Saturday, February 27, 2021

సోషల్ మీడియా సాహితీవేత్త కావడం ఎలా ?

 సోషల్ మీడియా సాహితీవేత్త కావడం ఎలా ?

Image Courtesy Google

రూల్ నెంబర్ 1.సాహిత్యంలో ఒక పెద్ద తలకాయని (?) పట్టుకో,మగవాళ్ళైతే వాళ్ళ భార్యల్నీ, ఆడవాళ్ళైతే వాళ్ళ భర్తల్నీ అందమంటే అదీ,హుందాతనమంటే ఇదీ అంటూ పొగుడు.

రూల్ నెంబర్ 2.వాళ్ళకి పిల్లలుంటే చీమిడిముక్కయినా ఫర్వాలేదు చ్వీట్ క్యూట్ అని ముద్దురాకపోయినా ముద్దు చెయ్యి.

రూల్ నెంబర్ 3. నీ సాహిత్యంలో విలువల  సంగతి దేవుడికెఱుక ఇక్కడ పబ్లిసిటీ ఇంపార్టెంట్..వాళ్ళ పుస్తకాల్ని ఎండోర్స్ చెయ్యి, వాళ్ళకింకో ఆప్షన్ లేదు..కృతజ్ఞతా భారంతో కుంగిపోయి నిన్ను, సారీ..నీ  సాహిత్యాన్ని ఎండోర్స్ చేస్తారు.

రూల్ నెంబర్ 4. పెద్దవాళ్ళని కలవడానికెళ్లినప్పుడు పండో ఫలమో పట్టుకెళ్ళాలి, మోడరన్ వరల్డ్ కాబట్టి అన్ని రకాల గిఫ్టులు తీసుకెళ్ళే సౌకర్యం ఉంటుందనుకో,ఇవన్నీ నీకు ప్రత్యేకం బొట్టు పెట్టి చెప్పక్కర్లేదు, నీకు తెలుసనుకో.

రూల్ నెంబర్ 5. వాళ్ళ కు అటెన్షన్ ఇవ్వడం మర్చిపోకు..ఈరోజుల్లో అటెన్షన్ ఆక్సిజన్ తో సమానం..వీలైతే ఒక లైక్,కుదిరితే ఒక లవ్  మర్చిపోకు..నీకు పోయేదేం లేదు.

రూల్ నెంబర్ 6.నువ్వు చదివేది బి గ్రేడ్ లిటరేచర్ అని నీకూ నాకూ తెలుసు గానీ వాళ్ళకి తెలీదు కదా,చదివేసి ప్రక్కన పెట్టేసి విస్డం సంపాదించి మర్చిపోతా అని చెప్పు..చదవని ఇంగ్లీషు పుస్తకాలు అన్నీ చదివానని అనెయ్, ఇక్కడ పరీక్షలెవ్వడూ పెట్టడు కదా.

రూల్ నెంబర్ 7.ఇది అన్నిటికంటే ముఖ్యమైన రూల్..ఆత్మాభిమానం,individuality  లాంటివి ఇలాంటి విషయాల్లో పనికిరావు,ఎప్పుడైనా పెద్దాళ్ళు ఏదో చిరాకులో మొహం మీద ఉమ్మేసినా  తుడుచుకోవడం మర్చిపోకు..ఎక్కడ తలవంచాలో తెలిసినవాడిదే రాజ్యం..యమ్ ధర్మరాజు ఎం.ఏ సినిమా చూసుంటావుగా.

ప్రస్తుతానికి ఇవి చాలు..అన్నీ ఒకేసారి చెప్పేస్తే మళ్ళీ నువ్వు సలహా కోసం మళ్ళీ నా దగ్గరకు రావాలిగా.. (మాక్కూడా కాస్త లౌక్యం తెలుసు)

డిస్క్లైమర్ : Not everything I post on social media is about you.. If you think so, then put that in your pipe and smoke it.

#Twintalk

No comments:

Post a Comment