'రైటింగ్ ఈజ్ ఎ సోలిటరీ బిజినెస్' అనో 'ఎ రైటర్ షుడ్ బీ రెడ్,నాట్ హర్డ్' అనో ఎంతమంది రచయితలు చెప్పినా రాయడం వెనకున్న అర్థం పరమార్థం కొందరు రచయితలకు బోథపడుతున్నట్లు అనిపించదు..ఒకప్పుడు ఇండియా టుడే లో రస్కిన్ బాండ్ తన పుస్తకం గురించి ఒక ఘోరమైన పదజాలంతో కూడిన విమర్శ చదివారట. 1937 లో హెమ్మింగ్వే కు ఇలాంటి పరిస్థితే ఎదురైనప్పుడు ఆయనేం చేశారో గుర్తు తెచ్చుకున్నారట..మాక్స్ ఈస్టమన్ అనే విమర్శకుడు హెమ్మింగ్వే 'డెత్ ఇన్ ది ఆఫ్టర్నూన్' ను సమీక్షిస్తూ అందులో హెమ్మింగ్వే మగతనాన్ని ప్రశ్నిస్తూ వ్యంగ్యంగా ఆ పుస్తకానికి 'బుల్ ఇన్ ది ఆఫ్టర్నూన్' అని పేరు పెట్టారట..ఆ తరువాత ఒక సందర్భంలో హెమ్మింగ్వే కు మాక్స్ ఈస్టమన్ తారసపడినప్పుడు మాక్స్ తలమీద పుస్తకంతో ఒక్కటి బాది,ఆయనను మట్టికరిపించారట..కానీ ఇప్పుడు రస్కిన్ విషయంలో చిక్కేమిటంటే ఆయన విమర్శకురాలు ఒక స్త్రీ.."ఆమెతో కుస్తీకి దిగితే ఖచ్చితంగా నేను ఓడిపోతానని తెలుసు" అని చమత్కరిస్తారు రస్కిన్..ఇక్కడ రచయితలకు రెండే రెండు మార్గాలు,పాఠకుల విమర్శను పట్టించుకోకుండా తమ సృజనాత్మక శక్తిని తమ రచనలపై పెట్టి తమ పని తాము చేసుకోవడం,లేదా వారితో పబ్లిక్ గా మల్లయుద్ధానికి దిగడం.
Image Courtesy Google |
ఒక్కోసారి పరువూ,మర్యాదలకు భంగం కలిగిస్తూనో,నిజమైన టాలెంట్ ను కూడా చిన్నచూపు చూసే రీతిలోనో విమర్శకులకూ,రచయితలకూ మధ్య చాలా అభ్యంతరకరమైన రీతిలో వాగ్వివాదాలు జరుగుతాయి..అందులోనూ చాలా దిగజారుడు స్థాయి విమర్శకులు మాత్రమే రచయితల రచనలను గూర్చి కాకుండా వారిపై వ్యక్తిగతమైన దూషణలకు దిగుతారు..ఇది కేవలం అసూయనో,దుర్భుద్ధితోనో చేసేపని కాకా మరొకటి కాదంటారు రస్కిన్.
రచయితలపై కొన్ని తీవ్ర విమర్శలు చేసిన విమర్శకులను గురించి ప్రస్తావిస్తూ,
* Thomas Carlyle called Emerson ‘a hoary-headed and toothless baboon’ and wrote of Charles Lamb: ‘a more pitiful, rickety, gasping, staggering Tomfool I do not know.’ కానీ మనం ఎమెర్సన్ నీ,లాంబ్ నీ చదువుతాం గానీ కార్లైల్ ని ఎవరు చదువుతారు ??
* Of Walt Whitman, one reviewer said: ‘Whitman is as unacquainted with art as a hog is with mathematics.’
* Swift was accused of having ‘a diseased mind’ and Henry James was called an ‘idiot and a Boston idiot to boot, than which there is nothing lower in the world’.
*Their critics have long been forgotten, but just occasionally an author turns critic with equal virulence. There was the classic Dorothy Parker review which read: ‘This is not a novel to be tossed aside lightly. It should be thrown with great force.
* Macaulay sneered at Wordsworth’s ‘crazy mystical metaphysics, the endless wilderness of dull, flat, prosaic twaddle’,
ఇలాంటి అనేకమంది ప్రముఖ రచయితల గురించి రాస్తూ,ఇంతవరకూ షేక్స్పియర్ ను మించి ఎవరూ విమర్శింపబడలేదు అనడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
Hamlet was described by Voltaire as ‘the work of a drunken savage’, and Pepys said A Midsummer Night’s Dream was ‘the most insipid, ridiculous play that I ever saw in my life’.
కానీ ఇక్కడ గ్రహించిన విషయం ఏమిటంటే ఆర్ట్ విషయంలో మహామహులు కూడా విమర్శలకు అతీతులు కాదు అని..ఇంతకుమునుపు చాలా వ్యాసాల్లో ప్రస్తావించినట్లుగానే వ్యక్తిగత విమర్శ కానంత వరకూ ఒక రచన గురించిన విమర్శను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నవారే రచనావ్యాసంగం జోలికి వెళ్తే మంచిది..ఎందుకంటే ఒకటి,పాఠకుల ఊహాత్మకతను అదుపు చేసే అవకాశం రచయితకు లేదు గనుక..రెండు,తమ రచన ఉత్తమమైనదని ప్రతీ పాఠకుడినీ ఒప్పించడం రచయితకు సాధ్యం కాదు గనుక.
కానీ రచయితలు ఈ తిరస్కారాల్నీ,విమర్శల్నీ తీసుకోవాలా అనే ప్రశ్న వస్తే రాజకీయనాయకులకూ,స్పోర్ట్స్ పర్సన్స్ కీ,నటులకీ తప్పనప్పుడు రచయితలే విధంగా మినహాయింపు అంటారు రస్కిన్.
As E.M. Forster once said: ‘No author has the right to whine. He was not obliged to be an author. He invited publicity, and he must take the publicity that comes along Of course, some reviewers do go a little too far, like the one who once referred to ‘that well-known typist Harold Robbins’.
రచనావ్యాసంగాన్ని జీవనోపాధిగా చేసుకోవడాన్ని యుద్దరంగంలో నిరాయుధులుగా ఉండడంతో సరిసమానంగా అభివర్ణిస్తూ, అప్పుడప్పుడూ కొంతమంది అపరిచిత వ్యక్తులు తారసపడి "మీరు మంచి రచయితేనా ? " అని అడిగినప్పుడు ఏమి చెప్పాలో పాలుపోక దిక్కులు చూస్తానంటారు రస్కిన్ బాండ్ :)
ఇక విమర్శ విషయానికొద్దాం..విమర్శకు కొలమానాలేమిటి ? పెద్ద గీతా చిన్న గీతా తరహాలో ఒక రచన నాణ్యత తెలియాలంటే దానిని మిగతా రచనలతో పోల్చి చూడడం తప్పనిసరి..ఇక్కడ మరో ప్రశ్న తలెత్తుతుంది..మన సాహిత్యం గొప్పదా ? పరాయి సాహిత్యం గొప్పదా ? మన బావిలో నీళ్ళ పరిమాణం అంచనా వెయ్యాలంటే మరో బావిని పరిశీలించాలి లేదా బావి బయట తలపెట్టి సముద్రాన్నో,నదినో,అదీ కాకపోతే ఒక చెరువునో చూస్తేనే మన నీళ్ళ పరిమాణం,నాణ్యత లాంటివి అవగతమవుతాయి..మనదంతా ఉత్తమ సాహిత్యం పరాయిదంతా వట్టి పైత్యం అనుకుంటూ తమ బావిని దాటి బయటకు వెళ్ళే అలవాటులేని విమర్శకులు (?) ,సాహిత్యకారులు (?) చేసే తీర్మానాలు ఉత్త కాలక్షేపం కబుర్లుగా కొట్టిపారెయ్యవచ్చు..వాటికి అంతకు మించిన విలువను ఆపాదించడం అనవసరం..చందమామ అంటే వల్లమాలిన ఇష్టం ఉన్నా,చలం,విశ్వనాథల మీద అభిమానం ఉన్నా జీవితమంతా కేవలం చందమామ గుణగణాలను భట్రాజు బృందంలా పొగుడుకుంటూ బ్రతికెయ్యడం 'అసలుసిసలు' పాఠకులూ,సాహితీ అభిలాష ఉన్నవారూ,సాహితీ వేత్తలూ చెయ్యరు..అక్కడే ఆగిపోకుండా 'వాట్ నెక్స్ట్ ?' అని ఆసక్తిగా చుట్టూ చూస్తారు..నాలుగుపుస్తకాలు చదవగానే,రాయగానే విమర్శకులూ,రచయితలూ అయిపోయామనుకున్న భ్రమలో తాము తయారుచేసుకున్న కోటరీల కరతాళ ధ్వనులమధ్య మరో శబ్దం చెవులకు వినిపించనంత మైకంలో మైమరిచిపోయిన రచయితలు దీర్ఘకాలికంగా గుర్తుండిపోయే రచనలు చేసే సృజనకారులు ఎంతమాత్రం కాలేరు,ఇక ఏబీసీడీలు నేర్చుకోగానే మన చదువు పూర్తైపోయిందనుకునే పాఠకుల గురించి మాట్లాడుకోనవసరం అసలే లేదు..సాహితీమథనానికి ఆకాశమే హద్దు..ఎన్ని చదివినా,ఎంత రాసినా ఇంకా మన అజ్ఞానాన్ని మనకు గుర్తు చేస్తూ ఏదో మిగిలిపోయిందనే స్పృహ పాఠకుడినో,రచయితనో ముందుకు నడిపించాలి..తమ ఊహాత్మకతను,ఆర్టిస్టిక్ మ్యూజ్ నూ నిరంతరం విమర్శకులకు ధీటైన జవాబిచ్చే క్రమంలో తాకట్టు పెట్టుకోవడం సృజనకారులు విషయంలో వృథాప్రయాస తప్ప మరొకటి కాదు..ఇది ఎలా ఉంటుందంటే పాఠకుడికి మన రచనను చదివి ఏమి ఆలోచించాలో,ఏమి ఊహించుకోవాలో మన దగ్గర కూర్చోబెట్టుకుని నేర్పించే ప్రయత్నం చెయ్యడంలా ఉంటుంది..సిగిస్మండ్ క్రిఝిజానోవ్స్కీ,ఫెర్నాండో పెస్సోవా లాంటి దిగ్గజాలే తమ రచనలకు వారి కాలంలో సరైన ఆదరణ లేక అనామకులుగా జీవించి ఈ లోకం నుండి నిష్క్రమించారు..ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ళలో వారి రచనలు వెలుగుచూశాయి,కాలపరీక్షకు ఎదురీది నిలిచి ఇప్పటికీ పాఠకుల నీరాజనాలందుకుంటున్నాయి..అదేమీ కాదు మా శ్రమకు తగ్గ ఫలం,ఫలితం దక్కనప్పుడు మేమెందుకు రచనలు చెయ్యాలి అంటారా ? అయితే మీరు మరో వ్యాపకం చూసుకుంటే మంచిదండీ...Art is definitely not for you.
No comments:
Post a Comment