Thursday, December 27, 2018

Goat Days - Benyamin

మేము కేరళలో ఉన్నకాలంలో ఒక పుస్తకాల సంత జరిగింది. అప్పటికే చెన్నై బుక్ ఫెయిర్స్ ని బాగా మిస్ అవుతున్నానేమో ఆ చిన్న పుస్తకాల సంతను చూడగానే ప్రాణం లేచొచ్చినట్లైంది. లోపలకి వెళ్ళి చూస్తే తొంభై శాతం అన్నీ మలయాళం పుస్తకాలే. ఆ కవర్లు చూస్తూ ఓ ప్రక్క కడుపు నింపుకుంటూ మలయాళం అనువాదాలు ఏమైనా ఉన్నాయా అని వెతగ్గా ఈ పుస్తకం కంటపడింది. ఆ విధంగా రెండేళ్ళకి పైగా నా పుస్తకాల షెల్ఫులో వేచిచూసిన ఈ రచనను ఈ మధ్యనే చదివాను. బెన్యామిన్ రచన 'గోట్ డేస్' 2009 లో కేరళ సాహిత్య అకాడమీ అవార్డు పొందింది. మలయాళంలో 'ఆడు జీవితం' పేరిట రాసిన ఈ కథ సుమారు ఎనభై భాషల్లోకి అనువదించబడింది. దీని ఆంగ్లానువాదం "Man Asian Literary Prize (2012)" లాంగ్ లిస్టులో స్థానం సంపాదించుకోవడంతో పాటు "DSC Prize for South Asian Literature (2013)" ను కూడా గెలుచుకుంది.
Image Courtesy Google

గల్ఫ్ దేశాలకీ కేరళ వాసులకీ ఉన్న విశిష్టమైన అనుబంధం కేరళలో నివాసం ఉన్న సమయంలో నాకు బాగా అనుభవమైంది. వాయనాడ్ లో ఉన్న కాలంలో కేరళ సంస్కృతీ సంప్రదాయాల్నీ, అక్కడి జీవన విధానాన్నీ చాలా దగ్గరగా చూసే అవకాశం లభించింది. కేరళలో ప్రతి ఒక్కరి కలా ఒక స్వంత ఇల్లు. అద్దెకు ఇళ్ళ కోసం తిరుగుతున్నప్పుడు అక్కడ అద్భుతమైన నిర్మాణాలు చూశాము. అన్నీ చక్కటి ఆర్కిటెక్చర్ తో కూడిన సంప్రదాయ కేరళ గృహాలే. వాకబు చేస్తే తెలిసిందేమంటే సింహభాగం ఇళ్ళ యజమానులు దుబాయ్ లో ఉంటారు. వాళ్ళు సంవత్సరానికోమారు కేరళ వచ్చి కొంతకాలం గడిపి వెళ్ళిపోతుంటారు. అలా ఇంటికి ఒకరిద్దరైనా గల్ఫ్ లో ఉండడం అక్కడ సర్వసాధారణం. అరబ్ దేశాల్లో వృత్తిరీత్యా స్థిరపడిన భారతీయుల్లో ఎనభై శాతం మంది మళయాళీలేనట. ఇంత భారీ సంఖ్యలో మలయాళీయుల వలసకు ప్రధాన కారణం కేరళలో పండించే సుగంధ ద్రవ్యాలు. స్పైసెస్ ను సౌదీకి ఎగుమతి చేసే క్రమంలో అక్కడ ఉద్యోగావకాశాల్ని కూడా అందిపుచ్చుకున్నారు కేరళవారు. ఆ విధంగా ప్రతి సగటు మలయాళీకీ గల్ఫ్ లో ఉద్యోగం ఒక కల. కానీ అందమైన కలలు కొందరికి  పీడకలలుగా మారిన సందర్భాలు కూడా కోకొల్లలు. అటువంటి ఒక దురదృష్టవంతుడు నజీబ్ కథే ఈ 'గోట్ డేస్'. విశేషమేంటంటే ఈ కథ కల్పితం కాదు, వాస్తవ ఘటనల ఆధారంగా రాసినది.

కథ విషయానికొస్తే నజీబ్ కూడా సగటు కేరళ వాసిగా గల్ఫ్ దేశాల్లో ఉద్యోగం కోసం సౌదీకి పయనమవుతాడు. ఒక స్వంత ఇల్లు, టీవీ, ఏసీ లాంటి సదుపాయాల కోసం నిండు గర్భిణి అయిన భార్య సైనునూ, తల్లినీ వదిలి రియాధ్ వెళ్తాడు. రియాధ్ చేరగానే అక్కడ ఒక అర్బబ్ (arbab-యజమాని) ఒక జీపులో వచ్చి నజీబ్ నూ, హకీమ్ అనే మరో యువకుణ్ణీ తన వాహనంలో జనజీవనానికి అందనంత దూరంగా ఒక మారుమూల ప్రదేశానికి తీసుకువెళ్తాడు. మనుష్య సంచారం బొత్తిగా లేని ఆ ఎడారి ప్రాంతంలో ఇద్దరూ అర్బబ్ చేతుల్లో దారుణమైన హింసలకు  గురవుతారు. సుమారు ఏడువందల మేకలకూ, కొన్ని ఒంటెలకూ కాపరిగా మసారా (masara-a goat farm) లో నజీబ్ జీవితం అతి దారుణంగా ఉంటుంది. హకీమ్ కూడా నజీబ్ కు సమీపంలోని మరో మసారాలో ఇలాంటి బాధలే పడుతుంటాడు. ప్రతిరోజూ కొన్ని khubus (రొట్టెలు)ను నీళ్ళలో ముంచుకుని తినడం, గొడ్డు చాకిరీ చేస్తూ అర్బబ్ చేతిలో బెల్టు దెబ్బలు తింటూ ఆ ఎడారిలో కనీసం తలపై నీడ కూడా లేకుండా బహిరంగ ప్రదేశంలోనే బ్రతకడం, ఎండకు ఎండి ఎర్రగా పెనంలా కాలుతున్న ఇసుక నేల మీద నిద్రపోవడం లాంటివి నజీబ్ దినచర్యగా మారతాయి. నీళ్ళు ప్రియం కాబట్టి స్నానం లేదు సరికదా కనీసం మలవిసర్జన తరువాత కూడా నీళ్ళతో శుభ్రం చేసుకోలేని దారుణమైన స్థితిలో సుమారు మూడేళ్ళపాటు శరీర దుర్గంధాన్ని భరిస్తూ ఆ నరకంలో నుంచి ఎలా అయినా బయట పడతాననే ఆశతో రోజులు వెళ్ళదీస్తుంటాడు నజీబ్.

కడు దుర్భరమైన జీవితం లేదా మరణం- ఈ రెండూ తప్ప మరో గత్యంతరం లేని దశలో బహుశా ప్రాణం మీద తీపి మాత్రమే మనిషిని నడిపిస్తుంది. అటువంటప్పుడు తనకు దొరికిన జీవితాన్నే (అది నరకమైన సరే) అంగీకరించే పరిస్థితికి మనిషి చేరుకుంటాడు. నజీబ్ కూడా మరో అవకాశం లేని దశలో తన పశువుకంటే హీనమైన జీవితాన్ని అంగీకరిస్తాడు. ఆ మేకలకు Pochakkari Ramani,Marymaimuna,Indipokkar,Njandu Raghavan,Parippu Vijayan అంటూ తన ఊరిలో మనుషుల పేర్లు పెట్టి పిలుస్తూ మాట్లాడుతుంటాడు. ఒక దశలో తన శారీరక అవసరాన్ని కూడా ఆ మేకల సమక్షంలో తీర్చుకుంటాడు. చివరకు తానొక మనిషిననే విషయం పూర్తిగా మర్చిపోయి ఆ పశువుల్లో ఒక పశువుగా (మేకలా) రూపాంతరం చెందుతాడు. వేళకి తిండి,నిద్ర,గొడ్డు చాకిరీ మినహా నజీబ్ జీవితంలో ఇంకేమీ ఆలోచించడానికి లేదు. స్వదేశంలో అతని భార్య, పుట్టబోయే బిడ్డా, తల్లి- వీరందరి బాధలతో అతనికి సంబంధం లేదు. వారందరూ కేవలం అతని గతించిన జీవితంలో ఒక చిన్న భాగంలోని వ్యక్తులుగా మిగిలిపోతారు. ఒక సందర్భంలో "ఎడారిలో సూర్యాస్తమాయలు మాములుగా అయితే అందమైనవే కానీ నా జీవితం దృష్ట్యా ఆ అందాన్ని ఆస్వాదించలేకపోతున్నాను" అంటాడు నజీబ్. అటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఊపిరి ఉన్నంతవరకూ ఎటువంటి అవరోధాలు ఎదురైనా వాటిని అధిగమించగలం అనే ఆత్మవిశ్వాసం నజీబ్ లో అన్ని వేళలా కనిపిస్తుంది.

అటువంటి సమయంలో హకీమ్ మసారాలోకి సోమాలియా నుండి వచ్చిన మరో బానిస ఇబ్రహీం ఖాదిరీ సాయంతో అదను చూసుకుని దారీ తెన్నూ లేని ఆ ఎడారిలో మిణుకుమిణుకుమంటున్న ఆశతో అర్బబ్ మసారా నుండి  తప్పించుకుని బయటకి పరిగెడతారు నజీబ్, హకీమ్. మరి కనీసం నీళ్ళు కూడా తీసుకెళ్ళడం మర్చిపోయి, పాదాలు రక్తాలు ఓడుతుండగా ఆ ఎడారిలో వారు సురక్షితంగా తమ గమ్యం చేరారా లేదా అన్నది తరువాతి కథ. నజీబ్ కు ఆ నరకం నుండి విముక్తి దొరికిందా లేదా? అతని ప్రార్థనలు ఫలించాయా ? ప్రాణాలతో తన స్వదేశానికి రాగలిగాడా లేదా అన్న విషయాలు తెలియాలంటే ఈ పుస్తకం చదివి తీరాల్సిందే.

ఎంత కాలం జీవించామన్నది కాదు, ఎలా జీవించామన్నది ముఖ్యమని అంటుంటారు. క్వాలిటీ vs క్వాంటిటీ గురించి చెప్పడం సులభమే గానీ ఆ నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం ఎదురైనప్పుడు ప్రాణం మీద తీపే గెలిచి తీరుతుందనిపిస్తుంది నజీబ్ జీవితాన్ని చూస్తే. కష్టం సుఖం చెప్పుకోడానికి మరో మనిషి లేని ఒంటరితనం ఎంత దారుణంగా ఉంటుందో, హ్యూమన్ ఇంటరాక్షన్ ఎంత అవసరమో నజీబ్ మూడేళ్ళ నరకాన్ని చూస్తే అర్థమవుతుంది. "మసారాకు చాలా అరుదుగా ఎవరైనా వస్తే చాలు, భాష రాకపోయినా ఆ మనుష్య వాసన కోసం తపనపడుతూ కుక్కపిల్లలా వాళ్ళ వెనుక వెనుక తిరిగేవాణ్ణి అంటాడు నజీబ్. ఏకాంతాలు అందమైనవే కానీ వాటి అందం మానవ సంబంధాలతో కలగలిసి ఉన్నప్పుడే. అడ్రీ హెప్బర్న్ అంటుంది, 'I don't want to be alone,I want to be left alone' అని.

ఇందులో నజీబ్ కథను బెన్యామిన్ చెప్పిన తీరు అద్భుతంగా ఉంది. నెరేషన్ అంతా ఫస్ట్ పర్సన్ లో సాగుతుంది. సులభమైన వర్ణనలతో అలవోకగా మనసుకి హత్తుకునే పదాలు రాయడంలో బెన్యామిన్ నేర్పరితనం అడుగడుగునా కనిపిస్తుంది. ఎక్కడా పట్టుతప్పిపోకుండా క్లిష్టమైన పరిస్థితుల్లో మానవనైజపు భావోద్వేగాల్ని తన వేదాంతధోరణితో బ్యాలెన్స్ చేసిన విధానం ఎంతో బాగుంది. నజీబ్ జీవితం గల్ఫ్ దేశాల వెలుగు జిలుగుల వెనుక చీకటి కోణాల్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. అరబ్ సంస్కృతిలో తరతరాలుగా వ్రేళ్ళూనుకుని ఉన్న అతి కౄరమైన బానిస వ్యవస్థ స్వరూపాన్ని నగ్నంగా నిలబెడుతుంది. ఈ కథలో నజీబ్ జీవితాన్ని తుదికంటా నడిపించేది జీవితం పై ఆశ మాత్రమే. అన్ని కష్టాల్లో కూడా నజీబ్ అల్లా తనకు తోడున్నాడని నమ్ముతాడు. అతని నమ్మకాన్ని నిలబెడుతూ ఆ కౄరమైన మనుషుల మధ్య కొందరు మానవత్వం ఉన్న మనుషులు కూడా అతనికి తారసపడతారు. అర్బాబ్ నజీబ్ తో వ్యవహరించే తీరు కౄరత్వానికి పరాకాష్ట. చేతిలో గన్ తో తన పనివాణ్ణి అనుక్షణం ఒక గ్రద్దలా కాచుకుని కూర్చుని రాత్రీ పగలూ పని చేయించుకోవడం పాశవికంగా ఉంటుంది. ఒక సందర్భంలో నజీబ్ కు ఆర్బాబ్ ను చంపే అవకాశం వచ్చినా వదిలెయ్యడంలాంటి సంఘటనలు నజీబ్ ను పశువుల్లాంటి మనుషుల మధ్య మానవత్వం ఉన్న మనిషిగా నిలబెడతాయి. ఇందులో నన్ను ముఖ్యంగా ఆకట్టుకున్న విషయం ఏంటంటే,ఇటువంటి దీనగాథ వర్ణనలో కూడా ప్రతి పేజీనీ ఒక ఆశావహదృక్పధంతో ముగిస్తారు. నజీబ్ లాంటి వాళ్ళ కథలు చదివితే మన దైనందిన జీవితంలో చాలా స్వల్పమైన, అల్పమైన విషయలుగా కనిపించేవి ఒక్కోసారి ఎంత విలువైనవో తెలుస్తాయి. కష్టం-సుఖం చెప్పుకోడానికో తోడు, తల మీద ఎండకీ వానకీ తలదాచుకోడానికో చూరు, పంచభక్ష్య పరమాన్నాలు కాకపోయినా వేడిగా వండుకున్న కాస్త అన్నం- ఇవన్నీ ఉన్నట్లుండి చాలా విలువైనవిగా అగుపిస్తాయి. ప్రతికూల పరిస్థితుల్లో సైతం మనోనిబ్బరాన్ని కోల్పోకూడదని హితవు చెప్పే ఈ నవల ఎందరికో స్ఫూర్తిదాయకం. అస్సలు క్రింద పెట్టనివ్వకుండా నన్ను ఏకబిగిన చదివించిన పుస్తకం ఈ 'గోట్ డేస్'.

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు..
Those plants taught me life's great lessons of hope.They whispered to me :Najeeb,adopted son of the desert,like us,you too must preserve your life and wrestle with this desert.Hot winds and scorching days will pass.Don't surrender to them.Don't grow weary,or you might have to pay with your life.Don't give in.Lie half dead,as if meditating.Feign nothingness.Convey the impression that you will never resurrect.Secretly appeal to Allah the merciful.He will recognize your presence.He will hear your cries.And finally an opportune moment will come for you.This hot wind will blow away.This heat will dissipate.The cold wind of time will beckon you.Then,only then,should you slowly raise your head from the earth,announce your presence and,then,quickly,spring to freedom.Bloom and come to fruit in the morrow.
I lent my ears to the words of the little plants.I waited patiently for the opportune moment.

Even while heading towards freedom,it is agonizing to depart from our loved ones.I experienced intense grief in that happy moment of freedom.

I suddenly lost all urge to escape.Even when it is set free,a goat reared in a cage will return to the cage.I had become like that.I can't go anywhere in this figure and form.I am a goat.My life is in this masara. Till I end my life or die of some disease.I don't want to show anyone this scruffy shape,this scruffy face,this scruffy life.Mine is a goat's life.

I was like a flower that forced to blossom in the desert. 

Thursday, November 1, 2018

Piano Stories - Felisberto Hernandez

కొన్ని కథలుంటాయి,కాఫీ తాగుతూనో,మధ్యమధ్య ఎవరితోనో మాట్లాడుతూనో కూడా ఆడుతూపాడుతూ చదివెయ్యవచ్చు..అక్షరాల వెంట కళ్ళు పరిగెడితే చాలు,రచయిత అంతరంగం ఉపరితలం వద్దే సునాయాసంగా దొరికేస్తుంది..మరికొన్ని కథలుంటాయి,వీటిలో అక్షరాలకు లోతెక్కువ..అడుగంటా కాలుమోపితే గానీ నీటి స్పర్శ తగలనట్లు అర్ధం అట్టడుగునెక్కడో నిక్షిప్తమై ఉంటుంది..వీటిని కేవలం కళ్ళతో చదవడం సాధ్యపడదు..ఉరుగ్వే రచయిత ఫెలిస్బెర్టో హెర్నాండెజ్ కథలు ఈ రెండో కోవలోకి వస్తాయి..ఈయన రాసిన 'పియానో స్టోరీస్' ను Luis Harss స్పానిష్ నుండి ఆంగ్లంలోకి అనువదించారు,కాగా Francine Prose,Italo Calvino పరిచయ వాక్యాలు రాశారు..తన కథలకు ఎటువంటి లాజికల్ స్ట్రక్చర్ ఉండదని తన మొదటి కథ 'How Not To Explain My Stories' లో చెప్తూనే తన ప్రపంచంలోకి మనల్ని ఆహ్వానిస్తారు రచయిత.

Image Courtesy Google
My stories have no logical structures. Even the consciousness undeviatingly watching over them is unknown to me. At a given moment I think a plant is about to be born in some corner of me. Aware of something strange going on, I begin to watch for it, sensing that it may have artistic promise. I would be happy if the idea weren’t a complete loss. But I can only watch and wait, indefinitely: I don’t know how to nurture the plant or make it bloom. All I have is the feeling or hope that it will grow leaves of poetry or of something that could become poetry when seen by certain eyes.
ఒక్కోసారి మెలకువలో ఏవో సుదూరమైన స్వప్న లోకాలు చుట్టొచ్చిన భావన కలుగుతుంది..ఎక్కడో ఏ మారుమూల ప్రదేశంలోని ఇంటిలో సంచరించినట్లూ,ఎవరో వ్యక్తుల్ని కలిసినట్లూ,మాట్లాడినట్లూ అనిపిస్తుంది..మనం నడిచి వెళ్ళిన చోట్ల పాదస్పర్శలూ,మనం మాట్లాడిన వ్యక్తులూ,ఇంటి లోపలి వస్తువులూ,చేతితో స్పర్శించిన కలమో,కాగితమో మరొకటో ఇలా ఏవేవో ఆబ్జక్ట్స్ అస్పష్టంగా జ్ఞప్తికి వస్తాయి..స్పృహ వచ్చాకా ఏమి జరిగిందో గుర్తు తెచ్చుకుందామని ఎంత ప్రయత్నించినా గుర్తుకురావు..కష్టం మీద Subconscious లో చెల్లాచెదురుగా పడి ఉన్న ముక్కల్ని ప్రోగుచేసి చూస్తే వాటికి ఒక అర్ధంగానీ,లాజిక్ గానీ ఉండవు..ఈ స్వప్నాలు,జ్ఞాపకాలూ అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ ని తలపిస్తాయి..ఫెలిస్బెర్టో హెర్నాండెజ్ కథలు అటువంటి ఛాయా చిత్రాల్లా అనిపిస్తాయి..హేతువాదానికి సుదూరమైనవీ,స్పష్టంగా నిర్వచించలేనివీ,మన ఆలోచనలకు అంతుపట్టనివీ,వాస్తవికతకు ఆమడ దూరంలో ఉండేవన్నీ నిరర్థకం అనుకుంటే పొరపాటేనని ఫెలిస్బెర్టో కథలు నిరూపిస్తాయి.. ఇందులో మొత్తం 15 కథలున్నాయి.
I’ve lived near other people and collected memories that don’t belong to me.
ఒక సాధారణమైన వస్తువును చూసే విషయంలో ఒక మామూలు వ్యక్తి దృష్టికోణానికీ,ఒక నైపుణ్యమున్న ఫోటోగ్రాఫర్ దృష్టికోణానికీ ఎంతో వైరుధ్యం ఉంటుంది..ఫెలిస్బెర్టో తన కథను ఒక ఛాయాచిత్రంగానూ,కథనాన్ని ఒక స్వప్నావస్థగానూ చూస్తారనిపిస్తుంది..అందుకేనేమో ఇందులో వర్ణనలు పలు ఛాయాచిత్రాలను అతికించిన ప్యాచ్ వర్క్ లా ఉంటాయి..'No One Had Lit a Lamp' అనే కథలో ప్రొటొగోనిస్ట్ ఒక వ్యక్తి పైనుండి తన దృష్టిని మరల్చుకుంటూ, "ఆ గదిలో టేబుల్ పై మంటలు ఎగసిపడుతున్నాయి" అంటారు..మరునిముషంలో ఆ టేబుల్ పై ఉన్నవి మంటలు కాదు,ఫ్లవర్ వేజ్లో ఎరుపూ,పసుపూ రంగుల్లో ఉన్న పువ్వులపై ఎండ పడుతోంది అంటారు..కంటిలోని ప్రతిబింబం మెదడుకి చేరే లోపే ఫెలిస్బెర్టో సన్నివేశాలు ప్రాణం పోసుకుంటాయి..అంటే ఊహకీ,తార్కికతకీ మధ్య ఉండే అతి సన్నని దారుల్లో ఈ కథలు ప్రయాణిస్తాయి..మరో విషయమేంటంటే ఈ కథల్లో సన్నివేశాల మధ్య  పొంతనలుండవు..కార్వర్ కథల్లోలా వీటికి ముగింపులు కూడా ఉండవు..కథ ముగిసే సమయానికి ఆదీ అంతాలు లేని అస్పష్టమైన ఇమేజ్ ఒకటి పాఠకుల మస్తిష్కంలో మిగిలిపోతుంది..అక్షరాల్ని తన కలంతో (కుంచెతో) రంగులుగా మార్చి తన కథల్ని కళ్ళకు చిత్రాలుగా చూపించే నైపుణ్యం ఫెలిస్బెర్టో సొంతం..ఇటాలో కాల్వినో తన ముందు మాటలో ఈయన లాంటి రచయిత వేరొకరు లేరని అనడం ఎంత మాత్రమూ అతిశయోక్తి కాదనిపిస్తుంది.

టామ్ హాంక్స్ 'Uncommon types' కథల్లో టైప్ రైటర్లలాగా ఈ కథల్లో కూడా 'పియానో' ప్రతి కథలో ఏదో ఒక మూల  ప్రత్యక్షమవుతుంది..కథానాయకులు సహజంగా పియానో వాయించేవారై ఉంటారు..ఈయన కథల్లో ప్రధానంగా చెప్పుకోవలసింది రెండు విషయాలు:ఒకటి జ్ఞాపకాలు,రెండు స్వప్నాలూ..ప్రౌస్ట్ అభిమాని అయిన ఫెలిస్బెర్టో కథలు కూడా ముఖ్యంగా జ్ఞాపకాల ఆధారంగానే నడుస్తాయి..చెకోవ్,కార్వర్ లాంటివాళ్ళ కథల్లో ప్రకృతిని గురించో,వస్తువులను గురించో వర్ణనలుంటాయి..ఒక మంచుకురిసే రాత్రి మొదలు టేబుల్ మీద ఉన్న ప్లేట్లు,స్పూన్లు,గడియారం,పరదాలూ ఇలా మనం నిత్యజీవితంలో విస్మరించే (ఓవర్ లుక్ చేసే ) చిన్న చిన్న వస్తువుల గురించి కూడా వర్ణిస్తారు..ఆ వర్ణనలు చదివే పాఠకుడు తాను ఆ ప్రదేశంలో ప్రత్యక్షంగా ఉన్న భావనకు లోనవుతాడు..అలాగే కార్వర్ కథల్లో విరివిగా కనిపించే ఫర్నిచర్ గురించిన వర్ణనలూ,కిటికీలోంచి వచ్చే సన్నటి వెలుతురూ మొదలైన అంశాలు కథలో 'మూడ్' ని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తాయి..ఇటువంటి విస్మరణకు గురైన అంశాల్నే ఫెలిస్బెర్టో తన కథలకు పునాదిగా చేసుకుంటారు..ఈ కథల్లో వస్తువులకు వ్యక్తులతో సరి సమానమైన ప్రాతినిథ్యం ఉంటుంది..వస్తువులు సజీవంగా కథలో భాగమై కథనాన్ని ముందుకు నడిపిస్తాయి.
An irresistible desire to cry was bloating up in me. I held it back with all my strength while a nightmarish silence fell about my ears and from my head and face down my whole body. Everything around me — the piano, the lamp, Celina still holding the pencil — radiated a strange heat. At that moment the objects were more alive than we were.
ఫెలిస్బెర్టో పాత్రల చిత్రీకరణ కూడా భలే విచిత్రంగా ఉంటుంది..ఒక్కరూ నార్మల్ గా అనిపించరు..కొన్ని స్త్రీ పాత్రలైతే ఏదో ఒక అబ్సెషన్ తో వింతగా ప్రవర్తిస్తూ Dickens 'Great Expectations' లో మిస్ హవిషంనూ,జేన్ అయిర్ లో రోచెస్టర్ భార్యనూ తలపించాయి..ఒక కథలో యువతి తన ఇంటి బాల్కనీతో ప్రేమలో పడుతుంది..చీకట్లో కూడా చూడగలిగే వ్యక్తి, వరదలతో చుట్టుముట్టిన ఇంటి యజమానురాలు,డైసీ అనే బొమ్మతో ప్రేమలో పడి భార్యను నిర్లక్ష్యం చేసే భర్త ఇలా విభిన్నమైన పాత్రలు తెరమీదకొస్తాయి..ఈ పాత్రలన్నీ మిస్టీరియస్ గా అనిపించే కొత్త కొత్త స్థలాలకీ,ఇళ్ళలోకీ వెళ్తుంటాయి..బొత్తిగా అపరిచితమైన వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసే ప్రయత్నం చేస్తుంటాయి..ఉన్నపళంగా వాస్తవాన్ని వదిలి తమ మెదడులోని కాల్పనిక జగత్తులోకి వెళ్ళిపోతుంటాయి..ఇక్కడ రచయిత కూడా తన కాల్పనిక ప్రపంచంలోకి మనతో పాటు ఒక కొత్త వ్యక్తిలా అడుగుపెడతారు..తాను చూసేది వాస్తవమో,కల్పనో రచయితకు కూడా స్పష్టత లేదనిపిస్తుంది,మనతో పాటు రచయిత కూడా మసక వెలుతురున్న గదుల్లో,చీకటి సొరంగాల్లో,అపరిచితుల ఇళ్ళలో అంతే కుతూహలంగా అడుగులు వేస్తారు..ఈ తరహా సర్రియలిస్టిక్,అబ్సర్డ్ అంశాలన్నీ ఉన్నా ఈ కథలు సాధారణ మెటా ఫిక్షన్ లా మెదడు మీద భారం మోపకుండా సరళంగా,చదవడానికి తేలిగ్గా ఉంటాయి..ఫిక్షన్ రాయడానికి కొన్ని కొలమానాలూ,పరిధులూ పెట్టుకుని దానికి లోబడి పనిచేసే  రచయితలకు దూరంగా ఫెలిస్బెర్టో కథలు వాస్తవానికీ,ఊహకీ మధ్య అస్పష్టమైన గీతను చెరిపేసే ప్రయత్నం చేస్తాయి..హేతువాదానికి ఆవలితీరంలో ఉండే ఈ కథలు పాఠకుల దృష్టికోణపు పరిథుల్ని విస్తృతం చేస్తాయి..ఈ కథలు చదివితే మన దైనందిన జీవితంలో చూసే ప్రతి చిన్న వస్తువునూ,మనిషినీ,ఇతర అంశాల్నీ మరోసారి సరికొత్తగా చూసే ప్రయత్నం చేస్తాము.

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు,

ఇటాలో కాల్వినో తన ముందుమాటలో ఫెలిస్బెర్టో గురించి ఈ విధంగా రాశారు..
Felisberto Hernández is a writer like no other: like no European, nor any Latin American. He is an “irregular” who eludes all classification and labeling, yet is unmistakable on any page to which one might randomly open one of his books
What never quite went to sleep was the specter of the magnolias. Although I had left behind the trees where they lived, they were with me, hidden in the back of my eyes, and suddenly I felt their presence, light as a breath somehow blown into the air by thought, scattered around the room, and blending into the furniture. Which was why, later on — in spite of the miseries I went through in that room — I never stopped seeing the faint glow of magnolias on the furniture and among the white and black shapes.
Also, just where the breast began, there was a flower with such sharp edges that if you moved too fast you could cut your fingers on it (and I couldn’t see why anyone would have wanted to reproduce a flower that grew wild on every fence along the road).
Her full, kindly face seemed to portray the word “grandmother”: she made me feel how round that word was. (Whenever a friend’s grandmother had a thin face, I thought the word “grandmother” didn’t fit her and she would probably not be as kindhearted as mine.)
What I was thinking just then was, “If I spend much longer in the past I’ll never get out again and I’ll go mad: I’ll be like one of those unhappy souls trapped by a secret in his past for the rest of his life. I’ve got to row with all my might back to the present."
It was on such a night, when I was running past times through my mind, carelessly, the way you let coins slip through your fingers, that the memory of Celina visited me.
My memories are a silent movie: I can put my old eyes on to see them, but my ears are deaf to them.
But until I fell asleep I was at the mercy of my memories, like a spectator obliged to watch two very different companies perform without knowing what scene or which memories would light up first, how they would alternate, or what the relations between the actors would be, because the theater and producer were always the same, usually the same author was involved and the main characters were always a man and a child.
I tried to imagine the character it portrayed but could think of nothing serious enough: perhaps he also had stopped taking himself as seriously as he used to in life and spent his time now playing with the pigeons.
“How you must regret having offered me your hospitality!” 
“On the contrary, I was thinking how unfortunate it will be to have an empty room after you’ve stayed in it.”
I looked out at a dimly lit sky that was trying to unload its bloated clouds on the house.
All these memories lived in some part of me that was like a small lost town known only to itself, cut off from the rest of the world. For many years no one had been born or died there. The founders of the town had been my childhood memories. Then, years later, some foreigners had arrived: my memories of Argentina. This afternoon I had the feeling I was in that town for a rest, as if misery had granted me a holiday.

Monday, October 15, 2018

The Posthumous Memoirs of Brás Cubas - Machado de Assis

ప్రతి దేశంలోనూ దేవుడిలా పూజింపబడి అంతర్జాతీయ స్థాయిలో మాత్రం పెద్దగా గుర్తింపుకు నోచుకోని రచయితలు కొందరుంటారు..కర్ణుడి చావుకి వంద కారణాలు లాగా వీరు ప్రపంచానికి పెద్దగా పరిచయం లేకపోవడానికి కూడా అనేక కారణాలు ఉంటాయి..రాసే కలానికి పదునుండాలే గానీ,కాస్త ఆలస్యమైనా అటువంటివారి రచనలు వెలుగుచూడకుండా ఆపడం ఎవరి తరమూ కాదు..నల్లజాతీయుడైన బ్రెజిల్ రచయిత మచాడో డి అస్సిస్ అటువంటి ఒక రచయిత..బ్రెజిల్  దేశపు సాహిత్యం గురించి నేను చాలా తక్కువ విన్నాను..అందునా 19వ శతాబ్దపు రచయితల్లో ప్రముఖులైన మచాడో డీ అస్సిస్ పేరు ఇదే తొలిసారి వినడం..ఆంగ్ల సాహితీ ప్రపంచంపు ప్రవాహంలో మరుగున పడిన కొందరు గొప్ప రచయితలను వెలికి తీసే క్రమంలో 'లైబ్రరీ ఆఫ్ లాటిన్ అమెరికా' వారు ఈ 'The Posthumous Memoirs of Bras Cubas' ను పోర్చుగీసు నుండి ఆంగ్లానికి అనువదించారు..1881 లో ఈ రచన తొలిముద్రణ జరిగింది,కాగా మళ్ళీ సుమారు శతాబ్దం తరువాత అంటే 1997 లో Gregory Rabassa దీన్ని తొలిసారి ఆంగ్లంలోకి అనువదించారు..ఈ నవలకు 'Epitaph of a small winner' అని మరో పేరు కూడా ఉంది...సుసాన్ సొంటాగ్  ముందుమాట రాసిన 'Epitaph of a small winner' కూడా ఒరిజినల్ కాపీతో పాటు అమెజాన్ లో లభ్యమవుతోంది.

Image Courtesy Google
ఇక కథ విషయానికొస్తే ప్రొటొగోనిస్ట్ 'బ్రాస్ క్యూబాస్' Rio de Janeiro నగరంలో ధనవంతుల బిడ్డగా,తండ్రి మితిమీరిన గారాబంలో పెరుగుతాడు..యుక్తవయసు వచ్చేనాటికి ఆకర్షణకూ,ప్రేమకూ తేడా తెలీని యవ్వనపు పొంగులో ఒక వేశ్య మార్సేలా ఆకర్షణకు లోనవుతాడు..ఆమె తత్వం తెలిసినప్పటికీ ఆమెను పొందాలనే కాంక్షతో సంపదనంతా ఆమెకు ధారపోస్తుంటాడు..ఈ వ్యవహారం తెలిసి క్యూబాస్ తండ్రి బలవంతంగా అతన్ని ఓడలో యూరోప్ కు చదువు నిమిత్తం పంపేస్తాడు..అక్కడ న్యాయశాస్త్రం అభ్యసించిన తరువాత  క్యూబాస్ తల్లి మరణవార్తను విని స్వదేశం తిరిగి వస్తాడు..తల్లి మరణంతో అతనిలో నైరాశ్యం,ఒంటరితనం చోటు చేసుకోగా Rio De Janeiro కు సమీపంలో ఒక కొండమీద ఒంటరిగా కాలం వెళ్ళదీస్తున్న సమయంలో తండ్రి వచ్చి బ్రాస్ క్యూబాస్ రాజకీయలబ్ది కోసం వర్జీలియాను వివాహమాడమని ప్రతిపాదిస్తాడు..కానీ వర్జీలియా బ్రాస్ క్యూబాస్ కంటే రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్న లోబో నెవెస్ ను వివాహమాడుతుంది..ఇంతవరకూ బాగానే ఉన్నా విచిత్రంగా ఆ వివాహానంతరం వర్జీలియా,బ్రాస్ క్యూబాస్ పీకల్లోతు ప్రేమలో పడతారు..ఇదిలా ఉండగా ఆమె భర్త వేరొకచోటికి వెళ్ళాల్సి రావడంతో ఇద్దరూ దూరమవుతారు..క్యూబాస్ కు యాభయ్యేళ్ళు వచ్చేసరికి రాజకీయాల్లో స్థానం సంపాదించుకుంటాడు,అయినప్పటికీ అతనిలో నైరాశ్యం మాత్రం పోదు..ఆ వైరాగ్యంలో మిత్రుడూ,ఫిలాసఫర్ అయిన క్విన్కస్ బోర్బా తత్త్వం 'హ్యూమానిటా' అనే సిద్ధాంతాన్ని వ్యాప్తి చెయ్యాలని తలపోస్తాడు..క్యూబాస్ జీవితం ఆ తరువాత ఎటువంటి మలుపులు తీసుకుందనేది తరువాత కథ.

He explained to me that on the one side Humanitism was related to Brahmanism, to wit, in the distribution of men throughout the different parts of the body of Humanitas, but what had only a narrow theological and political meaning in the Indian religion, in Humanitism was the great law of personal worth. 

సంప్రదాయవాదాన్ని ప్రశ్నించిన సందర్భాలు ఇందులో అనేకం..
Humanitism must also be a religion, the one of the future, the only true one. Christianity is good for women and beggars, and the other religions aren’t worth much more. They’re all equal with the same vulgarity or weakness. The Christian paradise is a worthy emulation of the Muslim one. And as for Buddha’s Nirvana, it’s nothing more than a concept for paralytics. You’ll see what the humanistic religion is. The final absorption, the contractive phase, is the reconstitution of substance, not is annihilation, etc. Go where you are called, but don’t forget that you’re my caliph.”

ఈ పుస్తకం చదవడానికి నావరకూ దీని టైటిల్ ఒక కారణం..ఎవరికైనా మరణానికి ముందు జ్ఞాపకాలు రాస్తారు గానీ ఇందులో బ్రాస్ క్యూబాస్ మాత్రం మరణానంతరం తన జ్ఞాపకాలకు అక్షరరూపమిస్తాడు..మరణించిన వ్యక్తికి సోకాల్డ్ 'పబ్లిక్ ఒపీనియన్' తో పనుండదు కాబట్టి తన జీవితంలోని ప్రతి చిన్న అంశాన్నీ ఈ పుస్తకంలో నిర్దయగా పునః పరిశీలించుకుంటాడు క్యూబాస్..
I’m not saying that the university hadn’t taught me some philosophical truths. But I’d only memorized the formulas, the vocabulary, the skeleton. I treated them as I had Latin: I put three lines from Virgil in my pocket, two from Horace, and a dozen moral and political locutions for the needs of conversation. I treated them the way I treated history and jurisprudence. I picked up the phraseology of all things, the shell, the decoration … Perhaps I’m startling the reader with the frankness with which I’m exposing and emphasizing my mediocrity. Be aware that frankness is the prime virtue of a dead man.
ప్రతి చిన్న అంశాన్నీ చురుకైన దృష్టితో చూసే క్యూబాస్ జీవితంపట్ల నిర్లిప్త వైఖరితో ఉంటాడు..మార్సెలతో తొలిప్రేమ,అంగవైకల్యం కారణంగా యూజీనియాను తిరస్కరించడం,వర్జీలియాతో వివాహేతర సంబంధం,అక్క సబీనా కుటుంబంతో స్పర్ధలు లాంటివి క్యూబాస్ జీవితంలో మానవసంబంధాల సంక్లిష్టతను ప్రతిబింబిస్తాయి..ప్రేమించిన వర్జీలియాకు వీడ్కోలు పలికేటప్పుడు తన మనసులో ఒక రకమైన ప్రశాంతతతో కూడిన సంతోషం కలిగింది అనడం లాంటివి కొంత అబ్సర్డ్ గా అనిపిస్తాయి..క్యూబాస్ నిర్లక్ష్య ధోరణి జే.డీ.సాలింజర్  Holden Caulfield ను గుర్తుకుతెస్తుంది..అలాగే తన జీవితంలో ప్రేమల పట్లా,మానవ సంబంధాల పట్ల అతని డిటాచ్మెంట్ తో కూడిన వైఖరి కాము నాయకుల్ని తలపిస్తుంది..చివరకి తాను ఒక బిడ్డకి జన్మనిచ్చి తండ్రి కాలేదు గనుక ఆ జీవికి ఈ దుఖ్ఖమయమైన జీవితంనుంచి ముందే విముక్తి కలిగించాను అని ఆనందపడతాడు క్యూబాస్..గుఱ్ఱం మీద నుండి పడిపోయినప్పుడు తన ప్రాణాలను రక్షించిన ఒక పేదవాడికి ఒక కాయిన్ ఇచ్చే సందర్భం,ఆ తరువాత దొరికిన పెద్ద మొత్తాన్ని (five contos) తనవద్ద ఉంచుకుని,మరో సందర్భంలో దొరికిన ఒకే ఒక్క కాయిన్ ను పోలీసులకు అందజెయ్యడం లాంటివి మొరాలిటీకి పరిథుల్ని ప్రశ్నిస్తూ,సరదాగా కనిపిస్తూనే వ్యంగ్యంతో కూడిన హాస్యాన్ని పండిస్తాయి.

మచాడో డి అస్సిస్ ప్రత్యేకత ఏంటంటే,బానిసత్వ సంస్కృతి వ్రేళ్ళూనుకుని ఉన్న కాలంలో, అందునా ప్రతి ఇంటికీ ఇద్దరు ముగ్గురు బానిసలు సర్వసాధారమైన బ్రెజిల్ వ్యవస్థలో ఒక బానిస కుటుంబంలో పుట్టి,ఎదురైన అవరోధాలను దాటుకుంటూ బ్రెజిల్ సాహిత్యంలో కీర్తిపతాకాన్నెగురవేసి తన పేరును సుస్థిరం చేసుకోవడం..ఇది సామాన్యమైన విషయం కాదు..ప్రముఖంగా 19వ శతాబ్దపు సాహిత్యం ఆనాటి రాజకీయ స్థితిగతులకు అద్దం పట్టేదిగా ఉండేది..ఈ సంప్రదాయానికి బ్రెజిల్ సాహిత్యం కూడా మినహాయింపు కాదు..ఈ సాహితీ ప్రక్రియను త్రోసిరాజంటూ సాధారణ సాహిత్యానికి అలవాటుపడిన పాఠకులకు మచాడో డి అస్సిస్ సరికొత్త శైలిని పరిచయం చేశారు..చదివించే శైలి నచ్చినా ఆయన తరహా ఫిలాసఫీ నాకు కొన్ని చోట్ల చాలా పేలవంగా అనిపించింది..కానీ కాలగతిని పరిగణనలోకి తీసుకుంటే అది చాలా సూక్ష్మమైన లోపమే..పోర్చుగీసు మార్కు 'melancholy' ఈ రచనలో కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది..నేరేషన్ లో సునిశిత హాస్యం వెనుక అంతర్లీనంగా నైరాశ్యం నీడలు పరుచుకుని ఉంటాయి..రాబర్ట్ వాల్సర్ కూ మచాడో కూ చాలా పొంతనాలున్నాయి..మచాడో కూడా వాల్సర్ లా ఇందులో రోజువారీ జీవనానికే పెద్ద పీట వేస్తారు..అలాగే ఈ నవలని వాల్సర్ లాగే చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ రూపంలో రాశారు..ఎటొచ్చీ వీరిలో ఒకరు ఆశావాదైతే,మరొకరు నిరాశావాది..వాల్సర్ రచనలు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆస్వాదించమంటూ,జీవితాన్ని యధాతథంగా అంగీకరించాలనే సిద్ధాంతంతో ఆశావహ దృక్పథంతో కూడిన సౌకర్యవంతమైన జీవనాన్ని ప్రతిబింబిస్తే,మచాడో రచనలో జీవితాన్ని గాలిలో పెట్టిన దీపంలా వదిలెయ్యమనే పెస్సిమిజం కనిపిస్తుంది..కానీ ఈ నైరాశ్యానికి విరుద్ధంగా 'పబ్లిక్ ఒపీనియన్' ని అడుగడుగునా ఎద్దేవా చేసే విప్లవాత్మక ధోరణి కూడా బ్రాస్ క్యూబాస్ పాత్రలో కనిపిస్తుంది..సంప్రదాయాలను మొరాలిటీ త్రాసులో అస్తమానం తూచుకుంటూ రాజకీయ,సామాజిక వైఫల్యాల నడుమ జీవితాంతం అవివాహితుడుగానే మిగిలిపోయిన బ్రాస్ క్యూబాస్ కథ జీవితంలో విఫలమయిన వ్యక్తి కథలా చూపించే ప్రయత్నం చేశారు రచయిత.

సున్నితమైన హాస్యం ఈ నవలలో మరో ప్రత్యేకత..Enylton De Sa Rego  ముందుమాటలో 'Warning :Deadly humour at work' అని హెచ్చరిస్తారు..మరీ అంత కాకపోయినా ఇందులో సరదా సందర్భాలు చాలా చోట్ల పెదాల మీద చిరునవ్వులు పూస్తాయి..ఒక వాక్యాన్ని అతి మాములుగా చదివి ముందుకు వెళ్ళిపోయాకా,ఇక్కడ చమత్కారం మిస్ అయినట్లున్నామని మళ్ళీ వెనక్కి వెళ్తే ఆ వాక్యంలో అమాంతం హాస్యపు జల్లులు కురుస్తాయి..ఈ రచనలో మరో ప్రత్యేకత ఏంటంటే అడుగడుగునా రచయిత పాఠకునితో సంభాషిస్తూ ఉంటారు..'మై డియర్ రీడర్' అని సంబోధిస్తూ తన కథలో పాఠకుణ్ణి భాగస్వామిని చేసి బ్రాస్ క్యూబాస్ జీవితానికి పాఠకుణ్ణి న్యాయనిర్ణేతగా చేస్తారు..పాఠకుల భావాల్ని చదివేసినట్లు "నా రచన మందకొడిగా సాగుతోంది కదూ,మీకు విసుగు తెప్పిస్తున్నాను కదూ!" అంటూ చివరి వరకూ పాఠకులతో సంభాషిస్తారు..
'The Defect of this Book' అనే చాప్టర్లో  'I’m beginning to regret this book. Not that it bores me, I have nothing to do and, really, putting together a few meager chapters for that other world is always a task that distracts me from eternity a little. But the book is tedious, it has the smell of the grave about it; it has a certain cadaveric contraction about it, a serious fault, insignificant to boot because the main defect of this book is you, reader. You’re in a hurry to grow old and the book moves slowly. You love direct and continuous narration, a regular and fluid style, and this book and my style are like drunkards, they stagger left and right, they walk and stop,mumble, yell, cackle, shake their fists at the sky, stumble, and fall … And they do fall! Miserable leaves of my cypress of death, you shall fall like any others, beautiful and brilliant as you are. And, if I had eyes, I would shed a nostalgic tear for you. This is the great advantage of death, which if it leaves no mouth with which to laugh, neither does it leave eyes with which to weep … You shall fall. అంటారు.
My dear critic, A few pages back when I said I was fifty, I added: “You’re already getting the feeling that my style isn’t as nimble as it was during the early days.”
హిస్టారికల్ ఫాక్ట్స్ ప్రక్కన పెడితే చాలా కాలం క్రిందట చదివిన  Viet Thanh Nguyen రచన 'The Sympathizer' వియాత్నాంను ఆ దేశపు సగటు పౌరుడి కోణం నుంచి చూసే అవకాశం కల్పిస్తుంది..ఆ తరహా రచనల్లోలా మచాడో వర్ణనల్లో 19వ శతాబ్దపు బ్రెజిల్ ను దర్శించాలని తపించే పాఠకులకు ఈ రచన నిరాశనే మిగులుస్తుంది..ఇందులో పలు సాంఘికాంశాలు,స్థలకాలాదుల ప్రస్తావనలూ ఉన్నప్పటికీ వాటిని బట్టి ఆనాటి బ్రెజిల్ రాజకీయ సామజిక స్థితిగతులను అర్ధం చేసుకునే అవకాశం లేదు..ఎటొచ్చీ బానిసత్వం తీవ్రంగా ఉన్న  కాలంలో చేసిన రచన కావడంతో ఇందులో బానిస సంస్కృతి అన్నిచోట్లా కనిపిస్తుంది.కథలో భాగంగా బ్రాస్ క్యూబాస్ రాజకీయాల్లో ఉండడం లాంటి అంశాలు చాలానే ఉన్నప్పటికీ ఈ రచన బ్రెజిల్ ను రాజకీయ,చారిత్రాత్మక అంశాల కోణం నుంచి చూపించదు..ఒక సగటు బ్రెజిలియన్ వ్యక్తి అంతరంగానికి దర్పణం పడుతూ అతని దైనందిన జీవితాన్ని చూపించే ప్రయత్నం మాత్రం చేస్తుంది.

బ్రాస్ క్యూబాస్ తన మెమోయిర్ ను మొదలుపెట్టే ముందు పాఠకులనుద్దేశించి ఈ విధంగా అంటారు..
I wrote it with a playful pen and melancholy ink and it isn’t hard to foresee what can come out of that marriage. I might add that serious people will find some semblance of a normal novel, while frivolous people won’t find their usual one here. There it stands, deprived of the esteem of the serious and the love of the frivolous, the two main pillars of opinion.
I’ll take my position between the poet and the savant.
“You miserable little minute!” she exclaimed. “What do you want a few more instants of life for? To devour and be devoured afterward? Haven’t you had enough spectacle and struggle? You’ve had more than enough of what I presented you with that’s the least base or the least painful: the dawn of day, the melancholy of afternoon, the stillness of night, the aspects of the land, sleep, which when all’s said and done is the greatest benefit my hands can give. What more do you want, you sublime idiot?"
సరదా సందర్భాలు
It took me thirty days to get from the Rossio Grande to Marcela’s heart, no longer riding the courser of blind desire but the ass of patience, crafty and stubborn at the same time, for there are really two ways of enticing a woman’s will: the violent way like Europa’s bull and the insinuative way like Leda’s swan or Danaë’s shower of gold—three inventions of Father Zeus, which, being out of fashion, have been replaced by the horse and the ass.
Marcela నవ్వును వర్ణిస్తూ,
I think it was a mixed laugh, as if it were coming from a creature born to a witch of Shakespeare’s by a seraph of Klopstock’s.
“It may not have style,” he pondered after an instant, “but no one can deny me feeling, unless that very feeling is harmful to the perfection …”
I shan’t say that she was already first in beauty, ahead of the other girls of the time, because this isn’t a novel, where the author gilds reality and closes his eyes to freckles and pimples.
I lived half like a recluse, attending, after long intervals, some ball or theater or a lecture, but I spent most of the time by myself. I was living, letting myself float on the ebb and tide of events and days, sometimes lively, sometimes apathetic, somewhere between ambitious and disheartened. I was writing politics and making literature. I sent articles and poems to newspapers and I managed to attain a certain reputation as a polemicist and poet.
I like happy chapters, they’re my weakness.
That’s what she said while I, sitting with my hands on my knees, looked at the floor, where a fly was dragging an ant that was biting its leg. Poor fly! Poor ant.
I think (and again I beg the critics’ good will), I think he was probably prepared to break with his wife, as the reader has probably broken with many personal relationships, but public opinion, that opinion which would drag his life along all the streets, would open a minute investigation into the matter, would put together, one by one, all circumstances, antecedents, inductions, proofs, would talk about them in idle backyard conversations, that terrible public opinion, so curious about bedrooms, stood in the way of a family breakup.
The main reason was a reflection made to me by Quincas Borba, who visited me that day. He told me that frugality wasn’t necessary in order to understand Humanitism, much less to practice it. That philosophy enjoyed easy accommodation with the pleasures of life, including table, theatre, and love, and that, quite the contrary, frugality could be an indication of a certain tendency toward asceticism, which was the perfect expression of human idiocy.
We kill time; time buries us.
A philosophical coachman used to say that the pleasure of a coach would be less if we all traveled in coaches.
“There is no puppy so well trained that we do not hear its bark in the end".
Fifty is the age of science and government.
A cool breeze was blowing, the sky was blue. In each window—there were three—hung a cage with birds, who were trilling their rustic operas. Everything had the appearance of a conspiracy of things against man: and even though I was in my room, looking at my yard, sitting in my chair, listening to my birds, next to my books, lighted by my sun, it wasn’t enough to cure me of the longing for that other chair that wasn’t mine.

Tuesday, October 9, 2018

What We See When We Read - Peter Mendelsund

కొన్ని రచనలు చదవడం పూర్తిచేశాక కూడా మనలో ఏదో వెలితి మిగిలిపోతుంది..రచయిత అంతరంగాన్ని పూర్తిగా పట్టుకోవడంలో విఫలమయ్యామనో,లేక శ్రద్ధగా చదవలేదేమో అనే అనుమానమో కలుగుతుంది..ఆసాంతం చదివినా రచనలో స్పష్టత లోపించిన భావన కలగడం కొన్నిసార్లు పాఠకులకు అనుభవమే..ముఖ్యంగా అత్యుత్తమమైన సాహిత్యంగా పరిగణింపబడే రచనల్లో 'మార్మికత' పునాదులమీద నిలబెట్టినవే సింహభాగం ఉంటాయి..ఈ తరహా రచనల్లో,రచయిత తన అంతరంగానికి తెరచాటు చేసుకుని తాను చెప్పాలనుకున్న కథ చెప్తారు..బహుశా ఆ తెరచాటు పరీక్షను దాటి తన అంతరంగంలోకి తొంగిచూసేదెవరా అని ఎదురుచూస్తారేమో !! అటువంటి కొన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు ఇవెందుకింత ఆదరణ పొందాయా అని ఆశ్చర్యపోవడం కూడా పరిపాటే..ఈ మధ్యే చదివిన విటోల్డ్ గోమ్బ్రోవిచ్ రచన 'కాస్మోస్' నన్ను ఇలాంటి సందిగ్ధంలోకే నెట్టేసింది..అందులోని సంక్లిష్టత గురించి రాసినప్పుడు నాగరాజు పప్పు గారు చదవమని చెప్పగా Peter Mendelsund రాసిన ఈ 'What We See When We Read అనే పుస్తకం గురించి తెలిసింది..ఇందులో మెండెల్సండ్ వర్ణచిత్రాల ఆధారంగా పాఠకులు పుస్తకాలను చదివే విధానాల గురించి  వివరణాత్మకమైన విశ్లేషణలు చేశారు.
Image Courtesy Google
ప్రపంచాన్నైనా,పుస్తకాన్నైనా పాఠకుడు తన దృష్టికోణం నుంచే చూస్తాడనేది జగమెరిగిన సత్యం..ఈ విషయాన్ని శాస్త్రీయంగా నిరూపించడానికి మెండెల్సండ్ టాల్స్టాయ్ సృష్టించిన 'అన్నా' పాత్రను ఉదహరిస్తారు..అన్నా కరెనినా లో అన్నా చూడడానికి ఎలా ఉంటుంది ? టాల్స్టాయ్ దృష్టిలో అన్నా రూపాన్ని మనం యథాతథంగా చూడలేము..రచయిత ఆమెను వర్ణించిన అంశాల ఆధారంగా ఆమె ఇమేజ్ ని మాత్రమే ఊహించుకుంటూ చదువుతాము..అలాగే మోబి-డిక్ లోని ఓపెనింగ్ లైన్స్ గురించి రాస్తారు..'Call me Ishmail' అంటూ మొదలయ్యే హెర్మాన్ మెల్విల్లీ 'మోబీ-డిక్' నవలలో ఆ మొదటి వాక్యాలు ఎవరు ఎవరితో చెప్తున్నారో కూడా తెలీకుండా చదవడం మొదలుపెట్టే పాఠకుడు ఆ వాక్యాలను ఒక అనానిమస్ క్యారెక్టర్ చెప్తున్నట్లు ఊహించుకుంటూ చదువుతాడు..అంటే రచయిత కథలోకి వెళ్ళే లోపే మనం మనసులో కొన్ని ఇమేజెస్ ను తయారు చేసేసుకుంటాం..ఒక్కో పాత్ర గురించీ స్పష్టత వచ్చే కొద్దీ మన ఇమేజెస్ ను మార్చుకుంటూ (సరిచేసుకుంటూ) చదువుతాము..ముఖ్యంగా ముఖ కవళికలు లాంటివి వర్ణించినప్పుడు ఒక్కో పాఠకుడు ఒక్కో రూపాన్ని ఊహించుకుంటూ ముందుకు వెళ్తాడు..ఇదంతా అబ్స్ట్రాక్ట్ వ్యవహారమే తప్ప,ఇందులో స్పష్టత ఉండదు..ఇతిమిద్దంగా ఆ పాత్రని ఫలానా అని రూపురేఖలతో సహా వర్ణించడం కుదరదు..రచయిత తాను చెప్పాలనుకున్నది కూడా పూర్తిగా చెప్పలేరు,మనం ఖాళీలను పూరించుకుంటూ చదువుతాము. 

అలాగే ప్రదేశాల గురించిన వర్ణనలు చదువుతున్నప్పుడు మనకు పరిచయమైన (లేదా మనం చూసిన) ప్రదేశాలను మనసులో సమాంతరంగా ఊహించుకుంటూ ముందుకు వెళ్తాము..ఈ విధంగా కథనీ,కథలోని పాత్రల్ని కూడా ఒక్కో పాఠకుడూ ఒక్కో విధంగా ఊహించుకుంటాడు..ఈ ఊహలన్నీ కూడా రచయిత వర్ణన చదువుతూ,అప్పటికే మనిషి మెదడులో నిక్షిప్తమైన ఇమేజెస్ కు వాటిని అన్వయించుకోవడం ద్వారానే జరుగుతుందని మెండెల్సండ్ అభిప్రాయపడతారు..అంటే మనిషి మెదడులో అప్పటికే ఉన్న సమాచారాన్ని గుర్తుకు తెచ్చుకుని తవ్వి తీసుకోవడం ద్వారా రచయిత కథల్ని తనదైన కోణంలో చూసే ప్రయత్నం చేస్తాడు పాఠకుడు..కొన్ని పాత్రలు సజీవంగా కళ్ళ ముందుకొచ్చినట్లున్నాయి అనుకోవడం,లేదా మరికొన్ని పాత్రలు మనకు బాగా తెలిసిన వ్యక్తిలా అనిపించడం ఇవన్నీ కూడా మన subconscious లో ఉన్న ఊహా చిత్రాల ప్రభావమే..ఇటువంటి అనేక ఉదాహరణలతో పాఠకుల అనుభవాల్ని వర్ణచిత్రాల సహాయంతో విశ్లేషిస్తారు మెండెల్సండ్...ఇందులో వర్జీనియా వుల్ఫ్ 'టు ది లైట్ హౌస్' ,హెర్మన్ మెల్విల్లీ 'మోబి డిక్',జేమ్స్ జోయ్స్ 'Ulysses',ఇటాలో కాల్వినో 'ఇన్విజిబుల్ సిటీస్' ,డికెన్స్ 'బ్లేక్ హౌస్' లాంటి పలు ప్రపంచ ప్రఖ్యాత రచనల్నీ,వాటిల్లో ప్రధాన పాత్రల్నీ ఉదహరిస్తూ ఆసక్తికరమైన విశ్లేషణలు చేశారు..ముఖ్యంగా నబకోవ్ వ్యాసాలు 'లెక్చర్స్ ఆన్ లిటరేచర్' నుండి ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

'Only parts of us will ever touch only parts of others.' అని మార్లిన్ మన్రో అన్నట్లు మనకి బాగా తెలుసనుకున్న వ్యక్తుల గురించి కూడా మనకి పూర్తిగా తెలిసే అవకాశం లేదు..మనుషుల్లో మనకు తెలియని కోణాలు మిగిలి ఉన్నట్లే రచయిత ఎంత విడమర్చి రాసినా ఆయన అంతరంగాన్ని యధాతథంగా (పూర్తిగా) తెలుసుకోవడం సాధ్యం కాదంటారు మెండెల్సండ్..ఈ రచన పఠనానుభవం అనేది అసంపూర్ణమైనదని నొక్కి చెప్తుంది..పుస్తకపఠనం విషయంలో సంపూర్ణత(wholeness) ను ఆశించడం కష్టమే కాదు అసంభవం అని కూడా చెప్తుంది..రచయితలు తమ అనుభవాలను వాక్యాలుగా కుదించి (reduce) ఒక పుస్తకంగా మలుస్తారు,అలాగే పాఠకులు ఆ పుస్తకాన్ని తమ ప్రపంచంలోకి కుదించుకుని చదువుతారు..ఈ మొత్తం వ్యవహారంలో పర్ఫెక్షన్  కష్టమనేదే ఇక్కడ రచయిత చెప్పదలచుకున్న అంశం..

Writers reduce when they write, and readers reduce when they read. The brain itself is built to reduce, replace, emblemize … Verisimilitude is not only a false idol, but also an unattainable goal. So we reduce. And it is not without reverence that we reduce. This is how we apprehend our world. This is what humans do.

అలాగే మనం చూసే సినిమాలూ,ప్రోగ్రాములు మన సృజనాత్మకతను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి అంటారు మెండెల్సండ్ ..అంటే చాలా ఏళ్ళు నా ఊహల్లో అబ్స్ట్రాక్ట్ గా ఉన్న అన్నా కరెనీనా రూపం,సినిమా చూసేసరికి కేరా నైట్లీగా మారిపోవడంలా అన్నమాట..ఇలాంటి సందర్భాల్లో మన ప్రమేయం లేకుండానే అన్నా ప్రస్తావన వచ్చినప్పుడల్లా మనం చూసిన అన్నా తాలూకా రూపం కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది..దృశ్యశ్రవణ యంత్రాల వినియోగం తారాస్థాయికి చేరుకున్న ఈ కాలంలో ఊహాశక్తి  రాన్రానూ తగ్గిపోవడానికి ఇదొక కారణం కావచ్చు..చిన్నప్పుడెప్పుడో స్కూల్లో చదువుతున్నరోజుల్లో సెక్రటరీ నవల చదివి రాజశేఖరాన్ని ఊహించుకుని ఆ తరువాతెప్పుడో ఆ సినిమా చూసి తీవ్రంగా నిరాశ చెందాను..ఎందుకంటే నేను నవల్లో ఊహించుకున్న రాజశేఖరం నాగేశ్వరరావు కాదు మరి :)

కొంతకాలం క్రిందట కాఫ్కా పుస్తకాల కవర్లు కొన్ని చూసినప్పుడు రొటీన్ కంటే భిన్నంగా చాలా ప్రత్యేకంగా ఉన్నాయనుకున్నాను..ఈ పుస్తకం చదివేటప్పుడు ఆ కవర్ల వెనుక ఉన్న క్రియేటివ్ మైండ్ పీటర్ మెండెల్సండ్ అని తెలిసింది..సింపుల్ జియోమెట్రికల్ షేప్స్ లో,బ్రైట్ కలర్స్ లో ఆయన డిజైన్ చేసిన కవర్లు నన్ను చాలా ఆకర్షించాయి..సాహిత్యాన్ని ఎలా చదవాలో,ఎలా చదవకూడదో,ఎలా చదువుతామో తెలియాలంటే ఈ పుస్తకాన్ని ఒకసారి చదవాలి.

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు ,

Another question: As a character develops throughout the course of a novel, does the way this character “looks” to you (their appearance) change … as a result of their inner development? (A real person may become more beautiful to us once we are better acquainted with their nature—and in these cases our increased affection isn’t due to some closer physical observation.)
 Are characters complete as soon as they are introduced? Perhaps they are complete, but just out of order; the way a puzzle might be

Past, present, and future are interwoven in each conscious moment—and in the performative reading moment as well. Each fluid interval comprises an admixture of: the memory of things read (past), the experience of a consciousness “now” (present), and the anticipation of things to be read (future).

 All good books are, at heart, mysteries. (Authors withhold information. This information may be revealed over time. This is one reason we bother to turn a book’s pages.) A book may be a literal mystery (Murder on the Orient Express, The Brothers Karamazov) or a metaphysical mystery (Moby-Dick, Doctor Faustus) or a mystery of a purely architectonic kind—a chronotopic mystery (Emma, The Odyssey)

 Nabokov seems to be making the point that the greater the specificity and context for an image, the more evocative it is.

 Specificity and context add to the meaning and perhaps to the expressiveness of an image, but do not seem to add to the vividness of my experience of an image—that is, all this authorial care, the author’s observation and transcription of the world, does not help me to see. They help me to understand—but not to see. (At least, when I examine my responses to these types of descriptions, I do not perform any better in my attempts to envision the author’s world.

Writers closely observe the world and record their observations. When we remark that a novel is “finely observed,” we are praising the writer’s ability to bear witness. This bearing witness is composed of two acts: the author’s initial observation in the real world, and then the translation of that observation into prose. The more “finely observed” the text, the better we readers recognize the thing or event in question. (Again—seeing and acknowledging are different activities)

To borrow a line of reasoning from the philosophy of science: What we are observing is not the thing itself, but the tools we have constructed to observe that thing.

“For me, the main thing in a narrative is … the order of things … the pattern; the symmetry; the network of images deposited around it …”—Italo Calvino, Le Monde, August 15, 1970

 Jorge Luis Borges refers to the disparate elements listed in literary description as disjecta membra, which translates from the Latin as either “scattered (or dismembered) remains,” or “broken pottery shards.”

There is no such thing as a “close-up” in prose. A detail may be called out in a narrative, but the effect is not the same as that of a camera, zooming in. In books, when a detail (Oblonsky’s slippers, for instance) is remarked upon, the observer does not have the sensation of moving closer, or even of a different vantage point.These events in fiction are not spatial, but semantic. When a camera
zooms in, the relationship of the camera to the object changes and thus our relationship (as viewers) to the object has changed. But not in novels.
As Calvino puts it: “The distance between language and image is always the same.”

One of the common metaphors we use when describing the immersive drift of reading is that of floating on a river: we are carried along by a narrative, as if we were in an oarless boat. This metaphor implies a passivity that belies the vested involvement of our reading minds. Sometimes we must row hard against the current, or steer around a jutting rock. And even when we are coasting, the boat that is carrying us is: our own minds.

The world, as we read it, is made of fragments. Discontinuous points—discrete and dispersed.
 (So are we. So too our coworkers; our spouses; parents; children; friends…)
We know ourselves and those around us by our readings of them, by the epithets we have given them, by their metaphors, synecdoches, metonymies. Even those we love most in the world. We read them in their fragments and substitutions.The world for us is a work in progress. And what we understand of it we understand by cobbling these pieces together—synthesizing them over time. It is the synthesis that we know. (It is all we know.) And all the while we are committed to believing in the totality—the fiction of seeing."

Authors are curators of experience. They filter the world’s noise, and out of that noise they make the purest signal they can—out of disorder they create narrative. They administer this narrative in the form of a book, and preside, in some ineffable way, over the reading experience. Yet no matter how pure the data set that authors provide to readers—no matter how diligently prefiltered and tightly reconstructed—readers’ brains will continue in their prescribed assignment: to analyze, screen, and sort. Our brains will treat a book as if it were any other of the world’s many unfiltered, encrypted signals. That is, the author’s book, for readers, reverts to a species of noise. We take in as much of the author’s world as we can, and mix this material with our own in the alembic of our reading minds, combining them to alchemize something unique. I would propose that this is why reading “works”: reading mirrors the procedure by which we acquaint ourselves with the world. It is not that our narratives necessarily tell us something true about the world (though they might), but rather that the practice of reading feels like, and is like, consciousness itself: imperfect; partial; hazy; co-creative.

Lily painting:
And she lost consciousness of outer things, and her name and her personality and her appearance, and whether Mr. Carmichael was there or not, her mind kept throwing up from its depths, scenes, and names, and sayings, and memories and ideas, like a fountain spurting over that glaring, hideously difficult white space … But this is one way of knowing people, she thought: to know the outline, not the detail.

Friday, September 28, 2018

Cosmos - Witold Gombrowicz

కథని ఉన్నదున్నట్టుగా,జరిగింది జరిగినట్లుగా పూస గుచ్చినట్లు చెప్పేస్తే ఇక పాఠకులకు తరువాత ఆలోచించడానికీ,ఊహించుకోడానికీ ఏమీ మిగలదు..అందుకే పాఠకులకు చదివిన అనుభూతి కొంతైనా మిగల్చడానికీ,వారిని తమ కథలో భాగంగా చేసుకోవడానికి కొన్ని విషయాలను వారి ఊహకు వదిలేస్తుంటారు రచయితలు..ఈ క్రమంలో కొందరు రచయితలు చెప్పాలనుకున్న విషయం సౌమ్యంగా చెప్తారు,మరికొందరు బిగ్గరగా అరిచి చెప్తారు,మరి కొందరు కర్ర విరక్కూడదు,పాము చావకూడదు అన్న రీతిలో నిగూఢంగా తాము చెప్పదలుచుకున్న అంశాన్ని విసిగించి,విసిగించి చెప్తారు..పోలిష్ రచయిత విటోల్డ్ గోమ్బ్రోవిచ్ ఈ మూడో రకానికి చెందిన రచయిత..1965 లో ప్రచురించిన ఈ నవలను Danuta Borchardt  ఆంగ్లంలోకి అనువదించారు..అవార్డు విన్నింగ్ పుస్తకాలజోలికి వెళ్ళకూడదని లెంపలు వేసుకుని ఏడాది తిరగకుండానే,మళ్ళీ ఈ పుస్తకం చదివే సాహసం చేశాను..ఈ రచన 'ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్' ను సొంతం చేసుకుంది మరి.
It will be difficult to continue this story of mine. I don’t even know if it is a story. It is difficult to call this a story, this constant . . . clustering and falling apart . . . of elements . 
Image Courtesy Google
సుసాన్ సోంటాగ్ కొన్ని వ్యాసాల్లో ఈ పోలిష్ రచయిత విటోల్డ్ గోమ్బ్రోవిచ్ ను ఇరవయ్యవ శతాబ్దపు లిటరేచర్ లో 'అండర్ డాగ్' అని తెగ పొగిడేశారు,దానికి తోడు ఇటీవల చదివిన 'బార్టిల్బీ అండ్ కో' లో కూడా ఈయన గురించి పలుమార్లు ప్రస్తావించారు..సరే ఈయన ప్రత్యేకత ఏంటో చూద్దామని చదవడం మొదలుపెట్టాను..కథ విషయానికొస్తే ఇద్దరు యువకులు Witold,Fuks తమ దైనందిన జీవితాల్లోని సమస్యల నుండి ఉపశమనం కోసం Zakopane కు ప్రయాణమవుతారు..వీరిలో విద్యార్థి అయిన విటోల్డ్ కు తండ్రితో విభేదాలు ఉండగా,ఉద్యోగి Fuks కు యజమానితో సరిపడదు..రిసార్ట్ చేరే దారిలో వారిద్దరూ ఒకచోట  ఉరివేయబడి ఉన్న పిచ్చుకను చూస్తారు..ఆ వింత దృశ్యం వారి మనస్సులో అలజడి రేపి,అనుమానాలకు దారి తీస్తుంది..తదుపరి వాళ్ళు బస చేసిన ఇంటి యజమాని Leon కుటుంబం ధోరణి కూడా వింతగా అనిపిస్తుంది..లియోన్ భార్య రోలీ-పోలీ,కూతురు లీనా,అల్లుడు లుడ్విక్,పనిమనిషి కటాసియా ఇలా విభిన్న పాత్రలు తెరమీదకొస్తాయి..ఆ యువకుల అనుమానాలకి ఊతమిస్తూ జరిగే మరికొన్ని వరుస సంఘటనలు ఈ కథను ఒక డిటెక్టివ్ కథేమో అనిపించేలా నడిపిస్తాయి..ఇక ఆ క్షణం నుంచీ ఆ ఇద్దరు యువకులూ తమ దృష్టిలో పడిన ప్రతి చిన్న అంశాన్నీ,సంఘటనల్నీ,వస్తువుల్నీ కలుపుకుంటూ తమ ప్రశ్నలకు సమాధానాలు వెతికే దిశగా పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ పద్ధతిలో  మైండ్ కాన్ఫిగరేషన్స్ చేసుకుంటూ ఒక ఊహాప్రపంచాన్ని తయారు చేసుకుంటూ ఉంటారు..మరి వారి ప్రశ్నలకు సమాధానాలు దొరికాయా లేదా అన్నది మిగతా కథ.

ఏ విషయమైనా మనం చూసే దృష్టికోణం మీద ఆధారపడుతుందంటారు..ఏదైనా ఒక సందర్భానికి అర్ధాలను వెతికే క్రమంలో (interpretation) ఒక వస్తువును/విషయాన్నే చూస్తాం గానీ దానివెనుక సత్యం ఎప్పుడూ మన దృష్టిని దాటిపోతుంది లేదా అదృశ్యం గానో,నిగూఢంగా ఉండిపోతుంది..సత్యం మన కళ్ళకు చిక్కేది కాదు..ఈ పుస్తకంలో గోమ్బ్రోవిచ్ చెప్పాలనుకున్న విషయం అదే...కానీ ఇందులో ఏ విషయాన్నీ అరటిపండు వలిచిపెట్టినట్లు చెప్పరు..అయినా కూడా ఓపిగ్గా చదవడం పూర్తి చేసి,విసుగ్గా ఈయన మన టైం ఎందుకు వేస్ట్ చేశారు అని అనుకునేలోపు ఆ ఆలోచనల్లోంచి అసలు విషయం స్ఫూరణకొస్తుంది..ఈ కథలో ఆ ఇద్దరు యువకుల్లో కనిపించే పిచ్చితనం మనందరిలో కూడా ఎంతో కొంతశాతం ఉంటుందేమో కదా అని ! ఈ రచనలో మానవ మస్తిష్కంలోని సంక్లిష్టతల్ని ఆవిష్కరించడంలో గోమ్బ్రోవిచ్ చేసిన అలుపెరుగని ప్రయత్నం కనిపిస్తుంది..డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ,అనుభవాలను పొదివిపట్టుకుంటూ,వాటి ఆధారంగా భవిష్యత్తుని ఊహించే పిచ్చి పని మనం అందరం కూడా చేస్తామేమో..జీవితమనే అనంతమైన చుక్కల ముగ్గులో,చివరి మజిలీ ఏంటో చేరేదాకా తెలీని చోటకి జాగ్రత్తగా ఒక్కో చుక్కనూ కలుపుకుంటూ,తప్పటడుగులు  దిద్దుకుంటూ,జీవితానికి అర్ధాన్ని వెతుక్కుంటూ ముందుకు వెళ్తుంటాము..ఈ ఆదీ-అంతాలకి మధ్యలో హ్యూమన్ బ్రెయిన్ లోని ఆలోచనల స్వరూపానికి ఒక ఆకారం ఇచ్చే ప్రయత్నం చేశారు రచయిత..చివరకు ఈ తీవ్రమైన ఆలోచనలన్నీ పిచ్చితనమని నిరూపిస్తూ కథని ముగిస్తారు..రచయిత అంతరంగం తెలియగానే పెస్సోవా కవిత ఒకటి గుర్తుకొచ్చింది..ఈ పుస్తకాన్ని వర్ణించడానికి ఈ కవిత చక్కగా సరిపోతుంది..
There’s enough metaphysics in not thinking about anything.
What do I think about the world?
I have no idea what I think about the world!
If I get sick I’ll think about that stuff.
What idea do I have about things?
What opinion do I have about cause and effect?
What have I meditated on God and the soul
And on the creation of the world?
I don’t know. For me thinking about that stuff is shutting my eyes
And not thinking. It’s closing the curtains
(But my window doesn’t have curtains).
The mystery of things? I have no idea what mystery is!
The only mystery is there being someone who thinks about mystery.
When you’re in the sun and shut your eyes,
You start not knowing what the sun is
And you think a lot of things full of heat.
But you open your eyes and look at the sun
And you can’t think about anything anymore,
Because the sun’s light is worth more than the thoughts
Of all philosophers and all poets.
The light of the sun doesn’t know what it’s doing
So it’s never wrong and it’s common and good.
- Fernando Pessoa 
కాస్మోస్ లో కథనం అంతా చిక్కుముడులతో సంక్లిష్టమైన నేరేషన్ కలిగి ఉంటుంది..పదాల్నీ,వాక్యాల్నీ చుట్టచుట్టి పడేసినట్లుగా ఉండే పొడవైన పేరాగ్రాఫుల్ని చదువుతున్నప్పుడు నాకైతే శంకర్ మహాదేవన్ 'Breathless' పాట గుర్తుకువచ్చింది..విటోల్డ్ గోమ్బ్రోవిచ్  శైలి ఆద్యంతం లిరికల్ మోడ్ లో కొనసాగుతుంది కాబట్టి ఆపి ఆపి చదవడం వల్ల ఆసక్తి పోతుంది..ముఖ్యంగా గోమ్బ్రోవిచ్ కథనాన్ని ప్రవాహం మధ్యలో పట్టుతప్పిపోకుండా ఉండేందుకు వాడే తాడులా జాగ్రత్తగా పట్టుకోవాలి..సుదీర్ఘంగా,చిక్కులుపడిపోయినట్లుండే వాక్యనిర్మాణం కారణంగా మధ్యమధ్యలో కథనం పట్టు తప్పిపోతుంటుంది..అసలు కథ రాయడానికి ముందు ఏం రాద్దామనుకుంటున్నారో ఈ రచయితకు అవగాహన ఉందా అని చాలాసార్లు అనుమానం వస్తుంది..ఒక మతి స్థిమితం లేని వ్యక్తి తన మనసులోకి వచ్చిన ఆలోచనలు ఉన్నదున్నట్లుగా పేపర్ మీద పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది గోమ్బ్రోవిచ్ కథనం..ఇందులో వాక్యాలకు ఫుల్ స్టాప్లూ,కామాలూ ఉండవు..ఎటొచ్చీ ఎడారిలో మంచు కురిసినట్లు అడపాదడపా వచ్చిపోయే కాసింత డార్క్ హ్యూమర్ కాస్త ఉపశమనం..అడుగడుగునా  అబ్సర్డిటీ,పర్వర్షన్,ఇన్సానిటీ లాంటివి తప్ప ఇక్కడ లాజిక్కులూ,మ్యాజిక్కులు లాంటివి ఏమీ కనపడవు..అయినా కూడా చివరకు ఏమి జరుగుతుందో అనే చిన్నపాటి కుతూహలం ఎక్కడో లోలోపల మిణుకుమిణుకుమంటుండగా కాస్త సహనం ఉన్న పాఠకులు పేజీలు తిప్పుతారు..పుస్తకం సగానికి వచ్చేసరికి లియోన్,విటోల్డ్ ల మధ్య జరిగే సంభాషణ మన సహనానికి నిస్సందేహంగా పరీక్షపెడుతుంది..అక్కడ రెండే దారులు,పుస్తకం మూసెయ్యడం,లేదా ఈ పద్మవ్యూహం ఏంటో ఛేదించాలని పట్టుదలగా ముందుకు వెళ్ళడం..చివరకు వచ్చేసరికి హతవిధీ ! అనుకోవడం మాత్రం తప్పదు..మీకు కాస్త కుతూహలం,భూదేవంత సహనం ఈ రెండూ ఉంటే విటోల్డ్ గోమ్బ్రోవిచ్ ను చదివే ప్రయత్నం చెయ్యవచ్చు.

పాఠకుల మనోగతం కనిపెట్టిన రచయిత మాటలు,
"And don’t think, sir, that I have a screw loose . . . I’m playing a crazy man to make it easier . . . But in truth I am a monk and a bishop. What time is it?”

ఒక చర్చలో తన గురించి రచయిత చెప్పుకున్న ఈ మాటలు కాస్మోస్ చదివాకా అక్షరసత్యమనిపిస్తాయి...
“I am a humorist, a clown, a tightrope walker, a provocateur, my works stand on their head to please, I am a circus, lyricism, poetry, terror, struggle, fun and games—what more do you want?”

గోమ్బ్రోవిచ్ తన రచన కాస్మోస్ గురించి ఈ విధంగా అన్నారట,
Gombrowicz said, “Cosmos for me, is black, first and foremost black, something like a black churning current full of whirls, stoppages, flood waters, a black water carrying lots of refuse, and there is man gazing at it—gazing at it and swept up by it—trying to decipher, to understand and to bind it into some kind of a whole . . ."

పుస్తకం నుండి మరికొన్ని,
Who hanged it, why, for what reason? . . . my thoughts were entangled in this overgrowth abounding in a million combinations, the jolting train ride, the night filled with the rumble of the train, lack of sleep, the air, the sun, the march here with this Fuks, there was Jasia and my mother, the mess with the letter, the way I had “cold-shouldered” my father, there was Roman, and also Fuks’s problem with his boss in the office (that he’s been telling me about), ruts, clods of dirt, heels, pant legs, pebbles, leaves, all of it suddenly fell down before the bird, like a crowd on its knees, and the bird, the eccentric, seized the reign . . . and reigned in this nook.

On the other hand . . . what if she stood over me out of sheer kindness? It was hard to tell, there are substantial obstacles to watching people, it’s different with inanimate objects, it’s only objects that we can truly watch.

From furrow to furrow, from twig to pebble, our gaze lowered, we were absorbed by the ground that unfolded before us—gray, yellowish, rusty-dark, boring, complex, sleepy, monotonous, barren, and hard. I wiped the sweat off my face. It was all a waste of time.

An onerous task . . . because, even if something were hiding here, to which the arrow, on the ceiling, in our room, was pointing, how would we find it in this entanglement, among weeds, among bits and pieces, in the litter, surpassing in number everything that could be happening on walls, on ceilings? An overwhelming abundance of connections, associations . . .How many sentences can one create out of the twenty-four letters of the alphabet? How many meanings can one glean from hundreds of weeds, clods of dirt, and other trifles? Heaps and multitudes gushed also from the boards of the shed, from the wall. I got bored.

He would not accept defeat. He stood over me. It was unpleasant because in this remote place the emptiness of our boredom met with the emptiness of these supposed signs, with evidence that wasn’t evidence, with this total nonsense—two emptinesses and the two of us caught between them. I yawned.

With a wave of his arm he encompassed the garden and the house: “Perhaps the place is swarming with signs . . ."

the world was indeed a kind of screen and did not manifest itself other than by passing me on and on—I was just the bouncing ball that objects played with!

కొద్దిగా హ్యూమర్ ..
What now? Reality intruded with lightning speed—everything returned to normal, as if called to order. Katasia: a respectable housekeeper who had injured her lip in a car accident; we: a couple of lunatics . . .

Was this ass planning to play detective?

But the trouble was that there was so much of everything, the labyrinth was expanding, lots of things, lots of places, lots of events, isn’t it so that every pulsation of our life is composed of billions of trifles, what is one to do? That’s it, I didn’t know what to do. I had absolutely nothing to do. I was unemployed.

I wasn’t present. Isn’t it true (I thought), that one is almost never present, or rather never fully present, and that’s because we have only a halfhearted, chaotic and slipshod, disgraceful and vile relationship with our surroundings; and, what’s more, people who take part in social games, on an excursion for example (I figured), are not even ten percent present.

I was vanishing, next to me Lena was vanishing. Jolting. Trotting. Scanty, sleepy little conversations with the new couple. Nothing really, except that I’m moving away with Lena from the house where Katasia stayed behind, and moment by moment we are farther away, and in a moment we’ll be even farther away, while there, the house is there, the wicket-gate, the puny whitewashed trees tied to stakes, and the house is there, while we are moving farther and farther away.

Friday, September 14, 2018

Bartleby & Co. - Enrique Vila-Matas

'బార్టిల్బీ',మొదటిసారి విన్నాను ఈ పదం..తన పనిని చెయ్యడానికి నిరాకరించే ఉద్యోగిని బార్టిల్బీ అంటారట..అమెరికన్ రచయిత హెర్మన్ మెల్విల్ రాసిన "Bartleby,the Scrivener:A Story of Wall Street" అనే కథలో ఒక కాపీరైటర్ ఒక లాయర్ వద్ద ఉద్యోగంలో చేరతాడు..మొదట్లో కష్టపడి పని చేసినా, ఒకరోజు హఠాత్తుగా యజమాని ఒక డాక్యుమెంట్ ని ప్రూఫ్ రీడింగ్ చెయ్యమని ఇస్తే తాపీగా "నేను చెయ్యకూడదు అనుకుంటున్నాను" అంటాడు..ఆ తరువాత అతను నెమ్మదిగా ఒకదాని తరువాత ఒకటి,తనకు నిర్దేశించిన పనులేవీ చెయ్యడం మానేసి తదేకంగా ఆఫీసు కిటికీలోంచి బయటకి చూస్తుంటాడు..ఈ కథ వినడానికి అబ్సర్డ్ గా అనిపించినా ఇందులో తన పనిని తాను చెయ్యడానికి నిరాకరించిన బార్టిల్బీ(Bartleby) మనఃస్థితిలా,మంచి నైపుణ్యం,శైలి ఉన్న గొప్ప రచయితలు (ఆర్టిస్టులు) రాయకపోవడానికీ,లేదా రాయడం మానెయ్యడానికీ కారణాలు ఏమై ఉంటాయనే అంశంపై స్పానిష్ రచయిత ఎన్రికై విలా మటస్ (Enrique Vila-Matas) రాసిన పుస్తకం ఈ 'బార్టిల్బీ అండ్ కో' (Bartleby & Co.)..సాహిత్యంలో ఈ 'శూన్యత' పట్ల ఆకర్షణ వల్ల ఒకటి రెండు రచనల తరువాత రచయితలు ఈ బార్టిల్బీ సిండ్రోమ్ అనే వ్యాధికి గురైన వైనాన్ని పరిశోధించే క్రమంలో ఈ రచన ప్రాణం పోసుకుంది..పాతికేళ్ళ సుదీర్ఘ మౌనం తరువాత ఒక రచయత ఏమీ రాయలేక తన 'బార్టిల్బీ సిండ్రోమ్' గురించి ఫుట్ నోట్స్ రాసే ప్రయత్నం చేస్తాడు..ఈ క్రమంలో సాహిత్యరంగంలో ఈ 'నిశ్శబ్దానికి' కారణాలు వెతుకుతూ పలువులు రచయితల జీవితాలపై దృష్టి సారిస్తాడు.
Image Courtesy Google
కొన్ని పుస్తకాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయంటారు..ఇది అలాగే వచ్చింది..సరిగ్గా పెస్సోవాని చదువుతున్న సమయంలోనే ఈ పుస్తకం కంటపడడం విచిత్రం..ఎందరో గొప్ప గొప్ప రచయితలు,ప్రతి ఒక్కరూ తమ రచనల ద్వారా ప్రపంచానికి తమ గళాన్ని వినిపించాలని ఆరాటపడిన వాళ్ళే..మరి పెస్సోవా మాత్రం తన రచనల్ని ప్రచురించకుండా ఎందుకు ఊరుకున్నారు,పైగా ఒక ఫాంటమ్ లా మారుపేర్లు,వ్యక్తిత్వాలతో ఎందుకు తన కళని తెరచాటున ఉంచారనేది నాకు కొరుకుడుపడలేదు..ఇక్కడ పెస్సోవా తన ఉనికిని పరిత్యజించడం ఒక ఎత్తైతే,శూన్యాన్ని తన కళగా చేసుకోవడం మరో ఎత్తు..ఈ విచిత్రమైన స్థితికి కారణాలు ఏంటా అని ఆలోచిస్తున్న తరుణంలో ఈ పుస్తకం చదవడం తటస్థించింది..నా అనుమానాలకు ఇందులో సమాధానాలు దొరికాయనే అనుకుంటున్నాను..రచయితల్లో ఈ సిండ్రోమ్ గురించిన స్పృహ పాతదే..రూల్ఫో లాగానే Wittgenstein అనే తత్వవేత్త కూడా రెండే రెండు రచనలు చేస్తే,ఆండ్రే గిడే సృష్టించిన ఒక పాత్ర చివరివరకూ పుస్తకం రాద్దామని ప్రయత్నించి రాయకుండా ఉండిపోతుందట..అలాగే ఆస్ట్రియన్ ఫిలాసఫర్ రాబర్ట్ మూసిల్ 'The man without qualities' అనే పుస్తకంలో 'unproductive author' అనే ఆలోచనపై చర్చించారట..వలరీ ఆల్టర్ ఇగో,Monsieur Teste రాయడాన్ని నిరాకరించడమే కాక తన లైబ్రరీని కిటికీలోంచి బయటకు విసిరేశారట..ఇలా సాహిత్యరంగంలో అస్త్ర సన్యాసం చేసినవారు కోకొల్లలు అంటూ ఈ బార్టిల్బీ సంఘ సభ్యుల మీద అద్భుతమైన విశ్లేషణలు చేశారు రచయిత..

సృజనాత్మకత అందరికీ దొరికే అదృష్టం కాదు..అందుకే కళాకారులకి సరస్వతీ కటాక్షం ఉంది అనడం తరచూ వింటూ ఉంటాం..మరి చరిత్ర తిరగేస్తే అపూర్వమైన సృజనాత్మకత ఉండీ కూడా కొందరు గొప్ప కళాకారులూ మౌనాన్ని ఎందుకు ఆశ్రయించారనేది సాహితీ దిగ్గజాలకు సైతం కొరుకుడుపడని విషయం..సాహిత్య సృష్టిలో ఇటువంటి స్తబ్ధతను కోరుకున్న రచయితల్ని 'బ్లాక్ సన్స్ ఆఫ్ లిటరేచర్' ,'రైటర్స్ ఆఫ్ నో' అని ఈ పుస్తకంలో సంభోదిస్తారు..
అయినా రాయకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి !! సమాజంపట్ల తిరస్కార భావం అని కొందరంటే,వైఫల్యాలు ఎదుర్కోలేని బెదురని మరికొందరంటారు..సృజనాత్మకతకి హద్దుల్లేకపోయినా ఆర్టిస్టులకి కూడా పరిమితులుంటాయనీ,సాహిత్యంతో సహజీవనం వాస్తవజీవితాన్ని నాశనం చేస్తుందని మరికొందరి వాదన..'I'm Nobody' అనుకోవడం వల్ల కొందరు రాయలేకపోతున్నారు అనే వాదన మనిషికి 'నేను' అనే అహం లేకపోవడం,సృజనకు అవరోధమా అనే దిశగా ఆలోచనలు రేకెత్తిస్తుంది..కానీ ఈ ఆలోచనకు భిన్నంగా పెస్సోవా లాంటివాళ్ళు ఈ 'శూన్యం' (nothingness) అనే అంశాన్నే ఆధారంగా చేసుకుని ఎన్నో రచనలు చేశారు..హ్యూమన్ మోర్టాలిటీ గురించి స్పష్టత ఉండడం,అస్తిత్వంలోని అస్థిరతను ఆర్టిస్టులు ముందుగానే గ్రహించడం లాంటివి కూడా కళాకారుల్లో ఈ నిశ్శబ్దానికి కారణాలని ఇందులో కొన్ని ఉదాహారణలు చూస్తే అనిపిస్తుంది..Art itself is imperfection అనుకుంటే నేననే అహంభావం (?),కాస్త నేపట్టిన కుందేలుకి మూడేకాళ్ళన్న మనస్తత్వం లాంటివి తగుమోతాదులో ఆర్టిస్టులకి అవసరమే అని ఇందులో కొని విశ్లేషణలు చూశాక అనిపించింది.
For some time now I have been investigating the frequent  examples of Bartleby’s syndrome in literature, for some time  I  have  studied  the  illness,  the  disease,  endemic  to  contemporary  letters,  the  negative  impulse  or  attraction  towards  nothingness  that  means  that  certain  creators,  while  possessing  a  very  demanding  literary  conscience  (or  perhaps  precisely because of this),  never manage to write: either they  write one or two books and then stop altogether or, working  on  a  project,  seemingly  without  problems,  one  day  they  become literally paralysed for good.
 Álvaro de Campos, an expert  in saying that the only metaphysics in the world were chocolates,  and  an  expert in  taking  the  silver  foil  in  which  they  were wrapped and throwing it to  the ground,  as  previously,  he  said,  he  had thrown his  own life  to  the ground.
ఈ సాహిత్య సన్యాసం చేసిన వారిని గురించి రాస్తూ,రెండే రెండు రచనలు చేసిన ప్రముఖ మెక్సికన్ రచయిత  జువాన్ రుల్ఫో గురించి ఆయన ఫ్రెండ్ రాసిన 'The wisest fox' అనే ఒక కథ చెప్తారు..ఆ కథలో ఒక నక్క ఉండేది,అది రెండు గొప్ప పుస్తకాలు రాసిన తరువాత రాయడం మానేసింది..ఏళ్ళు గడుస్తున్నా నక్క ఏమీ రాయకపోవడం చూసి అందరూ ఆ నక్క గురించి విచిత్రంగా మాట్లాడుకుంటూ ఒకసారి పార్టీలో "నువ్వు రాయాలి" అని అన్నారట."అదేంటి నేను ఆల్రెడీ రెండు పుస్తకాలు ప్రచురించాను కదా" అన్నప్పుడు, "అవును అవి మంచి రచనలు కాబట్టి నువ్వు ఇంకో పుస్తకం రాయాలి" అన్నారు..అప్పుడు నక్క మనసులో "వాళ్ళకి కావాల్సింది నా చేత ఒక చెడ్డ పుస్తకాన్ని రాయించడం" అని అనుకుందట..అది ఒక నక్క కాబట్టి వారి ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించింది అంటారు..ఈ కథ ను బట్టి రచయితల్లో వైఫల్యాలకు భయపడి రాయని వారు కొందరైతే,నిజాయితీగా తమలో సృజనాత్మకత అంతరించిపోయిందని తెలుసుకుని పరుగును ఆపడాన్ని కళగా చేసుకున్నవారు మరికొందరు.
“Adieu”  is  a  brief text by  Rimbaud included in A Season  in  Hell,  in which  the  poet does  indeed  appear  to  be  saying  farewell to literature: “Autumn already! But why yearn for an  eternal  sun  if we  are  committed  to  the  discovery  of divine  light,  far  away from those who die at different seasons?”
A writer who does not write is a monster who invites  madness అని కాఫ్కా అన్నట్లు రచయితలు రాయకపోతే జరిగే నష్టంతో పోలిస్తే,రాస్తే జరిగే నష్టం చిన్నదా పెద్దదా అని ఆలోచించాను..పంతొమ్మిదేళ్ళ వయసులో ఫ్రెంచ్ కవి ఆర్థర్ రింబాడ్ కూడా సాహిత్యసన్యాసం చేసి తుదకంటా మౌనాన్ని ఆశ్రయించడం గురించి రాస్తూ ,
“I grew used,” writes Rimbaud,  “to simple hallucination:  I saw very clearly a mosque in place of a factory,  a school of  drummers  formed  by  angels,  carriages  on the  highways  of  the sky,  a salon at the bottom of a lake"

No-one  can  derive  much pleasure from  the  task of making  a written inventory of their own hallucinations. Rimbaud did  it,  but after  two  books  he  grew  tired,  perhaps  because  he  sensed that he was  going to  lead a very  bad  life  if he  spent  all  his  time  recording  his  incessant visions  one  by  one. అంటారు..'మ్యూజ్' ను మనోఫలకంనుండి జారిపోకుండా నిరంతరం బంధించి ఉంచడంలో మానసిక సమతౌల్యం దెబ్బతింటుందని ఆర్టిస్టులు ముందుగానే ఊహించి సాహిత్యసన్యాసం చెయ్యడం బార్టిల్బీ సిండ్రోమ్ కు మరో కారణంగా చూపించారు..ఇది చదువుతున్నప్పుడు కళాసృష్టి చేసే విషయంలో అనుక్షణం స్పృహ కలిగి ఉండటం రచయితలకు శాపమా,వరమా అనే ప్రశ్న కూడా తలెత్తింది..ఈ పుస్తకంలో చాలా మంది రచయితల గురించి ఆసక్తికరమైన విషయవిశేషాలున్నాయి..నేను చదివిన కొందరు రచయతలు ఆండ్రే గిడే,కామూ,పెస్సోవా,రాబర్ట్ వాల్సర్,సాలింజర్,మొపాసా లాంటి కొందరితో పాటు మరికొందరు చదవాలనుకున్న గొప్ప రచయితల వివరాలు కూడా తెలిశాయి..

ఇంతవరకూ బాగానే ఉంది గానీ ఈ 'సాహిత్యంలో శూన్యాన్ని' కూడా ఒక కళారూపంగా చూడగలగడం అనే కాన్సెప్ట్ నాకు చాలా కొత్తగా,వింతగానేగాక ఆసక్తికరంగా కూడా  అనిపించింది.
ఏ మనిషికైనా ఏ పని మీదైనా ఒక 'కంఫర్టబుల్ జోన్' లోకి చేరాక ఆసక్తి సన్నగిల్లుతుంది..చాలాకాలం బొమ్మలతో ప్రాణంగా ఆడుకునే చిన్నపిల్లలు ఉన్నట్లుండి వాటిని వదిలెయ్యడం,స్నేహితులతో కబుర్లలో గడిపే యువత ఏదో ఒక సమయంలో ఏకాంతాన్ని కోరుకోవడం,పెద్దవాళ్ళలో 'రిటైర్మెంట్' అనే కాన్సెప్ట్ ఇవన్నీ ఈ వర్గంలోకి వస్తాయనుకుంటాను..జీవితంలో ఒక్కో దశలో ఒక్కో ఆసక్తిలాగా,ఇష్టం లేక,ఆసక్తి పోయాక మొక్కుబడిగా భౌతిక విషయాలకు సంబంధించి ఏ పనైనా అవసరం కొద్దీ చెయ్యగలరేమో గానీ కళను సృష్టించడం మాత్రం అసంభవం..కళ ఈ పరిధిలోకి రాదు..ఈ విషయం అర్ధమైన రచయితలు అందుకే మౌనాన్ని ఆశ్రయిస్తారేమో..

But,  paradoxically,  those who  shun the  pen  constitute literature as well. As Marcel Bénabou writes in Why  I Have Not Written Any  of My  Books,  “Above all,  dear reader, do  not believe  that the  books I have  not written are  pure  nothingness. On the contrary (let it be clear once and for all), they  are  held in  suspension in universal literature.”

I think  it  might  be  said  that,  in  a  certain  way,  both  Hölderlin  and  Walser  carried on  writing.  “To  write,”  Marguerite  Duras  remarked,  “is  also  not to  speak.  It is  to  keep silent. It is to howl noiselessly.”

ఒక మోస్తరు రచయితలే కాకుండా ఈ సిండ్రోమ్ బారిన పడ్డ వారిలో కాఫ్కా,మొపాసా,వాల్సర్ లాంటి గొప్ప గొప్ప రచయితలు కూడా ఉన్నారు..కాఫ్కా గోథేను చదువుతున్న సమయంలో కొన్ని రోజులు ఏమీ రాయలేకపోయారట..అలాగే గై డి మొపాసా జీవితం గురించి రాసిన విషయాలు కదిలించాయి..ప్రముఖ రచయితగా,ఫ్లాబర్ట్ శిష్యుడుగా కీర్తి ప్రతిష్ఠలార్జించిన మొపాసా చాలా సౌకర్యవంతమైన జీవితం గడిపారంటారు..కానీ ఒక రాత్రి హఠాత్తుగా తన బెడ్రూమ్ లోకి వచ్చి  "నేను అమరుణ్ణి" అని పిచ్చివాడిలా అరుస్తూ ఆత్మహత్యకు ప్రయత్నించిన తరువాత ఆయన మరెప్పుడూ రచనలు చెయ్యలేదు..ఒక మానసిక రోగిగానే ఆయన చివరిరోజులు గడిచాయట..అలాగే నోబెల్ గ్రహీత Juan  Ramón Jiménez రచనావ్యాసంగం వదిలేసిన కారణాలు కూడా మర్చిపోలేని ముద్ర వేస్తాయి..ఇలా చెప్పుకుంటూ పోతే వీటికి అంతం లేదు..ఇలాంటి కథలు ఈ పుస్తకంలో కోకొల్లలు..సాహిత్యలోకపు వెలుగుల వెనుక విఫలమయిపోయిన (?) రచయితల వ్యక్తిగత  జీవితాలు ఈ అరుదైన రచనలో వెలుగుచూశాయి..ఈ 'నిశ్శబ్దం' సాహిత్యానికి ఆవలి ప్రపంచాన్నీ,సాహితీలోకాన్నీ సమాంతరంగా చూపించే ప్రయత్నం చేస్తుంది.

చివరకు టాల్స్టాయ్ కూడా చివరి రోజుల్లో తన 'నైతిక వైఫల్యానికి' రైటింగ్ ఒక ప్రధాన కారణమని అంటూ సాహిత్యాన్ని ఒక శాపంగా భావించారనడం గమనార్హం..ఒక రోజు రాత్రి ఆయన తన డైరీలో తన జీవితంలో ఆఖరి వాక్యం రాశారట, a sentence he did not manage to finish: “Fais  ce  que dois, advienne  que  pourra”  (Do  your  duty,  come  what may).  It is  a  French proverb that Tolstoy was very keen on. The sentence  ended up looking like  this:Fais ce  que dois,  adv...
అని ఆ వాక్యం అసంపూర్తిగానే మిగిలిపోయింది అంటూ Many years  later,  Beckett would say even words abandon  us  and that’s all  there is  to  it. అని ముగించారు

ఇందులో రాబర్ట్ వాల్సర్ గురించి రాసిన విషయాలు ఆయన్ను మరింత అర్ధం చేసుకోడానికి దోహదపడ్డాయి..వాల్సర్ ఇరవై ఎమిదేళ్ళ నిశ్శబ్దాన్ని గురించి రాస్తూ,సాహిత్య లోకంలో ఉన్నత శిఖరాలు అధిరోహించే క్రమంలో దొరికే అధికారం,కీర్తిప్రతిష్ఠలు వాల్సర్ లాంటివాళ్ళకు ఉపయోగంలేనివంటారు.

He  stood rooted  to  the  spot,  viewed  me  with  utter seriousness and asked me,  if I valued his friendship, never to repeat  such  a  compliment.  He,  Robert  Walser,  was  a  walking  nobody and he wished to  be  forgotten.”

Someone  has  compared  Walser  to  a  long-distance  runner  who  is  on  the  verge  of  reaching the longed-for finishing-line and stops in surprise,  looks  round at masters  and fellow  disciples,  and abandons  the  race,  that  is  to  say  remains  in  what is  familiar,  in  an  aesthetics of bewilderment.

Walser wanted to be a walking nobody,  and the vanity he  loved  was  like  that  of Fernando  Pessoa,  who  once,  on  throwing a chocolate silver-foil wrapper to  the ground,  said  that,  in doing so,  he  had thrown away life.


వాల్సర్ 'Jakob von Gunten' లో  “I must  stop writing  for  today.It excites  me  too  much.The  letters  flicker and dance in front of my eyes.” అంటారు.

ఈ విశ్లేషణలో రీడర్స్ ని కూడా కలుపుకున్నారు..
Bobi  Bazlen  was  a Jew  from  Trieste  who  had  read  every  book  in  every  language  and  who,  while  possessing  a  very  demanding literary conscience (or perhaps precisely because  of this),  instead of writing preferred to  intervene directly in  people’s lives. The fact that he never wrote a book forms part  of his work.

సాహిత్యసన్యాసాన్ని సమర్ధించే దిశగా చేసిన పరిశోధనల్లో రాయకపోవడాన్ని ఒక వైఫల్యంగా భావించినవాళ్ళూ ఎదురవుతారు..
There are even moments in the book when Del Giudice  treats  the  mythical  writer  of the  No  with  extreme  cruelty,  quoting what an old friend of Bazlen has said: “He was evil.  He spent his whole time meddling in other people’s lives and  affairs.  He  was  nothing  but  a  failure  who  lived  his  life  through others.”

Another,  no  less  ingenious,  device  is  that  contrived  by  Jules  Renard,  who  in  his  Diary  notes  this  down:  “You’ll  achieve  nothing.  However  much  you  do,  you’ll  achieve  nothing.  You  understand the best poets,  the most profound  prose-writers, but though they say to understand is to equal,  you’ll  be  about as  comparable  to  them as  the  lowest dwarf  can be compared to giants [...] You’ll achieve nothing. Weep,  shout, clasp your head in both your hands,  hope, lose hope,  apply yourself again, push the stone. You’ll achieve nothing.”

In his stealthy and prolonged search, he always acted with  admirable lucidity and never lost sight of the fact that,  even  as  an  author without a  book and  a writer without texts,  he  still moved in the field of art: “Here I am, detached from civil  things,  in  the  pure region of art.” (joubert)

కాల్విన్ అండ్ హాబ్స్ లో 'Nude  Descending  a  Staircase' అనే ఒక కామిక్ స్ట్రిప్ ఉంటుంది..ఇందులో ఆ సెటైర్ తాలూకా కథను గురించి ప్రస్తావించారు.
Marcel Duchamp was  born in France in 1887 and died  a United States citizen in 1968. He was at home in both  countries  and  divided  his  time  between  them.  At  the  New York Armory Show of 1913,  his Nude  Descending  a  Staircase  delighted and offended  the press,  provoked a  scandal that made him famous in absentia at the age of  twenty-six,  and drew him to  the United States in 1915.
No-one ever catches up with Melville’s strange impostor,  just as  nobody ever caught up with Duchamp,  the man who  did  not  trust  in  words:  “As  soon  as  we  start  putting  our  thoughts into words and sentences everything gets distorted,  language is  just no damn good — I use  it because I have  to,  but  I  don’t  put any  trust  in  it.  We  never  understand  each  other.”
సాహిత్యం గురించి మాట్లాడుకునేటప్పుడు  ఆస్కార్ వైల్డ్ గురించి ప్రస్తావనలేని పుస్తకం రాయడం అసంభవమేమో..
In “The Critic as Artist”, Oscar Wilde voiced an old ambition:  “to  do  nothing at all  is  the  most difficult thing in  the  world,  the most difficult and the most intellectual".

“When  I  did  not  know  life,  I  wrote;  now  that  I  know  its  meaning,  I  have  nothing more to  write" 

If we  add  to  this  unattainable,  universal  aspiration what  Oscar  Wilde  wrote  about  the  public  having  an  insatiable  curiosity to know everything except what is worth knowing,

పుస్తకం నుండి మరి కొన్ని,
Susan Sontag discusses in her book Styles of Radical Will: “The  choice  of permanent  silence  doesn’t  negate  [the  artist’s]  work.  On  the  contrary,  it  imparts  retroactively  an  added  power and authority to what was  broken off — disavowal  of  the work becoming a new source of its validity,  a certificate  of unchallengeable seriousness. That seriousness consists in  not regarding art [...] as something whose seriousness lasts  for ever, an ‘end’, a permanent vehicle for spiritual ambition.  The truly serious attitude is one that regards art as a ‘means’  to  something  that  can  perhaps  be  achieved  only  by  abandoning art.

About Chamfort “His  extreme,  cruel  attitude,”  says  Camus, “led him  to  that final  denial which is  silence."

In one  of his Maxims we  read  the  following:  “M.,  whom  they  wanted  to  discuss  various  public  and  private  matters,  coldly replied,  ‘Every day I add  to  the  list of things  I don’t  talk about;  the greatest philosopher would  be  the one with  the longest list.’”

The denial of art led  him  to  even  more  extreme  denials,  including  that  “final  denial”  referred  to  by  Camus,  who,  commenting  on  why Chamfort  did  not write  a  novel  and  fell  into  an  extended  silence, has this to say: “Art is the opposite of silence, constituting one of the  signs of that complicity which joins us  to  men  in  our  common  struggle.  For  someone  who  has  lost  that complicity and has sided completely  with  rejection, neither  language nor art conserve their expression. This is, no doubt,  the  reason  why  that  novel  of a  denial  was  never  written:  precisely because  it was  the  novel  of a  denial.  The  point is  that this art contains the very principles that ought to lead it  to  negate itself.”

“The  dignity  of intelligence  lies  in  recognising  that it  is  limited  and that the universe exists  outside it.”

Robert  Musil’s  Young  Törless,  who,  in  the novel of the same name published in 1906, warns  of the  “second life  of things,  secret and elusive  [...], a life  that is  not  expressed  in  words  and  that  nonetheless  is  my  life”

“The  act  of  rejecting is  difficult and rare,  though identical in each of us  from the moment we have grasped it. Why difficult? Because  you  have  to  reject not only the worst,  but also  a reasonable  appearance, an outcome that some would call  happy.”

Poetry unwritten, but lived in the mind: a beautiful ending  for  someone who ceases  to write.

“What  we  cannot  speak  about  we  must  pass  over  in  silence,” wrote Wittgenstein.

I am like an explorer who advances towards the void. That  is  all. 

I started memorising,  over and  over,  Wittgenstein's saying  that everything  that can  be  thought can  be  thought clearly,  everything that  can be  put into words  can be  put clearly,  but not everything  that can be  thought can be put into words.

Whoever  affirms  literature  in  itself  affirms  nothing.  Whoever looks for it is only looking for what escapes, whoever  finds  it only  finds  what  is  here  or,  which  is  worse,  what is  beyond literature. That is why, in the end, every book pursues  non-literature as the essence of what it wants and passionately  desires to  discover.

Wednesday, September 5, 2018

The Uncommon Reader - Alan Bennett

పుస్తకాలెందుకు చదవడం !! చదివితే ఉన్న మతి పోయిందనీ !!! ఎంత చదివినా ఏం లాభం !! ఏ పని చేసినా దానికొక ప్రయోజనం ఉండాలి !! ఒక్కసారి చదివి ప్రక్కన పడేసేదానికి అంత డబ్బు పోసి ఆ పుస్తకాలు కొనకపోతే ఏం !! అదొక ఎస్కేపిజం !!!  ఎక్సట్రా !! ఎక్సట్రా !!! ఎక్సట్రా !! ఇలాంటి హితబోధలూ,ఉపమానాలూ,ఫిర్యాదులూ,నిష్టూరాలూ విని విని అదేదో కాని  పని చేస్తున్నామేమో అని ఎప్పుడైనా లేనిపోని అనుమానాలొస్తే "కుచ్ తో లోగ్ కహేంగే ,లోగోం కా కామ్ హై కెహనా/"తూ కౌన్ హై,తేరా నామ్ హై క్యా,సీతా భీ యహాన్ బద్నామ్ హుయీ"" అనే రాజేష్ ఖన్నా పాటని గుర్తు చేసుకుని మళ్ళీ పుస్తకం చదవడంలో మునిగిపోతుంటాను..నాకూ,నాలాంటి మరికొందరికీ పొద్దున్న లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకూ,ఊపిరిసలపని నిజజీవితంలోని బాధ్యతల మధ్య ఈ పుస్తక పఠనం అనే వ్యాపకం ఒక వెలకట్టలేని ఆనందం..నా చెంచాడు భవసాగరాల మధ్యలో నాకోసం నేను వెచ్చించుకునే సమయం ఈ పుస్తకాలు చదువుకోవడం..ఈ అపురూపమైన రెండు మూడు గంటల సమయంలో పుస్తక పఠనమేదో పాపంలా సభ్యసమాజం చేసే నిష్టూరాలు కూడా ఈ చెవితో వినేసి ఆ చెవితో వదిలేసే సమయంలో చూశాను ఈ పుస్తకాన్ని..అప్పుడు అనిపించింది "హమ్మయ్య నేనొక్కర్తినే కాదన్నమాట !" అని..
Image courtesy Google
పుస్తకాలు  చదవి ఏం ఉద్ధరిస్తారని అడిగితే నాలాంటి అతి మామూలు మనుషులకే చిరాకు వస్తే మరి సాక్షాత్తూ బ్రిటన్ రాణికి ఎలా అనిపించి ఉంటుంది !! Wait అసలు ప్రపంచం అంతా ఫింగర్ టిప్స్ మీద ఉన్న రాణీగారికి పుస్తకాలతో పనేంటి ? ప్రపంచం నలుమూలలూ తిరిగి చూసిన ఆవిడకు పుస్తకాల్లో కొత్తగా చూడాల్సిన ప్రపంచం ఏంటి ? అసలు ఎవరైనా పుస్తకాలు ఎందుకు చదవాలి ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈ రచన..ఎనభయ్యో పడికి చేరువలో ఉన్న బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ II కు పుస్తకాలు చదివే వ్యసనం (?) ఎలా అలవాటయ్యిందీ..పుస్తకాలు చదివే అలవాటు ఆమెలో ఎలాంటి పరివర్తన తీసుకువచ్చిందీ అనే అంశం ఆధారంగా అల్లిన కల్పిత కథ బ్రిటిష్ రచయిత Alan Bennett రాసిన ఈ 'The Uncommon Reader'..

Few people, after all, had seen more of the world than she had. There was scarcely a country she had not visited, a notability she had not met. Herself part of the panoply of the world, why now was she intrigued by books which, whatever else they might be, were just a reflection of the world or a version of it? Books? She had seen the real thing.“I read, I think,” she said to Norman, “because one has a duty to find out what people are like,” a trite enough remark of which Norman took not much notice, feeling himself under no such obligation and reading purely for pleasure, not enlightenment, though part of the pleasure was the enlightenment, he could see that. But duty did not come into it.

ఒకరోజు బ్రిటన్ రాణి పెంపుడు కుక్కల్ని తోటలో షికారు తిప్పుతుండగా అవి ఉన్నట్లుండి వంటింటి వెనుక వైపుకు పరుగులు తీస్తాయి..వాటిని అనుసరిస్తూ ఎప్పుడూ అటువైపుకు వెళ్ళని ఆవిడ అటు వెళ్ళే సరికి అక్కడ ఒక మొబైల్ లైబ్రరీ వాన్ ఆగి ఉంటుంది.. ప్రతి బుధవారం వచ్చే ఆ మొబైల్ లైబ్రరీ వద్ద రాజభవనపు వంటింట్లో పని చేసే నార్మన్ సీకిన్స్ అనే యువకుడు పుస్తకం చదువుతూ కనిపిస్తాడు..అతడితో మాట కలిపినప్పుడు అతనికి సాహిత్యం మీద ఉన్న అవగాహన తనకు లేదని గమనిస్తుంది..సాహిత్యం,పుస్తకాలూ వీటిపై ఆసక్తీ ,అవసరం ఇవేవీ లేకపోయినా ఆ పుస్తకాల షాపు యజమాని Mr Hutchings కి మర్యాద ఇస్తూ ఒక్క పుస్తకమైనా తీసుకోవాలని,ఆవిడకి తెలుసున్న టైటిల్ తో ఉన్న ఒక పుస్తకం తీసుకుని వెళ్తుంది..అలా మెల్లిగా ఆ పుస్తకం పూర్తిచేసి మళ్ళీ రెండోవారం కూడా పుస్తకాల కోసం వస్తుంది..క్రమేపీ పుస్తకపఠనం మీద ఆసక్తి కాస్తా ఆవిడకి తెలీకుండానే అబ్సెషన్ గా మారుతుంది..ఈ సమయంలోనే తనకు సాహిత్య సలహాదారుగా నార్మన్ ను నియమిస్తుంది..ఇక్కడ నుంచీ అసలు కథ మొదలవుతుంది.

"Oh, to the end. Once I start a book I finish it. That was the way one was brought up. Books, bread and butter, mashed potato — one finishes what’s on one’s plate. That’s always been my philosophy.”

రాణిగా అనేక బాధ్యతల నడుమ ఆమెకు పుస్తకాలకు తగినంత సమయం దొరకదు,అయినప్పటికీ ఆమె ఆసక్తి ఇసుమంత కూడా తగ్గదు..పుస్తకాలపురుగుల్లాగే ఆమె కూడా ప్రధానమంత్రి మొదలు ఇతర దేశాల ప్రతినిధులతో సహా కనిపించిన ప్రతి వ్యక్తినీ ఆ పుస్తకం చదివావా ? ఈ పుస్తకం మీద నీ అభిప్రాయమేంటి ? లాంటి ప్రశ్నలు వేసి,తెలీదన్న వారికి ఆ పుస్తకాలు తెప్పించి బహుకరిస్తుంది...కాల్పనిక ప్రపంచానికీ,వాస్తవ ప్రపంచానికీ ఎప్పుడూ చుక్కెదురు కాబట్టి,ఆమెలో ఈ వ్యాపకం వ్యసనంగా మారగా చివరకు సభల్లో కూడా దొంగచాటుగా కుషన్స్ క్రింద పుస్తకాలు పెట్టుకుని చదవడం,ఎక్కడకు వెళ్ళినా పుస్తకాలు వెంట తీసుకు వెళ్ళడంలాంటివి ఆమె హోదాకు భంగమని భావించిన పాలనా వ్యవస్థలోని వ్యక్తులు ఆమెచే ఎలా అయినా ఈ అలవాటు మాన్పించాలని పుస్తకాలు దాచెయ్యడం,నార్మన్ ను ఆమెకు తెలీకుండానే దూరంగా పంపించెయ్యడం లాంటి కొన్ని ప్రయత్నాలు చేసినా ఆమె ఆసక్తి తగ్గించడంలో పూర్తిగా విఫలమవుతారు.

‘The Queen has a slight cold’ was what the nation was told, but what it was not told, and what the Queen herself did not know, was that this was only the first of a series of accommodations, some of them far-reaching, that her reading was going to involve.

ఈ కథంతా సీరియస్ గా కాకుండా పొట్టచెక్కలయ్యే హాస్యం మేళవించి చెప్పడంలో బెన్నెట్ ప్రత్యేకత అడుగడుగునా కనిపిస్తుంది..రాణీగారి కుక్కలు ఆమె తమకు తగినంత సమయం వెచ్చించడం లేదని అలిగి ఆమె లైబ్రరీ పుస్తకాల్ని చింపి పొయ్యడం,డెబ్భై ఏళ్ళ వయసులో ఆమె తమజోలికి రానందుకు కుటుంబ సభ్యులు ఆనందపడడం,ఆమె పుస్తకాలు బహుమతిగా పొందిన సాధారణ ప్రజలు ebay లో వాటిని అమ్మేసుకుంటారు అని రచయిత అనడం,ఆమె పుస్తకాలు దాచెయ్యడం లాంటివి పాఠకుల్ని నవ్వుల్లో ముంచితేలుస్తాయి..ఇందులో మరో సరదా సందర్భం ఉంటుంది..ఎలిజబెత్ II కి సాహిత్యంపై పట్టువచ్చాక  మునుపు Priestly,T.S.Elliot,Philip Larkin,Ted Hughes లాంటి ఎందరో రచయితల్ని ప్రత్యక్షంగా కలిసినా వారి పుస్తకాలు చదవకపోవడం వల్ల ఏమీ మాట్లాడలేకపోయానని చింతించి ఆమె చదివిన రైటర్స్ అందర్నీ ఒకసారి పార్టీకి పిలుస్తుంది..ఈ అనుభవం తరువాత రచయితల్ని పుస్తకాల పేజీల మధ్య కలవడమే మంచిదని నిర్ధారణకొస్తుంది.. :) :)

One Scottish author was particularly alarming. Asked where his inspiration came from, he said fiercely: “It doesn’t come, Your Majesty. You have to go out and fetch it.”

Authors, she soon decided, were probably best met with in the pages of their novels, and were as much creatures of the reader’s imagination as the characters in their books. Nor did they seem to think one had done them a kindness by reading their writings. Rather they had done one the kindness by writing them.

ఒక రాణీగా ప్రపంచంతో ప్రత్యక్షమైన సంబంధం కలిగిన ఆమెకు నిజంగా పుస్తకాల అవసరం ఏముంటుంది ! ఆమెకు పుస్తక పఠనం మేలు చేసిందా,కీడు చేసిందా అనే విషయాలు తెలియాలంటే ఈ రచన చదవాలి..చివర్లో ఆమె చదవడం అనేది జీవితాన్ని దూరంగా నుంచుని చూడడంలాంటిదైతే,రాయడం జీవితంలో భాగం పంచుకోడంలాంటిదని నిర్ణయానికొచ్చి తాను కూడా ఒక రచన చెయ్యాలని సంకల్పించడంతో ఈ కథ ముగుస్తుంది..పుస్తకాలు చదవడం కూడా ఒక వ్యసనమే అనుకుంటే,ఈరోజుల్లో పాపులర్ రియాలిటీ షోలూ,దీర్ఘంగా సాగే ఫోన్ సంభాషణలూ,విరక్తి వచ్చే టీవీ సీరియళ్ళూ,ఇరుగుపొరుగుల వ్యక్తిగత జీవితాలని ఆరాతీస్తూ,ప్రతి దానిలో రంధ్రాన్వేషణ చేస్తూ,మనుషుల్ని ఏదో ఒక సాకుతో జడ్జి చేస్తూ బిజీగా ఉండే ఆధునిక సమాజంలో ఇది ఏమంత అనారోగ్యకరమైన వ్యసనం కాదని భరోసా ఇచ్చే పుస్తకం ఇది..పుస్తకపఠనంలో ఉన్న కష్టనష్టాలూ,చిన్న చిన్న చిక్కులూ,అనంతమైన ఆనందాలతో కూడిన కబుర్లతో ఆద్యంతం సరదాగా నవ్విస్తూ సాగిపోయే ఈ పుస్తకాన్ని రీడర్స్ మరియూ రైటర్స్  తప్పకుండా చదవాలి.

And it came to her again that she did not want simply to be a reader. A reader was next door to being a spectator whereas when she was writing she was doing, and doing was her duty.

పుస్తకం నుండి కొన్ని నచ్చిన విషయాలు,

She was also intensely conventional and when she had started to read she thought perhaps she ought to do some of it at least in the place set aside for the purpose, namely the palace library. But though it was called the library and was indeed lined with books, a book was seldom if ever read there. Ultimatums were delivered here, lines drawn, prayer books compiled and marriages decided upon, but should one want to curl up with a book the library was not the place. It was not easy even to lay hands on something to read, as on the open shelves, so called, the books were sequestered behind locked and gilded grilles. Many of them were priceless, which was another discouragement. No, if reading was to be done it were better done in a place not set aside for it. The Queen thought that there might be a lesson there and she went back upstairs.

Of course he couldn’t actually have said this to her face, she realised that, but the more she read the more she regretted how she intimidated people and wished that writers in particular had the courage to say what they later wrote down. What she was finding also was how one book led to another, doors kept opening wherever she turned and the days weren’t long enough for the reading she wanted to do.

“But ma’am must have been briefed, surely?”
“Of course,” said the Queen, “but briefing is not reading. In fact it is the antithesis of reading. Briefing is terse, factual and to the point. Reading is untidy, discursive and perpetually inviting. Briefing closes down a subject, reading opens it up.”

“I can understand,” he said, “Your Majesty’s need to pass the time.”
“Pass the time?” said the Queen. “Books are not about passing the time. They’re about other lives. Other worlds. Far from wanting time to pass, Sir Kevin, one just wishes one had more of it. If one wanted to pass the time one could go to New Zealand.”
With two mentions of his name and one of New Zealand Sir Kevin retired hurt.

Books did not defer. All readers were equal, and this took her back to the beginning of her life. As a girl, one of her greatest thrills had been on VE night, when she and her sister had slipped out of the gates and mingled unrecognised with the crowds. There was something of that, she felt, to reading. It was anonymous; it was shared; it was common. And she who had led a life apart now found that she craved it. Here in these pages and between these covers she could go unrecognised.

రాణీగారి కుక్కల ఆగ్రహానికి బలైన రచయితల గురించి రాస్తూ,
The James Tait Black prize notwithstanding, Ian McEwan had ended up like this and even A. S. Byatt. Patron of the London Library though she was, Her Majesty regularly found herself on the phone apologising to the renewals clerk for the loss of yet another volume.

“What are you reading at the moment?”
 To this very few of Her Majesty’s loyal Subjects had a ready answer (though one did try: “The Bible?”)

Off duty, Piers, Tristram, Giles and Elspeth, all the Queen’s devoted servants, compare notes: “What are you reading? I mean, what sort of question is that? Most people, poor dears, aren’t reading anything. Except if they say that, madam roots in her handbag, fetches out some volume she’s just finished and makes them a present of it.” “Which they promptly sell on eBay.”

“To read is to withdraw. To make oneself unavailable. One would feel easier about it,” said Sir Kevin, “if the pursuit itself were less…selfish.”

To begin with, it’s true, she read with trepidation and some unease. The sheer endlessness of books outfaced her and she had no idea how to go on; there was no system to her reading, with one book leading to another, and often she had two or three on the go at the same time. The next stage had been when she started to make notes, after which she always read with a pencil in hand, not summarising what she read but simply transcribing passages that struck her.

“I think of literature,” she wrote, “as a vast country to the far borders of which I am journeying but cannot possibly reach. And I have started too late. I will never catch up.”

“Do you know that I said you were my amanuensis? Well, I’ve discovered what I am. I am an opsimath.”      With the dictionary always to hand, Norman read out: “Opsimath: one who learns only late in life.”

“One recipe for happiness is to have no sense of entitlement.” To this she added a star and noted at the bottom of the page: “This is not a lesson I have ever been in a position to learn.”

పుస్తకాలు చదివే ప్రతివాళ్ళలోనూ ఏదో మూలన ఉండే దువిధ,
Had she been asked if reading had enriched her life she would have had to say yes, undoubtedly, though adding with equal certainty that it had at the same time drained her life of all purpose. Once she had been a self-assured single-minded woman knowing where her duty lay and intent on doing it for as long as she was able. Now all too often she was in two minds. Reading was not doing, that had always been the trouble. And old though she was she was still a doer.

“You don’t put your life into your books. You find it there.”

“No, Home Secretary. But then books, as I’m sure you know, seldom prompt a course of action. Books generally just confirm you in what you have, perhaps unwittingly, decided to do already. You go to a book to have your convictions corroborated. A book, as it were, closes the book.”