Wednesday, February 19, 2025

The Book of Fantasy - Edited By Jorge Luis Borges, Silvina Ocampo and Adolfo Bioy Casares

ఇష్టమైన రచయితలు ఎందరున్నా బోర్హెస్, సుసాన్ సొంటాగ్ -వీరిద్దరూ అంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం. ఎందుకో వీరిద్దరూ నాకు రచయితలుగా కంటే పాఠకుల్లానే ఎక్కువ కనిపిస్తారు. వాళ్ళలో పుస్తకాల పేజీల్లో తప్ప మరే విధంగానూ వాస్తవ ప్రపంచాన్ని చూడలేనితనమేదో నాకు చాలా దగ్గరితనంగా అనిపిస్తుంది. ఎస్థెటిక్ స్పర్శ తగలని వాస్తవాన్ని యథాతథంగా చూడడానికి ఇష్టపడనితత్వమేదో నాలో కూడా ఉండడమే బహుశా ఆ ఇష్టానికి కారణం కావచ్చు. దానికి తోడు వాళ్ళ పుస్తకాలు మునుపెన్నడూ చదవని గొప్ప సాహిత్యాన్ని పరిచయం చేసాయి. 1940లో ఫాంటసీ ప్రక్రియలో ప్రముఖుడైన బోర్హెస్, తన మిత్రులైన మరో ఇద్దరు అర్జెంటీనా సాహితీ దిగ్గజాలతో కలిసి ఎంపిక చేసిన 81 కథల్ని "ది బుక్ ఆఫ్ ఫాంటసీ" పేరుతో ప్రచురించారు. కంటిచూపు పోయేవరకూ పఠనాన్ని ఒక యజ్ఞంలా మార్చుకున్న మనిషికి నచ్చిన ఈ కథలు, ప్రచురించిన 85 ఏళ్ళ తర్వాత కూడా పాఠకులకు ఫాంటసీ ప్రపంచపు అద్భుతాలను సరికొత్తగా పరిచయం చేస్తూనే ఉన్నాయి.

ఒక సమయంలో అకుతాగవా, బోర్హెస్, క్రిఝిఝానోవ్స్కీ, కాల్వినో, ఉర్సులా లీగ్విన్, బ్రాడ్బరీ లాంటి కొందర్ని చదివాక ఫెంటాస్టిక్ ఫిక్షన్ వ్యామోహంలో పడిపోయాను. అంతవరకూ చదివిన అస్తిత్వవాదపు రచనలకు భిన్నంగా మెదడుకి మేత పెట్టే మెటఫోర్లతో కూడిన కథనంతో పజిల్స్ సాల్వ్ చేస్తున్నట్లుండే కథల్ని చదివాక ఇతరత్రా రచనలేవీ పెద్దగా నచ్చడం మానేశాయి. చివరకు ఫెంటాస్టిక్ ఫిక్షన్ ఏం చేసిందంటే, నా చదువు "సిగిజ్మండ్ ని చదవక ముందూ, చదివిన తరువాత" అన్నంతగా ప్రభావితమైంది. చెప్పీచెప్పకుండా కథను చెబుతూ, దాన్నెలా అర్థం చేసుకుంటామన్న విషయాన్ని పూర్తిగా పాఠకుడి ఊహకు వదిలేస్తూ చెప్పే కథలంటే నాకు మొదట్నుంచీ ఆసక్తి.

"యులీసిస్" చదివిన తర్వాత ఏ పుస్తకం చదవడమైనా తేలికే(?) అనిపిస్తుంది కాబట్టి ఈ పుస్తకాన్ని మహా అయితే పదిహేను రోజుల్లో పూర్తిచేసేస్తాను అనుకుంటూ మొదలుపెట్టాను. కానీ విచిత్రంగా ఇందులో కొన్ని కథల్ని వాటి శైలి కోసం రెండు, మూడు సార్లు చదివాను. మరి కొన్ని కథల్ని ఎక్కడైనా డాట్స్ ని సరిగ్గా కనెక్ట్ చెయ్యలేదేమో అన్న అనుమానంతో మరో రెండు, మూడు సార్లు చదివాను. ఇక కొన్నైతే రచయిత నర్మగర్భంగా ఇంకేం వివరాలు దాచేస్తున్నారో తెలుసుకుందామని డిటెక్టివ్ వర్క్ చేస్తూ మరోసారి చదివాను. “I can't imagine a man really enjoying a book and reading it only once.” అని C.S. Lewis అన్నట్లు ఎవరైనాసరే ఈ కథల్ని కనీసం రెండుమూడు సార్లు చదవకుండా ఈ పుస్తకం ముగించడం దాదాపు అసంభవం అంటాను. 

ఇందులో కొన్ని చిన్నకథలైతే, కొన్ని పెద్ద పెద్ద కథలు, మరికొన్ని పేజీలో సగం మాత్రమే ఉండే పిట్టకథలు. కొన్ని కథల్లో దెయ్యాలూ, ప్రేతాత్మలూ కనిపిస్తే, మరికొన్ని క్రైమ్ చుట్టూ అల్లిన కథలు. ఈ కథల గురించి చెప్పాలంటే ఒక్కో కథకూ ఒక్కో వ్యాసం రాయచ్చు, అంత మంచి కథలు. ఈ పుస్తకం నాకు అత్యంత ఇష్టుడు అకుతాగవా రాసిన "సెన్నిన్" తో మొదలవుతుంది. 

1. "The Drowned Giant" by J.G. Ballard :

ఈ కథల్లో నాకు మునుపు పరిచయం లేని రచయితల్లో ఒకరైన జె. జి. బల్లాడ్ కథ ఒకటి ఉంది. బల్లాడ్ రాసిన "The Drowned Giant" కాల్పనిక సాహిత్యంలో మార్మికత అవసరాన్ని మరోసారి గుర్తుచేసిన కథ. ఒకానొక చోట సముద్రపు ఒడ్డుకి ఒక పెద్ద 'జైంట్' (మహాకాయుడు) కొట్టుకు వచ్చిన సంగతి చుట్టుపక్కలంతా పాకితే, అది ఒట్టి  పుకారని అనుకుంటూ కూడా కుతూహలం కొద్దీ దాన్ని చూడ్డానికి అక్కడికి చేరతాడు. తీరాచూస్తే అక్కడ నిజంగానే ఒక జైంట్ కనిపిస్తాడు. అతడి మహోన్నతమైన ఆకృతినీ, తీర్చిదిద్దినట్లున్న రూపురేఖల్నీ చూశాక అక్కడ కనిపించిన తోటి మనుషులంతా అతడికి అల్పంగా [puny] కనిపిస్తారు. "కొత్తొక వింత" అన్నట్లుగా మొదట్లో దాన్నొక మహాద్భుతంగా చూసిన జనం దాని మీదకెక్కి ఆడుతుంటారు. కొందరు దాన్నెక్కి కూర్చుంటారు, మరి కొందరు దానిమీద నడుస్తుంటారు. కానీ రోజులు గడిచే కొద్దీ శుష్కిస్తున్న శరీర భాగాలనూ, ఎముకలనూ, తలనూ మొండెం నుంచి వేరుచేసి ఊరిలో పలుచోట్ల అలంకార ప్రాయంగానూ, మ్యూజియంలలోనూ ప్రదర్శనకు పెడతారు. మనిషి జీవించి ఉన్నప్పుడు ఎంత గొప్పగా బ్రతికినా మరణించాక మట్టిలో నిరర్ధకంగా  కలిసిపోవడమనే  నిజాన్ని కళ్ళలోకి కళ్ళుపెట్టి చూస్తూ ఈ కథ చెబుతున్నట్లు ఉంటుంది.

ఇందులో చివరకు మిగిలే మహోన్నతమైన(?) మానవ జీవితపు అవశేషాలనూ, దుఖ్ఖాన్నీ కథావస్తువుగా చేసి పైకి చాలా సరళంగా కనిపిస్తున్నట్లు కథ చెప్పినా చదవడం పూర్తయ్యేసరికి పాఠకుడిలో ఒకరకమైన స్తబ్దత నెలకొంటుంది. ఎందుకంటే ఆ కథ ఒక జైంట్ గురించి చెబుతున్నట్లు చెప్పినా, రచయిత "నువ్వు 'మానవుడే మహనీయుడు' అనుకుంటూ, నిన్ను మించినవాడులేడని విర్రవీగుతూ మరచిపోయిన నీ కథను నీకే గుర్తుచేస్తున్నాను" అన్నట్లు  'హ్యూమన్ మోర్టాలిటీ'ని గుర్తుచేస్తారు. రచయిత ఎవరి గురించో చెప్తున్న కథను మనం "ఊఁ" కొడుతూ వింటున్నప్పుడు చివర్లో హఠాత్తుగా ఆ కథ నన్ను గురించేనన్న స్పృహ కలగడం పాఠకుడికి ఒక షాక్ లా అనిపిస్తుంది.

2.  "The Golden Kite, the Silver Wind" - Ray Bradbury :

ఈ కథ నాకెంత ఎంత నచ్చిందో చెప్పలేను. "అనగనగా" అంటూ మొదలుపెట్టి పిల్లలందరికీ మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన కథ ఇది. యునైటెడ్ స్టేట్స్ కీ, సోవియట్ యూనియన్ కీ మధ్య కోల్డ్ వార్ జరుగుతూ విపరీతమైన టెన్షన్ నెలకొన్న సందర్భంలో రాసిన ఈ నీతి కథ ప్రతీ మానవ సమాజానికీ అన్వయించుకునే విధంగా అత్యంత అవసరమైన రాజకీయ పాఠం చెబుతుంది. ఈ కథను అనువాదం చెయ్యాలనిపించేంతగా నచ్చింది. మరో పోస్ట్ లో దీన్ని విడిగా అనువాదం చేశాను.

Life was full of symbols and omens. Demons lurked everywhere, Death swam in the wetness of an eye, the turn of a gull’s wing meant rain, a fan held so, the tilt of a roof, and, yes, even a city wall was of immense importance.

3. Fate is a Fool - Arturo Cancela

ఈ అర్జెంటీనియన్ కథ కాలగతిలో మనం గర్వపడేవన్నీ మనతో సహా ఎలా కనుమరుగైపోతాయో కథానాయకుడు 'జువాన్ పెడ్రో రియార్టే' అనుభవాలకు సున్నితమైన హాస్యాన్ని జోడించి చెబుతుంది. సామాజికంగా మార్పు ఎంత సహజంగా జరిగిపోతుందో, ఆ మార్పుతో బాటు ఒకప్పుడు సంఘజీవిగా గొప్పగా, గర్వంగా జీవించిన మనిషి ప్రాముఖ్యతను కోల్పోయి నిరర్ధకంగా ఎలా మిగిలిపోతాడో హాస్యం, వ్యంగ్యం మేళవించి చెప్పిన కథ ఇది. ఈ కథ మునుపు చదివిన Marcel Aymé రాసిన 'The Man Who Walked Through Walls' కథల్ని గుర్తుకుతెచ్చింది. ఈ కథ చదివాక "శంకరాభరణం" సినిమా లాంటి గంభీరమైన అంశాన్ని ఈ కథలా పూర్తిగా కామెడీ కోణంలో ఎవరైనా తీస్తే చూడాలన్న చిలిపి ఆలోచన వచ్చింది. :)

Juan Pedro Rearte left the hospital limping, and limping he entered the twentieth century.

‘So,’ he said to himself, deeply melancholic, ‘progress has left me with a limp and that same limp prevents me from following it, making me the champion of underdevelopment.’

4. Tantalia - Macedonio Fernandez :

ఈ కథల్లో బోర్హెస్ గురువు, మెంటార్, ఇన్స్పిరేషన్ అయిన మేసిడోనియో హెర్నాండెజ్ కథ ఒకటి ఉంది. ఫెర్నాండెజ్ గురించి మునుపు చాలా చోట్ల చదివాను. ఆయన కథల సారాన్ని [లేదా కథల్ని!?] బోర్హెస్ తన రచనల్లో కాపీ చేశారనే అపవాదులు బోర్హెస్ మీద చాలానే ఉన్నాయి. ఆ ప్లాగియారిజం ఆరోపణలు నిజమో కాదో ఖచ్చితమైన సమాచారం లేదు గానీ ఆ విషయాలు మొదటిసారి చదివినప్పుడు మాత్రం చాలా బాధేసింది. 'టాంటాలియా' కథ చదివినప్పుడు ఆయన శైలి బోర్హెస్ మీద చాలా ప్రభావం కలిగి ఉందన్నది మాత్రం నిజమని అర్థమైంది. ఈ కథకి ముందు రచయిత పేరు చెప్పకపోతే  శైలిని బట్టి మనం బోర్హెస్ రాశారేమో అనుకుని పొరబడే అవకాశం ఉంది.

5. A Secure Home : Elena Garro

ఇందులో ఎలెనా గర్రో అనే మెక్సికన్ రచయిత్రి తొలిసారి పరిచయమైంది. ఈ కథ నేరేషన్ మొదలవ్వడమే భలే ఉంటుంది. కిటికీలూ, తలుపులూ లేని ఒక ఇరుకైన చీకటి గది. ఆ గదిలో 80 నుండి 5 ఏళ్ళ వరకూ అన్ని వయసుల  స్త్రీపురుషులు ఉంటారు. ఆ ఇంట్లో వాళ్ళంతా ఇంటికి రాబోయే ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఒకరితో ఒకరు పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ కథలో వాళ్ళెవరూ? ఆ ఇంటికి ఎవరొస్తున్నారు? ఈ విషయాలేమీ స్పష్టత లేకుండా చివరికొచ్చేసరికి విషయం అర్థమైనప్పుడు "కథను ఇలా కూడా చెప్పొచ్చా" అనిపిస్తుంది. ఈ కథ చదివి రచయిత్రి ఎలెనా ఇతరత్రా పుస్తకాలేమైనా దొరుకుతాయేమో అని జల్లెడ పడితే ఆ దార్లు మరో రెండు మూడు పుస్తకాలవైపు తీసుకెళ్ళాయి.

కొన్నేళ్ళ క్రితం పీటర్ మెండెల్సండ్ రాసిన "What we see when we read" అనే పుస్తకం చదివాను. అందులో ఈ తరంలో సృజనాత్మకత క్షీణించిపోవడానికి ప్రధాన కారణంగా సినిమాలూ, ఫోటోలూ అంటారు. ఉదాహరణకు నేను "ప్రైడ్ అండ్ ప్రిజుడిస్" నవల చదివినప్పుడు డార్సీనీ, ఎలిజబెత్ నూ నా మనసులో ఒక రూపంలో ఊహించుకుంటాను. నవలను సినిమాగా చూసినప్పుడు నా ఊహకూ, వాస్తవానికీ పొంతనలు కనబడవు. కానీ నా మెదడులో నిక్షిప్తమైన ఉన్న ఎలిజబెత్ చిత్రం వెంటనే ఆ సినిమాలో నటి రూపంలో ఒక ఫ్రేమ్ లో ఇమిడిపోతుంది. ఆ తరువాత 'ఎలిజబెత్' ప్రస్తావన ఎప్పుడొచ్చినా ఆ నటి మొహం తప్ప మన మెదడు మరొక రూపాన్ని అంగీకరించదు, మన కళ్ళు స్టోర్ చేసుకునే మెమరీ డేటా మన ఊహాత్మకతను రీప్లేస్ చేసేస్తుందన్నమాట. బహుశా అందుకే సొంటాగ్ కూడా ఫోటోగ్రఫీ గురించి రాసిన ఒక పుస్తకంలో [On Photography] “Photographs are a way of imprisoning reality...One can't possess reality, one can possess images--one can't possess the present but one can possess the past.” అంటారు. "బుక్ ఆఫ్ ఫాంటసీ" కథల్లో మనిషి ఆలోచనా పరిధికావలి    అతీంద్రీయ శక్తులతో కూడిన అసాధారణ ప్రపంచాలను కేవలం మన దృష్టి పరిధిలోకి కుదించడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఫాంటసీ శైలి ఉనికిలోకి వచ్చే చోటు మనిషి సబ్కాన్షియస్ కాబట్టి ఈ కథలన్నీ అవి చదివే పాఠకుడి ఊహాత్మకతలోనే జీవం పోసుకుంటాయి. అందువల్ల ఆ ఫాంటసీ ప్రపంచపు అనుభవం ఎవరికి వారికే ప్రత్యేకం.

ఇందులో కోర్తజార్, కిప్లింగ్, చెస్టెరాన్, హాథోర్న్, కాఫ్కా, మపాసా, ఎడ్గర్ అలెన్ పో, వైల్డ్, టాల్స్టాయ్ లాంటి వాళ్ళతో బాటు నాకు మునుపు తెలీని వివిధ దేశాల సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ, క్రైమ్ రచయితలు చాలామంది పరిచయమయ్యారు.  ఇందులో మునుపు చదివిన నథానియల్ హాథ్రోన్ "Earth's Holocaust" కథ కూడా ఉంది. దాని గురించి మునుపొక బ్లాగ్ పోస్ట్లో రాసాను. పుస్తకాల పురుగుల గురించి అందులో వ్యంగ్యంగా, అవమానకరంగా రాసిన వాక్యాలు అంత సులభంగా మర్చిపోలేం. :))

This,’ remarked the sedate observer beside me, ‘is a bookworm—one of those men who are born to gnaw dead thoughts. His clothes, you see, are covered with the dust of libraries. He has no inward fountain of ideas; and, in good earnest, now that the old stock is abolished, I do not see what is to become of the poor fellow. Have you no word of comfort for him?’

ఇందులో నేను మొదటిసారి మాక్స్ బీర్బోమ్ కథను చదివాను. ఆయన రాసిన "Enoch Soames" రచనావ్యాసంగంలోకి అడుగుపెట్టే ప్రతీ రచయితా చదివి తీరాల్సిన గొప్ప కథ. ఇక ఈవెలిన్ వా రాసిన "The man who liked Dickens", ఎడిత్ వార్టన్ రాసిన "Pomegranate Seed", జియోవన్నీ పాపిని రాసిన "The man who belonged to me" కథలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా ఆ మూడో కథ స్టోరీ టెల్లింగ్ లో ఒక మాస్టర్ పీస్. విచిత్రంగా జాయిస్ తో తెగతెంపులు చేసేసుకున్నాననుకునేలోగా ఇందులో కూడా "యులీసిస్" లో డెడలస్ తల్లి మరణం గురించి రాసిన రెండు చిన్న భాగాలు ఉన్నట్టుండి  ప్రత్యక్షమయ్యాయి. Leopoldo Lugones రాసిన కథ "The Horses of Abdera"కు  గ్రీకు మైథాలజీలో హెర్క్యులస్ కథ ఆధారం. ఈ కథ గురించి గూగుల్ చేస్తే దాని చుట్టూ ప్రచారంలో ఉన్న పిట్టకథలనేకం తెలుస్తాయి. గుర్రాలు అచ్చం మనుషుల్లా వ్యవహరించే ఈ కథ భలే వింతగా ఉంటుంది. 

ఇక రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన "The return of Imray" కథ బ్రిటిషర్ల కాలపు  ఇండియా నేపథ్యంలో రాసిన కథ. కథకుడిగా కిప్లింగ్ నైపుణ్యం గురించి చెప్పనవసరం లేదు. ఆకాలంలో చదువూ సంధ్యా లేని భారతీయులపట్ల కిప్లింగ్ తృణీకార వైఖరి ఆయన రాతల్లో స్పష్టంగా కనిపిస్తుంది. పాపం ఎప్పటిలాగానే వాళ్ళే ఏలిన రాజ్యంలో పాలకుల మీద జరిగిన అమానుషాల గురించి మాత్రమే చెప్పుకొస్తారాయన. నాణానికి రెండో వైపు కథలు ఏవైనా రాశారేమో తెలీదు, నాకైతే ఎక్కడా చదివిన గుర్తులేదు. అదంతా ప్రక్కన పెడితే ఈ కథలో ఒక వాక్యం దగ్గర ఆగిపోయాను. ఆ మధ్య కొందరు పాత రచయితల రచనల్లో వాక్యాలను తీసేసి, వాటిని తిరగరాసి ప్రచురించే ప్రయత్నం చేసిన వివాదం బహుశా ఇలాంటి వాక్యాల గురించే అనిపించింది. ఆ రచయితల్లో కిప్లింగ్ పేరు కూడా ఉంది మరి. కిప్లింగ్ భార్య గయ్యాళి అని కొందరూ, కిప్లింగ్ ఒక 'మేల్ షొవనిస్ట్ పిగ్' అని మరి కొందరూ అనుకుంటూ ఉంటారు. కిప్లింగ్ కఠినమైన వ్యక్తిత్వం గురించి కొన్ని గార్డియన్ పత్రిక కథనాలు కూడా ఉన్నాయి. ఆ వాక్యం ఇదీ.

"If a mere wife had wished to sleep out of doors in that pelting rain it would not have mattered; but Tietjens was a dog, and therefore the better animal."

కొద్దికాలంగా రియాలిటీ నలువైపులకూ లాగేస్తుంటే, ఇష్టమైన చదువు ప్రాధాన్యతల లిస్టులో అట్టడుగుకి చేరిపోయింది. మళ్ళీ చాలా కాలానికి రాసి పెట్టుకున్న "డ్రీమ్ లిస్టు" దుమ్ము దులిపితే, వాటిల్లో మొట్టమొదట కనిపించిన పుస్తకం జార్జి లూయీ బోర్హెస్, అడాల్ఫో బయో కజారెస్, సిల్వినా ఒకాంపో- ఈ ముగ్గురూ సంపాదకత్వం వహించిన "The Book of Fantasy". అన్నట్లు సిల్వినా ఒకాంపో అంటే గుర్తొచ్చింది, ఆవిడ కథలు చాలా చెత్తగా రాస్తారు. కొన్నేళ్ళ క్రితం NYRB క్లాసిక్స్ లో కొన్ని కథలు చదివి విరక్తి చెందాను. కేవలం బోర్హెస్, అడాల్ఫో ల స్నేహం, సాహచర్యం మాత్రమే ఆవిణ్ణి లైమ్ లైట్ లో నిలబెట్టాయనిపిస్తుంది. "బుక్ ఆఫ్ ఫాంటసీ" చదవాలనుకుంటూ ఆరేడేళ్ళపైనే గడిచిపోయాయంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎట్టకేలకు ఈ ఏడాది ఆ కోరిక నెరవేర్చుకున్నాను. హ్యాపీ రీడింగ్. :)

పుస్తకం నుండి నచ్చిన కొన్ని వాక్యాలు:

I asked him what he thought of Baudelaire. He uttered the snort that was his laugh, and ‘Baudelaire,’ he said, ‘was a bourgeois malgré lui.’

‘In Life and in Art,’ he said, ‘all that matters is an inevitable ending.’

‘You sound like an Argentine, you’re so bitter.’

He who consumes too much news has no time for boiling, frying or chewing it over, but is obliged to swallow everything raw and whole. Having considered political digestion and protective fatty layers of tissue, he decided to attack the problem from quite a different angle.

The Tale and the Poet : Sir Richard Burton (1821-90) --- Tulsi Das, the Hindu poet, created the tale of Hanuman and his army of monkeys. Years afterwards, a despot imprisoned him in a stone tower. Alone in his cell, he fell to meditating, and from his meditation came Hanuman and his monkey army, who laid low the city, broke open the tower, and freed Tulsi Das.

I couldn’t tell you why she knitted so much; I think women knit when they discover that it’s a fat excuse to do nothing at all.

The truth was, that the human race had now reached a stage of progress so far beyond what the wisest and wittiest men of former ages had ever dreamed of that it would have been a manifest absurdity to allow the earth to be any longer encumbered with their poor achievements in the literary line.

How could she ever have gained that power, since she knows so little about these hearts of ours? She hides herself and does not sing, but our people, quietly, without visible disappointment, a self-confident mass in perfect equilibrium, so constituted, even though appearances are misleading, that they can only bestow gifts and not receive them, even from Josephine, our people continue on their way.

I have always had a solitary disposition, always been a dreamer, a sort of lone philosopher, kind to others, content with little, bearing neither bitterness towards men, nor resentment towards heaven. I have always lived alone, as a result of a kind of uneasiness which comes over me when I am with other people. How can I explain this? I don’t suppose I can explain it. It’s not that I refuse to see people, or to chat to them, or to have dinner with friends, but when I’ve been with them for some time, even with the people I know best, I find that they weary me, tire me out, get on my nerves—and with a growing exasperation I long to see them go, or go away myself, so that I can be alone.

This feeling I have is more than a desire: it is a compelling necessity. And if I had to endure the continued presence of other people, if I had to go on listening to their conversation for any length of time, something would certainly happen to me. What exactly would it be? Ah, who knows? Perhaps I should faint—something like that.

‘Wait one moment, please. I’ll explain now why I thought about you and why I followed you. A few days ago I said to myself: “You are a fool, the kind of person you can meet anywhere any day; and you’ve got this craze of wanting to live a glorious life, all risks and adventures, like the people in six-penny stories and cheap novels. But you’ve no imagination so you can’t expect to have that sort of life. The only thing to do is to look round till you find an author who makes up extra-ordinary characters, and make him a present of your life so that he can do whatever he likes with it and turn it into something really exciting and beautiful and unexpected . . .” ‘

I thought to myself how for months—ever since I had taken over control of that man—I had not been master of my own life; I had been obliged to leave all my work in the middle, to leave my country, to worry myself inventing romantic adventures and reliable people to carry them out. Since I had taken possession of Amico Dite’s life, I had had to sacrifice the whole of my own life to him. I, nominally his master, had really degenerated into his slave; or at best, merely the manager of his personal existence.

‘I married Rani never dreaming that at night she turned into a tiger.’

At about seven o’clock the bell rang. I opened the door. It was Rani. Her hair was uncombed, her clothes in a mess, her nails dirty. She seemed confused and ashamed. I turned my head away so as not to hurt her; I let her come i

Don Pedro was right: each family is a world unto itself.

In vain I told him that I considered as harmful the distance which is maintained between one man and another in Buenos Aires and the displeasure at the peculiarities of others, in vain I advised him to be tolerant and understanding. I don’t think he even heard me.

‘For nearly half a century now I have been acting and playing other men’s passions without ever feeling them—for at bottom I have never felt anything. So I am like those other men just for fun! So I am nothing but a shadow! Passions, feelings, real actions—that is what makes a genuine Man. Consequently, since my age forces me to rejoin Mankind, I must find myself some passions or real feelings—seeing that that is the sine qua non without which nobody can call himself a Man.

In those days people were happy in getting so easily quit. America was not then discovered, and distressed ladies were not nearly as dangerous as they are now.

The proper basis for marriage is a mutual misunderstanding.

Not being a genius, he had no enemies

No comments:

Post a Comment