Thursday, December 31, 2020

2020 Reading List

చరిత్ర పునరావృతమయ్యింది..మరో ఏడాది గుడ్ రీడ్స్ ఛాలెంజ్ లో ఫెయిల్ అయ్యాను..That's OK, failures are stepping stones అనుకునే బాపతు మనం..అయినా ఒకసారంటూ లక్ష్యం సాధించేస్తే మరో ఏడాది ప్రయత్నించాలనే ఆసక్తి పోతుంది.. :) ప్రతి ఏడాది లాగే భారీ సంఖ్యలో రిలీజ్ చేసిన అనేక బుక్ లిస్టుల్లో కోవిడ్ కారణంగా ఈ ఏడాది పుస్తకాలకు గిరాకీ పెరిగింది అని రాశారు..సాధారణంగా మల్టీప్లెక్సుల్లో కోక్ తోను,పాప్ కార్న్ తోనూ కాలక్షేపం చేసే జనం కూడా ఇల్లు కదలడానికి లేకపోయేసరికి పుస్తక పఠనం పై మొగ్గు చూపారు అంటున్నారు..బిజీ జీవితపు వేగంతో సరిసమానంగా పరిగెత్తడమే తప్ప ఎప్పుడూ తీరుబడి ఎరుగని వాళ్ళు,పుస్తకం ముట్టనివాళ్ళు కూడా ఆన్లైన్ లో పుస్తకాలు తెప్పించుకుని మరీ చదివారని వినికిడి..పుస్తక ప్రియులు బుక్ ఫెయిర్ లను మిస్ అయినా ఆన్లైన్ కొనుగోళ్లు ఆ లోటును కొంతవరకూ తీర్చుకునే అవకాశం ఇచ్చాయి.

ఇక నా విషయానికొస్తే ఈ ఏడాది గత ఏడాది కంటే మరో రెండు పుస్తకాలు తక్కువ చదివాను..నార్మల్గా వీక్ డేస్ లో కుటుంబంతో ఎక్కువ సమయం వెచ్చించే అవకాశం ఉండేది కాదు..కానీ కోవిడ్ కుటుంబంతో ఎక్కువసమయం గడిపే అవకాశం ఇచ్చింది..అందరూ ఇంట్లో ఉండడం వల్ల సహజంగానే ఈ ఏడాది పుస్తకాలవైపు మనసుపోలేదు..సో నో రిగ్రెట్స్..మొదట్లో చదువుకు రోజులో కొంతసేపు ఖచ్చితంగా కేటాయించాలని ప్రయత్నించినా,ఇంట్లో మా బుల్లి రాక్షసుణ్ణి పెట్టుకుని పుస్తకాల ఛాలెంజిలు పూర్తి చెయ్యాలనే సో కాల్డ్ unrealistic expectations సంవత్సరం మధ్యలోకి వచ్చేసరికి వదిలేయవలసి వచ్చింది...అయినా ఈ ఏడాది రాండమ్ గా ఎక్కువ పుస్తకాలు చదివాను..అందునా రియలిస్టిక్ ఫిక్షన్ కి దూరంగా జరిగే కొద్దీ పూర్తిగా చదవాలనుకునే పుస్తకాల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది..ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా క్వాలిటీ రీడింగ్ టైం ఎంజాయ్ చేశాను..యాభై అనుకున్నది 32/50 తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది..ఇవి పూర్తిగా చదివిన పుస్తకాలు..ఇక పూర్తి చెయ్యనివీ,నచ్చక సగంలో వదిలేసినవీ అరవై,డెబ్భై పైమాటే.

ఈసారి చదువు పూర్తిగా author based గా సాగింది..ప్రతీసారిలా  సింహభాగం చదివే కథలూ,నవలలూ తగ్గించి ఈ సారి కొంతమంది విభిన్నమైన రచయితలను చదివాను..లిటరరీ క్రిటిసిజం,ఫిలసాఫికల్ కాన్సెప్ట్స్ ఎక్కువగా బేస్ చేసుకుని చదివిన కొందరు : సుసాన్ సొంటాగ్,వాల్టర్ బెంజమిన్, Idris Shah, Michel Foucault, Guy Debord ,రోలాండ్ బార్త్ , ఎరిక్ ఫ్రొమ్ , హరాల్డ్ బ్లూమ్ ,బెన్ లెర్నర్ వంటి కొంతమంది సాహిత్యంలో సరికొత్త ప్లేన్స్ ని పరిచయం చేసి అభిరుచి దృష్ట్యా నా చదువును మరో మెట్టు ఎక్కించారు.

మరో ఏడాది మరిన్ని కొత్త పేజీలు చదవాలనీ,తద్వారా చరిత్రలో మరి కొంతమంది ఇంట్రెస్టింగ్ వ్యక్తుల్ని పరిచయం చేసుకోవాలనీ ,మరిన్ని ఫాంటసీ లోకాలు చుట్టి రావాలనీ ఆశిస్తూ,

Happy New Year and Happy Reading :) 



Saturday, December 26, 2020

Sum : Forty Tales from the Afterlives - David Eagleman

ఆస్కార్ వైల్డ్ అంటారు, There are only two tragedies in life : one is not getting what one wants, and the other is getting it.అని..ఈ పుస్తకంలో కథలన్నీ ఈ వాక్యం రెండో సగం నుండి మొదలవుతాయి..ఎప్పుడైనా ఏదైనా మాట అంటే ఇంట్లో పెద్దవాళ్ళు అనేవారు "పైన తథాస్తు దేవతలు ఉంటారు,అన్నీ మంచి మాటలే మాట్లాడాలి" అని..ఒకవేళ వాళ్ళన్నట్లు తథాస్తు దేవతలు నిజంగానే ఉంటే ? మనం అనుకున్నవన్నీ అయిపోతే ? మనకు భవిష్యత్తులో ఏం జరగబోతోందో  ముందే తెలిసిపోతే ? ఎదుటి మనిషి ఆలోచనలను పుస్తకం చదివినట్టు చదివెయ్యగలిగే శక్తి ఉంటే ? అప్పుడు నిజంగానే జీవించడంలో మజా ఉంటుందా ? సమాధానం మనకందరికీ తెలుసు ,"నిస్సందేహంగా ఉండదు"..ఈ పుస్తకం 'కంటెంట్మెంట్' కి అర్ధం తెలీని మనిషికి ఒక మంచి థెరపీ లాంటిది.

Image Courtesy Google

అమెరికన్ న్యూరో సైంటిస్టూ,రచయితా డేవిడ్ ఈగల్మాన్ 2009 లో రాసిన స్పెక్యులేటివ్ ,మెటాఫిజికల్ ఫిక్షన్ల జానర్ కు చెందిన ఈ 'Sum : Forty Tales from the Afterlives'  దాదాపు 28 భాషలలోకి అనువదించబడింది..ఇందులో ఉన్న నలభై కథలూ చిన్న చిన్న పిట్టకథల్లా,ఒక్కో కథా రెండు పేజీలను మించకుండా ఉంటాయి..డేవిడ్ కథల్లో ఇటాలో కాల్వినో పొదుపు కనిపిస్తుంది,అనవసరమైన ఒక్క వాక్యంగానీ,వివరం గానీ కనపడవు..అంతేకాకుండా ఆయన ఎన్నుకున్న కొన్ని థీమ్స్ కాల్వినో 'కాస్మి కామిక్స్' కథల్ని గుర్తుకు తెచ్చాయి.

ఊహలకే రెక్కలొస్తే !!! అవి అచ్చంగా డేవిడ్ ఈగల్మాన్ కథల్లా ఉంటాయి అనిపించింది ఈ పుస్తకం చదివాక..ఈ రచయిత ఊహలు ప్రసరించని చోటంటూ లేదు..డేవిడ్ కథలు నీలాకాశంలో ట్రోపోస్పియర్,స్ట్రాటోస్పి యర్ మొదలు అన్ని పొరల్నీ ఛేదించుకుంటూ ,మేఘాలూ,గ్రహమండలాలూ,ఇతరత్రా గెలాక్సీలూ అన్నీ దాటుకుని విశ్వపు పరిథులను తాకుతాయి..వాస్తవాన్ని ప్రతిబింబించే కథల్లో తన చుట్టూ ఉన్న పరిసరాల్ని దాటి ఆవలకి వెళ్ళలేని రచనలు కొన్నైతే,అస్తిత్వపు సంకెళ్ళనుండి బయటపడలేని రచనలు మరికొన్ని..జాతీయదురభిమానాలూ,వర్గవైషమ్యాలు,మతవిద్వేషాలు,లింగవివక్షలూ లాంటి ప్రాపంచిక విషయాలు మూలాధారంగా ఉండే రచనలు ఇంకొన్ని..నిజానికి అధికశాతం వాస్తవికతతో కూడిన కథలు మనిషిని ఏదో ఒక చట్రంలో కుదించకుండా కథా గమనాన్ని నిర్దేశించలేవు..కానీ అటు మానవీయవిలువలను మర్చిపోకుండా,ఇటు వాస్తవికత దృక్పథాన్ని విడిచిపెట్టకుండా నిలుచున్న చోటినుండే మరో ఫాంటసీ ప్రపంచంలోకి దృష్టిసారించి వాస్తవిక సమస్యలను చర్చించడం ఈ రచయిత కథల్లో ప్రత్యేకత.

డేవిడ్ తన కథల్లో పాత్రలను వాటి సహజమైన అస్తిత్వంనుండీ,వాటికి అలవాటైన  పరిసరాలనుండీ పూర్తిగా వేరు చేసి కొత్త కొత్త ప్రపంచాల్లోకి తీసుకెళ్ళి వదిలేస్తారు..'ఆఫ్టర్ లైఫ్' పేరిట ఆయన సృష్టించే ప్రపంచాల్లో, ఒక్కో ప్రపంచం ఒక్కో తీరుగా ఉంటుంది..ప్రతీ ప్రపంచం విభిన్నంగానూ ,కొన్ని నిర్ధిష్టమైన నియమాలకనుగుణంగానూ వ్యవహరిస్తుంది..మనిషి తన మరణానంతర జీవితంలోకి అడుగుపెట్టాకా ఆ ప్రపంచాన్ని తెలుసుకోవడం కంటే,భూమి మీద తన వాస్తవ ప్రపంచం గురించీ,ఒక మనిషిగా తన గురించీ ఎక్కువ తెలుసుకుంటాడు..ఆ విధంగా నేల మీద కథల్లో మనిషిని 'మరణానంతర జీవితం' అనే మరో కాల్పనిక ప్రపంచంలోకి తీసుకెళ్ళి ఇహలోకపు సమస్యలపై దృష్టిసారిస్తారు డేవిడ్..ఏదైనా సమస్యను దానిలో భాగంగా ఉండి చూడడంకంటే దాని నుండి విడివడి,ఒక డిటాచ్మెంట్ తో మూడవవ్యక్తిలా దూరంగా నిలబడి చూస్తేనే మనకు సమస్య మరింత స్పష్టంగా అవగతమవుతుంది..డేవిడ్ ఈగల్మాన్ కథలు మనకు అటువంటి దృక్పథాన్ని పరిచయం చేస్తాయి.

మరణానంతర ప్రపంచానికి సంబంధించిన కథలు కాబట్టి వీటిల్లో దేవుడు కూడా కీలకమైన పాత్ర పోషిస్తాడు..ఎటొచ్చీ దేవుణ్ణి కేవలం మగవాడిగా మాత్రమే సృష్టించి లింగవివక్ష చూపకుండా కొన్ని   కథల్లో 'గాడ్' ను ఒక స్త్రీగా కూడా చూపిస్తారు డేవిడ్..ఒక సందర్భంలో She knew Her humans were multidimensional అన్నప్పుడు అసలీయన ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని ఆసక్తిగా చదువుతుంటే కాసేపటికి దేవుడు అని అర్ధమయింది..దానికి తోడు కొన్ని కథల్లో ఒక్క దేవుడూ,ఒక్క దేవతా ఉండకుండా వివిధ మతాలకూ,సంస్కృతులకూ చెందిన అనేకమంది దేవుళ్ళూ,దేవతలూ కనిపిస్తుంటారు..ఒక కథలో అయితే ఈ దేవుడి హోదాను భార్యా భర్తలు ఇద్దరూ సరిసమానంగా పంచుకుంటారు..వాళ్ళు భూమి మీద మానవుణ్ణి చూసి ఒక్కోసారి జాలిపడితే మరోసారి అసూయ పడుతుంటారు,అతడి మేథను చూసి అబ్బురపడుతూ,మనిషి లాంటి మిరాకిల్ ని సృష్టించిన తమ సృజనాత్మక శక్తికి గర్వపడతారు..మనిషి తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్న తీరుగా భూమిని చేజేతులా నాశనం చేసుకుంటున్న తీరుకు బాధపడుతూ అందరికీ దూరంగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు.

ఈ కథలన్నిటికీ మరణానంతరపు ప్రపంచాన్ని వేదికగా చేసుకున్నప్పటికీ అందులో చర్చకువచ్చేవన్నీ భూమి మీద మనుషులు ఎదుర్కుంటున్న వ్యక్తిగత ,సామజిక సమస్యలే..భూమి మీద తన ఉనికి పట్ల అసంతృప్తితో ఉన్న మనిషిలో ఉత్పన్నమయ్యే పలు ప్రశ్నలకు డేవిడ్ తన కథల ద్వారా సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశారు..ఈ కధల్లో నేను మరి కాస్త పొడుగ్గా ఉంటే బావుండేది,ఇంకాస్త తెల్లగా ఉంటే బావుండేది,ఫలానా కుటుంబంలో పుట్టి ఉంటే బావుండేది,ఇంకాస్త ఎక్కువ కాలం బ్రతికితే బావుండేది,సమాజం అలా కాక ఇలా ఉంటే బావుండేది,ప్రజాస్వామ్యం బదులు కమ్యూనిజం / సోషలిజం ఉంటే బావుండేది,వృద్ధాప్యం రాకుండా ఉంటే బావుండేది లాంటి 'What if' ప్రశ్నలన్నీ ఒక్కొక్కటిగా చర్చకు వస్తాయి..మరణానంతరం దేవుళ్ళు కూడా "మనం ఇన్ని ఇచ్చినా,పాపం మనిషి జీవితమంతా ఏదో ఒక లోటు వెతుక్కుంటూ అసంతృప్తిగానే బ్రతికాడు కదా,ఇప్పుడైనా అతడి కోరికలు తీరుద్దాం" అనే ఏకాభిప్రాయంతో చాలా ఉదారంగా వ్యవహరిస్తూ అతడు అనుకున్నవన్నీ ఇచ్చి అతడి కోరికలు తీర్చే ప్రయత్నం చేస్తుంటారు..కానీ అన్ని కోరికలూ తీరిన మానవుడు సంతోషంగా ఉన్నాడా ? తెలుసుకోవాలంటే ఈ పుస్తకం తప్పకుండా చదవండి.

ఈ సంవత్సరం నేను చదివిన అన్ని పుస్తకాల్లోకీ,ఒక మూసలో లేకుండా ఫిక్షన్,నాన్ ఫిక్షన్ లను కలబోసి కొత్త పంథాలో ఎక్స్పెరిమెంట్ చేసిన ఈ రచన చాలా ప్రత్యేకంగా అనిపించింది..ఇందులో నచ్చిన ఒక్క కథను ఎంచుకోవడం నా వరకూ అసంభవం..కానీ Mirrors, Quantum కథలు కొంచెం ఎక్కువ నచ్చాయని చెప్పగలను..ఒక్క చిన్న కథ చెప్పి ఈ వ్యాసం ముగుస్తాను.

తాను సృష్టించిన మనుషుల మీద ప్రేమతో దేవత (గాడ్) మంచి వాళ్ళకి స్వర్గం,చెడ్డవాళ్ళకి నరకం ఇవ్వాలన్న రూల్ ని అమలులో పెట్టలేక తెగ సతమతమవుతూ ఉంటుంది..ఆమెకు రాత్రి నిద్రపట్టదు,పగటి పూట కూడా మోపింగ్ చేసుకుంటూ ఈ విషయాన్ని సుదీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది..ఆలోచించగా ఆలోచించగా తన స్వంత పిల్లల పట్ల పక్షపాత ధోరణి సరికాదనే నిర్ణయానికి వస్తుంది..భూమ్మీద ఎలాగూ ఈ వర్గ తారతమ్యాలు ఉన్నాయి కదా ! కనీసం మరణానంతరం అయినా అందరూ సంతోషంగా ఉండాలనీ,స్వర్గ సుఖాలు అనుభవించాలనీ కోరుకుంటూ పాపపుణ్యాలతో సంబంధం లేకుండా అందరినీ స్వర్గంలో చేర్చాలని ఆదేశిస్తుంది..ఆ విధంగా మరణించిన వాళ్ళందరూ స్వర్గం చేరతారు..నరకం పూర్తిగా నిషేధించడబడుతుంది.మరి ఆమె ఆశించినట్లు అందరూ ఆనందంగా ఉన్నారా ? సమాధానం భలే సరదాగా ఉంటుంది.చదవండి.  'The Communists are baffled and irritated, because they have finally achieved their perfect society, but only by the help of a God in whom they don't want to believe. The meritocrats are abashed that they're stuck for eternity in an incentiveless system with a bunch of pinkos. The conservatives have no penniless to disparage; the liberals have no downtrodden to promote.

So God sits on the edge of Her bed and weeps at night, because the only thing everyone can agree upon is that they're all in Hell.' :) 

పుస్తకం నుండి కొన్ని నచ్చిన వాక్యాలు :

The missing crowds make you lonely. You begin to complain about all the people you could be meeting. But no one listens or sympathizes with you, because this is precisely what you chose when you were alive.

There are three deaths. The first is when the body ceases to function. The second is when the body is consigned to the grave. The third is that moment, sometime in the future, when your name is spoken for the last time.

చరిత్రకు ఎటువంటి authenticity ఉండదనీ,జ్ఞాపకాలు చరిత్రను ఎలా ప్రభావితం చేస్తాయో చెబుతూ రాసిన కథ ఒకటి ఉంది..అది ఒక ఆణిముత్యం.ఈ క్రింది వాక్యాలు అందులోవి.

The cheerless woman across the way is praised as a saint, even though the roads in her heart were complicated. The gray-haired man at the vending machine was lionized as a war hero, then demonized as a warlord, and finally canonized as a necessary firebrand between two moments in history. He waits with aching heart for his statues to fall.And that is the curse of this room: since we live in the heads of those who remember us, we lose control of our lives and become who they want us to be.

"Your fantasies have cursed your realities".

But they're both wrong. In truth, God lives a life very much like ours—we were created not only in His image but in His social situation as well. God spends most of His time in pursuit of happiness. He reads books, strives for self-improvement, seeks activities to stave off boredom, tries to keep in touch with fading friendships, wonders if there's something else He should be doing with His time. Over the millennia, God has grown bitter. Nothing continues to satisfy. Time drowns Him. He envies man his brief twinkling of a life, and those He dislikes are condemned to suffer immortality with Him.

Very few people visit Him anymore. He finds Himself lonely and misunderstood. He often invites over men like Martin Luther King, Jr., and Mahatma Gandhi, and together they sit on the porch drinking tea and lamenting about movements that sweep over the tops of their founders.

These reunions reveal a group of individuals touchingly searching for a common theme. They appeal to your name as a unifying structure, but they come to realize that the name that existed on Earth, the you that moved serially through these different identities, was like a bundle of sticks from different trees. They come to understand, with awe, the complexity of the compound identity that existed on the Earth. They conclude with a shudder that the Earthly you is utterly lost, unpreserved in the afterlife. You were all these ages, they concede, and you were none.

Does understanding the mechanics of attraction suck all the life out of it ?

Tuesday, December 22, 2020

If I Have to Say It - A Poem by Frida Kahlo

ఈ మధ్య ఏదో లిటరరీ రిఫెరన్సు కోసం వెతుకుతుంటే ఆర్టిస్ట్ ఫ్రిడా కాహ్లో తన భర్త డియాగో రివెరానుద్దేశించి రాసిన ఈ కవిత కనిపించింది..ఇప్పటివరకూ ఆమె చిత్రాల్ని చూడడమో,అంతకుమించిన ఆమె కాంట్రవర్షియల్ లైఫ్ స్టైల్ గురించి అక్కడక్కడా చదవడమో తప్ప ఫ్రిడా కవితలు కూడా రాస్తారన్నఎరుకలేదు..ఈ కవిత చదివాక ఆమె మరికొన్ని కవితలు చదివాను..కొన్ని కవితల్లో ఫ్రిడా స్వరంలో అంతర్లీనంగా కమలా దాస్ స్వరం ధ్వనించినట్లనిపించింది..తొలిపంక్తులు చదువుతున్నప్పుడు ఈ 'మెక్సికన్ కమలా దాస్' తన చిత్రాల వెనుక నీలెక్క నాకేంటన్నట్లు సర్వస్వతంత్రురాలిలా,ధీరవనితలా కనిపిస్తుంది కదా,మరి ఈ కవితలో ఇంతటి మనోదౌర్బల్యం, దైన్యమేమిటబ్బా అనుకున్నాను..ఈ కవిత చదువుతున్నప్పుడు నాకు తెలిసిన ఫ్రిడా ఈమె కాదే అని ఆమెను వెతుక్కుంటూ చదివాను..ఆమె స్థిరగంభీరమైన వ్యక్తిత్వం భర్త డియాగో విషయానికొచ్చేసరికి పేలవమైన రూపుదాల్చడంలో మర్మమేమిటో !! బహుశా ప్రేమ కావచ్చు !! కానీ చివర్లో ఆమె ఇవన్నీ నిన్ను అడగాల్సొస్తే అవేమీ నాకు అక్కర్లేదు పొమ్మంటుంది చూశారా,అప్పుడు మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ ఫొటోల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడే ఫ్రిడా మళ్ళీ కనిపించింది.

Image Courtesy Google

ఏదేమైనా ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిస్టులను కొందర్ని చూసినప్పుడు వారిలో ఆత్మన్యూనతపాళ్ళు చాలా ఎక్కువ అనిపిస్తుంది..ఈ న్యూనతలూ ,బలహీనతలూ , వైఫల్యాలు ,నైరాశ్యాలూ , సమాజంలో ఇమడలేకపోవడాలూ , తత్పరిణామంగా నిరంతరం జరిగే అంతః సంఘర్షణలోనుండే కదా అద్భుతమైన ఆర్ట్ పుడుతుంది..మెదడునిండా గ్యాప్ లేని ఇంటెలెక్ట్,రేషనాలిటీ,లాజిక్ వీటన్నిటితో నిండిన సాధారణ వ్యక్తులు (నాలాంటివాళ్ళు ? :) ) ఒక చిన్న పీస్ ఆఫ్ ఆర్ట్ కూడా సృజించలేకపోవడానికి కారణం బహుశా ఇదేనేమో కదా !! 'స్పష్టత' సృజనకు ప్రధాన శత్రువు.

ఆమె అంటోంది "నేను నిన్నేమీ అడగను,నీవే తెలుసుకోవాలి..నిన్ను అడగాల్సివస్తే అది నాకొద్దు" అని.. ఫ్రిడా, నువ్వు పైకి కనిపించేటంత రాడికల్ కాదు సుమా :) నేటితరంలో అందరం 'స్ట్రెయిట్ ఫార్వర్డ్' , ఆమెలా ఓల్డ్ ఫ్యాషన్డ్ తరం కాదు కదా..మనకి సమయం చాలా విలువైనది,"క్యా పతా కల్ హో నహో"..ఈ క్షణం చేతిలోంచి జారిపోయేలోగా దాన్ని అర్జెంటుగా జీవించెయ్యాలి అని మేనేజ్మెంట్ గురువులు బోధిస్తూ ఉంటారు..అందుకే ఈ తరానికి రొమాన్స్ కు నిర్వచనాలు తెలీదు..'When all is said and done' మిగిలేదేమిటి !! ఎవరి మొబైల్ ఫోన్లు వాళ్ళు చెక్ చేసుకోవడం తప్ప..ఇదే విషయాన్ని మరో కాంటెక్స్ట్ లో మన ముళ్ళపూడి బాపు సినిమా 'పెళ్ళిపుస్తకం' లో విలన్ మాటల్లో నర్మగర్భంగా ఇలా చెప్పిస్తారు : "ఒలిచిన అరటిపండుకీ,ఒలుచుకు తినే అరటిపండుకీ తేడా లేదూ ?"  అంటూ..ఆర్టిస్టులు వెర్రివాళ్ళు కాదు వారికీ విషయం బాగా తెలుసు..ఫ్రిడా కు కూడా ఖచ్చితంగా తెలుసు.

ఆమె కవిత 'If I Have to Say It' కు నా స్వేఛ్ఛానువాదం :

నన్ను ముద్దాడమని నేను నిన్ను అడగబోవడం లేదు.

నువ్వు పొరపాటో,తప్పో చేశావని నాకు నమ్మకంగా తెలిసినప్పుడు కూడా నన్ను క్షమాపణ కోరమని అడగబోవడంలేదు.

నీ సాన్నిహిత్యం నాకు చాలా అవసరమైనప్పుడు నన్ను నీ కౌగిలిలో బిగించి సేద తీర్చమని అడగబోవడంలేదు.

లేదా మన పెళ్ళిరోజు నన్ను విందుకి ఆహ్వానించమని నిన్ను అడగబోవడంలేదు. 

కొత్త అనుభవాలకోసం ప్రపంచాన్ని చుట్టివద్దాం రమ్మనో లేదా ఆ కొత్త నగరంలో ఉన్నప్పుడు నాచేతిని నీ చేతిలోకి తీసుకొమ్మనో అంతకంటే అడగబోవడం లేదు.

అబద్ధమే అయినప్పటికీ నేను ఎంతటి సౌందర్యరాశినో చెప్పమనీ,లేదా నాకు అందమైన పదాలతో ఏర్చికూర్చిన లేఖ రాయమనీ నిన్ను అడగబోవడంలేదు.

నీ రోజు ఎలా గడిచిందో చెప్పడానికో, లేదా నన్ను మిస్ అయ్యావని చెప్పడానికో నాకు కాల్ చెయ్యమని నిన్ను అడగబోవడం లేదు.

నీ మీద ప్రేమతో నీకోసం నేను చేసిన ప్రతి చిన్న పనికీ కృతజ్ఞతలు చెప్పమనీ,నా చిరాకుపరాకుల్లో నా గురించి చింతపడమనీ నిన్ను అడగబోవడంలేదు.

అంతేకాదు,నా నిర్ణయాలకు వెన్నుదన్నుగా నిలబడమని కూడా నిన్ను అడగబోవడంలేదు. 

నీకు చెప్పడానికి నా దగ్గర కథలూ,బాసలూ,ఊసులూ కోకొల్లలున్నా, అవన్నీ తీరిక చేసుకుని  వినమని నిన్ను నేను అడగబోవడం లేదు.

కనీసం నిన్ను నా తోడూ నీడగా నాతో కడదాకా ఉండమని కూడా అడగబోవడం లేదు.

ఎందుకంటే ఒకవేళ ఇవన్నీ నేను నిన్ను అడిగి సాధించుకోవాల్సిన పక్షంలో 

అవేమీ నాకు అఖ్ఖర్లేదు.


If I Have to Say It

I’m not going to ask you to kiss me,

neither ask for forgiveness when I believe that you have done wrong,

or that you have made a mistake.

Nor am I going to ask you to hug me when I need it the most,

or to invite me to dinner on our anniversary.

I’m not going to ask you to go around the world

to live new experiences, much less

ask you to give me your hand when we are in that city.

I’m not going to ask you to tell me how pretty I am,

even if it’s a lie or that you write me anything nice.

Nor will I ask you to call me to tell me

how your day was or tell me you miss me.

I’m not going to ask you to thank me for everything I do for you,

for you to worry about me when my moods are down

and of course I will not ask you to support me in my decisions.

I’m not going to ask you to listen to me when I have a thousand

stories to tell you.

I’m not going to ask you to do anything,

not even to stay by my side forever.

Because if I have to ask you,

I do not want it anymore.

- Frida Kahlo, to her husband, Diego Rivera. 

Friday, December 18, 2020

What Are You Going Through - Sigrid Nunez

జనంతో కిక్కిరిసిన సభాస్థలిలో ఒక ప్రఖ్యాత రచయిత నేటి క్లైమేట్ క్రైసిస్ గురించి ప్రసంగిస్తారు..ప్రసంగంలో ఆయన ఉటంకించిన అతి ముఖ్యమైన అంశాలకంటే ప్రసంగం ముగిశాక ఆయన ప్రశ్నలేవీ తీసుకోకపోవడం శ్రోతలకు హాట్ టాపిక్ గా మారుతుంది..కొందరు హమ్మయ్య అయిపోయింది అంటూ ఉసూరుమంటూ లేస్తారు..మరికొందరు ఏ కేఫ్ కి వెళ్ళి కాఫీ తాగుదామా అని చర్చించుకుంటూ బయటకు వస్తారు..ఇంకొందరు అతనికి పిచ్చిపట్టింది,పిల్లల్ని కనద్దంటాడేమిటీ అని బుగ్గలు నొక్కుకుంటారు,అతడి ప్రసంగంలో భవిష్యత్తు పట్ల ఆశావహ దృక్పథం అణుమాత్రమైనా ధ్వనించలేదు,బొత్తిగా పెస్సిమిస్టు లా ఉన్నాడే అనుకుంటారు..తన Ex బాయ్ ఫ్రెండ్ స్పీచ్ గురించిన ఈ తీర్పులన్నీ చెవిన పడుతుండగా మన ప్రొటొగోనిస్ట్ (పేరు తెలియని మధ్యవయసు అవివాహిత అయిన రైటర్) మనకు కథ చెప్పడం మొదలుపెడుతుంది.

"You don’t care what people think about you anymore.”
 “Of course I do. But, like most people, I’ve spent way too much time caring about what other people think of me. My image. My reputation. I’m not sure they ever really mattered, or at least not as much as I thought they did. Not that I can’t name far stupider things I’ve wasted half my life thinking about. I’m obsessed these days with the kinds of things people are paying attention to in spite of the elephant herd in the room. I get a kick out of the New York Times home page, scrolling down from the ghastly headlines to their better living feature or whatever it’s called: How to have better posture. How to clean your bathroom. How to pack a school lunch."
Image Courtesy Google

అమెరికన్ రచయిత్రి సిగ్రిడ్ నూనెజ్ నాకు ఒక రచయిత్రిగా కంటే సుసాన్ సొంటాగ్ కుమారుడు డేవిడ్ రీఫ్ గర్ల్ ఫ్రెండ్ గానే మొదట పరిచయం అయ్యారు..బెంజమిన్ మోసర్ రాసిన 'సొంటాగ్' బయోగ్రఫీలో నూనెజ్ కు  సొంటాగ్,డేవిడ్ రీఫ్ లతో గల వ్యక్తిగతానుభవాలను గూర్చి కొన్ని పేజీలు కేటాయించారు..అసలు నూనెజ్ రాసిన సొంటాగ్ బయోగ్రఫీ 'సెంప్రే సుసాన్' చదువుదామని ముందు అనుకున్నదే కానీ మోసర్ బయోగ్రఫీ దానికంటే మరింత విస్తృతంగా ఉందని అనిపించడంతో అది చదవడం జరిగింది..నిజానికి 2018 లో నేషనల్ బుక్ అవార్డు గెలుచుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న నూనెజ్ మరో రచన 'ఫ్రెండ్స్' వెలువడేవరకూ ఆమె లైమ్ లైట్ లోకి రాలేదు అంటారు..'ఫ్రెండ్స్' కూడా ఎప్పటిలాగే నా టు-రీడ్ పైల్ లో ఎక్కడో అడుక్కి వెళ్ళిపోయింది..చివరకు ఆమె ఇటీవల రాసిన 'What Are You Going Through' (2020) తో సిగ్రిడ్ నూనెజ్ ను చదవడం జరిగింది.

మనిషి విచిత్రమైనవాడు..అతడు ఈ భూమ్మీద అన్ని జీవరాశులతోనూ కలిసి తిరుగాడే ఒక రెండుకాళ్ళ జంతువు మాత్రమేనన్న విషయం తరచూ మర్చిపోతుంటాడు..తన మేథస్సుతోనూ,దాని వెన్నంటే వచ్చిన అహంతోనూ  తాను ఈ పర్యావరణంలో ఒక పరమాణువంత భాగమేనని మర్చిపోయి,తనను దానికి అతీతుడనని  భ్రమ పడతాడు..ఎవరికైనా క్యాన్సర్ అని తెలిస్తే 'అయ్యో పాపం' అని సానుభూతి వ్యక్తం చేస్తాం,మనకు రాదనే నమ్మకం..ఎవరైనా మరణించారని వింటే 'రెస్ట్ ఇన్ పీస్' చెప్పి మళ్ళీ మన దైనందిన వ్యవహారాల్లో మునిగిపోతాం, మరణం మన దరిచేరదని నమ్మకం..భూమి మీద సహజవనరులు అన్నీ క్షయమైపోతున్నాయి,వాతావరణ సమతౌల్యం దెబ్బతింటోందని ఎన్విరాన్మెంటలిస్టులు,ఎకాలజిస్టులు గగ్గోలుపెడుతున్నా మన వాహనాల వాడకం,పెట్రోల్ వినియోగం ఆపం,పట్టణీకరణ పేరిట భూబకాసురుల్లా యథేచ్ఛగా చెరువుల్ని మూసేసి భవంతులు నిర్మించడం ఆపం..భూమి మీద అనునిత్యం పెరుగుతూ పోతున్న జనాభాకు సరిపడే వనరులు లేవనీ,ముందుతరాలు ఆకలి,దాహం,వేడిమి తట్టుకోలేని కడు దుర్భరపరిస్థితులు ఎదుర్కోవలసి  వస్తుందని హెచ్చరిస్తున్నా పిల్లల్ని కనడం మానం..ఏదైనా మన వరకూ రాదనే నమ్మకం....'తిరస్కరణ'(Denial) ..“Man Is The Only Creature Who Refuses To Be What He Is.” అని ఆల్బర్ట్ కామూ అన్నమాట గుర్తొచ్చింది...The power of denial. It’s happened more than once: a girl finds herself giving birth, in a high school bathroom, say, and later reveals that she’d had no idea she was pregnant, the many changes taking place in her body having been attributed by her to—whatever. The boundless capacity of the human mind for self-delusion: my ex was certainly not wrong about that. అంటుంది ప్రొటొగోనిస్ట్.

I don’t know who it was, but someone, maybe or maybe not Henry James, said that there are two kinds of people in the world: those who upon seeing someone else suffering think, That could happen to me, and those who think, That will never happen to me. The first kind of people help us to endure, the second kind make life hell.

మునుపెన్నడూ లేనంతగా శాస్త్రసాంకేతికరంగం పురోభివృద్ధి కారణంగా అందుబాటులో ఉన్న సౌకర్యాలతో నూటికి డెబ్భై శాతం మంది ఆటో పైలట్ మోడ్ లో జీవితాన్ని ఆడుతూ పాడుతూ గడిపేస్తున్నాం..ఆ రచయిత ప్రసంగంలో చెప్పిన కటువైన నిజాలను ఎస్కేపిస్టు మనస్తత్వంతో తిరస్కరిస్తాం..మనం స్వేచ్ఛాజీవులం (అనుకుంటాం అంతే) ..కానీ మన సో కాల్డ్ స్వేఛ్చతో అభివృద్ధి పేరిట మనం చెల్లిస్తున్న భారీ మూల్యం ఏమిటో గ్రహించమని సున్నితంగా హెచ్చరిస్తుందీ రచన..వినాశనానికి దారితీస్తున్న అటువంటి స్వేఛ్చ కంటే మనుషులు బానిసలుగానే ఉండడం బెటర్ అంటూ, Again, how had a supposedly freedom-loving people allowed this to happen? Why were people not outraged by the very idea of surveillance capitalism? Scared right out of their wits by Big Tech? An alien one day studying our collapse might well conclude: Freedom was too much for them. They would rather be slaves. అంటారు.

ఈ నవలలో ప్రొటొగోనిస్ట్ మనకు తన దైనందిక జీవితంలో ఎదురయ్యే అనేకమంది వ్యక్తుల గురించీ ,వారి అనుభవాలను గురించీ చెప్తూ ఉంటుంది..ఇందులో మూలకథతో పాటు అనేక చిన్న చిన్న ఉప కథలు ఉన్నప్పటికీ,ముఖ్య పాత్రలు మూడే ఉంటాయి..ప్రోటోగోనిస్ట్,క్యాన్సర్ బారినపడి మరణానికి చేరువలో ఉన్న ఆమె స్నేహితురాలు (సొంటాగ్ కీమో థెరపీ అనుభవాలనుండి రాశారనిపించింది ),ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ (రచయిత) : ప్రధానంగా వీరి  ముగ్గురి చుట్టూ కథ నడుస్తుంది..పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి ఎన్నో పుస్తకాలు వచ్చాయి..ఇది మరణానికి చేరువలో ఉన్న మనుషుల అనుభవాల ఆధారంగా రాసిన  When breath becomes air, Tuesdays with Morrie, The Last Lecture వంటి మెమోయిర్స్, టాల్స్టాయ్ The Death of Ivan Ilyich వంటి పుస్తకాల కోవకి చెందిన రచనే అయినప్పటికీ,ఇందులో మనసును మెలితిప్పే అంశాలమీ కనపడవు..ఈ నేరేషన్ లో ఒక ప్రత్యేకత ఉంది..ఇందులో మూలాంశం మృత్యువు అయినప్పటికీ, కథనం విషయంలో మరీ లోతుగా వెళ్ళిపోకుండా పాఠకులపై భావోద్వేగాల వత్తిడిపడకుండా జాగ్రత్తపడ్డారు నూనెజ్..ఆమె శైలిలో సరళత్వంతో కూడిన విలక్షణత ప్రత్యేకం ఆకట్టుకుంటుంది.

'ఆయినా ముఝసే మేరీ పెహలీసీ సీ సూరత్ మాంగే' అంటూ మహేష్ భట్ సినిమాలో అనుపమ్ ఖేర్ పాట అనుకుంటా, చిన్నప్పుడెప్పుడో ఇష్టంగా వినేదాన్ని..వృద్ధాప్యాన్ని చేరుకున్న ఒక మహిళ తన అందవిహీనమైన (?) రూపాన్ని చూసుకుని ఒక సందర్భంలో All those years ago I died, and I’ve been a ghost ever since. I’ve been mourning my lost self ever since, and nothing, not even my love for my children and grandchildren, can make up for it అంటుంది..Again denial..తన వయసుని డిగ్నిఫైడ్ గా అంగీకరించి,మీరు చాలా యంగ్ అండీ అని ఎవరన్నా అంటే ఒళ్ళుమండుతుంది అనే ఉర్సులా లెగైన్ గుర్తుకువచ్చారు.. :) ఇందులో అందం గురించీ,వృద్ధాప్యం,వయసు పెరగడం గురించి రచయిత్రి రాసిన అనేక విషయాలు ఆ పాటను గుర్తుకు తెచ్చాయి..హీరో శోభన్ బాబు తనను ప్రేక్షకులు అందగాడిగానే గుర్తుపెట్టుకోవాలి అని నిర్ణయించుకుని వృద్ధాప్యంలో లైమ్ లైట్ కి దూరంగా ఉన్నారంటారు..అడుగడుగునా ఈ తరహా 'Human Denial' ఎంత విచిత్రంగా ఉంటుందీ అంటారు నూనెజ్..ఆవిడ రాసిన అనేక హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్ ని చూస్తే మనిషి జీవితంలో ఏ ఒక్క దశలోనూ 'denial' తప్ప 'acceptance' అనేది కనపడదు..బాహ్య సౌందర్యం పట్ల వెర్రి వ్యామోహం కారణంగా ఇతరులు తమనెలా చూస్తున్నారోననే ఆత్మ న్యూనతతో నిరంతరం భయపడుతూ ఛస్తూ బ్రతికేవాళ్ళు నేటి సమాజంలో కోకొల్లలు..Again denial.

And was it so crazy? After all, always hating the way she looked, always fighting against her own body and always, always losing the battle meant that she was depressed all the time, more depressed than her sister had been about getting cancer.

Long before the arrival of FaceApp, I remember once hearing someone say that everybody, sometime in their youth— say around when they finished high school—should be given digitally altered images showing how they’ll probably look in ten, twenty, fifty years. That way, this person said, at least they could be prepared. Because most people are in denial about aging, just as they are about dying.Though they see it happening all around them, though the example of parents and grandparents might be right under their nose, they don’t take it in, they don’t really believe it will happen to them. It happens to others, it happens to everyone else, but it won’t happen to them.

ఈ రచనలో మరో ఆసక్తికరమైన అంశం : పెయింటర్ డోరా కారింగ్టన్ (Dora Carrington) ,రైటర్ లిట్టన్ స్ట్రాచే (Lytton Strachey) ల ప్రేమ కథ..ఇది నేను తొలిసారిగా విన్నాను..ఆమెకు అతడు గే అని తెలుసు,వర్జీనియా వూల్ఫ్ ను ఒకసారి ప్రొపోజ్ చేశాడని తెలుసు,తనకంటే పదమూడేళ్ళు పెద్దవాడని తెలుసు (సొంటాగ్,ఫిలిప్ రీఫ్ గుర్తొచ్చారు)   A scandal from the start, theirs became a legendary story. Indeed, it is not for her painting but for her endless, hopeless love of Strachey, how it shaped her life, how it caused her death, that Carrington is known (that kind of woman’s story). For seventeen years, she was devoted to him. Not even her marriage to another man could separate them; all three had to live together. But then the man she married was not her but his object of desire. Having agreed to the marriage, she wrote a poignant letter to Strachey, lamenting the fate that made it impossible for the two of them to become man and wife. Then all three went to Venice on honeymoon together. When Strachey died, of stomach cancer, Carrington survived less than two months before shooting herself. In the stomach. She was just shy of thirty-nine. Not her first suicide attempt. “There is nothing left for me to do,” she had told the Woolfs the day before. “I did everything for Lytton.” అన్నట్లు రచయిత D. H. Lawrence 'విమెన్ ఇన్ లవ్' కి స్ఫూర్తి వారి ప్రేమకథ పట్ల ఆయనకున్న అబ్సెషనేనట. 

ఈ నవలలో కథ అంటూ ప్రత్యేకం ఏమీ లేనప్పటికీ కథనం విషయంలో ఎక్కడా పట్టుసడలకుండా చూసుకున్నారు నూనెజ్..వన్ సిట్టింగ్ లో ఆపకుండా చదవగలిగే రచన ఇది..క్యాన్సర్ బారిన పడిన ప్రోటోగోనిస్ట్ స్నేహితురాలు కీమో తాలూకూ నరకయాతనను తట్టుకోలేక ఒక డ్రగ్ తో బలవన్మరణం చెందాలని నిర్ణయించుకుంటుంది..ఒంటరిగా ఈ ప్రపంచాన్ని వదిలిపోలేక స్నేహితురాలైన ప్రోటోగోనిస్ట్ సహాయం అర్ధిస్తుంది..ఆమె తుది రోజుల్లో వారిద్దరి అనుభవాలూ అనేక తాత్వికపరమైన సంభాషణలకు తెరతీస్తూ, నేటి ఆధునిక సమాజపు స్వేచ్చాజీవి (?) జీవితంలో ఐరనీని చూపిస్తాయి.

I think it will be easier to prepare—to focus on letting go—if I’m someplace where I won’t be surrounded by intimate, familiar things, all those reminders of attachments, and so on.

I shrugged. You know how it is when you live with something every day, I said. They probably don’t even notice it anymore.

ఇందులో రైటింగ్ గురించి ప్రస్తావించిన సందర్భాల్లో భాషా,దాని పరిమితులను గురించి రాసిన కొన్ని పేజీలు చాలా ఆసక్తికరంగా అనిపించాయి.

Understood: language would end up falsifying everything, as language always does. Writers know this only too well, they know it better than anyone else, and that is why the good ones sweat and bleed over their sentences, the best ones break themselves into pieces over their sentences, because if there is any truth to be found they believe it will be found there. Those writers who believe that the way they write is more important than whatever they may write about—these are the only writers I want to read anymore, the only ones who can lift me up. I can no longer read books that— But why am I telling you all this?

But what if God had in fact gone even further. What if it was not just to different tribes but to each individual human being that a separate language was given, unique as fingerprints. And, step two, to make life among humans even more strifeful and confounding,he beclouded their perception of this. So that while we might understand that there are many peoples speaking many different languages, we are fooled into thinking that everyone in our own tribe speaks the same language we do.

This would explain much of human suffering, according to my ex, who was being less playful than you might think. He really did believe that’s how it was: each of us languaging on, our meaning clear to ourselves but to nobody else. Even people in love? I asked, smilingly, teasingly, hopefully. This was at the very beginning of our relationship. He only smiled back. But years later, at the bitter end, came the bitter answer: People in love most of all.

పుస్తకంనుండి మరికొన్ని అంశాలు,

I have learned that there exists a word, onsra, in Bodo, a language spoken by the Bodo people in parts of northeastern India, that is used to describe the poignant emotion a person experiences when that person realizes that the love they have been sharing with another is destined not to endure. This word, which has no equivalent in English, has been translated as “to love for the last time.” Misleading. Most English-speaking people would probably take “to love for the last time” to mean to have at long last found one’s true, enduring love. For example, in a song composed by Carole King called “Love for the Last Time.” But when I first learned this translation of onsra I thought it meant something else entirely. I thought it meant to have experienced a love so overwhelming, so fierce and deep, that you could never ever ever love again.

I’ve heard of people who confess to regularly reading obituaries in the hope of seeing the name of someone they know. Reading obituaries is also said to be a source of comfort to many lonely people. Presumably it’s not the deaths that these people like reading about but the neatly summarized lives that the deceased supposedly lived. But are these same people also avid readers of biographies? Probably not.

In the most romantic movie ever made, a girl yearns for her boyfriend, away at war, even as she finds herself forgetting his face. I would have died for him, she says. How is it that I am not dead? The saddest musical of all time, one critic called it. The Umbrellas of Cherbourg.

What draws the reader to the novel is the hope of warming his shivering life with a death he reads about, said Benjamin.

What are you going through? When Simone Weil said that being able to ask this question was what love of one’s neighbor truly meant, she was writing in her native French. And in French the great question sounds quite different: Quel est ton tourment?

Never return to a place where you were really happy, and in fact that’s a mistake I’ve already made once in my life, and then all my beautiful memories of the first time were tainted.

Crime and Punishment: A Love Story. Now that’s a good title. Anyway, don’t they say that every good story is a suspense story? And every story is a love story. And every love story is a ghost story.

(It seems the one person with whom the poet could not share his poem was the very one who had inspired it, and who is addressed in it, the reason being that Dylan Thomas’s father hadn’t been told that he was dying.)

Dying is a role we play like any other role in life: this is a troubling thought. You are never your true self except when you’re alone—but who wants to be alone, dying?

The meaning of life is that it stops. Of course it would have been a writer who came up with the answer. Of course that writer would have been Kafka.

What he was saying was that perhaps the idea of planning families in the way that people had been doing for generations needed to be rethought.

Be kind, because everyone you meet is going through a struggle. Often attributed to Plato.

Saturday, December 5, 2020

On Disobedience : Why Freedom Means Saying "No" to Power - Erich Fromm

రస్సెల్ తత్వాన్ని గురించి రాస్తూ ఒకచోట 'Among the ideas which Bertrand Russell embodies in his life, perhaps the first one to be mentioned is man’s right and duty to disobedience.' అంటారు ఎరిక్ ఫ్రోమ్.

జీవితపు ప్రాముఖ్యతలు మనిషి మనిషికీ మారుతుంటాయి.."ఉన్న ఒకే ఒక్క జీవితంలో నీకేం కావాలి ?" అని అడిగితే ఒక్కొక్కరూ ఒక్కో సమాధానం చెప్తారు..కొందరికి కీర్తి,కొందరికి సంపద,కొందరికి మంచి మానవ సంబంధాలు,కొందరికి ప్రేమ,కొందరికి అధికారం..ఇలా చెప్పుకుంటూపోతే కొండపల్లి చాంతాడంత లిస్టు తయారవుతుంది..ఈ ప్రశ్న నాకు యవ్వనంలో ఒకసారి ఎదురైనప్పుడు,మెజారిటీ సగటు మనుషుల్లాగే నేను కూడా సంతోషం కావాలనుకున్నాను..కంటికి కానని ప్రపంచపు లోతుల్ని కొలిచే పరిపక్వత లేని సమయంలో 'హ్యాపీనెస్' చాలా సింపుల్ పదం కదూ ! కానీ సంతోషానికి నిర్వచనం అంత సరళం కాదని త్వరలోనే జీవితం పాటలు నేర్పించడం మొదలుపెడుతుంది..దాన్ని నిర్వచించే క్రమంలో మళ్ళీ అనేకమైన సబ్ ఫాక్టర్స్ తెరపైకొస్తాయి..సంతోషం దిశగా ప్రయాణించాలంటే అవసరమైన మీన్స్ సాధించేందుకు కావాల్సింది 'స్వేఛ్చ' అని ఏ కాస్త సెన్సిబిలిటీ ఉన్నవారికైనా త్వరలోనే అర్ధమవుతుంది..ఆధునికత పేరిట స్వేచ్ఛకీ,విశృంఖలత్వానికీ/విచ్చలవిడితనానికీ మధ్యనున్న సన్నని గీతను చెరిపేసిన ఈరోజుల్లో ఫ్రోమ్ రాసిన 'ఆన్ డిసోబీడియన్స్' ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవవలసిన పుస్తకం.

Image Courtesy Google

ఇది స్వేచ్ఛను గురించిన పుస్తకం కాదే ! మరి దాని ప్రస్తావన ఎందుకు అంటే స్వేచ్చకు పునాదులు పడేది అవిధేయత వద్దనుండే..నియమాలను అతిక్రమించడం వద్దే మానవ చరిత్రకు బీజాలు పడ్డాయి..హీబ్రూ బైబిల్ ప్రకారం ఆడమ్ ఈవ్ లు దైవాజ్ఞను ధిక్కరించించడంతోనే మానవచరిత్రకు అంకురార్పణ జరిగింది..అదే విధంగా గ్రీకు పురాణాల ఆధారంగా చూస్తే ప్రొమేథియస్ దైవనిర్ణయానికి ఎదురెళ్ళి నిప్పును మానవాళికి కానుకగా ఇవ్వకపోతే మనిషి ఇంకా రాతి యుగంలోనే ఉండిపోయి ఉండేవాడు..చరిత్రకారులు ఏ పురోగతికైనా అవిధేయతను మొదటిమెట్టుగా చూస్తారు..(కానీ ఆలోచిస్తే మన హిందూ పురాణాల్లో ఇటువంటి దాఖలాలు కనిపించలేదు,దీనికి భిన్నంగా మన చరిత్ర విధేయతతో మొదలయ్యిందంటారు (?) ) ఆడమ్ ఈవ్ ల వలెనే,ప్రొమేథియస్ కూడా నియమోల్లంఘన చేసినందుకు శిక్షింపబడతాడు,కానీ అతడు తాను చేసిన పనికి పశ్చాత్తాపపడి క్షమాపణ కోరడు సరికదా,పైపెచ్చు “I would rather be chained to this rock than be the obedient servant of the gods." అంటాడు.

అలా అన్న ప్రొమేథియస్ ను కార్ల్ మార్క్స్ 'Patron Saint of all Philosophers' గా అభివర్ణించారట..మార్క్స్ అన్న ఈ మాటలు ఫిలాసఫీకీ, అవిధేయతకూ గల సంబంధాన్ని చెప్పకనే చెబుతాయి..అవిధేయత స్వభావంగా గల అనేకమంది తత్వవేత్తల జీవితాలను చూస్తే వారెవరూ నిజానికి దానిని తమ జీవితానికి అన్వయించుకున్నట్టు కనిపించదు..Socrates obeyed by dying, Spinoza declined the position of a professor rather than to find himself in conflict with authority, Kant was a loyal citizen, Hegel exchanged his youthful revolutionary sympathies for the glorification of the State in his later years. Yet, in spite of this, Prometheus was their patron saint. అంటారు ఫ్రోమ్.

నిజానికి నియమోల్లంఘన చేసే వ్యక్తి  కళ్ళేలు లేని గుర్రంతో సమానం కదా ! మరి అన్ని రకాల అవిధేయతా మంచిదేనా ? అవిధేయత ఏ రకంగా మానవాళి అభివృద్ధికి ఉపయోగపడుతుంది ? అనే దిశగా జర్మన్ సైకో అనలిస్ట్,ఫిలాసఫర్ ఎరిక్ ఫ్రొమ్ విశ్లేషణలు సాగుతాయి..మనిషి అథారిటేరియన్ కన్సైన్స్ ,హ్యూమనిస్టిక్ కన్సైన్స్ లకు అనుగుణంగా సమాజానికి విధేయుడుగా ఉంటాడని ఫ్రోమ్ అభిప్రాయపడతారు (ఈ అథారిటేరియన్ కన్సైన్స్ నే ఫ్రాయిడ్ 'సూపర్ ఇగో' అంటారు )..మొదటిదానికి తండ్రికి భయపడే కొడుకు ఉదాహరణైతే,రెండవ దానికి గట్ ఫీలింగ్ ని (ఆత్మవిమర్శ/అంతర్దృష్టి) ని ఆధారంగా చేసుకుని మానవీయతకూ,అమానవీయతకూ భేదాలెఱిగి విధేయతతో వర్తించడం ఉదాహరణగా చూపిస్తారు.

మునుపటి తరాలు కలలో కూడా ఉహించని సౌకర్యవంతమైన జీవన విధానం నేటి మనిషి సొంతం..మెషీన్ల రాకతో శారీరక శ్రమ తగ్గింది,తీరిక వేళలు పెరిగాయి (?) కానీ మనిషి మునుపటిలా ఆరోగ్యంగా,ఆనందంగా లేడు..ఇంకా సక్సెస్ (?) సాధించలేదని బాధ,మరిన్ని విలాసవంతమైన వస్తువులు కొనలేకపోతున్నానే అసంతృప్తి, ఉన్న జీవితం కాకుండా మరింకేదో ఉత్కృష్టమైన జీవితం గడపలేకపోతున్నాననే దిగులు, ఎప్పుడు ఏ టెర్రరిస్ట్ దాడి జరుగుతుందో,ఏ దేశం అణుబాంబు దాడి చేస్తుందో,సంపాదించిన ఆస్తులు చేజారిపోతాయేమో ఇలా అనేక భయాల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు నేటి మానవుడు..మనిషి నిజంగానే స్వేచ్ఛగా ఉన్నాడా ? లేదా వైల్డ్ 'The Soul of Man Under Socialism' లో అన్నట్లు మనిషి ఒక అథారిటీ క్రిందనుండి బయటపడి మరో అథారిటీ క్రిందకి ఆల్రెడీ చేరిపోయాడా ?? The Western democracies, on the other hand, feel proud at having overcome nineteenth-century authoritarianism. But have they—or has only the character of the authority changed. అని కనుబొమ్మలెగరేస్తారు ఫ్రోమ్.

The organization man has lost the capacity to disobey, he is not even aware of the fact that he obeys. At this point in history the capacity to doubt, to criticize and to disobey may be all that stands between a future for mankind and the end of civilization.

సరిగ్గా ఇక్కడే మనమందరం బిగ్ పిక్చర్ చూడడంలో విఫలమవుతున్నామంటారు ఫ్రొమ్..నేటిసమాజం ఉత్పత్తిని ఒక మాధ్యమంగా చూడడానికి బదులు లక్ష్యంగా చూస్తోంది..మనిషి వ్యక్తిగతంగా స్వతంత్రుడైనా వ్యవస్థాగతంగా కట్టు బానిసగా మారాడు..నేడు అధిక శాతం పిల్లలు చదువుకోగలుగుతున్నారు,ఒకప్పటికంటే ఎన్నోరెట్లు అధికంగా జీతభత్యాలు పెరిగాయి,క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగింది..మనిషి తనకు నచ్చిన విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు..కానీ ఇదంతా 'ఇండస్ట్రియల్ బ్యూరోక్రసీ' పరిధిలో,అది శాసించినట్లు నడుస్తున్న వ్యవహారం..క్యాపిటలిజం మనిషిని వస్తువుగా మార్చేసింది..మనిషి అవసరాల్ని నిరంతరం రూపాంతరంచెందే విలాసాలుగా,మనిషిని కేవలం ఒక కన్స్యూమర్ గా మార్చేసిన ఈ వ్యవస్థలో  అందరికీ సమన్యాయం జరగడం లేదు..When man is transformed into a thing and managed like a thing, his managers themselves become things; and things have no will, no vision, no plan. నిరుపేదలు కనీసావసరాలు కూడా తీరకుండా జీవిస్తుంటే సంపన్నులు పాలరాతిసౌథాల్లో అస్తిత్వవాదాల నడుమ కొట్టుమిట్టాడుతున్నారు.

People confuse excitement with joy, thrill with love of life. They are “without joy in the midst of plenty.” The fact is that all the virtues for which capitalism is praised—individual initiative, the readiness to take risks, independence—have long disappeared from industrial society and are to be found mainly in westerns and among gangsters. In bureaucratized, centralized industrialism, regardless of political ideology, there is an increasing number of people who are fed up with life and willing to die in order to get over their boredom. They are the ones who say “better dead than red,” but deep down their motto is “better dead than alive.”

Obedience to a person, institution or power (heteronomous obedience) is submission; it implies the abdication of my autonomy and the acceptance of a foreign will or judgment in place of my own. Obedience to my own reason or conviction (autonomous obedience) is not an act of submission but one of affirmation. My conviction and my judgment, if authentically mine, are part of me. If I follow them rather than the judgment of others, I am being myself; hence the word obey can be applied only in a metaphorical sense and with a meaning which is fundamentally different from the one in the case of “heteronomous obedience.

దీనికి ఏకైక పరిష్కారం 'అవిధేయత' మాత్రమే అంటారు ఫ్రోమ్..17,18 శతాబ్దాలలో మానవమేథ కొత్తపుంతలు తొక్కుతున్న సమయంలో తత్వవేత్తలు మతపరమైన విధివిధానాలకు ఎదురుతిరిగారు..వారి విధేయత తార్కికత,మానవశ్రేయస్సు కు మాత్రమే పరిమితం..మనిషి ఎవరికి జవాబుదారీ అయినా కాకపోయినా తన అంతరాత్మకు (నైతికత/మనస్సాక్షి) సమాధానం చెప్పుకుతీరాలి..ఒకతరంలో అమరవీరులు తమ తాము నమ్మిన సిద్ధాంతాలపట్ల విధేయతతో మతవిశ్వాసాలకు ఎదురుతిరిగారు..'దేనికీ ఎదురు తిరగకుండా అన్నిటికీ విధేయుడిగా ఉన్న మనిషి బానిస' ,అదే విధంగా 'దేనికీ విధేయుడిగా ఉండకుండా అన్నిటికీ ఎదురుతిరిగేవాడు రెబెల్ ' అంటారు ఫ్రోమ్..ఇక్కడ అవిధేయత విషయంలో నేటితరం దృష్టిని దాటిపోయిన ఒక అతి ముఖ్యమైన విషయాన్ని గమనింపులోకి తీసుకొస్తారు..అదేమిటంటే ఒక రెబెల్ కీ,రెవల్యూషనరీకీ ఉన్నతేడా..రెబెల్ అవిధేయతలో సమాజంపట్ల కసి,అసంతృప్తి,కోపం మాత్రమే ఉంటుంది..అతడి తిరుగుబాటు సైద్ధాంతిక ప్రాతిపదికతా,లక్ష్యమూ లేని చర్య..కానీ విప్లవకారుడి (రెవల్యూషనరీ) తిరుగుబాటు సమాజ శ్రేయస్సు కోరుతూ,మానవీయవిలువలను పరిరక్షించేదిగా ఉంటుంది..ప్రాచీన,సనాతనమైన ప్రతిదాన్నీ కాదంటూ,మూలాల్ని కాలరాసి ముందుకుపోవడం అభివృద్ధి,తిరుగుబాటు,అవిధేయత క్రిందకు రాదని ఫ్రోమ్ ఘంటాపధంగా చెప్తారు.

By disobedience I do not refer to the disobedience of the “rebel without cause” who disobeys because he has no commitment to life except the one to say “no.” This kind of rebellious disobedience is as blind and impotent as its opposite, the conformist obedience which is incapable of saying “no.” I am speaking of the man who can say “no” because he can affirm, who can disobey precisely because he can obey his conscience and the principles which he has chosen; I am speaking of the revolutionary, not the rebel.

ఫ్రోమ్ అథారిటీని రేషనల్,ఇర్రేషనల్ అథారిటీలంటూ రెండు రకాలుగా విభజించారు..స్కూలు పిల్లవాడిని కంట్రోల్ చేసే టీచర్,షిప్ కెప్టెన్ ల రేషనల్ అథారిటీ ని మరో ఆలోచన లేకుండా శిరసావహించవచ్చు (ఎస్ ఎక్సెప్షన్స్ అన్ని చోట్లా ఉంటాయి)..కానీ ఒక మనిషిపై వత్తిడి తీసుకు వస్తూ,తమ సిద్ధాంతాలకూ,ఆలోచనలకూ అనుగుణంగా మనిషిని శాసించే ఇర్రేషనల్ అథారిటీనుండి మనిషి స్వతఃసిద్ధంగా బయటపడాలనుకుంటే తప్ప కుదరదు.He/She must disobey.

ఫ్రోమ్ ఈ వ్యాసంలో క్యాపిటలిజం,కమ్యూనిజం చట్రాలమధ్యలో పడి అస్తవ్యస్తంగా తయారైన ప్రపంచాన్ని రక్షించే దిశగా సూచించిన కొన్ని సిద్ధాంతాల్లో బెర్ట్రాండ్ రస్సెల్ ఫిలాసఫీని ఆదర్శంగా చూపిస్తూ ఆయన్ను పలుమార్లు కోట్ చేశారు..నియమాలవద్దే నిలిచిపోయి,అమలువిషయంలో చతికిలబడి,నేటి క్యాపిటలిస్టు వ్యవస్థకు సామంతరాజు హోదాలో మాత్రమే మిగిలిపోయిన సోషలిజాన్ని నేటి ప్రపంచ శాంతికి వెలికి తియ్యాలంటూ,సోషలిజానికి కూడా నేటి సమాజానికి అనుగుణంగా అవసరమైన పలు ఆచరణాత్మక మార్పులు సూచించారు..ఫ్రోమ్ అటువంటి సోషలిజాన్ని 'హ్యూమనిస్టిక్ సోషలిజం' అంటూ "When the laws of the country contradict the laws of humanity, a true man must choose the laws of humanity"  అన్న రస్సెల్ మాటల్ని గుర్తుచేసినప్పుడు నేటి వ్యవస్థలో చట్టాల సంస్కరణలు,ముఖ్యంగా రాజకీయాల్లో ఆధునిక విధివిధానాల అమలు ఎంత అవసరమో అనిపిస్తుంది..ఈ మధ్య చదువుతున్న Guy Debord రాసిన మరో పుస్తకం, 'The Society of the Spectacle', మునుపు చదివిన వైల్డ్ 'The Soul of Man Under Socialism' లో దాదాపు ఇవే అంశాలు ప్రస్తావనకొచ్చినప్పటికీ వారిలా సమస్యను చూపించి వదిలెయ్యకుండా ఫ్రోమ్ ఆచరణ యోగ్యమైన పరిష్కారమార్గాల్ని కూడా సూచించారు.

ఈ పుస్తకం పూర్తి సారాన్ని బెర్ట్రాండ్ రస్సెల్ చెప్పిన ఈ మాటల్లో పొందుపరిచినట్లనిపించింది..

Nobody has expressed the revolutionary nature of thought more brilliantly than Bertrand Russell. In Principles of Social Reconstruction (1916), he wrote: 

Men fear thought more than they fear anything else on earth—more than ruin, more even than death. Thought is subversive and revolutionary, destructive and terrible; thought is merciless to privilege, established institutions, and comfortable habits; thought is anarchic and lawless, indifferent to authority, careless of the well-tried wisdom of the ages. Thought looks into the pit of hell and is not afraid. It sees man, a feeble speck, surrounded by unfathomable depths of silence; yet bears itself proudly, as unmoved as if it were lord of the universe. Thought is great and swift and free, the light of the world, and the chief glory of man. But if thought is to become the possession of many, not the privilege of the few, we must have done with fear. It is fear that holds men back—fear lest their cherished beliefs should prove delusions, fear lest the institutions by which they live should prove harmful, fear lest they themselves should prove less worthy of respect than they have supposed themselves to be. “Should the working man think freely about property? Then what will become of us, the rich? Should young men and young women think freely about sex? Then what will become of morality? Should soldiers think freely about war? Then what will become of military discipline? Away with thought! Back into the shades of prejudice, lest property, morals, and war should be endangered! Better men should be stupid, slothful, and oppressive than that their thoughts should be free. For if their thoughts were free they might not think as we do. And at all costs this disaster must be averted.” So the opponents of thought argue in the unconscious depths of their souls. And so they act in their churches, their schools, and their universities.

పుస్తకంనుండి మరికొన్ని వాక్యాలు : 

Those who announce ideas—and not necessarily new ones—and at the same time live them we may call prophets. The Old Testament prophets did precisely that: they announced the idea that man had to find an answer to his existence, and that this answer was the development of his reason, of his love; and they taught that humility and justice were inseparably connected with love and reason. They lived what they preached. They did not seek power, but avoided it. Not even the power of being a prophet. They were not impressed by might, and they spoke the truth even if this led them to imprisonment, ostracism or death. They were not men who set themselves apart and waited to see what would happen. They responded to their fellow man because they felt responsible. What happened to others happened to them. Humanity was not outside, but within them.

His views on the alleged evilness of man, Russell expressed brilliantly in the Unpopular Essays (1950): “Children, after being limbs of Satan in traditional theology and mystically illuminated angels in the minds of educational reformers, have reverted to being little devils—not theological demons inspired by the Evil One, but scientific Freudian abominations inspired by the Unconscious. They are, it must be said, far more wicked than they were in the diatribes of the monks; they display, in modern textbooks, an ingenuity and persistence in sinful imaginings to which in the past there was nothing comparable except St. Anthony.

The world is divided into two camps, the capitalist and the communist camp. Both camps believe that they have the key to the fulfillment of the human hopes of generations past; both maintain that, while they must coexist, their systems are incompatible. Are they right? Are they not both in the process of converging into a new industrial neo-feudalism, into industrial societies, led and manipulated by big, powerful  bureaucracies—societies in which the individual becomes a well-fed and well-entertained automaton who loses his individuality, his independence and his humanity? Have we to resign ourselves to the fact that we can master nature and produce goods in an ever-increasing degree, but that we must give up the hope for a new world of solidarity and justice; that this ideal will be lost in an empty technological concept of “progress”

Are economic wealth and human fulfillment really incompatible?

We have affluence, but we do not have amenity. We are wealthier, but we have less freedom. We consume more, but we are emptier. We have more atomic weapons, but we are more defenseless. We have more education, but we have less critical judgment and convictions. We have more religion, but we become more materialistic. We speak of the American tradition which, in fact, is the spiritual tradition of radical humanism, and we call “un-American” those who want to apply the tradition to present-day society.

They are the soil in which the American tradition is rooted and from which it draws its strength and vitality. What has happened to the idea of the perfectability of man and of society? It has deteriorated into a flat concept of “progress,” into a vision of the production of more and better things, rather than standing for the birth of the fully alive and productive man. Our political concepts have today lost their spiritual roots. They have become matters of expediency, judged by the criterion of whether they help us to a higher standard of living and to a more effective form of political administration.

The individual is managed and manipulated not only in the sphere of production, but also in the sphere of consumption, which allegedly is the one in which the individual expresses his free choice. Whether it is the consumption of food, clothing, liquor, cigarettes, movies, or television programs, a powerful suggestion apparatus is employed with two purposes: first, to constantly increase the individual’s appetite for new commodities, and second, to direct these appetites into the channels most profitable for industry.

Education, from primary to higher education, has reached a peak. Yet, while people get more education, they have less reason, judgment, and conviction. At best their intelligence is improved, but their reason—that is, their capacity to penetrate through the surface and to understand the underlying forces in individual and social life—is impoverished more and more. Thinking is increasingly split from feeling, and the very fact that people tolerate the threat of an atomic war hovering over all mankind, shows that modern man has come to a point where his sanity must be questioned.

Socialists found that in capitalism things direct life; that having is superior to being; that the past directs the present—and they wanted to reverse this relation.

The aim of socialism was individuality, not uniformity; liberation from economic bonds, not making material aims the main concern of life; the experience of full solidarity of all men, not the manipulation and domination of one man by another. The principle of socialism was that each man is an end in himself and must never be the means of another man. Socialists wanted to create a society in which each citizen actively and responsibly participated in all decisions, and in which a citizen could participate because he was a person and not a thing, because he had convictions and not synthetic opinions.

Where do we stand today? Capitalism and a vulgarized, distorted socialism have brought man to the point where he is in danger of becoming a dehumanized automaton; he is losing his sanity and stands at the point of total self-destruction. Only full awareness of his situation and its dangers and a new vision of a life which can realize the aims of human freedom, dignity, creativity, reason, justice, and solidarity can save us from almost certain decay, loss of freedom, or destruction. We are not forced to choose between a managerial free-enterprise system and a managerial communist system. There is a third solution, that of democratic, humanistic socialism which, based on the original principles of socialism, offers the vision of a new, truly human society.

In relations between people, every man is an end in himself and must never be made into a means to another man’s ends. From this principle it follows that nobody must personally be subject to anyone because he owns capital.