Saturday, April 7, 2018

Zen in The Art of Writing - Ray Bradbury

తొమ్మిదేళ్ళ ఆ పిల్లవాడికి కామిక్ క్యారెక్టర్ బక్ రోజర్స్ అంటే ప్రాణం..ఒకరోజు తోటిపిల్లలు అతన్ని ఈ విషయమై పరిహసిస్తే,ఏడుస్తూ తాను కలెక్ట్ చేసుకున్న బక్ రోజర్స్ కామిక్స్ అన్నీ చింపేసి విసిరేశాడు..కానీ తన ప్రాణానికి ప్రాణమైన రోజర్స్ లేని తన చిన్ని ప్రపంచం బోసిపోవడం గ్రహించిన వెంటనే తేరుకుని ఆ కామిక్స్ మళ్ళీ కలెక్ట్ చెయ్యడం మొదలు పెట్టాడు..ఆ పసి వయసులో తన తోటి పిల్లలు చెప్పిందే నిజమని ఆ పిల్లవాడు నమ్మి ఉంటే తరువాతి కాలంలో పెద్దల్నీ,పిల్లల్నీ తన మార్స్ స్వప్నలోకంలో విహరింపజేసిన 'రే బ్రాడ్బరీ' మనకు పరిచయమై ఉండేవారు కాదు.

Image courtesy Google
బ్రాడ్బరీ బాల్యంలో జరిగిన ఈ సంఘటనతోనే రచయితలకు మొదటి పాఠం మొదలవుతుంది.. ప్రతి మనిషీ ప్రత్యేకం..అభిరుచులు,ఇష్టాయిష్టాలు,కలలూ,కల్పనలూ ఇవన్నీ వ్యక్తిత్వానికి అదనపు సుగంధాన్నద్ది ఆ మనిషిని మిగతావారికంటే వేరుగా నిలబెడతాయి..ఆ ప్రత్యేకతను గేలి చేసే లోకం శత్రు సమానమనీ,దాన్ని నమ్మవద్దనీ అంటారు బ్రాడ్బరీ..స్పేస్ ట్రావెల్,సైడ్ షోస్,గొరిల్లాస్ లాంటి వింతైన విషయాలపై తన మక్కువను చిన్నచూపు చూసేవారు తనకు స్నేహితులు కారని అనుకోవడమే ఇక్కడ బ్రాడ్బరీ విజయానికి మొదటి మెట్టు అయ్యింది.. 'Zen in The Art of Writing',ముప్పై ఏళ్ళ వ్యవధిలో ప్రఖ్యాత సైన్స్ ఫిక్షన్ రచయిత రే బ్రాడ్బరీ వివిధ సమయాల్లో రాసిన వ్యాసాల సంకలనం..ఈ వ్యాసాలు ఇప్పటికే రచనా వ్యాసంగంలో ఉన్నవారికోసం రాశారు..రచయిత కావాలనుకుంటున్న వారి కోసమైతే కాదు..కానీ రచయితలు కావాలనుకున్న వారికి కూడా ఇదొక మంచి రిఫరెన్స్ పుస్తకం అని చెప్పవచ్చు..ఇందులోని విషయాలు ఏదో పాఠం చెప్పినట్లో లేక ఎక్స్పర్ట్ ఇంస్ట్రక్షన్స్ ఇచ్చినట్లో కాకుండా నిజాయితీ,మరి కాస్త హ్యూమర్ కలగలిసి ఆసక్తికరంగా ఉన్నాయి.

రచనలు చేసే కొత్తల్లో అనుకరణ అనేది సర్వసాధారణం..ఇందులో బ్రాడ్బరీ కూడా తను చదివిన రచయితల ప్రభావాన్ని దాటుకుని తన సొంత శైలిని ఏర్పరుచుకునే క్రమంలో ఎదురైన చిక్కుల్ని ప్రస్తావించారు..బాల్యంలో డికెన్స్,లవ్ క్రాఫ్ట్,Poe లనూ మరికొంత కాలం తరువాత Kuttner,Bloch,and Clark Ashton Smith లాంటివారి సంప్రదాయ సాహిత్యాన్ని (ఘోస్ట్ స్టోరీస్) చదువుతూ పెరిగిన బ్రాడ్బరీ మీద సహజంగానే వారి ప్రభావం ఎక్కువ ఉండేది..రచయితగా తొలి అడుగులేస్తున్న కాలంలో ఆయన శైలిలో,భాషలో వారి జాడలు కనిపిస్తుండేవి..కానీ తన శైలిని గుర్తించకుండా వారిని గుడ్డిగా అనుకరిస్తున్నానని తెలీని వయసు అది..పన్నెండేళ్ళ వయసు నుండే  Poe ఒక భుజంపైనుండీ,Wells, Burroughs లాంటి విచిత్రమైన కథలు (Astounding and Weird Tales) రాసే మరికొంతమంది రచయితలు మరో భుజంపై నుండీ పరికిస్తుండగా రోజుకి కనీసం వెయ్యి పదాలు రాసేవారట ఆయన..

"ప్రతి రోజూ ఉదయం మంచం దిగుతూనే ల్యాండ్ మైన్ మీద కాలు మోపుతాను..ఆ ల్యాండ్ మైన్ నేనే..విస్ఫోటనం జరిగిన తరువాత మిగిలిన రోజంతా ఆ తెగిపడిన ముక్కల్ని మళ్ళీ అతికించుకుంటాను" అంటూ ఒక 'రచయిత' కావడం అంటే ఏమిటో చెప్తారు బ్రాడ్బరీ..మనిషికి శ్వాస ఎంత అవసరమో,ఒక రచయితకు రాయడం అలాగే ఒక నిత్యావసరం..అదొక ఔట్లెట్..ఒక విముక్తి...ఆ ఔట్లెట్ లేనప్పుడు చుట్టూ ఉన్న ప్రపంచపు నీలినీడలు క్రమేణా అతనిలో విషంలా పేరుకుపోయి జీవితాన్ని నిరర్ధకం చేస్తాయంటూ,"You must stay drunk on writing so reality cannot destroy you." అంటారు..

మరో చోట రచనా వ్యాసంగానికి పురిగొల్పే కీలక అంశాలను ప్రస్తావిస్తూ,ఒక రచయితకు ముందుగా తనకు అత్యంత ప్రీతి పాత్రమైనదేంటో తెలియాలంటారు..అలాగే అన్నిటికంటే మిక్కిలి అయిష్టమైనదీ కూడా ఏంటో తెలుసుకోమంటారు..ఆ రాగద్వేషాల గాఢతే మంచి రచనకి పునాది అంటూ,వాటితో పాటు Zest,Gusto లను కూడా తోడు తీసుకెళ్తే రచనలో స్వఛ్ఛత కనిపిస్తుందన్నది బ్రాడ్బరీ ఫార్ములా..ఇక రాయడానికి మంచి మంచి ఐడియాస్ కావాలంటే ఎలా ? దానికి కూడా మంచి సమాధానం ఇచ్చారు బ్రాడ్బరీ..

But ideas lie everywhere, like apples fallen and melting in the grass for lack of wayfaring strangers with an eye and a tongue for beauty, whether absurd, horrific, or genteel.

భవసాగరాల ఈదులాటల మధ్య ఆర్ట్ (ఇక్కడ రైటింగ్) ప్రాముఖ్యతను గురించి మాట్లాడుతూ,ఏ కళైనా యుద్ధాలు,ఒంటరితనం,మరణం,ద్వేషం,వృద్ధాప్యం లాంటి వాటి నుండి విముక్తుల్ని చెయ్యలేదు గానీ మనసుకి తప్పకుండా స్వాంతన చేకూరుస్తుందంటారు..ఆ క్రమంలో రైటింగ్ ను ఒక 'సర్వైవల్' గా అభివర్ణిస్తూ Not to write,for many of us ,is to die అంటారు..ఇలాంటి కొన్ని వాక్యాలు ఆ కాలంలో రచయితలకు తమ పని పట్ల ఉండే నిబద్ధతను మరోసారి గుర్తుచేస్తాయి..
మరోచోట ఆగి ఆలోచించడం సృజనాత్మకతకు ప్రతిబంధకం అని చెప్తూ,అసంకల్పిత స్థితిలో వచ్చిన ఆలోచనల్ని ఎంత త్వరగా పేపర్ మీద పెడితే ఆ రచనలో అంత స్వఛ్ఛత,నిజాయితీ కనిపిస్తాయంటారు..అంటే ఆ అసంకల్పిత స్థితికి,రచయితకీ మధ్య వచ్చే తర్కాన్ని (ఇంటలెక్ట్) ను ఎంత దూరం పెడితే అంత మంచిదన్నమాట.

Run fast, stand still. This, the lesson from lizards. For all writers.

What can we writers learn from lizards, lift from birds? In quickness is truth. The faster you blurt, the more swiftly you write, the more honest you are. In hesitation is thought. In delay comes the effort for a style, instead of leaping upon truth which is the only style worth deadfalling or tiger-trapping.

ఇరవైల తరువాత పల్ప్ ఫిక్షన్ కథలు రాస్తున్న కొత్తల్లో Henry Kuttner,Leigh లు తన గురువులుగా,వారి  సూచన మేరకు Katherine Anne Porter,John Collier, Eudora Welty లనూ The Lost Weekend, One Man's Meat, Rain in the Doorway లాంటి కొన్ని పుస్తకాలనూ చదివారు బ్రాడ్బరీ..అప్పుడు జరిగింది ఒక అద్భుతం..ఇరవై ఒకటో ఏడులో అడుగుపెడుతున్న సమయంలో కొన్ని వేసవి మధ్యాహ్నాలు,అక్టోబర్ రాత్రుల్లో నెమ్మదిగా తన ఇష్టాలు,అయిష్టాలు కలగలిపిన చిట్టాను తయారు చేసుకుంటున్న తరుణంలో ఆ వెలుగు చీకట్ల మధ్య తనదైన ఉనికిని దేన్నో అస్పష్టంగా గుర్తించారు బ్రాడ్బరీ..అప్పుడు అనుకరణలకతీతంగా 'ది లేక్' అనే కథ రాసిన అనంతరం ఆయనకు తెలీకుండానే చెంపలపై జాలువారిన కన్నీళ్ళు ఆయన ఒక పరిపూర్ణమైన రచయితగా మారారనడానికి సాక్ష్యాలు.

రచయితకు రోజు వారీ జీవితంలో ఎదురయే చిన్న చిన్న సంఘటనలే కాదు..ఎక్కడో విన్న ఒక చిన్న మాట,ఒక పదం కూడా స్ఫూర్తినిస్తాయి..అలా పదాలను ప్రోగుచేసుకుంటూ,వాటిని వాక్యాల మధ్య అమరిక కోసం ఒకదానికొకటి  ముడులు వేసుకుంటూ తొలుత కథను రాయడం మొదలు పెట్టానని చెప్పడం ఒక్కో సందర్భంలో పాఠకుల్ని ఆశ్చర్యపరిచినా, "మీకు ఇవి మెకానికల్ గా అనిపించవచ్చు,కానీ ఇవి నా అనుభవాలు,మీకు కూడా ఉపయోగపడతాయేమో,ప్రయత్నించి  చూడండి" అని చెప్పిన సమయంలో ఆయన నిజాయితీ ఎంతో నచ్చింది..ఆర్టిస్ట్ కావడానికి దైవాంశ సంభూతులై ఉండాలి,సరస్వతీ కటాక్షం ఉండాలి లాంటి సంప్రదాయ వాదనలకు దూరంగా పాఠకులకు అర్ధమయ్యే రీతిలో ఆచరణకు అనువుగా "ఈ లాజిక్ అప్లై చెయ్యండి / లేదా ఇలా చేసి చూడండి / నేనూ అప్పుడిలాగే చేశాను,నాకు వర్క్ అవుట్ అయ్యింది / నేనూ రాసేటప్పుడు ఫలానా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ తన అనుభవాల సారన్నంతటినీ రంగరించి రచయితలకు చాలా సరళమైన పద్ధతుల్ని సూచిస్తూ మార్గనిర్దేశం చేశారు బ్రాడ్బరీ.

ఆర్ట్ గురించీ,రైటింగ్ గురించీ ఇంతవరకూ చదివేసినా ఎక్కడా మా గురువుగారు వైల్డ్ ప్రస్తావన రాలేదేంటి చెప్మా అని ఆశ్చర్య పోతున్నంతలో ఈ పోయెమ్ ను ప్రస్తావించారు బ్రాడ్బరీ..

We might start off by paraphrasing Oscar Wilde's poem, substituting the word "Art" for "Love."

Art will fly if held too lightly,
Art will die if held too tightly,
Lightly, tightly, how do I know
Whether I'm holding or letting Art go?

ఇకపోతే రచన చెయ్యడానికి ముడి సరుకు కావాలంటే ఎక్కడో వెతుక్కోకుండా ముందుగా మన సబ్ కాన్షియస్ లో ఎక్కడో మూలన దాక్కున్న డేటాను వెలికి తియ్యమంటారు..ఒక జీవితకాలంలో చూసినవీ,విన్నవీ,కన్నవీ,ధ్వనులు,రుచులు,వాసనలూ,వ్యక్తులూ,ప్రకృతి,సంఘటనలూ ఇలా ఇవన్నీ దొరికే భాండాగారం మన మనస్సేనట..ఒకరకంగా మన ఊహాశక్తిని ఫీడ్ చేసే ఆహారం ఈ డేటానే అంటారు..మెలకువలో వాస్తవాన్ని,జ్ఞాపకంతోను అలాగే నిద్రిస్తున్నపుడు జ్ఞాపకాన్ని,జ్ఞాపకంతోనూ సరిచూసుకోవడం కూడా ఒక ఆర్టిస్టు అలవర్చుకోవాల్సిన విషయం..

If it seems I've come the long way around, perhaps I have. But I wanted to show what we all have in us, that it has always been there, and so few of us bother to notice. When people ask me where I get my ideas, I laugh. How strange-we're so busy looking out, to find ways and means, we forget to look in.

My ideas drove me to it, you see. The more I did, the more I wanted to do. You grow ravenous. You run fevers. You know exhilarations. You can't sleep at night, because your beast-creature ideas want out and turn you in your bed. It is a grand way to live.

అలాగే ఇందులో Muse గురించి రాసిన వ్యాసం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది..మనమేదో పని చేసుకుంటున్నప్పుడు మెదడుని తొలుస్తూ,పట్టుకుందామని వెంటపడితే,చిన్న అలికిడికే దూరంగా ఎగిరిపోయే తేలికపాటి పక్షి ఈక లాంటి సున్నితమైన Muse ను అదుపులోకి తెచ్చుకోవడానికి కూడా కొన్ని మార్గాల్ని సూచించారు..సబ్ కాన్షియస్ కు డైట్ మెనూ చెప్తూ ముందుగా ప్రతి రోజూ కవిత్వం చదవమంటారు..కవిత్వంలో దాగున్న మెటాఫోర్స్ మెదడుకి మంచి మేత..ఇది మన సెన్సెస్ ను మంచి కండిషన్ లో ఉంచుతుంది..కవిత్వం తరువాత వ్యాసాలు,వాటి తరువాత కథలు,నవలలూ కూడా చదవమంటారు కానీ మంచి రచయిత  కావాలంటే తనలా ఆలోచించే వారి కథలే కాకుండా తనలా ఆలోచించని వారిని కూడా చదవడం అవసరమంటారు..భాష,ఆలోచనల్లో ఏ ప్రత్యేకతా లేని తన తండ్రి తనకు అత్యంత ఇష్టమైన అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు మాత్రం అతనిలో కవిత్వం పెల్లుబుకుతుందంటూ,నిజాలు మాట్లాడే ప్రతి మనిషి నోట్లోంచీ కవిత్వం పుట్టుకొస్తుందంటారు.

Be certain of this: When honest love speaks, when true admiration begins, when excitement rises, when hate curls like smoke, you need never doubt that creativity will stay with you for a lifetime. The core of your creativity should be the same as the core of your story and of the main character in your story.

పలుచోట్ల బ్రాడ్బరీ స్వస్థలమైన Waukegan,Illinois పై ఆయన ప్రేమ కూడా ఈ వ్యాసాల్లో తళుక్కుమంది..ముప్పై మూడేళ్ళ వయసులో B. Berenson నుండి వచ్చిన ఫ్యాన్ లెటర్ ను ప్రస్తావిస్తూ ఒక్కోసారి తన ఆలోచనల్ని ఆమోదించే వారు ఒక రచయితకి ఎంత అవసరమోనంటారు..

I needed that approval. We all need someone higher, wiser, older to tell us we're not crazy after all, that what we're doing is all right. All right, hell, fine!

ఈ పుస్తకంలో ఫారెన్ హీట్ 451,మార్షియన్ క్రానికాల్స్,డాండేలియన్ వైన్ లతో పాటు ఆయన రాసిన ఇతర రచనలను గురించిన ఆసక్తి కరమైన విషయవిశేషాలున్నాయి..

A last discovery. I write all of my novels and stories, as you have seen, in a great surge of delightful passion. Only recently, glancing at the novel, I realized that Montag is named after a paper manufacturing company. And Faber, of course, is a maker of pencils! What a sly thing my subconscious was, to name them thus.And not tell me!

సహజంగా విజయమైతే స్వయంకృతమనీ,అపజయమైతే విధిని నిందించే లోకంలో తన విజయాల్లో కృషితో పాటు అదృష్టం కూడా ప్రధాన పాత్ర పోషించిందని చెప్పడం ఆయన మీద గౌరవాన్ని రెట్టింపు చేసింది..ఈ పుస్తకంలో అన్ని వ్యాసాలూ ఒకెత్తయితే చివరగా క్రియేటివిటీ గురించి ఆయన రాసిన ఎనిమిది కవితలు మరొకెత్తు..ఈ పుస్తకం సారాన్నంతటినీ ఒక విధంగా ఆ ఎనిమిది కవితల్లో పొందుపరిచారా అన్నట్లున్నాయి..రచయితలైనవాళ్ళు,రచయితలు   కావాలనుకుంటున్నవాళ్ళు తప్పకుండా చదవవలసిన పుస్తకం ఇది.

What if Norman Corwin had not sent me or if Walter I. Bradbury had not received me?
Mars might never have gained an atmosphere, and its people would never have been born to live in golden masks, and its cities, unbuilt, would have stayed lost in the unquarried hills. Much thanks to them then for that journey to Manhattan, which turned out to be a forty-year round trip to another world.

పుస్తకం నుండి మరి కొన్ని వాక్యాలు..
Even as I write this, a letter has come from a young, unknown writer, who says he is going to live by my motto, found in my Toynbee Convector.
"... to gently lie and prove the lie true... everything is finally a promise... what seems a lie is a ramshackle need, wishing to be born..."

You stumble into it, mostly. You don't know what you're doing, and suddenly, it's done. You don't set out to reform a certain kind of writing. It evolves out of your own life and night scares. Suddenly you look around and see that you have done something almost fresh.

I loved them, and they smothered me. I hadn't learned how to look away and in the process look not at myself but at what went on behind my face.

The children sensed, if they could not say, that fantasy, and its robot child science fiction, is not escape at all. But a circling round of reality to enchant it and make it behave.

It is a lie to write in such a way as to be rewarded by money in the commercial market.
It is a lie to write in such a way as to be rewarded by fame offered you by some snobbish quasi-literary group in the intellectual gazettes.

Remember: Plot is no more than footprints left in the snow after your characters have run by on their way to incredible destinations. Plot is observed after the fact rather than before. It cannot precede action. It is the chart that remains when an action is through. That is all Plot ever should be. It is human desire let run, running, and reaching a goal. It cannot be mechanical. It can only be dynamic.So, stand aside, forget targets, let the characters, your fingers, body, blood, and heart do.

2 comments: