ఒక్క ఎలక్ట్రిక్ లైట్ కనిపించాలంటే కనీసం ముప్ఫై రెండు మైళ్ళు ప్రయాణం చెయ్యాల్సిన దూరంలో,బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా,కనీసం ఫోన్ సదుపాయం కూడా లేని రష్యన్ మారుమూల పల్లెటూర్లో ఏమాత్రం వృత్తిరీత్యా అనుభవంలేని యువవైద్యుడు అక్కడి నిరక్షరాస్యులైన పేషెంట్స్ తో తన అనుభవాలను గురించి రాస్తూ ఎన్నిసార్లు విసుక్కుంటాడో,'ఇక్కడ నుంచి పట్టణానికి వెళ్ళిపోతే ఎంత బావుండును,నాకేంటి ఈ శిక్ష' అని !పగటి వేళలు పేషెంట్స్ కి నయం చెయ్యడంలో గడిచిపోయినా రాత్రి అయ్యేసరికి తన గదిలో గుడ్డి దీపపు కాంతిలో భయంకరమైన ఒంటరితనంతో ఒక్కడూ బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్ళదీస్తుంటాడు..మాస్కో పట్టణపు ఆధునికతనూ,అందాలను పదే పదే తలచుకుంటాడు..కానీ అర్జెంటుగా ఏదైనా కేసు వచ్చినప్పుడు మాత్రం ఈ అస్తిత్వవాదమంతా ఉఫ్ మని ఊదేసినట్లు మాయమైపోతుంది ,ఉన్నపళంగా సాహసికుడి అవతరమెత్తి గుఱ్ఱపు బగ్గీలో ప్రాణాలను సైతం లెక్కచెయ్యకుండా బయలుదేరతాడు..మంచుతుఫానుల్లో దారిలో పొంచి ఉండే ప్రమాదాలను ఎదుర్కుంటూ,అక్కడక్కడా కాపు కాసే తోడేళ్ళ బారినుండి చిన్న పిస్టల్ సాయంతో తనను తాను రక్షించుకుంటూ తన వృత్తిధర్మాన్ని నిర్వర్తించడానికి పూనుకుంటాడు..పైకి సాధారణంగా కనిపిస్తూనే ఏదైనా అవసరం వచ్చినప్పుడు మాత్రం ధైర్యంగా ఎదురు నిలబడి పోరాడే అసాధారణమైన హీరో మన బల్గకోవ్ కథానాయకుడు..మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రంట్ లైన్స్ లో డాక్టర్ గా పనిచేసి,రెండుసార్లు గాయపడిన తరువాత తన ఉద్యోగం వదిలేసి మళ్ళీ కాస్త కోలుకున్నాకా మోర్ఫిన్ వ్యసనం బారినపడి,ఆ తరువాత Smolensk ప్రావిన్స్ లో పనిచేసిన సమయంలో బల్గకోవ్ తన అనుభవాలకు 'A Country Doctor's Notebook' పేరుతో అక్షరరూపం ఇచ్చారంటారు.
చెహోవ్,సోమర్సెట్ మామ్ లాంటి పలు డాక్టర్ రచయితల సరసన చెప్పుకోదగ్గ మరో పేరు మిఖాయిల్ బల్గకోవ్ ది..స్టాలిన్ కి ఇష్టుడుగా మసులుకున్న రష్యన్ రచయిత బల్గకోవ్ ..రష్యన్ మారుమూల పల్లెటూర్లో డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో తన స్వానుభవాలకు కొంత కాల్పనికతను జోడించి ఈ తొమ్మిది కథలుగా మలిచారు..ఈ కథలు సముద్రంలో పడినవాడికి ఈత దానంతటదే వచ్చేస్తుందనే నానుడిని నిజం చేస్తూ,ప్రోటొగోనిస్ట్ పూర్తి స్థాయి వైద్యుడిగా రూపాంతరం చెందే క్రమంలో ప్రత్యక్ష జీవన్మరణ సంఘర్షణకు మధ్యవర్తిగా వ్యవహరించడంలో ఎదుర్కునే పరిస్థితులను వివరిస్తాయి..ఈ నూనూగు మీసాల డాక్టర్ పేషెంట్స్ బాధను తన బాధగా చేసుకుని అల్లాడిపోతాడు..సర్జరీ గురించి థియరీ చదవడమే తప్ప ప్రాక్టికల్ అనుభవం ఎంతమాత్రం లేని యూనివర్సిటీ చదువుతో బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టి అప్రెంటిస్షిప్ చేస్తున్నప్పుడు వణికే చేతుల్తో ఫోర్సెప్స్ తీసుకుని,అప్పటికప్పుడు కేసుకు అవసరమైన సర్జరీ మాన్యువల్స్ పేజీలు తిప్పుతూ,మరోప్రక్క నుదుటి మీద పట్టిన చిరుచెమటల్ని తుడుచుకుంటూ,పేషెంట్ కేసి కళ్ళు పెద్దవిగా చేసుకుని చూస్తున్నప్పుడు 'ఈ పేషెంట్ నా చేతుల్లో మరణిస్తే నా పరిస్థితి ఏంటి !' అనుకునే ఈ యువవైద్యుడి రూపం పాఠకుల మనసులో అలా ముద్రపడిపోతుంది.
ఈ కథలన్నీ అవ్వడానికి క్లినికల్ టేల్స్ అయినా బల్గకోవ్ వీటిలో డాక్టర్-పేషెంట్ సంబంధాలకు పెద్దపీట వేస్తూ మానవీయకోణాన్ని వాస్తవికతకు జతచేస్తూ కథనాన్ని నడిపించే ప్రయత్నం చేశారు..దీనికి తోడు చెహోవ్ శైలిని తలపించే ప్రకృతి వర్ణనలు ఈ కథల్లో మరో ప్రత్యేకత..ఈ వేర్వేరు కథలకు ఎంచుకున్న ఉమ్మడి కాన్వాస్ ఒక ఆర్టిస్టు ఏకాగ్రతతో గీసిన స్కెచ్ అంత స్పష్టంగా ఉంటుంది..శీతాకాలపు రాత్రుళ్ళు,మంచుతుఫానులు ,మినుకుమినుకు మంటూ కథానాయకుడి గదిలో ఉన్న ఆకుపచ్చని ఛాయలో వెలిగే దీపం,హాస్పిటల్ ప్రధాన ద్వారం దగ్గర ఉన్న మరొక దీపం మినహా కనుచూపుమేరా కన్నూమిన్నూ కానని కటిక చీకటి..ఈ పరిసరాలన్నీ కథలతోపాటు సమాంతరంగా జీవంపోసుకోగా సువిశాలమైన రష్యన్ లాండ్స్కేప్ ఉన్నపళంగా మన కళ్ళముందు తెల్లని తైలవర్ణ చిత్రంలా దర్శనమిస్తుంది.
ఈ కథలన్నిటిలోకీ కాస్త వైవిధ్యంగా ఉన్న కథ 'Morphine' ఒక్కటే.ఇది మొదటి ప్రపంచయుద్ధ సమయం నాటి బోల్షివిక్ విప్లవం సమయానికి సంబంధించిన కథ..ఇదొక్కటీ మినహాయిస్తే మిగతా కథలన్నీ హాస్పిటల్ లో రకరకాల పేషెంట్స్ కి సంబంధించిన కథలే..డాక్టర్ గా ప్రాక్టీస్ తొలినాళ్లలో అనేకమంది అనుభవమున్న డాక్టర్ల మధ్య నేర్చుకుంటూ అప్రెంటిస్షిప్ చెయ్యడం వేరు,అన్న ప్రాసనరోజే ఆవకాయ్ పచ్చడి తీరుగా ఏకాకి వైద్యుడుగా ఎమర్జెన్సీ కేసులను అటెండ్ చెయ్యడం వేరు..తన డైరీలో కష్టాలను ఏకరువు పెడుతున్నపుడు బగ్లకోవ్ హాస్యోక్తులు కథనాన్ని మరింత రక్తి కట్టిస్తాయి.
ఉదాహరణకు,The Embroidered Towel కథలో వైద్యం పూర్తయ్యి కోలుకున్న అందమైన యువతి తండ్రి కృతజ్ఞతా భావంతో డాక్టర్ చేతిని ముద్దుపెట్టుకోమని కూతుర్ని ఆదేశిస్తే దగ్గరకు వచ్చిన ఆమెను గూర్చి 'I was so confused that I kissed her on the nose instead of the lips.' అంటారు బల్గకోవ్ :)
మరో కథలో పేషెంట్ పన్ను పీకబోయి అతడి దవడను పీకేసిన డాక్టర్ ఆత్మవిమర్శను వర్ణిస్తూ,
‘What about the soldier’s jaw? Answer, miserable graduate!’ అంటారు.
తీవ్రమైన మంచుతుఫాను మధ్య చిక్కుకున్న సమయంలో చావుబ్రతుకుల మధ్య డాక్టర్ ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి.. Well, somewhere on the back page of a Moscow newspaper there would be a report of how Doctor So-and-So, Pelagea Ivanovna, a driver and a pair of horses had perished from the ‘rigours of the service’. Peace to their ashes, out there in the sea of snow. Dear me, what rubbish creeps into one’s head when called out on a journey in the so-called line of duty.
మరో కథలో టాల్స్టాయ్ మీద ఛలోక్తి విసురుతూ,
I suddenly remembered a short story I had read and for some reason felt a burst of resentment at Leo Tolstoy.‘It was all right for him, living comfortably at Yasnaya Polyana,’ I thought, ‘I bet he was never called out to people who were dying …’అంటారు.
ఇంకో కథలో వింతశిశువు గురించి రాస్తూ,
At university I was not once permitted to hold a pair of obstetrical forceps, yet here—trembling, I admit—I applied them in a moment.I must confess that one baby I delivered looked rather odd: half of its head was swollen, bluish-purple and without an eye. I turned cold, dimly hearing Pelagea Ivanovna as she said consolingly:‘It’s all right, doctor, you’ve just put one half of the forceps over his eye.' అంటారు..ఇలాంటి డార్క్ హ్యూమర్ ఈ కథల్లో అణువణువునా కనిపిస్తుంది.
ఇలా చెప్పుకుంటూ వెళ్తే,ఈ పుస్తకంలో యువ డాక్టర్ చేసే సాహసాలెన్నో,కేసు ఎటువంటి మలుపు తీసుకుంటుందో అని పాఠకులకు ఉత్కంఠ కలిగించే సందర్భాలెన్నో..ఒక చిన్ననాటి స్నేహితుడు సెలవులకు ఇంటికొచ్చినప్పుడు తీరుబడిగా చెప్పే కబుర్లంత సహజంగా,తియ్యగా ఉంటాయి బగ్లకోవ్ వర్ణనలు...అతడి దగ్గరకి వైద్యానికి వచ్చినా,మొహంలో పసితనపు ఛాయలు ఇంకా పోనీ ఆ కుర్ర డాక్టర్ వైద్యం మీద నమ్మకం లేక అతడిని ఎగతాళి చేసే నిరక్షరాస్యులైన రైతుల మధ్య అనేక ఒత్తిళ్ళను ఎదుర్కుంటూ వైద్య వృత్తిలో అనుభవం సంపాదించి ఎలా నిలదొక్కుకున్నదీ ఈ కథల సారాంశం.
పుస్తకం నుండి మరొకొన్ని అంశాలు,
I needn’t have offered to do the operation, and Lidka could have died quietly in the ward. As it is she will die with her throat slit open and I can never prove that she would have died anyway, that I couldn’t have made it any worse …’
‘As soon as I get back to my room, I’ll shoot myself.’
‘You did the operation brilliantly, doctor.’ I thought she was making fun of me and glowered at her.
Anna Nikolaevna described to me how my predecessor, an experienced surgeon, had performed versions. I listened avidly to her, trying not to miss a single word. Those ten minutes told me more than everything I had read on obstetrics for my qualifying exams, in which I had actually passed the obstetrics paper ‘with distinction’. From her brief remarks, unfinished sentences and passing hints I learned the essentials which are not to be found in any textbooks.
And an interesting thing happened: all the previously obscure passages became entirely comprehensible, as though they had been flooded with light; and there, at night, under the lamplight in the depth of the countryside I realised what real knowledge was.‘One can gain a lot of experience in a country practice,’
It was, in fact, less of a conversation than a monologue—a brilliant monologue by me, which would have earned a final year student the highest marks from any professor.
I felt the customary stab of cold in the pit of my stomach as I always do when I see death face to face. I hate it.
God, how the sweat ran down my back! For an instant I somehow imagined that some huge, grim, black figure would appear and burst into the cottage, saying in a stony voice: ‘Aha! Take away his degree !'
I felt my heart gripped by loneliness, by cold, by awareness of my utter isolation. What was more, by breaking the baby’s arm I might have actually committed a crime. I felt like driving off somewhere to cast myself at someone’s feet and confess that I, Doctor So-and-So, had broken a child’s arm—take away my degree, dear colleagues, I am unworthy of it, send me to Sakhalin! God, how neurotic I felt!
In a year, up to the very hour of that evening, I had seen 15,613 patients;200 inpatients had been admitted, of whom only six died.
CLEVER PEOPLE HAVE LONG BEEN AWARE THAT happiness is like good health: when you have it, you don’t notice it. But as the years go by, oh, the memories, the memories of happiness past!
ఏకాంతాన్ని గురించిన వర్ణన,
For an addict there is one pleasure of which no one can deprive him—his ability to spend his time in absolute solitude. And solitude means deep, significant thought; it means, calm, contemplation—and wisdom.
The night flows on, black and silent. Somewhere out there is the bare leafless forest, beyond it the river,the chill air of autumn. Far away lies the strife-torn, restless city of Moscow.
Nothing concerns me, I need nothing and there is nowhere for me to go.
The flame in my lamp burns softly; I want to rest after my adventures in Moscow and forget them.
And I have forgotten them.
Image Courtesy Google |

No comments:
Post a Comment