కర్ట్ వన్నెగట్ నీ, మారియో వర్గస్ లోసానీ చదివాకా కాస్త లైట్ రీడ్ ఏదైనా చదువుదానిపించింది..గత ఏడాది మొదలుపెట్టి కొన్ని పేజీలు చదివి ప్రక్కన పెట్టి, కొత్త పుస్తకాల మోజులో పడి మర్చిపోయిన 'జేన్ ఆస్టెన్ ఎడ్యుకేషన్' జ్ఞాపకం వచ్చింది..అమెరికన్ రచయిత William Deresiewicz ఆస్టెన్ నవలలు తన జీవితంపై ఎటువంటి ప్రభావం చూపించాయో వివరిస్తూ రాసిన ఈ పుస్తకంలో ఆస్టెన్ ఆరు నవలలు ఎమ్మా,ప్రైడ్ అండ్ ప్రిజుడిస్,Northanger Abbey, Persuasion, Mansfield Park,సెన్స్ అండ్ సెన్సిబిలిటీలను గురించి చర్చిస్తూ కొన్ని వ్యాసాలు రాశారు..ఈ రచన కొంత మెమొయిర్ గానూ,కొంత విమర్శగానూ కనిపిస్తుంది..సహజంగా ఉన్నతమైన సాహితీవిలువలతో కూడిన పుస్తకాలు చదివేవాళ్ళకు స్త్రీ రచయితలు ,అందునా ఆస్టెన్ లాంటి రచయితల రచనల పట్ల చాలా చులకనభావం ఉంటుంది..చాలామంది ఆస్టెన్ పేరు వినగానే "ఆహ్ గర్లీ రొమాంటిక్ జానర్" అంటూ పెదవి విరవడం చూస్తుంటాం..కానీ నా వరకూ జేన్ ఆస్టెన్ ప్రస్తావన లేకుండా బ్రిటిష్ సంస్కృతీ సంప్రదాయాల గురించి మాట్లాడడం అసంభవం..ఇంగ్లీష్ నవల,సాహితీ విలువల గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు ఎవరికైనా ప్రప్రథమంగా గుర్తొచ్చేది ఆస్టెన్ పేరు మాత్రమే..ఆమె ఒక తరపు సంస్కృతికి తన రచనల్లో ప్రాణంపోశారు..ఆమెకు సమకాలీనులైన పురుష రచయితలెందరున్నా ఆస్టెన్ మాత్రమే ఇంగ్లీష్ నవలకు ఆద్యురాలు అనడానికి అన్ని విధాలా అర్హురాలు అనిపిస్తుంది..సరళమైన స్త్రీ సాహిత్యమని ఎందరు విమర్శించినా ఆమె ఇంగ్లీష్ సాహితీలోకాన్ని అప్పుడూ,ఇప్పుడూ కూడా శాసిస్తున్నారనేది నిర్వివాదాంశం.
|
Image Courtesy Google |
తన గురువైన సోక్రటీస్ తనకు కథలు చెప్పిన విధానం గురించి ప్లేటో ఈ విధంగా అంటారట : “His words are ridiculous when you first hear them, for his talk is of pack-asses and smiths and cobblers . . . so that any ignorant or inexperienced person might feel disposed to laugh at him; but he who sees what is within will find that they are the only words which have a meaning in them, and likewise the most divine.” . జేన్ ఆస్టెన్ కథలు కూడా చదివేవాళ్ళకి ఇలాగే అనిపిస్తాయి..ఆమె పాఠకుల స్థాయికి దిగి వాళ్ళను తన ప్రపంచంలోకి ఇట్టే లాక్కెళ్ళిపోతారు..నా వరకూ జేన్ ఆస్టెన్ రచనల గురించి కొత్తగా చర్చించడానికేం లేదు..అది అమ్మ ప్రతీ ఏడూ పెట్టే ఆవకాయ ఘనతను పొగడడంలా ఉంటుంది..చాలామందికి లాగే ఆస్టెన్ నవలలు చిన్నతనంలో నా వ్యక్తిత్వ నిర్మాణంలో కూడా ప్రధాన పాత్ర పోషించాయి,ఒకప్పటి నా ఆలోచనా సరళిని తీవ్రంగా ప్రభావితం చేశాయి..కానీ ఇందులో రచయిత ఆస్టెన్ నవలల గురించిన రాసిన వ్యాసాల ద్వారా పాఠకుల మదిలో కొన్ని వినూత్నమైన ప్రశ్నలు రేకెత్తిస్తారు : చదువు అనేది ఏమిటి ? ఎందుకు ? మనం చదివే చదువు జీవితాన్ని సుగమం చేసుకోవడానికా లేక ఇంకా సంక్లిష్టం చేసుకోడానికా ?
ఎంత చదువు చదివినా మనం సాటి మనిషితో వ్యవహరించే తీరు మాత్రమే మన సంస్కారం గురించి చెప్తుంది అంటూ ఉంటారు..జేన్ ఆస్టెన్ నవలలు పాఠకులకు అటువంటి సంస్కార జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి.."జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ది హిల్" తరహా ఎందుకూ పనికిరాని బోధనా పద్ధతులతో కూడిన నేటి విద్యావిధానంలో అటువంటి కీలకమైన చదువు లోపిస్తోంది..సామజిక మర్యాద,నైతిక విలువలు,నీతిని బోధించే కథలూ,పద్యాలతో కూడిన చదువు సెక్యులర్ భావజాలాల ఒత్తిడి క్రింద నలిగి మృగ్యమైపోయిందని సి.యస్.లూయిస్ కూడా హెచ్చరించారు..దీనికి తోడు నేటి సాంకేతిక విద్యా విధానాలు మనిషి వ్యక్తిత్వ నిర్మాణానికి అవసరమైన మౌలిక విద్యా విధానాన్ని అమలు చెయ్యడంలో ఘోరంగా విఫలమవుతున్నాయి..ఈ తరంలో (a + b ) 2 = a 2 + b 2 + 2 a b అని తడుముకోకుండా చెప్పగలిగిన చిన్నారులు మానవీయ విలువలు, ప్రాథమికావసరమైన సోషల్ కాండక్ట్ విషయంలో మాత్రం చాలా వెనుకబడి ఉన్నారు..సరిగ్గా ఇక్కడే 'జేన్ ఆస్టెన్ ఎడ్యుకేషన్' ప్రత్యేకతను గుర్తుచేస్తారు విలియం..ఆస్టెన్ ను చదివే ముందు తన ప్రవర్తన,మాటలు ఎదుటివారి పట్ల ఎటువంటి దుష్ప్రభావం చూపిస్తాయో గ్రహించలేని అహంకారి ఆధునిక యువకుడిని నేను అంటారాయన..ఆయన ఎవరితో మాట్లాడినా తన విజ్ఞాన ప్రదర్శనతో వారిని తీసిపారెయ్యడమో లేదా తన అపరిమితమైన తెలివితేటలతో వారిని చిన్నబుచ్చడమో చేసేవారే తప్ప సాటి మనిషి పట్ల సహానుభూతి ఉండేది కాదట..కొలంబియా యూనివర్సిటీలో విద్యార్థులకు ఇంగ్లీష్ బోధించే ప్రొఫెసర్ స్థాయిలో ఉన్నప్పటికీ తన ప్రవర్తనలో సరిదిద్దుకోవాల్సిన లోపాలు అనేకం ఉన్నాయని ఆస్టెన్ ను చదివాకా గానీ తనకు అర్ధమవ్వలేదంటారాయన..
Above all, I started paying attention to what the people around me might be feeling and experiencing in relation to me—how the things I said and did affected them. Surprise, surprise, a lot of those things really pissed them off. If you’re oblivious to other people, chances are pretty good that you’re going to hurt them. I knew now that if I was ever going to have any real friends—or I should say, any real friendships with my friends—I’d have to do something about it. I’d have to somehow learn to stop being a defensive, reactive, self-enclosed jerk.
కానీ నబకోవ్ మార్మిక పదజాలం, జోయ్స్ పదగాంభీర్యాలతో కూడిన అల్లికలూ,ఘనమైన చారిత్రాత్మక వివరాలూ వంటి ఉన్నతమైన సాహిత్యం చదవడం అలవాటైన తనకి ఆస్టెన్ ని మొదటిసారి చదివినప్పుడు "ఏమిటీ ఏ ప్రత్యేకతా లేని రోజువారీ సంగతులతో కూడిన ఈ సరళమైన వాక్యనిర్మాణం" అనిపించింది అంటారు విలియం.
He did things “in his own way,” “as he liked,” and “on his own terms.”This, I now saw, was how all of Austen’s language worked. No strain, no display, no effort to awe or impress. Just everyday words in their natural order—a language that didn’t call attention to itself in any way, but just rolled along as easily as breathing. It wasn’t the words that Austen used that created her effects, it was the way she used them, the way she grouped and balanced them. And so it was, I saw, with her characters. A thousand authors could write novels about ordinary people, but only one of those books would be Emma.
ఆస్టెన్ నవలల్లో ప్రత్యేకత ఏమిటంటే ఆవిడకు తాను సృష్టించిన ప్రతి పాత్ర పట్లా అపరిమితమైన ప్రేమ,సహానుభూతి ఉండేవి..ఎన్ని లోపాలున్నా ప్రతీ మనిషీ తనదైన ప్రత్యేకతను కలిగి ఉంటాడని బలంగా నమ్మేవారు ఆస్టెన్..ఆస్టెన్ రోజువారీ జీవితంలో సర్వసాధారణమైన విషయాల గురించి రాసేవారంటే ఆవిడకి రాయడానికి ఇంకే ముడిసరుకూ దొరక్క కాదు , దైనందిన జీవితంలో మనం నిర్లక్ష్యం చేసే విషయాల ప్రాముఖ్యతను చాటిచెప్పాలని చేసిన ప్రయత్నం మాత్రమే..All that trivia hadn’t been marking time until she got to the point. It was the point. Austen wasn’t silly and superficial; she was much, much smarter—and much wiser—than I could ever have imagined. అంటారు రచయిత.
ఎమ్మా నవలలో జేన్ ఫైర్ఫాస్ ఉత్తరాలు దాచిన చోటు గురించో ,పిల్లలు జాన్,హెన్రీ ల తెలివితేటల గురించో వర్ణనలు చదువుతున్నప్పుడు ఇలాంటి ప్రాముఖ్యతలేని విషయాలు మనకెందుకబ్బా అనిపించక మానదు..కానీ తన పాత్రలకి అవన్నీ ప్రాధాన్యతతో కూడిన అంశాలు కాబట్టి అవి తనకు కూడా అవసరం అనుకుంటారు ఆస్టెన్..నిజానికి ఇలాంటి మామూలు విషయాలే వాళ్ళ జీవితానికి రంగూ,రుచీ ఇచ్చి నేతలోని దారప్పోగుల అమరికలా ఒక ఆకృతినిస్తాయి కదా..అందుకనే మనం ఏవైనా నవలలు చదువుతున్నప్పుడు అడ్రినలిన్ రష్ తో ప్రకంపనలు సృష్టించే సాహసోపేతమైన అంశాలనూ, ప్రేమలూ,సంక్షోభాలూ లాంటి గొప్ప గొప్ప విషయాలనూ ,ఒక్కోసారి కథ నేపథ్యాన్నీ కూడా దాటుకుని మనం రోజూ విస్మరించే ప్రాముఖ్యతతో కూడిన చిన్న చిన్న విషయాలపై దృష్టి పెట్టమని ఆస్టెన్ సూచిస్తారు..మీ ఇరుగుపొరుగులు చెప్పే గాసిప్స్ , మీ ప్రక్కింటి పాలబుగ్గల చిన్నారి కబుర్లు ,నీ స్నేహితురాలు వీకెండ్ పార్టీ లో విన్న విషయాలూ ,నీ మేనల్లుడికి పది షాపులు వెతికి మురిపెంగా కొన్న కారు బొమ్మా ఇలాంటి రోజువారీ జీవితంలో గంట గంటకీ జరిగే సాధారణ విషయాలన్నీ కలిసే కదా సంవత్సరం ముగిసేసరికి జీవితానికి ఒక పరిపూర్ణతను ఆపాదిస్తాయి..జీవితాన్ని నిర్వచిస్తాయి..నిజానికి ఆస్టెన్ తన రచనల్ని ఎవరి కోసమో రాయలేదు.. “I do not write for such dull Elves,” she said of Pride and Prejudice, adapting some lines of poetry, “As have not a great deal of Ingenuity themselves." అంటారావిడ.
ఆస్టెన్ ను చదవడం నల్లేరు మీద నడకలా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే..పదగాంభీర్యాలు లేకుండా చెప్పాలనుకున్న విషయాలను స్పష్టమైన,సరళమైన వాక్య నిర్మాణంతో చెప్పడంలో ఆస్టెన్ తరువాతే ఎవరైనా..దీనికి తోడు ఆమె కాల్పనిక సాహిత్యంలో అంతర్లీనంగా వ్యక్తిత్వవికాసానికి సంబంధించిన పాఠాలు కూడా ఉంటాయి..ఆస్టెన్ రచనల్లో పిల్లల పెరుగుదల గురించి రాసిన అంశాలు పరిశీలిస్తే ఆమె వాళ్ళలో సౌందర్యం,సృజనాత్మకత, తెలివితేటలు లాంటి అంశాలకు కాకుండా వారి ప్రవర్తనకూ ,స్వభావానికి, సానుభూతితో కూడిన వ్యక్తిత్వానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు అవగతమవుతుంది.. She watched her nieces and nephews grow; she shaped that growth when she could; she knew that it would be a difficult process. Austen understood that kids are going to make mistakes, and she also understood that making mistakes is not the end of the world..ఇక మగవారి విషయంలో నలుగురు కలిసి ఒకచోట కూడి మాట్లాడుకోవడం అంటే స్టాక్ మార్కెట్స్ గురించో,జాతీయ,అంతర్జాయ రాజకీయాల గురించో,ఆర్ధిక వ్యవస్థ ,గ్లోబల్ వార్మింగ్ etc. etc. లాంటి ఘనమైన విషయాల గురించి మాత్రమే..కానీ ఆస్టెన్ మగవారు సర్వసాధారణంగా విస్మరించే అంశాలకు ప్రాధాన్యతనిస్తారు అంటూ , She had shown us, in other words, what it means to see and think and talk like a woman. అంటారు విలియం.
ఇందులో మిగతా వ్యాసాల కంటే సహజంగానే ప్రైడ్ అండ్ ప్రిజుడిస్ గురించి రాసిన వ్యాసం నాకు ఎక్కువ నచ్చింది..ఆస్టెన్ నవలా నాయికలందరూ సుమారు పదహారు,ఇరవయ్యేళ్ళ లోపు వారే..మనం వారి వెంటే నడిస్తే , వారు ప్రతి మనిషీ ఎదుగుదలలో భాగంగా చేసే తప్పులు చెయ్యడం చూస్తాం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం చూస్తాం..అపరిపక్వ స్థాయి నుండి పరిపక్వతవైపు ఆత్మవిశ్వాసంతో అడుగులు వెయ్యడం గమనిస్తాం..ఇరవైల వయసులో వయసుకి మించిన వివేకం కలిగిన ఎలిజబెత్ బెన్నెట్ కు తన తెలివితేటలూ,జడ్జిమెంట్ ల పట్ల అపారమైన నమ్మకం..ఆమె ఇంట్లో తండ్రి తరువాత అంత తెలివైన మరో వ్యక్తి ఎలిజబెత్ మాత్రమే..కానీ కథ ముందుకుసాగే కొద్దీ ఆమె అనేక విషయాల్లో తప్పటడుగులు వెయ్యడం చూస్తాం..అసలీ నవలకు 'ఫస్ట్ ఇంప్రెషన్స్' అని పేరు పెడదామనుకున్నారట ఆస్టెన్..ఎలైజా డార్సీని తొలిసారి కలిసినప్పుడు ఆమె గురించి “She is tolerable; but not handsome enough to tempt me; and I am in no humour at present to give consequence to young ladies who are slighted by other men" అని డార్సీ అన్న మాటల్ని పట్టుకుని గర్విష్టిగా,స్నేహభావం తెలియనివాడిగా అతడి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుందామె ,ఫస్ట్ ఇంప్రెషన్ అన్నమాట..దానికితోడు విక్హమ్ ను బాల్ కు పిలవకపోవడం,అతణ్ణి తిరస్కారభావంతో చూడడం లాంటివి కూడా ఎలైజాకు డార్సీ గురించి విముఖత ఏర్పడడానికి కారణమవుతాయి..కంటికి కనిపించేదే నిజం అనుకోవడం, మెరుపు వేగంతో ఒక నిశ్చయానికి వచ్చెయ్యడం ఆమెలోని వ్యక్తిత్వ లోపం..కానీ నవల చివరకు వచ్చేసరికి ఆమె తన తప్పులు తెలుసుకుంటుంది..తప్పులు చెయ్యడం,సరిదిద్దుకోవడం మానసిక పరిణితి చెందడంలో భాగం అని ఈ నవల నేర్పిస్తుంది అంటూ , Finally, by reading Pride and Prejudice, I had come to understand it, too. Being right, Austen taught me, might get you a pat on the head, but being wrong could bring you something more valuable. It could help you find out who you are. అంటారు విలియం.
“First impressions”: it seemed to me now that the phrase did double duty. It referred to the heroine’s tendency to jump to conclusions, and it also pointed to ours, as we put ourselves in her place.
ఇక ఎలైజా అంటే ఎంత అభిమానమో ఎమ్మా అంటే అంత చిరాకు నాకు..ఎమ్మా ను చదివినప్పుడు తాను మాత్రమే చాలా తెలివైన దాన్ననీ,మిగతా అందరూ వెర్రివాళ్ళనీ అనుకునే ఆమె మూర్ఖత్వానికీ,అమాయకత్వానికి జాలి అనిపిస్తుంది..నవల మొదట్నుంచీ తన అతి తెలివితేటలతో అందరి సొంత విషయాల్లోనూ కలుగజేసుకుని సమస్యలు తెచ్చిపెట్టే ఎమ్మాను భరించడం చాలా కష్టం..ఎదురుపడితే "కుదురుగా అందరి జీవితాల్లో వేలు పెట్టకుండా నీ పని నువ్వు చూసుకోలేవా అమ్మాయ్" అని మొహం తగలెయ్యాలనిపిస్తుంది..మంచి ఉద్దేశ్యంతోనే అయినప్పటికీ ఆమె ఆలోచించకుండా తీసుకునే తొందరపాటు నిర్ణయాలు ఆమె చుట్టూ ఉన్న వ్యక్తుల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయనే గ్రహింపు ఆమెలో శూన్యం..కానీ ఆమెను గమనిస్తే మనలో చాలా మందిలో కూడా ఇదే లోపం ఉందని అర్ధమవుతుంది..కానీ ఈ నవలలో నచ్చే విషయమేమిటంటే కథానాయిక అనగానే ఆమెను ఏ లోపమూ లేని దేవతలా చిత్రించే ప్రయత్నం చెయ్యరు ఆస్టెన్..నిజానికి ఈ నవలలో మిగతా పాత్రలు ఆమె కంటే ఎక్కువ వివేకంతో వ్యవహరిస్తాయి..హారియట్ స్మిత్, జేన్ ఫైర్ఫాక్స్ లాంటి మిగతా పాత్రలు కూడా ఎమ్మా తో సరిసమాన ప్రాధాన్యత కలిగి ఉంటాయి..నేను/నాది అంటూ వ్యక్తిప్రధానంగా మారిన నేటి తరానికి ఎమ్మా ఒక సున్నితమైన హెచ్చరికలా ఉంటుంది.
A book, to be really valuable, had to offer truths that seemed as recondite as metaphysics and as final as Scripture—had to promise to reveal the nature of language, or the self, or time. Modernism was superior art for superior people, or so that snobbiest of literary movements believed. No wonder I disdained the herd; I’d learned that pose from T. S. Eliot and Vladimir Nabokov, every line of whose work strutted its contempt for ordinary people. Emma refuted the notion that great literature must be difficult, and it also rebuked the human attitudes that that idea was designed to justify. I still loved modernism, I just no longer believed it was the only way to make art, and I certainly didn’t think that it was way to live.
ఇదంతా చదివాక, ఆస్టెన్ ని చదవడమంటే గొప్ప గొప్ప విషయాలను విస్మరించమనీ,ఎటువంటి ఆశయాలూ,లక్ష్యాలూ లేకుండా ఆమె రొమాంటిక్ ప్రపంచంలో కళ్ళుమూసుకుని బ్రతికేయమని చెప్పడం రచయిత ఉద్దేశ్యం కాదని అర్ధమవుతుంది..జీవితంలో ఉన్నతమైన అంశాలు ఎంత అవసరమో, ఇటువంటి సున్నితమైన,సరళమైన అంశాలు కూడా అంతే అవసరం..ఈ రెండిటి మధ్యా సమన్వయం లోపిస్తే జీవితానికి పరిపూర్ణత సిద్దించదు...What I hadn’t taken seriously were the little events, the little moments of feeling, that my life actually consisted of. I wasn’t Stephen Dedalus or Conrad’s Marlow. I was Emma. I was Jane Fairfax. I was Miss Bates. I wasn’t a rebel, I was a fool. I wasn’t floating in splendid isolation a million miles above the herd. I was part of the herd. I was a regular person, after all. Which means, I was a person.
ఆస్టెన్ అభిమానులందరూ ఆమెను మరోసారి ప్రేమగా గుర్తుచేసుకోవాలన్నా, ఆమె ఊహా ప్రపంచంలో మరోసారి హాయిగా విహరించిరావాలన్నా ఈ పుస్తకం తప్పకుండా చదవండి..నాకైతే ఈ పుస్తకం ఈమధ్య చదివిన హెవీ రీడ్స్ నుండి మంచి ఆటవిడుపులా అనిపించింది.
పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు,
Like the modernists, I was hot to change the world, even if I wasn’t sure exactly how. At the very least, I knew I wasn’t going to let the world change me. I was Dostoyevsky’s Underground Man, raging against the machine. I was Joyce’s Stephen Dedalus, the rebel artist who runs rings around the grown-ups. I was Conrad’s Marlow, the world-weary truth teller who punches through hypocrisy and lies.
Needless to say, I was not the easiest person to get along with. In fact, I wonder that my friends put up with me at all. Like so many guys, I thought that a good conversation meant holding forth about all the supposedly important things I knew: books,history, politics, whatever. But I wasn’t just aggressively certain of myself—though of course I never let anyone finish a sentence and delivered my opinions as if they’d come direct from Sinai. I was also oblivious to the feelings of the people around me, a bulldozer stuck in overdrive, because it had never occurred to me to imagine how things might look from someone else’s point of view.
In my other classes, D. H. Lawrence was preaching sexual revolution and Norman Mailer was cursing his way through World War II, and here I was reading about card parties.
I couldn’t deplore Emma’s disdain for Miss Bates, or her boredom with the whole commonplace Highbury world, without simultaneously condemning my own.
Though Emma was over four hundred pages long, its whole scale was little, like a crowded scene inscribed upon a miniature. If I was having trouble seeing the importance of the world that Austen was putting in front of me, in other words, it wasn’t entirely my fault. Like all the great teachers, I now saw, she made us come to her. She had momentous truths to tell, but she concealed them in humble packages. Her “littleness” was really an optical illusion, a test. Jesus spoke in parables so his disciples would have to make an effort to understand him. The truth, he knew, cannot be grasped in any other way. Austen reminded me, I realized,
But if you loved her—if you “got” her—you felt like you’d joined a secret club, with its own code words and special signs and degrees of initiation. It was a creed, in the words of one writer, “as ardent as a religion,” and “a real appreciation of Emma,” her subtlest book of all, was “the final test of citizenship in her kingdom.”
In other words, Austen knew exactly what she was doing when she created her fiction of ordinary life. It didn’t happen by default, as if she never really thought about it and simply did what came naturally. It was a revolutionary artistic choice, a courageous defiance of convention and expectation: exactly why so many of her early readers had trouble appreciating what she had done, and why her fame took so long to establish itself.
Jane Austen’s life may have seemed uneventful compared to her aunt’s or cousin’s or brothers’, or indeed, compared to just about anyone’s. Her genius began with the recognition that such lives as hers were very eventful indeed—that every life is eventful, if only you know how to look at it. She did not think that her existence was quiet or trivial or boring; she thought it was delightful and enthralling, and she wanted us to see that our own are, too. She understood that what fills our days should fill our hearts, and what fills our hearts should fill our novels.
To pay attention to “minute particulars” is to notice your life as it passes, before it passes. But it is also, I realized, something more. By talking over their little daily affairs—and not just talking them over, but talking them over and over, again and again (the same story in brief, then in full, the same stories in one house, then another)—the characters in Emma were doing nothing less than attaching themselves to life. They were weaving the web of community, one strand of conversation at a time. They were creating the world, in the process of talking about it.
She didn’t need to play the same game as the big boys. Her small, feminine game was every bit as good, and every bit as grand. Austen glorified the everyday on its own terms—without the glamour of Joyce and modernism, and epic archetypes, and the whole repertoire of epic conventions. What she offered us, if we’re willing to see it, is just the everyday, without amplification. Just the novel, without excuses. Just the personal, just the private, just the little, without apologies.