ప్రతీ మనిషి లోపలా రాయని పుస్తకం ఒకటుంటుంది..కానీ తమ లోపలి పుస్తకానికి అక్షరాల ఆయుష్షునిచ్చి ప్రాణం పోసే శక్తి అందరికీ ఉండదు,ఆ శక్తి ఉన్నది రచయితలకు మాత్రమే.."మీరెందుకు రాస్తారు?" అనే ప్రశ్న ఒక్కోసారి క్లిష్టమైందిగా అనిపిస్తే మరికొన్నిసార్లు కామికల్ గా అనిపిస్తుంది..అయినా అదేం పిచ్చి ప్రశ్న! ఎవరైనా రాయగలరు కాబట్టి రాస్తారు అంటారు కొందరు.. నిజానికి రాయడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి..అవి మనిషి మనిషికీ మారతాయి..కొంతమంది విడుదల కోసం రాస్తే,మరికొంతమంది తమ ఉనికిని వెతుక్కోవడం కోసం రాస్తారు..కొంతమంది తమ స్వరాన్ని వినిపించాలని రాస్తే,మరికొంతమంది తమలో చెలరేగే ఆలోచనల అలజడిని తగ్గించుకోడానికి రాస్తారు.
నార్వే రచయిత 'కార్ల్ ఓవే కెనాస్గార్డ్' ('K' సైలెంట్ అనుకున్నా ఇంతకాలం) కు కూడా కొన్ని బలమైన కారణాలున్నాయి.. కాఫ్కాలాగే కెనాస్గార్డ్ కి కూడా మొదట్నుంచీ తండ్రితో సత్సంబంధాలు లేవు..తనను తానుగా స్పష్టంగా చూడలేనీ,అంగీకరించలేనీ తండ్రి కాఠిన్యం ఆయన బాల్యం మీద చెరగని ముద్ర వేసిందంటారు.తనలో రచయిత కావాలన్న కోరికకు బీజం పడింది అక్కడే అంటారాయన.."సాహిత్యం నేను ఎవరికీ కనపడకుండా తలదాచుకునే చోటు.అదే సమయంలో అది నేను నేనుగా కనిపించే చోటు " అనడంలో కెనాస్గార్డ్ బాల్యంలో కోల్పోయిన ఉనికిని వెతుక్కునే ప్రయత్నం కనిపిస్తుంది.
రాయడం గురించి ఏ రచయితనడిగినా మొదట వచ్చే సమాధానం "నీకు తెలిసింది రాయి" అనే..కెనాస్గార్డ్ తనకు తెలిసిందే రాశారు..తన జీవిత విశేషాలను,ముఖ్యంగా తన తండ్రితో ఉన్న సంక్లిష్టమైన సంబంధాన్ని గురించి ఆయన రాసిన మెమొయిర్ 'మై స్ట్రగుల్' సిరీస్ అంతర్జాతీయంగా ఖ్యాతి గడించింది..యేల్ యూనివర్సిటీ ప్రెస్ పాటీ స్మిత్ 'డివోషన్' తరువాత 'Why I Write' సిరీస్ లో భాగంగా ప్రచురించిన రెండో పుస్తకమిది.ఈ పుస్తకంలో ప్రస్తావించిన అనేక విషయాల గురించి పూర్తిగా రాయడం సాధ్యం కాదు కాబట్టి,నాకు నచ్చిన కొన్ని అంశాలను మాత్రం ప్రస్తావిస్తాను.
కెనాస్గార్డ్ "మీరెందుకు రాస్తారు?" అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం చెప్పడం కష్టమంటూనే రచనావ్యాసంగంలో తన అనుభవాలను నిజాయితీగా వివరించే ప్రయత్నం చేశారు..కెనాస్గార్డ్ ఆర్థర్ రింబాడ్ లా లిటరేచర్ ప్రాడిజీ కాదు,కేవలం సాహిత్యం పట్ల అభిరుచితో రచయితలవుదామని కలలుగనే సగటు రచయితలకు ప్రతినిధి మాత్రమే..ఈ కారణంగా రాయడమనే కళ ఆయనకు అంత సులభంగా పట్టుబడలేదు..బ్రిటిష్ డైలీ 'గార్డియన్' పత్రిక 'ట్రాష్' అని విమర్శించినా,స్నేహితుడు ఆయన ప్రతుల్ని పడేసి మళ్ళీ ప్రయత్నం చెయ్యమని సలహా ఇచ్చినా,తన పుస్తకం ప్రచురణకు తిరస్కరించబడినా కూడా ఆయన రాయడం మాత్రం మానలేదు..తొలినాళ్ళలో రచయితనవ్వాలనే తన ఆలోచనల గురించి రాస్తూ ఈ విధంగా అంటారు,
తన వాదనను సమర్ధించుకునే దిశగా కనుట్ హంసున్ (Knut Hamsun) 'Hunger' ను,మిలన్ కుందేరా 'The Unbearable Lightness of Being' తో పోలుస్తూ చేసిన విశ్లేషణను ప్రత్యేకంగా ప్రస్తావించాలి..ఈమధ్య మిత్రులొకరు కుందేరాతో తన స్వానుభవాన్ని గురించి చెప్తూ "ఆయన చాలా మీన్ ఫెల్లో" అన్నారు..కుందేరా అభిమానిగా నేను కాస్త ఆశ్చర్యపోయినా ఈ పుస్తకంలో కెనాస్గార్డ్ ఎనాలిసిస్ చదివి ఓహో అనుకున్నాను..కెనాస్గార్డ్ తనకు కనుట్ హంసున్ 'హంగర్' అద్భుతంగా అనిపిస్తే కుందేరా రచన పట్ల మాత్రం 'స్వభావసిద్ధమైన అయిష్టత' కలిగిందని అంటారు..ఎంత అయిష్టత అంటే దాని గురించి రాయాలనిపించడం లేదని అంటూ,"As if I could have written about it had I wanted to!" అని చమత్కరిస్తారు.
కెనాస్గార్డ్ విశ్లేషణ ఇలా సాగుతుంది:
ఈ పుస్తకంలో ఎందుకు రాస్తారని ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వకపోయినా కెనాస్గార్డ్ విశ్లేషణలన్నీ ఆ ఐడియా చుట్టూనే తిరుగుతాయి..
పుస్తకం నుండి మరికొన్ని వాక్యాలు,
That identity and our understanding of the world at one and the same time fit yet are arbitrary is, I think, the reason why art and literature exist. Art and literature constitute a continual negotiation with reality, they represent an exchange between identity and culture and the material, physical, and endlessly complex world they arise from.
Every Tuesday I brought home a shopping bag full of books. What I gained from this I don’t know; the essential thing about the books, I think, was that they constituted a place in the world where I could be, where nothing was demanded of me, where on the contrary I got what I wanted. I didn’t know anyone else who read except my brother, so I never talked about what I experienced in books, but it didn’t matter, the whole point of them being precisely that I read them alone, and yet it never felt like that, for while you were reading you were always together with someone else. I never thought about the books once I had finished them, and I didn’t learn anything from them, or rather, that was never the point. I consumed them, passed the time with them, escaped in them.
But as it happens, writing is precisely about disregarding how something seems in the eyes of others, it is precisely about freeing oneself from all kinds of judgments and from posturing and positioning. Writing is about making something accessible, allowing something to reveal itself.
The contradiction between the illimitable that dwells within us and our simultaneous limitation and earthboundness is the driving force behind all literature and all art, or so I believe, but not only that; the longing to equalize the difference, suspend the contradiction and simply exist in the world, undifferentiated from it, is also an important part of all religious practice.
Of course, that kind of literary experience was what my childhood reading was all about, and this is why the step from reading to writing was such a short one when I turned eighteen: I wanted to be there, in that state of utter absorption where everything else vanished and you were, in a sense, out of the world. To read is to be the citizen of another country, in a parallel realm which every book is a door to.Feelings were generally a problem for me, I felt too easily and too much, and reading somehow provided relief from that, at the same time that it generated new and unfamiliar emotions. In my reading I was in a sense exploring and charting the boundless inner world that Tolstoy had written about. All of it fit within me, and my inner world expanded radically, while the world I was in remained unchanged.
Image Courtesy Google |

"మొదటిసారి నేను రచయితను కావాలని అనుకుని లిటరరీ టెక్స్ట్స్ రాయడం మొదలుపెట్టినప్పుడు నాకు పద్దెనిమిదేళ్ళు.నిజానికి నేనెందుకు రాయాలనుకున్నానో నాకిప్పుడు గుర్తులేదు..బహుశా రాయడం పెద్దగా శ్రమపడకుండా నాకు అందుబాటులో ఉన్న విషయం కావచ్చు..అప్పుడు ఉత్తర నార్వేలోని సముద్రపు ఒడ్డున ఒక చిన్న పల్లెటూరిలో టీచరుగా ఉద్యోగం చేస్తున్నాను..అక్కడ నాకెవరూ పరిచయస్థులు లేరు,అందువల్ల నాకు రాసుకోడానికి కావాల్సినంత ఏకాంత సమయం దొరికింది అనుకున్నాను..కానీ అలా జరగలేదు..మహా అయితే నెలకో షార్ట్ స్టోరీ రాయగలిగేవాణ్ణి..ఆ సమయంలో రాసిన కథలన్నీ మా నాన్న ఆథిపత్యంలో నా చిన్ననాటి భయాలు,అనుభవాల సారాంశంగా రాసినవే."ఈ పుస్తకంలో చాలా అంశాలు నన్ను ఆలోచనలో పడేశాయి..ముఖ్యంగా సంక్లిష్టమైనదే సాహిత్యమనే సిద్ధాంతంతో కెనాస్గార్డ్ తీవ్రంగా విభేదించారు..ఇందులో వివరణలన్నీ ఆయన స్వంత శైలి అయిన రియలిస్టిక్ ఫిక్షన్ ను సమర్ధించే దిశగా సాగాయి..కుందేరా,బోర్హెస్,జేమ్స్ జోయ్స్ వంటివారి ప్రతిభా పాటవాలనూ,రచనా వ్యాసంగంలో విభిన్నమైన ప్రయోగాత్మక శైలుల్నీ ఒక ప్రక్క మెచ్చుకుంటూనే అన్నివేళలా సాహిత్యానికి సంక్లిష్టతను ఆపాదించి రచయిత వాస్తవిక దృక్పథంపై పరిథులు విధించడంపట్ల అసహనం వ్యక్తం చేస్తారు.
తన వాదనను సమర్ధించుకునే దిశగా కనుట్ హంసున్ (Knut Hamsun) 'Hunger' ను,మిలన్ కుందేరా 'The Unbearable Lightness of Being' తో పోలుస్తూ చేసిన విశ్లేషణను ప్రత్యేకంగా ప్రస్తావించాలి..ఈమధ్య మిత్రులొకరు కుందేరాతో తన స్వానుభవాన్ని గురించి చెప్తూ "ఆయన చాలా మీన్ ఫెల్లో" అన్నారు..కుందేరా అభిమానిగా నేను కాస్త ఆశ్చర్యపోయినా ఈ పుస్తకంలో కెనాస్గార్డ్ ఎనాలిసిస్ చదివి ఓహో అనుకున్నాను..కెనాస్గార్డ్ తనకు కనుట్ హంసున్ 'హంగర్' అద్భుతంగా అనిపిస్తే కుందేరా రచన పట్ల మాత్రం 'స్వభావసిద్ధమైన అయిష్టత' కలిగిందని అంటారు..ఎంత అయిష్టత అంటే దాని గురించి రాయాలనిపించడం లేదని అంటూ,"As if I could have written about it had I wanted to!" అని చమత్కరిస్తారు.
కెనాస్గార్డ్ విశ్లేషణ ఇలా సాగుతుంది:
"హంసన్ తన రచనలో తన ప్రొటొగోనిస్ట్ ని చాలా సన్నిహితంగా వెంబడిస్తాడు..ప్రత్యేకమైన ప్లాట్ గానీ,పాత్ర నిర్మాణంతో గానీ పని లేకుండా కథంతా ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుంది..ప్రొటొగోనిస్ట్ చుట్టూ ఉన్న ప్రపంచం యథాతథంగా ఆ పాత్ర ద్వారానే బహిర్గతమవుతుంది..పాఠకుడి పఠనానుభవంలో అదే ప్రపంచం ఆ ప్రధానపాత్ర ద్వారా వర్తమానంలో వాస్తవంగా రూపాంతరం చెందడంతో అతడికి భూతభవిష్యద్ కాలాల మీద అనవసర ధ్యాస ఉండదు..కానీ కుందేరా నేరేటర్ అలా కాదు,అతడు సర్వజ్ఞుడు..చుట్టూ ఉన్న పాత్రలతో తనకు నచ్చినట్లు వ్యవహరిస్తాడు,అసంబద్ధమైన పరిస్థితుల్లోకి నెట్టేస్తాడు..వాళ్ళకి దూరంగా అంటీముట్టనట్లు ఉంటూ వాళ్ళని తోలుబొమ్మల్లా చేసి ఆడిస్తాడు..ఈ స్థితిలో పాఠకుడి అనుభవంలో 'ఇల్యూజన్ ఆఫ్ రియాలిటీ ' పదేపదే ముక్కలవుతుంటుంది."Kundera is a writer of ideas, a master of superstructure, and as an essayist he has no peer in contemporary letters. అంటూనే,తన పఠనానుభవంలో 'సానుభూతి' కి చాలా ప్రాధాన్యతనిస్తాను కాబట్టి కుందేరా శైలికీ,లిటరరీ స్ట్రాటజీలకీ స్వతహాగానే దూరం జరిగానంటారు కెనాస్గార్డ్..పాఠకుడి ప్రాథాన్యతలు విస్మరించలేనివనీ,సాహిత్యంలో సాన్నిహిత్యాన్నీ,ఉనికినీ వెతుక్కోవడం తనకు అలవాటని అంటూ,అటువంటి అనుభవాన్ని ఇవ్వని రచనలు పాఠకుణ్ణి ప్రాపంచిక అనుభవాలకూ,వాస్తవికతకూ దూరం చేస్తాయనడం గమనార్హం.
ఈ పుస్తకంలో ఎందుకు రాస్తారని ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వకపోయినా కెనాస్గార్డ్ విశ్లేషణలన్నీ ఆ ఐడియా చుట్టూనే తిరుగుతాయి..
There are some fundamental rules of writing, for example that one shouldn’t psychologize when describing characters, or the related dictum “Show, don’t tell,” both of which spring from the realization that literature by its very nature always seeks complexity and ambiguity, and that monologic claims of truth about the world are antiliterary. In line with this, the statement “I write because I am going to die” is antiliterature, but the author with his sweater tucked into his trousers saying that he writes because he is going to die is literature.ఈ పుస్తకం రైటింగ్ గురించే అయినప్పటికీ ఇందులో రచయితలతో పాటు రచయితలు కావాలనుకునే వాళ్ళూ,పాఠకులూ ఏకకాలంలో ఐడెంటిఫై చేసుకునే అంశాలు అనేకం ఉన్నాయి..ముఖ్యంగా కెనాస్గార్డ్ ఒక రచయిత స్వరంలో కాకుండా ఒక సాహితీ ప్రేమికుడి స్వరంలో చర్చించిన పలు అంశాలు ఆసక్తికరంగా అనిపించాయి.Must read for readers and writers.