Tuesday, February 12, 2019

Out of India: Selected Stories - Ruth Prawer Jhabvala

చాలా కాలం క్రితం ఇంతియాజ్ అలీ ఒక ఇంటర్వ్యూలో శశి కపూర్ 'జునూన్'(1979) సినిమా గురించి ప్రస్తావించారు..ఆ సినిమాలో శశి నటనను ఆయన ప్రశంసించిన తీరుకి నాకు వెంటనే ఆ సినిమా చూడాలనిపించింది..ఆ క్షణం వరకూ శశి కపూర్ అంటే 'మేరే పాస్ మా హై' తరహా కమర్షియల్ సినిమాలు తప్ప వేరే సినిమాలు తెలీని నాకు ఆ సినిమా శశి కపూర్ లోని అసలుసిసలు నటుణ్ణి పరిచయం చేసింది..ఆ తరువాత వరుసగా శశి నటించిన Householder,Shakespeare Wallah, Bombay Talkie,Heat and dust లు చూశాను (ఇవన్నీ యూట్యూబ్ లో లభిస్తాయి)..విశేషమేంటంటే ఈ సినిమాలన్నీ 'మర్చంట్ ఐవరీ ప్రొడక్షన్స్' అనే ఒకే సంస్థ నిర్మించినవే.

Image Courtesy Google

జేమ్స్ ఐవరీ,ఇస్మాయిల్ మర్చంట్ ల జాయింట్ కొలాబొరేషన్ 'మర్చంట్ ఐవరీ ప్రొడక్షన్స్' సంస్థ నిర్మించిన సినిమాలు చూసినవారికీ,వారి ఆస్థాన హీరో శశి కపూర్ అభిమానులకూ 'రూథ్ ప్రవెర్ ఝబ్వాలా' సుపరిచితురాలు..వారి సంస్థలో సింహభాగం సినిమాలకు ఆమె కథ,స్క్రీన్ప్లే అందించారు..ఆవిడ స్క్రీన్ప్లే అందించిన EM Forster's నవలలు 'A Room with a View' మరియు 'Howards End' లకు గాను రెండు ఆస్కార్లు కూడా సొంతం చేసుకున్నారు..అంతేకాకుండా 'Heat and Dust' నవలకు గాను 1975 లో Booker Prize ను గెలుచుకున్నారు..ఆ విధంగా చరిత్రలో ఆస్కార్ మరియు బుకర్ ప్రైజ్ లను గెలుచుకున్న ఏకైక వ్యక్తిగా కీర్తినార్జించారామె..చాలా కాలం నుండీ ఆవిడ రచనలు చదవాలనుకుని,ఎట్టకేలకు ఆమె కథలు 'Out of India : Selected stories' చదివాను..ఈ పుస్తకంలో కథలు ఒకెత్తైతే 'Myself in India' అంటూ ఆమె రాసిన పరిచయ వాక్యాలు మరొకెత్తు..ఒకప్పుడు ఒక అద్భుతంగా తోచిన ఇండియా మీద నేడు తనకు ఆసక్తి లేదనీ,అందువల్ల ఈ పుస్తకంలో ఇండియాలో తన ఉనికిని గురించి మాత్రమే మాట్లాడతాననీ  అంటారు..రూథ్ ను ఇండియాలోని దుర్భర దారిద్య్రం తీవ్రంగా కలచివేసింది.

There is a cycle that Europeans—by Europeans I mean all Westerners, including Americans—tend to pass through. It goes like this: first stage, tremendous enthusiasm—everything Indian is marvelous; second stage, everything Indian not so marvelous; third stage, everything Indian abominable. For some people it ends there, for others the cycle renews itself and goes on. I have been through it so many times that now I think of myself as strapped to a wheel that goes round and round and sometimes I’m up and sometimes I’m down.

స్వతంత్ర భారతం ఆవిర్భవించేనాటికి జాత్యాంతర వివాహాలూ,వ్యాపార,వాణిజ్యాల కారణంగా తూర్పు-పశ్చిమల సాంస్కృతిక సమ్మేళనం జరిగింది..తత్పరిణామంగా ఇండియాలో భారతీయుల్ని వివాహం చేసుకోవడం ద్వారా ఇక్కడే స్థిరపడ్డ ఆంగ్లో-ఇండియన్లు కొందరైతే, క్యాబినెట్ మినిస్టర్లు,ఇంజినీర్లు,టీచర్లు,కళాకారులుగా పలురంగాల్లో వృత్తి రీత్యా స్థిరపడ్డవారు మరికొందరు..ఇలా ఆ కాలంలో ఆంగ్లేయులు కూడా మన సమాజంలో కీలకమైన అంతర్భాగంగా ఉండేవారు..రూథ్ ఝబ్వాలా కూడా ఒక భారతీయ ఆర్కిటెక్ట్ సైరస్ ఝబ్వాలాను వివాహమాడి ఢిల్లీలో చాలా ఏళ్ళు నివసించారు కాబట్టి ఆమె కూడా ఆనాటి ఆంగ్లో ఇండియన్ వలస సమాజంలో అంతర్భాగమే..అందుకేనేమో ఆమె రచనలన్నీ సాంస్కృతిక వైరుధ్యాలు కీలకాంశంగా ఉంటాయి..'Once a refugee, always a refugee' అని నమ్మే రచయిత్రి ఇండియాను own చేసుకోడంలో విఫలమయ్యారో,లేక అప్పుడప్పుడే మానుతున్న గాయాలతో ఉన్న ఇండియా ఆమెను own చేసుకోడానికి సుముఖంగా లేదో ఇప్పటికీ అర్ధం కాలేదు.

సాహిత్యమంటే 'ఉనికిని చాటుకునే దిశగా జరిగే సంఘర్షణే' అనుకుంటే రూథ్ కథల్లో ఆ సంఘర్షణ అడుగడుగునా కనిపిస్తుంది..జన్మతః యూరోపియన్ అయినప్పటికీ భారతీయుల ఇంటి కోడలుగా,ఈ సమాజంలో ఇమడడానికి ఆమె పడ్డ కష్టం కనిపిస్తుంది..ఆమె ఊహల్లో ఇండియాకూ,వాస్తవంలో ఇండియాకూ పొంతన లేదనే నిరాశ దాదాపు అన్ని కథల్లోనూ అంతర్లీనంగా ద్యోతకమవుతూనే ఉంటుంది..'Passion' అనే కథలో ఇద్దరు భారతీయ యువకుల్ని ఇండియా రెండు స్వరూపాలుగా అభివర్ణిస్తారు..పశ్చిమదేశాల వారికీ తెలీని భారతాన్ని హరగోపాల్ అనే సగటు పేద యువకుని సంఘర్షణగా చూపిస్తే,మానీ అనే ప్రెసిడెంటు బాడీగార్డ్ ను పశ్చిమదేశాలవారు పుస్తకాల్లో చదివి ఊహించుకునే సుందర భారతంగా చూపిస్తారు..ఈ కథలో రూథ్ లో ఇండియా పట్ల పేరుకుపోయిన అయిష్టత,ఆశాభంగం ప్రస్ఫుటమవుతాయి.

Betsy had to admit that Manny too was typically Indian—but in a very different way. Manny was the India one read about in childhood, colored with tigers, sunsets,and princes; but Har Gopal was real, he was everyday, urban, suffering India that people in the West didn’t know about.

ఇందులో మొత్తం పదిహేను కథల్లో నాకు బాగా నచ్చిన కథ 'An experience of India' మతం మాటున దాక్కున్నభారతీయత యొక్క పవిత్రత ముసుగుని తొలగించి,ఛాందసత్వ సమాజపు మాలిన్యాన్ని బహిర్గతం చేస్తుంది..తొలుత ఇండియా మీద ప్రేమతో ఇక్కడికి వచ్చిన రచయిత్రి ఝబ్వాలాకు ఇక్కడ ఆధ్యాత్మికత,సంప్రదాయం,కట్టుబాట్ల చాటునున్న హిపోక్రసీ అనుభవంలోకి రాగానే కలిగిన ఆశాభంగంలోంచి పుట్టిన వ్యథ ఈ కథగా రూపుదాల్చిందా అని అనిపిస్తుంది..రచయిత్రిగా ఆమె ప్రతిభకు ఈ కథ ఒక మచ్చుతునక మాత్రమే.

I resisted with all my strength and sat down on one of the kitchen chairs. Henry continued to pull and now he was pulling me along with the chair as if on a sleigh. I clung to it as hard as I could but I felt terribly weak and was afraid I would let myself be pulled away. I begged him to leave me. I cried and wept with fear—fear that he would take me, fear that he would leave me.

ఒక కథలో తన షర్ట్ కు గుండీ ఊడిపోయినా,పనివాడు బూజు సరిగ్గా దులపకపోయినా కూడా దానికి భారతీయుల్ని అందర్నీ బాధ్యుల్ని చేసి,ఇండియా పేద దేశమనీ,భారతీయులు అందరూ మూర్ఖులనీ,పనికిరానివారనీ పరిహసించి,అవమానించే Boekelman లాంటి యూరోపియన్లు తారసపడితే, ప్రియురాలైన బెట్సీ (ఆంగ్లేయురాలు) చేతిని వెనక్కి విరిచి శరత్ నవల్లో కథానాయకుడిలా ఆమెతో పరిహాసమాడే హరగోపాల్ లాంటి సగటు ఇండియన్లు మరో కథలో  కనిపిస్తారు..భారతీయ యువకుల 'విచారగ్రస్తమైన కళ్ళు' ఎంత అందంగా ఉంటాయో అని అంటూ,భారతీయ స్త్రీలకు యూరోపియన్ యువకులపై ఆకర్షణకు గల కారణాలను 'Man with a dog' కథలో విశ్లేషిస్తారు.

Indian men who are always a little shy with us and clumsy, and even if they like to talk with us, they don’t want anyone to see that they like it. But he didn’t care who saw—he would sit on a little stool by the side of the lady with whom he was talking, and he would look up at her and smile and make conversation in a very lively manner, and sometimes, in talking, he would lay his hand on her arm. He was also extra polite with us, he drew back the chair for us when we wanted to sit down or get up, and he would open the door for us, and he lit the cigarettes of those ladies who smoked, and all sorts of other little services that our Indian men would be ashamed of and think beneath their dignity. But the way he did it all, it was full of dignity. And one other thing, when he greeted a lady and wanted her to know that he thought highly of her, he would kiss her hand, and this too was beautiful, although the first time he did it to me I had a shock like electricity going down my spine and I wanted to snatch away my hand from him and wipe it clean on my sari. But afterward I got used to it and I liked it.

ఈ కథల్లో సంప్రదాయపు దాష్టీకాల నడుమ అలనాటి భారతీయ సమాజంలో స్త్రీ సంఘర్షణపై దృష్టి సారించే ప్రయత్నం చేస్తారు రూథ్..ముఖ్యంగా ఈ కథల్లో స్త్రీలందరూ శరత్ నాయికల్లా భర్తపై,ప్రియునిపై,గురువుపై తీర్పరితనంలేని అకుంఠిత దీక్ష,గుడ్డి ప్రేమ కలిగి ఉంటారు..కాగా పురుషులు మాత్రం ప్రతిసారీ ఆ నమ్మకాన్ని వమ్ముచేస్తూ వెన్నెముకలేని సగటు భారతీయ మనస్తత్వాన్ని బయటపెట్టుకుంటుంటారు..యురోపియన్ వ్యవస్థకూ,భారతీయ సమాజానికీ ఉన్న భేదాన్ని రూథ్ తన కథల్లో సున్నితంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారు..ఆవిడ దృష్టిలో భారతీయులు తమలోని మాలిన్యాన్ని 'సంప్రదాయం,ఆధ్యాత్మికత' అనే మేలిముసుగులో దాచుకుంటారు..ఆవిడ ప్రతి కథలోనూ ఆ ముసుగును తీసేసి సత్యాన్ని బహిర్గతం చేసే దిశగా అలుపెరగని ప్రయత్నం కనిపిస్తుంది..ఇందులో కొన్ని కథలు 'భారతీయ ఆధ్యాత్మిక వ్యవస్థ' కు చెంపపెట్టులా ఉంటాయి..పాశ్చాత్య మెటీరియలిస్టు వ్యవస్థకు దూరంగా,ఇక్కడ ఆధ్యాత్మిక చైతన్యం కోసం తరలి వచ్చే విదేశీయుల్ని ఆశ్రమాల పేరిట,మత గురువుల వేషధారణలో తమ స్వార్ధం కోసం పావులుగా మార్చుకున్న వ్యక్తులు అక్కడక్కడా తారసపడతారు.

ఈ కథలు చదువుతుంటే అరవై-డెబ్భై ల కాలంనాటి కాలుష్యం లేని బొంబాయి,ఢిల్లీ వీధుల్లో విహారానికి వెళ్ళినట్లుంటుంది..మధ్య మధ్యలో “Bombay House'',“Shalimar,”“Monna Lisa,”“Taj Mahal" లాంటి రెస్టారెంట్లలో ఆగి చాయ్ తాగుతూ,దార్లో పద్ధతిగా ధోవతి కట్టుకుని ఉద్యోగానికి వెళ్తూ ఎదురయ్యే సగటు భారతీయుల్ని కలిసి పిచ్చాపాటీ మాట్లాడుతున్నట్లుంటుంది..ఇందులో సాయంకాలపు వీధి దీపాల మసక వెలుతురుల్లో తమ గమ్యాన్ని వెతుక్కునే సాధారణమైన పాత్రలు దర్శమిస్తాయి..సంగీత సాధనలో తన జీవితానికి అర్ధాన్ని వెతుక్కునే మధ్యవయసు గృహస్థురాలూ,మాటల మాయకు లొంగిపోయి ఆస్తుల్ని త్యజించి ఒక దేశదిమ్మరిని పెళ్ళి చేసుకునే యువతీ,సంప్రదాయాల్ని కాదని తన హక్కులకై పోరాడే విధవరాలు,స్వప్నలోకంలో  విహరిస్తూ,బాధ్యతల్ని విస్మరించి వాస్తవాన్ని ఎదుర్కోలేని సగటు మధ్యతరగతి అసమర్ధుడు,ఆధ్యాత్మికతకు అర్ధాన్ని తెలుసుకున్న విదేశీయురాలు,కట్టుబాట్లను ధిక్కరిస్తూ ఒక విదేశీయుడితో సహజీవనం సాగించే మహిళా ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులో ఒక్కో కథా ఒక్కో సజీవమైన జీవన ప్రస్థానాన్ని దర్శింపజేస్తుంది..ఈ కథల్లో అప్పుడే రెక్కలు విప్పుకుంటున్న స్వతంత్ర భారత విహంగాన్నీ,'కల్చరల్ క్లాష్' నూ ఒక విదేశీయురాలి దృష్టికోణంతో చూడచ్చు..అద్భుతమైన వచనంతో,సున్నితమైన భావోద్వేగాల్ని అలవోకగా పలికించగల రూథ్ ప్రవెర్ ఝబ్వాలా ఖచ్చితంగా చదివి తీరాల్సిన రచయిత్రి.

పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు,
I’d had this idea that there was something in India for me to gain, and even though for the time being I’d failed, I could try longer and at last perhaps I would succeed.

Two more under the indian sun కథ నుండి,
As soon as I set foot on Indian soil, I knew this was the place I belonged. It’s funny isn’t it? I don’t suppose there’s any rational explanation for it. But then, when was India ever the place for rational explanations.”

No comments:

Post a Comment