మొదట్లో మనిషి భౌతిక అవసరాలనూ,పునరుత్పత్తినీ క్రమబద్ధీకరించే విధంగా ఏర్పడిన వివాహ వ్యవస్థకు తరువాతి కాలంలో సంప్రదాయపు ముసుగులు తొడిగింది సమాజం..విదేశాలతో పోలిస్తే,పిల్లలు పుట్టడం,పుట్టకపోవడం అనే ప్రకృతి సహజమైన అంశాలకు భారతీయ సమాజంలో చాలా ప్రాథాన్యత ఉంది..ఎంతంటే పిల్లలు పుట్టకపోతే మరణానంతరం స్వర్గంలో తాము కూర్చోబోయే కుర్చీమీద అడ్వాన్సుగా కర్చీఫు వేసుకునే అవకాశం కోల్పోయినట్లు భావిస్తారు..ఇక కొడుకులైతే పున్నామనరకాలు తప్పిస్తారనే తరహా నమ్మకాలకు దురదృష్టవశాత్తూ ఈనాటికీ కాలం చెల్లలేదు..ఇటువంటి కొన్ని నమ్మకాలు వ్రేళ్ళూనుకుని ఉన్న సంస్కృతిని కథాంశంగా చేసుకుని ప్రముఖ తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ 2010 లో 'వన్ పార్ట్ వుమన్' అనే పుస్తకాన్ని రాశారు..హిందూత్వాన్ని కించపరిచే విధంగా ఉందంటూ తీవ్ర వివాదాలపాలై,చివరకు మురుగన్ చేత కొంత కాలంపాటు బలవంతపు అస్త్ర సన్యాసం చేయించిన ఈ రచనకు తరువాత రెండు రకాల ముగింపులనిస్తూ 2018 లో 'ట్రయల్ బై సైలెన్స్','ఎ లోన్లీ హార్వెస్ట్' అనే రెండు సీక్వెల్స్ కూడా వచ్చాయి.
ఇక కథ విషయానికొస్తే 1940ల కాలంలో తమిళనాడులోని కొంగునాడు ప్రాంతానికి చెందిన రైతుకుటుంబానికి చెందిన కాళీ,పొన్నా లకు పెళ్ళై పదేళ్ళైనా పిల్లలు కలగరు..కానీ వారిద్దరిదీ అన్యోన్యమైన దాంపత్యం..కాళీకి భార్యే సర్వస్వం,అందుచేత పెద్దలు ఎంత ప్రయత్నించినా మారుమనువుకి కూడా ఒప్పుకోడు..కానీ పిల్లల్లేని కారణంగా ఆ ఊరి జనమంతా వాళ్ళని నానామాటలూ అంటుంటారు..ముఖ్యంగా స్త్రీ కావడం వల్ల పొన్నా మరిన్ని అవమానాలపాలవుతుంటుంది..సామాజికపరమైన వత్తిళ్ళు తట్టుకోలేక విసిగివేసారిన ఆ దంపతులకు పిల్లలు పుట్టడానికి లోపాయికారిగా ఒక మార్గాన్ని సూచిస్తారు కుటుంబ పెద్దలు..దక్షిణ భారతంలోని తిరుచెంగోడ్ అర్థనారీశ్వరాలయంలో ప్రతియేడూ జరిగే జాతరలో పధ్నాలుగో రోజున ఒక వింత ఆచారం ఉంటుంది..పిల్లలు కలగని స్త్రీ ఆ రాత్రి కొండమీద ఏ పురుషుని ద్వారానైనా తల్లి కావచ్చు..ఆ ఒక్కరోజూ కొండమీద జాతరకు వచ్చిన మగవారందరు దేవుళ్ళని నమ్ముతారు,తద్వారా కలిగిన సంతానాన్ని దేవుని ప్రసాదంగా భావిస్తారు..కానీ ఈ వ్యవహారమంతా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతుంటుంది..కాళీకి ఈ ఆచారం సుతరామూ ఇష్టం ఉండదు..కానీ పెద్దల జోక్యం వల్ల తప్పని పరిస్థితుల్లో పొన్నా ఆ రాత్రి కొండ మీదకు వెళుతుంది..ఆ తరువాత ఏమైంది,కాళీ పొన్నాల వైవాహిక జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురయ్యాయన్నది మిగతా కథ.
కథలో నూతనత్వం,కాంట్రవర్సీ చేసినంత విషయమూ నాకు కనపడలేదు గానీ కథనం మాత్రం చాలా బావుంది..పెరుమాళ్ మురుగన్ కొంగునాడు ప్రాంతీయ సంస్కృతీ సంప్రదాయాల్ని,ఆనాటి ప్రజల జీవన విధానాన్నీ సజీవంగా కళ్ళముందుకు తీసుకొస్తారు..ప్రతీ చిన్న పక్షీ,ఆకూ,మొక్కా,చెట్టూ చేమా,జంతుజాలాలన్నీ మురుగన్ కలంలో ప్రాణం పోసుకుంటాయి..ముఖ్యంగా ఆయన వర్ణనల్లో గాఢత,లోతూ చాలా నన్ను చాలా ఆశ్చర్యపరిచాయి..సమకాలీన సాహిత్యంలో ఎటువంటి గమనింపులూ లేకుండా ఒక ఉపరితలం మీద ఫ్లాట్ గా సాగిపోయే చప్పని వర్ణనల మధ్య ఈ కథలో అంతర్భాగంగా రాసిన చిన్న చిన్న సంగతులూ,విషయ విశేషాలూ అమితంగా ఆకట్టుకుంటాయి..ఒక రచయితకు కథ చెప్పేటప్పుడు 'డిటైల్స్' పట్ల పెట్టాల్సిన శ్రద్ధ గురించి తెలియాలంటే ఈ కథను మంచి ఉదాహరణగా చూపించవచ్చు..పల్లె ప్రాంతపు ప్రకృతి వర్ణనలతో బాటు సాంఘిక కట్టుబాట్లూ,దురాచారాలూ,సంస్కృతి సంబంధితమైన ఏ ఒక్క చిన్న వివరాన్నీ వదలకుండా,అలాగే ఎక్కడా అనవసర సాగతీతలతో విసుగుతెప్పించకుండా కథను ఆపకుండా చదివిస్తారు రచయిత.
ఆవులూ ఈనడం,పొలం పనులూ లాంటి వివరాల మొదలు గంగరావి చెట్టు కొమ్మల నీడన భార్యా భర్తా చెప్పుకునే ఊసులూ,అల్లరిగా అటుఇటు తిరిగే కోడిపిల్లలూ,కాళీ,పొన్నాలు ఇష్టంగా పెంచుకునే వంకాయ పాదులూ,ఎడ్లబళ్ళెక్కి తిరనాళ్ళకి వెళ్ళే గ్రామస్థులూ,కాలినడకన గుళ్ళకి వెళ్తూ అలసట తెలీకుండా నల్లుపయ్యన్ మామ చెప్పే పిట్ట కథలూ (Vulgar renditions of Original stories),ఇవన్నీ తమిళనాడు రూరల్ ప్రపంచాన్ని అచ్చంగా కళ్ళముందుకు తెస్తాయి.
ఇక పాత్రల విషయానికొస్తే 'వన్ పార్ట్ వుమన్' లో కథ ముఖ్యంగా కాళీ పొన్నా,నల్లుపయ్యన్ లాంటి ముఖ్య పాత్రల చుట్టూ తిరిగితే 'ట్రయల్ బై సైలెన్స్' లో కాళీ తల్లి శీరాయి,పొన్నా అన్నగారు ముత్తు పాత్రలు కూడా ప్రధానపాత్రలతో సరి సమానమైన ప్రాముఖ్యత కలిగి ఉంటాయి..వయసుపైబడుతున్నా అటు కొడుకుకి సర్దిచెప్తూ,కోడల్ని కంటికి రెప్పలా చూసుకునే ముదుసలి శీరాయి పాత్రని మర్చిపోవడం కష్టం..ఒక దశలో ఆమె మూఢనమ్మకాలూ,అజ్ఞానం కూడా ఆమెపై కోపం తెప్పించకపోవడం ఆశ్చర్యం..ఇక తన అభ్యుదయ భావాలతో సమాజానికి ఎదురీది బ్రతికే నల్లుపయ్యన్ పాత్ర ద్వారా రచయిత తన స్వంత అభిప్రాయాలకు గళాన్నిచ్చే ప్రయత్నం చేశారేమో అనిపించింది.
తప్పొప్పుల నిర్వచనాలు తరతరానికీ మారుతుంటాయి..ఒక తరానికి సరైన సంప్రదాయం మరో తరానికొచ్చేసరికి ఛాందసత్వంగా మారుతుంది..జీవితంలో సగభాగం తమిళనాడులో గడిచిన కారణంగా ఇక్కడి పల్లె జీవితం,సంస్కృతీ సంప్రదాయాలూ నాకు కొత్తేమీ కాదు..తమిళులకు భాషే కాదు,సంప్రదాయం అంటే కూడా మక్కువ ఎక్కువే..ఇక్కడి పల్లెల్లో ఇప్పటికీ సంప్రదాయాలకు విలువిచ్చే కుటుంబాలు కోకొల్లలు..పట్టణాల్లో నాకు తెలిసిన ప్రపంచంతో ఎంతమాత్రమూ పోలిక లేని మరో సమాంతర ప్రపంచం ఇది..శిలంబం (కర్రసాము) నేర్చుకునే పిల్లలూ,లంకంత ఇళ్ళున్నా సాయంత్రం కాగానే చుట్ట కాలుస్తూ రోడ్ మీదే కూర్చుని కబుర్లు చెప్పుకునే ఆసాములూ,పత్తి,జొన్న పంటల్లో కూనిరాగాలు తీస్తూ పనులు చేసుకునే రైతులూ,అమ్మవారి జాతరలూ లాంటివి ఇక్కడ సర్వ సాధారణ దృశ్యాలు..కానీ పెరుమాళ్ మురుగన్ రచనల్లో నాకు తెలిసిన ప్రపంచాన్ని అక్షరాల్లో చదువుకోవడం మరింత బావుంది..మీ పుస్తకానుభవాన్ని
పాడుచేసే ఉదేశ్యం లేదు గనుక ముగింపుల జోలికి పోవడం లేదు,కానీ నేను రెండు పారలెల్ సీక్వెల్స్ లో 'ట్రయిల్ బై సైలెన్స్' చదివాను..ఇక రెండో ముగింపు నాకు ఆసక్తి లేనిది కాబట్టి దాన్ని వదిలేశాను.
తమ కూతకు భిన్నంగా కూసిందని సదరు పక్షిని తమ సమూహానికి చెందదని వెలివేస్తాయి మిగతా పక్షులు..ఇది వరకూ చెప్పినట్టు,సమూహాల్లో మసలాడానికి ఆ సమూహపు నియమాల్ని ఇష్టం ఉన్నా లేకపోయినా పాటించాలి..మనిషి కూడా దీనికి భిన్నమేమీ కాదు,తనకు భిన్నంగా ఉన్నదానిని ఒక రకమైన శత్రుభావంతో చూస్తాడు..దీనికి కారణం తనకు తెలియని విషయం పట్ల మనిషికుండే భయం తప్ప మరొకటి కాదంటుంది మనస్తత్వ శాస్త్రం..ఈ మధ్య అనేక పాశ్చాత్య దేశాల్లో పిల్లల్ని కనడాన్ని ఒక ఛాయిస్ గా చేసుకుంటున్నారు..కానీ వేషభాషల్లో ఆధునిక సంస్కృతిని వేలంవెర్రిగా అనుసరించే భారతీయ సమాజంలో నేటికీ కట్టుబాట్ల రూపంలో కొన్ని జాడ్యాలు అమలులోనే ఉన్నాయి..ఒకవేళ మనిషి ఆ కట్టుబాట్ల చట్రానికావల అడుగుపెడితే అది పాపమనీ,దోషమనీ హెచ్చరిస్తూ మళ్ళీ తన గుంపులోకి లాగడానికి విశ్వ ప్రయత్నాలూ చేస్తుంది చుట్టూ ఉన్న సమాజం..వివాహ వ్యవస్థలో పిల్లలు కనడం అందరు చెయ్యాల్సిన పని(?) కాబట్టి దంపతులందరూ పిల్లల్ని కనితీరాలి,లేకపోతే అరిష్టమనీ,అశుభమనీ వాళ్ళని సామజిక వృత్తాల నుండి వెలివేస్తారు..అవమానాలు చేస్తారు.ఈమధ్య కాలంలో సామజిక స్థితిగతుల్లో స్థాయీ భేదం లేకుండా అన్ని వర్గాల వారినీ కలచివేస్తున్న ఒక ముఖ్యమైన సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చిన పెరుమాళ్ మురుగన్ లాంటి రచయితలు రాబోయే కాలంలో సమాజానికి ఎంతో అవసరం..ఈ మధ్య న్యూయార్క్ టైమ్స్ లోనూ,ప్రతిష్టాత్మక పుష్కిన్ ప్రెస్ అనువాదాల్లోనూ పెరుమాళ్ మురుగన్ పుస్తకాలను చూసి సంతోషంగా అనిపించింది..మెయిన్ స్ట్రీమ్ లిటరేచర్ లో ఆంగ్ల సాహిత్యం మాత్రమే కాకుండా ప్రాంతీయ సాహిత్యం కూడా ప్రపంచ వ్యాప్తంగా అనువాదాలకు వెళ్ళడం మంచి పరిణామం.
ఈ రెండు పుస్తకాల నుండీ కొన్ని వాక్యాలు,
Nallayyan defended himself right away. ‘All stories have such a version, let me tell you. I know so many of them. Why don’t you tell me a story? I will tell you a bawdy version of your story too.’
Even when you have spent years with some : people, their real faces are revealed only when the right time comes. God knows how many faces lie concealed forever, with no opportunity to reveal themselves.
నల్లుపయ్యన్ భావాలు,
Why? For whom do I hang my head low now? It is only you who is relentlessly talking about having children. All right, go ahead and have a child. But do you know how you should live? Like that crow that has built a nest on that palm tree.When it knows it is going to lay eggs, it builds its nest. Then it incubates the eggs and hatches them. It finds food for the little ones and takes care of them until they grow their own wings. Once that happens, what do you think is the relationship between the baby crow and its mother? They go their separate ways. “You got your wings, now get out of here, and fend for yourself.” That’s the way to live. Instead, we give birth, raise them, get them married, save money and struggle. Is this any way to live? If we were more like crows and cuckoos, I’d also like to have children.
'Trial by silence' నుండి కొన్ని,
‘Who are we to decide right and wrong? Something that seemed right to your father now seems wrong to you. And what seems right to you now will seem wrong to your son in the future. These are all big questions. You just do your thing and keep moving.
Pointing to a man who walked with a large bundle on his head and two other bundles on his shoulders, he said, ‘He is like a load-bearing rock. We can place as much weight as we want on him. It will stay rock solid, but it will be very difficult to move it.’ Then he pointed to a man who carried a large bundle on his back, and said, ‘He is a donkey. He can carry things, but he knows nothing else. A donkey is happy as long as it finds a place where it can be by itself.’ Then he directed Kali’s attention to a man who carried a lot of pots and pans and was walking with his family. About him, Nallayyan said, ‘Look at him carefully. He is basically carrying his entire household on his head. No matter where he goes, he can never set that burden down. I cannot show you worse idiocy than this.’ Kali laughed at all these remarks.
Image Courtesy Google |

No comments:
Post a Comment