ఆదర్శంగా జీవించడానికి సార్వజనీనమైన బ్లూ ప్రింట్ ఇదీ అంటూ ప్రత్యేకంగా ఏదీ ఉండదు. అది ప్రతీ మనిషికీ 'టైలర్ మేడ్' కొలతలతోనే వస్తుంది. అందుకే ఇతరుల నిర్వచనాలను మనం బట్టీపట్టడం వల్ల ప్రయోజనం లేదు. ఈ విషయంలో ఎవరి నిర్వచనాలు వాళ్ళవే. కానీ మన పూర్వీకుల నుండీ, తమ అనుభవాలను అక్షరీకరించిన తత్వవేత్తల నుండీ మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఎటొచ్చీ ఒక వయసులో ఒక ఫిలాసఫీ సరైనదనిపిస్తే, మరో వయసులో మరో ఫిలోసఫీ సరైనదనిపిస్తుంది. దీనికి తోడు మారుతున్న సంస్కృతులతో బాటు సందర్భానుసారం కొత్త కొత్త ఫిలాసఫీలు పుట్టుకొస్తున్నాయి. అందుకేనేమో అమెరికన్ సోషల్ ఫిలాసఫర్, థియలోజియన్ Reinhold Niebuhr- “Every time I find the meaning of life, they change it.” అన్నారు.
|
Image Courtesy Google |
ఏ తాత్విక మార్గాన్ని అనుసరించాలో తెలీని సందిగ్ధతల మధ్య అనేక తత్వాలను సమన్వయం చేస్తూ జీవితానికి మనదైన సొంత ఫిలాసఫీ తయారుచేసుకోవడం అవసరమని అనుకున్నారో ఏమో డేనియల్ క్లైన్ ముప్పైల వయసులో తనను ప్రభావితం చేసిన సిద్ధాంతాలను ఎప్పటికప్పుడు కోట్స్ రూపంలో ఒక పుస్తకంగా రాసిపెట్టుకునేవారు. అలా క్లైన్ చదివిన పుస్తకాల నుండి ఒక్కో సిద్ధాంతాన్నీ తన దృక్కోణం నుండి చూస్తూ రాసిన పుస్తకమే ఈ "Every Time I Find the Meaning of Life, They Change It". డేనియల్ క్లైన్ ను ఆరేడేళ్ళుగా చదువుదామనుకున్నా ఈ పుస్తకం కనిపించగానే టైటిల్ చాలా ఆసక్తికరంగా అనిపించి వెంటనే చదివేలా చేసింది.
నేను ఇరవైలలో చదివిన ఆల్బర్ట్ కామూ, జిడ్డు కృష్ణమూర్తి, హెర్మన్ హెస్, ఆండ్రే గిడే లాంటి వాళ్ళతోబాటు తరువాతి కాలంలో చదివిన స్టాయిక్, ఈస్టర్న్ ఫిలాసఫీలు క్రమేపీ ఫిలాసఫీపై ఒకప్పటి ఆసక్తిని సడలించాయి. సత్యశోధన విషయంలో ఏ సంస్కృతికి చెందిన ఎంత గొప్ప తత్వమైనా చివరకు హ్యూమన్ మోర్టాలిటీ దగ్గరకే వచ్చి ఆగిపోయేది. తత్వవేత్తలందరూ యెటువంటి భాష వాడినా, ఏ శైలిలో చెప్పినా కర్మ సిద్ధాంతామనే ఒకే ఒక్క సత్యాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పినట్లనిపించేది. ఈ పుస్తకం మునుపు చదివిన ఆ ఫిలాసఫీలన్నిటినీ మరోసారి పునఃశ్చరణ చేసుకునే అవకాశం ఇచ్చింది.
క్లైన్ ఈ పుస్తకాన్ని స్టాయిక్స్ మొదలు పలువురు ప్రపంచ ప్రసిద్ధ తత్వవేత్తల సిద్ధాంతాలకు తన జీవితానుభవాలతో కూడిన ఆసక్తికరమైన విశ్లేషణల్ని జతచేస్తూ పిచ్చాపాటీ కబుర్లు చెబుతున్నట్లు రాశారు. అందువల్ల లోతైన తాత్విక చర్చలే అయినప్పటికీ ఈ పుస్తకంలోని అంశాలన్నీ సరళంగానూ, అదే సమయంలో ఆహ్లాదంగానూ అనిపిస్తాయి. క్లైన్ క్లిష్టమైన సమయాల్లో నిరాశానిస్పృహలు ఆవహించినప్పుడు ఈ తత్వాలని తన జీవితానికి అన్వయించుకున్న తీరు నాకు బాగా నచ్చింది. ఎంతగా అంటే నాక్కుడా ఇటువంటి జర్నల్ ఒకటి రాసుకోవాలనుకునేంతగా.
హెడోనిస్ట్ అయిన గ్రీకు తత్వవేత్త ఎపిక్యూరస్- “Do not spoil what you have by desiring what you have not; remember that what you now have was once among the things you only hoped for.” అంటారు. దాన్నే మరో విధంగా చెప్పారు ఎమెర్సన్- “We are always getting ready to live, but never living.”
ఎపిక్యూరస్ లాంటి స్టాయిక్లు ఆదర్శ జీవన మార్గానికి శాస్త్రీయంగానూ, నైతికంగానూ కూడా ఆమోదయోగ్యమైన ఆరోగ్యకర విధానాలను మనముందుంచినా, వాటిని కాలంచెల్లిన తత్వాలుగా తీసిపారేసి ఆధునికత పేరిట వెర్రితలలు వేస్తున్న నేటి తాత్విక (?) ప్రమాణాల గురించి ఇందులో విస్తృతంగా చర్చించారు క్లైన్. ఆధునిక మానవుడికి జరామరణాలు లేని మనుష్య జన్మ కావాలి. మరో భావోద్వేగానికి తావులేని శాశ్వతానందం కావాలి. ఎపిక్యూరస్ ప్రతిపాదించిన సిద్ధాంతాలను అదే హెడోనిస్ట్ వర్గానికి చెందిన బ్రిటిష్ ఫిలాసఫర్ డేవిడ్ పియర్స్ లాంటివాళ్ళు పురోగతి పేరిట ఎలా వక్రీకరించారో క్లైన్ విశ్లేషణలు చదివితే అర్థమవుతుంది.
“Genetic engineering and nanotechnology will abolish suffering in all sentient life. This project is ambitious but technically feasible. It is also instrumentally rational and ethically mandatory.” — David Pearce, British Philosopher (1960– ), Hedonist.
డేవిడ్ పియర్స్ "ఫీల్ గుడ్ ఉటోపియా" ప్రకారం మనిషి నిరంతరం ఆనందంగా మాత్రమే ఉండడానికి "సింథెటిక్ మూడ్స్" సృష్టించడంలో తప్పులేదు. నిజానికి యాంటీ డిప్రెషన్ పిల్స్ లాంటివి చేసే పని కూడా అదే. మనిషికి మోర్టాలిటీ చేధించలేని పజిల్ అయితే, "శాశ్వతానందం" (అత్యాశ / విపరీతం?) అందని ద్రాక్షలాగా ఊరిస్తున్న లక్ష్యం. నిజానికి ఆదర్శ జీవితానికి అర్థాన్నిచ్చే అన్ని నిర్వచనాలూ ఆ "ఆనందం" అనే సో కాల్డ్ బ్రహ్మపదార్థం దగ్గరకే వచ్చి ఆగుతాయి. కానీ ఆధునిక తరం ఆ ఆనందం శాశ్వతం కావాలనుకుంటోంది. ఒకసారి క్లౌడ్ 9 అనుభవం చవిచూశాక మరో అనుభవం దానికంటే ఖచ్చితంగా గొప్పదై ఉండాలి. నిరంతరం డోపమైన్ హిట్స్ దొరకడం, ఆనందడోలికల్లో తేలియాడడం కుదిరేపని కాదు కాబట్టి సమస్త సౌకర్యాలూ ఉన్నా, దేనికీ లోటు లేకపోయినా నేటి తరం డిప్రెషన్తో బాటు పలు మానసిక వైకల్యాలతో సతమతమవుతోంది. ఎంత నింపినా నిండని చిల్లు కుండలాంటి మనిషి కోర్కెల్ని భర్తీ చెయ్యడానికి అనేక వినోదప్రధానమైన అంశాలు తెరమీదకొచ్చాయి. ప్రతీ సమస్యకూ పరిష్కారం ఉండే తీరాలని నమ్మే సైన్సు జెనెటిక్ ఇంజనీరింగ్, నానో టెక్నాలజీ మనిషికి అన్ని బాధలనుంచీ విముక్తి కలిగించి శాశ్వతానందాన్నిస్తాయని నమ్మబలుకుతోంది. ఇది అత్యాశే అయినా అసంభవం కాదంటూ శాస్త్రవేత్తలు ఈ దిశగా పరిశోధనలు మొదలుపెట్టారు.
డేవిడ్ పియర్స్ వాదనను సవాలుచేసే కథ “Escape from Spiderhead” గురించి రచయిత ప్రస్తావించగా ఆ కథ వెతికి చదివాను. "Lincoln in the Bardo" రచయిత జార్జ్ సాండర్స్ రాసిన ఆ కథనే నెట్ఫ్లిక్స్ మూవీగా కూడా తీశారట (క్రిస్ హెమ్స్వర్త్ హీరో). నేనా సినిమా ఇంకా చూడలేదు. ఈ కథలో ప్రధాన పాత్రధారిపై "మైండ్ అండ్ ఎమోషన్ ఆల్టరింగ్ డ్రగ్స్"ని ప్రయోగిస్తారు. 'మోబి ప్యాక్' అనే ఒక పరికరాన్ని సర్జరీతో శరీరానికి అమర్చి పరిశోధనలు చేస్తారు. ఆ ప్రయోగంలో భాగంగా అతడిని హెథర్ అనే స్త్రీతో కలిపి ఒక గదిలో ఉంచుతారు. ప్రొటగోనిస్ట్ కి మునుపు ఎంతమాత్రమూ ఆకర్షణ లేని హెదర్ తో లవ్ డ్రగ్ ఇచ్చిన తరువాత విపరీతమైన వ్యామోహంలో పడిపోతాడు. హెదర్ కు కూడా ఆ డ్రగ్ ఇస్తారు. ఆ గదిలో ఇద్దరూ చాలా ప్యాషనేట్ గా ఒకటవుతారు. ఈ లవ్ డ్రగ్ గురించి చదువుతున్నప్పుడు షేక్స్పియర్ "A Midsummer Night's Dream"లో 'లవ్ పోషన్' గుర్తొచ్చింది. విచిత్రమేమిటంటే, హెథర్ తనకు సరైన జోడు అనుకున్నప్పటికీ, ఆ రసాయనాల ప్రభావం తగ్గగానే ఆమెను పూర్తిగా పట్టించుకోవడం మానేస్తాడు. రేచల్ అనే మరో అమ్మాయితో ఇదే ప్రయోగాన్ని మళ్ళీ చేస్తారు. అప్పుడు కూడా అతడికి రేచల్ తన "వన్ ట్రూ లవ్" అనే అనిపిస్తుంది.
Says the protagonist: “Soon my memory of the perfect taste of Heather’s mouth was being overwritten by the current taste of Rachel’s mouth, so much more the taste I now desired. I was feeling unprecedented emotions, even though those unprecedented emotions were (I discerned somewhere in my consciousness) exactly the same emotions I had felt earlier, for that now unworthy-seeming vessel Heather. Rachel was, I mean to say, it.”
Sublime love, total delight in finding one’s long-desired soul mate, is thus reduced to drops of a drug. And once the experimental subject knows that, strong as his current feelings are, he realizes that ultimately his love is meaningless. (Of course, some readers may see Saunders’s tale as wicked commentary on the undrugged, but nonetheless fickle, human heart.)
“Neuromodulation of mood”తో భావోద్వేగాలను నియంత్రించి మనిషికి ఆనందం తప్ప చిన్న బాధ కూడా కలగకుండా చూడడం సాధ్యమే గానీ, "ఇది సరైనా మార్గమేనా?" అన్నది అసలు ప్రశ్న. వీటివల్ల మిగిలేది కష్టం, కన్నీరు తెలీని డొల్లజీవితాలేగా! మరో హెడోనిస్ట్ గ్రీకు తత్వవేత్త అరిస్టిపస్ కూడా పియర్స్ వాదనలకు తీసిపోకుండా, సంతోషాన్ని సాధించడానికి నైతిక విలువల్ని పట్టించుకోనవసరంలేదని అంటారు.
“The art of life lies in taking pleasures as they pass, and the keenest pleasures are not intellectual, nor are they always moral.” - Aristippus, Greek/Libyan Philosopher (435–356 BC).
ఇకపోతే ఫిలాసఫీలన్నీ మంచివే కాదు కదా! మంచి-చెడుల బేరీజు వేసుకుని చదివిన ప్రతీ తత్వం మనపై ప్రభావం చూపించకుండా జాగ్రత్తపడడం కూడా అవసరం. ఒకప్పుడు టాల్స్టాయ్ ని చదువుతున్నప్పుడు జీవితపు చివరి దశలో జర్మన్ తత్వవేత్త ఆర్థర్ షోపెన్హార్ ప్రభావం టాల్స్టాయ్ పై తీవ్రంగా ఉండేదని తెలిసింది. షోపెన్హార్ నిరాశావాదం నుండి సాక్షాత్తూ టాల్స్టాయే తప్పించుకోలేకపోయారు. 20వ శతాబ్దపు తత్త్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్ ఈ పుస్తకంలో షోపెన్హార్ పై చేసిన విమర్శల గురించిన ప్రస్తావన చదివినప్పుడు టాల్స్టాయ్ గుర్తొచ్చారు. షోపెన్హార్ తన జీవితంలో కడు దుర్భర పరిస్థితుల్లో రాసిన రాతలకీ, ఆ రాతల ద్వారా వచ్చిన డబ్బు, కీర్తితో తరువాత కాలంలో గడిపిన విలాసవంతమైన జీవితానికీ అస్సలు సంబంధమేలేదంటారు రస్సెల్.
The twentieth-century philosopher Bertrand Russell, by all accounts a generally charitable man, thought that Schopenhauer was a consummate hypocrite. Wrote Russell: “He habitually dined well, at a good restaurant; he had many trivial love-affairs, which were sensual but not passionate; he was exceedingly quarrelsome and unusually avaricious. . . . It is difficult to believe that a man who was profoundly convinced of the virtue of asceticism and resignation would never have made any attempt to embody his convictions in his practice.”
ఇలా చెప్పుకుంటూపోతే అనేక తత్వాలను లోతుగా చర్చిస్తూ క్లైన్ రాసిన ఈ పుస్తకం పాఠకులకు ఒక పూర్తి స్థాయి "ఫిలాసఫీ బఫే"లా ఉంటుంది. హ్యాపీ రీడింగ్ :)
పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు :
In the 1960s and 1970s, the idea of finding one’s true self and giving it full expression was very much in the air. In pursuit of this goal, many of us went into psychoanalysis or group therapy, practiced Transcendental Meditation, imbibed mind-expanding drugs, and engaged in talk marathons during which we tried to strip away all artifice, all delusion, all the bullshit we habitually told one another. I remember that many a romance and friendship was wrecked along the way.
Wrote Leopardi, “If all you seek from something is pleasure, you’ll never find it.
To feel pleasure in any act or activity, you have to pursue some end other than pleasure. To put it another way, the pursuit of happiness is a guaranteed dead end,
Woody Allen: “My one regret in life is that I am not someone else.”
Albert Einstein expressed this late-in-life phenomenon beautifully when he wrote, “I live in that solitude which is painful in youth, but delicious in the years of maturity.”
One thing about living in a psychological era is that few people give credence or value to a philosophical perspective. In our period, despairing of finding any meaning in life is rarely considered a sincerely held worldview; no, it is a sickness that needs to be cured.
“Estragon: We always find something, eh Didi, to give us the impression we exist? “Vladimir: Yes, yes, we’re magicians.”—SAMUEL BECKETT, IRISH NOVELIST AND PLAYWRIGHT (1906–1989), ABSURDIST
But the ultimate absurdist gag is the one about the human being looking for life’s meaning when there isn’t any to be found.
So off Horner goes to the doctor’s clinic, Remobilization Farm, for therapy that includes reading both the works of Sartre and the World Almanac. Until Horner gets a hold on his life, the doctor prescribes a method for making his daily choices: “[D]on’t let yourself get stuck between alternatives, or you’re lost. You’re not that strong. If the alternatives are side by side, choose the one on the left; if they’re consecutive in time, choose the earlier. If neither of these applies, choose the alternative whose name begins with the earlier letter of the alphabet. These are the principles of Sinistrality, Antecedence, and Alphabetical Priority—there are others, and they’re arbitrary, but useful.”
The doctor’s treatment for overcoming choice-making paralysis then goes on to “mythotherapy,” adopting “masks” to abolish the ego by acting out symbolic roles. This is Existentialism gone wacky.
Like many people I know, I sometimes feel guilty for living in a fortunate bubble, one where too often I am oblivious to the evil running like a mad dog through the bigger world. Being a hedonist with a conscience can be demoralizing. It turns out that this business of feeling good often comes at the price of somebody else’s deprivation, and then I have to consider which is more important to me: feeling good or being good?
“People deserve much less punishment, or even perhaps no punishment, for what they did many years ago as compared to with what they did very recently. - Derek Parfit, British Philosopher (1942– )
When Wittgenstein says that “eternal life belongs to those who live in the present,” he is suggesting that this kind of eternal life is available only to certain people and not to others.
“The unexamined life is surely worth living, but is the unlived life worth examining?” —Adam Phillips. (British Psychoanalyst and Philosopher (1954– )
Often, Niebuhr displayed a sense of humor about what he saw as man’s predicament. He concluded one sermon by saying, “What a contradiction—to be the judge of all things and yet to be a worm of the earth.” Not exactly a thigh-slapper, but not bad for a sermon.
Like political creeds and advertising slogans, philosophies of life arise and fall in a culture.