గత రెండేళ్ళుగా నా చదువు ఫిక్షన్ కంటే సాహితీ విమర్శ, ఫిలాసఫికల్ కాన్సెప్ట్స్ చుట్టూనే ఎక్కువ తిరిగింది. ముఖ్యంగా లిటరరీ క్రిటిసిజం విపరీతంగా చదివితే ఫిక్షన్ చదవడంలో కిక్ పోతుందని మరోసారి అనుభవంలోకి వచ్చింది. ఒక పాఠకురాలిగా ఫిక్షన్ చదివితే ఉండే ఆనందం క్రిటిక్ లా చదివితే నిస్సందేహంగా ఉండదు. క్రిటిక్ కళ్ళు క్రాఫ్ట్ పై నుండి మరల్చడం కష్టం. కానీ ఫిక్షన్ చదవడంలో ఉండే ఆనందం ఎరుకలో ఉంది గనుక కాస్త విరామం తీసుకుంటే మళ్ళీ హ్యాపీగా చదువుకోవచ్చని మొనాటనీ బ్రేక్ చేస్తూ ఈసారి జానర్స్ మార్చాను. దీనికి తోడు ఈ మధ్య చదివిన జె.ఎమ్. కోట్జీ 'ది గుడ్ స్టోరీ' చాలా కాలంగా ముట్టని సైకాలజీని వెలికి తీయించింది. అందులో రాసిన కొన్ని అంశాలు నార్సిసిజం గురించి కావడంతో ఆ సబ్జెక్ట్ గురించిన పుస్తకాలు ఆన్లైన్ లో వెతికాను. దానికంటే ముందు ఈ అంశాన్ని గురించి ఎక్స్ప్లోర్ చేస్తూ చాలా సమయం కోరా లో,యూట్యూబ్ లో గడిపాను.
జూన్ ఒకటిని World Narcissistic Abuse Awareness Day గా జరుపుకుంటారు. యాదృచ్చికంగా ఈ నెలలో నార్సిసిజం గురించి అవగాహన కోసం ఏదో ఒక పుస్తకం చదువుదామని మొదలుపెట్టి నాకు తెలీకుండానే ఆసక్తితో ఒకదాని వెంబడి ఒకటి వరుసగా చాలా పుస్తకాలు చదివాను.
[ World Narcissistic Abuse Awareness Day on June 1 dedicates the day to education, support and effective change. Unlike physical abuse, narcissistic abuse leaves no physical marks. A form of Psychological and emotional abuse, it is invisible and difficult to prove.]
Image Courtesy Google |
'నార్సిసిజం'. ఈ రోజుల్లో ఈ మాటను చాలా క్యాజువల్ టోన్ లో వాడేస్తున్నాం. ఎవర్ని పడితే వాళ్ళని నార్సిసిస్టు అని బ్రాండ్ చేసేస్తున్నాం. కానీ 'నార్సిసిస్టిక్ అబ్యూజ్' బాధితులకు ఈ మాట వింటే వెన్నులోనుంచి చలి పుట్టుకొస్తుంది. NPD గురించి క్షుణ్ణంగా తెలిసినవాళ్ళెవరూ ఆ పదాన్ని తేలిక దృష్టితో వాడరు. ఎవరికైనా అనుభవంలోకి వస్తేనే గానీ అర్ధమయ్యే విషయం ఇది ఎంత మాత్రమూ కాదు. నార్సిసిజం గురించి ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఒక గొప్ప (?) నార్సిసిస్ట్ హెచ్.జి.ట్యూడర్ గురించి తెలిసింది. ఆయన తన క్లినికల్ థెరపీ స్టోరీలనూ, అనుభవాలనూ, నార్సిసిస్టిక్ వ్యూహాన్నీ,ప్రవర్తనా సరళినీ అనేక పుస్తకాలుగా ప్రచురించారు. ఇవి కాకుండా సైకోథెరపిస్టులూ,ప్రొఫెషనల్స్ రాసిన మరికొన్ని పుస్తకాలు ఆన్లైన్ లో లభించాయి. ఈ వ్యాథిని గురించి ఈ పుస్తకాల్లో చదివిన కొన్ని ఉమ్మడి అంశాలను మాత్రం ఈ వ్యాసంలో ప్రస్తావిస్తాను. నార్సిసిజం గురించి ఈ వ్యాసంలో ప్రస్తావించని అంశాలు చాలా ఉన్నాయి,ఇది కొండను అద్దంలో చూపించే ప్రయత్నం మాత్రమే.
నార్సిసిజంలో చాలా రకాలున్నప్పటికీ దాన్ని ప్రధానంగా ఓవర్ట్ నార్సిసిజం (ఎక్స్ట్రావర్ట్) ,కోవర్టు నార్సిసిజం (ఇంట్రావర్ట్) అని రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ఈ పుస్తకాల్లో రాసిన సింహభాగం అంశాలు లవ్ పార్టనర్స్ గురించీ,జీవిత భాగస్వాముల్ని గురించీ రాసినప్పటికీ నార్సిసిస్టులు అన్ని 'షేప్స్ & సైజెస్' లోనూ ఉంటారు. అంటే తల్లిదండ్రులూ ,తోడబుట్టినవాళ్ళూ,స్నేహితులూ, ప్రియుడూ,ప్రియురాలూ, బాస్ ,కలీగ్స్ ఇలా ఎవరైనా నార్సిసిస్టులు అయ్యే అవకాశం ఉంది. ఈ పుస్తకాల్లో నార్సిసిస్టిక్ రిలేషన్షిప్స్ లో కొనసాగుతున్న యువత గురించి ఎక్కువ రాశారు కాబట్టి వాటి గురించే నేను కూడా ప్రస్తావిస్తాను. సహజంగా నార్సిసిస్టులు అనగానే జబ్బు చేసిన మనుషుల్లా దీనంగా ఉండరు. ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్నట్లు ,పైకి చాలా ఛరిష్మాటిక్ వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వీళ్ళు ఓటమినెరుగని విజేతలు,పలు రంగాల్లో నిష్ణాతులూ, అన్ని విధాలా జీవితంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళూను. కానీ వీళ్ళు లోపల మాత్రం చాలా ఇన్సెక్యూర్డ్ గా, సాధారణ వ్యక్తులకంటే తీవ్రమైన ఆత్మన్యూనతతో ఉంటారు.
They will look you in the eyes, making you feel special and heard, make sounds and give looks that tell you they care, but they really don’t. They mirror your emotions, so it seems like they have empathy. They have observed and learned how to appear to care. They thrive off the attention of others. People that think or act as if they are amazing are their energy supply. They have people around them that adore them, respect them, revere them, see them as special and almost perfect, and in some cases seem to worship them.
I spoke with one woman who would watch her narcissistic mom observe other people’s insecurities and shower them with compliments and praise in those areas. The “targets” felt loved, seen, heard. Her mom didn’t care about these people. She only wanted to look good and be impressive. She was using them for the attention and admiration she received from them. They were her energy supply.
అహంకారం,అగ్గ్రెస్సివ్నెస్ లు ప్రధాన లక్షణాలుగా గల 'ఓవర్ట్ నార్సిసిజం' పైకి కనపడుతుంది కాబట్టి బాధితులు దానిని సులభంగా గుర్తించి జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది. కానీ ప్రమాదకరమైన 'కోవర్ట్ నార్సిసిజం' దారి వేరు,వీళ్ళతో చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉండే బాధితులకి తప్ప వాళ్ళు నార్సిసిస్టులని వేరొకరికి తెలిసే అవకాశం లేదు. చెప్పినా ఎవరూ నమ్మరు. ఎందుకంటే కోవర్టు నార్సిసిస్టులు చాలా దయగలవారుగా,ఉత్తములుగా పబ్లిక్ లో ఒక ప్రత్యేకమైన 'ఫేక్ ఇమేజ్' ని మైంటైన్ చేస్తారు. They are usually pathological liars and con artists. వీళ్ళతో ఏ సన్నిహిత సంబంధమైనా బాధితులకు నిరంతరం నిప్పులపై నడకలా ఉంటుంది (walking on eggshells). మైండ్ గేమ్స్ ఆడడంలో వీళ్ళు నిష్ణాతులు. పబ్లిక్ లో ఫేక్ పర్సనాలిటీస్ తో చీమకు కూడా హాని తలపెట్టని ఉదారమైన వ్యక్తుల్లా చెలామణీ అయ్యే వీళ్ళు కోవిడ్ వైరస్ లా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మిమ్మల్ని టార్గెట్ చేస్తే మీ వరకూ రావడానికి ఏదో ఒకదారి వెతుక్కుంటారు. ఏం జరుగుతోందో మీకు అర్ధమయ్యేలోగా మీరు హాస్పిటల్ బెడ్ మీద ఆక్సిజన్ మాస్క్ తో కొన ఊపిరితో ఉంటారు. శరీరానికి తగిలే దెబ్బలు పైకి కనిపిస్తాయి,సులభంగా మానిపోతాయి. కానీ కోవర్ట్ నార్సిసిస్టులు చేసే 'ఎమోషనల్ డామేజ్' పైకి కనిపించదు. చివరకు చాలా subtle గా నడిచే ఈ మొత్తం వ్యవహారంలో వీళ్ళు సాటి మనుషులకు చేసే హాని గురించి కొంచెం కూడా బాధ్యత తీసుకోకుండా తప్పించుకుంటారు. కానీ దురదృష్టవశాత్తూ ఈ మానసిక వ్యాథిగ్రస్తులకు వాళ్ళు చేసే నేరాలకు థెరపీలు తప్ప శిక్షలు లేవు. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే నార్సిసిజం అనే ఈ జబ్బుకి పూర్తి స్థాయిలో క్యూర్ చాలా కష్టమని స్వయంగా థెరపిస్టులు చెప్పడం.
నార్సిసిస్టులు టార్గెట్స్ గా ఎంచుకునే వ్యక్తులు కూడా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటారంటారు. నలుగురిలో నారాయణా అని ఉండే వ్యక్తులు వీరి 'స్టాండర్డ్స్' కు తగరు. వీళ్ళ టార్గెట్స్ ఇంటెలిజెంట్,స్మార్ట్,లవింగ్,కేరింగ్,ఎంపతీ ఉన్న మనుషులై ఉంటారనేది చాలా సర్వేల్లో వెల్లడైంది. ఎన్ని ప్రత్యేక లక్షణాలున్నా కోవర్ట్ నార్సిసిస్టిక్ అబ్యూజ్ ని తప్పించుకోవడం చాలా కష్టమనేది పలు మానసిక శాస్త్ర వేత్తల అభిప్రాయం. నిజానికి బాధితుల్లో ఈ ప్రత్యేకమైన లక్షణాలే వారిని నార్సిసిస్టులకు లక్ష్యాలుగా మారుస్తాయంటారు సైకాలజిస్టులు. దురదృష్టవశాత్తూ నూటికి 90 % బాధితులకు NPD విషయంపై కనీస అవగాహన ఉండదు. ఇంకా ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే,చివరకు సైకో థెరపిస్టులకు కూడా కోవర్ట్ నార్సిసిజం గురించి ఉండాల్సినంత అవగాహన లేదని ఈ పుస్తకాల్లో రాశారు.
I’ve come to believe that in order to really understand the nature of the covert narcissist, you have to have lived it. Whether it’s a spouse, significant other, friendship, boss, co-worker, neighbor or family member, the patterns are nearly identical and only someone who has been inside that nightmare can really know what the experience is like. Even then it’s hard to describe.
Many people who go to therapy to get help because they are depressed, low on energy, experiencing low self-esteem, feeling a lot of anxiety, and confusion usually have no idea that the cause of their issue is an abusive relationship, whether that is with a romantic partner, a parent, or a boss at work. Some victims become re-traumatized by a therapist or friend that doesn’t understand. Most therapists are not educated on the covert type of narcissism. Only the overt type is taught in higher education, so most understandably don’t recognize the signs and traits.
అసలు నార్సిసిస్టులకు ఏం కావాలి ?
నార్సిసిస్టులకు స్పష్టమైన 'సెల్ఫ్' అంటూ ఉండదు. సరళంగా చెప్పాలంటే వారొక ఖాళీ షెల్ లాంటివాళ్ళు. NPD ఉన్న వ్యక్తులకు అటెన్షన్ ఆక్సిజన్ తో సమానం. వాళ్ళకు తమలో ఉన్నాయనుకునే లోపాల్ని అధిగమించడానికీ, సెల్ఫ్ ఎస్టీమ్ పెంచుకుని మనసులో ఖాళీని పూరించుకోవడానికీ 'ఇగో బూస్ట్' అవసరమవుతుంది. దానిని వాళ్ళు ఎప్పటికప్పుడు తమ 'నార్సిసిస్టిక్ 'సప్లై' / 'ఫ్యూయల్' ద్వారా పూరించుకుంటారు. అది లేకపోతే వాళ్ళు ఇంధనంలేని వాహనంతో సమానం. ఇక్కడ 'సప్లై' అంటే ఏదో వస్తువనుకునేరు,మనుషులు. నిజానికి 'బాధితులు' అనడం సబబు. వాళ్ళు తమ టార్గెట్ ను ఎంచుకునే విషయంలో చాలా శ్రద్ధగా (picky) ఉంటారు. ఏదైనా రంగంలో నైపుణ్యం ఉన్నవాళ్ళో,ఛరిష్మాటిక్ మనుషులో, జాలీ,దయ, భావోద్వేగాలు, పాపులారిటీ ,అందచందాలు ఉన్నవాళ్ళో వీళ్ళని ఎక్కువ ఆకర్షిస్తారు.
Covert narcissists seek out certain types of people. They look for people who are kind, authentic, self-reflective, nurturing, loving, and caring people with a conscience. They look for energy supplies. Without these attributes, the narcissist has no use for you, and their manipulative tactics wouldn’t work on you.
తమ 'టార్గెట్స్' ని తమ వైపు తిప్పుకోవడం మొదలు వారి ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేసి,'ఎనర్జీ వాంపైర్స్' లా మారి spirit & soul ని క్రష్ చేసి,చెఱకు గడను పీల్చిపిప్పి చేసినట్లు వారిలో జీవితానందాన్ని,శాంతినీ,ఆత్మ విశ్వాసాన్నీ పూర్తిగా హరించేసే వరకూ నార్సిసిస్ట్టిక్ స్ట్రాటజీ మూడు దశల్లో జరుగుతుంది. ఇదంతా కేవలం మెదడుని బేస్ చేసుకుని భావోద్వేగాలతో ఆడుకునే ఆసక్తికరమైన ఆట.
1. ఐడియలైజేషన్ ఫేజ్ లేదా లవ్ బాంబింగ్ :
ఈ దశను సైకోథెరపిస్టులు నార్సిసిస్టిక్ రిలేషన్షిప్ లో 'గోల్డెన్ పీరియడ్' గా అభివర్ణిస్తారు. ఈ సమయంలో నార్సిసిస్ట్లు మిమ్మల్ని లిటరల్ గా ఒక దేవత/దేవుడి గా ఆరాధిస్తారు. విపరీతమైన అటెన్షన్,అఫెక్షన్ ఇస్తూ మీరు దివినుండి భువికి దిగి వచ్చిన వ్యక్తి ఏమో అనిపించేలా మీపై ప్రేమాభిమానాలు కురిపిస్తారు. మీమాటలో మాట కలుపుతూ, మీరిద్దరూ ఒకే ప్రపంచానికి చెందినవాళ్ళన్న భ్రమను కలుగజేస్తారు. మీకు క్లౌడ్ నైన్ లో ఉన్నట్లుంటుంది. నిజానికి నిజాయితీగా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు కూడా ఎప్పుడూ అంత ప్రేమ కురిపించి ఉండరు. మీ పట్ల వారి అబ్సెషన్ ను తప్పించుకోవడం అసాధ్యం. మునుపూ ముందూ ఎవరూ మిమ్మల్ని ఇంతలా ప్రేమించి ఉండరు. నార్సిసిస్టులు ఊసరవెల్లిలా ఎవరి సమక్షంలో ఉంటే వాళ్ళ అలవాట్లనూ,వ్యక్తిత్వాన్నీ ప్రతిబింబిస్తూ మీరూ,వాళ్ళూ ఒకే తత్వం కలిగిన వ్యక్తులని మీరు భ్రమపడేలా చేస్తారు. నిజానికి మీ భావోద్వేగాలతో సహా వాళ్ళు మిమ్మల్ని మిర్రర్ చేస్తూ ఉంటారు. చాలా మంది బాధితులు అబ్యూజ్ తరువాత థెరపీ సెషన్స్ లో,ఈ దశలో నార్సిసిస్టును తమ 'సౌల్ మేట్' అనుకున్నామని చెప్పారంటారు సైకాలజిస్టులు. ఈ దశ చివరకి వచ్చేసరికి నార్సిసిస్టుకు మీరు పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి వచ్చారన్న నమ్మకం కలుగుతుంది.
It is very common for targets to say, “We seemed so much alike.” This is because the covert narcissist mirrors you in the beginning, in a sense becomes you.
Covert Narcissists are often chameleons that become whoever they are around. They don’t have a strong sense of self. They pick up what a person wants, and they become that. Because of this, people are impressed with how well they can seem to relate to all types of people.
2. డీ వేల్యూ ఫేజ్: మీరు నార్సిసిస్టుతో ఒక కంఫర్టబుల్ దశకు చేరుకోగానే అసలు కథ మొదలవుతుంది. వాళ్ళకి ఇంటిమసీ ఇష్యూస్ ఉంటాయి. They are incapable of love. వాళ్ళు మిమ్మల్ని 'ఛేజ్' చెయ్యడంలో ఉన్న ఛాలెంజ్ ని మాత్రమే ఎంజాయ్ చేస్తారు. నార్సిసిస్టులకి కావాల్సింది మీపై కంట్రోల్ మాత్రమే,మీరూ,మీ ప్రేమా కాదు. మహా అయితే (మినిమం) రెండు నుండి (మాగ్జిమమ్) ఆరు నెలల్లో నావెల్టీ తగ్గగానే వాళ్ళకి మీరు బోర్ కొట్టేస్తారు, లేదా వారికి 'మెంటల్ స్టిమ్యులేషన్' ఇచ్చే మరో కొత్త 'సప్లై/విక్టిమ్' దొరుకుతుంది. లేదా అప్పటికే మీతో సంబంధం తెంచుకోక మునుపే వాళ్ళు కొత్త సప్లై తో 'ఐడియలైజేషన్ ఫేజ్' ని మళ్ళీ మొదలుపెట్టి ఉంటారు. ఈ ఆటను వాళ్ళు చాలా కాలంగా ఆడుతుంటారు కాబట్టి అందులో నిష్ణాతులు. తమ అమ్ముల పొదిలో 'రెడీమేడ్' అస్త్రాలైన మాటలూ,కథలూ,ప్రేమ లేఖలూ,మెసేజ్ లూ కాపీ పేస్ట్ లుగా వాళ్ళకి కూడా వెళ్తూ ఉంటాయి. ఈ పాటర్న్ రిపీట్ అవుతుంటుంది. విచిత్రమేంటంటే ఏకకాలంలో వాళ్ళు ఇలా కనీసం నాలుగైదు లేదా అంతకుమించి సంబంధాలు కూడా కలిగి ఉంటారంటారు సైకాలజిస్టులు. వాళ్ళకి 'ఇగో బూస్ట్' అవసరమైనప్పుడల్లా ఒక సప్లై నుంచి మరొక సప్లై కి అప్పటి మూడ్ ని బట్టి షిఫ్ట్ అవుతుంటారు.
They are generally successful and charming. Everyone loves them on a surface level. They tend to not have long-lasting friendships with people that really know them deeply. They may have friends that have known them for years but don’t really know them. Yet they are rarely without a partner. After they discard you, they usually move on quickly to another source, another target that will think they are so lucky to have found such a “nice guy” just like you did in the beginning.
Covert narcissists are likable to the outside world; they appear to be giving, humble, and kind. Image is the most important thing to them. These people are law-abiding citizens. They usually have well paying steady careers. They are not outwardly aggressive. You could know them for years and never see this side of them. This can change during the discard phase, which I’ll discuss in a later chapter. It is usually only the person that gets to know them intimately that sees the destructive traits. The rest of the world sees the façade, the “nice guy.” Many therapists don’t see through the mask and indeed are often impressed with how kind and aware they are.
ఇక నార్సిసిస్టుతో మీ హనీమూన్ పీరియడ్ పూర్తవుతుంది. 'లవ్ బాంబింగ్' ఫేజ్ తరువాత నార్సిసిస్టులు మునుపటిలా మీతో వ్యవహరించరు. వారు ప్రేమను సడన్ గా విత్డ్రా చేసుకుంటారు. మీరు నార్సిసిస్ట్ తో సంబంధంలో మీ ఎమోషన్స్ ని ఇన్వెస్ట్ చేసి ఉండడంతో హై డ్రగ్ అడిక్షన్ ఉన్న పేషెంట్ కి డ్రగ్స్ అందుబాటులో లేకుండా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మీ పరిస్థితి. వాళ్ళు హఠాత్తుగా ప్రేమ,అటెన్షన్ ఇవ్వడం మానేస్తారు. మీకు వచ్చే మెస్సేజెస్,కాల్స్ గణనీయంగా తగ్గిపోతాయి లేదా ఆగిపోతాయి. ఏం జరుగుతుందో అర్థంకాక మీరు గందరగోళానికి గురవుతారు,మీరేదో తప్పు చేశారేమో అని అనుకుంటారు, సమాధానాల కోసం వారిని రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు మీకు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా సాకులు చెప్పి తప్పించుకుంటారు. కానీ మధ్య మధ్య లో మీపై కంట్రోల్ పోకుండా కొద్ది మోతాదుల్లో 'లవ్ బాంబింగ్' దశను రిపీట్ చేస్తారు. కానీ మీ మీద చాలా subtle గా విమర్శలు,ఇన్సల్ట్స్ చేస్తూ ఉంటారు. ఈ దశ ఐడియలైజేషన్ కూ,డీవేల్యూ ల మేళవింపుగా ఉంటుందంటారు థెరపిస్టులు. మార్చి మార్చి ఒకసారి ప్రేమగా,మరోసారి క్రూరంగా మీతో వ్యవహరిస్తారు. మెదడు ఈ రెండు 'ఆపోజిట్ రియాలిటీల' ను ప్రక్కప్రక్కనే గ్రహించలేక విక్టిమ్ లో విపరీతమైన స్ట్రెస్,ట్రామా ఏర్పడుతుంది. దాన్నే సైకోథెరపిస్టులు 'కాగ్నిటివ్ డిసొనన్స్' అంటారు. (Cognitive dissonance is a catastrophic breakdown of steadfast beliefs and self-knowledge. It is the sense of complete confusion — an entire dissolution of clarity. It feels like mental torture. If you have been in a relationship of any kind with a narcissist, you will know this feeling well. ) ఈ దశలో నార్సిసిస్టులు మీలో సృష్టించిన 'Cognitive dissonance' తీవ్రమైన 'ఎమోషనల్ డేమేజ్' కు కారణమవుతుంది. నార్సిసిస్ట్లు 'కాగ్నిటివ్ డిసోనెన్స్' ని తమ ఆయుధంగా ఎలా ఉపయోగించుకుంటారో తరువాత ఓపికుంటే ఈ క్రింది లింక్ లో చదవండి.
https://medium.com/invisible-illness/on-cognitive-dissonance-61821269204
మీకు వారి వ్యక్తిత్వంపై అనుమానమొచ్చినా మీ ఇంస్టిక్స్ ని నమ్మలేరు. ఈపాటికే నార్సిసిస్టిక్ మానిప్యులేషన్ తో మీరు మీ 'సెన్స్ ఆఫ్ సెల్ఫ్' ని కోల్పోవడం మొదలవుతుంది. ఈ దశలో మీరు నార్సిసిస్టుల అబద్దాలనూ,మైండ్ గేమ్స్ నీ నమ్మి ఊరుకునే తెలివితక్కువ మనుషులైతే సరి, లేకపోతే మిమ్మల్ని దారికి తీసుకురావడానికి వారు చాలా శక్తిమంతమైన ఆయుధం అయిన 'సైలెంట్ ట్రీట్మెంట్' ను మీ మీద ప్రయోగిస్తారు. కానీ వాళ్ళతో 'గోల్డెన్ పీరియడ్' అనుభవించిన మీ మనసు మీ మాట వినదు. మీరు రిలేషన్షిప్ ఇష్యూస్ ని 'ఫిక్స్' చెయ్యడానికి పదేపదే ప్రయత్నిస్తారు. ఉపయోగం ఉండదు. మీరు విసిగిపోయి 'విత్ డ్రా' అయిపోయే ఆలోచనలో ఉంటే 'ఔట్ ఆఫ్ బ్లూ' మళ్ళీ ప్రత్యక్షమై నార్సిసిస్టులు మళ్ళీ మీమీద కొద్ది కొద్దిగా ప్రేమను ఒలికిస్తారు. దీన్ని 'బ్రెడ్ క్రంబింగ్' అంటారట. బిజీ అనో మరొకటనో అబద్ధాలు చెబుతారు, వాళ్ళని అర్ధం చేసుకోనందుకూ,అపార్థం చేసుకున్నందుకూ మిమ్మల్ని గిల్టీ ఫీల్ అయ్యేలా చేస్తారు. మీరు నిజమనుకుంటారు. అదే సమయంలో మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే దిశగా చాలా 'subtle' గా మీ మీద విమర్శలు చేస్తారు. మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టి మళ్ళీ ఓవర్ రియాక్ట్ అవుతున్నావంటారు. అప్పటికే మనసు పాడై ఏం జరుగుతోందో అర్థంకాని గందరగోళంలో మీరు ఆవేశంలో ఏమైనా అంటే ఎదురుతిరిగి వాళ్ళే విక్టిమ్ లా వ్యవహరిస్తారు. చివరకి మీమీద మీకే అపనమ్మకం కలుగుతుంది. శక్తివంతమైన 'నార్సిసిస్టిక్ మానిప్యులేషన్' సాలెగూడులో చిక్కుకుని Cognitive dissonance తో,సెల్ఫ్ డౌట్ తో మీ వాస్తవాన్ని మీరే ప్రశ్నించుకునే స్థితికి మిమ్మల్ని తీసుకువస్తారు. స్లో పోయిజన్ లా మిమ్మల్ని మానసికంగా నాశనం చేస్తారు.
You may be aware of the phrase ‘misery loves company’, and this couldn't be truer for a covert narcissist. They will, either consciously or unconsciously, spread their misery and unhappiness to those closest to them.
నార్సిసిజానికి సంబంధించి 'గ్యాస్ లైటింగ్' అనే ఒక పద్ధతి ఉంటుందట. [Gaslighting is a form of manipulation that attempts to grow seeds of doubt in a target. It is used to make you question your memory, your perception, and your own sanity. It makes you think something is wrong with you when it is not. Psychology Today defines gaslighting as “A tactic in which a person or entity, in order to gain more power, makes a victim question their reality.”] అంటే వాళ్ళు మీతో అన్నమాటల్ని అనలేదని బుకాయిస్తారు. వాస్తవాన్ని తిరగ రాస్తారు. చేసిన పనులు చెయ్యలేదని దారుణంగా మీ మొహం మీదే అబద్దాలు చెబుతారు. మీ మధ్య జరిగిన రియాలిటీని,సంభాషణాల్నీ ఎప్పటికప్పుడు తమకు అనుగుణంగా మార్చుకుంటూ 'హిస్టరీని రీ-రైట్' చేసుకోవడం నార్సిసిస్టుకి వెన్నతో పెట్టిన విద్య.
This gaslighting behavior can often make you think you're losing your mind, and make you question your perception of reality. This is known as ‘percepticide’.
*PERCEPTICIDE DEFINITION: a type of emotional abuse within a relationship, when one partner is so controlling over the other, that the victim loses their grasp on the truth and their sense of self.
ముఖ్యంగా కోవర్ట్ నార్సిసిస్టులు మ్యానిపులేషన్ టాక్టిక్ట్స్లో భాగంగా ఈ రకమైన వాక్యాలను విరివిగా ఉపయోగిస్తారట. తమ మాటలకీ చేతలకీ అకౌంటబిలిటీ తీసుకోకపోవడం,తమ ప్రవర్తనను బాధితుల మీద ప్రొజెక్ట్ చెయ్యడం నార్సిసిస్టుల ప్రధాన లక్షణం. ఈ పుస్తకాల్లో రాసిన వారి టెర్మినాలజీ చూద్దాం.
"అరే నీకలా అనిపించిందా ? నేనా ఉద్దేశ్యంతో అనలేదు".
"I'm sorry you feel that way."
"I never said that"
"She/ He is just a friend."
"You are so jealous, possessive and insecure."
"I was just joking."
"You are oversensitive / overreacting."
"You take everything very seriously."
3. డిస్కార్డ్ ఫేజ్ :
ఈ దశలో మీరు చూస్తున్న వ్యక్తికీ, మీకు ఐడియలైజేషన్ దశలో తెలిసిన వ్యక్తికీ ఎంతమాత్రం సంబంధం ఉండదు. నార్సిసిస్టు మాస్క్ పూర్తిగా జారిపోయి అసలు రూపం మీకు స్పష్టంగా కనిపించే దశ ఇది. ఈ సమయంలో ఏం జరుగుతోందో మీకు స్పష్టంగా అర్ధంకాకపోయినా ఏదో తేడా ఉందని మీ కామన్ సెన్స్ మీకు చెబుతుంది. నార్సిసిస్టుల మానిప్యులేషన్ కారణంగా ఇంతవరకూ మీరు మీ ఇన్స్టింక్ట్స్ నీ, గట్ ఫీలింగ్ నీ కూడా త్రోసిపుచ్చారు మరి. కానీ ఈ దశలో మీరు రెడ్ ఫ్లాగ్స్ ని గుర్తించడం మొదలవుతుంది. ఎందుకంటే మీ మానసిక/శారీరక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. మీరు నార్సిసిస్టుకి మునుపటిలా ఫ్యూయల్(మెంటల్ స్టిమ్యులేషన్/ఇగో బూస్ట్) ఇచ్చే పరిస్థితుల్లో ఉండరు. వారికి కావాల్సిన ఎమోషనల్/ఇగో బూస్ట్ మీరు ఇవ్వలేనప్పుడు మీ అవసరం వారికి లేదు, అంటే వాళ్ళకి మీరు తాత్కాలికంగా పనికిరారు..ఎందుకంటే ఎప్పుడూ లేనిది మీలో ఏంగ్జైటీ,రెస్ట్లెస్నెస్,గుండె వేగంగా కొట్టుకోవడం,డిప్రెషన్,fatigue ,స్కిన్ అలర్జీస్,స్ట్రెస్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. మీరున్నది టాక్సిక్ రిలేషన్శిప్లోనని మీరు గ్రహించకపోయినా మీ శరీరం గ్రహిస్తుంది.
మీరు వాళ్ళ ప్రవర్తన,మాటల వల్ల హర్ట్ అవుతున్నారని వాళ్ళకు ఎన్నిసార్లు అర్థమయ్యేటట్లు చెప్పడానికి ప్రయత్నించినా వారి తీరు మార్చుకోకపోవడంతో విసిగిపోయి మీరు సంబంధాన్ని తెంచుకోవాలనుకుంటారు. నార్సిసిస్టుకి ఇది సుతరామూ ఇష్టం ఉండదు. ప్రేమికుల్లా కాకపోతే కనీసం స్నేహితుల్లా ఉందామంటారు (స్నేహం ముసుగులో మునుపటి రొమాంటిక్ రిలేషన్షిప్ ఆశిస్తారు) మీపై వారి 'కంట్రోల్' వారికి ఇంధనం లాంటిది. అది వాళ్ళు వదులుకోడానికి ఇష్టపడరు. వారు అనుకున్నట్లు జరగకపోతే మీకు వారిపై ప్రేమ లేదంటారు,మీ సంతోషం మీరు చూసుకునే స్వార్థపరులని మిమ్మల్ని నిందిస్తారు. మిమ్మల్ని వదులుకోవడం ఇష్టంలేదంటారు. ఇదంతా మీపై ఉన్న ప్రేమని అనుకుంటే పొరబాటే. (వాళ్ళ కొత్త 'సప్లై' బోర్ కొడితే 'ఆల్టెర్నేటివ్ సప్లై' గా మీరు పనికొచ్చే అవకాశం ఉంది. అప్పటికప్పుడు మరో సప్లై దొరకడం కష్టం కాబట్టి వాళ్ళకి ఆ బ్యాక్ అప్ చాలా అవసరం. ఈ అంశంపై డాక్టర్ థెరెసా జె.కోవర్ట్ రాసిన పుస్తకంలో 'The Narcissist's Harem' అని ఒక చాఫ్టర్ చదివి తీరాల్సిందే. ఇందులో నార్సిసిస్టులు తమ పాత 'సప్లై' లను స్టోర్ చేసుకుని ఏ విధంగా రీసైకిల్ చేసుకుంటారో రాశారు) .వారి మాటలకీ చేతలకీ పొంతన లేకపోవడంతో మీరు తెగించి సంబంధాన్ని తెంచుకుంటే నార్సిసిస్టు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. మీకెంత ధైర్యం వాళ్ళని మీ జీవితంలోనుంచి బయటకు పంపించడానికి ? ఓవర్ట్ నార్సిసిస్టు ఆగ్రహం హింస,అబ్యూజ్ రూపంలో పైకి వ్యక్తమవుతుంది. కానీ కోవర్ట్ నార్సిసిస్టులు పైకి శాంతంగా ఉన్నా మిమ్మల్ని ఎలా నాశనం చెయ్యాలా అని మనసులోనే మైండ్ మ్యాప్ వేసుకోవడం మొదలుపెడతారు. నార్సిసిస్టులు ఈ సమయంలో మీతో సంబంధం వారికి ప్రయోజనకారి కాదనుకుని మిమ్మల్ని డిస్కార్డ్ చేసిన పక్షంలో మీరు నిజంగా అదృష్టవంతులే. మీకు చావుతప్పి కన్ను లొట్టపోయినా కొంత కాలానికి కోలుకుంటారు. కథ సుఖాంతమవుతుంది. మీరు టాక్సిక్ రిలేషన్షిప్ నుండి బయటపడిన స్వేచ్ఛా జీవులు. కానీ మీరు వారితో సంబంధం కలిగి ఉన్న సమయంలో 'నార్సిసిస్టిక్ ఇంజ్యూరీ' కి కారణమైనా,వాళ్ళ ఇగోని మరే విధంగా దెబ్బ తీసినా నరకానికి మీకు పునః స్వాగతం పలుకుతారు వాళ్ళు. మీకు వ్యతిరేకంగా 'Smear campaign' నిర్వహిస్తారు. అంటే మీ గురించి గాసిప్స్,రూమర్స్ రూపంలో దుష్ప్రచారాలు చేస్తారు. లేదా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు మీరు అగ్రెషన్ లో అన్న మాటలనో,సన్నిహితంగా ఉన్నప్పుడు మీరు పంచుకున్న రహస్యాలనో తమకు అనుకూలంగా వాడుకోడానికి కూడా వెనుకాడరు. ముఖ్యంగా కోవర్ట్ నార్సిసిస్టులు ఇదంతా తమంతట తాముగా చెయ్యరు. తెరవెనుక మీ గురించి అబద్ధపు ప్రచారాలు చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు. నిజానికి వాళ్ళు అత్యంత 'ప్రమాదకరమైన పిరికివాళ్ళు' . అందువల్ల నార్సిసిస్టిక్ అబ్యూజ్ లో చివరి దశ అయిన 'డిస్కార్డ్' ని మీకు విముక్తిగా భావించి సెలెబ్రేట్ చేసుకోమంటారు థెరపిస్టులు. నిజానికి రిలేషన్షిప్స్ లో కష్టనష్టాలూ,బ్రేకప్స్ సహజమే,సాధారణ సంబంధాల్లో వాటిని తీపి జ్ఞాపకాలుగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ నార్సిసిస్టుతో డీ-వేల్యూ,డిస్కార్డ్ ఈ రెండు దశలూ ట్రామాతో కూడిన పీడకలను తలపిస్తాయంటారు సైకాలజిస్టులు. నార్సిసిస్టులు ఈ రెండు దశల్లో చాకచక్యంగా మీ ఆత్మవిశ్వాసాన్ని సమూలంగా నాశనం చేస్తూ చేసే అవమానాలు మర్చిపోయి మీ 'సెన్స్ ఆఫ్ సెల్ఫ్' ని తిరిగి పొందడానికి ఎన్నో థెరపీ సెషన్స్ అవసరపడతాయంటారు.
As Jackson Mackenzie, bestselling author of Psychopath Free once said, from the moment you left, or were left, by the narcissist, you were given the first true compliment by the narcissist. You are now the narcissist's nightmare, the type of person he no longer wants and will want to avoid at all costs. And that is exactly who you will remain and strive to be, because rejection never felt so good - Becoming the Narcissist’s Nightmare: How to Devalue and Discard the Narcissist While Supplying Yourself - Shahida Arabi.
Image Courtesy Google |
ఈ పుస్తకాలన్నిటిలోనూ నార్సిసిస్టులని సమర్ధవంతంగా ఎదుర్కోగల ఒకే ఒక ఆయుధం 'నో కాంటాక్ట్' అని రాశారు. సరళంగా చెప్పాలంటే "పారిపోండి". వారి మానసిక వ్యాధికి మందు లేదు. మీరు వాళ్ళ విషయంలో రేషనల్ గా ఆలోచించడానికీ, నిజాయితీగా ముఖాముఖీ తలపడడానికి వాళ్ళు 'అప్ ఫ్రంట్' / 'ఫెయిర్' ఎనిమీస్ కాదు. అందువల్ల సోషల్ మీడియాలో అయితే అన్ని అప్లికేషన్స్ లోనూ కూడా వాళ్ళని బ్లాక్ చెయ్యడం కూడా చాలా ముఖ్యమంటారు. జీవిత భాగస్వామి నార్సిసిస్టు అయినా,మీరు పిల్లలతో ఉన్నా దురదృష్టవశాత్తూ మీకీ అవకాశం లేదు, నార్సిసిస్టులు లీగల్ గా,ఫైనాన్సియల్ గా మీకు చాలా సమస్యలు సృష్టిస్తారు. If they are not done with you yet,నార్సిసిస్టులు మిమ్మల్ని తిరిగి తమ కంట్రోల్లోకి తీసుకునే దిశగా 'డిస్కార్డ్' తరువాత 'హోవరింగ్' చేస్తారు. మిమ్మల్ని తిరిగి గెలుచుకోడానికి ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్నీ చేస్తారు. ఒకవేళ మీరు స్పందించకపోతే 'ఫ్లైయింగ్ మంకీస్' ని ఉపయోగించుకుంటారు.
'ఫ్లైయింగ్ మంకీస్' అంటే నార్సిసిస్టు కోటరీకి చెందిన మీ ఇద్దరి ఉమ్మడి స్నేహితులూ,బంధువులూ,కలీగ్స్,చివరకు మీ తల్లిదండ్రులు కూడా కావచ్చు. ఫ్లైయింగ్ మంకీస్ నార్సిసిస్టులను ఆరాధించే,ప్రేమించే నమ్మిన బంటులు. మిమ్మల్ని నిందిస్తూ,మీవల్ల తాము బాధపడినట్లు ఒక విక్టిమ్ గా వీళ్ళ దృష్టిలో కోవర్ట్ నార్సిసిస్టులు సానుభూతి సంపాదించుకుంటారు. విచిత్రమేమిటంటే 'ఫ్లైయింగ్ మంకీస్' కి తాము ఫ్లైయింగ్ మంకీస్ అనే స్పృహ ఉండదు. నార్సిసిస్టు ఆడుతున్న చదరంగంలో పావులమని తెలీక నార్సిసిస్టును రక్షిస్తున్నామనుకుంటూ 'విక్టిమ్ బ్లేమింగ్' చేస్తూ వీళ్ళు మీపై ప్రత్యక్ష,పరోక్ష యుద్ధానికి దిగుతారు.
మరి కొన్ని ఆసక్తికరమైన అంశాలు :
* నార్సిసిస్టుకి కావాల్సిన అటెన్షన్/ఇగో బూస్టింగ్ కేవలం పాజిటివ్ మాత్రమే కానక్కర్లేదు అంటారు ట్యూడర్. మిమ్మల్ని రెచ్చగొట్టాక మీవైపు నుండి నెగటివ్ రియాక్షన్ వచ్చినా కూడా అది వాళ్ళకి ఫ్యూయల్ గానే ఉపయోగపడుతుందట. ఎందుకంటే they feel they can still control you / manipulate you. ఆ ఫీలింగ్ ని వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు.
* ఒకసారి 'నో కాంటాక్ట్' కు వెళ్ళాక మళ్ళీ నార్సిసిస్టు 'హోవరింగ్' కి ప్రభావితమై వెనక్కి వెళ్ళారో ఈసారి పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు తాత్కాలికంగా మారినట్లు నటించినా మళ్ళీ త్వరలోనే తమ నిజస్వరూపం చూపిస్తారు. ఈసారి 'డిస్కార్డ్' రూపంలో మీకు పడే శిక్ష చాలా కఠినంగా,కౄరంగా ఉంటుంది. మీరు 'నో కాంటాక్ట్' తో వాళ్ళని వదిలేసి వెళ్ళి వాళ్ళని ఇగ్నోర్ చేసే ధైర్యం చేశారు,అందుకే వాళ్ళు మిమ్మల్ని శిక్షించాలనుకుంటారు.
* మీరు ఎపుడైనా ఒక నార్సిసిస్టుతో 'ట్రామా బాండ్' లో మాత్రమే ఉంటారు. నిజానికి నార్సిసిస్ట్లు మీతో రిలేషన్షిప్ లో ఉన్న సమయంలో కూడా మీలా (అంటే సాధారణ వ్యక్తుల్లా) తమ ఎమోషన్స్ ని ఇన్వెస్ట్ చెయ్యరు. కొత్త సప్లై దొరికి,మీతో అవసరం తీరగానే మిమ్మల్ని ట్రాష్ క్యాన్ లోకి విసిరికొట్టడం వాళ్ళకి చిటికెలో పని.
* ఓవర్ట్ నార్సిసిస్టులకు భిన్నంగా ఉండే కోవర్ట్ నార్సిసిస్టులు సమాజంలో చాలా మంచి/గొప్ప వ్యక్తులుగా ఒక ఫేక్ ఇమేజ్ ని ప్రొజెక్ట్ చేసుకుంటారు. ఈ మాస్క్ వారికి కర్ణుడికి కవచకుండలాలంత ముఖ్యం. ఆ ఇమేజ్ ను కాపాడుకోవడానికి వాళ్ళు ఏమైనా చేస్తారు. కానీ ఆ ఫేక్ ఇమేజ్ ని మోసుకుంటూ తిరగడం వల్ల త్వరగా సోషల్ రిలేషన్షిప్స్ లో exhaust అయిపోయి అలసిపోతుంటారు. అందుకే వారికి సర్ఫేస్ లెవెల్ లో ప్రపంచమంతటితో సంబంధాలున్నా ఎవరితోనూ లోతైన సంబంధాలు మాత్రం ఉండవు. చాలామందికి వారు తెలుసు,కానీ వాళ్ళేమిటో ఎవరికీ తెలీదు.
* నార్సిసిస్టులతో ఎలా వ్యవహరించాలి అని చాలా చోట్ల అడిగిన ప్రశ్నకు చాలామంది చెప్పిన ఒకే సమాధానం. "అసలు వ్యవహరించకండి." బ్రతుకుజీవుడా అనుకుంటూ బ్యాగ్ సర్దుకుని మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తండి. ఈ మాట రమణి దుర్వాసుల,డెబ్బీ మీర్జా,జార్జ్ కె.సైమన్ లాంటి పలు మానసిక నిపుణులు పదే పదే చెబుతున్నారు. నార్సిసిస్టులు సహానుభూతికీ,ప్రేమకూ అర్ధం తెలీని మనుషులు. 'ఫేక్ మాస్క్' జారిపోయి తమ వికృతమైన రూపం ఎక్కడ బయటపడుతుందో అని అనుక్షణం ఛస్తూ, ఎత్తులపైయెత్తులు వేసుకుంటూ బ్రతికే వారి ఖర్మకు వారిని వదిలెయ్యండి. ఇంటెగ్రిటీ,కన్సైన్స్,శాంతీ,స్థిరత్వం,స్వచ్ఛత,సంతోషం ఎరుగని వారి మానసిక వ్యాథే వారికి ఒక జీవితానికి సరిపడే శిక్ష. వాళ్ళు జీవితాంతం ఎలాగూ బ్రతికేది ఆ నరకంలోనే. వాళ్ళని ప్రత్యేకం శిక్షించే పని లేదు అంటారు సైకాలజిస్టులు.
* "మీరు నార్సిసిస్టిక్ అబ్యూజ్ బాధితులైతే ముందుగా పగిలిన ముక్కల్ని ఏరుకుని,వాళ్ళు నాశనం చేసి వదిలేసిన మీ మానసిక ఆరోగ్యం సంగతి చూసుకోండి. మానవత్వమున్న సగటు మనిషిగా వ్యవహరించినందుకు గిల్టీ ఫీల్ అవ్వకండి. తాత్కాలికంగా బాధపడినా మీరు ఇలాంటి అనుభవాలతో మరింత బలమైన వ్యక్తిగా,వివేకవంతులుగా పరిణామం చెందారు,మరో జీవిత పాఠం నేర్చుకుని మరో మెట్టు పైకెక్కారు." అని అంటారు సైకో థెరపిస్టులు. నార్సిసిస్టిక్ రిలేషన్షిప్ నుండి బయటపడడం ఒక కల్ట్ నుండి బయటకు రావడంలా,డ్రగ్ అడిక్షన్ మానెయ్యడంలా ఉంటుందని సైకోథెరపిస్టులు అనడం ఈ సమస్య తీవ్రతను చెబుతుంది.
ఈ రోజుల్లో 'స్వేచ్ఛ' కు ఉన్న నిర్వచనాలు మారిపోయాయి. డేటింగ్,లివ్ ఇన్ రిలేషన్షిప్స్,కోర్టింగ్,ఫ్లర్టింగ్ లాంటివి సర్వసాధారణమైపోయాయి. మనం మార్పుని ఆపలేం. ఆపవలసి అవసరం కూడా లేదు. కాలం మారింది. కాలంతో పాటు మనమూ మారాలి. కానీ మన ముందు తరాల్ని ఆ మార్పులను తట్టుకునేలా సిద్ధం చెయ్యవలసిన అవసరం కూడా ఉంది. లేకపోతే ముక్కుపచ్చలారని టీనేజీలోనే సెక్సువల్,ఎమోషనల్ అబ్యూజ్ లాంటివాటికి గురైతే వారు ఆ పీడకలలతో జీవితాంతం జీవించాలి. దురదృష్టవశాత్తూ మన దేశంలో సెక్సువల్ అబ్యూజ్ పట్ల ఉన్న అవగాహన ఎమోషనల్ అబ్యూజ్ పట్ల లేదు. ఈ పుస్తకాలు చదివితే రెండూ సరిసమానంగా హేయమైనవని అర్థమవుతుంది. మీ పిల్లలు యుక్త వయస్సులో వారైతే ఈ పుస్తకాలు మీరు చదివి,వాళ్ళతో కూడా తప్పకుండా చదివించండి.
Most people I talked to struggled to describe the relationship. This is common. There was a perpetual confused look on each face. It can be difficult to explain because the abuse is so hidden and subtle. They weren’t yelled at or physically abused. There are no visible scars. Yet the impact it makes on the psyche is profound.
చివరగా,ఇటువంటి అనుభవాలు మనిషిలో సాటి మనిషిపట్ల నమ్మకాన్ని సమూలంగా నాశనం చేసేస్తాయి. కొందరు వ్యక్తుల కారణంగా ఈ ప్రపంచంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టే మీ సహజసిద్ధమైన 'సెల్ఫ్' ని కోల్పోకండి. ఈ లోకంలో మంచి-చెడు సరిసమానంగా ఉంటాయని గుర్తెరిగి మసలుకుంటే చాలు.
డిస్క్లైమర్ : ఎగిరే కోతుల్లోనో ,యజమానుల్లోనో ,బాధితుల్లోనో మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకున్నారా ? అయితే అది ఖచ్చితంగా మీ గురించే. ఈ సంకెళ్ళనుండి మిమ్మల్ని ఎవరైనా కాపాడగలిగితే అది మీరు మాత్రమే.
ఈ క్రమంలో నేను చదివిన కొన్ని పుస్తకాలు :
* The Covert Passive Aggressive Narcissist : Recognizing the Traits and Finding Healing After Hidden Emotional and Psychological Abuse - Debbie Mirza
* No Contact: How to Beat the Narcissist - H G Tudor
* Covert Narcissism - Louisa Cox
* The Covert Narcissist: Recognizing the Most Dangerous Subtle Form of Narcissism and Recovering from Emotionally Abusive Relationships - Dr.Theresa J. Covert
* Should I Stay or Should I Go?: Surviving a Relationship with a Narcissist - Ramani Durvasula
* In Sheep's Clothing: Understanding and Dealing With Manipulative People - Simon, George K., Jr.
* Becoming the Narcissist’s Nightmare: How to Devalue and Discard the Narcissist While Supplying Yourself - Shahida Arabi.
పుస్తకాల నుండి కొన్ని వాక్యాలు :
What you have been through is not a small thing. There are several types of narcissists. The covert type is one of the most destructive to your heart, psyche, and physical body because it is so hidden, unrecognizable, and you are usually the only one that sees it. People who know the narcissist in your life probably think they are one of the nicest people they’ve ever met and often wish they could be as lucky as you to have a mom, husband, dad, wife, boyfriend, boss, or friend like you do. They feel the same way you did, maybe for a long time, about the covert narcissist in your life. They have experienced the same illusion, just not identified the truth.
Here is the truth. If you have lived with a covert narcissist, you have been held down for a long time. You have experienced the illusion of love, not the real thing. You have been lied to, manipulated, and controlled. You have not been heard or valued. You were devalued and brutally discarded by someone who said they cared about you, but in fact only cared about themselves. You have experienced a crazy-making relationship that is difficult to describe. Your self-confidence, your zest for life, your adventurous spirit, the light inside you has slowly dimmed; there is part of you that may not want to be here anymore but is scared to say that out loud or to anyone else. I understand. I’ve been there. This is incredibly common among survivors.
Empathy is what will change this world. Empathy is what heals. Empathy is what enables us to experience real connection with each other. Empathy is what allows us to see the things that really matter. When someone doesn’t have empathy, it is almost like they have a black hole inside of them. They don’t have that warm core spark of life within them. As a result, they cannot ever fully feel the magic of a sunset, the feeling of real connection, or the transcendent experience of real love. Someone without empathy is in survival mode. They end up feeding off other people’s energy since they are devoid of it. They find people who have life, who have connection, who have empathy and real love, then drain them of their own supply of energy. This is why the CN in your life chose you, and this is why he or she moved on to someone else so quickly.
Wah, what a great reasearched article! I owe you a lot for this naagini.
ReplyDeleteThank you Aruna garu :)
DeleteVery enlightening article.Thank you Nagini.
ReplyDeleteThank you so much Satyavathy garu :)
DeleteEntha detailed ga cheppave. Excellent.
ReplyDeleteWe should educate our children also for the same. Thank you for your nice article.
Thank you so much.This was happened to me practically.I got the solution now.
DeleteThank you very much
Thank you Mohini :)
Delete@Unknown,you most welcome.
DeleteExcellent Naagini. I am reading this again and again. You put your heart in this. There are so many silent victims around us. Thank you so much. I wish this appears in mainstream media for more reach.
ReplyDeleteThanks a ton Sujatha garu :)
DeleteNaagini Kandala gru...great work. applaudable
DeleteExcellent ....
ReplyDeleteThank you :)
DeleteThanks for the information
ReplyDeleteThis helped me I am grateful 🙏
ReplyDeleteYou most welcome :)
DeleteI cannot tell you how much this blog has helped me! Thank you
ReplyDeleteThank you for dropping by :)
DeleteMam, i am suffering with my covert narcissist wife....she was already isolated me from my parents, sisters and even friends.....now she is in discard stage but my worry is about my innocent daughter who is of just 2 years of age. What i have to do is a big?
ReplyDelete