Saturday, April 15, 2017

What we talk about when we talk about love - Raymond Carver

Image courtesy Google
అసలు ముగింపు లేని కథలు ఉంటాయా !! యెస్..ఉంటాయి..ఆ మాటకొస్తే ముగింపే కాదు,మొదలూ-తుదా లేని కథలు కూడా ఉంటాయి అని Raymond Carver కథలు చదివాకే తెలిసింది..మొత్తం పదిహేడు కథలతో కూడిన కార్వర్ రచన 'What we talk about when we talk about love' అమెరికన్ మధ్యతరగతి మనుషుల మనస్తత్వాలకు అద్దం పడుతుంది..అమెరికన్ డ్రీమ్స్,మానవ సంబంధాలు ఆల్కహాల్ మత్తులో ఎలా చిన్నాభిన్నమయ్యాయో చూపిస్తుంది..Raymond Carver వచన ప్రయోగం చాలా సరళం..అన్ని కథల్లోనూ ఆయన ఉపయోగించిన వాడుక భాష,ఒక చక్కని కథ రాయడానికి పెద్ద పెద్ద పదాలు అవసరం లేదని నిరూపిస్తుంది...అప్పటికే కొంతమంది రచయితలు 'The language really used by men' ను సాహిత్యంలో ఉపయోగించే ప్రయోగానికి శ్రీకారం చుట్టినప్పటికీ ఆ విషయంలో పూర్తిగా సఫలీకృతులయింది మాత్రం Raymond Carver అని అంటారు..కార్వర్ లో మరో ప్రత్యేకత ఏంటంటే ఆయన పదాలను బహు పొదుపుగా ఉపయోగిస్తారు..అందుకే అప్పట్లో ప్రముఖులైన అమెరికన్ సమకాలీన సాహిత్యకారుల్లో ఈయన ఒకరిగా నిలిచారు..

మొదటి కథ Why don't you dance ? చదివాక,ఇదేంటి ఇలా అసంపూర్తిగా వదిలేశారు అనిపించింది! అసలు ఈ కథలో ముగింపు ఏమై ఉంటుంది అని నిర్ధారణ చేసుకునేదాకా ఆలోచిస్తూనే ఉన్నాను..రెండో కథ Viewfinder,ఆ తరువాత Mr.Coffee అండ్ Mr.Fixit ఇలా ఒక్కో కథా చదువుకుంటూ వెళ్తుంటే,అప్పుడు రచయిత ఏం చెప్పాలనుకున్నారో మెల్లిగా అర్ధంకాసాగింది..ముందుగా lighter vein సంభాషణల్లో మొదలయ్యే ఆయన కథలు క్రమేపీ ఒక రూపుదాల్చుకుంటాయి..అలాగే కార్వర్ కథెక్కడ మొదలుపెడతారో తెలీదు..ఒక డైనింగ్ టేబుల్ దగ్గర కాఫీ సిప్ చేస్తున్నప్పుడో,లేదా ఒక గారేజీ లోనో,నలుగురు మిత్రులు కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నప్పుడో,అర్ధరాత్రి రాత్రి మంచి నిద్ర మధ్యలోనో,ఇలా చిత్రమైన సందర్భాల్లో కార్వర్ కథలు మొదలవుతాయి..అసలు ఈయన ఒక సన్నివేశాన్ని ముందుగా అనుకుని కథ రాయరేమో అనిపిస్తుంది,కార్వర్ పదాల అల్లిక మొదలుపెట్టాకే సన్నివేశం రూపకల్పన జరుగుతుంది..

కార్వర్ కథలన్నీ ముఖ్యంగా మానవ సంబంధాల చుట్టూ తిరుగుతాయి..సంక్లిష్టమైన మానవసంబంధాల్లో ఉండే 'conflict',ఐడెంటిటీ ఇష్యూస్ లాంటివి ప్రతి కథలోనూ కనిపిస్తాయి..టైటిల్ కి తగ్గట్లు ఈ సంకలనంలో కథా వస్తువు  'ప్రేమ'..ఇందులో ప్రేమ అంటే మళ్ళీ ఇప్పటి సినిమాల్లోలా హీరో-హీరోయిన్ల మధ్య ఉండే ప్రేమ ఒక్కటే కాదు..భార్య భర్తల మధ్య,తల్లితండ్రులు-పిల్లల మధ్య,ఇద్దరు స్నేహితుల మధ్య,ఇలా ప్రేమ లోని అన్ని పార్శ్వాలను స్పృశిస్తూ ముందుకి వెళ్తాయి..ఈ కథల్లో ప్రత్యేకత ఏంటంటే,ఒక్క కథకి కూడా conclusion లేదా ముగింపు లాంటిది ఏమీ ఉండదు..ఫలానా వ్యక్తి ఇలా చేశాడు,ఫలానా ఆమె ఈ విధంగా ప్రవర్తించింది అంటూ వారిని గురించి చిన్న చిన్న సంగతులు చెప్తారు..అవి కూడా రోజువారీ జరిగే మామూలు సంఘటనల్లాగే ఉంటాయి..అతను మంచి వ్యక్తి,ఇతను చెడ్డ వ్యక్తి అంటూ జడ్జిమెంట్స్ తో కూడిన పాత్రల రూపకల్పన మనకెంత వెతికినా కనపడదు..వారి పేరు,ఉద్యోగం,రోజువారీ వ్యవహరించే పద్ధతులను గురించి చిన్న చిన్న క్లూస్ ఇచ్చి వదిలేస్తారు..ఆ పైన మనమెలా చదివితే అదే కథ...ఈ కథలు అన్నీ చదివేవాళ్ళ పర్స్పెక్టివ్ ని బట్టి రూపాంతరం చెందుతూ ఉంటాయి..No Two Persons Ever Read the Same Book అనే విషయం కార్వర్ కథలకి అన్వయిస్తే చాలా బాగా సరిపోతుంది..అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు కాకుండా,చెప్పీ చెప్పకుండా ఉండే ఈ శైలిలో కథలు రాయడం వల్ల చదివిన చాలాసేపటి తరువాత కూడా మన ఆలోచనల్లో ఆ పాత్రలన్నీ నిలిచిపోతాయి. 

Tuesday, April 11, 2017

The Blind Owl - Sadegh Hedayat

Image courtesy Google

రచయితల్లో కొందరు నిర్లిప్తంగా ఉంటూ కథకు దూరంగా పూర్తిగా ప్రేక్షక స్థానంలో ఉండి తమ రచనలు చేస్తే,మరి కొందరు కథతో మమేకమై,అంతా తానై,అన్నీ తానై కథను ముందుకు నడిపిస్తారు. ఇరాన్ కు చెందిన Sadeq Hedayat ఆ రెండో కోవకి చెందిన రచయిత..అందువల్ల 'The Blind Owl' గురించి చెప్పుకోవాలంటే Sadeq Hedayat గురించే చెప్పుకోవాలి..ఇందులో కథ,కథనం,ప్రేక్షకుడు,వీక్షకుడూ,రచయితా,పాఠకుడూ,విమర్శకుడు అన్నీ ఆయనే..ఆయనకి చదివేవాళ్ళతో సంబంధంలేదు. చదివి ఏమనుకుంటారో అని భయం అంతకంటే లేదు. ఉన్నదున్నట్లుగా ఏమాత్రం ఫిల్టర్స్ లేకుండా తన ఆలోచనల్నీ,  పిచ్చితనాన్నీ,కోపాన్నీ,బాధనూ,ప్రేమనూ,ద్వేషాన్నీ, మనసులో ఎన్ని భావోద్వేగాలకు స్థానం ఉందో అన్నిటినీ ఈ రచన ద్వారా మన ముందు కుమ్మరిస్తారు.
"I am writing only for my shadow, which is now stretched across the wall in the light of the lamp..I must make myself known to him."
అంటూ మొదటి పేజీ లోనే చెప్పడంలో,"ఇది నా కోసం,నా నీడ కోసం రాసుకుంటున్నాను,నేను నీకేమీ చెప్పట్లేదు,నీకు వినే అర్హత ఉందో లేదో కూడా నాకు తెలీదు,విని నువ్వేమనుకుంటావో నాకు అవసరం లేదు" అన్నట్లు ఉంటుంది చదివేవాళ్ళకి. ఈ విధంగా రచయితలో మొక్కవోని  తిరుగుబాటు ధోరణి మనకు రచన ఆదిలోనే పరిచయమవుతుంది.

'The Blind Owl' ను ఇరాన్ సాహితీరంగంలో ఎన్నదగ్గ రచనలు చేసిన సాదిఖ్ హెదాయత్ మాగ్నమ్ ఒపస్ గా పరిగణిస్తారు. మనిషి తన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఇమడలేకపోవడం,తనను సమాజంలో ఒక భాగంగా ఐడెంటిఫై చేసుకోలేకపోవడం వంటి మానసికప్రవృత్తులు అస్థిత్వవాదం,అబ్సర్డిటీలకు దారితీశాయి. ఇంత పెద్ద ప్రపంచంలో అంత మంది సుఖంగా బ్రతుకుతున్నారు కదా ! మరి నాకే ఈ బాధ ఎందుకు ! నేనెందుకు భిన్నంగా ఉన్నాను ! అని నిరంతరం ఆత్మపరిశీలన చేసుకుంటూ జీవిత పరమార్ధం తెలుసుకోవాలనే జిజ్ఞాసలోంచే ఈ 'బ్లైండ్ ఔల్' పుట్టింది. ఈ రచన ఇరాన్ రాజకీయ,సాంఘిక పరిస్థితులనూ/మతపరమైన నమ్మకాలనూ కించపరిచేదిగా ఉండటం వలన దీన్ని 18వ Tehran International Book Fair నుంచి బ్యాన్ చేశారంటారు. ఇరాన్ లో ఇది ప్రచురణకు నోచుకోకపోవడంతో ఇండియా లోనే దీనికి తొలి ముద్రణ జరిగింది.

ఈ కథలో మనకు పేరు తెలియని కథానాయకుడు పెన్ కేసెస్ తయారు చేసే ఆర్టిస్ట్. ఈ ఆర్టిస్ట్ ఒక వైపైతే మిగతా ప్రపంచం అంతా మరొక వైపు ఉంటుంది. ప్రొటొగోనిస్ట్ తన కంటే భిన్నంగా ఉన్న   మనుషుల్ని 'rabble-men' అనీ, తనని మాత్రమే దూరం పెడుతూ చాలామందితో వివాహేతర సంబంధాలు కలిగిన భార్యను 'bitch' అనీ పుస్తకం అంతా సంబోధిస్తాడు. ఒక ప్రక్కన తన ఉనికి మిగతా ప్రపంచం కంటే భిన్నమని నమ్ముతూనే, వారితో తనని పోల్చుకుంటూ వాళ్ళతో తనకున్న పొంతనల్ని సహించలేకపోతున్నానంటాడు. తాను చిన్నప్పటి నుంచీ ప్రేమించిన భార్య ప్రేమను పొందలేని నైరాశ్యం ఒక అబ్సెషన్ గా మారడంతో రచయిత ఆలోచనలు ప్రేమ నుంచి కోపంగా,ద్వేషంగా,ఆ పై విరక్తిగా మారడం వంటి పర్యవసానాలతో కథ ముందుకి వెళ్తుంది. ఇందులో కొన్ని వాక్యాలు రిపీటెడ్ గా మళ్ళీ మళ్ళీ చెప్తారు. కథంతా ఫస్ట్ పర్సన్ లోనే చెప్పినా భూత,వర్తమాన కాలాల మధ్య నడుస్తుంది. సమాజాన్ని లెక్కచెయ్యని రచయిత ధోరణి కొన్ని చోట్ల తెలుగు రచయిత చలం గారిని గుర్తుకు తెస్తుంది. మరికొన్ని చోట్ల గుడ్డిగా సమాజం మీద అక్కసు వెళ్ళబోసుకునే సినిసిజంతో కూడిన ధోరణిగా కూడా అనిపిస్తుంది. ఇందులో ఇరాన్,భారతీయ సంస్కృతులను విస్తృతంగా చర్చించారు,దానితో పాటుగా అక్కడక్కడ ఒమర్ ఖయ్యాం కవితల ప్రస్తావన కూడా ఉంటుంది.
It seemed as though mystery was everywhere and my lungs hardly dared to inhale the air.
 He was like someone whom I had known once, but he was no part of me.
I thought to myself, 'If it is true that everyone has his own star in the sky mine must be remote, dark and meaningless.Perhaps I have never had a star at all.'
ఈ పుస్తకంలో రచయిత ఆలోచనలు ఎప్పుడూ జీవన్మృత్యులవుల మధ్యలో ప్రయాణిస్తూ ఉంటాయి. యూరోప్ లో ఉన్న కాలంలో ప్రపంచ సాహిత్యంతో ఆయనకి పరిచయం కలగడంతో Kafka,Poe,Dostoevski లాంటి వారి ప్రభావం ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మిగతా అస్తిత్వవాద రచనలకు భిన్నంగా ఇందులో రచయిత మృత్యువుకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం కనబడుతుంది. అంటే ఇందులో మృత్యువే హీరో అన్నమాట. ఈ ప్రపంచంలో నిజమైనదీ, నిజాయితీ కలిగినదీ మృత్యువు మాత్రమేనని ఆయన అభిప్రాయం. తన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం,మనుషులూ,విధానాలు అన్నీ ఒక పచ్చి అబద్ధమనీ,మోసభూయిష్టమనే రచయిత ఆలోచనలు చేదు మాత్రల్లా ఒకపట్టాన మింగుడుపడవు. చదువుతున్నంతసేపు మన గుండె శబ్దం మనకే వినిపిస్తోందా అన్నట్లు అనిపించే నిశ్శబ్దపు రాత్రులనూ,పగళ్ళనూ అద్భుతంగా తన పదాల్లో మనముందు చిత్రించినప్పటికీ  ఆ నిశ్శబ్దంలోంచి ఎల్లలులేని నైరాశ్యం,సమాజంపై అంతులేని ఆగ్రహం లాంటివి చెవులు చిల్లులుపడే ధ్వనితో మేమున్నామంటూ ఆయన ప్రతి పదంలోనూ తమ ఉనికి చాటుకుంటూనే. జీవితం యొక్క Monotony ని చూసి చూసి విసిగిపోయిన రచయిత musings లో చివరకి పునర్జన్మ కూడా తనకి అక్కర్లేదనీ తనకి మళ్ళీ ఈ ప్రపంచాన్ని చూసే దౌర్భగ్యం వద్దనీ అంటారు.

అస్థిత్వవాదం,అబ్సర్డిటీ లు పరిచయమైన తొలినాళ్ళలో Herman Hesse, Andre Gide, Albert Camus లాంటి యూరోపియన్ రచయితలను చదివినప్పుడు,ఆ పుస్తకాలను పూర్తి చేసిన వారం-పది రోజులకి గానీ ఆ ప్రభావం నుంచి బయటపడేదాన్ని కాదు. ఇప్పుడు ఈ Blind Owl చదివాకా అవే నయం అనిపిస్తున్నాయి. వారి పుస్తకాల్లో ఉన్న సరళత్వం ఇందులో లేదు. Sadeq Hedayat consciousness కి తీక్షణత చాలా ఎక్కువ. మనకి తెలీకుండానే మన మెదళ్ళని తన ఆధీనంలోకి తీసేసుకోగల తీవ్రత అది. సులువుగా ఆకళింపు చేసుకునే రచనల కోవకు ఈ Blind Owl చెందదు. పిచ్చితనాన్ని,ద్వేషాన్నీ,బాధనూ,విరక్తినీ కూడా consider చెయ్యగలిగే మనసున్న వాళ్ళు   తప్పకుండా చదవవలసిన పుస్తకం ఇది. నేనైతే ఆ తీవ్రత చాలా ఎక్కువగా అనిపించి,రెండు మూడు ఇంటెర్వల్స్ లో చదివిన పుస్తకం ఇది. చివరగా ఈ పుస్తకం గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే 'Depiction of suffering in it's best possible way' అంటాను.

ఇన్నేళ్ళలో నేను చదివిన పుస్తకాల్లో మంచి పుస్తకం ఏదంటే చెప్పడానికి తడబడతానేమో గానీ అత్యంత విషపూరితమైన రచన ఏంటని అడిగితే మాత్రం అస్సలు తడుముకోను. అది 2017 లో చదివిన సదేగ్ హెదాయత్ మాగ్నమ్ ఓపస్ 'ది బ్లైండ్ ఔల్' అని చెబుతాను.
సాహిత్యంలో ఉత్తమ సాహిత్యంగా పరిగణింపబడేదంతా మంచిదని అనలేం. చక్కని భాష, వ్యాకరణం,కట్టిపడేసే నేరేషన్, ఇవన్నీ ఉన్న ఈ రచన పాఠకులకు పంచేది విషం మాత్రమే. సాహితీ విలువలు ఉన్న రచనలన్నీ నైతికపరంగా గొప్పవి కాదని అనడానికి ఇదొక మంచి ఉదాహరణ. The real challenge in reading such books is to retain your sanity after reading them. 😉

పుస్తకం నుండి కొన్ని నచ్చిన వాక్యాలు,
My heart stood still. I held my breath. I was afraid that if I breathed she might disappear like cloud or smoke.
ఒక మాస్టర్ పీస్ ఎలా పుడుతుందో చెప్తూ,
At such times as this every man takes refuge in some firmly established habit, in his own particular passion. The drunkard stupefies himself with drink, the writer writes, the sculptor attacks the stone. Each relieves his mind of the burden by recourse to his own stimulant and it is at such times as this that the real artist is capable of producing a masterpiece..
The subject I had chosen, a dead woman, had a curious affinity to my dead manner of painting. I had never been anything else than a painter of dead bodies.
The only thing that makes me write is the need, the overmastering need, at this moment more urgent than ever it was in the past, to create a channel between my thoughts and my unsubstantial self, my shadow, that sinister shadow which at this moment is stretched across the wall in the light
of the oil-lamp in the attitude of one studying attentively and devouring each word I write.This shadow surely understands better than I do. It is only to him that I can talk properly. It is he who compels me to talk. Only he is capable of knowing me. He surely understands..It is my wish, when I have poured the juice- rather, the bitter wine of my life down the parched throat of my shadow, to say to him, 'This is my life'.
How many stories about love, copulation, marriage and death already exist, not one ofwhich tells the truth! How sick I am of well-constructed plots and brilliant writing!
Monotony of life గురించి చెప్తూ,ఫిక్షన్ అంటే జీవితమంటే విసిగివేసారిపోయిన మనుషుల మనోవ్యధ ఫలితం అంటారు..
For thousands of years people have been saying the same words, performingthe same sexual act, vexing themselves with the same childish worries. Is not life frombeginning to end a ludicrous story, an improbable, stupid yam? Am I not now writing my own personal piece of fiction? A story is only an outlet for frustrated aspirations, for aspirations which the story-teller conceives in accordance with a limited stock of spiritual resources inherited from previous generations.
For three years, Of, rather for two years and four months - although, what do days and months matter? To me they mean nothing; time has no meaning for one who is lying in the grave - this room has been the tomb of my existence, the tomb of my mind.

Wednesday, April 5, 2017

The Tales of Madness - Luigi Pirandello

వేసవి సెలవులు కావడంతో పెద్ద పెద్ద నవలలు చదివే తీరిక లేక షార్ట్ స్టోరీస్ గురించి చూస్తుంటే ఈ మహానుభావుడు కనపడ్డారు.. సరదాగా ఒకటి రెండు కథలు చదువుదాంలే అని మొదలుపెట్టిన నాకు పుస్తకం అంతా పూర్తి చేసేదాకా నిద్ర పట్టలేదు..'జీవితం నుండి పూర్తిగా విడివడి ఒక ప్రక్కగా నుంచుని నీ రోల్ ని నువ్వే తరచి చూసుకుంటే ఆ జీవితమనే స్టేజి పై  నువ్విక లేనట్లే' అనే  Pirandello ను కేవలం ఒక రచయితగా మాత్రమే చూడడానికి మనస్కరించడంలేదు..ఇటలీకి చెందిన నోబెల్ పురస్కార గ్రహీత Luigi Pirandello రచనల్లో మనకు ఒక ఫిలాసఫర్,సైకాలజిస్ట్,ఆర్టిస్ట్ కూడా కనిపిస్తారని  ఆయన కథలు చదివినవారెవరైనా నిస్సందేహంగా చెప్తారు..నాకు ఆల్బర్ట్ కామూ ను తలుచుకోగానే గుర్తొచ్చే మొదటి పదం 'రెబల్' అయితే,పిరాండెల్లో అనగానే ఇకపై 'madness' గుర్తొస్తుంది...అంతకుమునుపు కూడా చాలా మంది రచయితలూ,కవులూ,చిత్రకారులూ ఈ madness కి ఒక రూపాన్నివ్వడానికి ప్రయత్నించినప్పటికీ,ఈ పదానికి ఆయన న్యాయం చేసినంతగా మరెవరు చెయ్యలేదని Pirandello ని చదివిన వారెవరైనా ఘంటాపదంగా చెప్తారు..

'The Tales of Madness' లో మొత్తం పదహారు కథలున్నాయి..ఇందులో పిరాండెల్లో madness కు సంబంధించిన విపరీత ధోరణులను మొదలుకుని Dementia (చిత్త వైకల్యాలు) లాంటి రుగ్మతల వరకూ వివిధ మానసిక స్థితులను అన్ని సాధ్యమైన కోణాల్లోనూ చూపిస్తారు..నిజానికి ఈ కథల్లో అస్థిత్వవాదాన్ని (Existentialism ) చర్చించడానికి madness ను ఒక మెటాఫోర్ గా వాడారు..Pirandello దృష్టిలో పిచ్చితనం లేని మనిషి అస్థిత్వమే లేదు,ఈ నమ్మకాన్ని బలపరుస్తూ ఆయన కథలన్నీ నిజజీవితంతో పెనవేసుకునే ఉంటాయి..పిరాండెల్లో 'madness' ను అర్ధం చేసుకోడానికి సింపుల్ ఫార్ములాలు ఏమీ ఉండవు,అలాగే దాన్ని స్పష్టంగా వర్గీకరించడం వీలుపడదు..ఈ కథల్లో వేటికీ స్పష్టమైన 'లాజిక్' ఉండదు..అసంపూర్తిగా,అంతు చిక్కని కథల్లా ఉంటాయి,చదివేవాళ్ళని ఒక సందిగ్ధంలోకి నెట్టేస్తాయి..Madness ను శోధించే క్రమం లో పిరాండెల్లో తన ఆలోచనలను Pre-Freudian సైకాలజిస్ట్ లు అయిన Janet,Binet,Marchesini మొదలగువారి నుండి కొంత సంగ్రహించినప్పటికీ,ముఖ్యంగా ఆయన రచనలు ఆయన వ్యక్తిగత అనుభవాలనుండి ప్రభావితమయ్యాయి అంటారు..మానసిక వైకల్యం కలిగిన భార్య Antonietta తో పిరాండెల్లో వైవాహిక జీవితం Madness పై ఆయన ఆలోచనాసరళిని చాలా వరకూ ప్రభావితం చేసిందంటారు..

ప్రతి మనిషికీ మనకు తెలిసీ/తెలియకా కొంత పిచ్చితనం ఉండటం కూడా ఒక సహజమైన మానసిక స్థితి క్రిందకే వస్తుందని ఈ కథలన్నీ నిరూపిస్తాయి..ఎందుకంటే ఒక్కో కథా చదువుతుంటే,'అరే ! ఈ మానసిక స్థితి నాకు కూడా పరిచయమే' అని పాఠకులు అనుకుని తీరాల్సిందే..అన్ని కథలూ అద్దాల్లా మన ప్రతిబింబాల్ని అందులో చూసుకోమంటాయి..ఒక్కోసారి వాస్తవం నుంచి పారిపోవడం,మరికొన్ని సార్లు ఏదో జరుగుతుందని భయపడడం,నిజాన్ని జీర్ణించుకోలేక భ్రమలో బ్రతకడానికి అలవాటుపడటం,సమాజంలో ఇమడలేక దూరంగా పారిపోవడం/లేదా 'తను' కానీ తనను సమాజమనే చట్రంలో ఇమిడ్చేసుకోవడం,ఆ కారణంగా ఉత్పన్నమయ్యే భయాలు,బాధలూ,కోపతాపాలు,నిరాశ-నిస్పృహలు ఇలా అన్ని కోణాల్నీ స్పృశిస్తూ మనిషి మస్తిష్కమనే సముద్రపు లోతును కొలవడానికి ప్రయత్నిస్తాయి..

Pirandello పాత్రలు జీవితమంటే నిరర్ధకమైనదనీ,దానికి తోడు జీవితంలో ఎదురయ్యే సమస్యలకి పరిష్కారం ఉండదనే బలమైన నమ్మకం కలిగి ఉంటాయి..అందువల్ల ఈ కథలన్నీ pessimism కు ప్రతీకలుగా కనిపిస్తాయి..ఈ పాత్రలన్నిటిలో సాధాణంగా కనిపించే మరో విషయం,'విపరీతమైన విశ్లేషణా శక్తి'...ప్రతి సమస్యనూ తీవ్రంగా విశ్లేషిస్తూ,ఆ కారణంగా మామూలు మనుషుల్లా జీవించకుండా,ఆ Act of living లో తమ పాత్రను నిరంతరం తరచి చూసుకుంటూ ఉంటారు..

ఉదాహరణకి 'The Train Whistled' అనే కథలో Belluca  ఊహల్లో సుదూరమైన ప్రదేశాలకు ప్రయాణించడం ద్వారా తన బాధలన్నీ మర్చిపోతాడు.. అలాగే The Wheelbarrow కథలో మరో వ్యక్తి భారమైన బ్రతుకునుండి ప్రశాంతత పొందడం కోసం రహస్యంగా ఒక విచిత్రమైన చర్య చేస్తుంటాడు..Pitagora's Misfortune కూడా ఇదే కోవకు చెందిన కథ..ఈ రెండు కథల్లో వ్యక్తులు ఐడెంటిటీ ఇష్యూస్ తో బాధపడుతుంటారు..
My spirit had almost become estranged from my senses and had taken refuge in an indefinitely distant place where, inexplicably and with a sense of joy that didn't seem its own, it caught a glimpse of the seething of a different life. Not its own, but one that could have been its own. Not here, not now, but there in that infinitely distant place. It was the seething of a remote life which perhaps had been its own, it knew not how or when, and of which it had a vague recollection, not of acts, not of images but, as it were, of desires that vanished even before they were formed. And there was the feeling of not existing, which, though empty, was sad and painful.
Escape అనే మరో కథలో Bareggi తన బాధల నుండి విముక్తి పొందే క్రమంలో ఒక పాలవాడి గుర్రబ్బండిని తోలుకుంటూ సుదూర గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళిపోతాడు..Set fire to the Straw మరో చక్కని కథ లైఫ్ ప్రియరిటిస్ గురించి చర్చిస్తుంది..అలాగే Mrs.Frola and Mr.Ponza వాస్తవాన్ని అంగీకరించలేని అత్తా అల్లుళ్ళ కథ..అలాగే Puberty అనే కథ టీనేజ్ కి వచ్చిన అమ్మాయి మనస్తత్వానికీ,ఆ వయసులో ఉండే భయాలకీ దర్పణం పడుతుంది..
I also penetrated into the life of the plants, and little by little, from a pebble, from a blade of grass, I arose, absorbing and feeling within me the life of all things, until it seemed that I was almost becoming the world, that the trees were my limbs, the earth my body, the rivers my veins, and the air my soul. And for a while I went on like that, ecstatic and pervaded by this divine vision.
Fear of being happy కథలో Fabio జీవితానికి విపరీతమైన లాజిక్ అప్లై చేసి అదొక అబ్సెషన్ గా మారడంతో చెడు తనను చేరుకోడానికి వేచి చూస్తుందనే భ్రమలో పిచ్చివాడిగా మారడం కూడా madness లో మరో కోణాన్ని చూపిస్తుంది.. అలాగే When I was Crazy అనే కథలో protagonist సమాజం తనను పిచ్చివాడిగా ముద్ర వేసిన కారణంగా తాను కూడా (Sane)సాధారణ మనిషిగా మారాననీ స్వార్ధం నేర్చుకున్నానని అంటాడు..
But while I walked through my lands, tiptoed and stooped in order to avoid trampling some little flower or insect whose ephemeral life I lived within myself, those others were stripping my fields, stripping my houses, and going so far as to strip me.And now, here I am: ecce homo
ఈ కథ ప్రకారం ప్రకారం పిరాండెల్లో madness ను ఒక సోషల్ ఎలిమెంట్ గా కూడా చూస్తారు..ఇది మనిషి సమాజంలో ఇమడడానికి పడే సంఘర్షణని ప్రతిబింబిస్తుంది..Pirandello రచనల్లో మామూలు మనుషులకంటే (sane ) madness కే పెద్దపీట వేస్తారు..ఫిలాసఫర్ Henri Bergson సిద్ధాంతం ప్రకారం లైఫ్ అంటే formless అండ్ fluid కాబట్టి,జీవితాన్ని ఏ లాజిక్ లేకుండా బ్రతికే/లేక దానికి విచిత్రమైన లాజిక్ implement చేసే పిచ్చివాళ్ళు జీవితానికి మరింత దగ్గరగా ఉంటారు అని Pirandello వాదన..Existentialism,Philosophy ఇష్టపడేవాళ్లు ఖచ్చితంగా చదవలసిన పుస్తకం ఇది..ఫిలాసఫీ అన్నానని ఇందులో  విసుగొచ్చేలా ఊకదంపుడు ఉపన్యాసాలు ఏమీ ఉండవు,చిన్న చిన్న సంభాషణలతో,మనలాంటి మామూలు వ్యక్తులు మనతో తమ భయాలను,బాధల్ని స్వోత్కర్షలా చెప్పుకుంటున్నట్లు ఉంటుంది.

పుస్తకం నుండి కొన్ని నచ్చిన వాక్యాలు,
"Then everything that happens was destined to have happened? Wrong! It might not have happened if... and here, in this if I always lose myself."
The lessons one learns from the experiences of others, you say? They're useless. Each of us can think that experience is the fruit that grows according to the plant which produces it and the soil in which the plant has taken root. And if I consider myself to be, for instance, a rosebush whose nature it is to produce roses, why should I poison myself with the toxic fruit picked from the sad tree of someone else's life?
Whoever is not guilty, whoever has no reason to be sorry, is always a free man. Even if you chain me, I'll always be free internally. At this point, I don't care what happens to me externally.'
I didn't know that even the so-called mad possess that most complicated little thought-producing machine known as logic, which is in perfect running order, perhaps even more so than ours, in that, like ours, it never stops, not even in face of the most inadmissible deductions.
He who lives, doesn't see himself while he's living: he simply lives... If one can see his own life, that only means that one no longer lives it, but undergoes it, drags it along. Like a dead thing, one drags it along, because every form is a death.

Saturday, April 1, 2017

2BR02B - Kurt Vonnegut

Image Courtesy Google
రెండేళ్ల క్రిందట అనుకుంటా Lois Lowry డైస్టోపియన్ రచన 'The Giver' Quarter చదివినప్పుడు ఈ కాల్పనిక కథ భవిష్యత్తులో వాస్తవంగా మారబోతోందా అని అనిపించింది..మామూలుగా సైన్స్ ఫిక్షన్/డైస్టోపియన్/ఫాంటసీ రచనలకు ఆమడ దూరంలో ఉండే నేను Giver గురించి తరచూ వినడంతో,సరే ఒకసారి ప్రయత్నిద్దాం అని చదివాను..అది ఈరోజుకీ మర్చిపోలేని రచనల్లో ఒకటిగా మిగిలిపోయింది..మళ్ళీ ఇంతకాలానికి ఆ పుస్తకాన్ని గుర్తుకు తెచ్చింది Kurt Vonnegut రాసిన కథ 2BR02B..ముందుతరాల్లో రాజకీయ సామాజిక పరిస్థితులను గురించిన భవిష్యవాణిని 1940 లలోనే తన రచనల్లో పొందుపరచిన George Orwell రచనల్లాగే ఇది కూడా రాబోయే రోజుల్ని మన కళ్ళ ముందు నిలబెడుతుంది..1962 లో ప్రచురితమైన ఈ సైన్స్ ఫిక్షన్ కథ ఒకే విషయాన్ని రెండు మూడువందల పేజీల రచనగానూ చెప్పొచ్చు,ఇరవై పేజీల్లోనూ చెప్పచ్చు అనడానికి ఒక మంచి ఉదాహరణ..కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కేవలం 28 పేజీలున్న ఈ కథ ఒక పెద్ద నవల చదివిన అనుభూతికి సరిసాటిగా నిలుస్తుంది ..

"Everything was perfectly well"  అంటూ మొదలయ్యే ఈ To Be or Naught to be (2BR02B) అనే కథలో ఒక అందమైన ప్రపంచం (ఉటోపియా) ఉంటుంది.. ఈ ప్రపంచంలో మనుషులకు వృద్ధాప్యం,మరణం,వ్యాధులు లాంటి ఇహలోకపు బాధలేవీ ఉండవు..ఎటొచ్చీ భూమి మీద సమతౌల్యం కోసం 'ఒక పుట్టుకకు ప్రతిగా ఒక చావు' విధానాన్ని జనాభా నియంత్రణ అంటూ అమలు చేస్తుంటారు..అదే సమయంలో 129 ఏళ్ళు average వయసు కలిగిన ఆ జనాభాలో 56 ఏళ్ళ Edward K.Wehling,Jr (అంటే చాలా చిన్న వయస్కుడన్నమాట) అనే వ్యక్తి చికాగో ఆస్పత్రిలో తన భార్య ప్రసవ వేదన పడుతుండగా గది బయట వేచియుంటాడు..అతనికి triplets పుట్టబోతున్నారని డాక్టర్స్ ముందే చెప్తారు..మరి ఒక పుట్టుకని తాను అమితంగా ప్రేమించే తాత మరణాన్ని ప్రతిగా ఇవ్వడానికి గత్యంతరంలేక సిద్ధపడిన Wehling మరో రెండు ప్రాణాలకు బదులు చెల్లించలేడు కాబట్టి ముగ్గురు పసికందుల్లో ఎవరో ఒకర్ని ఎంచుకోవాల్సి పరిస్థితి..

అదే సమయంలో,
A sardonic old man, about two hundred years old, sat on a stepladder,painting a mural he did not like.
అంటూ మరొక 200 ఏళ్ళ వృద్ధుణ్ణి గురించి చెప్తారు..అతను ఈ లోకంలో ఉండలేడు,అలా అని ఈ లోకాన్ని విడిచి వెళ్ళలేడు..ఇక్కడ ఆ mural వాస్తవ ప్రపంచం అన్నమాట..ఆ వృద్ధుడు ఇక్కడ ఉండాలా వెళ్ళాలా అనే దువిధతో ఉంటాడు..
ఇక్కడ "2BR02B" అనేది మరణాన్నిఅందించే ఒక వ్యవస్థ(ఫెడరల్ బ్యూరో ఆఫ్ టెర్మినేషన్ ) ఫోన్ నెంబర్.. ఆ ఉటోపియా ప్రపంచంలో ఉండడం ఇష్టం లేని వాళ్ళు ఆ నెంబర్ ను డయల్ చేస్తే వారికి ఎక్కువగా బాధపడకుండా మరణించడంలో సహాయం చేస్తారు..ఆ వ్యవస్థను ఇలా ముద్దుగా పిలుచుకుంటారు..

 It was the telephone number of an institution whose fanciful sobriquets included: "Automat," "Birdland," "Cannery," "Catbox," "De-louser," "Easy-go," "Good-by, Mother," "Happy Hooligan," "Kiss-me-quick," "Lucky Pierre," "Sheepdip," "Waring Blendor," "Weep-no-more" and "Why Worry?"

మనిషి ఆలోచనా పరిధి ఎంతసేపూ జననం,పునరుత్పత్తి చెయ్యడం,ఆ తరువాత ఈ భూమి మీద ఎల్లకాలం ఉండిపోవాలనే కాంక్షను దాటి ఆవలకి వెళ్ళదు..జననమరణాలకి సైతం పరిధుల్ని విధించగలమనుకునే ఆ ప్రపంచంలో తన పరిధుల్ని మర్చిపోయి అన్నీ శాశ్వతం అనుకుంటూ ఈ అశాశ్వతంలో ఊపిరి సలపకుండా జీవిస్తున్న వర్గానికి ప్రతినిధులుగా Wehling ను,వృద్ధుణ్ణీ ఉదహరిస్తారు రచయిత..చివరగా మరణాన్ని ఆశ్రయించి ఆ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసిన వ్యక్తితో,
"Your city thanks you; your country thanks you; your planet thanks you. But the deepest thanks of all is from future generations."  అంటూ ముగిసే ఈ కథ వాస్తవాన్ని అంగీకరించమంటుంది.. 
చదివిన వెంటనే మర్చిపోయే పుస్తకాలు కొన్నైతే,అప్పుడప్పుడు జ్ఞాపకాల్లోకి వచ్చే ప్రపంచాల్ని పరిచయం చేసేవి మరికొన్ని..ఈ రెండూ కాకుండా చదివిన తరువాత కొంత సేపు పాఠకుల్ని ఆలోచనలో పడేసేవి మరికొన్ని ఉంటాయి..ఇది ఆ మూడో రకం రచన..Kurt Vonnegut ని చదువుదామని ఎంతోకాలం నుండీ అనుకుంటున్నా వేసవి సెలవుల వల్ల పెద్ద పెద్ద రచనలు చదవడం వీలుపడక చదివిన ఈ చిన్న కథ Vonnegut మరికొన్ని రచనల్ని చదవాలనే ఆసక్తి కలిగించింది..

పుస్తకం నుండి మరికొంత,
In the year 2000," said Dr. Hitz, "before scientists stepped in and laid down the law, there wasn't even enough drinking water to go around,and nothing to eat but sea-weed—and still people insisted on their right to reproduce like jackrabbits. And their right, if possible, to live forever."