పాండెమిక్ రోజులు. నాకేమో అర్జెంటుగా ఎక్కడికో అక్కడికి ప్రయాణమై వెళ్ళాలని ఉంది. అనుకున్నదే తడవు పారిస్ వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. కానీ ఒంటరిగా వెళ్ళడం బోర్. పోనీ హెమ్మింగ్వేతో కలిసి వెళ్తే !!! ఆయనకు పారిస్ వీధులన్నీ కొట్టిన పిండి అంటారు. కానీ పారిస్ అంతా చుట్టి రావాలంటే కనీసం నాలుగైదు రోజులైనా పడుతుంది. ఎర్నెస్ట్ కాస్త కోపిష్టి అని ఇదివరకే విని ఉన్నాను కాబట్టి ఆయనతో ప్రయాణం గురించి ముందుగానే ప్రిపేర్ అయ్యాను. :)
పారిస్ అనగానే నాకు ముందుగా గుర్తొచ్చేవి కేఫ్స్. అసలు పారిస్ అనగానే వర్షపు రోజుల్లో ఊరంతా గ్రే కలర్ పెయింట్ చేసినట్లు ఉండే వాతావరణంలో, ఖాళీగా ఉండే కేఫ్ లో ఏదో ఒక మూలగా కూర్చుని రచయితలు స్టైల్ గా సిగార్స్ పీలుస్తూ మధ్యమధ్యలో డ్రింక్స్ సిప్ చేస్తూ తమను తాము మర్చిపోయి రాసుకోవడం ఊహకొస్తుంది. కాఫీలు ఏదో ఒక కేఫ్ లో తాగొచ్చులెమ్మని నేనూ,హెమ్మింగ్వే పొద్దున్నే నగర సంచారానికి బయలుదేరాం. వర్షంలో పారిస్ వీధుల్లో నడుచుకుంటూ వెడుతుంటే ముందుగా St-Michel లోని Cafe des Amateurs కనిపించింది. నిరంతరం వచ్చేపోయే జనాలతో ఆ కేఫ్ ఖాళీ ఎరుగదు. లోపల మనుషుల రద్దీ,సిగరెట్ల వేడీ వెరసి ఆ కేఫ్ అద్దాలు ఎప్పుడూ పొగచూరిపోయి ఉంటాయి. ఈ గందరగోళంలో కూర్చుని కుదురుగా రాసుకోవడం అయ్యేపని కాదు గానీ మరో చోటికి వెళదాం అంటూ ముందుకు సాగారు హెమ్మింగ్వే. నేను మారుమాటాడకుండా ఆయన్ను అనుసరించాను. వర్షంలో Boulevard St. German ని దాటుకుని కేఫ్ లు ఉన్న దాఖలాలేమైనా కనిపిస్తాయేమో అని భవనాలపై చిమ్నీ పొగల ఆనవాళ్ళు వెతుకుతూ ముందుకు వెళ్ళగా Closerie des Lilas అనే ఒక కేఫ్ కనిపించింది. నిశ్శబ్దంగా మమ్మల్ని ఆహ్వానించిన 'లిలాస్' హెమ్మింగ్వేకు ఎంతో ఇష్టమైన కేఫ్ గా మారడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆ మాటకొస్తే హెమ్మింగ్వే మాత్రమే కాదు,1920ల్లో ఫిట్జ్ గెరాల్డ్,ఎజ్రా పౌండ్,పికాసో, జేమ్స్ జాయ్స్,గెర్ట్రూడ్ స్టెయిన్ వంటి అనేకమంది కళాకారులు ఆ కేఫ్ లో తరచూ సమయం గడిపేవారట. ఇప్పటికీ వారి గుర్తుగా కొన్ని టేబుల్స్ మీద ఆయా రచయితల,కళాకారుల పేర్లు మెటల్ ప్లేట్స్ మీద రాసి ఉంటాయంటారు. ఈలోగా పారిస్ వచ్చిన కొత్తల్లో తన సాహితీ ప్రస్థానం గురించీ, తనకు ఇష్టమైన ప్రదేశాల గురించీ, సాహితీవేత్తల గురించీ నాకు మెల్లి మెల్లిగా తనదైన శైలిలో పరిచయాలు మొదలుపెట్టారు హెమ్మింగ్వే.
ఈ సందర్భంలో ఒక చిన్న జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు. ఒక వర్షపురోజు ఆ కేఫ్ లో కూర్చుని తన జేబులోని నోట్ బుక్కూ ,పెన్సిలు బయటకు తీసి మధ్య మధ్యలో St.James రమ్ తాగుతూ రాసుకుంటున్న సమయంలో ఆయన ఎదురుగా కాస్త దూరంలో మరో టేబుల్ దగ్గర కూర్చున్న అందమైన యువతి కనిపించిందట. ఆ క్షణంలో ఆయనలోని కళాకారుడికి ఆమె రూపంలో మరో కథ దొరికింది.
I've seen you, beauty, and you belong to me now, whoever you are waiting for and if I never see you again, I thought. You belong to me and all Paris belongs to me and I belong to this notebook and this pencil.
|
Image Courtesy Google |
పారిస్ లో ఉంటూ గెర్ట్రూడ్ స్టెయిన్, పికాసో లను కలవని వారుంటారా ! హెమ్మింగ్వేకు సహజంగానే గెర్ట్రూడ్ తో మంచి దోస్తీ కుదిరింది. కానీ పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు ఆనతి కాలంలోనే ఆ స్నేహం వెలిసిపోయింది. ఇది నాకేమీ ఆశ్చర్యంగా అనిపించలేదు,పర్వతాలను పోలే ఇగోలకు నెలవైన ఇంటెలెక్చువల్ వర్గాల్లో ఇటువంటివి సర్వసాధారణం. గెర్ట్రూడ్ స్టెయిన్ తో స్నేహం గురించి హెమ్మింగ్వే కొన్ని ఆసక్తి కరమైన విషయాలు పంచుకున్నారు. నాకైతే ఆయన చెప్పినదాన్ని బట్టి ఆమె చాలా సూపర్ఫీషియల్ గా అనిపించారు. తన రచనలపట్ల సానుకూలంగా స్పందించని రచయిల గురించి ఆమె ఒక్క మంచి మాట మాట్లాడగా వినలేదంటారు హెమ్మింగ్వే.
She quarrelled with nearly all of us that were fond of her except Juan Gris and she couldn't quarrel with him because he was dead.అని ఛలోక్తి విసురుతారు.
అమెరికన్ రచయిత షేర్వుడ్ ఆండర్సన్ ప్రస్తావన వచ్చినప్పుడు స్టెయిన్ ఆయన ఇటాలియన్ నీలి కళ్ళనూ,ఛరిష్మానీ పొగిడినంతగా ఆయన కథలను గూర్చి మాట్లాడలేదనేది హెమ్మింగ్వే ఫిర్యాదు. ఏం పుస్తకాలు చదువుతున్నావు అని హెమ్మింగ్వేను అడిగి, ఆయన ఆల్డస్ హక్స్లే , డి.హెచ్. లారెన్స్ లను చదువుతున్నానని చెప్తే , 'Huxley is a dead man', 'Why do you want to read a dead man? Can't you see he is dead?' 'You should only read what is truly good or what is frankly bad.' అని ఆ రచయితల్ని తీసిపారేశారట గెర్ట్రూడ్. ఆమెకు 'నచ్చడం' విషయంలో చాలా పేచీలున్నట్లున్నాయి. ఆమె ఇంట్లో eau-de-vie సిప్ చేస్తూ హెమ్మింగ్వే కూ గెర్ట్రూడ్ కూ మధ్య జరిగిన సంభాషణల్లో 1920ల నాటి పారిస్ సాహితీ ప్రపంచం అంతా కళ్ళముందు కనిపిస్తుంది. రాత్రి వేళల్లో బంగారు కాంతుల ధగధలతో మెరిసిపోయే పారిస్ లో ఏవగింపు కలిగించే చీకటి కోణాలను గురించి హెమ్మింగ్వేకు చెబుతూ, ఈ విధంగా అంటారు గెర్ట్రూడ్. ఈ మాటల్లో మిస్ గెర్ట్రూడ్ లోని హార్డుకోర్ ఫెమినిస్టు అలా తళుక్కున ఒకసారి మెరిసి మాయమౌతారు :
'You know nothing about any of this really, Hemingway,' she said. 'You've met known criminals and sick people and vicious people. The main thing is that the act male homosexuals commit is ugly and repugnant and afterwards they are disgusted with themselves. They drink and take drugs, to palliate this, but they are disgusted with the act and they are always changing partners and cannot be really happy.'
'In women it is the opposite. They do nothing that they are disgusted by and nothing that is repulsive and afterwards they are happy and they can lead happy lives together.'
ఇక సాహితీ ప్రియులన్నాక పారిస్ కు వెళ్ళి rue de l'Odeon లోని 'షేక్స్పియర్ అండ్ కో' బుక్ షాప్ కి వెళ్ళకపోతే ఎలా ! పారిస్ వెళ్ళిన కొత్తల్లో హెమ్మింగ్వేకు పుస్తకాలు కొనుక్కుని చదివే స్తోమత లేక ఆ బుక్ షాప్ ఓనర్ సిల్వియా బీచ్ రెంటల్ లైబ్రరీలో పుస్తకాలు అద్దెకు తెచ్చుకునేవారట. ఆయన మొదటిసారి ఆ షాప్ కు వెళ్ళినప్పుడు రెంటల్ లైబ్రరీలో జాయిన్ అవ్వడానికి కూడా సరిపడా డబ్బు లేకపోతే సిల్వియా "డిపాజిట్ ఎప్పుడైనా కట్టవచ్చు, ఎన్ని పుస్తకాలు కావాలంటే అన్ని పట్టుకెళ్ళండి" అని మెంబర్షిప్ కార్డు తయారుచేసి ఇచ్చారని ఎంతో అభిమానంగా తలచుకున్నారు హెమ్మింగ్వే. ఆ లైబ్రరీలోనే తుర్గెనెవ్,గొగోల్,టాల్స్టాయ్,చెహోవ్ వంటి రష్యన్ సాహితీవేత్తల రచనల్ని ఔపాసన పట్టారాయన. పారిస్ కు రాక మునుపు టోరెంటోలో ఉండగా క్యాథెరిన్ మాన్స్ఫీల్డ్ గొప్ప కథా రచయిత్రి అని విన్నాననీ, కానీ సహజమైన శైలిలో రాసే డాక్టర్ చెహోవ్ ని చదివిన తరువాత క్యాథెరిన్ ని చదివితే ఒక 'యంగ్ ఓల్డ్-మెయిడ్' అతి జాగ్రత్తగా కూర్చిన కృత్రిమమైన కథల్ని వింటున్నట్లు ఉందనీ అంటారు. Mansfield was like near-beer. It was better to drink water. But Chehov was not water except for the clarity. అంటారాయన.
పారిస్లో తొలి చివురులు తొడిగే వసంత ఋతువు (ఫాల్స్ స్ప్రింగ్) శోభను వర్ణిస్తూ, ఆనందంగా ఉండడానికి ఇంతకంటే మరో కారణం అఖ్ఖర్లేదంటారు హెమ్మింగ్వే. ఆ అందమైన వాతావరణాన్ని చెడగొట్టగల శక్తి మనుషులకు మాత్రమే ఉంది కాబట్టి,ఆ సమయంలో మనుషులను దూరం పెట్టగలిగితే వసంత ఋతువులో ప్రతిరోజూ సుదీర్ఘమైనదే అంటూ, People were always the limiters of happiness except for the very few that were as good as spring itself. అని ముక్తాయింపునిస్తారు.
జర్నలిజాన్ని వదిలేసి, సంపాదించుకున్న కొద్దిపాటి డబ్బుతో పారిస్ కు వచ్చి రచనా వ్యాసంగం మీద దృష్టి పెట్టాలనుకున్న హెమ్మింగ్వే దంపతులు పారిస్లో విలాసవంతవంతమైన జీవితాన్ని జీవించారనుకుంటే పొరపాటే. కొత్త ప్రపంచంలో తాత్కాలికంగా గుర్రపు పందాలూ,తాగుడూ వంటి ఖరీదైన వ్యసనాలకు బానిసలైనా,వాటిని కూడా క్రమశిక్షణతో అధిగమించారు. పారిస్లో గడిపిన కాలంలో పేదరికంతో పాటు హెమ్మింగ్వేకు ఆకలి బాధ కూడా తెలుసు. ఆయన వద్ద ఒక్కోసారి డబ్బులేక పస్తులుండవలసిన అవసరమొచ్చినప్పుడు Luxembourg గార్డెన్స్ లో రెండుగంటల పాటు ఊరికే చక్కర్లు కొట్టి,ఇంటికి వచ్చాకా మాత్రం స్నేహితులతో కలిసి మధ్యాహ్నం బ్రహ్మాండమైన విందు చేశానని భార్య వద్ద కోతలుకోసేవారట.
There is never any ending to Paris and the memory of each person who has lived in it differs from that of any other. We always returned to it no matter who we were or how it was changed or with what difficulties, or ease, it could be reached. Paris was always worth it and you received return for whatever you brought to it. But this is how Paris was in the early days when we were very poor and very happy.
ఈ పుస్తకంలో కొన్ని విషయాలు జగమెరిగిన సత్యాలైతే మరికొన్ని ఎవరికీ తెలియని రహస్యాలు. ఇక ఏదైనా ప్రాంతాన్ని గురించిన ప్రస్తావన, అక్కడ నివసించిన మనుషుల గురించి చెప్పుకోకపోతే పూర్తవ్వదు కదా ! ఇందులో హెమ్మింగ్వే పారిస్ ఆత్మను పట్టుకోవడంతోపాటుగా తన సమకాలీన రచయితల గురించి కూడా అనేక విషయ విశేషాలను పొందుపరిచారు. ముఖ్యంగా హెమ్మింగ్వేకు సన్నిహితులైన ఫిట్జ్ గెరాల్డ్,జెల్డాల అస్తవ్యస్థమైన దాంపత్యాన్ని గురించీ, ఎజ్రా పౌండ్ ఎల్లలులేని మంచితనం గురించీ, గెర్ట్రూడ్ స్టెయిన్ సూపర్ఫీషియల్ వ్యక్తిత్వాన్ని గురించీ ప్రత్యేకం కొన్ని పేజీలు కేటాయించారు. ఈ పుస్తకాన్ని చదువుతుంటే ఫిక్షన్, నాన్ ఫిక్షన్ ,ట్రావెలాగ్ లను ఏకకాలంలో చదువుతున్నట్లు అనిపించింది. కావాలంటే ఈ రచనను పాఠకులు కాస్త కాల్పనిక దృష్టితో చూసే వెసులుబాటును తమకు తామే కల్పించుకోవచ్చని అంటారు హెమ్మింగ్వే. పుస్తకం పేరుకు అక్షరాలా న్యాయం చేకూర్చిన ఈ రచన పాఠకులకు పూర్తిస్థాయి విందులానే ఉంటుంది.
యాత్ర పూర్తై ఇల్లు చేరినా కూడా ఆ అనుభవాలు మాత్రం ఇంకా నన్ను వదిలిపోలేదు. ఇక అసలు విషయానికొస్తే,ఆన్లైన్ క్లాసులకు కూడా వేసవి సెలవులు ఇవ్వడంతో ఇది వరకూ చూసిన సినిమాలే మా తిలక్ ని కోవిడ్ సమయంలో ఎంగేజ్ చెయ్యడానికి మరోసారి వాడితో కలిసి చూశాము. అందులో 'మిడ్నైట్ ఇన్ పారిస్' ఒకటి. 1920 ల నాటి పారిస్ ప్రపంచాన్ని అంత అందంగా చూపించిన సినిమాలు నేనైతే మరింకేవీ చూడలేదు. ఫిట్జ్ గెరాల్డ్, గెర్ట్రూడ్ స్టెయిన్, పికాసో, కోల్ పోర్టర్, హెమ్మింగ్వే వంటి పలు సాహితీవేత్తలూ,చిత్రకారులూ,సంగీతకారులూ ఈ సినిమాలో సజీవమైన పాత్రలుగా దర్శనమిస్తారు. నిడివి తక్కువున్నా ఆ పాత్రల్లో మా అందరికీ బాగా నచ్చిన పాత్ర హెమ్మింగ్వే ది. ముఖ్యంగా St.Michel ప్రాంతంలోని ఒక కేఫ్ లో హెమ్మింగ్వేకూ,హీరోకూ మధ్య జరిగే 4,5 నిముషాల సంభాషణ ముక్కుసూటి మనిషైన హెమ్మింగ్వే వ్యక్తిత్వాన్ని యధాతథంగా పట్టుకుందనిపించింది. ఆ సినిమా చూశాక హెమ్మింగ్వే పారిస్ అనుభవాల గురించి రాసిన 'ఎ మూవబుల్ ఫీస్ట్' చదవాలనిపించింది. సహజంగా ప్రకృతి వర్ణనలూ,ప్రదేశాల గురించి వర్ణనలూ చదవాలంటే నాకు చాలా విసుగు. అటువంటివి పుస్తకాల్లో చదవడంకంటే ప్రత్యక్షంగా చూడాలనుకుంటాను. కానీ 'మిడ్నైట్ ఇన్ పారిస్' సినిమా చూశాక పారిస్ ను హెమ్మింగ్వే కళ్ళతో మరోసారి చూడాలన్న కోరిక కలిగింది. దాని ఫలితమే ఇది.
పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు :
Don't you know all writers ever talk about is their troubles?
'Never to go on trips with anyone you do not love.'
In the end everyone, or not quite everyone, made friends again in order not to be stuffy or righteous. I did too. But I could never make friends again truly, neither in my heart nor in my head. When you cannot make friends any more in your head is the worst.
రచయితలకు హెమ్మింగ్వే పారిస్ లో తన అనుభవాల రూపంలో ఇచ్చిన సలహాలూ,సూచనలు :
After writing a story I was always empty and both sad and happy, as though I had made love, and I was sure this was a very good story although I would not know truly how good until I read it over the next day.
When I was writing, it was necessary for me to read after I had written. If you kept thinking about it, you would lose the thing that you were writing before you could go on with it the next day. It was necessary to get exercise, to be tired in the body, and it was very good to make love with whom you loved. That was better than anything. But afterwards, when you were empty, it was necessary to read in order not to think or worry about your work until you could do it again. I had learned already never to empty the well of my writing, but always stop when there was still something there in the deep part of the well, and let it refill at night from the springs that fed it.
All you have to do is write one true sentence. Write the truest sentence that you know.' So finally I would write one true sentence, and then go on from there. It was easy then because there was always one true sentence that I knew or had seen or had heard someone say. If I started to write elaborately, or like someone introducing or presenting something, I found that I could cut that scrollwork or ornament out and throw it away and start with the first true simple declarative sentence I had written. Up in that room I decided that I would write one story about each thing that I knew about. I was trying to do this all the time I was writing, and it was good and severe discipline.
It made me feel sick for people to talk about my writing to my face, and I looked at him and his marked-for-death look and I thought, you con man conning me with your con.
I've been wondering about Dostoevsky,' I said. 'How can a man write so badly, so unbelievably badly, and make you feel so deeply?
But Ezra, who was a very great poet, played a good game of tennis too. Evan Shipman, who was a very fine poet and who truly did not care if his poems were ever published, felt that it should remain a mystery.
'We need more true mystery in our lives, Hem,' he once said to me. 'The completely unambitious writer and the really good unpublished poem are the things we lack most at this time. There is, of course, the problem of sustenance.'
If a man liked his friends' painting or writing, I thought it was probably like those people who like their families, and it was not polite to criticize them. Sometimes you can go quite a long time before you criticize families, your own or those by marriage, but it is easier with bad painters because they do not do terrible things and make intimate harm as families can do. With bad painters all you need to do is not look at them. But even when you have learned not to look at families nor listen to them and have learned not to answer letters, families have many ways of being dangerous. Ezra was kinder and more Christian about people than I was. His own writing, when he would hit it right, was so perfect, and he was so sincere in his mistakes and so enamoured of his errors, and so kind to people that I always thought of him as a sort of saint. He was also irascible but so perhaps have been many saints.
When I woke with the windows open and the moonlight on the roofs of the tall houses, it was there. I put my face away from the moonlight into the shadow but I could not sleep and lay awake thinking about it. We had both wakened twice in the night and my wife slept sweetly now with the moonlight on her face. I had to try to think it out and I was too stupid. Life had seemed so simple that morning when I had wakened and found the false spring and heard the pipes of the man with his herd of goats and gone out and bought the racing paper.
But Paris was a very old city and we were young and nothing was simple there, not even poverty, nor sudden money, nor the moonlight, nor right and wrong, nor the breathing of someone who lay beside you in the moonlight.
By then I knew that everything good and bad left an emptiness when it stopped. But if it was bad, the emptiness filled up by itself. If it was good you could only fill it by finding something better.