ఇరవయ్యో శతాబ్దపు నియంతృత్వం చెరిపేసిన చరిత్ర పుటల్లో రష్యన్ రచయిత 'Sigizmund Krzhyzhanovsky' జీవితం కూడా ఒక భాగం కావడంతో ఆయన బ్రతికున్నంత కాలం ఆయన ఫిక్షన్ రాస్తున్నారని ఎవరికీ తెలీదట..ఆయన మరణానంతరం ప్రచురణకు నోచుకున్న ఆయన రచనలు 'న్యూయార్క్ రివ్యూ బుక్స్ క్లాసిక్స్' లిస్టులో చేరి కీర్తినార్జించాయి..''Sigizmund Krzhyzhanovsky'- అసలీ పేరు సరిగ్గా ఉచ్ఛరించడానికే నాకు చాలా సమయం పట్టింది :) పేరు చూస్తుంటే మరీ ఎలియన్ ఫీలింగ్ కలుగుతోంది అనుకుంటూ టాల్స్టాయ్,చెఖోవ్ లాంటివాళ్ళు కొందరు తెలుసుగానీ ఈయన పేరెప్పుడూ వినలేదే సరే చూద్దాం అనుకుంటూ మొదలు పెట్టాను..కొన్ని పేజీలు చదివేసరికి రష్యా,ఇండియా,భూమీ,ఆకాశం,నువ్వూ,నేనూ ఉహూ...ఇవేమీ గుర్తులేవు..ఎవరో హిప్నటైజ్ చేసినట్లు అబ్స్ట్రాక్ట్ లోకంలో రచయిత తీసుకెళ్ళిన చోటుకల్లా నోరు వెళ్ళబెట్టి చూస్తూ వెళ్ళిపోయాను..Sigizmund శైలి పాఠకుల్ని అమాంతం వశపరుచుకునే శైలి...మెదడు,కళ్ళు మన ఆధీనంలో లేకుండా పూర్తిగా ఆయన అక్షరాలకు లోబడిపోతాయి..
'ఫెంటాస్టిక్' genreలో ఆయన కూర్చిన ఈ కథలన్నీ టైం మెషీన్ లో పాఠకుల్ని కాలంలోకి ప్రయాణించేలా చేస్తాయి..సంక్లిష్టమైన ఫిలాసఫీని ఆవిష్కరించడానికి 'ఫెంటాస్టిక్' (unearthy/imaginative) ని మించిన genre లేదనీ దాన్ని Krizhizhanovsky ఉపయోగించుకున్నట్లు వేరే ఎవరూ ఉపయోగించుకోలేదనీ Adam Thirwell తన ముందుమాటలో అంటారు..Sigizmund రచనలు (philosophical and phantasmagorical fictions) సోవియట్ రాష్ట్రాన్ని పాజిటివ్ లైట్ లో చూపించలేకపోయిన కారణంగా ఆయన రచనలు,ఆయన గతించిన తరువాత కూడా చాలా ఏళ్ళు ప్రచురణకు నోచుకోలేకపోయాయట.
Image Courtesy Google |
ఇందులో మొత్తం పదకొండు కథలు ఉన్నాయి..మొదటి కథ,'ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ అ కార్ప్స్' లో ఒక మరణించిన వ్యక్తి ,తన గదిలో ఉండటానికి వచ్చిన మరో అపరిచిత వ్యక్తిని (ఇక్కడ జర్నలిస్ట్ Shtamm) అడ్రస్ చేస్తూ రాసి వదిలేసిన నోట్ బుక్ ఉంటుంది..ఈ కథ రష్యన్ ప్రొవిన్షియల్ ప్లేస్ నుండి మాస్కోకు తమ కలలను సాకారం చేసుకునే దిశగా తరలివచ్చిన యువతకు,తమ ఉనికిని చాటుకునే క్రమంలో ఎదురయ్యే ఐడెంటిటీ ఇష్యూస్,ఒంటరితనం,బోర్ డమ్ లాంటి అంశాల్ని ఫిలసాఫికల్ గా చర్చిస్తుంది..విచిత్రమేంటంటే Krzhizhanovsky ఈ పుస్తకంలో భారతీయ జానపదాల గురించి అలవోకగా చర్చిస్తారనుకోలేదు..ఈ కథలో ఉన్నట్లుండి విక్రమార్కుడు భేతాళుడి ప్రస్తావన కల్లో కూడా ఊహించం..ఆ మధ్య ఉర్సులా లెగైన్ కూడా 'నో టైమ్ టు స్పేర్' లో ఇలాగే మహాభారతాన్నిఇలియడ్ తో పోల్చి ఆశ్చర్యానికి గురిచేశారు..అసలు ఈ 'ఫెంటాస్టిక్' genre రచయితల్ని చదువుతుంటే,వీళ్ళందరికీ అంతర్జాతీయ సాహిత్యం మీద,అందులోనూ మన జానపదాల మీద సైతం ఎంత అవగాహన ఉందోనని ఆశ్చర్యం కలగక మానదు..Krzhizhanovsky ఇండియన్ ఫిలాసఫీని కూడా ఔపాసన పట్టారనడానికి ఇందులో చాలానే సాక్ష్యాలు ఉన్నాయి..గూగుల్ లేనికాలంలోనే పూర్వపక్షం గురించీ,పతంజలి,వ్యాసుల గురించిన ప్రస్తావనలు ఆయనకు అంతర్జాతీయ సాహిత్యంపై ఉన్న విస్తృతమైన అవగాహనను సూచిస్తాయి..ఈయన సమకాలీనులైన బోర్హెస్,కాఫ్కా లాంటి వారికి లభ్యమైన ఆధునిక గ్రంధాలు కూడా అందుబాటులో లేనప్పటికీ Krzhizhanovsky లైబ్రరీలో Poe,పుష్కిన్,గోగోల్ ల వంటివారు ఉండేవారట..కానీ ఇన్ని పరిమితుల మధ్య,ఒక చిన్న గదిలో రెండు దశాబ్దాల తరబడి ఏ ప్రతిఫలాపేక్షా లేకుండా రచనలు చేసిన Krzhizhanovsky ని ఒక ఋషిగా భావించడంలో గానీ,ఆయన కలం నుండి వెలువడ్డ రచనల్ని అపురూపమైన కళాఖండాలు అనడంలో గానీ ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.
An old Indian folktale tells of a man forced to shoulder a corpse night after night—till the corpse, its dead but moving lips pressed to his ear, has finished telling the story of its long-finished life. Don’t try to throw me to the ground. Like the man in the folktale, you will have to shoulder the burden of my three insomnias and listen patiently, till the corpse has finished its autobiography.
ఇందులో ఒక్కో కథా ఒక్కో రత్నమైతే,నాకు అన్నిటికంటే ఎక్కువ నచ్చిన కథ 'ది ల్యాండ్ ఆఫ్ నాట్స్' ...కనీసం మూడు,నాలుగు సార్లు చదివుంటాను ఈ ఒక్క కథనీ..ఇది అస్తిత్వవాదాన్ని గురించిన కథ.. ఈ genre లో ఇంత మంచి కథ మునుపెన్నడూ చదివిందీ లేదు,ఇక ముందు చదువుతానన్న నమ్మకమూ లేదు..ఎప్పుడూ కంఫర్టబుల్ జోన్ లో కూర్చుని,తమను తాము ఇంటెలెక్టువల్స్ లా ఊహించుకునే పుస్తకాల పురుగులకి సైతం ఈ కథలో మొట్టికాయలు,చెంపదెబ్బలు తప్పవు..Krzhyzhanovsky దృష్టి అంతా ఆయనలో చెలరేగే తాత్వికప్రవాహాన్ని అక్షరీకరించడం వైపే ఉంటుంది తప్ప చదివేవారి స్పందనతో ఆయనకి సంబంధం ఉన్నట్లు కనపడదు...అంతగానూ ఆకట్టుకున్న మరో కథ 'In the pupil',ఈ కథలో ఒక వ్యక్తి తన ప్రియురాలి కళ్ళలోకి చూసినప్పుడు కనిపించిన ఇమేజ్ ఒకటి చిన్న వ్యక్తి రూపంలో ప్రాణం పోసుకుంటుంది..ఆమె కనుపాపల్లో ఆమె జ్ఞాపకాల తాలూకూ ప్రతిబింబాలన్నీ సజీవమైన పాత్రలుగా,వారి అనుభవాలను చర్చించడం చాలా సరదాగా ఉంటుంది..ఈయన కథలు ఎటునించి ఎటు వెళ్తాయో తెలీదు..ఈ కథలోనైతే మరీనూ,కథనం పాదరసంలా సైకాలజీకీ నుండి కెమిస్ట్రీకి ,కెమిస్ట్రీ నుంచి ఫిక్షన్ కీ అలవోకగా దిశలు మార్చుకుంటూ ఉంటుంది..ప్రేమలు,వాటిల్లో రకాలు,మానవ సంబంధాలు సర్రియలిస్టిక్ కాన్సెప్ట్స్ తో జతచేసి రాసిన ఈ కథలో ఇమేజెస్ ప్రధాన పాత్రలుగా కథను చెప్తాయి.."Like Poe, Krzhizhanovsky takes us to the edge of the abyss and forces us to look into it. “ అని Adam Thirwell తన ముందుమాటలో అన్నట్లు ఈ కథలన్నీ మనల్ని లోతు తెలియని అగధాల్లోకి తొంగి చూడమంటాయి..ఈయన్ని చదివితే,పాఠకులుగా ఇకముందు ఏ రచనను విశ్లేషించి చూడాలన్నా Krzhyzhanovsky ని చదవక మునుపు, Krzhyzhanovsky ని చదివిన తరువాత అనుకునేలా చేస్తాయి.
In the Pupil కథ నుండి,
Sometimes you become accustomed to a trifle, invent a meaning for it, philosophize it—then before you know it, that trifle starts raising its hand, contradicting the important and the real, brazenly demanding more existence and legitimacy.
To make someone fall in love with you is to take possession of their ‘associative matter’; love itself, schematically speaking, is nothing but a special case of two-way association".
Only by changing the objects of that emotion, only by throwing more and more wood onto the fire of feeling can one maintain its white heat.
The real love object is constantly changing, and one can love you today only by betraying the person you were yesterday.
“Listen,” I turned to Sixth, “I know how we, the rest and I, got here, but why do you need love? What are you doing at the bottom of this pupil? You have the soul of a bibliophile. All you need are your bookmarks. You should have gone on living with them and your formulas, your nose in a book, rather than butting in where you’re not wanted.” The university lecturer looked crestfallen. “It can happen to anyone, you see . . . Even Thales.
With a new day nearing, I began to consider how to convey everything without saying anything. To begin with, I must cross out the truth; no one needs that. Then variegate the pain to the limits of my canvas. Yes, yes. Add a touch of the day-to-day and over all, like varnish over paint, a veneer of vulgarity—one can’t do without that. Finally, a few philosophical bits and . . . Reader, you’re turning away, you want to shake these lines out of your pupils. No, no. Don’t leave me here on this long empty bench: Hold my hand—that’s right—tight, tighter still—I’ve been alone for too long. I want to say to you what I’ve never said to anyone: Why frighten little children with the dark when one can quiet them with it and lead them into dreams?
మరో కథలో ఒక పియానిస్ట్ చేతి వేళ్ళు అతన్ని వదిలి పారిపోతాయి..ఇంకో కథ 'Bridge over the Styx' లో ఒక ఇంజినీర్ కు కలిగిన భ్రాంతిలో భాగంగా Styx (In Greek the meaning of the name Styx is: A river of the under world ) నుండి భూమ్మీదకు వచ్చిన కప్ప మృతజీవుల జ్ఞాపకాలన్నీ కలిసిపోయే మృత సముద్రపు సంగతుల్ని ఫిలసాఫికల్ ధోరణిలో చెప్తుంది..
'Yellow Coal' డిస్టోపియన్ శైలిలో,డార్క్ హ్యూమర్ అంతర్లీనంగా రాసిన మరో ప్రత్యేకమైన కథ,ఇది చదువుతున్నంతసేపు జార్జ్ ఆర్వెల్ 'ఆనిమల్ ఫార్మ్' గుర్తుకువచ్చింది..ఇందులో ఒక వ్యక్తి మానవ జాతిని ప్రేమించడానికి చేసే వ్యర్ధ (?) ప్రయత్నం అసలు మర్చిపోలేం :)
చివరి కథ Postmark:Moscow కొన్ని పోస్టు చెయ్యని ఉత్తరాలు..ఇవి రచయిత కళ్ళతో చూసిన ఆ కాలంనాటి మాస్కో నగరాన్ని పరిచయం చేస్తాయి..ఇందులో అన్ని కథల్లోనూ కీలకంగా ఉండే 'I' కథా,కథనాల్ని బట్టి రూపాంతరం చెందుతుంటుంది..ప్రత్యేకమైన ఆకారం గానీ characteristics గానీ ఏమీ ఉండని ఈ 'I' ,సైన్స్ భాషలో చెప్పాలంటే ఒక catalyst గా కనపడుతుంది.
ఒక మనిషి కొన్ని పదాలు రాస్తే అందులో ఎంతో కొంత అతని ఆత్మ కనిపిస్తుంది..ఇంకొన్ని పదాలు రాస్తే ఆ సదరు వ్యక్తి అస్థిత్వాన్ని గురించి ఒక అవగాహనకు వస్తాం..కానీ రెండువందల పేజీల పైగా అనేక విషయాలపై అనర్గళంగా తన మెడిటషన్స్ కి అక్షరరూపమిచ్చిన Krzhyzhanovsky నాకు ఇప్పటికీ ఒక అబ్స్ట్రాక్ట్ ఆబ్జెక్ట్ గానే మిగిలిపోయారు..ఇలాంటి అరుదైన రచయితలు మన ఊహలకు రెక్కలిస్తారేగానీ,మనకు దిశానిర్దేశం చెయ్యరు..వాస్తవానికీ,ఊహకీ మధ్య రెపరెపలాడే క్షణకాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకునే అరుదైన రచయిత ఈయన..ఈ కథల్లో ఆబ్సెన్స్ ఆఫ్ లైఫ్ కీ,రియాలిటీ ఆఫ్ లైఫ్ కీ మధ్య రెప్పపాటు క్షణంలో కోల్పోయే జీవన చిత్రాన్ని మన కళ్ళకు కట్టే సాహసం చేశారు Krzhyzhanovsky..మనిషిని 0.6 పర్సన్ కి కుదించినా,కనుపాపల్లో ప్రతిబింబం సజీవంగా ప్రాణంపోసుకుని వెంటాడినా,పియానిస్ట్ చేతి వేళ్ళు అతన్ని వదిలి పారిపోయినా,ఇవన్నీ సాధ్యమేనా అని ఒక ప్రక్క అనుకుంటూనే,మరో ప్రక్క నిజమేనని నమ్మేస్తాం..వాస్తవంలో సాధ్యం కానీ విషయాలను సుసాధ్యం చెయ్యడంలో భాషని ఒక టూల్ గా ఎంత నేర్పుగా ఉపయోగించచ్చో Krzhyzhanovsky కథలు చదివితే తెలుస్తుంది.
రెండు స్థితుల నడుమ ఊగిసలాడే ఈ ఫెంటాస్టిక్ genre కూడా సంక్లిష్టమైనది..ఒక స్థితిలో అద్భుతంగా కనిపించేదంతా చివరకు హేతుబద్ధమైన వివరణతో ముగుస్తుంది..మరో ప్రక్క ఇలాంటి వివరణలేవీ లేకుండా కేవలం ఒక అద్భుతాన్ని ఆవిష్కరించి మన ఊహకు వదిలేస్తారు..కానీ ఈ రెండు స్థితులకతీతమైన “psychic reality of experience” తో కూడిన ఫిలాసఫీ Krizhizhanovsky కథల్లో కీలకమైన అంశం..ఈయన్ని చదివేటప్పుడు reading between the lines/seeing through the gaps ఈ రెండూ తప్పనిసరి..ఎందుకంటే ఆయన చెప్పాలనుకున్నవన్నీ ఆ వాక్యాల మధ్య గ్యాప్స్ లో దాచేస్తారు..మన దృష్టిని దాటిపోయిన బిందువు వద్దే Krizhizhanovsky కథ రూపకల్పన మొదలవుతుంది..అలాగే సరిగ్గా మన ఊహాశక్తి శూన్యగతిని చేరే చోటులోనే ఆయన ఊహాలోకపు ద్వారాలు తెరుచుకుంటాయి.
ఈ కథలు చదువుతునప్పుడు ఒక చిన్న సంగతి..సహజంగా నిద్రపోయేటప్పుడు చదవడం అలవాటు కావడంతో ఒక రోజు రాత్రి 'ఇన్ ది ప్యూపిల్' కథ చదువుతున్నాను..అప్పటికే 12 దాటింది,పుస్తకం ప్రక్కన పెట్టేసి రెప్పల బరువుకి నిద్రకుపక్రమించే సమయం అది..కానీ ఆ సమయంలో రెప్పవెయ్యడం మర్చిపోయిన కళ్ళు కొన్ని వాక్యాలు మీద అదేపనిగా పరిగెడుతున్నాయి..అప్పుడు ఆ వాక్యాలు మనసులోపలి పొరల్లో రేపిన అలజడికి ఉన్నట్లుండి లేచి కూర్చున్నాను..శ్రద్ధగా ఏదో భగవద్గీతనో,రామాయణాన్నో పట్టుకున్నంత శ్రద్ధగా పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని మళ్ళీ కొన్ని వాక్యాలు వెనక్కి వెళ్ళి చదవడం మొదలు పెట్టాను..ఒక రచయిత పాఠకుల మనసుపై ఏ స్థాయిలో ముద్ర వెయ్యగలరో చెప్పడానికి ఆ క్షణం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే..ఒక పుస్తకాన్ని మళ్ళీ మళ్ళీ చదవకపోతే ఇక ఆ చదవడం వల్ల ఉపయోగం లేదంటారు ఆస్కార్ వైల్డ్..మాములుగా అయితే వైల్డ్ ఏదైనా ఒకసారి చెప్పాక తర్కించడం పాపం అనుకుంటాను..కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం ఆయనకీ నాకూ చుక్కెదురు..ఎంత నచ్చిన పుస్తకమైనా రెండోసారి చదవడానికి అస్సలు ఇష్టపడను..Life is too short to re-read a book అనే ఫిలాసఫీని నమ్మే నేను,ఈ కథల్ని కొన్నిటిని రెండు,మూడు సార్లు చదవడం నాకే ఆశ్చర్యం కలిగించింది..నేను ఇప్పటి వరకూ చదివిన సాహిత్యం అంతా ఒక వైపైతే Krzhyzhanovsky ని చదవడం మరో వైపు..ఉర్సులా లెగైన్ అన్నట్లు అమెజాన్ టాప్ 100 లోనో,మాన్ బుకర్,నోబెల్ ప్రైజుల్లోనో సాహిత్యాన్ని కొలుస్తున్న ఈ కాలంలో కూడా ఎక్కడో ఒక మారుమూల గదిలో Krzhyzhanovsky లాంటి వాళ్ళు గెలుపోటములతో ప్రమేయం లేకుండా అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టిస్తూనే ఉండి ఉంటారు.Krzhyzhanovsky అద్భుత ప్రపంచాన్ని నాకు పరిచయం చేసిన నాగరాజు పప్పు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
పుస్తకం నుండి కొన్ని వాక్యాలు,
But at the time I gave this phenomenon a special name: psychorrhea. Meaning “soul seepage.” Sometimes that measured flight—drop by drop—into the emptiness even frightened me. I would turn on the light and shoo both the dusk and the pseudo-sound away. The dusk, the boredoms, the “T,” and the hallucinations would all disappear: It was then that that ultimate loneliness, known to only a few of the living, would begin, when you are left not only without others but without yourself.
Only by holding a lighted match up to the paper square’s top lines did I learn that it was collecting not only boots and undershirts but bodies with what was in them: life. About the price of this last item, it said nothing.
Now I understand: Any “I” not nourished by “we,” not umbilically attached to the maternal organism enveloping its small life, cannot begin to be itself. Even the mollusk hidden inside tight-shut valves, if one helps those valves by binding them with a tight metal band, will die.
The Collector of Cracks నుండి,
“One can never finish. My point is this: If there is no single thread of time, if being is not continuous, if ‘the universe is not whole’ but cloven by cracks into odd, unrelated pieces, then all those textbook ethics based on the principle of responsibility, on the connectedness of my tomorrow with my yesterday, all fall away and are replaced by a single crackist ethic. The formula? Just this: For everything left behind the crack, I, who have stepped over the crack, am not responsible. I am here, the deed is there, behind me. I and what I have done are in different worlds, and between those worlds there are no windows. Oh, that I realized long ago. Do you understand?”
A philosophizing Not once said, “Being cannot not be without becoming Nothing, while Nothing cannot be without becoming Being.”
But there’s no sense becoming too nonsensical and delving too deeply into metaphysics—don’t you agree?
When you, Tintz, reach our mires . . .O, there’s nothing you can’t find in nothing! I assure you, all that life of yours betinseled with stars and suns is so much . . . Extrastyxia.To live is to defect from death. True, all of you who have run away from nothing return to nothing sooner or later—because there is nothing else.
Other people too, of course, wrestle as best they can with this or that problem; under any frontal bone lives some question to unsettle the mind and torment the “I.” Even so, I envy other people: They can hide their problem inside notebooks, lock it away in a laboratory, contain it in mathematical symbols. They may, at least for a short while, go away from their conundrum, disengage from it, and give their thoughts a rest. But I can never leave my theme: I live inside it.
I stride past bookshop windows with their ever-changing covers: Moscow.
Here, in the city, associations tend to be strangely uniform: An association by similarity (especially an inner, essential similarity) is rare and almost unachievable. Here the barbershops all trim mustaches the same way, dress shops all button women into much the same styles, bookshop windows all display the same book covers—all billed as THE LATEST THING! From nine to ten every morning four-fifths of the total number of eyes are hidden behind newssheets identical down to the last misprint. No, here in the city, if you make associations by similarity, you’re bound to confuse everything (the familiar with the unfamiliar, today with yesterday), to grow melancholy, and even to go mad.
The “ideologies,” so to speak, of all these socially minded novelists (90 percent of all novelists today) have lost their way, like some bumpkin, in a forest of three pencils; their themes begin not from the beginning but from the workbench, which they know about from Granat’s Encyclopedia.
Besides, people who edit other people’s thoughts have their own particular probes; they’ll never find their Moscow in your fragmented lines, they won’t bother about the imported thoughts of an imported person: They’ll pass over them, like the others.
The dead, the idea glimmered, are to be envied. Barely stiff, and down goes the lid; on top of the lid goes damp earth; on top of the damp earth, sod. And that’s that. But here, as soon as you begin bumping along in a dray,they cart you on and on like that, from pothole to pothole, through spring and winter, from one decade to the next, unmourned and unneeded.
I have long preferred the narrow margins of books to the monotonous miles of earthly fields; the spine of a book has always seemed more intelligent to me than confused lectures about “the roots of things”; the sheer accumulation of those things, everywhere one looks, strikes me as crude and meaningless compared to the wise and subtle concatenations of letters and symbols hidden in books. Though the lines in books deprived me of half of my eyesight (55 percent), I never resented them: They knew too well how to be meek and dead. Only they, those silent black signs, could deliver me, however briefly, from my importunate, listless, and sleepy boredoms.
No comments:
Post a Comment