Saturday, July 6, 2019

Where the Crawdads Sing - Delia Owens

పుస్తకం పూర్తి చేసి ప్రక్కన పెట్టగానే "పంచేందుకే ఒకరులేని,బతుకెంత బరువో అనీ...ఏ తోడుకీ నోచుకోనీ,నడకెంత అలుపో అనీ.." అంటూ ఉన్నట్లుండి సీతారామ శాస్త్రి గారి పాట పెదాలమీదకొచ్చి కూర్చుంది..
When cornered, desperate, or isolated, man reverts to those instincts that aim straight at survival. Quick and just. They will always be the trump cards because they are passed on more frequently from one generation to the next than the gentler genes. It is not a morality, but simple math. Among themselves, doves fight as often as hawks.
నాగరికత నేర్చిన మనిషి ఆధునిక సమాజపు చట్రంలో ప్రకృతికి దూరంగా బ్రతుకుతున్నానని భ్రమపడినా,ఇప్పటికీ మానిషి ఉనికిని శాసించే పని తనదేనంటూ ప్రకృతి పరోక్షంగా తన పని తాను చేసుకుపోతూనే ఉంది..వేడెక్కిన నేల మీద కురిసిన వర్షపు జల్లులకు వచ్చే మట్టి వాసనంత సహజంగా మస్తిష్కంనుండి వెలువడే భావోద్వేగాలు   అవసరమైనప్పుడు ప్రకృతి నియమాలననుసరిస్తూ చుట్టూ ఉన్న నేలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి..ప్రకృతి-సంస్కృతి పరస్పరం ఒకద్దాన్నొకటి నిర్వచించుకుంటూ,ఈ చర్యలో మనిషిని మాత్రం చివరకు బాధ్యుడుగా నిలబెడతాయి..బలవంతుడు బలహీనుణ్ణి కొట్టి తన ఉనికిని చాటుకునే అలనాటి ఆటవిక న్యాయం,ఈనాటి నాగరిక సమాజంలో కూడా అమలులో ఉంది..ఇలా తెలిసో తెలీకో సమస్త జీవరాశులూ ప్రకృతి నియమావళిని అనుసరిస్తూనే ఉన్నాయి..ఎందుకంటే ఇక్కడ ఉనికి ప్రధానం..ఏం చేసైనా ఈ భూమ్మీద మనగలగాలి..అది నీటిలో గడ్డి మొలిచే తీరప్రాంతంలోనైనా,నాగరికత నేర్చిన ఆధునిక సమాజంలోనైనా సరే.
Image Courtesy Google
'Graveyard of Atlantic' అనే తీరప్రాంతం రక్షణ వలయంగా ఉన్న నేల (Marsh) చాలా ఏళ్ళుగా బానిసలకూ,దొంగలకూ,సమాజంనుండి వెలివెయ్యబడ్డవారికీ,కట్టుబాట్లకు ధిక్కరించేవారికీ నివాసంగా మారింది..ఆ నేలకు నియమాలూ,చట్టాలు వేరు..అక్కడి మనుషుల జీవన విధానం పూర్తిగా వేరు.."చిత్తడి నేలకు మృత్యువు గురించి తెలుసు,కానీ దానికి సంబంధించినంతవరకూ మృత్యువు ఒక విషాదం కాదు..పాపం అంతకంటే కాదు." అని ప్రారంభంలోనే నార్త్ కరోలినా తీరప్రాంతపు,గడ్డి మొలిచే బురదనేల నియమావళిని మనకు పరిచయం చేస్తారు..కానీ ఈ వాక్యంలో నిగూడార్థం పుస్తకం పూర్తిగా చదివాక గానీ అర్ధం కాదు..అమెరికన్ రచయిత్రి డెలియా ఓవెన్స్ తొలి నవలైన 'Where the Crawdads Sing'(2018) న్యూయార్క్ టైమ్స్ ఫిక్షన్ బెస్ట్ సెల్లెర్స్ లో ఒకటిగా నిలిచి విశేషంగా పాఠకుల ప్రశంసలందుకుంటోంది.

ఇది 'మార్ష్ గర్ల్' గా పిలవబడే క్యా (క్యాథెరిన్ క్లార్క్-Catherine Danielle Clark) కథ..'క్యా' నార్త్ కరోలినా తీరప్రాంతంలో (Marsh) జనారణ్యానికి దూరంగా చిన్న ఇంటిలో(shack) నివసిస్తుంటుంది..ఐదుగురు సంతానంలో ఆఖరిదైన క్యా (6) ఒక రోజు ఉదయం హఠాత్తుగా ఇల్లు వదిలి వెళ్ళిపోయిన తల్లి ఎప్పటికైనా తిరిగి వస్తుందని ఎదురుచూస్తుంటుంది..తల్లి రాలేదు సరికదా,తాగుబోతు తండ్రిని భరించలేక మిగిలిన ఇద్దరు అక్కలూ,ఇద్దరు అన్నలూ కూడా ఒక్కొక్కరుగా క్యాను వదిలి వెళ్ళిపోతారు..ఇకమీదట బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే ఇంటికి వచ్చే బాధ్యత లేని తాగుబోతు తండ్రి అధీనంలో బ్రతకాలని క్యా మెల్లిగా అర్ధం చేసుకుంటుంది..ఇల్లు వదిలి వెళ్ళడానికి ముందు క్యా కంటే ఏడాది పెద్ద అయిన జోడీ ఆమెకు ఆ పరిసరాల గురించి నేర్పిస్తాడు..తర్వాత తండ్రి అరుదుగా చూపించే మంచితనం కారణంగా చేపలు పట్టడం,పడవ నడపడం నేర్చుకుంటుంది..కుటుంబం అంతా వదిలి వెళ్ళిపోయినా అక్కడ చేపల్నీ,నత్తల్ని అమ్మి ఆ వచ్చిన సొమ్ముతో కడుపు నింపుకుంటూ ఉంటుంది..కానీ ఒకరోజు బయటకి వెళ్ళిన తండ్రి కూడా ఇంటికి తిరిగి రాకపోయేసరికి క్యా పూర్తి ఏకాకిగా మారుతుంది..ప్రభుత్వం వాళ్ళు తినడానికి తిండి పెడతామని ఆశపెట్టి స్కూల్ కి తీసుకెళ్ళినా అక్కడ తోటి పిల్లలు క్యా ను 'మార్ష్ గర్ల్','వైట్ ట్రాష్' అంటూ ఆటపట్టించడంతో ఆమె రెండో రోజు ఇక స్కూల్ కి వెళ్ళడం మానుకుంటుంది..ఇదిలా ఉండగా అన్నయ్య జోడీ స్నేహితుడైన మరో కుర్రవాడు టేట్ (Tate) క్యా కు మెల్లిగా దగ్గరవుతాడు..టేట్ పరిచయంతో ఆమెలో ఒంటరితనం పోయి కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటుంది..టేట్ 'రీడింగ్ కేబిన్' లో క్యాకు చదవడం,రాయడం నేర్పిస్తాడు..యుక్తవయస్సు వచ్చేసరికి వారిద్దరి మధ్యా ప్రేమ చిగురిస్తుంది..మళ్ళీ వస్తానని ప్రమాణం చేసి చదువుల నిమిత్తం దూరంగా వెళ్ళిపోయిన టేట్,ప్రకృతి ఒడిలో పెరిగిన క్యా తన నాగరిక ప్రపంచంలో ఇమడలేదేమో అని భావించి తుదకు మాట తప్పుతాడు..రెట్టించిన ఒంటరితనంతో క్యా కథ మళ్ళీ మొదటికొస్తుంది..ఈలోగా బార్క్లీ కోవ్ (Barkley Cove) లో పేరున్న ఫుట్ బాల్ ప్లేయర్ ఛేజ్ ఆండ్రూస్ క్యా కు దగ్గరవుతాడు..కొన్ని కారణాల వల్ల ఛేజ్ కూడా దూరమవడంతో మనసు విరిగిన క్యా మరెవ్వరినీ తన జీవితంలోకి ఆహ్వానించకూడదని నిర్ణయించుకుని మార్ష్ లో తన ఇంటిలో ఒంటరి జీవితాన్ని గడుపుతుంటుంది..మొదట్నుంచీ ప్రకృతితో పెనవేసుకుని జీవిస్తున్న కారణంగా సహజంగానే క్యా జీవశాస్త్రం వైపు మొగ్గుచూపుతుంది..ఆ తీరప్రాంతంలోని అరుదైన పక్షులు,కీటకాలు,పువ్వులు,షెల్స్ నమూనాలను సేకరించి,పశ్చాత్తాపంతో స్నేహహస్తం చాచి వచ్చిన టేట్ ప్రోత్సాహంతో వాటి మీద పుస్తకాలు ప్రచురించే స్థాయికి ఎదుగుతుంది.

ఆ సమయంలో హఠాత్తుగా ఛేజ్ ఆండ్రూస్ హత్య గావింపబడ్డాడన్న వార్త బార్క్లీ కోవ్ అంతటా కార్చిచ్చులా వ్యాపిస్తుంది..ఛేజ్ కూ క్యాకు ఉన్న సంబంధమే ఈ హత్యకు కారణమంటూ తమకంటే భిన్నమైన జీవితం గడిపే 'మార్ష్ గర్ల్' క్యా ను అనుమానిస్తారు..ఫలితంగా ఆమెను పోలీసు నిర్బంధంలోకి తీసుకుని విచారణ చేస్తారు..ఈ కథను 1952 లో క్యా బాల్యం నుండి మొదలు పెట్టి 1969 లో ఛేజ్ హత్య వరకూ బ్యాక్ టూ బ్యాక్ చెప్పుకుంటూ వస్తారు..మరి ఛేజ్ హత్య వెనుక కారణాలు ఏమిటనేది మిగతా కథ.

ఈ కథలో క్యాథెరిన్ క్లార్క్ జీవితం ఒక ప్రేరణ..అమ్మచాటు ఆరేళ్ళ పసిబిడ్డ ఉన్నపళంగా తన జీవితాన్ని తానే తీర్చిదిద్దుకున్న వైనం స్త్రీ సాధికారతకు నిర్వచనంలా కనిపిస్తుంది..కుటుంబం ఏకాకిని చేసినా క్యా ను కొందరు మంచి మనుషులు అక్కున చేర్చుకుంటారు..కిరాణా కోసం పిగ్లీ-విగ్లీ షాపు కి వెళ్ళి మిగిలిన చిల్లర లెక్కచూసుకునేలోపే ఆ చిన్నారికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ చిల్లర ఇచ్చే సారా,ఆమె పడవకు ఇంధనం కోసం  వచ్చినప్పుడల్లా క్యా ను సొంత కూతురిలా చూసుకునే జంపిన్,మేబెల్ లాంటి మంచి మనుషులు కూడా అక్కడక్కడా పరిచయమవుతారు..ప్రకృతి వర్ణనలతో పాటు సున్నితమైన భావోద్వేగాలను కూడా ఆవిష్కరించడంలో రచయిత్రి డెలియా నేర్పు  ప్రశంసనీయం..తండ్రి తనను తొలిసారిగా 'hon' (హనీ) అని పిలిచినప్పుడు క్యా పొంగిపోయే సన్నివేశం,చాలా కాలానికి తల్లి రాసిన ఉత్తరాన్ని చదవడం రాక తండ్రి చదివి వినిపిస్తాడేమోనని ఉత్తరాన్ని అతనికి కనిపించేలా పెడితే,తండ్రి ఆ ఉత్తరాన్ని చింపి బూడిద చేస్తే,తల్లి రాసిన ఆ ఉత్తరాన్ని వెతుక్కుంటూ క్యా పసి మనసులో మెదిలే భావాలు హృదయాన్ని మెలితిప్పుతాయి..
She flung open his dresser drawers, rummaged through his closet, searching. “It’s mine, too! It’s mine as much as yours.”
భారతీరాజా సినిమాని ఇంగ్లీష్ వెర్షన్ లో స్క్రిప్ట్ రాస్తే ఈ పుస్తకంలా ఉంటుంది.. :) కథలో చివరివరకూ అంతర్లీనంగా కొనసాగే 'melancholic mood' పుస్తకం పూర్తి చేసిన చాలా సేపటివరకూ కూడా మనల్ని వదిలిపోదు..ఈ కథలో జాత్యహంకారపు జాడలు చూసి క్యా ను మొదట్లో నల్లజాతీయురాలేమో అని భ్రమ పడతాము..'Sing Unburied Sing' లో Jasmyn Ward తరహాలో ఇందులో 1950 ల కాలంలో నార్త్ కరోలినా తీరప్రాంతాల్లో సామాన్యులు వాడే భాషనే యధాతథంగా ఉపయోగించారు..అందువల్ల ఇందులో వచనం నేటివిటీకి దగ్గరగా,పచ్చి వాసన వేస్తూ కథకు అదనపు ఆకర్షణగా నిలిచింది..క్యా పసితనాన్నీ,ప్రకృతి ఆమెను గుండెలకు హత్తుకున్న వైనాన్నీ రచయిత్రి ఎంతో హృద్యంగా వర్ణించారు..సృష్టిలో ప్రతి జీవికీ సంతోషాన్నీ,దుఃఖాన్నీ పంచుకోడానికి మరో జీవి సాహచర్యం అవసరం..క్యా ఒంటరి జీవితం ఒక ప్రేరణ గా కనిపించినా,ఆమె గమ్యం చేరుకోడానికి సహాయపడిన జంపిన్,టేట్,రాబర్ట్,మేబెల్ లాంటి కొందరు మంచి మనుషుల పాత్రలు ఆశావహదృక్పధాన్ని చాటుతూ,మరుగునపడిన మానవత్వపు ఔన్నత్యాన్ని వెలికితీస్తాయి..సృష్టిలో ప్రతి  జీవికీ ఏకాంతం ఎంత అవసరమో,మరో మనిషి సాంగత్యం కూడా అంతే అవసరమన్న సత్యాన్ని క్యా సంఘర్షణ పదే పదే గుర్తు చేస్తుంది..నిజానికి ఒంటరితనాన్ని ఎవరూ కోరుకోరు,మన అనుకున్న మనుషులు వదిలి వెళ్ళిపోయినప్పుడో,లేక తిరస్కారానికి గురైనప్పుడో మనసులో ఏర్పడే గాయాలు అందరికీ మానినట్లు కొందరికి మానవు..క్యా ఆ కొందరిలో ఒకరిగా కనిపిస్తుంది..ఒక దశలో టేట్ ను జీవితంలోకి ఆహ్వానించాలా వద్దా అని ఆలోచిస్తూ,సాన్నిహిత్యంలో ఉండే సౌకర్యం కంటే తిరస్కారంలో ఉండే బాధను ఓర్చుకోవడం కష్టమనుకుంటుంది..చూడగా ఇదొక సాధారణమైన కథే,కానీ ఈ కథలో ప్రత్యేకత ఏంటంటే, ఇందులో పాత్రలతో పాటు ప్రకృతికి కూడా సరిసమాన ప్రాతినిథ్యం కల్పించారు డెలియా...ప్రకృతి నిరంతరం మనిషి జీవనశైలిని ప్రభావితం చేస్తుంది జీవితంలో విడదీయలేని భాగంగా అగుపిస్తుంది..ఈ కథలో సముద్రపు ఆటుపోట్లూ,తుమ్మెదల సంయోగాలూ,సముద్రపు పక్షుల అరుపులూ ఇవన్నీ ఆ తీర ప్రాంతపు జీవితాన్నుంచి విడదీయలేని అంశాలు..అన్నిటికంటే కథనం ఈ పుస్తకానికి ప్రధానాకర్షణగా నిలిచింది..ఒక దశలో ఈ పుస్తకాన్ని ప్రత్యేకం ప్రకృతి ప్రేమికుల కోసం మాత్రమే రాశారా అనిపిస్తుంది..ఈ పుస్తకం న్యూ యార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ గా నిలవడానికి ఇదే ప్రధాన కారణం.

పుస్తకం నుండి కొన్ని వాక్యాలు..
Months passed, winter easing gently into place, as southern winters do. The sun, warm as a blanket, wrapped Kya’s shoulders, coaxing her deeper into the marsh. Sometimes she heard night-sounds she didn’t know or jumped from lightning too close, but whenever she stumbled, it was the land that caught her. Until at last, at some unclaimed moment, the heart-pain seeped away like water into sand. Still there, but deep.Kya laid her hand upon the breathing, wet earth, and the marsh became her mother.
When in trouble, just let go. Go back to idle.
Someone knew her name. She was taken aback. Felt anchored to something; released from something else.
“No, I cain’t leave the gulls, the heron, the shack. The marsh is all the family I got.”
“‘There are some who can live without wild things, and some who cannot"'
Months turned into a year. The lonely became larger than she could hold. She wished for someone’s voice, presence, touch, but wished more to protect her heart.
But these hurried groping hands were only a taking, not a sharing or giving.
She knew it wasn’t Chase she mourned, but a life defined by rejections.
“I have to do life alone. But I knew this. I’ve known a long time that people don’t stay.”
Even in nature, parenthood is a thinner line than one might think.

No comments:

Post a Comment