తక్కువ పదాల్లో ఎక్కువ చెప్పాలనీ,అసలేమీ చెప్పకుండా పాఠకుల ఊహకు వదిలెయ్యాలనే రచయితకు సంబంధించిన నియమాలు సమీక్షకులకు ఉండవనుకుంటా..సమీక్షకుల పని పుస్తకం ఎందుకు చదవాలో /ఎందుకు చదవనవసరం లేదో చెప్పడం వరకే.
ఒకప్పుడు రచయితకు సన్మాన సభ ఏర్పాటు చేసి పొగిడేవాళ్ళు,ఇప్పుడు సమీక్షల పేరిట పుస్తకం గురించి ఏమీ రాయకుండా ( బహుశా చదవకుండా ??? ) ముఖ పుస్తకంలో ముఖస్తుతుల పేరిట పొగడ్తలు వెల్లువెత్తుతున్నాయి..రాజకీయ నాయకులకు విద్యా, వయో పరిమితులు లాంటివి ఉన్నట్లు సమీక్షకులకు కూడా రచయితను గురించి 10% పుస్తకాన్ని గురించి 90% లాంటి లిమిట్స్ విధిస్తే బావుణ్ణు..పుస్తకంలో ఉన్న విషయాల గురించి ఒక్క ముక్క ప్రస్తావించకుండా కూడా సమీక్షలు చెయ్యవచ్చని ఫేస్బుక్ వ్యాసాలు చూస్తే తెలిసింది..అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
ఫేస్బుక్ సమీక్షలూ,రకాలు :
*ఆ పుస్తకం చదువుతుంటే నా హృదయం దూదిపింజలా ఎగురుకుంటూ అల్లంత దూరాన ఉన్న పచ్చని చెట్టు కొమ్మల్లో చిక్కుకుంది..
*నలభయ్యో పేజీ దాటగానే నా మనసు సాగర తీరంలో అలల్లా ఉవ్వెత్తున ఎగసిపడింది..
*ఇక శైలి గురించి ఏం చెప్పమంటారూ, నా ఒకాబులరీ సరిపోవడం లేదు బాబూ..
*ఆహా వాట్ ఏ రైటింగ్ , మైండ్ బ్లోయింగ్ యా..
*ఆ పుస్తకం అసలెలా ఉందో తెలుసా,నన్ను అస్సలు అడగొద్దు.. నేను చెప్పలేను..
*సాక్షాత్తూ దేవేంద్రుడే కలం పట్టుకున్నాడా అని అనుమానం వచ్చేసింది..
*అతనికి మీ తెలివేదీ..అతనికి మీ సులువేదీ ...
*కోకిల కన్నా తియ్యనివి మీ అక్షర సుస్వరాలు..
*మీరు రాయకపోతే మా లాంటి పాఠకులు ఏమైపోవాలి..
*మీ గురించి ఎంత చెప్పినా తక్కువే , మీలాంటి రచయితాగ్రేసరులు ఈ భూమి మీద పుట్టారంటే ఈ భూమి మీద ప్రతి ఇసుకరేణువూ ఎంతో పుణ్యం చేసుకుని ఉంటుంది..
*గులాబీల పరిమళం మీ కలంలో ఇంకులా ఇంకించి మా కోసం ఈ పుస్తకం రాశారు..
ఇక రెండో రకం :
పుస్తకం చదవకుండా పుస్తకం కవర్ నో, లేదా కవర్ మీద రచయిత (ముఖ్యంగా నాట్ సో పాపులర్ ఫేస్బుక్ యూజర్ ) పేరునో చూసి సమీక్షలు రాసేవాళ్ళు.
వీళ్ళు రచయితలను తిట్టే తిట్లకు ఉదాహరణలు ఇవ్వడానికి నాకున్న ఒకాబులరీ సరిపోదు.అందుకే వదిలేద్దాం.
FYI ఇది అమెజాన్ ,ఫ్లిప్కార్ట్ లలో సరసమైన ధరలకు లభ్యం :
Image courtesy Google |
No comments:
Post a Comment