Monday, October 15, 2018

The Posthumous Memoirs of Brás Cubas - Machado de Assis

ప్రతి దేశంలోనూ దేవుడిలా పూజింపబడి అంతర్జాతీయ స్థాయిలో మాత్రం పెద్దగా గుర్తింపుకు నోచుకోని రచయితలు కొందరుంటారు..కర్ణుడి చావుకి వంద కారణాలు లాగా వీరు ప్రపంచానికి పెద్దగా పరిచయం లేకపోవడానికి కూడా అనేక కారణాలు ఉంటాయి..రాసే కలానికి పదునుండాలే గానీ,కాస్త ఆలస్యమైనా అటువంటివారి రచనలు వెలుగుచూడకుండా ఆపడం ఎవరి తరమూ కాదు..నల్లజాతీయుడైన బెల్జియం రచయిత మచాడో డి అస్సిస్ అటువంటి ఒక రచయిత..బెల్జియం దేశపు సాహిత్యం గురించి నేను చాలా తక్కువ విన్నాను..అందునా 19వ శతాబ్దపు రచయితల్లో ప్రముఖులైన మచాడో డీ అస్సిస్ పేరు ఇదే తొలిసారి వినడం..ఆంగ్ల సాహితీ ప్రపంచంపు ప్రవాహంలో మరుగున పడిన కొందరు గొప్ప రచయితలను వెలికి తీసే క్రమంలో 'లైబ్రరీ ఆఫ్ లాటిన్ అమెరికా' వారు ఈ 'The Posthumous Memoirs of Bras Cubas' ను పోర్చుగీసు నుండి ఆంగ్లానికి అనువదించారు..1881 లో ఈ రచన తొలిముద్రణ జరిగింది,కాగా మళ్ళీ సుమారు దశాబ్దం తరువాత అంటే 1997 లో Gregory Rabassa దీన్ని తొలిసారి ఆంగ్లంలోకి అనువదించారు..ఈ నవలకు 'Epitaph of a small winner' అని మరో పేరు కూడా ఉంది...సుసాన్ సొంటాగ్  ముందుమాట రాసిన 'Epitaph of a small winner' కూడా ఒరిజినల్ కాపీతో పాటు అమెజాన్ లో లభ్యమవుతోంది.
Image Courtesy Google
ఇక కథ విషయానికొస్తే ప్రొటొగోనిస్ట్ 'బ్రాస్ క్యూబాస్' Rio de Janeiro నగరంలో ధనవంతుల బిడ్డగా,తండ్రి మితిమీరిన గారాబంలో పెరుగుతాడు..యుక్తవయసు వచ్చేనాటికి ఆకర్షణకూ,ప్రేమకూ తేడా తెలీని యవ్వనపు పొంగులో ఒక వేశ్య మార్సేలా ఆకర్షణకు లోనవుతాడు..ఆమె తత్వం తెలిసినప్పటికీ ఆమెను పొందాలనే కాంక్షతో సంపదనంతా ఆమెకు ధారపోస్తుంటాడు..ఈ వ్యవహారం తెలిసి క్యూబాస్ తండ్రి బలవంతంగా అతన్ని ఓడలో యూరోప్ కు చదువు నిమిత్తం పంపేస్తాడు..అక్కడ న్యాయశాస్త్రం అభ్యసించిన తరువాత  క్యూబాస్ తల్లి మరణవార్తను విని స్వదేశం తిరిగి వస్తాడు..తల్లి మరణంతో అతనిలో నైరాశ్యం,ఒంటరితనం చోటు చేసుకోగా Rio De Janeiro కు సమీపంలో ఒక కొండమీద ఒంటరిగా కాలం వెళ్ళదీస్తున్న సమయంలో తండ్రి వచ్చి బ్రాస్ క్యూబాస్ రాజకీయలబ్ది కోసం వర్జీలియాను వివాహమాడమని ప్రతిపాదిస్తాడు..కానీ వర్జీలియా బ్రాస్ క్యూబాస్ కంటే రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్న లోబో నెవెస్ ను వివాహమాడుతుంది..ఇంతవరకూ బాగానే ఉన్నా విచిత్రంగా ఆ వివాహానంతరం వర్జీలియా,బ్రాస్ క్యూబాస్ పీకల్లోతు ప్రేమలో పడతారు..ఇదిలా ఉండగా ఆమె భర్త వేరొకచోటికి వెళ్ళాల్సి రావడంతో ఇద్దరూ దూరమవుతారు..క్యూబాస్ కు యాభయ్యేళ్ళు వచ్చేసరికి రాజకీయాల్లో స్థానం సంపాదించుకుంటాడు,అయినప్పటికీ అతనిలో నైరాశ్యం మాత్రం పోదు..ఆ వైరాగ్యంలో మిత్రుడూ,ఫిలాసఫర్ అయిన క్విన్కస్ బోర్బా తత్త్వం 'హ్యూమానిటా' అనే సిద్ధాంతాన్ని వ్యాప్తి చెయ్యాలని తలపోస్తాడు..క్యూబాస్ జీవితం ఆ తరువాత ఎటువంటి మలుపులు తీసుకుందనేది తరువాత కథ.

He explained to me that on the one side Humanitism was related to Brahmanism, to wit, in the distribution of men throughout the different parts of the body of Humanitas, but what had only a narrow theological and political meaning in the Indian religion, in Humanitism was the great law of personal worth. 

సంప్రదాయవాదాన్ని ప్రశ్నించిన సందర్భాలు ఇందులో అనేకం..
Humanitism must also be a religion, the one of the future, the only true one. Christianity is good for women and beggars, and the other religions aren’t worth much more. They’re all equal with the same vulgarity or weakness. The Christian paradise is a worthy emulation of the Muslim one. And as for Buddha’s Nirvana, it’s nothing more than a concept for paralytics. You’ll see what the humanistic religion is. The final absorption, the contractive phase, is the reconstitution of substance, not is annihilation, etc. Go where you are called, but don’t forget that you’re my caliph.”

ఈ పుస్తకం చదవడానికి నావరకూ దీని టైటిల్ ఒక కారణం..ఎవరికైనా మరణానికి ముందు జ్ఞాపకాలు రాస్తారు గానీ ఇందులో బ్రాస్ క్యూబాస్ మాత్రం మరణానంతరం తన జ్ఞాపకాలకు అక్షరరూపమిస్తాడు..మరణించిన వ్యక్తికి సోకాల్డ్ 'పబ్లిక్ ఒపీనియన్' తో పనుండదు కాబట్టి తన జీవితంలోని ప్రతి చిన్న అంశాన్నీ ఈ పుస్తకంలో నిర్దయగా పునః పరిశీలించుకుంటాడు క్యూబాస్..
I’m not saying that the university hadn’t taught me some philosophical truths. But I’d only memorized the formulas, the vocabulary, the skeleton. I treated them as I had Latin: I put three lines from Virgil in my pocket, two from Horace, and a dozen moral and political locutions for the needs of conversation. I treated them the way I treated history and jurisprudence. I picked up the phraseology of all things, the shell, the decoration … Perhaps I’m startling the reader with the frankness with which I’m exposing and emphasizing my mediocrity. Be aware that frankness is the prime virtue of a dead man.
ప్రతి చిన్న అంశాన్నీ చురుకైన దృష్టితో చూసే క్యూబాస్ జీవితంపట్ల నిర్లిప్త వైఖరితో ఉంటాడు..మార్సెలతో తొలిప్రేమ,అంగవైకల్యం కారణంగా యూజీనియాను తిరస్కరించడం,వర్జీలియాతో వివాహేతర సంబంధం,అక్క సబీనా కుటుంబంతో స్పర్ధలు లాంటివి క్యూబాస్ జీవితంలో మానవసంబంధాల సంక్లిష్టతను ప్రతిబింబిస్తాయి..ప్రేమించిన వర్జీలియాకు వీడ్కోలు పలికేటప్పుడు తన మనసులో ఒక రకమైన ప్రశాంతతతో కూడిన సంతోషం కలిగింది అనడం లాంటివి కొంత అబ్సర్డ్ గా అనిపిస్తాయి..క్యూబాస్ నిర్లక్ష్య ధోరణి జే.డీ.సాలింజర్  Holden Caulfield ను గుర్తుకుతెస్తుంది..అలాగే తన జీవితంలో ప్రేమల పట్లా,మానవ సంబంధాల పట్ల అతని డిటాచ్మెంట్ తో కూడిన వైఖరి కాము నాయకుల్ని తలపిస్తుంది..చివరకి తాను ఒక బిడ్డకి జన్మనిచ్చి తండ్రి కాలేదు గనుక ఆ జీవికి ఈ దుఖ్ఖమయమైన జీవితంనుంచి ముందే విముక్తి కలిగించాను అని ఆనందపడతాడు క్యూబాస్..గుఱ్ఱం మీద నుండి పడిపోయినప్పుడు తన ప్రాణాలను రక్షించిన ఒక పేదవాడికి ఒక కాయిన్ ఇచ్చే సందర్భం,ఆ తరువాత దొరికిన పెద్ద మొత్తాన్ని (five contos) తనవద్ద ఉంచుకుని,మరో సందర్భంలో దొరికిన ఒకే ఒక్క కాయిన్ ను పోలీసులకు అందజెయ్యడం లాంటివి మొరాలిటీకి పరిథుల్ని ప్రశ్నిస్తూ,సరదాగా కనిపిస్తూనే వ్యంగ్యంతో కూడిన హాస్యాన్ని పండిస్తాయి.

మచాడో డి అస్సిస్ ప్రత్యేకత ఏంటంటే,బానిసత్వ సంస్కృతి వ్రేళ్ళూనుకుని ఉన్న కాలంలో, అందునా ప్రతి ఇంటికీ ఇద్దరు ముగ్గురు బానిసలు సర్వసాధారమైన బ్రెజిల్ వ్యవస్థలో ఒక బానిస కుటుంబంలో పుట్టి,ఎదురైన అవరోధాలను దాటుకుంటూ బ్రెజిల్ సాహిత్యంలో కీర్తిపతాకాన్నెగురవేసి తన పేరును సుస్థిరం చేసుకోవడం..ఇది సామాన్యమైన విషయం కాదు..ప్రముఖంగా 19వ శతాబ్దపు సాహిత్యం ఆనాటి రాజకీయ స్థితిగతులకు అద్దం పట్టేదిగా ఉండేది..ఈ సంప్రదాయానికి బెల్జియం సాహిత్యం కూడా మినహాయింపు కాదుట..ఈ సాహితీ ప్రక్రియను త్రోసిరాజంటూ సాధారణ సాహిత్యానికి అలవాటుపడిన పాఠకులకు మచాడో డి అస్సిస్ సరికొత్త శైలిని పరిచయం చేశారు..చదివించే శైలి నచ్చినా ఆయన తరహా ఫిలాసఫీ నాకు కొన్ని చోట్ల చాలా పేలవంగా అనిపించింది..కానీ కాలగతిని లెక్కవేసుకుంటే అది చాలా సూక్ష్మమైన లోపమే..పోర్చుగీసు మార్కు 'melancholy' ఈ రచనలో కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది..నేరేషన్ లో సునిశిత హాస్యం వెనుక అంతర్లీనంగా నైరాశ్యం నీడలు పరుచుకుని ఉంటాయి..రాబర్ట్ వాల్సర్ కూ మచాడో కూ చాలా పొంతనాలున్నాయి..మచాడో కూడా వాల్సర్ లా ఇందులో రోజువారీ జీవనానికే పెద్ద పీట వేస్తారు..అలాగే ఈ నవలని వాల్సర్ లాగే చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ రూపంలో రాశారు..ఎటొచ్చీ వీరిలో ఒకరు ఆశావాదైతే,మరొకరు నిరాశావాది..వాల్సర్ రచనలు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆస్వాదించమంటూ,జీవితాన్ని యధాతథంగా అంగీకరించాలనే సిద్ధాంతంతో ఆశావహ దృక్పథంతో కూడిన సౌకర్యవంతమైన జీవనాన్ని ప్రతిబింబిస్తే,మచాడో రచనలో జీవితాన్ని గాలిలో పెట్టిన దీపంలా వదిలెయ్యమనే పెస్సిమిజం కనిపిస్తుంది..కానీ ఈ నైరాశ్యానికి విరుద్ధంగా 'పబ్లిక్ ఒపీనియన్' ని అడుగడుగునా ఎద్దేవా చేసే విప్లవాత్మక ధోరణి కూడా బ్రాస్ క్యూబాస్ పాత్రలో కనిపిస్తుంది..సంప్రదాయాలను మొరాలిటీ త్రాసులో అస్తమానం తూచుకుంటూ రాజకీయ,సామాజిక వైఫల్యాల నడుమ జీవితాంతం అవివాహితుడుగానే మిగిలిపోయిన బ్రాస్ క్యూబాస్ కథ జీవితంలో విఫలమయిన వ్యక్తి కథలా చూపించే ప్రయత్నం చేశారు రచయిత.

సున్నితమైన హాస్యం ఈ నవలలో మరో ప్రత్యేకత..Enylton De Sa Rego  ముందుమాటలో 'Warning :Deadly humour at work' అని హెచ్చరిస్తారు..మరీ అంత కాకపోయినా ఇందులో సరదా సందర్భాలు చాలా చోట్ల పెదాల మీద చిరునవ్వులు పూస్తాయి..ఒక వాక్యాన్ని అతి మాములుగా చదివి ముందుకు వెళ్ళిపోయాకా,ఇక్కడ చమత్కారం మిస్ అయినట్లున్నామని మళ్ళీ వెనక్కి వెళ్తే ఆ వాక్యంలో అమాంతం హాస్యపు జల్లులు కురుస్తాయి..ఈ రచనలో మరో ప్రత్యేకత ఏంటంటే అడుగడుగునా రచయిత పాఠకునితో సంభాషిస్తూ ఉంటారు..'మై డియర్ రీడర్' అని సంబోధిస్తూ తన కథలో పాఠకుణ్ణి భాగస్వామిని చేసి బ్రాస్ క్యూబాస్ జీవితానికి పాఠకుణ్ణి న్యాయనిర్ణేతగా చేస్తారు..పాఠకుల భావాల్ని చదివేసినట్లు "నా రచన మందకొడిగా సాగుతోంది కదూ,మీకు విసుగు తెప్పిస్తున్నాను కదూ!" అంటూ చివరి వరకూ పాఠకులతో సంభాషిస్తారు..
'The Defect of this Book' అనే చాప్టర్లో  'I’m beginning to regret this book. Not that it bores me, I have nothing to do and, really, putting together a few meager chapters for that other world is always a task that distracts me from eternity a little. But the book is tedious, it has the smell of the grave about it; it has a certain cadaveric contraction about it, a serious fault, insignificant to boot because the main defect of this book is you, reader. You’re in a hurry to grow old and the book moves slowly. You love direct and continuous narration, a regular and fluid style, and this book and my style are like drunkards, they stagger left and right, they walk and stop,mumble, yell, cackle, shake their fists at the sky, stumble, and fall … And they do fall! Miserable leaves of my cypress of death, you shall fall like any others, beautiful and brilliant as you are. And, if I had eyes, I would shed a nostalgic tear for you. This is the great advantage of death, which if it leaves no mouth with which to laugh, neither does it leave eyes with which to weep … You shall fall. అంటారు.
My dear critic, A few pages back when I said I was fifty, I added: “You’re already getting the feeling that my style isn’t as nimble as it was during the early days.”
హిస్టారికల్ ఫాక్ట్స్ ప్రక్కన పెడితే చాలా కాలం క్రిందట చదివిన  Viet Thanh Nguyen రచన 'The Sympathizer' వియాత్నాంను ఆ దేశపు సగటు పౌరుడి కోణం నుంచి చూసే అవకాశం కల్పిస్తుంది..ఆ తరహా రచనల్లోలా మచాడో వర్ణనల్లో 19వ శతాబ్దపు బెల్జియంను దర్శించాలని తపించే పాఠకులకు ఈ రచన నిరాశనే మిగులుస్తుంది..ఇందులో పలు సాంఘికాంశాలు,స్థలకాలాదుల ప్రస్తావనలూ ఉన్నప్పటికీ వాటిని బట్టి ఆనాటి బ్రెజిల్ రాజకీయ సామజిక స్థితిగతులను అర్ధం చేసుకునే అవకాశం లేదు..ఎటొచ్చీ బానిసత్వం తీవ్రంగా ఉన్న  కాలంలో చేసిన రచన కావడంతో ఇందులో బానిస సంస్కృతి అన్నిచోట్లా కనిపిస్తుంది.కథలో భాగంగా బ్రాస్ క్యూబాస్ రాజకీయాల్లో ఉండడం లాంటి అంశాలు చాలానే ఉన్నప్పటికీ
ఈ రచన బ్రెజిల్ ను రాజకీయ,చారిత్రాత్మక అంశాల కోణం నుంచి చూపించదు..ఒక సగటు బ్రెజిలియన్ వ్యక్తి అంతరంగానికి దర్పణం పడుతూ అతని దైనందిన జీవితాన్ని చూపించే ప్రయత్నం మాత్రం చేస్తుంది.

బ్రాస్ క్యూబాస్ తన మెమోయిర్ ను మొదలుపెట్టే ముందు పాఠకులనుద్దేశించి ఈ విధంగా అంటారు..
I wrote it with a playful pen and melancholy ink and it isn’t hard to foresee what can come out of that marriage. I might add that serious people will find some semblance of a normal novel, while frivolous people won’t find their usual one here. There it stands, deprived of the esteem of the serious and the love of the frivolous, the two main pillars of opinion.
I’ll take my position between the poet and the savant.
“You miserable little minute!” she exclaimed. “What do you want a few more instants of life for? To devour and be devoured afterward? Haven’t you had enough spectacle and struggle? You’ve had more than enough of what I presented you with that’s the least base or the least painful: the dawn of day, the melancholy of afternoon, the stillness of night, the aspects of the land, sleep, which when all’s said and done is the greatest benefit my hands can give. What more do you want, you sublime idiot?"
సరదా సందర్భాలు
It took me thirty days to get from the Rossio Grande to Marcela’s heart, no longer riding the courser of blind desire but the ass of patience, crafty and stubborn at the same time, for there are really two ways of enticing a woman’s will: the violent way like Europa’s bull and the insinuative way like Leda’s swan or Danaë’s shower of gold—three inventions of Father Zeus, which, being out of fashion, have been replaced by the horse and the ass.
Marcela నవ్వును వర్ణిస్తూ,
I think it was a mixed laugh, as if it were coming from a creature born to a witch of Shakespeare’s by a seraph of Klopstock’s.
“It may not have style,” he pondered after an instant, “but no one can deny me feeling, unless that very feeling is harmful to the perfection …”
I shan’t say that she was already first in beauty, ahead of the other girls of the time, because this isn’t a novel, where the author gilds reality and closes his eyes to freckles and pimples.
I lived half like a recluse, attending, after long intervals, some ball or theater or a lecture, but I spent most of the time by myself. I was living, letting myself float on the ebb and tide of events and days, sometimes lively, sometimes apathetic, somewhere between ambitious and disheartened. I was writing politics and making literature. I sent articles and poems to newspapers and I managed to attain a certain reputation as a polemicist and poet.
I like happy chapters, they’re my weakness.
That’s what she said while I, sitting with my hands on my knees, looked at the floor, where a fly was dragging an ant that was biting its leg. Poor fly! Poor ant.
I think (and again I beg the critics’ good will), I think he was probably prepared to break with his wife, as the reader has probably broken with many personal relationships, but public opinion, that opinion which would drag his life along all the streets, would open a minute investigation into the matter, would put together, one by one, all circumstances, antecedents, inductions, proofs, would talk about them in idle backyard conversations, that terrible public opinion, so curious about bedrooms, stood in the way of a family breakup.
The main reason was a reflection made to me by Quincas Borba, who visited me that day. He told me that frugality wasn’t necessary in order to understand Humanitism, much less to practice it. That philosophy enjoyed easy accommodation with the pleasures of life, including table, theatre, and love, and that, quite the contrary, frugality could be an indication of a certain tendency toward asceticism, which was the perfect expression of human idiocy.
We kill time; time buries us.
A philosophical coachman used to say that the pleasure of a coach would be less if we all traveled in coaches.
“There is no puppy so well trained that we do not hear its bark in the end".
Fifty is the age of science and government.
A cool breeze was blowing, the sky was blue. In each window—there were three—hung a cage with birds, who were trilling their rustic operas. Everything had the appearance of a conspiracy of things against man: and even though I was in my room, looking at my yard, sitting in my chair, listening to my birds, next to my books, lighted by my sun, it wasn’t enough to cure me of the longing for that other chair that wasn’t mine.

No comments:

Post a Comment