ఈ 'స్వేఛ్చ' అనే రెండక్షరాల పదం చూడ్డానికి కనిపించింత సరళంగా జీవితానికి అన్వయించుకునే సమయంలో అనిపించదు..అసలీ స్వేచ్ఛకు నిర్వచనం ఏమిటి ? స్వేఛ్చ శరీరానికి సంబంధించిందా లేదా మానసికమైనదా ? అనే ప్రశ్నలు అనేక సందర్భాల్లో తలెత్తుతాయి..సహజంగా మన దృష్టిలో స్వేచ్ఛ రెండు రకాలు..ఒకటి వ్యక్తిగతమైతే,రెండు సామజికమైనది..కానీ సంఘజీవిగా సమూహాల్లో కొనసాగడం అనివార్యమైన మనిషి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ,సామజిక స్వేచ్ఛ మీద ఆధారపడి నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది..ఫిలాసఫర్స్ సహజంగా ఈ స్వేచ్ఛను మెటాఫిజికల్,పొలిటికల్ అనే రెండు కోణాల్లో చూస్తారు..కానీ Michel Foucault దృష్టిలో స్వేఛ్చకు మరో మూడో పార్శ్వం కూడా ఉంది..ఆయన మెటాఫిజికల్ ఫ్రీడమ్ ను సమర్ధించలేదు,అలాగే దాన్ని తిరస్కరించనూలేదంటారు..ఆయన స్వేఛ్ఛను నిర్వచించే క్రమంలో ఎన్నుకున్న కాన్వాస్ చాలా పెద్దదీ,చారిత్రకమైనదీను.."After all,what would be knowledgeable-ness and not,in one way or another and to the extent possible,in the knower's straying afield of himself "? అంటారు Foucault.
మెటాఫిజికల్ ఫ్రీడమ్ విషయానికొస్తే మెదడు శరీరాన్ని అదుపు చేస్తుందన్న విషయం మనకందరికీ తెలిసిందే..ఆ విధంగా చూస్తే సోంటాగ్ అన్నట్లు మానసిక స్వేఛ్చ(ఫ్రీ విల్) శారీరక స్వేఛ్చకు దారితీస్తుంది..కానీ మెటాఫిజికల్ ఫ్రీడమ్ అంటే ఏమిటి ? దీనిని లోతుగా అర్థం చేసుకోడానికి కొన్ని వాదాలను తెరపైకి తీసుకొచ్చారు రచయిత..వాటిల్లో మొదటిది 'డాక్ట్రిన్ ఆఫ్ డిటెర్మినేషన్'..మన ఆలోచనలూ,కర్మలూ మన అదుపాజ్ఞల్లో ఉండవని చెప్తుంది డిటెర్మినిజం (నిర్ణయాత్మకత)..మనం చేసే పనులన్నింటికీ మూలాలు వెతికితే అవి మన consciousness పరిథికి ఆవల వాస్తవిక ప్రపంచంలో వ్రేళ్ళూనుకుని ఉంటాయంటారు..అదే విధంగా 'జెనెటిక్ డిటెర్మినిస్టులు' మన వ్యవహారశైలి,విషయాల పట్ల మనం స్పందించే తీరు మన జీన్స్ లో ముందుగానే కోడింగ్ చెయ్యబడి ఉందని ప్రతిపాదిస్తారు..అదే కాల్వనిస్టులు (జాన్ కాల్విన్) దీనిని ఒక మతపరమైన కోణంలో చూస్తారు..దేవుని చేతిలో అంతా ముందే లిఖితమై విధి పేరిట ప్రతి కర్మా నిర్ణయింపబడిందని వీరి నమ్మకం..మనం దేవుని చేతిలో కేవలం కీలు బొమ్మలమని వీరి భావన..ఇక ప్రవర్తనావాదులు మన వ్యక్తిత్వం మనమున్న పరిసరాలను బట్టి రూపుదిద్దుకుంటుందని అంటారు..మన చుట్టూ ఉన్న సమాజంలో మంచి-చెడులు మనల్ని నిర్వచించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఇక ఒకదానికొకటి పరస్పరం విరుద్ధమైన ఈ వాదాలన్నిటినీ జాగ్రత్తగా గమనిస్తే,జీవితంలో ఏ ఒక్క విషయం,సందర్భం మన అదుపులో లేదన్న చేదు నిజం ఈ వాదాలన్నిటిలోనూ ఉమ్మడిగా కనిపిస్తుంది..కానీ మెటాఫిజికల్ ఫ్రీడమ్ ఉంటుందని (బాహ్య ప్రపంచంతో సంబంధంలేని అంతఃప్రపంచం ఉంటుందని) నమ్మేవాళ్ళు ఈ వాదనను ఖండిస్తారు..ఇకపోతే నిర్ణయాధికారం,జడ్జిమెంట్ లనేవి ఆరోగ్యకరమైన మానసిక స్థితికి కొలమానాలుగా ఆలివర్ సాక్స్ పరిగణించినట్లు,మానసిక సంతులనం కోల్పోయినవారు తప్ప మిగతా వాళ్ళకి తమ ఆలోచనల పట్ల,నిర్ణయాలపట్ల కాస్తో కూస్తో అదుపు ఉండే తీరుతుంది..అదే విధంగా పొలిటికల్ ఫ్రీడమ్ బాహ్యప్రపంచంలో మనిషి యొక్క జీవితాన్ని వేషభాషలు,కులమతాలు,హక్కులూ,అధికారాలు మొదలగు సాంస్కృతికపరమైన అన్ని అంశాలపై ఆధిపత్యం కలిగి ఉంటుంది..One could be metaphysically free without any type of political liberty అనుకుంటే సాధారణ వ్యక్తుల కంటే ఆర్టిస్టులకు ఈ మెటాఫిజికల్ ఫ్రీడమ్ గురించిన అవగాహన కాస్త ఎక్కువేమో అనిపిస్తుంది.
నిజానికి పొలిటికల్ ఫ్రీడమ్ లా కాకుండా మెటాఫిజికల్ ఫ్రీడమ్ అందరికీ ఉంటుంది,కానీ ఈ తరహా స్వేచ్ఛ ఉంటుందనే గ్రహింపు మాత్రం అందరికీ ఉండకపోవచ్చు..ఇదంతా చదువుతున్నప్పుడు కొన్ని ప్రశ్నలు తలెత్తాయి.
* పొలిటికల్ ఫ్రీడమ్ తో సంబంధం లేని పక్షంలో,బాహ్య ప్రపంచపు హద్దులు,వత్తిళ్ళు,నియమాలూ లేని మనుషులు మెటాఫిజికల్ ఫ్రీడమ్ తో సర్వస్వతంత్రులు అవుతారా అంటే పూర్తి స్వేఛ్ఛను అనుభవించగలరా ?
* స్వేఛ్చ విషయంలో మనిషి ఎవరితో సంఘర్షిస్తాడు ?
* మనం చెయ్యాలనుకున్నది చెయ్యగలగడం స్వేఛ్ఛా ? లేక చెయ్యాలనుకున్నది చెయ్యకుండా ఉండడం స్వేఛ్ఛా ? వీటిపై మొరాలిటీ ప్రభావం ఏమిటి ?
అన్ని అడ్డంకులూ దాటుకుంటూ,బంధాలు తెంచుకుని తనకు నచ్చిన విధంగా జీవితాన్ని స్వేఛ్ఛగా బ్రతకాలనుకునే క్రమంలో మనిషి చేసే తొలి యుధ్ధం బహుశా తనతోనే..ఒక్కోసారి మెదడు చెయ్యమని ప్రోత్సహించిన పనిని consciousness (స్పృహ ? లేక ఆత్మ ?) వద్దని వారిస్తుంది..మెదడు జడ్జిమెంట్ తప్పైనా మానవ సహజమైన నైతిక విలువలతో కూడిన స్పృహ జడ్జిమెంట్ ఎప్పుడూ కరక్టే..పొలిటికల్ ఫ్రీడమ్ ఉన్నా లేకపోయినా మెటాఫిజికల్ ఫ్రీడమ్ అనుభవించడానికి కూడా అడుగడుక్కీ ఎంతో కొంత సంఘర్షణ తప్పనిసరి..ముఖ్యంగా ఆ సంఘర్షణ మనతోనే మొదలయినప్పుడు,ఆలోచనా మాత్రంగానే అయినప్పటికీ పూర్తి స్థాయి స్వేఛ్చను అనుభవించడం అసంభవమనిపిస్తుంది.
ఇక Foucault సిద్ధాంతానికొస్తే ఆయన ప్రశ్న ఎప్పుడూ "మనం స్వేఛ్ఛా జీవులమా ?" అని కాకుండా "చరిత్ర మన స్వేఛ్ఛను ఏ విధంగా శాసిస్తోంది ? ఈ విషయమై మనం ఏ చర్యలు తీసుకోగలం ?" అనే దిశగానే సాగాయంటారు ఈ వ్యాసాన్ని రాసిన రచయిత Todd May..మనకి ఏం ఆలోచించాలో,ఎలా ఆలోచించాలో చెప్పకుండా ఈ రెండవ ప్రశ్నకు సంబంధించి అన్ని చారిత్రక కోణాల్లోనూ విశ్లేషణలు మాత్రం చేశారు Foucault...ఈ విషయమై
There is an optimism that consists in saying that things couldn’t be better. My optimism would consist in saying that so many things can be changed, fragile as they are, more arbitrary than self-evident, more a matter of complex, but temporary, historical circumstances than with inevitable anthropological constraints.అని రాస్తారు.
ఈ విషయమై Foucault రచన 'డిసిప్లిన్ అండ్ పనిష్' ను ప్రస్తావించారు Todd ..ఆ పుస్తకంలో,క్యాపిటలిజం సమాజాన్ని శాసిస్తున్న తరుణంలో పాలకవర్గాలు మన స్వేఛ్ఛను హరిస్తున్నాయి అనేకంటే,అవి మనల్ని కొన్ని నిర్ణీత వర్గాలుగా విభజించి నిరంతరం మన ఆలోచనల్ని అదుపు చేస్తున్నాయని (psychological monitoring and intervention) అంటారు Foucault..ఇలా తయారైన సమాజంలో ప్రజల్ని Docile Bodies (Foucault argues that individuals are under constant surveillance and regulation in ways that are often subtle and thereby seemingly invisible, leading to normalization and acceptance of such systems) గా అభివర్ణిస్తారు..ఈ విధంగా రూపుదిద్దుకున్న సమాజంలో ప్రజలు తమను తాము 'సైకలాజికల్ బీయింగ్స్' గా మాత్రమే భావిస్తున్నారంటారు..తత్ఫలితంగా తమ బాధలకు కారణం సమాజపు తీరుతెన్నుల్లో ఉన్న లోపమనో,సామజిక వైఫల్యమనో గ్రహించి దాన్ని ప్రశ్నించకుండా,తమ బాధలన్నీ కేవలం మానసికపరమైనవని తీర్మానించుకుని,వాటికి మానసికవైద్యం అవసరమని భ్రమిస్తున్నారనేది Foucault వాదన..నిజానికి స్వేఛ్ఛను ప్రత్యక్షంగా హరించడం కంటే మనుషుల్ని ఈ సైకలాజికల్ బీయింగ్స్ గా మార్చే క్రమంలో వారిని ఒక పథకం ప్రకారం conformity కి గురిచేసి,విభిన్న జీవన విధానాలను అవలంబించకుండా చేసి సమాజానికి ఎదురుతిరగకుండా నిరోధించడం మరింత తేలిక అంటారాయన..దీనికీ స్వేఛ్చకూ సంబంధం ఏమిటంటే,ఇటువంటి పద్ధతులు పరోక్షంగా మన ఆలోచనా విధానాన్ని శాసిస్తూ మనకు తెలీకుండానే మన మెటాఫిజికల్ ఫ్రీడమ్ ను అదుపు చేస్తున్నాయి..ఇటువంటి చారిత్రక అంశాలు మనం ఏం ఆలోచించాలి ? ఎలా ఆలోచించాలి ? అనే నిర్ణయాధికారాన్ని తన చెప్పుచేతల్లో ఉంచుకుంటున్నాయి..Foucault స్వేఛ్ఛను సాంఘిక,ఆధ్యాత్మిక కోణాల్లోను,స్వేఛ్చ అమలు పరచడం గురించీ చేసిన విశ్లేషనల గురించి ఇంకో వ్యాసంలో మరింకెప్పుడైనా.
పుస్తకం నుండి మరి కొన్ని వాక్యాలు,
One must observe that there cannot be relations of power unless the subjects are free. If one or the other were completely at the disposition of the other and became his thing, an object on which he can exercise an infinite and unlimited violence, there would not be relations of power. In order to exercise a relation of power, there must be on both sides at least a certain form of liberty
Image Courtesy Google |
ఇక ఒకదానికొకటి పరస్పరం విరుద్ధమైన ఈ వాదాలన్నిటినీ జాగ్రత్తగా గమనిస్తే,జీవితంలో ఏ ఒక్క విషయం,సందర్భం మన అదుపులో లేదన్న చేదు నిజం ఈ వాదాలన్నిటిలోనూ ఉమ్మడిగా కనిపిస్తుంది..కానీ మెటాఫిజికల్ ఫ్రీడమ్ ఉంటుందని (బాహ్య ప్రపంచంతో సంబంధంలేని అంతఃప్రపంచం ఉంటుందని) నమ్మేవాళ్ళు ఈ వాదనను ఖండిస్తారు..ఇకపోతే నిర్ణయాధికారం,జడ్జిమెంట్ లనేవి ఆరోగ్యకరమైన మానసిక స్థితికి కొలమానాలుగా ఆలివర్ సాక్స్ పరిగణించినట్లు,మానసిక సంతులనం కోల్పోయినవారు తప్ప మిగతా వాళ్ళకి తమ ఆలోచనల పట్ల,నిర్ణయాలపట్ల కాస్తో కూస్తో అదుపు ఉండే తీరుతుంది..అదే విధంగా పొలిటికల్ ఫ్రీడమ్ బాహ్యప్రపంచంలో మనిషి యొక్క జీవితాన్ని వేషభాషలు,కులమతాలు,హక్కులూ,అధికారాలు మొదలగు సాంస్కృతికపరమైన అన్ని అంశాలపై ఆధిపత్యం కలిగి ఉంటుంది..One could be metaphysically free without any type of political liberty అనుకుంటే సాధారణ వ్యక్తుల కంటే ఆర్టిస్టులకు ఈ మెటాఫిజికల్ ఫ్రీడమ్ గురించిన అవగాహన కాస్త ఎక్కువేమో అనిపిస్తుంది.
నిజానికి పొలిటికల్ ఫ్రీడమ్ లా కాకుండా మెటాఫిజికల్ ఫ్రీడమ్ అందరికీ ఉంటుంది,కానీ ఈ తరహా స్వేచ్ఛ ఉంటుందనే గ్రహింపు మాత్రం అందరికీ ఉండకపోవచ్చు..ఇదంతా చదువుతున్నప్పుడు కొన్ని ప్రశ్నలు తలెత్తాయి.
* పొలిటికల్ ఫ్రీడమ్ తో సంబంధం లేని పక్షంలో,బాహ్య ప్రపంచపు హద్దులు,వత్తిళ్ళు,నియమాలూ లేని మనుషులు మెటాఫిజికల్ ఫ్రీడమ్ తో సర్వస్వతంత్రులు అవుతారా అంటే పూర్తి స్వేఛ్ఛను అనుభవించగలరా ?
* స్వేఛ్చ విషయంలో మనిషి ఎవరితో సంఘర్షిస్తాడు ?
* మనం చెయ్యాలనుకున్నది చెయ్యగలగడం స్వేఛ్ఛా ? లేక చెయ్యాలనుకున్నది చెయ్యకుండా ఉండడం స్వేఛ్ఛా ? వీటిపై మొరాలిటీ ప్రభావం ఏమిటి ?
అన్ని అడ్డంకులూ దాటుకుంటూ,బంధాలు తెంచుకుని తనకు నచ్చిన విధంగా జీవితాన్ని స్వేఛ్ఛగా బ్రతకాలనుకునే క్రమంలో మనిషి చేసే తొలి యుధ్ధం బహుశా తనతోనే..ఒక్కోసారి మెదడు చెయ్యమని ప్రోత్సహించిన పనిని consciousness (స్పృహ ? లేక ఆత్మ ?) వద్దని వారిస్తుంది..మెదడు జడ్జిమెంట్ తప్పైనా మానవ సహజమైన నైతిక విలువలతో కూడిన స్పృహ జడ్జిమెంట్ ఎప్పుడూ కరక్టే..పొలిటికల్ ఫ్రీడమ్ ఉన్నా లేకపోయినా మెటాఫిజికల్ ఫ్రీడమ్ అనుభవించడానికి కూడా అడుగడుక్కీ ఎంతో కొంత సంఘర్షణ తప్పనిసరి..ముఖ్యంగా ఆ సంఘర్షణ మనతోనే మొదలయినప్పుడు,ఆలోచనా మాత్రంగానే అయినప్పటికీ పూర్తి స్థాయి స్వేఛ్చను అనుభవించడం అసంభవమనిపిస్తుంది.
Todd May : Image Courtesy Google |