Disclaimer : This is a work of fiction. Any resemblance to actual persons, living or dead, or actual events is purely coincidental.
ఇది నేను సహజంగా రాసే పూర్తి స్థాయి సాహిత్యం పోస్ట్ కాదు,చదువుతున్నప్పుడు భాషను గురించి వచ్చిన కొన్ని ఆలోచనలు..ఆసక్తి లేనివారు చదవడం విరమించుకోవచ్చు.
Image Courtesy Google |
తరాలతోనూ, కాలాలతో పాటు భాష,దాని తాలూకా భావాలూ,భావజాలాలూ మారుతూ ఉంటాయి..మార్పు సహజం..ఒకప్పుడు 'I Love You' కీ ఇప్పటి ఐ లవ్ యూ కీ తేడా ఉన్నట్లే :) దానికి తోడు సోషల్ మీడియా పుణ్యమా అని లవ్ ఐకాన్లు ధారాళంగా ఎవరికి పడితే వాళ్ళకి వాడేస్తున్నాం..ఏమంటే మోడరన్ టైమ్స్ తో అడుగులో అడుగేసి నడవడం అంటాం..వైల్డ్,ఆర్వెల్,బార్త్ లాంటి వారు ముందే హెచ్చరించినట్లు మోడర్నిస్టు అనైతిక భావజాలానికి తగ్గట్లు దాని టెర్మినాలజీ కూడా మారిపోతోంది.
ఉదాహరణకు కొన్ని పదాలు చూద్దాం :
* అజాత శత్రువు ( in ancient times) = People who are friendly with all without any disputes.
అజాత శత్రువు (in current world) = A Spineless Coward who is afraid of taking sides and wants to be friends with everyone for his personal gain.
* స్థిత ప్రజ్ఞులు ( in ancient times) = మంచి చెడుల విచక్షణనెఱిగి దేనికి స్పందించాలో దేనికి అక్కర్లేదో తెలిసి, ప్రతిదానికీ చలించకుండా స్థిరంగా ఉండేవారు.
స్థిత ప్రజ్ఞులు ( in current world) = సామాజికపరంగా అవసరమైన సందర్భాలలో కూడా స్పందించకుండా అన్నిటికీ ఎవరినేమంటే నాకేం నష్టమో,కష్టమో అనుకుని లెక్కలేసుకుంటూ గోడమీద పిల్లుల్లా వ్యవహరించేవాళ్ళు.
* మంచితనం ( in ancient times) = అందరికీ తలలో నాలుకలా ఉంటూ మంచి చేసేవాళ్ళు.
మంచితనం ( in current world) = పిరికితనం. ఎవరితోనూ పోట్లాటలకు వెళ్లకుండా చాలా ఆచితూచి తమపని తాము చేసుకునేవాళ్ళు.
* కోపిష్టి ( in ancient times) = చీటికీ మాటికీ అందరి మీదా అకారణంగా అరిచేవాళ్ళు.
కోపిష్టి ( in current world ) = నిజాన్ని నిర్భయంగా,నిజాయితీగా మాట్లాడేవాళ్ళు..Never trust a person who says they never get angry because anger is a trait of honesty.
* నిజాయితీ ( in ancient times) = కొన్ని విలువలకు లోబడి వర్తించడం.
నిజాయితీ ( in current world ) = లౌక్యం లేకపోవడం /లోకం తీరు తెలీకపోవడం..A typical 'flaw' / or Lack of Diplomacy / or having poor social skills.
* నైతిక విలువలు ( in ancient times) = సామజిక కట్టుబాట్లు,నియమాలు etc. etc. (?)
నైతిక విలువలు ( in current world ) = నా లైఫ్ ఫిలాసఫీ (అది మంచైనా/చెడైనా) దాన్ని జస్టిఫై చేసేవి.
* ఇంటెలెక్చువల్ ( in ancient times) = A scholarly man who is capable of thinking (for the good of society) and know things.
ఇంటెలెక్చువల్ ( in current world ) = తమ మనుగడకు అనుకూలమైన సొంత ఫిలాసఫీ ఒకటి తయారు చేసుకుని ఒక హిడెన్ అజెండాతో సొసైటీని కంట్రోల్ చేసేవాళ్ళు.
* Love ( in ancient times) = ఇవ్వడం..ఎదుటి మనిషి గురించి ఆలోచించడం.
Love ( in current world ) = తీసుకోవడం .. ఎదుటి మనిషి తనకే రకంగా ఉపయోగపడతాడా అని ఆలోచించడం.
* Kindness ( in ancient times) = జాలిగుండె కలిగి అవసరమైన వారికి అడగకుండా సహాయం చేసేవాళ్ళు.
Kindness ( in current world ) = ఖాళీ సమయంలో తన పర భేదం లేకుండా అన్ని పోస్టులకీ లవ్,కేర్ ఐకాన్లు శక్తివంచనలేకుండా నొక్కి దాన్ని ఎంపతీ,సింపతీ అనుకునేవాళ్ళు.
ఈ పోస్టుకి ఇవి చాలు..మరీ గుమ్మడికాయ దొంగల్లా భుజాలు తడిమేసుకోకండి..మహాత్ములు,మంచివాళ్ళు మన మధ్య లేరని అనుకునే సినిసిజం ఇంకా వంటబట్టలేదు. ఆ పై వర్గాల్లో నేను కూడా ఏదో ఒక కేటగిరీలో నిస్సందేహంగా ఉన్నానని నమ్ముతూ,శలవు.
No comments:
Post a Comment