీ మా కళాకారులకు  పనిముట్లు..సంతోషంగా ఉన్నప్పుడు ఏదైనా సృజించగలం అనుకోవడం పొరపాటు..మన తప్పటడుగులూ,పీడకలలు వీటన్నిటినీ కవిత్వంగా మలచడమే కవి చెయ్యగలిగిన పని..ఒకవేళ నేను నిజంగా కవినే అయితే నా జీవితంలో ప్రతి సందర్భంలోనూ కవిత్వముందని భావిస్తాను, ప్రతీ  క్షణాన్నీ కవిత్వంగా మలచగలిగే ఒక విధమైన మట్టిముద్దగా అనుకుంటాను..ఈ కారణంగా నా తప్పులకు నేను క్షమించమని అడగవలసిన అవసరం ఉందనుకోవడంలేదు..Those mistakes were given me by that very complex chain of causes and effects, or rather, unending effects and causes—we may not begin by the cause—in order that I might turn them into poetry."  అంటారు. 

బోర్హెస్ జన్మించిన బ్యూనోస్ ఐరిస్ జ్ఞాపకాల గురించి చెప్పమని అడిగినప్పుడు,

"నేను బ్యూనోస్ ఐరిస్ ని చూసింది చాలా తక్కువ..పలేర్మో మురికివాడల దగ్గర పుట్టాను..కానీ నాకు 29 ఏళ్ళు వచ్చేవరకూ ఆ ప్రాంతం నచ్చనేలేదు..ఒక పిల్లవాడిగా నాకున్న జ్ఞాపకాలల్లా నేను చదివిన పుస్తకాల జ్ఞాపకాలు మాత్రమే..నాకు ఆ జ్ఞాపకాలు నేనున్న పరిసరాలకంటే మిక్కిలి వాస్తవంగా తోస్తాయి..అందువల్ల నా జ్ఞాపకాలన్నీ స్టీవెన్సన్ జ్ఞాపకాలు,కిప్లింగ్ వి,అరేబియన్ నైట్స్ వి,డాన్ క్విక్సోట్ వి ('డాన్ క్విక్సోట్' నేను చిన్నపిల్లవాడిగా చదివాను,చదువుతూనే ఉన్నాను,ముఖ్యంగా  రెండవ భాగం అద్భుతం,మొదటి భాగంలో  మొదటి అధ్యాయం మినహా మిగతాదంతా హాయిగా వదిలెయ్యచ్చు.) ఇక నా బాల్యాన్ని గురించి ఏమని చెప్పాలి ! అతి కొద్ది జ్ఞాపకాలు మినహా  చెప్పడానికేముంది ! మా పూర్వీకుల ఫోటోలు గుర్తున్నాయి,వాళ్ళు యుద్ధాలలో ఉపయోగించిన ఖడ్గాలు గుర్తున్నాయి..ఇలా అతి కొద్ది వ్యక్తిగత జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి..నా జ్ఞాపకాలన్నీ ముఖ్యంగా పుస్తకాలకు సంబంధించినవే..నిజానికి నాకు నాదైన సొంత జీవితమే జ్ఞాపకం లేదు,మీకు తారీఖులూ,సంవత్సరాలూ లాంటి వివరాలు చెప్పలేను..నాకు గుర్తున్నంత వరకూ నేను 17,18 దేశాల్లో పర్యటించాను, కానీ ఇప్పుడా ప్రయాణాల క్రమం చెప్పమంటే చెప్పలేను..ఎక్కడ ఎంతకాలం ఉన్నానన్న గణాంకాలు కూడా చెప్పలేను..ఇదంతా నాకొక 'jumble of division, of images'.అందుకనే నేను పుస్తకాలను ఆశ్రయిస్తాను..ముఖ్యంగా నాతో ఎవరైనా మాటామంతీ కలిపినప్పుడు సంభాషణను పుస్తకాలవైపు మళ్ళిస్తాను, పుస్తకాల్లో చదివిన కొటేషన్స్ ను ఆశ్రయిస్తాను." అంటారు.

ఈ పుస్తకంలో స్వర్గనరకాలను గురించి బోర్హెస్ చెప్పిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి..ఇక్కడ బోర్హెస్ స్వరంలో ఒకవిధమైన అలసట,జీవితం పట్ల నిర్లిప్తత,నిరాసక్తతా ధ్వనిస్తాయి.

"డాంటే ని చదివి అందరూ భ్రమపడినట్లు నరకమనేది ఒక స్థలం కాదు, నేను దాన్నొక 'స్థితి' గా భావిస్తాను..మిల్టన్ 'పారడైజ్ లాస్ట్' లో సాతాను 'Myself am Hell' అనడం గుర్తుకొచ్చింది.."

"నేను చదివిన ఒక ఆంగ్ల మతప్రవక్త రాసిన పుస్తకంలో 'స్వర్గం అంతా దుఃఖ్ఖమయం' అంటారు..నేనది నమ్ముతాను..నిజానికి మితిమీరిన సంతోషాన్ని భరించలేము..సంతోషం ఎప్పుడూ కొన్ని క్షణాలో, కొద్దిసేపో మితంగా ఉంటే బావుంటుంది గానీ శాశ్వతమైన ఆనందం ఆలోచనలకందనిది..వ్యక్తిగతంగా నాకు మరణానంతర జీవితంపై నమ్మకం లేదు, నా ఉనికి శాశ్వతంగా అంతమైపోతుందనుకుంటాను..నేను దుఃఖ్ఖంతో ఉన్నప్పుడో, దేనికైనా చింతిస్తూ ఉన్నప్పుడో  (నిజానికి నేను ఎప్పుడూ ఏదో విషయమై చింతపడుతూనే ఉంటాను) నాకు నేను ఇలా చెప్పుకుంటాను : "ఏదో ఒక క్షణంలో మృత్యురూపంలోనో,మరో వినాశనం రూపంలోనో మోక్షం ప్రాప్తించే పాటికి ఇలా చింతించడం ఎందుకు ? మృత్యువు తథ్యం, ఏ క్షణంలోనైనా సాధ్యం,అటువంటప్పుడు అనవసర విషయాల గురించి వ్యథ పడటం ఎందుకు ?"..నేను చీకటి కోసం ఎదురుచూడడంలేదు..నాకు కావాల్సింది నన్ను అందరూ మరచిపోవడం..నిజానికి నేను ఏదో ఒక సమయంలో మనుషుల జ్ఞాపకాలనుండి చెరిగిపోతాను..కాలక్రమేణా ప్రతిదీ చెరిగిపోతుంది."

 కథలు రాస్తారు గానీ నవలలు ఎందుకు రాయరన్న ప్రశ్నకు సమాధానమిస్తూ : 

బహుశా నేను నవలా పాఠకుణ్ణి కాదు కాబట్టి నవలా రచయితను కూడా కాలేకపోయాను..ఎందుకంటే ఎంతో ఉత్తమమైన నవలలకు సైతం 'padding' అవసరమవుతుంది.. దీనికి భిన్నంగా కథలకు ఆ అవసరం ఉండదు..కథలు అవసరమైన విషయాలతో సత్తువ కలిగి ఉంటాయి..ఉదాహరణకు రుడ్యార్డ్ కిప్లింగ్, హెన్రీ జేమ్స్ రాసిన చివరి కథలూ, కాన్రాడ్ రాసిన కథలూ నా దృష్టిలో సారవంతమైనవి.ఆ మాటకొస్తే అరేబియన్ నైట్స్ కూడా,ఆ కథల్లో padding కనపడదు..సాధారణంగా నవలారూపంలో రచయిత యొక్క అలసట నా దృష్టికి వస్తుంది.

కళాకారుడిగా కళపట్ల తప్ప కీర్తి గురించి వెంపర్లాట లేని ఆ తరం రచయితలను గురించి బోర్హెస్ మాటలు చదివినప్పుడు ఒక పుస్తకం రాయగానే సన్మానాలు,గజారోహణలు అంటున్న నేటితరం రచయితలు గుర్తొచ్చారు..

"నేనెప్పుడూ కీర్తి గురించి ఆలోచించలేదు.అది నాకు పరాయి భావన..ప్రచురణ రచయిత ఉపాధిలో గానీ,రచనావ్యాసంగంలో గానీ భాగం కాదని ఎమిలీ డికిన్సన్ అంటారు..ఆమె ఎప్పుడూ తన రచనల్ని పబ్లిష్ చెయ్యలేదు..మా అందరి అభిప్రాయం కూడా అదే..మేము మైనారిటీ కోసమో,మెజారిటీ కోసమో,పబ్లిక్ కోసమో రాయడం లేదు..మమల్ని మేము సంతోషపెట్టుకోవడానికి రాసుకుంటాం,బహుశా మా స్నేహితుల్ని సంతోషపెట్టడానికి కూడా రాస్తాం..అదీ కాదూ,బహుశా మాకొచ్చిన కొన్ని ఆలోచనల్ని వదిలించుకోవాలని రాస్తాము..గొప్ప మెక్సికన్ రైటర్ అల్ఫోన్సో రెయిస్ నాతో ఏమన్నారంటే : "మనం రఫ్ డ్రాఫ్ట్స్ ని తప్పులు సరిదిద్ది మెరుగుపరుచుకోడానికి పబ్లిష్ చేస్తాం." ఆయనన్నది నిజమని నాకు తెలుసు..ఒక పుస్తకాన్ని రాశాక దాన్ని వదిలించుకోడానికీ,మర్చిపోడానికీ మేము పబ్లిష్ చేస్తాం..మేము రాసినవి పుస్తక రూపంలో కనపడగానే మాకు దానిపై ఆసక్తి పూర్తిగా పోతుంది..I’m sorry to say that people have written fifty or sixty books about me. I haven’t read a single one of them, since I know too much of the subject, and I’m sick and tired of it.

పుస్తకపఠనం గురించి మాట్లాడుతూ ,

పుస్తక పఠనం ఒక అనుభవం.ఎటువంటి అనుభవమంటే ఒక స్త్రీ వైపు దృష్టి సారించడం,ప్రేమలో పడడం,వీధి వెంబడి విలాసంగా నడవడంలాంటిదన్నమాట..వాటన్నిటిలాగే చదవడం ఒక అనుభవం,చాలా వాస్తవమైన అనుభవం.

రచనా వ్యాసంగం గురించి మాట్లాడుతూ, 
"నా అభిప్రాయంలో రచయితలు తమ జీవితకాలంలో ఒకే పుస్తకాన్ని మళ్ళీ మళ్ళీ రాస్తుంటారు.కొద్దిపాటి మార్పులతో,వైవిధ్యంతో ప్రతీ తరం ముందు తరాలు రాసినదాన్ని తిరగరాస్తూ ఉంటుంది..ఈ విషయంలో మనిషి తనంతట తానుగా స్వతంత్రించి ఏమీ చెయ్యలేడు అనుకుంటాను.ఎందుకంటే అతడు భాషను ఉపయోగించాలి,కానీ భాష అనేది ఒక సంప్రదాయం..రచయిత సంప్రదాయాల్ని మార్చగలిగినా దాన్ని అంటిపెట్టుకున్న భూతకాలన్ని విస్మరించలేడు..అందుకే మనం కొద్దిపాటి కొత్తదనంతో సాహిత్యాన్ని పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నించాలి అంటారు ఎలియట్ ..ఇక బెర్నార్డ్ షా అయితే Eugene O’Neill నుద్దేశించి అవమానకరంగా  “There is nothing new about him except his novelties,” అన్నట్లు గుర్తు..meaning that novelties are trivial."

 బోర్హెస్ గురించి బోర్హెస్ మాటల్లోనే :

"నాకు విముఖత ఉన్న అన్నిటికీ ప్రతీకగా నిలుస్తాడు బోర్హెస్..అతడు పబ్లిసిటీకి నిలబడతాడు ,ఫొటోగ్రాఫులకు పోజులిస్తాడు, ఇంటర్వ్యూలు ఇస్తాడు, రాజకీయాలకూ,అభిప్రాయాలకూ ప్రతినిధిగా ఉంటాడు,నన్నడిగితే అభిప్రాయాలన్నీ హేయమైనవంటాను..అతడు విలువలేని జయాపజయాలకు కూడా ప్రతినిధిగా నిలుస్తాడు..or, as he called them: where we can meet with triumph and disaster and treat those two imposters just the same. He deals in those things. While I, let us say, since the name of the paper is “Borges and I,” I stands not for the public man but for the private self, for reality, since these other things are unreal to me. The real things are feeling, dreaming, writing—as to publishing, that belongs, I think, to Borges, not to the I. Those things should be avoided. Of course I know that the ego has been denied by many philosophers. 

ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క వ్యాసంలో ఎన్ని కబుర్లని చెప్పగలను ! ఈ పుస్తకంలో బోర్హెస్ ప్రేమనూ,స్నేహాన్నీ ఒకదానితోనొకటి పోలుస్తూ చేసిన విశ్లేషణ ఎంత నచ్చిందంటే దాని గురించి విడిగా మరో వ్యాసం రాయాలనిపించింది..ఎంత రాసినా ఇంకా రాయకుండా ఏదో మిగిలిపోయిందన్న భావన కలిగించే పుస్తకం ఇది.ఇందులో మరి కొన్ని నచ్చిన అంశాలను గురించి మరో వ్యాసంలో మరెప్పుడైనా..అంత వరకూ హ్యాపీ రీడింగ్. :) 

పుస్తకం నుండి మరి కొన్ని వాక్యాలు :

Dante Gabriel Rossetti Poem :

I have been here before,
But when or how I cannot tell:
I know the grass beyond the door,
The sweet keen smell,
The sighing sound, the lights around the shore.
You have been mine before..

I think that one is dying all the time. Every time we are not feeling something, discovering something, when we are merely repeating something mechanically. At that moment you are dead. Life may come at any moment also. If you take a single day, therein you find many deaths, I suppose, and many births also. But I try not to be dead. I try to be curious concerning things, and now I am receiving experiences all the time, and those experiences will be changed into poems, into short stories, into fables. I am receiving them all the time, though I know that many of the things I do and things I say are mechanical, that is to say, they belong to death rather than to life.

Frost poem :

I have been one acquainted with the night. 
I have walked out in rain—and back in rain.
I have outwalked the furthest city light.
One luminary clock against the sky
Proclaimed the time was neither wrong nor right.
I have been one acquainted with the night.

Stevenson poem :

Under the wide and starry sky,
Dig the grave and let me lie.
Glad did I live and gladly die,
And I laid me down with a will.

Tennyson wrote when he was fifteen: “Time flowing through the middle of the night.”

COLEMAN: What do you mean when you say you’ve known violent men ?
BORGES: Well, a friend of mine was a murderer. A very likable fellow.

బోర్హెస్ కొన్ని కథలూ,వ్యాసాలూ,కొంత కవిత్వంతో బాటు నేను ఆయన 'బుక్ ఆఫ్ సాండ్' చదివాను..ఇందులో బోర్హెస్ "మీకు నా పుస్తకాలూ తెలిసి ఉండకపోతే రెండే రెండు పుస్తకాలు చదవమని చెబుతాను,మీరవి ఒక గంటలో పూర్తి చెయ్యచ్చు" అంటారు. అందులో ఒకటి బుక్ ఆఫ్ సాండ్.. One, a book of poems, called Historia de la luna, History of the Moon,* and the other, El libro de arena, The Book of Sand. As for the rest, you can very easily forget them, and I will be very grateful to you if you do, since I have forgotten them.

BARNSTONE: I know you don’t go in for high-sounding words because you’re a literary man.
BORGES: No, because I am too skeptical about words. A literary man hardly believes in words.

Well, I think Hume said, when I’ve looked for myself I have never found anybody at home. That’s the way the world is.

ఇందులో ప్రస్తావనకొచ్చిన బోర్హెస్ 'Remorse' అనే కవిత ఎంత నచ్చిందో చెప్పలేను..దేవుడిచ్చిన వరంలాంటి జీవితాన్ని అనవసరమైన విషయాలను గురించి బాధపడుతూ వ్యర్థం చెయ్యడం ఎంత పాపమో కదా !

I have committed the worst sin of all
That a man can commit. 
I have not been Happy.
Let the glaciers of oblivion
Drag me and mercilessly let me fall.
My parents bred and bore me for a higher
Faith.

BORGES: No, I am sorry to say I have no aesthetics. I can only write poetry and tales. I have no theory. I don’t think theories are any good, really.
BARNSTONE: You could devastate half a university with that last comment.

I think I can say that writing poetry or writing fables—it all boils down to the same thing—is a process beyond one’s will. I have never attempted a subject. I have never looked for a subject. I allow subjects to look for me, and then walking down the street, going from one room to another of my house, the small house of a blind man, I feel that something is about to happen, and that something may be a line or it may be some kind of shape. We may take the metaphor of an island. I see two tips. And those tips are the beginning of a poem, the beginning of a fable, and the end. And that’s that. And I have to invent, I have to manufacture, what comes in between. That is left to me. What the muse, or the Holy Ghost, to use a finer and a darker name, gives me is the end and the beginning of a story or of a poem. And then I have to fill it in. I may take the wrong path and have to retrace my steps. I have to invent something else. But I always know the beginning and the end. That is my personal experience.

I suppose that every poet has his own method, and there are writers, I am told, who know only the beginning, and they go on, and near the end they discover or they invent—the two words mean the same thing—the ending. But in my case I must know the beginning and the end. And I do my best not to allow my opinions to intrude on what I write. I am not thinking of the moral of the fable but of the fable. Opinions come and go, politics come and go, my personal opinions are changing all the time. But when I write I try to be faithful to the dream, to be true to the dream. That’s all I can say.

BORGES: I suppose life, I suppose the world, is a nightmare, but I can’t escape from it and am still dreaming it. And I cannot reach salvation. It’s shielded from us. Yet I do my best and I find my salvation to be the act of writing, of going in for writing in a rather hopeless way. What can I do? I’m over eighty. I am blind. I am very often lonely. What else can I do but go on dreaming, then writing, then, in spite of what my father told me, rushing into print. That’s my fate. My fate is to think of all things, of all experiences, as having been given me for the purpose of making beauty out of them. I know that I have failed, I’ll keep on failing, but still that is the only justification of my life. To go on experiencing things, to go on being happy, being sad, being perplexed, being puzzled—I am always puzzled by things and then I try to make poetry out of those experiences. And of the many experiences, the happiest is reading. Ah, there is something far better than reading, and that is rereading, going deeper into it because you have read it, enriching it. I should advise people to read little but to reread much.

BORGES: I think I am concerned with images rather than with ideas. I am not capable of abstract thinking. Even of what the Greeks did and what the Hebrews did, I tend to think not in terms of reason but of fables and metaphors. That’s my stock in trade.

BORGES: I wonder if I can answer that very complex question. Personally, I think that free will is an illusion, but a necessary illusion. For example, if I am told my past has been given me, I accept it. Whereas if I am told that I am not a free agent now, I can’t believe in it. So that free will is a necessary illusion. Of course Spinoza knew all about that when he said a stone falling could think “I want to fall.” I think that if I want to go on writing I am made to think so, not by any god, but by that long chain of causes and effects, branching out into infinity.

AUDIENCE: What should the role of the artist be in a society as threatened as ours? Can beauty survive in the ambience in which we find ourselves?
BORGES: I think that poetry and beauty will prevail. I have no use for politics. I am not politically minded. I am aesthetically minded, philosophically perhaps. I don’t belong to any party. In fact, I disbelieve in politics and in nations. I disbelieve also in richness, in poverty. Those things are illusions. But I believe in my own destiny as a good or bad or indifferent writer.

I think of myself primarily as being a man of letters. I have acquired, at long last, some skill in the writing of Spanish, not too much, but I can more or less express what I want to, and I can say it in fairly melodious language. But then people read my stories and read many things into them that I have not intended, which means that I am a writer of stories. A writer who wrote only the things he intended would be a very poor writer. A writer should write with a certain innocence. He shouldn’t think about what he is doing. If not, what he does is not at all his own poetry.

BARNSTONE: And the basis of your ethics?
BORGES: I suppose at every moment of our lives we have to choose. We have to act one way or another. As Dr. Johnson had it, we are moralists all the time, not astronomers or botanists.

JORGE LUIS BORGES: Yes. I think that that statement is true, though I said it. For example, the works of Edgar Allan Poe are read by children. I read them when I was a child. The Arabian Nights are read by children. But maybe that’s all to the good, since, after all, children read as we should read. They are simply enjoying what they read. And that is the only kind of reading that I permit. One should think of reading as a form of happiness, as a form of joy, and I think that compulsory reading is wrong. You might as well talk of compulsory love or compulsory happiness. One should be reading for the pleasure of the book. I was a teacher of English literature for some twenty years and I always said to my students: if a book bores you, lay it aside. It hasn’t been written for you. But if you read and feel passion, then go on reading. Compulsory reading is a superstition.

బ్రిటిషర్లు ఇంగ్లీష్ ని ఇండియాలో వ్యాపింపజేసి ప్రాంతీయ భాషలకు ఏదో ద్రోహం చేశారని అనుకుంటాం గానీ,వాళ్ళే ఆ పని చెయ్యకపోతే మనకి ఈ దేశవిదేశీ సాహిత్యం చదివే అవకాశం దొరికేదా అనిపిస్తుంది..బోర్హెస్ ఏమన్నారో చూడండి.  

BORGES: I suppose that Ortega had read very few novels, no?
COFFA: I wouldn’t know.
BORGES: Well, he had no English, so he missed the best novels in the world.