An intellectual is a person who engages in critical thinking, research, and reflection about the reality of society, who may also propose solutions for the normative problems of society, and thus gains authority as a public intellectual. - Wikipedia
జ్ఞానానికీ,వివేకానికీ భూమ్యాకాశాల అంతరం ఉంటుందని ఇన్నేళ్ళ చదువు నేర్పించింది..ఈ విషయంలో Knowledge is knowing that a tomato is a fruit; wisdom is not putting it in a fruit salad అని Miles Kington కొటేషన్ తరచూ వింటుంటాం..కెమిస్ట్రీ లాబ్ లో వాడే సాల్ట్స్ ని తెల్లగానే ఉంది కదాని కూరలో కలిపెయ్యలేం కదా ! వంటకు వాడే సాల్ట్ వేరు అనే స్పృహే 'వివేకం'..నేర్చుకున్న జ్ఞానాన్ని జీవితానికి అన్వయించుకోవడం లో మనిషి విచక్షణ,విజ్ఞత,వివేకం లాంటివి తోడ్పడతాయి.
Image Courtesy Google |
నిజానికి జ్ఞానం సంపాదించడం చిటికెలో పని..ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాలంలో ఎక్కడ చూసినా ఫాక్ట్స్ ఫాక్ట్స్ ఫాక్ట్స్..మనం వద్దన్నా ప్రపంచం నలుమూలాలనుంచీ వచ్చే ఇన్ఫర్మేషన్ ఏదో ఒకరకంగా మన చెవుల్లో పడుతూనే ఉంటుంది..ఆ ఇన్ఫర్మేషన్ ని అటుతిప్పి ఇటు తిప్పి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడో,లేదా సభల్లోనో,ఇక అన్నిటికంటే సులువైన మార్గం సోషల్ మీడియాలోనో రిపీట్ చేస్తూ మేథావుల్లా చెలామణి అయ్యేవాళ్ళకీ చిన్నప్పుడు ఎక్కాలు బట్టీపట్టి క్లాసులో మిగతా పిల్లల ముందు నాకన్నీ తెలుసని గర్వంగా వల్లించే రెండో క్లాసు స్కూల్ పిల్లాడికీ పెద్ద తేడా లేదు..జ్ఞాపకశక్తి ఉండి మెదడు సరిగ్గా పనిచేసే ప్రతి ఒక్కరూ చెయ్యగలిగిన అతి మామూలు పని ఇది..ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అనో,అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ అనో,అమలాపురం ఆంధ్రాలో ఉందనో చెప్పడంలో మేథావితనం ఏమీ ఉండదు..అది ఒక సింపుల్ ఫాక్ట్..నీ బుర్రని ఎక్కువ స్ట్రైన్ చెయ్యకుండా చెప్పగలిగిన ఫాక్ట్..ఇప్పుడు అసలు విషయనికొద్దాం : మనం నేర్చుకున్న జ్ఞానాన్ని నిజ జీవితానికి అప్లై చెయ్యడం..ఇక్కడ జ్ఞానం సరిపోదు వివేకం కావాలి..ముఖ్యంగా సాహిత్యం చదివేటప్పుడు ఫ్యాక్స్ తెలుసుకోవడం కంటే ఇంప్లిమెంటేషన్ లో చాలా జగరూకత అవసరం..అన్నా కరేనిన చదివి అన్నా ను ఆదర్శంగా తీసుకోవాలో, కొంస్టాంటైన్ లెవిన్ ని ఆదర్శంగా తీసుకోవాలో తెలియాలంటే మనకు ఉండాల్సింది జ్ఞానం కాదు..వివేకం.
గత ఏడాది చదివిన ప్రఖ్యాత న్యూరో సైంటిస్ట్ ఆలివర్ సాక్స్ రచన 'The man who mistook his wife for a hat ' లో సాక్స్ అంటారు..ఇంటెలిజెంట్ / హెల్తీ మైండ్ ని సూచించే కీలకమైన అంశం 'జడ్జిమెంట్' మాత్రమే అని..అది కుప్పలుతెప్పలుగా వచ్చిపడిపోయే ఫాక్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ కాదు..నాలెడ్జి అంతకంటే కాదు..వివేకంతో కూడిన జడ్జిమెంట్.
చెన్నైలో స్టూడియోలు ఇంటికి దగ్గరగా ఉన్న కారణంగా సినిమా షూటింగ్స్ నీ,ఆర్టిస్టులనీ చాలా దగ్గరనుండి ఆసక్తిగా చూసేదాన్ని..సినిమా ఎంత ఇష్టమో షూటింగ్స్,ఫంక్షన్స్ అంత వెగటు అనిపించేవి..లేనిదాన్ని ఉన్నట్లు భ్రమింపజేస్తూ ఎంటర్టైన్ చేసే 'తెచ్చిపెట్టుకున్న సూపర్ఫీషియల్ ప్రపంచం' అది...నేను చదివిన కొందరు ఫిలాసఫర్లు గుర్తొస్తే వారి తార్కికవాదం (intellect ?!) కూడా ఒక సినిమా సెట్టింగ్ లాంటిదే అనిపిస్తుంది..ఆ ప్రపంచంలో పునాదులు లేని ఇళ్ళు కట్టచ్చు..సువాసనలేని పువ్వుల్ని అమర్చచ్చు..వేషభాషలు మార్చుకుని పరకాయ ప్రవేశం చెయ్యచ్చు..లేని గుణగణాలతో కూడిన వ్యక్తిత్వాలను అప్పు తెచ్చుకోవచ్చు..షూటింగ్ అయిపోగానే ఆ తొడుక్కున్న డిమీనర్ అంతా తీసేసి ప్రక్కన పడేసి ఆ షూటింగ్ మెస్ అంతా క్లియర్ చేసే పని పనివాళ్ళకొదిలేసి ఏ బాధ్యతా లేకుండా చేతులు దులుపుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు..మనం జీవించలేని,జీవించడం చేతకానీ, జీవించడానికి ఎంత మాత్రం ఆస్కారంలేని ఎన్ని జీవితాలనో అక్కడ పాత్రల్లో ఇమిడిపోయి జీవించవచ్చు...పైసా ఖర్చు లేని సౌకర్యం లా ఉంది కదా..పైగా నటించేవాళ్ళకి సంపాదనతో పాటు 'అనుభవం' ఎక్స్ట్రా బోనస్..ఇప్పుడు ఇదే థియరీని ఇంటలెక్చువల్ ప్రపంచానికి అప్లై చేద్దాం.
ఇంటలెక్చువల్ ప్రపంచంలో కళ్ళేలు లేని గుర్రాల రీతిలో మనిషి ఆలోచనల్ని మల్టిపుల్ డైరెక్షన్స్ లో ఎటువంటి దిశానిర్దేశం లేకుండా పరుగులు తీయించవచ్చు..ముఖ్యంగా ఇక్కడ వాదనలకు పునాదులు ఉండాల్సిన అవసరం లేదు..ఆలోచనలకు,అభిప్రాయాలకు,ఆచరణకు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం అంతకంటే ఉండదు..న్యూరాన్ల ప్రవాహంతో నిరంతరం తన గతిని మార్చుకునే హ్యూమన్ కాన్షియస్ లో సెంటిమెంటాలిటీకి,ఫీలింగ్స్ కీ స్థానం లేదు..అయినా సెంటిమెంట్స్, ఫీలింగ్స్ అవేంటబ్బా !! ఆర్వెల్ టైమ్స్ లో obsolete లాన్గ్వేజ్ వాడడం నేరం..Grow up man !! మంచైనా చెడైనా మన సిద్ధాంతాలను సమర్ధించుకోడానికి ఎక్స్క్యూజెస్ మీద ఎక్స్క్యూజెస్ చేసుకునే అవకాశం ఉన్న ఒకే ఒక్క సేఫ్ జోన్ ఈ ఇంటల్లెక్చువల్ ప్రపంచం..Those who lack the courage will always find a philosophy to justify it అంటారు కామూ..అందులోనూ 'నేను ఇంపెర్ఫెక్ట్' అని స్వాభావిక లోపాలను గ్లోరిఫై చేసుకోవడం ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది..లోపాలున్నాయని స్పృహ ఉన్నప్పుడు వాటిని అధిగమించే ప్రయత్నం చెయ్యాలన్న సంకల్పం కూడా ఉండాలి.. అంతేగానీ 'నేనింతే' అని మనకు అనుకూలమైన ఫిలాసఫీని జస్టిఫై చేసుకుంటూ రవితేజ డైలాగ్స్ చెప్పడం ఇంటెలెక్చువల్ ఇంటెగ్రిటీ క్రిందకి రాదు..ఆ మధ్య రాసిన మరో వ్యాసంలో చెప్పినట్లు ఇంటలెక్చువల్ అనిపించుకోవాలంటే బహుశా సామజిక బాధ్యత కూడా కలిగి ఉండాలి అనుకుంటా..ఒకసారి ఒక స్కాలర్ మాటల మధ్యలో అన్నారు, నేను ఇంటెలెక్చువల్స్ సాంగత్యం కంటే వారణాసి ఘాట్లో సాధారణ బార్బర్ కంపెనీ ఎక్కువ ఎంజాయ్ చేస్తాను అని.
మరి ఈ ఇంటలెక్ట్ ఉపయోగం ఏమిటి ! కళలకు, కళాకారులకూ ,పుస్తకాలు రాసుకోడానికీ,పుస్తకాలు బాగా చదివి ఇంటలెక్చువల్ లెక్చర్లు దంచడానికీ ,ఇలా వ్యాసాలు రాయడానికీ (ఇంకేమన్నా ఉన్నాయా ?!!!! ) బాగా పనికి వస్తుందనుకుంటా !! ఈ సందర్భంలో ఆ మధ్య చదివిన మార్సెల్ ఐమీ సైన్స్ ఫిక్షన్ కథ ఒకటి గుర్తొస్తోంది.. సహజ వనరులు కొరత పెరిగిపోయి బొత్తిగా ప్రొడక్టివిటీ లేని మనుషుల్ని భూమ్మీద లేకుండా చేసేయ్యమని ప్రభుత్వం ఒక జీవో జారీ చేస్తుంది..మన ఇంటెలెక్చువల్ ప్రోటగోనిస్టు ఎదురింట్లో ఒక అరవై దాటి రిటైర్ అయిన ఆయన పేపర్ లో ఈ విషయం చదివి గగ్గోలు పెడుతుంటే,వీడికి రోగం కుదిరింది అని నవ్వుకున్న హీరో , మరుసటి రోజు జీవో సవరణలో అటెన్షన్ సీకింగ్ కి తప్ప ఎందుకూ పనికిరాని ఇంటలెక్చువల్స్ ని కూడా ఆ లిస్టులో కలిపాము అని చదివి దిగ్భ్రాంతి చెందుతాడు.
No comments:
Post a Comment