Friday, May 22, 2020

Star - Yukio Mishima

రష్యన్ రచయితలు లాండ్స్కేప్స్ ని వర్ణించడంలో కనబరిచే నైపుణ్యం జపనీస్ రచనల్లో భావోద్వేగాల వర్ణనల్లో కనిపిస్తుంది..ముఖ్యంగా 'melancholy' వర్ణనలో వీళ్ళు సిద్ధహస్తులు..నేను చదివిన జాపనీస్ రచయితల్లో హరుకీ మురాకమీ,యసునారీ కవాబాతా,అకుతాగావా,కజువో ఇషిగురో వంటివారి రచనల్లో తరచూ ఒక విషయం గమనింపుకొచ్చేది..అదేమిటంటే ప్రతీ కథలోనూ అంతర్లీనంగా వర్ణించనలవికాని వ్యాకులత్వం,విచారం వ్యక్తమయ్యేవి..మూడేళ్ళ క్రితం వీళ్ళని చదువుతున్నప్పుడు నేను తెలుసుకున్న నీతి ఏంటంటే 'One should not read Japanese authors when one is already sad' అని..అందుకే కావాలనే కొంతకాలంగా జాపనీస్ సాహిత్యాన్ని దూరంపెడుతూ వచ్చాను..మళ్ళీ ఇప్పుడు ఋతువులు మారడంతో ఎప్పటినుండో దాటవేస్తున్న మిషిమాని చదువుదామని కోరిక కలిగింది..నిజానికి మిషిమాను చదవాలంటే 'Confessions of a Mask' నుండి మొదలుపెట్టాలి,కానీ అనుకోకుండా కంటబడిన 'స్టార్' తో ఈ రచయితను పరిచయం చేసుకున్నాను..నాకు మిషిమా శైలికీ ఇషిగురో (An Artist of the Floating World చదివాను) శైలికీ చాలా దగ్గర పోలికలు కనిపించాయి.
Image Courtesy Google
ఆస్కార్ వైల్డ్ అంటారు,"జీవితంలో రెండే రెండు ట్రాజెడీలు ఉంటాయి..ఒకటి నువ్వు కోరుకున్నవేవీ జరగకపోవడం,రెండు నువ్వు కోరుకున్నవన్నీ జరిగిపోవడం" అని..ఈ ఆధునిక తరంలో సకల సౌకర్యాల మధ్యా కూడా మనుషుల్లో పెరిగిపోతున్న అశాంతికి కారణం ఒకవిధంగా ఇదేనేమో అనిపిస్తుంది..జీవితం వడ్డించిన విస్తరిగా,ఇక సాధించాల్సినవేవీ మిగలకపోవడాన్ని మించిన ట్రాజెడీ మరొకటుంటుందా ! అతి పిన్నవయసులోనే ధనకీర్తులతోబాటుగా,ప్రముఖ హీరోగా సమాజంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించిన 23 ఏళ్ళ కథానాయకుడు 'రిచీ మిజునో' జీవితం అతి త్వరలోనే కాంతివిహీనంగా తయారవుతుంది..నటుడి జీవితాన్ని మినహాయిస్తే అతడికి తన వ్యక్తిగత జీవితంలో డొల్లతనం స్పష్టంగా కనిపిస్తుంటుంది..అందుకేనేమో రిచీ తనకి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందని చెప్తే అతడి అసిస్టెంట్ 'కాయో' “You’re twenty-four, at the top of your game. A heartthrob. A movie star, more famous by the day. No poor relatives to take care of, in perfect health. Everything is set for you to die. అంటుంది.

కెమెరా సృష్టించిన భ్రాంతిలో చిక్కుకుపోయి వాస్తవ ప్రపంచానికి దారులు వెతుకుతూ Unreal time resumed its flow. I was stripped bare — deep inside a dream అనుకుంటాడు రిచీ..కెమెరా ముందు తప్ప వాస్తవ జీవితంలో అతడి ఉనికి దాదాపు శూన్యం..షాట్ కి ముందు అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ 'My reflection was boyish and alive, but all the life was in the makeup. Since my face looked a little greasy, I applied some more powder, but I knew that there was nothing shining underneath. My physique was rugged and my build was solid, but the old power was escaping me. Once a mold has finished casting its share of copies, it cools and becomes deformed and useless.' అనుకుంటాడు..తన చుట్టూ చేరే ఫ్యాన్స్ అంటే అతడికి అమితమైన ఏహ్య భావం..నలువైపులనుండీ చుట్టేసి తన ప్రతి కదలికనూ శల్యపరీక్ష చేసి చూసే కళ్ళల్లోని తీక్షణత అతడిని గుచ్చుకుంటూ ఉంటుంది..Eyes, countless as the gravel at a shrine, pressed in all around me. They found their center — my image coalesced. అనుకుంటాడొకచోట.

పట్టుమని ముప్పై ఏళ్ళు కూడా లేకపోయినా నలభై ఏళ్ళ వయసున్నట్లు కనిపించే రిచీ అసిస్టెంట్ 'కాయో' తో అతడికి శారీరక సంబంధం ఉంటుంది..లైమ్ లైట్ లో వ్యక్తిగతమంటూ ఎరుగని రిచీ,లోకం కళ్ళుగప్పి ఎవరూ ఊహించలేని విధంగా అతడికేమాత్రం ఈడూ జోడూ కాని కాయోతో సంబంధం కలిగి ఉండడంలో సమాజంపై ఒకరకమైన తిరస్కారంతో కూడిన విజయం సాధించినట్లు ఆనందాన్ని పొందుతూ ఉంటాడు..ఎందుకంటే కాయోతో ఉన్న సంబంధం రిచీ తనకి మాత్రమే స్వంతమని చెప్పుకోగలిగే ఏకైక అనుభవం.

ఇక నేరేషన్ విషయానికొస్తే మిషిమా ప్రత్యేకత ఏమిటంటే ఈ రచయితకు సైకిక్ పవర్స్ ఉన్నాయేమో అనిపించేలా పాఠకుల మెదళ్ళను హ్యాక్ చేసి పూర్తిగా తన స్వాధీనంలోకి తీసేసుకుంటారు..దీనికి ఫస్ట్ పర్సన్ నేరేషన్ కూడా దోహదపడింది..ఈ కథలో రిచీ మానసిక ప్రపంచాన్ని రెండుగా విభజిస్తూ, అతడి భావాలను ఏకకాలంలో ఆల్టర్నేట్ రియాలిటీస్ లో చూపించే ప్రయత్నం చేస్తారు..అలాగని కథ అబ్స్ట్రాక్ట్,ఫాంటసీల వైపు వెళ్ళిపోకుండా జాగ్రత్తపడుతూ పగ్గాలను తన చేతుల్లో ఉంచుకుని కథనాన్ని నియంత్రిస్తారు..ఒక వాస్తవికత పై మరో వాస్తవికతను జోడిస్తూ చాలా సులభంగా మల్టీ లేయర్స్ లో అల్లేసిన కథనంలో సరళత్వమే తప్ప క్లిష్టత ఎక్కడా కనిపించదు..తన ప్రైవసీకి భంగం కలిగిస్తూ ఎల్లప్పుడూ చుట్టూ మూగే సమాజంపట్ల అయిష్టతను దాచుకుంటూ కెమెరా ముందు నటించే నటుడు రిచీ ఆలోచనలు ఒకవైపూ,పబ్లిక్ పెర్సొనా కి సంబంధం లేని ఒక 23 ఏళ్ళ సాధారణ యువకుడు రిచీ ఆలోచనలు మరొకవైపుగా కథ నడుస్తుంది..సెలబ్రిటీ జీవితపు వెలుగునూ,ఆ వెలుగుకు వెన్నంటే ఉండే చీకటినీ కలగలిపి కథనానికి ఒక ఫిలసాఫికల్ (Yin and yang) రూపాన్నిచ్చే ప్రయత్నం చేశారు మిషిమా..'ఫేమ్' ఒక్కోసారి మనుషుల్ని ఒంటరిని చేసేస్తుంది..ఎంతమందిలో ఉన్నా ఎవరికీ చెందని ఏకాకితనం గురించి ఏమని చెప్తే అర్ధమవుతుంది ! It’s useless trying to explain what it feels like in the spotlight .The very thing that makes a star spectacular is the same thing that strikes him from the world at large and makes him an outsider.

ఈ కథలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన సందర్భం ఒకటుంది..కృత్రిమత్వానికీ,సహజత్వానికీ తేడాను చూపించడంలో ఇటువంటి ఒక వర్ణన మునుపు ఎక్కడా చదవలేదు..రిచీ సినిమా షూటింగ్ సమయంలో ఒక జూనియర్ ఆర్టిస్టు 'యూరి' సరిగ్గా నటించలేక పోవడంతో ఆమెను సినిమా నుంచి తప్పిస్తారు..ఆ బాధతో ఆమె ఆత్మహత్యకు పాల్పడుతుంది..ఆ సందర్భంలో విషపూరితమైన శరీరంతో ఆమె ప్రమేయం లేని శరీరపు కదలికల్ని వర్ణిస్తూ,తన కృత్రిమమైన నటనతో ఆమె దేహభాషలో సహజత్వాన్ని పోల్చుకుంటాడు రిచీ.
The position of her body made the spectacle supreme. With her eyes firmly shut, fake eyelashes and all, and undistracted by her senses, Yuri was submerged. That’s right. Her mind was underwater. Her senses had been caught in the blurred grayness at the bottom of the sea, but her body had made it to the surface, its every curve and crevice bathed in the violent light. When Yuri yelled “It hurts!” her voice was aimed at the abyss. This was not a cry out into the world, and certainly not a message. It was a frank display of physicality, expressed through pure presence and pure flesh, unburdened by the weight of consciousness.  I wanted to study her, to watch her do it all over again. She had managed to attain the sublime state that actors always dream of. That two-bit actress had really pulled it off . . . without even knowing she had done it.
మరొకచోట స్త్రీపురుషుల సంబంధాలను గురించిన వర్ణనలో నటుడు రిచీని ప్రేమించి అతడి ఫోటో చూస్తూ అతడితో స్వప్నంలో సాన్నిహిత్యాన్ని ఊహించుకున్న అమ్మాయి ఉత్తరం గురించి రాస్తూ Real love always plays out at a distance అంటారు :
But the girl was anything but dreaming. She wove her cloth with steady focus and fastidious attention.  Nobody was watching. There was no way my photograph was looking back at her. But there I was, under her voracious gaze! Through this sort of exchange, a man and woman can consummate a pure and timeless intimacy without ever actually meeting. In some deserted square, in the middle of a sunny day — it would manifest and consummate, without either of us ever knowing.Real love always plays out at a distance. 
ఏ రచయిత ప్రతిభైనా ఒక గొప్ప విషయాన్ని తీసుకుని గొప్పగా చెప్పడంలో కంటే ఒక అతి సాధారణమైన అంశాన్ని తీసుకుని దాన్ని అసాధారణంగా చూపడంలో కనిపిస్తుంది..నిజానికి ఈ కథలో కొత్తదనమేమీ లేదు..ఒక సినిమా ఆర్టిస్టు జీవితం ఎంత యాంత్రికంగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే,కానీ ఇటువంటి మామూలు విషయాన్ని మిషిమా ఒక పూర్తి స్థాయి సైకలాజికల్ ఫిక్షన్ గా చాలా ఆసక్తికరంగా రాశారు..కూర్చున్న చోటు నుండి కదలకుండా సింగిల్ సిట్టింగ్లో పూర్తి చెయ్యగలిగే పుస్తకం ఇది..నిజానికి అలా చదివితేనే పట్టుసడలని కథనంలో నూతనత్వం స్పష్టంగా అనుభవంలోకొస్తుంది.

పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు,

I hate witnessing ambition, even in a woman. I had to look away.

He planned his scenes shot by shot, like a criminal plotting out the perfect crime.

The flag spasmed in the breeze. Just as it would fall limp, it whipped against the sky, snapping between shadow and light, as if any moment it would tear free and fly away. I don’t know why, but watching it infused me with a sadness that ran down to the deepest limits of my soul and made me think of suicide. There are so many ways to die.

I was once more overtaken by a deep fatigue; my thoughts returned to death. If I was going to die, now would be as good a time as any. Rather than a death cushioned by pleasure, I would die embracing a despicable filth. Cheek in the gutter, curled up against the corpse of a stray cat.

When we were filming, Takahama was always squatting by the camera. He was lanky, skeletal, and had a long, hyperactive nose and a tiny little mouth. His whole face was darkened from incessant exposure to the brutal world of dreams. Habitually dismissing the commotion of his surroundings to give himself the space to think, his gaze was lonely and parched, a gaze most people could never wear in public. It felt so private, like something I was never meant to see. He had the eyes of a child locked naked in a secret room.

My job was to come up with a backstory of violence. I’d been a shy kid. All I did was draw. I never came close to fighting anybody. Instead of gambling with the other kids, I chose the blue sky, and treasured not the gold leaf on their playing cards, but the golden sundown rimming actual young leaves. Looking back, I can say that loving nature was an error. Not seeing my affection for the weakness that it was, I put a stain upon my youth.

The yakuza with his simplistic attitude toward death and the pretty woman who resists him, hiding her true feelings, are bearers of a special kind of vulgar, trifling poetry. A hidden poetry that will be lost if any mediocrity is shed. Genius is a casualty. The poetry must never be conspicuous — its scent is only detectable when subtle. What makes the majority of these films so great is that they’re shot in a way that overlooks the poetry entirely.

*In the pale light of midnight’s foggy street, I’m haunted by the goodbye in your eyes.*
Who would ever notice that this cheap and tired lyric has terms so rigid not a single word could be replaced? People permit its existence because they think it’s harmless and derivative, with the lifespan of a mayfly, but in fact it’s the only thing that’s certain to survive. Just as evil never dies, neither does the sentimental. Like suckerfish clinging to the belly of a shark, threads of permanence cling to the underbelly of all formulaic poetry. It comes as a false shadow, the refuse of originality, the body dragged around by genius. It’s the light that flashes from a tin roof with a tawdry grace. A tragic swiftness only the superficial can possess. That elaborate beauty and pathos offered only by an undiscerning soul. A crude confession, like a sunset that backlights clumsy silhouettes. I love any story guarded by these principles, with this poetry at its core.

The piercing fidelity of the landscape must have meant that I was watching from the gates of death. What I saw was as comprehensive as a memory, poor and wretched as a memory, as quiet, as fluorescent. I was putting it together in the way you would before you die, a last attempt to connect the life flashing before you with an acute vision of the future. I let the neon wash over me, knowing this was something I could never see again. I was no longer on a set, but in an undeniable reality, a layer within the strata of my memory.

It was nothing short of a miracle that I’d stepped into this textured landscape, a living version of memory. It may sound contradictory, but it felt like I had stepped into a painting on the wall and was standing, dumbfounded, inside its panorama.

In the flow of unreal time, I expect things to proceed as planned. The future is fixed; I know its every detail and can see the route ahead of me, like a car negotiating a winding slope. This girl was not part of the plan.

I had slipped into another dimension, an actual place — all of it was real! The neon, the lanterns, the signboards, the willows, the telephone poles, and the glass door of the realtor. I’d been imagining they were all artificial, but now I was awake. I was positive that in about ten hours the sun would sweep the landscape, a newborn sun rising between the hunkered roofs.

Monday, May 18, 2020

A Country Doctor's Notebook - Mikhail Bulgakov

ఒక్క ఎలక్ట్రిక్ లైట్ కనిపించాలంటే కనీసం ముప్ఫై రెండు మైళ్ళు ప్రయాణం చెయ్యాల్సిన దూరంలో,బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా,కనీసం ఫోన్ సదుపాయం కూడా లేని రష్యన్ మారుమూల పల్లెటూర్లో ఏమాత్రం వృత్తిరీత్యా అనుభవంలేని యువవైద్యుడు అక్కడి నిరక్షరాస్యులైన పేషెంట్స్ తో తన అనుభవాలను గురించి రాస్తూ ఎన్నిసార్లు విసుక్కుంటాడో,'ఇక్కడ నుంచి పట్టణానికి వెళ్ళిపోతే ఎంత బావుండును,నాకేంటి ఈ శిక్ష' అని !పగటి వేళలు పేషెంట్స్ కి నయం చెయ్యడంలో గడిచిపోయినా రాత్రి అయ్యేసరికి తన గదిలో గుడ్డి దీపపు కాంతిలో భయంకరమైన ఒంటరితనంతో ఒక్కడూ బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్ళదీస్తుంటాడు..మాస్కో పట్టణపు ఆధునికతనూ,అందాలను పదే  పదే తలచుకుంటాడు..కానీ అర్జెంటుగా ఏదైనా కేసు వచ్చినప్పుడు మాత్రం ఈ అస్తిత్వవాదమంతా ఉఫ్ మని ఊదేసినట్లు మాయమైపోతుంది ,ఉన్నపళంగా సాహసికుడి అవతరమెత్తి గుఱ్ఱపు బగ్గీలో ప్రాణాలను సైతం లెక్కచెయ్యకుండా బయలుదేరతాడు..మంచుతుఫానుల్లో దారిలో పొంచి ఉండే ప్రమాదాలను ఎదుర్కుంటూ,అక్కడక్కడా కాపు కాసే తోడేళ్ళ బారినుండి చిన్న పిస్టల్ సాయంతో తనను తాను రక్షించుకుంటూ తన వృత్తిధర్మాన్ని నిర్వర్తించడానికి పూనుకుంటాడు..పైకి సాధారణంగా కనిపిస్తూనే ఏదైనా అవసరం వచ్చినప్పుడు మాత్రం ధైర్యంగా ఎదురు నిలబడి పోరాడే అసాధారణమైన హీరో మన బల్గకోవ్ కథానాయకుడు..మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రంట్ లైన్స్ లో డాక్టర్ గా పనిచేసి,రెండుసార్లు గాయపడిన తరువాత తన ఉద్యోగం వదిలేసి మళ్ళీ కాస్త కోలుకున్నాకా మోర్ఫిన్ వ్యసనం బారినపడి,ఆ తరువాత Smolensk ప్రావిన్స్ లో పనిచేసిన సమయంలో బల్గకోవ్ తన అనుభవాలకు 'A Country Doctor's Notebook' పేరుతో అక్షరరూపం ఇచ్చారంటారు.
Image Courtesy Google
చెహోవ్,సోమర్సెట్ మామ్ లాంటి పలు డాక్టర్ రచయితల సరసన చెప్పుకోదగ్గ మరో పేరు మిఖాయిల్ బల్గకోవ్ ది..స్టాలిన్ కి ఇష్టుడుగా మసులుకున్న రష్యన్ రచయిత బల్గకోవ్ ..రష్యన్ మారుమూల పల్లెటూర్లో డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో తన స్వానుభవాలకు కొంత కాల్పనికతను జోడించి ఈ తొమ్మిది కథలుగా మలిచారు..ఈ కథలు సముద్రంలో పడినవాడికి ఈత దానంతటదే వచ్చేస్తుందనే నానుడిని నిజం చేస్తూ,ప్రోటొగోనిస్ట్ పూర్తి స్థాయి వైద్యుడిగా రూపాంతరం చెందే క్రమంలో ప్రత్యక్ష జీవన్మరణ సంఘర్షణకు మధ్యవర్తిగా వ్యవహరించడంలో ఎదుర్కునే పరిస్థితులను వివరిస్తాయి..ఈ నూనూగు మీసాల డాక్టర్ పేషెంట్స్ బాధను తన బాధగా చేసుకుని అల్లాడిపోతాడు..సర్జరీ గురించి థియరీ చదవడమే తప్ప ప్రాక్టికల్ అనుభవం ఎంతమాత్రం లేని యూనివర్సిటీ చదువుతో బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టి అప్రెంటిస్షిప్ చేస్తున్నప్పుడు వణికే చేతుల్తో ఫోర్సెప్స్ తీసుకుని,అప్పటికప్పుడు కేసుకు అవసరమైన సర్జరీ మాన్యువల్స్ పేజీలు తిప్పుతూ,మరోప్రక్క నుదుటి మీద పట్టిన చిరుచెమటల్ని తుడుచుకుంటూ,పేషెంట్ కేసి కళ్ళు పెద్దవిగా చేసుకుని చూస్తున్నప్పుడు 'ఈ పేషెంట్ నా చేతుల్లో మరణిస్తే నా పరిస్థితి ఏంటి !' అనుకునే ఈ యువవైద్యుడి రూపం పాఠకుల మనసులో అలా ముద్రపడిపోతుంది.

ఈ కథలన్నీ అవ్వడానికి క్లినికల్ టేల్స్ అయినా బల్గకోవ్ వీటిలో డాక్టర్-పేషెంట్ సంబంధాలకు పెద్దపీట వేస్తూ మానవీయకోణాన్ని వాస్తవికతకు జతచేస్తూ కథనాన్ని నడిపించే ప్రయత్నం చేశారు..దీనికి తోడు చెహోవ్ శైలిని తలపించే ప్రకృతి వర్ణనలు ఈ కథల్లో మరో ప్రత్యేకత..ఈ వేర్వేరు కథలకు ఎంచుకున్న ఉమ్మడి కాన్వాస్ ఒక ఆర్టిస్టు ఏకాగ్రతతో గీసిన స్కెచ్ అంత స్పష్టంగా ఉంటుంది..శీతాకాలపు రాత్రుళ్ళు,మంచుతుఫానులు ,మినుకుమినుకు మంటూ కథానాయకుడి గదిలో ఉన్న ఆకుపచ్చని ఛాయలో వెలిగే దీపం,హాస్పిటల్ ప్రధాన ద్వారం దగ్గర ఉన్న మరొక దీపం మినహా కనుచూపుమేరా కన్నూమిన్నూ కానని కటిక చీకటి..ఈ పరిసరాలన్నీ కథలతోపాటు సమాంతరంగా జీవంపోసుకోగా సువిశాలమైన రష్యన్ లాండ్స్కేప్ ఉన్నపళంగా మన కళ్ళముందు తెల్లని తైలవర్ణ చిత్రంలా దర్శనమిస్తుంది.

ఈ కథలన్నిటిలోకీ కాస్త వైవిధ్యంగా ఉన్న కథ 'Morphine' ఒక్కటే.ఇది మొదటి ప్రపంచయుద్ధ సమయం నాటి బోల్షివిక్ విప్లవం సమయానికి సంబంధించిన కథ..ఇదొక్కటీ మినహాయిస్తే మిగతా కథలన్నీ హాస్పిటల్ లో రకరకాల పేషెంట్స్ కి సంబంధించిన కథలే..డాక్టర్ గా ప్రాక్టీస్ తొలినాళ్లలో అనేకమంది అనుభవమున్న డాక్టర్ల మధ్య నేర్చుకుంటూ అప్రెంటిస్షిప్ చెయ్యడం వేరు,అన్న ప్రాసనరోజే ఆవకాయ్ పచ్చడి తీరుగా ఏకాకి వైద్యుడుగా ఎమర్జెన్సీ కేసులను అటెండ్ చెయ్యడం వేరు..తన డైరీలో కష్టాలను ఏకరువు పెడుతున్నపుడు బగ్లకోవ్ హాస్యోక్తులు కథనాన్ని మరింత రక్తి కట్టిస్తాయి.

ఉదాహరణకు,The Embroidered Towel కథలో వైద్యం పూర్తయ్యి కోలుకున్న అందమైన యువతి తండ్రి కృతజ్ఞతా భావంతో డాక్టర్ చేతిని ముద్దుపెట్టుకోమని కూతుర్ని ఆదేశిస్తే దగ్గరకు వచ్చిన ఆమెను గూర్చి 'I was so confused that I kissed her on the nose instead of the lips.' అంటారు బల్గకోవ్ :)

మరో కథలో పేషెంట్ పన్ను పీకబోయి అతడి దవడను పీకేసిన డాక్టర్ ఆత్మవిమర్శను వర్ణిస్తూ,
‘What about the soldier’s jaw? Answer, miserable graduate!’ అంటారు.

తీవ్రమైన మంచుతుఫాను మధ్య చిక్కుకున్న సమయంలో చావుబ్రతుకుల మధ్య డాక్టర్ ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి.. Well, somewhere on the back page of a Moscow newspaper there would be a report of how Doctor So-and-So, Pelagea Ivanovna, a driver and a pair of horses had perished from the ‘rigours of the service’. Peace to their ashes, out there in the sea of snow. Dear me, what rubbish creeps into one’s head when called out on a journey in the so-called line of duty.

మరో కథలో టాల్స్టాయ్ మీద ఛలోక్తి విసురుతూ,
I suddenly remembered a short story I had read and for some reason felt a burst of resentment at Leo Tolstoy.‘It was all right for him, living comfortably at Yasnaya Polyana,’ I thought, ‘I bet he was never called out to people who were dying …’అంటారు.

ఇంకో కథలో వింతశిశువు గురించి రాస్తూ,
At university I was not once permitted to hold a pair of obstetrical forceps, yet here—trembling, I admit—I applied them in a moment.I must confess that one baby I delivered looked rather odd: half of its head was swollen, bluish-purple and without an eye. I turned cold, dimly hearing Pelagea Ivanovna as she said consolingly:‘It’s all right, doctor, you’ve just put one half of the forceps over his eye.' అంటారు..ఇలాంటి డార్క్ హ్యూమర్ ఈ కథల్లో అణువణువునా కనిపిస్తుంది.

ఇలా చెప్పుకుంటూ వెళ్తే,ఈ పుస్తకంలో యువ డాక్టర్ చేసే సాహసాలెన్నో,కేసు ఎటువంటి మలుపు తీసుకుంటుందో అని పాఠకులకు ఉత్కంఠ కలిగించే సందర్భాలెన్నో..ఒక చిన్ననాటి స్నేహితుడు సెలవులకు ఇంటికొచ్చినప్పుడు తీరుబడిగా చెప్పే కబుర్లంత సహజంగా,తియ్యగా ఉంటాయి బగ్లకోవ్ వర్ణనలు...అతడి దగ్గరకి వైద్యానికి వచ్చినా,మొహంలో పసితనపు ఛాయలు ఇంకా పోనీ ఆ కుర్ర డాక్టర్ వైద్యం మీద నమ్మకం లేక అతడిని ఎగతాళి చేసే నిరక్షరాస్యులైన రైతుల మధ్య అనేక ఒత్తిళ్ళను ఎదుర్కుంటూ వైద్య వృత్తిలో అనుభవం సంపాదించి ఎలా నిలదొక్కుకున్నదీ ఈ కథల సారాంశం.

పుస్తకం నుండి మరొకొన్ని అంశాలు,
I needn’t have offered to do the operation, and Lidka could have died quietly in the ward. As it is she will die with her throat slit open and I can never prove that she would have died anyway, that I couldn’t have made it any worse …’
‘As soon as I get back to my room, I’ll shoot myself.’

‘You did the operation brilliantly, doctor.’ I thought she was making fun of me and glowered at her.

Anna Nikolaevna described to me how my predecessor, an experienced surgeon, had performed versions. I listened avidly to her, trying not to miss a single word. Those ten minutes told me more than everything I had read on obstetrics for my qualifying exams, in which I had actually passed the obstetrics paper ‘with distinction’. From her brief remarks, unfinished sentences and passing hints I learned the essentials which are not to be found in any textbooks.

And an interesting thing happened: all the previously obscure passages became entirely comprehensible, as though they had been flooded with light; and there, at night, under the lamplight in the depth of the countryside I realised what real knowledge was.‘One can gain a lot of experience in a country practice,’

It was, in fact, less of a conversation than a monologue—a brilliant monologue by me, which would have earned a final year student the highest marks from any professor.

I felt the customary stab of cold in the pit of my stomach as I always do when I see death face to face. I hate it.

God, how the sweat ran down my back! For an instant I somehow imagined that some huge, grim, black figure would appear and burst into the cottage, saying in a stony voice: ‘Aha! Take away his degree !'

I felt my heart gripped by loneliness, by cold, by awareness of my utter isolation. What was more, by breaking the baby’s arm I might have actually committed a crime. I felt like driving off somewhere to cast myself at someone’s feet and confess that I, Doctor So-and-So, had broken a child’s arm—take away my degree, dear colleagues, I am unworthy of it, send me to Sakhalin! God, how neurotic I felt!

In a year, up to the very hour of that evening, I had seen 15,613 patients;200 inpatients had been admitted, of whom only six died.

CLEVER PEOPLE HAVE LONG BEEN AWARE THAT happiness is like good health: when you have it, you don’t notice it. But as the years go by, oh, the memories, the memories of happiness past!

ఏకాంతాన్ని గురించిన వర్ణన,
For an addict there is one pleasure of which no one can deprive him—his ability to spend his time in absolute solitude. And solitude means deep, significant thought; it means, calm, contemplation—and wisdom. 
The night flows on, black and silent. Somewhere out there is the bare leafless forest, beyond it the river,the chill air of autumn. Far away lies the strife-torn, restless city of Moscow.
Nothing concerns me, I need nothing and there is nowhere for me to go. 
The flame in my lamp burns softly; I want to rest after my adventures in Moscow and forget them. 
And I have forgotten them.

Friday, May 15, 2020

Roland Barthes on Feminism

Image Courtesy Google
మనకి ఖాళీల్ని పూరించడం ఇష్టం..కప్ బోర్డులను బట్టలతోనూ,ఖాళీ గదుల్ని వస్తువులతోనూ,మెదడుని సమాచారంతోనూ,జీవితాన్ని మనుషులతోనూ  నింపుకోవడం ఇష్టం...ఏదీ ఖాళీగా ఉండకూడదు,ఖాళీలు భయపెడతాయి..మనం జన్మతః ఒంటరివాళ్ళమని ఓరకంట చూస్తూ గేలి చేస్తాయి..ఆ ఖాళీలను పూరించి తీరాలి.ఆ దిశగా చదువు,ఉద్యోగం,వివాహం,సంతానం,రిటైర్మెంట్ లాంటివన్నీ నలుగురితో పాటు అదే వరుసలో పాటించిన మనిషి సమాజంలో గౌరవస్థానంలో ఉంచబడతాడు..కానీ ఇవన్నీ మనిషికి ఆహారనిద్రా మైథునాల్లా కనీసావసరాలా ? ప్రాచీన కాలంనుండీ విభిన్న సంస్కృతుల పరిణామక్రమంలో సంఘజీవిగా మనిషి సౌకర్యార్థం 'ఏవయసుకా ముచ్చట' ప్రాతిపదికన ఈ క్రమాన్ని ఏర్పాటు చేసి ఉంటారు..కానీ కాలం గడుస్తున్నా ఈ క్రమంలో మాత్రం ఎటువంటి మార్పూ లేదు..జనాభా పెరుగుదలకూ,ప్రకృతి వనరులకూ మధ్య త్వరితగతిని మారుతున్న నిష్పత్తుల్లో భూమ్యాకాశాల సామ్యం కనిపిస్తునప్పుడు కూడా ఇంకా పెళ్ళి కాలేదా,పిల్లలు లేరా వంటి ఛాందసత్వాలు మాత్రం పోవడం లేదు..స్త్రీ శరీరం సంతానోత్పత్తికి అనువుగా ఉన్నంత మాత్రాన సంతానం ఉత్పత్తి చెయ్యాలా ? ఈ విషయంలో ఆమెకు నిర్ణయాధికారం లేదా ? ఈ ప్రశ్నల్ని సాహిత్యానికీ,ఫెమినిజానికీ ముడిపెడుతూ రోలాండ్ బార్త్ మైథాలజీస్ లో 'నోవెల్స్ అండ్ చిల్డ్రన్' అనే ఒక వ్యాసం రాశారు..ఇది చదువుతున్నప్పుడు దీని గురించి ప్రత్యేకించి ఒక నోట్ రాయాలనుకున్నాను.

ఇక్కడ మనిషి తన సౌకర్యార్ధం ఏర్పాటు చేసుకున్నక్రమాన్ని విమర్శించడం,లేదా అది సరికాదని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు..నలుగురూ పాటించే క్రమాన్ని పాటించాలా వద్దా అనే విషయంలో ప్రతీ మనిషికి సంపూర్ణ నిర్ణయాధికారం ఉండాలి అని మాత్రం అనుకుంటాను.

ఇక వ్యాసంలోకి వస్తే,ఇది బార్త్ ఫెమినిస్ట్ అభిప్రాయాలను ప్రతిబింబిస్తుంది..ఒకసారి ఫ్రాన్స్ లో వెలువడే Elle అనే పత్రిక డెబ్భై మంది రచయిత్రులను ఒకే ఫ్రేములో బంధించిన ఫోటోను ప్రచురించిందట..మంచిదే..కానీ ఆ పత్రికలో రచయిత్రులను ఈ విధంగా వర్గీకరిస్తూ పరిచయం చేశారట.

Jacqueline Lenoir (two daughters, one novel); Marina Grey (one son, one novel); Nicole Dutreil (two sons, four novels), etc.

అసలేమిటిది ? దీనికి అర్థమేమిటి ?
"రైటింగ్ ను ఒక సాహసోపేతమైన వృత్తిగా రైటర్ ని కాస్తో కూస్తో బొహేమియనిజానికి అర్హుడుగా భావిస్తారు..రచయిత అన్నివిధాలా స్వతంత్రుడు,'రైట్ టు ఇండివిడ్యువాలిటీ' కి చిరునామాలాంటివాడు..అతడి వృత్తి రచయితగా సంఘంలో గౌరవంతో పాటు జీవనోపాధిని కూడా అందిస్తుంది..కానీ ఈ నియమాలన్నీ మగవారికే వర్తిస్తాయి..రచయిత్రులు పొరపాటున కూడా స్త్రీ ప్రప్రథమంగా చెయ్యాల్సిన డ్యూటీ (submitted to the eternal statute of womanhood),అనగా మాతృత్వానికి న్యాయం చెయ్యకుండా ఆ ఆర్టిస్టుల నియమావళిని తమకు అనుకూలంగా భావించకూడదు..నిజానికి స్త్రీలు ఈ భూమి మీద సృష్టించబడిందే పురుషులకు సంతానాన్ని కని ఇవ్వడానికి ; వాళ్ళు ఎంత కావాలంటే అంత రాసుకోవచ్చు,వాళ్ళ పరిస్థితుల్ని ఎంత కావాలంటే అంత సుందరమయంగా తీర్చిదిద్దుకోవచ్చు,కానీ వాళ్ళ స్త్రీ అస్తిత్వపు సహజస్థితికి దూరంగా జరగడం మాత్రం నిషిద్ధం..అన్నిటినీ మించి రచయిత్రిగా వారి ఆర్టిస్టు హోదా వారికి ఆపాదించిన బైబిలికల్ ఫేట్ ను భంగపరిచేదిగా ఉండకూడదు..అందువల్ల వాళ్ళ తక్షణ కర్తవ్యం ఏమిటంటే,వెనువెంటనే వాళ్ళు 'మదర్ హుడ్' కి ట్రిబ్యూట్ ఇస్తూ తమను తాము రుజువు చేసుకోవాలి."
"మీ స్త్రీమూర్తులు స్వతహాగా ధైర్యవంతులు,స్వతంత్రులు,పురుషులతో సమానంగా అన్ని పనులూ చెయ్యగలరు,రాయడంతో సహా ; కానీ పురుషులకంటే ఒకడుగు ముందుకు వెళ్ళిపోయి మాత్రం కాదు ; వారి కనుసన్నలలో మెలుగుతూ,మీరు రాసే పుస్తకాలను మీ పిల్లలతో భర్తీ చెయ్యాలి ; కొంతకాలం సాధికారత స్వతంత్రత అనుభవించవచ్చు,తప్పేమీ లేదు..కానీ మళ్ళీ వెనుదిరిగి మీకు కేటాయించిన స్థానంలోకి మీరు వచ్చెయ్యాలి..ఒక నవల,ఒక సంతానం,కాస్త ఫెమినిజం,మరికాస్త దాంపత్యం..ఇదీ మీ క్రమం." 
"మీ రచయిత్రుల ఆర్టిస్టిక్ మ్యూజ్ ని తీసుకొచ్చి బలమైన కుటుంబ వ్యవస్థ దూలాలకు వ్రేళ్ళాడదీద్దాం..నిజానికి ఈ కాంబినేషన్ వలన రెండువైపులా ప్రయోజనం చేకూరుతుంది..ఇటువంటి మిథ్యల విషయంలో పరస్పరం సహాయం చేసుకోవడం ఎప్పుడూ లాభదాయకమే."
"For instance, the Muse will give its sublimity to the humble tasks of the home; and in exchange, to thank her for this favour, the myth of child-bearing will lend to the Muse, who sometimes has the reputation of being a little wanton, the guarantee of its respectability, the touching decor of the nursery. "
"ఈ విధంగా Elle పత్రిక పాఠకులకు చెప్పి ఒప్పించాలనుకున్న మిథ్య అందరికీ ఆనందదాయకమే..స్త్రీలు శక్తిస్వరూపిణులుగా ఆత్మ విశ్వాసంతో ఉండాలి : వాళ్ళకి కూడా పురుషులతోపాటు గొప్ప సృజనాత్మక ప్రపంచంలోకి (సుపీరియర్ స్టేటస్ ఆఫ్ క్రియేషన్) అడుగుపెట్టే హక్కుని కట్టబెట్టాలి..కానీ ఇవన్నీ చూసి మగవారు బెదురుతారేమో,వారిని భయపడొద్దని భరోసా ఇస్తూ భుజం తడదాం ; స్త్రీలు ఎప్పటికీ మీ స్థానాన్ని లాగేసుకోరు,స్త్రీ సహజమైన మాతృత్వానికి దూరం జరగరు."
"Elle nimbly plays a Molièresque scene, says yes on one side and no on the other, and busies herself in displeasing no one; like Don Juan between his two peasant girls, Elle says to women: you are worth just as much as men; and to men: your women will never be anything but women." 
"Man at first seems absent from this double parturition;ఇక ఈ పత్రిక చూసిన మగవారికి పిల్లలూ,నవలలూ ఒకేలా కనిపిస్తారు..తమ ప్రమేయం లేకుండా వాటంతటవే ఏదో అద్భుతంలా సృష్టించబడి భూమ్మీదకి అకస్మాత్తుగా వచ్చేసినట్లు,పూర్తిగా తల్లికి మాత్రమే చెందినట్లు..అందునా డెబ్భై మంది స్త్రీలనూ, వారి పిల్లలనూ,పుస్తకాలనూ కలిపి ఒకే ఫోటో లో చూపించడం వల్ల నిజంగానే అవన్నీ ఒక మిరాకల్ లా సృజనాత్మకత,స్వప్నాల సరిసమాన ఫలితమేమో (the miraculous products of an ideal parthenogenesis ) అనిపించేస్తుంది..కానీ ఈ మొత్తం ఫామిలీ పిక్చర్ లో మగవాడు ఎక్కడ ? "
"Nowhere and everywhere, like the sky, the horizon, an authority which at once determines and limits a condition. Such is the world of Elle: women there are always a homogeneous species, an established body jealous of its privileges, still more enamoured of the burdens that go with them. Man is never inside, femininity is pure, free, powerful; but man is everywhere around, he presses on all sides, he makes everything exist; he is in all eternity the creative absence, that of the Racinian deity: the feminine world of Elle, a world without men, but entirely constituted by the gaze of man, is very exactly that of the gynaeceum. "
"ఈ విధంగా Elle పత్రికలో ప్రతీ భాగంలో ఈ ద్వంద్వ వైఖరి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది..ప్రాచీన గ్రీకు రోమన్ సంస్కృతుల్లో స్త్రీల కోసం ప్రత్యేకమైన 'జానీసియం' అనే అంతఃపురాలను కేటాయించేవారు..ఇవన్నీ పురుషుల కనుసన్నలలో మెలుగుతూ స్వతంత్రంగా (?) వ్యవహరిస్తాయి..ఎటొచ్చీ ఆ అంతఃపురాలకు తాళాలు ఉంటాయి..స్త్రీలను వాటిలోపల స్వేచ్ఛగా తిరగమని వదులుతారు..ప్రేమించు,పనిచెయ్యి,రచనలు చెయ్యి,వ్యాపారవేత్తగా మారు,నీ ఇష్టం కానీ ఎప్పుడూ పురుషుడి ఉనికిని గుర్తుపెట్టుకో..నువ్వు అతడిలా సృష్టింపబడలేదని జ్ఞాపకం పెట్టుకో ;ఈ కారణంగా నీ ఉనికి అతడి మీద ఆధారపడుతుందని మరవొద్దు..నీ స్వేచ్ఛ కేవలం ఒక లగ్జరీ,ఆ లగ్జరీ నీకెప్పుడు దక్కుతుందంటే నువ్వు నీ స్త్రీ సహజ ప్రవృత్తిని గుర్తించి,అంగీకరించినప్పుడే..నీకు రాయాలనుంటే రాయి..సాటి మనుషులుగా మేమందరం నిన్ను చూసి గర్వపడతాము,కానీ మరో చేత్తో స్త్రీగా పిల్లలను కనవలసిన నీ విధిని మాత్రం మర్చిపోవద్దు..ఎందుకంటే అదే నీ డెస్టినీ..ఒక jesuitic morality: అందువల్ల నీ మోరల్ రూల్ ఆఫ్ కండిషన్ ను స్వీకరించు..కానీ అది నిలబడిన నమ్మకపు పునాదుల(dogma) విషయంలో మాత్రం ఎప్పుడూ రాజీపడకు."

Sunday, May 10, 2020

Mythologies - Roland Barthes

ఫ్రెంచి సాహితీ విమర్శకులు రోలాండ్ బార్త్ పుస్తకం పేరు 'మైథాలజీస్' అని ఉండడం చూసి ఇందులో ఏవో గ్రీకు పురాణాల్లో,రోమన్ గాథలో ఉంటాయని భ్రమపడి చాలా కాలంపాటు చదవకుండా ప్రక్కన పెడుతూ వచ్చాను..ఇన్నేళ్ళకు యాదృచ్ఛికంగా కొన్ని పేజీలు తిప్పినప్పుడు ఇందులో మైథాలజీకి ఏమాత్రం సంబంధంలేని విషయాలు చదివి ఆశ్చర్యం వేసింది..'పుక్కిట పురాణాలని' మనం తరచూ వినే ఒక మాటను ఈ పుస్తకం పేరుకి అన్వయిస్తే,అసత్యాలను అందమైన అభూతకల్పనలుగా చేసి మీడియా,ఇంటెలెక్చువల్ వర్గాలూ,ప్రభుత్వాలూ ఇవన్నీ కలిసి సామాన్య ప్రజానీకానికి కట్టుకథలు (మైథాలజీలు) చెప్పి ఎలా మోసం చేస్తున్నారనే విషయాలను విశ్లేషించిన కొన్ని వ్యాసాలు ఇందులో ఉన్నాయి..మన కంటికి కనిపించేవి,చెవులకు వినిపించేవి అన్నీ నిజాలు కావు..కానీ ఈ విషయం గ్రహించడానికి ఎప్పుడూ 'బిట్వీన్ ది లైన్స్' చదవడం చేతనవ్వాలి..అటువంటి విద్యలో బార్త్ నిష్ణాతులు..ఇందులో వాస్తవానికీ,మిథ్ కూ ఉన్న తేడాలను పలు శాస్త్రీయమైన విశ్లేషణలతో సహా వివరించారు బార్త్.
Image Courtesy Google
అసలు మిత్ అంటే ఏమిటి ? ఇది ఒక రకమైన స్పీచ్ అంటారు బార్త్..వాస్తవం నుండి మిత్ ను వేరు చేసి చూసే  విధంగా రూపొందిన ఫీల్డ్ స్టడీని 'సెమియోలజీ' అంటారు..మనుషులు తమ చుట్టూ ఉన్న ప్రపంచంనుండి అర్ధాలను భాష,సింబల్స్,ఫోటోగ్రాఫ్స్,పెయింటింగ్స్ మొదలైన అనేక అంశాల నుండి ఎలా అర్ధం చేసుకుంటారో అధ్యయనం చేస్తుంది ఈ 'సెమియోటిక్స్'..ఈ స్టడీస్ లో 'మిత్' ని వివరించడానికి 'సైన్,సిగ్నిఫయర్,సిగ్నిఫయడ్' అనే ఒక ట్రై డైమెన్షనల్ పాటర్న్ ను పరిచయం చేస్తారు..మరింత లోతుగా చర్చిస్తూ ఫామ్,స్ట్రక్చర్ వంటి మరికొన్ని అంశాలు కూడా ఉంటాయి..ఉదాహరణకు ఒక 'గులాబీల గుత్తి'ని తీసుకుంటే,దానిని ప్యాషన్ కు చిహ్నంగా భావిస్తారు..అంటే ఇక్కడ గులాబీలు 'సిగ్నిఫయర్' అయితే ప్యాషన్ 'సిగ్నిఫయిడ్' అవుతుంది..కానీ నిజానికి ఇక్కడ ఉన్నది 'Passionified roses'..కానీ ఈ గులాబీలను ప్యాషన్ కు కలిపితే మరో మూడో ఆబ్జెక్ట్ తయారవుతోంది,అదే సైన్.

ప్రేమలో ఉండడం కంటే,ప్రేమలో ఉన్నామన్న భావన మరింత అద్భుతంగా ఉంటుందంటారు..అలాగే మనుషులు తమను గురించి తాము చెప్పే మాటలకంటే,చెప్పకుండా వదిలేసిన మాటలే వారిని ఎక్కువ నిర్వచిస్తాయని అంటారు,ఇకపోతే పదాలకంటే వ్యవహారశైలి ఒక వ్యక్తిని గురించి మరింత ఖచ్చితమైన సమాచారాన్ని తెలియజేస్తుంది..ఇవన్నీ వాస్తవానికీ,మిథ్ కూ తేడా గ్రహించగలిగి,కేవలం ఉపరితలంలో కనిపించే విషయాలపై మాత్రమే దృష్టి పెట్టకుండా కాస్త లోతుగా విషయాలను అధ్యయనం చేసే అలవాటున్నవాళ్ళకి అర్ధమవుతాయి..కానీ నేటి తరంలో అసలైన అనుభవం కంటే ఆ అనుభవాన్ని ప్రతిబింబించే అంశానికి ప్రాథాన్యత ఎక్కువ..సాధారణ సమయాల్లోనే కాకుండా కోవిడ్ లాంటి గ్లోబల్ ఎపిడెమిక్ కారణంగా వర్గ తారతమ్యాలు లేకుండా ప్రతీ సగటుమనిషి జీవితం ఇంస్టాగ్రామ్,ఫేస్బుక్,ట్విట్టర్ వంటి పలు సోషల్ మీడియా కిటికీలకు పరిమితమైపోయిన సమయంలో 'We are what we pretend to be' అన్న తీరులో అన్ని ప్రసార మాధ్యమాల్లోనూ,సోషల్ మీడియాలోనూ అసలు కంటే నకలు ఎక్కువ చెల్లుబాటవుతోంది..ఇదే విషయాన్ని బార్త్ 1972 లో రాసిన ఈ వ్యాసాల్లో ప్రస్తావించారు.

చేగువేరా లాంటి ఒక రివల్యూషనరీని ఉదాహరణగా తీసుకుంటే ఒకప్పటి అసలుసిసలు చేగువేరా సిద్ధాంతాలూ,ఆయన స్వచ్ఛమైన జీవితాశయాలూ ఈ తరంలో క్యాపిటలిజం ఉత్పత్తి చేసే టీ షర్ట్లకు పరిమితమైపోయాయి..రివల్యూషనరీ చేగువేరా కాస్తా ఒక కార్పొరేట్ 'బ్రాండ్' గా మారిపోయారు..విచిత్రం ఏమిటంటే నిజానికి ఆ టీ షర్టును డబ్బుపెట్టికొనుక్కున్న వ్యక్తి,ఆ షర్టు వేసుకుని తనను చేగువేరా ఆశయాలకు ప్రాతినిథ్యం వహించే వ్యక్తిగా చూసుకోవాలని ఆశపడతాడు..కానీ కాస్త నిశితంగా గమనిస్తే,చేగువేరా ఏ పెట్టుబడిదారీ వ్యవస్థనైతే వ్యతిరేకించారో అదే పెట్టుబడిదారీ వ్యవస్థకు ఊతమిస్తూ వారి వ్యాపారంలో అతడు భాగంగా మిగిలిపోతున్నాడు..చేగువేరా అనే కమ్యూనిస్టు ఐకాన్ ప్రస్తుతం ఒక క్యాపిటలిస్టు కమోడిటీగా మారిపోవడం బార్త్ వ్యాసాలను గురించి చెప్పడానికి నేను ఎన్నుకున్న ఒక చిన్న ఉదాహరణ మాత్రమే..అన్ని ప్రచార మాధ్యమాలూ,సినిమా,ఆర్ట్ వంటివన్నీ ఇటువంటి నిజమైన ఆకారాలను పోలిన అభూతకల్పనలని తన వ్యాసాల్లో రుజువులతో సహా నిరూపిస్తారు బార్త్.

తొలి వ్యాసంలో మల్లయుద్ధం గురించి ఇలా రాస్తారు,
A wrestler can irritate or disgust, he never disappoints, for he always accomplishes completely, by a progressive solidification of signs, what the public expects of him. In wrestling, nothing exists except in the absolute, there is no symbol, no allusion, everything is presented exhaustively. Leaving nothing in the shade, each action discards all parasitic meanings and ceremonially offers to the public a pure and full signification, rounded like Nature. This grandiloquence is nothing but the popular and age-old image of the perfect intelligibility of reality.
రెండో వ్యాసంలో కుందేరా 'Kitsch' ను తలపించే 'Bourgeois art' గురించి రాస్తూ Mankiewicz జూలియస్ సీజర్ సినిమాలో సింబాలిజంను ప్రస్తావిస్తారు..ఇందులో రోమన్ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా దాదాపూ అన్ని పాత్రలకూ నుదుటిమీద పడే చిన్న చిన్న జాలర్లవంటి కేశాలంకరణ కనిపిస్తుంది,బట్టతల ఉన్న వాళ్ళు ఎక్కడా కనిపించరు..కానీ నిజానికి అన్ని రకాలవాళ్ళూ ఉండే రోమన్ సంస్కృతిని సింబలైజ్ చేస్తూ వారి తలమీద ఫ్రిన్జెస్ ని అమర్చడం చవకబారు ఆర్ట్ అంటారు బార్త్.
Those who have little hair have not been let off for all that, and the hairdresser—the king-pin of the film—has still managed to produce one last lock which duly reaches the top of the forehead, one of those Roman foreheads, whose smallness has at all times indicated a specific mixture of self-righteousness, virtue and conquest.
What then is associated with these insistent fringes? Quite simply the label of Roman-ness. We therefore see here the mainspring of the Spectacle—the sign—operating in the open. The frontal lock overwhelms one with evidence, no one can doubt that he is in Ancient Rome. And this certainty is permanent: the actors speak, act, torment themselves, debate 'questions of universal import', without losing, thanks to this little flag displayed on their foreheads, any of their historical plausibility.
ఈ సినిమాలో మరొక సింబాలిజం ఏంటంటే అన్ని పాత్రల మొహాలకూ వేజలైన్ రాసి చెమటోడుతూ ఉన్నట్లు కనిపించేలా జాగ్రత్త తీసుకోవడం..ఈ మొహాలు చెమటకారుతూ ఉండడం ఒక 'మోరల్ ఫీలింగ్' ని చూపిస్తూ ప్రతి ఒక్కరూ అంతః సంఘర్షణకు లోనవుతున్నారని చెప్పకనే చెపుతుంది..అందరూ సీజర్ కు పడే శిక్షను గురించి తర్జనభర్జనలు పడుతున్నారు..ఒక్క సీజర్ మాత్రమే మొహం మీద చెమట లేకుండా,ఎటువంటి భావోద్వేగాలూ కనిపించనీయకుండా,స్థిరంగా చలనం లేనట్లు ఈ సినిమాలో కనిపిస్తాడు..ఎందుకంటే ఇక్కడ 'ఆబ్జెక్ట్ ఆఫ్ క్రైమ్' సీజర్ కాబట్టి అతడికి ఏమి జరుగుతుందో తెలీని ఖాళీతనం అతడి మొహంలో ద్యోతకమవుతుంది అంటారు బార్త్.

The Writer on Holiday అనే మరో వ్యాసంలో 'Gide was reading Bossuet while going down the Congo' అని పేపర్లో Le Figaro తీసిన గిడే ఫొటోతో సహా ప్రచురించిన వార్తను విశ్లేషిస్తూ బార్త్ సంధించిన వ్యంగ్యాస్త్రాలు చదవడానికి మహా సరదాగా అనిపించాయి..' Here is therefore a good piece of journalism, highly efficient sociologically, and which gives us, without cheating, information on the idea which our bourgeoisie entertains about its writers అని 'మీడియా మిథ్స్' ను తూర్పారబడుతూ చాలా సాధారణమైన అంశాలకు మన మీడియా అనవసరమైన ప్రాధాన్యతను ఆపాదించి,ఐడియలైజేషన్ పేరిట కట్టుకథల్ని ఎలా తయారుచేస్తుందో,మధ్యతరగతి దాని ప్రభావానికి ఎలా లోనవుతుందో తెలిపే వ్యాసం ఇది..మనిషన్నాకా ప్రయాణాలు  చెయ్యడమైనేది సర్వసాధారణం..నిజానికి 'రచయిత' అనేవాడు సెలవు తీసుకున్నా అతడి మ్యూజ్ మాత్రం సెలవు తీసుకోదు..అందువల్ల రచయిత ఆటవిడుపు ప్రయాణాల్లో కూడా పని చేస్తూనే ఉంటాడు..అతణ్ణి నిరంతరం ఘోస్ట్ లా అంటిపెట్టుకుని ఉండే 'మ్యూజ్' అతణ్ణి విశ్రాంతిగా ఉండనివ్వదు..ఏ హోటల్ గదిలోనో పెన్నూ పేపర్ చేతబట్టుకుని అతడు నిరంతరం తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూనే ఉండాలి,ప్రస్తుతం రాస్తున్న పుస్తకాలకో,భవిష్యత్తులో ప్రచురించబడే పుస్తకాలకో గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉండాలి..పేద శ్రామికవర్గాల ఆటవిడుపు ప్రయాణాలతో పోలిస్తే ఒక రచయిత పరిస్థితి కడు దయనీయం..కానీ మీడియా ఈ యదార్ధాన్ని కప్పిపుచ్చి రచయిత ప్రయాణాన్ని అందంగా గ్లోరిఫై చేస్తుంది..మరో మిత్ అన్నమాట.
And the 'naturalness' in which our novelists are eternalized is in fact instituted in order to convey a sublime contradiction: between a prosaic condition, produced alas by regrettably materialistic times, and the glamorous status which bourgeois society liberally grants its spiritual representatives (so long as they remain harmless)
By having holidays, he displays the sign of his being human; but the god remains, one is a writer as Louis XIV was king, even on the commode.
ఇందులో చార్లీ చాప్లిన్ ఆర్ట్ యొక్క శైలిని విశ్లేషిస్తూ గురించి రాసిన మరొక వ్యాసం నన్ను ఆకట్టుకుంది..ఆయన సినిమాలను గమనిస్తే చాప్లిన్ శ్రామిక వర్గాన్ని ఎప్పుడూ పేదరికానికి ప్రతినిథులుగానే చూస్తారు..కానీ ఈ శ్రామికవర్గపు కష్టాలను ఎక్కడా రాజకీయాలకు ముడిపెట్టిన దాఖలాలు కనిపించవు..తన శ్రామికవర్గ పక్షపాతం విషయంలో స్పష్టత లేని ఒకవిధమైన రాజకీయ సందిగ్ధం గురించి విశ్లేషిస్తూ,మనం చాప్లిన్ సినిమా చూస్తున్నప్పుడు శ్రామికవర్గంపై రాజకీయపరమైన ప్రభావం చాప్లిన్ కథానాయకుడి దృష్టిని కూడా దాటిపోతుంది..అరే అసలు విషయాన్ని గమనించకుండా ఎంతసేపూ ఆకలీ,నిద్దురా అంటూ తన ముందున్న అవసరాలమీదే అతడి దృష్టి పెడతాడేంటి అని మనకి అనిపిస్తుంది..ఈ చిన్న లాజిక్ ను చాప్లిన్ తన ఆర్ట్ లో సమర్ధవంతంగా వాడుకున్నారంటారు బార్త్.
Now Chaplin, in conformity with Brecht's idea, shows the public its blindness by presenting at the same time a man who is blind and what is in front of him. To see someone who does not see is the best way to be intensely aware of what he does not see: thus, at a Punch and Judy show, it is the children who announce to Punch what he pretends not to see.
All told, it is perhaps because of this that Chaplin-Man triumphs over everything: because he escapes from everything, eschews any kind of sleeping partner, and never invests in man anything but man himself. His anarchy, politically open to discussion, perhaps represents the most efficient form of revolution in the realm of art.
ఈ పుస్తకంలో ఫ్రాన్స్ లో 1957లో అలజడి సృష్టించిన ముగ్గురు బ్రిటీషర్ల హత్య కేసు Dominici ట్రయల్ గురించి ఒక వ్యాసం ఉంది..ఈ కేసు స్టడీ ఇటీవల జరుగుతున్న ఎన్కౌంటర్లు,వాటిలో మీడియా పాత్రను మరోసారి చర్చిస్తుంది..మీడియా,సాహిత్యం అన్నీ కలిసి ఖచ్చితమైన సాక్ష్యాధారాలు లేకపోయినా,వాస్తవాలకు ఎవరికి తోచిన ఊహాగానాల్ని (మిత్) ను వారు జోడించి నిందితుడు Gaston Dominici కు మరణశిక్ష పడేలా ఎలా చేశారన్నది ఈ వ్యాసం సారాంశం..బార్త్ వాదన ఇంతకుమునుపు నాకుండే కొన్ని మూఢ నమ్మకాలను పునరాలోచించుకునేలా చేసింది.

Periodically, some trial, and not necessarily fictitious like the one in Camus's The Outsider, comes to remind you that the Law is always prepared to lend you a spare brain in order to condemn you without remorse, and that, like Corneille, it depicts you as you should be, and not as you are.
Justice took the mask of Realist literature, of the country tale, while literature itself came to the court-room to gather new 'human' documents, and naively to seek from the face of the accused and the suspects the reflection of a psychology which, however, it had been the first to impose on them by the arm of the law.
Only, confronting the literature of repletion (which is always passed off as the literature of the 'real' and the 'human'), there is a literature of poignancy; the Dominici trial has also been this type of literature. There have not been here only writers hungering for reality and brilliant narrators whose 'dazzling' verve carries off a man's head; whatever the degree of guilt of the accused, there was also the spectacle of a terror which threatens us all, that of being judged by a power which wants to hear only the language it lends us. We are all potential Dominicis, not as murderers but as accused, deprived of language, or worse, rigged out in that of our accusers, humiliated and condemned by it. To rob a man of his language in the very name of language: this is the first step in all legal murders.
I am only wondering about the enormous consumption of such signs by the public. I see it reassured by the spectacular identity of a morphology and a vocation, in no doubt about the latter because it knows the former, no longer having access to the real experience of apostleship except through the bric-a-brac associated with it, and getting used to acquiring a clear conscience by merely looking at the shop-window of saintliness; and I get worried about a society which consumes with such avidity the display of charity that it forgets to ask itself questions about its consequences, its uses and its limits.
మరోవ్యాసంలో పిల్లల బొమ్మల్ని గురించిన మనకున్న కొన్ని మిత్స్ ని బ్రేక్ చేస్తూ,ఊహాత్మకతను పెంపొందించేవిగా తయారు చెయ్యవలసిన బొమ్మల బదులు ప్లాస్టిక్ బొమ్మలు వారి మానసిక ఎదుగుదలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో వివరిస్తారు.
However, faced with this world of faithful and complicated objects, the child can only identify himself as owner, as user, never as creator; he does not invent the world, he uses it: there are, prepared for him, actions without adventure, without wonder, without joy. He is turned into a little stay-at-home householder who does not even have to invent the mainsprings of adult causality; they are supplied to him ready-made: he has only to help himself, he is never allowed to discover anything from start to finish. The merest set of blocks, provided it is not too refined, implies a very different learning of the world: then, the child does not in any way create meaningful objects,
French toys are usually based on imitation, they are meant to produce children who are users, not creators.
ఇలా రాసుకుంటూపోతే బార్త్ రాసిన ఒక్కో వ్యాసం గురించి ఒక్కో నోట్ రాయవలసి ఉంటుంది..ఇందులో మొదటి వంద పేజీల వరకూ మిత్ ను ఉదాహరణలతో సహా చర్చించారు..ఇవి చదవడం తేలికే..కానీ ఆ తరువాత 'మిత్' కు శాస్త్రీయమైన థియరీని గురించి ఆయన రాసిన అంశాలు ఒకటికి రెండుసార్లు చదివితే గానీ కొరుకుడు పడలేదు..చదువుతున్నప్పుడు అర్ధమైనట్లే అనిపించినా కొన్ని కాన్సెప్ట్స్ మళ్ళీ మళ్ళీ రిఫర్ చెయ్యాల్సొచ్చింది..ఇది చదువుతున్నప్పుడు పీటర్ మెండెల్సండ్ రాసిన 'What we see when we read' అని గత ఏడాది చదివిన పుస్తకం ఒకటి జ్ఞాపకం వచ్చింది..మనం చదివే పదాలు మన మెదడులోని సృజనాత్మకతకు తోడై ఎన్ని వైవిధ్యమైన అర్ధాలనూ,ఇమేజ్ లనూ సంతరించుకుంటాయో వివరించిన పుస్తకం అది..ఈ పుస్తకంలో మల్ల యుద్ధం మొదలు మార్గరైన్ వరకూ,సబ్బులు మొదలు సాహిత్యం వరకూ,ఫెమినిజం మొదలు స్ట్రిప్ టీస్ వరకూ,ఐన్స్టెయిన్ రిలేటివిటీ మొదలు జెట్ మాన్ వరకూ,కుకరీ మొదలు ట్రావెల్ గైడ్స్ వరకూ,ఇలా చెప్పుకుంటూ పోతే బార్త్ స్పృశించని అంశమంటూ లేదు..మరో ప్రత్యేకత ఏంటంటే ఇందులో రచయిత విశ్లేషణాలన్నీ కేవలం ఒక ఉపరితలం వద్ద ఆగిపోకుండా అన్ని కోణాల్లోనూ చర్చిస్తూ భ్రమకూ,వాస్తవికతకూ తేడాలను ఎత్తిచూపేవిధంగా లోతుగా సాగుతాయి..ఇది చదివిన తరువాత విన్న మాటల్ని విన్నట్లు నమ్మలేం,చూసినదాన్ని చూసినట్లు నిజమనుకోలేం..దేన్నైనా గ్రహించే విషయంలో మన దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసే రచన ఈ మైథాలజీస్..

కౌటిల్యుని అర్థ శాస్త్రంలా,కృష్ణ గీతలా సత్యానికీ,అసత్యానికీ,మంచీ చెడులకీ మధ్యనున్న భేదం తెలియాలంటే రోలాండ్ బార్త్ రాసిన ఈ సైంటిఫిక్ భగవద్గీతను తప్పకుండా నిరంతరం పారాయణ చెయ్యడం అవసరం.

పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు,
Semiology is a science of forms, since it studies significations apart from their content.
We must here recall that the materials of mythical speech (the language itself, photography, painting, posters, rituals, objects, etc.), however different at the start, are reduced to a pure signifying function as soon as they are caught by myth.
Myth sees in them only the same raw material; their unity is that they all come down to the status of a mere language. Whether it deals with alphabetical or pictorial writing, myth wants to see in them only a sum of signs, a global sign, the final term of a first semiological chain.
As a total of linguistic signs, the meaning of the myth has its own value, it belongs to a history, that of the lion or that of the Negro: in the meaning, a signification is already built, and could very well be self-sufficient if myth did not take hold of it and did not turn it suddenly into an empty, parasitical form. The meaning is already complete, it postulates a kind of knowledge, a past, a memory, a comparative order of facts, ideas, decisions.When it becomes form, the meaning leaves its contingency behind; it empties itself, it becomes impoverished, history evaporates, only the letter remains. There is here a paradoxical permutation in the reading operations, an abnormal regression from meaning to form, from the linguistic sign to the mythical signifier.
To be a critic by profession and to proclaim that one understands nothing about existentialism or Marxism (for as it happens, it is these two philosophies particularly that one confesses to be unable to understand) is to elevate one's blindness or dumbness to a universal rule of perception, and to reject from the world Marxism and existentialism: 'I don't understand, therefore you are idiots.'
But if one fears or despises so much the philosophical foundations of a book, and if one demands so insistently the right to understand nothing about them and to say nothing on the subject, why become a critic? 
There is a single secret to the world, and this secret is held in one word; the universe is a safe of which humanity seeks the combination: Einstein almost found it, this is the myth of Einstein.